శ్రీపాద(దత్త)సాధనా క్షేత్రం-విశ్వయోని ‘గోకర్ణ’ : (Sripada Sadhana Kshetra & Viswayoni Gokarna-ಗೋಕರ್ಣ/गोकर्ण)
శ్రీపాద (దత్త)సాధనా క్షేత్రం & విశ్వయోని ‘గోకర్ణ’
(Sripada Sadhana Kshetra & Viswayoni ‘Gokarna’-ಗೋಕರ್ಣ/गोकर्ण)
II లింగరూప తుంగ, జగమాఘనాశన భంజితాసురేంద్ర రావణలేపన
వరగోకర్ణఖ్యా క్షేత్ర భూషణ క్షేత్ర భూషణ శ్రీమహాబలేశదేవ సార్వభౌమతే II
జయజయ శంకర..హరహర శంకర..హరహర శంకర..జయజయ శంకర..హరహర శంకర..జయజయ శంకర..
గమనిక : ఈ ఆర్టికల్ చాలా పెద్దది. గోకర్ణకు సంబంధించిన అనేక విషయాలను ఫోటోలతోసహా తెలియజేయడం జరిగింది. ఈ వెబ్ పేజ్ లో అతి అరుదైన, అద్భుతమైన దాదాపు 100కు పైగా ఫోటోలు గలవు. దయచేసి పూర్తిగా లోడ్ అయ్యేవరుకు ఓపికగా వేచి ఉండండి. లోడ్ కాని పక్షంలో F5 బటన్ (Reload) ను నొక్కండి.
వింతైన క్షేత్రం గోకర్ణ…అంతుపట్టని క్షేత్రం గోకర్ణ…
గోకర్ణ క్షేత్రం ఒక వింతైన ‘సాధనాదత్త’ క్షేత్రం. ఈ క్షేత్రంలో అనేకానేక సంస్కృతుల సమ్మేళనం మన కళ్ళకు కనిపిస్తుంది. ఎలాగంటే ఒక విదేశీ పురుషుడు ఒక చేతిని బీరు బాటిల్ మీద మరో చెయ్యిని విదేశీ స్త్రీ మీద వేసి అక్కడ గుడి వీధుల్లో తిరగడం ఎంత సాధారణమో… మరో విదేశీ వొళ్ళంతా భస్మధారణతో, రుద్రాక్షయుతంగా ఉండి శివ నామస్మరణతో శంఖం ఊదుతూ అదే వీధుల్లో తిరగడం కుడా అంతే సాధారణమక్కడ . హిందువులు కుడా చెయ్యలేని సాధనలు చేసే విదేశాలవారు, శతశృంగి పర్వత గుహలలో మంత్రాలు నేర్చుకునే విదేశీ స్త్రీలు, ఇక్కడి రామతీర్ధంలో దొరికే పరమ పవిత్ర ఔషద జలాన్ని క్యాన్ లలో మోసుకొని పోయే విదేశీ జంటలు వారి చిన్నచిన్న పిల్లలు, కాళ్ళకు చెప్పులు లేకుండా రాళ్ళలో ముళ్ళలో తిరిగే తెల్లవారు(మనం నడవగలమా! అని అనిపిస్తుంటుంది), బికినిలలో తిరుగాడే విదేశీ వనితలు ఇక్కడ నిత్యకృత్యంగా కనిపిస్తారు. గుర్తుపెట్టుకోండి ‘గోకర్ణ’ ఒక గొప్ప సాధనాదత్త క్షేత్రం. ఇందాక మనకి బీరు బాటిల్ తో కనిపించిన విదేశీ స్త్రీ-పురుషులు సాక్షాత్తు అనఘా-దత్తాత్రేయుల వారిగా తలచిన వారికి ఈ క్షేత్రంలో అనేక ఆధ్యాత్మిక వింత అనుభూతులు ఎదురౌతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మనమెలా తలిస్తే ఆ తల్లి (గోకర్ణ క్షేత్రం) మనకలా కనిపిస్తుంది. మీ మనస్తత్వాన్ని బట్టి ఆ క్షేత్రం నడుచుకుంటుంది. గోకర్ణ క్షేత్రానికి – మన మనసుకు – మన సాధనకు గల సంబంధం ఈ క్షేత్రంలో బయటపడుతుంది. అదే ఈ సాధనా దత్తక్షేత్ర విశిష్టత.
గోకర్ణ క్షేత్రం గురించి…
మూరకో గుడి – బారకో బ్రాహ్మడు, అడుగుకో ఔదుంబరం – అరుగుకో అనఘదత్త వృక్షం (పనస చెట్టు), గడపకో గోవు – వీధికో విదేశీజంట వెరసి ‘గోకర్ణ’. గోకర్ణ క్షేత్రాన్ని ఒక్క రోజులో చూడచ్చు… ఒక్క వారంలోనూ చూడచ్చు. ఇది గోకర్ణ క్షేత్రానికి గల మరో ప్రత్యేకత. గోకర్ణ బీచ్, ‘ఓం’ బీచ్, ప్యారడైస్ బీచ్, కుండ్లె బీచ్, హాఫ్ మూన్ బీచ్, తడడి బీచ్ లలో ఒకటైనా దర్శించనివారుండరు. కాని శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు మూడు సంవత్సరాలు తపస్సు చేసుకున్న ప్రదేశము, వారు స్థాపించిన శివలింగం [దత్త ప్రతిష్టిత 'దత్తశివలింగం'], వారి చేతుల మీదుగా సంకల్ప మాత్రం తోనే ఏర్పడ్డ కోనేరు [దత్త కోనేరు], వారు ప్రతిష్టించిన అనసూయా మాత విగ్రహం, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు ప్రతిరోజూ కాలినడకన వెళ్లి అర్చించిన ఉమామహేశ్వర దేవాలయం ఉన్నాయని కుడా చాలామందికి తెలియదు. తెలిసినా బీచుల మీద ఉండే శ్రద్ధ భగవంతుడి మీద ఉండదు. భగవంతుని గురించి సమాచారం ఇచ్చేవారు గోకర్ణలో దొరకడం కష్టం. కాని బీచ్ లగురించి సమాచారమిచ్చే వారు అడుగుకొకరు ఉంటారు. చాలామంది గోకర్ణ మహాబలేశ్వర స్వామినీ, గోకర్ణ బీచ్ లను చూసి బయల్దేరుతుంటారు. సరైన సమాచారం భక్తులకు అందుబాటులో లేకపోవడమూ, శ్రీపాదుల వారి సమాచారం తెలిసిన వారందరూ వృద్ధాప్యంలో ఉన్న కారణంగా, అటువంటి వారు ఇంటికి మాత్రమే పరిమితమవ్వడం కుడా సమాచారలేమికి మరో కారణం. శ్రీపాద శ్రీ వల్లభులు ఎక్కడ తపస్సు చేసారని గోకర్ణ మహాబలేశ్వర స్వామి దేవాలయం లోని పుజార్లను కనుక్కుంటే వారిదగ్గర నుండి కుడా సరైన సమాచారం అందదు. కొంతమంది మాత్రం “ఇక్కడే” [మహాబలేశ్వర స్వామి దేవాలయం లోనే] తపస్సు చేసారని తప్పుడు సమాచారం అందివ్వడం జరిగింది (ఏదో ఒకటి చెప్పక పోతే ‘నామోషీ’ మరి). అందువల్లనే ఇంత పెద్ద Article రాయడానికి శ్రీపాదుల వారు నాకు ఆశీస్సులను, శక్తిని అందించారు. దత్తభక్తులందరూ ఈ Article లోని సమాచారం ఆధారంగా శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు ప్రతిష్టించిన శివలింగం, అనసూయా మాత విగ్రహం మరియు దత్తకోనేరులను దర్శించి తరిస్తారని ఆశిస్తున్నాను. సహ్యాద్రి పర్వత శ్రేణి లోని ‘గోకర్ణం’ కర్నాటక రాష్ట్రంలో పడమర దిక్కుగా ఉన్న ఒక గ్రామం. చుట్టూరా సముద్రపు ఉప్పును తయారు చేసే ‘ఉప్పుమడులు’ [Salt Flats], చూడచక్కటి మడ అడవులు [Mangroovs] కలిగి రెండు నదులు [శాల్మలి & అఘనాశిని] సముద్రంలో కలిసే మద్య ప్రాంతంలో [రెండు నదీసంగమప్రదేశాలు] గల అతి గొప్ప సాధనా దత్త క్షేత్రం మరియు ప్రముఖ శైవక్షేత్రం. మహారాష్ట్ర లోని ‘గోవా’ కు అతి దగ్గరలోఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం గోకర్ణ, పైకి ప్రముఖ శైవక్షేత్రంలా కనిపించే గొప్ప “దత్తక్షేత్రం” గోకర్ణ.
దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా..
- Keerthi Vallabha [keerthivallabha@gmail.com / 7207402498]
ఎలా చేరుకోవాలి?
By Public Transport |
---|
By Public Transport |
కాచిగూడ రైల్వే స్టేషన్ / సికందరాబాద్ రైల్వే స్టేషన్ / బేగంపేట్ రైల్వే స్టేషన్ / లింగంపల్లి రైల్వే స్టేషన్ ---->హుబ్లి రైల్వే స్టేషన్ ----->హుబ్లి Old బస్ స్టాండ్ (BSNL Office దగ్గర) ----> అంకోలా ----> గోకర్ణ (ట్రైన్ మరియు బస్సు కలిపి హైదరాబాద్ నుండి దాదాపు 18 గంటల నుండి 20 గంటల ప్రయాణం). దయచేసి గమనించండి హుబ్లి నుండి మరియు ఇతర ప్రదేశాల నుండి గోకర్ణ కు డైరెక్ట్ బస్సులు అతి తక్కువ. ఎక్కడకి వెళ్ళాలన్న 'అంకోలా', 'హొనావర్' లేదా 'కుంట' ల నుండి మరొక బస్సు మారి గోకర్ణ చేరుకోవచ్చు. |
By Own Transport |
---|
By Own Transport |
హైదరాబాద్ ----> జూపార్క్ ----> ఆరంఘర్ చౌరాస్తా ----> బెంగలూరు హైవే ----> జడ్చర్ల---->మహబూబ్ నగర్ ----> దేవరకద్ర ----> మఖ్తల్ ----> రాయచూరు (రాయచూరు ఊర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు)----> సింధనుర్ ----> కొప్పాల్ ----> గదగ్ ----> హుబ్లి ----> ఎల్లాపుర ----> అంకోలా ----> గోకర్ణ ( మొత్తం దాదాపు 800 KMs 16-18 గంటల ప్రయాణం). |
గోకర్ణ క్షేత్ర దర్శనానికి అనువైన సమయం…
సంక్రాంతి శెలవలు గోకర్ణ క్షేత్ర దర్శనానికి అనువైనవి. కారణం కర్నాటకలో సంక్రాంతి శెలవలు ఉండవు. కేవలం మకర సంక్రాంతి ఒక్కరోజు శెలవుగా ప్రకటిస్తారు. కాబట్టి సంక్రాంతి శెలవలల్లో రద్దీ తక్కువగా ఉంటుంది. పైగా జనవరి నెలలో ఇక్కడి వాతావరణం వివిధ ప్రదేశాలు తిరగడానికి అనువుగా ఉంటుంది. రూములు ఇతర సౌకర్యాలకోసం కొట్టుకోవలసిన పని ఉండదు. ఈ రోజులలో ఉదయంపూట గోకర్ణ మహాబలేశ్వర స్వామి [ఆత్మలింగ] దర్శనం [ ప్రధాన దేవాలయం] 3 నుండి 5 నిముషాలలో జరిగిపోతుంది.
అసలు శివుని యొక్క ఆత్మలింగం ఎందుకు అక్కడే (గోకర్ణ లో) గణపతి చేతుల మీదుగా భుమిమీద పెట్టబడింది?…
భూగోళం పై సృష్టి జరగకముందు మొత్తం భూమిని ఆవరించి ‘సముద్రుడు’ ఉండేవాడు. ఎక్కడా కుడా ఇసుమంతైనా భూభాగం కనిపించేది కాదు. దేవతలు సముద్రుడికి భూగ్రహాన్ని నివాసంగా ఇవ్వడం జరిగింది. అటువంటి సమయంలో దేవలోకంలో ఉన్న బ్రహ్మ సృష్టి జరగాలనీ, అదికూడా మహాశివుని ద్వారా జరగాలనీ, అదికూడా ‘భూమి’ మీద సముద్రుడి చుట్టుకొలతలతో జరగాలనీ ఆశించాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న సముద్రుడు తను ఆవరించిన చుట్టుకొలతలో కొంతమేర తగ్గించి అక్కడక్కడ భూమి బయటకు కనిపించే విధంగా తన రూపాన్ని అమర్చుకున్నాడు. అంతట పరమశివుడు మరణము సంభవించనీ, సమానగుణములూ, సత్వగుణములు కలిగిన మానవజాతిని సృస్టించడానికి కావలసిన శక్తి కోసం పాతాళలోకంలో ఒకానొక శుభదినాన్న తపస్సు ప్రారంభిస్తాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న బ్రహ్మ సృష్టి అంటే ‘చరాచర’ జగత్తు. అవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటూ ఒకదానిమీద మరొకటి ఆధారపడేలా ఉండాలి కాని సృష్టి అంటే సమాన జగత్తు కాదనీ, 5 భిన్న సముదాయాల సమ్మేళనమే (పంచ భూతాలు) సృష్టి అనీ, శివుని తపస్సు అందుకు భిన్నంగా ఉందనీ “నేనొకటి తలిస్తే శివుడొకటి తలుస్తున్నాడని” అందరిలో (తను కలిసిన వారందరితో) చెబుతాడు. ఆ విషయాన్ని పాతాళలోకంలో తపస్సులో ఉన్న శివునికి తపోభంగం కలిగించి మరీ చెబుతుంది ‘ప్రకృతి’.
ఆ విషయాన్ని తెలుసుకున్న శివుడు ఆవేశంతో అయితే “ఆయన్నే సృష్టి చేసుకోమని” కైలాసం వెళ్ళడానికిగానూ పాతాళలోకం నుండి పైకి వచ్చుటకొరకై చక్రాకార భ్రమణం చేయుచున్న భూమి అడ్డువచ్చుట చూసి “నేను వెళ్ళాలి దారిని వొదులు, అడ్డులే!” అని అరుస్తాడు. అప్పుడు భూమాత వినయంతో “పరమశివా! రాకరాక ఇక్కడికి వచ్చావు. కారణమేదైనా, ఎవరిమీద కొపమున్నా దయచేసి నాకు నీ స్పర్శన భాగ్యం కలిగించి, నన్ను భాదింపకుండా సూక్ష్మరూపధారుడవై నాలో ప్రవేసించి, నా కర్ణముల గుండా కైలాసానికి వెళ్ళవలసింది” అని దీనంగా స్తోత్ర సహితంగా ప్రార్దించింది. ఆస్తోత్రాన్ని విన్న రుద్రుడు శాంతించి అంగుష్టమాత్ర శరీరాన్ని ధరించి భూమాత కర్ణముల గుండా బయటకు వచ్చి ఆనందంతో “నీకు గల మరొక పేరు (భూమికి గల మరొక పేరు) ‘గో’, ఇది నీ కర్ణ ప్రదేశం కనుక ఇకనుండి ఈ సుందర ప్రదేశం “గోకర్ణ” గా ఖ్యాతి పొందుతుంది. ముందు యుగాలలో ఇక్కడ గోకర్ణ ఆకారంలో, “గోకర్ణేశ్వరుడనే మహాబలేశ్వరుడు ఆత్మలింగంగా”స్థాపింపబడతాడు. అశ్వనీదేవతల పై నాకుగల ప్రేమను చాటడంకోసం ఈ పేరులో అంతర్లీనము గా ఉన్న గోకర్ణ (ఆవుచెవి – ఆవు చెవిలో అశ్వనీ దేవతలుంటారు) ఆకారం లోనే గోకర్ణేశ్వరుడు ఉంటాడు. ఈ ప్రాంతం అనేక గోవులకు ఆలవాలమై ఉంటుంది. నేను పాతాళం నుండి బయటకు వెళ్ళునప్పుడు ఈ ప్రదేశం “యోని” లాగా నాకు కనిపించినందున ఈ ప్రాంతాన్నే “రుద్రయోని / విశ్వయోని” అనీ, ప్రళయకాలంలో భూమిపై గల సముద్రుడు ఇక్కడే “సుడి” తిరిగి సృష్టిని తనలో కలిపేసుకుంటాడుగాన దీనికి “వరుణావర్తం” అనీ పేరు వస్తుంది. “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి పొద్దున్న ఉచ్ఛరించిన , గత రాత్రి చేసిన పాపములన్నీ హరించుకుపోవును. అలాగే “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి సాయంత్రం ఉచ్ఛరించిన, పొద్దున్న చేసిన పాపములన్నీ హరించుకుపోవును. ముందు ముందు క్రమంగా ఇక్కడకు మహర్షులూ, దేవతలూ, గంధర్వులూ, యోగులు వచ్చి వారి పాపముల ప్రక్షాళనగావించుకొనెదరు. ఇక్కడికి తీసుకురాబడేవారెవరైనా, ఇక్కడనుండి తీసుకుపోబడేవాడేవడైనా (ఇక్కడ మరణం పొందినవారు) అత్యంత అదృష్టవంతుడని తలంపుము. ఇక్కడే తాంత్రిక విద్యలు పుడతాయి. వాటిని నిరోధించే హనుమంతుడూ ఇక్కడే పుడతాడు. ఈ ప్రాంతం భూమి మీద గల ప్రత్యేక ప్రాంతంగా, భౌతిక సుఖాలకు, ఆధ్యాత్మిక సుఖాలకు కేంద్రంగా మారుతుంది. ఈ ప్రాంతంలో ముందు ముందు “అఘనాశిని మరియు గంగావళి ” (అఘనాశిని = పాపమును నశింపజేసేది, గంగావళి = గంగతో సమానమైనది) అనే పాపాలను సమూలంగా కడిగే ఈ విశ్వం లోనే గల ఏకైక సముద్ర సంగమసహిత రెండు నదులు పారుతాయి. (కాశి లోని గంగానది సముద్రసంగమ ప్రదేశం కాదు). ఎవరైతే ఈ అఘనాశిని మరియు గంగావళి నదులు సముద్రంలో కలిసే చోట స్నానమాచరిస్తారో వారికి పన్నెండు పూర్వ జన్మలలో చేసిన పాపాలూ, అలాగే ప్రస్తుత జన్మలో అప్పటివరుకు చేసిన పాపాలూ “శూన్యమవుతాయి”, ఇక్కడికి మునులూ దేవతలూ సైతం వచ్చి సంధ్యవార్చి స్నానం చేసి వెళ్ళవలసిందే!” అని రుద్రుడు భూమికి వరముని ఇచ్చి కైలాసానికేగుతాడు.
గోకర్ణ క్షేత్రం లో చూడవలసిన ప్రదేశాలు / ఆలయాలు
(1) గోకర్ణేశ్వరుడనే ‘మహాబలేశ్వరుని’ దేవాలయం [ఆత్మలింగ దేవాలయం]
లంకానగరంలో ఉన్న రావణాసురుడి తల్లి ‘కైకసి’ నిత్యం సముద్రపు ఒడ్డున ఇసుకమట్టి తో శివలింగాన్ని చేసి పూజిస్తూ ఉండేది. ఇలా మట్టితో చేసిన శివలింగాన్ని “పార్థివలింగం” అంటారు. ఇటువంటి పార్థివలింగం పూజ అన్నింటికన్నా మిన్న అయినది. ఒక రోజు కైకసి ఎన్ని సార్లు పార్థివలింగాన్ని చేసినా సముద్రపు అలలు వాటిని నాశనం చేయసాగాయి. ఆరోజు పార్థివలింగాభిషేకం చేయకపోవడం వల్ల కైకసి కన్నీటి పర్యంతమవుతుంది. పార్థివలింగాభిషేకం తంతులో కన్నీరు పెట్టిన రావణాసురుడి తల్లి కైకసి నిత్యం పూజించుకోవడం కోసం రావణాసురుడు “పార్థివలింగం ఏమిటి నీకు శివుని ఆత్మలింగమే తెచ్చి ఇస్తానని” తన తల్లి తో చెప్పి కైలాసానికి వెళతాడు. రావణాసురుడు అకుంఠిత దీక్షతో తపస్సు చేసి పరమశివుడిని మెప్పించి, కేవలం ఆత్మలింగం కోసం కైలాసానికి వెళ్ళిన రావణుడు అక్కడ శివునితో పాటు ఉన్న పార్వతీదేవి అందాన్ని చూసి వచ్చిన విషయాన్ని మరిచి పార్వతీ దేవినే చూస్తున్న రావణుడుని “ఏం కావాలని?” అడుగుతాడు శివుడు. అప్పుడు రావణుడు “పార్వతి” కావాలని అడుగుతాడు. శంకరుని మనస్సు తెలుసుకున్న పార్వతి రావణుడుకి కొన్ని నిభంధనలను పెట్టి రావణునితో వెళ్ళడానికి అంగీకరిస్తుంది. వింధ్యా పర్వతాల ప్రాంతంలో పార్వతి రావణునితో “నాకు ఆకలిగా ఉన్నది వనములో దొరికే కొన్ని ఫలములు కావాలి” అంటుంది. అంతట రావణాసురుడు పార్వతిని ఒక చెట్టు క్రింద కూర్చోనమని చెప్పి ఫలములు తేవడం కోసం అడవిలోకి వెళతాడు. అక్కడ రావణాసురుడుకి పాతాళలోక రాజైన, మాయాసురుని పుత్రికైన “మండోదరి”కనిపిస్తుంది. పార్వతీ దేవి కంటే అందంగా ఉన్నమండోదరిని చూసి మోహించి, మండోదరి తోసహా తిరిగి పార్వతి దగ్గరకు వచ్చి “నాకు మండోదరే కావాలని” అడుగుతాడు . అప్పుడు వారిరువురినీ ఆశీర్వదించి తిరిగి కైలాసానికి వెళుతుంది పార్వతి. ఈ విధంగా ఆత్మలింగం రావణ రాజ్యానికి తేవాలనే మొదటి ప్రయత్నం బెడిసికొడుతుంది.
లంకకు చేరిన రావణుడు- మండోదరి లను చుసిన కైకసి తనకోసం తెచ్చిన” ఆత్మలింగ మెక్కడ? ” అని అడుగుతుంది. అప్పుడు రావణాసురుడు తిరిగి కైలాశం వెళ్లి శివుని మెప్పించి ఆత్మలింగం ఇవ్వమని కోరతాడు. శివానుగ్రహంతో రావణాసురుడు ఆత్మలింగాన్ని భూలోకానికి తీసుకువస్తాడు. భూమిమీద ఆత్మలింగాన్ని ఎక్కడయితే ఉంచుతారో, అక్కడ అది స్థాపితం అయిపోతుందనీ, తిరిగి దాన్ని ఎత్తడం, జరపడం సాధ్యంకాదనీ పరమశివుడు ఆత్మలింగం ఇవ్వడానికి మునుపే రావణాసురుడికి ఒక నిబంధన పెడతాడు.
అయితే రావణుడు పరమశివుడి ఆత్మలింగాన్ని గనుక లంకలో ప్రతిష్టించితే నష్టం జరుగుతుందని భావించి దేవాధిదేవతలు మహావిష్ణువును వేడుకొంటారు. దాంతో విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లుగా తన సుదర్శన చక్రాన్ని సూర్యునికి క్రమంగా పద్దతి ప్రకారం అడ్డువేస్తూ వస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయ్యిందని భావించి సంధ్య వార్చుకునేందుకు సిద్ధపడతాడు. ఈలోగా విషయం తెలుసుకున్న నారదమునీంద్రుడు వినాయకుడి వద్దకు వచ్చి, “రావణాసురుడి వద్దనున్న ఆత్మలింగం తీసుకుని రావణ రాజ్యంలో కాకుండా (లంకలో కాకుండా మరెక్కడైనా) ఇంకెక్కడైనా భూమిపై పెట్టాలనీ, దానికి తగిన స్థలం ‘గోకర్ణ’ అనీ. పైగా గతంలో మీ తండ్రిగారైన మహాశివుడు భూమాతకు ‘ఆత్మలింగ’ ప్రతిష్ట గోకర్ణలో జరుగుతుందని మాటిచ్చారు కుడా!” అని చెప్పి, అందుకు నువ్వే సమర్దుడవని చెప్పి భూలోకానికి పంపిస్తాడు. రావణుడు సంధ్యవార్చుకునే సమయానికల్లా బ్రాహ్మణవేషంలో వెళతాడు వినాయకుడు. ఆ బ్రాహ్మణ బాలుడిని చూసిన రావణుడు సంధ్యవార్చుకునేంతదాకా ఆత్మలింగాన్నిభూమిపై పెట్టకుండా పట్టుకోవాల్సిందిగా కోరతాడు. ఈ లింగం చాలా బరువుగా ఉండడం వల్ల తాను ఎక్కువసేపు మోయలేననీ, మోయలేనప్పుడు మూడుసార్లు తమను పిలుస్తాననీ అయినప్పటికీ మీరు రాకపోతే ఈ లింగాన్ని భూమిపై ఉంచేస్తానని అంటాడు బాల బ్రాహ్మణుడి రూపంలోని వినాయకుడు.
ఆ పరిసర ప్రాంతంలో మరెవ్వరూ లేకపోవడంతో గత్యంతరం లేక రావణుడు అందుకు అంగీకరించి, ఆత్మలింగాన్ని బాల బ్రాహ్మణుడి చేతిలో పెట్టి సంధ్య వార్చుకునేందుకు సముద్రం లోకి వెళతాడు. రావణుడు వెళ్లిన కాసేపటికే తాను లింగాన్ని మోయలేకపోతున్నానంటూ వినాయకుడు మూడుసార్లు పిలుస్తాడు. సంధ్యవార్చే కార్యక్రమం మధ్యలో ఉండటంతో కాస్త ఆలస్యంగా వస్తాడు రావణుడు. ఈలోగా వినాయకుడు ఆత్మలింగాన్ని భూమిమీద పెట్టేస్తాడు. దాంతో కోపంతో రావణుడు వినాయకుడి నెత్తిపై గట్టిగా మొట్టికాయ కొట్టగా అక్కడ గుంట పడుతుంది. ఇప్పటికి ఆ గుంటను మనం గోకర్ణ మహాగణపతి తలపై చూడవచ్చు.
ఈలోగా తాను అనుకున్న కార్యం నిర్విఘ్నంగా జరిగిపోవటంతో సంతోషించిన విష్ణువు, తన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించడం వల్ల వెంటనే సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. వెంటనే విషయాన్ని గ్రహించిన రావణుడు కోపంతో ఆత్మలింగాన్ని తన చేతులతో బలవంతంగా పెకిలించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమం లో ఆత్మలింగం పై కప్పిన వస్త్రం అడ్డు రావడం వల్ల దానిని తీసి విసిరేస్తాడు. అది పడిన ప్రదేశమే “మురుడేశ్వర”. మళ్లీ ప్రయత్నించినప్పుడు ఆత్మలింగం కవచం వల్ల చేతులు జారడం వల్ల కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే అది ” సజ్జేశ్వర” అనే ప్రదేశంలో పడుతుంది. మళ్లీ ప్రయత్నించినప్పుడు ఆత్మలింగం పై నున్న మూత అడ్డు రావడం వల్ల దానిని తొలగించి విరిచి విసిరి వేస్తే అందులో ఒక ముక్క “గుణేశ్వర / గుణవంతేశ్వర్” లో, మరో ముక్క “ధారేశ్వర్” లో పడుతుంది. రావణాసురుడు ఆత్మలింగం పై ప్రయోగించిన బలం ఫలితంగా ఆత్మలింగం పైభాగం ఆవు చెవి ఆకారంలో సాగుతుందే కాని అది భూమినుండి ఊడిరాదు. కాల క్రమములో మహావిష్ణువు శాలిగ్రామ పీఠం రూపంలో ఈ ఆత్మలింగాన్నిచుట్టి ఉండడం జరుగుతుంది. గోకర్ణలోని భక్తులు ఈ మహాబలేశ్వరుని ఆత్మలింగాన్ని “శాలిగ్రామ పీఠం” లోని మధ్య భాగంలో వున్న గుండ్రని రంధ్రం లోనుండి తమ చేతులతో తాకుతారు. ఈ రంద్రం గుండానే అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అత్యంత అరుదుగా ఆత్మలింగం పై గల ఈ శాలిగ్రామ పీఠంను తొలగించి ఎనిమిది రోజులు పుజిస్తారు. ఇట్టి కార్యక్రమాన్ని “అగమ్య అష్టబంధన మహోత్సవం” అంటారు. తదుపరి తిరిగి విష్ణు శాలిగ్రామ పీఠాన్ని యధాతధంగా పునః ప్రతిష్టాపన చేస్తారు. ఇది అతి అరుదుగా జరిగే కార్యక్రమము. ఈ కార్యక్రమం క్రీ.శ. 1903, 1930,1983 లో జరిగినవి.
గోకర్ణేశ్వర మహాబలేశ్వర (ఆత్మలింగం) ఆలయ ప్రాంగణంలోగల ఇతర ఆలయాలు
1.ఆది గోకర్ణేశ్వర లింగం – Aadi Gokarneshwara Linga
ప్రధాన ఆత్మలింగ ఆలయానికి ఎడమ చేతి వైపుగా గోశాలకు దగ్గరలో ఉంటుంది. ప్రధాన దేవాలయ ప్రాంగణంలో ముందుగా దర్శించవలసిన ప్రదేశమిది (మొత్తం గోకర్ణ యాత్రలో ముందుగా దర్శించవలసిన ప్రదేశం ‘మహాగణపతి’ దేవాలయం). ఇక్కడ బిల్వాలను సమర్పించి జలాభిషేకం (నీటిని మనమే తీసుకుని వెళ్ళాలి, అక్కడ చుట్టూరా ఉండే నీటిని మళ్లీ అభిషేకానికి వాడరాదు) చేస్తే సరిపోతుంది.
2.దత్తాత్రేయ దేవాలయం – Guru Dattatreya Temple
గోకర్ణేశ్వర మహాబలేశ్వరుడి (ఆత్మలింగం) దర్శన అనంతరం దర్శింప వలసిన ప్రదేశమిది. మొత్తం గోకర్ణలో దత్తత్రేయునికి అధిక ప్రాముఖ్యత గలదు. అందువల్లనే దత్తత్రేయుడి ఆలయం ప్రధాన ఆలయం లోనే గలదు. పైగా గోకర్ణ ఒక “దత్త సాధనా క్షేత్రం”. ప్రధాన దేవాలంలో కుడి చేతి వైపు ప్రసాదాలు అమ్మే కౌంటర్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ దిగంబర నామ స్మరణ చేస్తూ 3 ప్రదక్షిణలు చెయ్యాలి.
3.వీరభద్ర ఆలయం – Veerabhadra Temple
గోకర్ణేశ్వర మహాబలేశ్వరుడి (ఆత్మలింగం) ఆలయం వెనుక వైపున వీరభద్ర ఆలయం కలదు. ఇక్కడి క్షేత్ర పాలకుడు యీయనే. ఇక్కడ గల వీర భద్రుడిని నీటితో అభిషేకించి పుష్పాలను సమర్పించాలి. ఇక్కడి వీరభద్రుడు తన పాదములను ఎడమ వైపుగా తిప్పిఉంచి సూర్య-చంద్ర సహితంగా ఉంటాడు.
3.సాక్షి గోకర్ణేశ్వర లింగం / శాస్త్రేశ్వర గోకర్ణ లింగం – Saakshi Gokarneshwara Linga / Shastreshwara Gokarna Linga
గోకర్ణేశ్వర మహాబలేశ్వరుడి (ఆత్మలింగం) ఆలయ ప్రాంగణం లోని అన్ని ఆలయాలను దర్శించిన అనంతరం చివరిగా సాక్షి గోకర్ణేశ్వరలింగాన్ని దర్శించాలి. ఇది తప్పని సరిగా దర్శించ వలసిన దేవాలయం. ప్రధాన దేవాలయానికి ఎడమ చేతి వైపు ఉంటుంది. మనం గోకర్ణయాత్ర చేసామనడానికి “సాక్షిభూతమే” యీ సాక్షి గోకర్ణేశ్వరలింగం.ఇక్కడ బిల్వాలను సమర్పించి జలాభిషేకం (నీటిని మనమే తీసుకుని వెళ్ళాలి)చెయ్యాలి.
గోకర్ణేశ్వర మహాబలేశ్వరుడి (ఆత్మలింగం) ఆలయ దర్శన నియమాలు మరియు వివిధ పూజల సమయం వివరాలు
విషయము | వివరణ |
---|---|
విషయము | వివరణ |
డ్రస్ కోడ్ - వస్త్ర నియమాలు | పురుషులు : Traditional Indian Dress (పంచె కండువా లేదా షర్ట్, బనియన్ లేకుండా) స్త్రీలు : Traditional Indian Dress (ఆధ్యాత్మిక వస్త్రధారణ) |
అభిషేక సమయం | ఉదయం 05:00 గంటల నుండి ఉదయం 08:00 గంటల వరుకు (ఇక్కడ సాధారణంగా Rs. 150/- క్షీరాభిషేకం చేయిస్తే సరిపోతుంది).అభిషేక సమయం లోనే మహాబలేశ్వర ఆత్మలింగాన్ని చేతితోతాకి స్పర్శదర్శనం కుడా చేసుకోవచ్చు. |
స్పర్శదర్శన సమయం | ఉదయం 05:00 గంటల నుండి ఉదయం 08:00 గంటల వరుకు. అభిషేక సమయం లోనే మహాబలేశ్వర ఆత్మలింగాన్ని చేతితోతాకి స్పర్శదర్శనం కుడా చేసుకోవచ్చు. |
అలంకార దర్శనం | ఉదయం 09:00 గంటల నుండి రాత్రి 08:00 గంటల వరుకు. |
మహాహారతి - ప్రసాద దర్శనం | రాత్రి 09:00 గంటల నుండి రాత్రి 09:30 గంటల వరుకు. |
కేమ్రా/ వీడియో కేమ్రా వాడకం | కేమ్రా & విడియో కేమ్రా వాడకం పూర్తిగా నిషేధము. కేమ్రా సెక్యురిటి వారికి కనిపిస్తే దానిలోగల ఫోటోలను చూసే అధికారం కలదు. కేమ్రా లో ప్రధాన దేవాలయానికి సంబంధించిన ఫోటోలు ఏవైనా ఉంటే కేమ్రా సీజ్ చేయబడుతుంది. అలాగే ప్రధాన దేవాలయం లోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్ళడం నిషేధం. |
దర్శన ప్రవేశ రుసుము | పూర్తిగా ఉచితము |
పూజలు | అష్టోత్తర బిల్వపూజ: Rs.101/- క్షీరాభిషేక పూజ: Rs.151/- పంచామృతాభిషేక పూజ: Rs.251/- మహాపంచామృతాభిషేక పూజ & రుద్రాభిషేక పూజ కలిపి: Rs.351/- నవధాన్యాభిషేక పూజ: Rs.501/- రజితనాగాభరణ పూజ: Rs.1101/- స్వర్ణనాగాభరణ పూజ: Rs.1501/- |
చిరునామా [Address] | Sri Mahabaleswar Dev Samsthan, Gokarna (PO), Kumta (TQ), Uttara Kannada(UK) - 581326 Ph: 08386-257955 / 09482331354 |
(2) మహాగణపతి ఆలయం / సిద్ధగణపతి దేవాలయం
గోకర్ణ యాత్ర లో ముందుగా దర్శింప వలసిన దేవాలయం “మహాగణపతి” దేవాలయం. ముందుగా గోకర్ణ బీచ్ లో సముద్ర స్నానం చేసి మహాగణపతి ని గరిక తో పూజించి అనంతరం గోకర్ణేశ్వర మహాబలేశ్వర (ఆత్మలింగం) దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ ఉదయం పూట 08:00 గంటల లోపు అయితే గర్భ గుడిలోకి వెళ్లి ఎవరైనా అభిషేకంచేయించుకోవచ్చు. ఆ సమయంలో రావణుడు కోపంతో వినాయకుడి నెత్తిపై గట్టిగా మొట్టికాయ కొట్టగా ఏర్పడిన గుంటను చూడవచ్చు.
(3) తామ్రగౌరీ (పార్వతి) దేవాలయం
మహాబలేశ్వర ఆలయ వెనుక వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడిచేయినుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రుణ్ణి వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం 06:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, సాయంత్రం 05:00 నుంచి రాత్రి 08:30 వరకు తెరిచి ఉంటుంది. తామ్రగౌరీ పుట్టిల్లు తామ్రపర్వతం. అందువల్ల ఈమెని తామ్రగౌరీ అని పిలుస్తారు. ఇక్కడ పసుపు,కుంకుమ, పూలు, గాజులు, జాకెట్ గుడ్డ సమర్పించవచ్చు.
(4) భద్రకర్ణికా (భద్రకాళీ) దేవాలయం / మహాబలేశ్వర మహీషీ
లోకకంటకులైన ‘శుంభ – నిశుంభ’ లను సంహరించిన కాళిక, శివుని ఆజ్ఞ మేరకు గోకర్ణ వచ్చి అక్కడగల ‘కాళీహ్రుద’ అనే కోనేరులో తన రక్తపు ఆయుధాలను కడిగి దక్షిణదిక్కుగా గోకర్ణ పొలిమేరలలో ఊరిబైట ఉండి గోకర్ణకు రక్షణ (భద్రత) కోసం అక్కడే ఉండిపోయింది. అందువల్లనే ఈ తల్లిని భద్రకర్ణికా (భద్రకాళీ) దేవి అంటారు. ఈమెనే “మహాబలేశ్వర మహీషీ” అని కుడా పిలుస్తారు. ఈవిడ విష్ణు మాయవల్ల జన్మించింది.
(5) కోటితీర్ధము
ఇచ్చట అగస్త్యుడు ప్రతిష్టించిన ‘వరదేశ్వరశివలింగం’ కలదు. అలాగే ఈ తీర్ధము ‘గరుక్మంతుడు’ వల్ల ఏర్పడినది కాబట్టి ఇచ్చట ‘గరుడమండపం’ గలదు. ఒకప్పుడు కోటితీర్ధములో భక్తులు స్నానమాచరించే వారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితులులేవక్కడ. పితృతర్పణాలు ఇచ్చట పెట్టుకోవచ్చు. అలాగే ప్రతీ సంవత్సరం కోటితీర్ధము లోనే కార్తిక పౌర్ణమి రోజున గోకర్ణ మహాబలేశ్వరుని నౌకాయానం (తెప్పోత్సవం) జరుగుతుంది.
(6) కాలభైరవ దేవాలయము
శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మ యొక్క నాలుగవ తలను నరుకుతాడు కాలభైరవుడు. అందువల్ల కాలభైరవునకు ‘బ్రహ్మహత్యా పాతకం’ చుట్టుకుంటుంది. అప్పుడు కాలభైరవుడు రక్షించమని ఆదిశంకరుడిని వేడుకొనగా దానికి శివుడు “గోకర్ణలో ఆశ్రమం ఏర్పరచుకొని సముద్ర స్నానమాచరించిన నీ పాపం పూర్తిగా పోవును”అని చెప్పగా కాలభైరవుడు ఒక ఆశ్రమాన్ని గోకర్ణలో ఏర్పరచుకుంటాడు. అదే కాలభైరవ దేవాలయము. ఇది కోటితీర్ధము వద్ద గలదు. ఉదయం పూట అప్పుడప్పుడూ ఇక్కడ అఘోరాలను చూడవచ్చు.
(7) పట్ట వినాయక దేవాలయము
శివుని యొక్క ఆత్మలింగాన్ని రావణుడి రాజ్యానికి (లంకకు) చేరకుండా చాకచక్యంగా గోకర్ణలో భూమిమీద పెట్టిన వినాయకుడిని దేవతలందరూ అభినందించి రత్నపీఠము పై కూర్చుండబెట్టి సన్మానం చేస్తారు. ఆ సందర్భంగా శివుడు వినాయకుడి వ్రేలికి ఉంగరాన్ని తొడిగి “ఇకనుండి ఈ సన్మానం జరిగిన ప్రదేశంలోగల నిన్ను ‘చింతామణి వినాయకుడ’ ని పిలుస్తారు. నువ్వు గోకర్ణలో ఆగ్నేయ దిక్కుగా స్థావరం ఏర్పరచుకొని ‘పట్ట వినాయకుడు’ గా పిలవబడేదవని” ఆశీర్వదిస్తాడు. ఒకప్పుడు గోకర్ణ యొక్క మెయిన్ రోడ్డు ఆగ్నేయ దిక్కుగా పట్ట వినాయక దేవాలయము ప్రక్కగా ఉండేది. అప్పట్లో గోకర్ణకు వచ్చే వారంతా ముందుగా పట్ట వినాయకుడుని దర్శించుకునేవారు. పట్ట వినాయకుడినే ‘బట్టే వినాయకుడు’ అని కుడా పిలుస్తారు. పట్ట వినాయక దేవాలయము కోటితీర్ధము వద్ద గలదు.
(8) నాగదేవత దేవాలయము / నాగతీర్ధము
మహాగణపతి దేవాలయం నుండి కోటితీర్ధము వెళ్ళే దారిలో నాగదేవత దేవాలయము కలదు. ఒకప్పుడు ఇక్కడ సుందరమైన కోనేరు ఉండేది. ఇక్కడ నాగదోషం గలవారు ప్రతిష్టించిన అనేకానేక రకాలైన నాగదేవతలను చూడవచ్చు. నాగదేవత దేవాలయము లో ఉన్న శివలింగం పెద్దదిగా ఉండి అందరిని ఆకట్టుకుంటుంది. అలాగే ఇక్కడ ఒక గొప్ప దేవతా వృక్షం (అస్వత్థ) కుడా కలదు.
(9)శ్రీ వేంకటేశ్వర దేవాలయము
గోకర్ణ ప్రధాన వీధిలో ‘పాయ్ హోటల్’ సమీపంలో శ్రీ వేంకటేశ్వర దేవాలయము కలదు. శివుని యొక్క ఆత్మలింగాన్ని రావణుడి రాజ్యానికి (లంకకు) చేరకుండా చాకచక్యంగా గోకర్ణలో భూమి మీద పెట్టిన వినాయకుడిని అభినందించడానికి శ్రీలక్ష్మీ సమేతుడై వేంకటేశ్వరుడు గోకర్ణకు వచ్చినప్పుడు కొలువైఉన్న ప్రదేశమే ఇది.
(10) శ్రీగురు దత్తాత్రేయ దేవాలయము
గోకర్ణలో అనేక దత్తాత్రేయ దేవాలయములు కలవు. ఒకటి గోకర్ణ మహాబలేశ్వరుని (ఆత్మలింగం) ఆలయ ప్రాంగణంలో ఉంటే ఇప్పుడు చెబుతున్న ఈ దత్తాత్రేయ దేవాలయము శ్రీవేంకటేశ్వర దేవాలయమునకు అతి దగ్గరలో కుడి వైపుగల సందులో గలదు. ఇది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో నడుస్తోంది. అతి మహిమగల దత్తాత్రేయ దేవాలయమిది.
(11) పితృస్థలేశ్వర్ / విధ్యుత పాపస్థలి
పితృకార్యక్రమాలు చేయవలసిన వారు / చెయ్యాలనుకునే వారు తప్పనిసరిగా ఇక్కడ పితృశ్రాద్ధములు పెట్టే తీరవలయును. తండ్రి చనిపోయిన కొడుకులు ఇక్కడ ఒక్కసారి పితృ శ్రాద్ధములు పెట్టిన వారి పితృపాపాలు మరియు శాపాలు పోయి నూతన జవసత్వాలతో కూడిన సంతతి పుడుతుంది. ఇది పితృ జన్యు కణముల లోని పాపమును హరింపగల ప్రదేశమవడం వల్ల దీనిని “విధ్యుత (విధ్యుతము = కడగడం) పాపస్థలి” అని కుడా పిలుస్తారు.
(12) రుద్రభూమి
“గోకర్ణ సర్వదావాసం మరణం ముక్తి మంటపే…రుద్ర భూమ్యాంతు దహనం కాంక్షతే విబుధా అపి”
గోకర్ణ క్షేత్రంలో దేవతలు సైతం దహనమగుటను కోరెదరు. అంతటి విలక్షణమైన రుద్రభూమి (స్మశానం) గల క్షేత్రం గోకర్ణ. మాములుగా శవ దహనానికి 80 KG ల నుండి 100 KG ల కర్రలు అవసరం పడతాయి. కాని ఇక్కడ శవ దహనానికి కేవలం 20 KG ల కర్రలు సరిపోతాయి. గోకర్ణ రుద్రభూమి (స్మశానం) లో తక్కువ కర్రలను (20 KG) వాడినా ప్రేతం (శవం) ‘ఫెళ ఫెళ’మంటూ బూడిద అయిపోతుందట. గోకర్ణ రుద్రభూమి (స్మశానం) అఘోరాలకు ముఖ్య స్థావరము.
ఆవిషయం తెలిసిన నేను(కీర్తివల్లభ) గోకర్ణ రుద్రభూమి (స్మశానం) గురించి మరింత తెలుసుకోవాలంటే కనీసం ఒక్క అఘోరాస్వామినైనా కలవాలని తలచి దాదాపుగా ఉదయం 11:00 గంటలకు అక్కడకి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు అక్కడ 3 శవాలు కాలుతున్నాయి. అక్కడ శవం తాలూకు వారెవ్వరూలేరు. ఒక అతను మాత్రం జీన్స్ పాంట్ బనియన్ వేసుకొని అక్కడ కూర్చుని ఉన్నాడు. నన్ను చూసి లేచి వచ్చి ఎవరు కావాలని కన్నడ బాషలో అడిగాడు. నాకు ఎలా చెప్పాలో, ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. అతను తనని తాను ‘కవలుగార’ (కాటికాపరి) గా చెప్పుకున్నాడు. అప్పుడు నేను ఇక్కడ ఎవరైనా అఘోరాస్వామి ఉంటే కలుద్దామని వచ్చానని చెప్పాను. నాదగ్గర గల కేమ్రా ని చూసిన ఆ కాటికాపరి “మీదే ఊరు? ఇక్కడ (గోకర్ణలో) ఎక్కడుంటున్నావు? గోకర్ణ ఎందుకొచ్చావు?” లాంటి ప్రశ్నలు వేసాడు. తరువాత అతను నాతో ” ఇక్కడ నువ్వు అఘోరాబాబాను కలవచ్చు, ఇక్కడే నిద్రపోతున్నాడు” కాని ముందు నీ బసకి వెళ్లి నీ కేమ్రా, మొబైల్ ఫోన్ పెట్టేసి నిన్నటివి కానీ, మొన్నటివి కానీ విడిచిన బట్టలు వేసుకొని మధ్యాహ్నం 01:00కి రమ్మని చెప్పాడు.
మధ్యాహ్నం 01:00 కి మళ్లీ నేను గోకర్ణ రుద్రభూమికి వెళ్ళాను. అక్కడ కాటికాపరి తో పాటు ఉన్న మరొకరిని చూడగానే అతని ముఖ కవళికల ఆధారంగా అర్ధమయ్యింది అతనే ‘అఘోరాబాబా’ అని. ఆ అఘోరాబాబా వారణాశి నుండి ఇక్కడికి వచ్చాడట. హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషలు బాగా మాట్లాడుతున్నాడు. ఆయనకి సుమారు 25 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉంటుంది. అఘోరాబాబాకి నన్ను పరిచయం చేసాడు కాటికాపరి.
అఘోరాబాబాకి నన్ను నేను మళ్లీ పరిచయం చేసుకున్నాను . నేను అఘోరాబాబాకి సంబంధించిన పర్సనల్ విషయాలేవీ అడగలేదు. కాని నా పర్సనల్ విషయాలన్నీ అఘోరాబాబా అడిగి తెలుసుకున్నాడు. కేమ్రా కాని మొబైల్ ఫోన్ కాని తెచ్చావా? అని అడిగాడు. లేదు రూంలో పెట్టి వస్తున్నా అని చెప్పాను. అనేక విషయాలను నాకు చెప్పారు. దాదాపు ఒక గంట సేపు నాకు అఘోరాబాబా టైం కేటాయించారు. మా మధ్య జరిగిన ముఖ్య సంభాషణ వివరాలు:
నేను: మీ పేరేమిటి? మీ గురువుగారెవరు?
అఘోరాబాబా: నా పేరు కపాలీరాంబాబా, నేను కపాలీకుల తెగకి చెందిన అఘోరాని. సాదారణంగా మేము తిని, తాగే ఏపదార్ధమైనా కపాలంలో వేసి(మానవ పుర్రె) పుచ్చుకుంటాము. నాకు ముగ్గురు గురువులున్నారు. మొదటి గురువు ఆదినాథుడు ఈయననే మీరు దత్తాత్రేయుడు అంటారు, మేము మాత్రం ‘ఆదినాథుడ’నే అంటాము. రెండవ గురువు వైష్ణవ మతస్థుడైన ‘బాబా కినారాం’. బాబా కినారాం నాకే కాదు భూమిమీద ఉండే అందరు అఘోరాలకు గురువు. సాధారణంగా అఘోరాల గురువులు శైవులని అనుకుంటారు అది తప్పు. అఘోరాల గురించి మీరు చెప్పుకునేదీ, ఊహించేవి కుడా చాలామటుకు తప్పే. నిజాలు తక్కువ..కల్పితాలు ఎక్కువ. అఘోరాలు చూడడానికి భయంకరంగా ఉంటారు, కొన్ని అలవాట్లు ఆటవికంగా ఉంటాయి తప్ప, మా పద్దతులను మా నీతిని మేమెప్పుడూ తప్పనివారము. మూడవ గురువు ‘బాబా గంగారాం’. వారు ప్రస్తుతం ‘కామాఖ్య’ ఉన్నారు. కామాఖ్య ఆలయంలో అమ్మవారి విగ్రహానికి బదులు కొండరాళ్ళతో ఏర్పడిన అమ్మవారి యోని ఉంటుంది. ఈ యోని నుండి ప్రతి 27 రోజులకొకసారి రుతురక్తం (Menstrual Fluids)వస్తుంది. ఇలా 4 రోజుల పాటు రుతురక్తం వస్తుంది. ఆ రుతురక్తాన్ని తుడిచిన తెల్లటి వస్త్రాన్నే (రుతురక్తం తుడిచిన రక్తపు వస్త్రం) చిన్నచిన్న ముక్కలుగా కోసి ప్రసాదంగా ఇస్తారు. రుతు రక్తం తుడిచిన గుడ్డ పెలికే అక్కడి ప్రసాదం. ఇది అస్సాం లోని గౌహతి లో ఉంది. అక్కడికి వెళ్ళదలచిన వారు అమ్మవారి రుతు సమయంలో వెళితే రుతురక్త వస్త్రాన్ని ప్రసాదంగా తెచ్చుకోవచ్చు. అమ్మవారి 4 రోజుల రుతు సమయాన్ని “అంబుభాషి” అంటారు. అమ్మవారి రుతురక్త వస్త్ర ముక్కని ప్రసాదంగా తెచ్చుకున్న మీలాంటి సాదారణ భక్తులకు రాజయోగం పడుతుంది. మావంటి అఘోరాలకు ‘వామాచార గురువు’గా ఉన్నతి లభిస్తుంది.
నేను: మీరు ఎక్కడ నుండి వచ్చారు?
అఘోరాబాబా: నేను వారణాశి లోని ‘రవీంద్రపురి’ లోగల ‘అఘోరశోద్ సంస్థాన్’ నుండి వచ్చాను. బాబా కినారాం సమాధి వారణాశిలో ఉంది. మాకు అది గొప్ప క్షేత్రం. గోకర్ణ లో ‘శవ భేతాళం’ నేర్చుకోవడానికి వచ్చాను. నేర్చుకోగానే వారణాశి వెళ్ళిపోతాను. గోకర్ణ రుద్రభూమి ఒక గొప్ప అఘోరా సాధనా స్థలం . ఇక్కడకు వచ్చి 3 సంవత్సరాలైంది.
నేను: మీ దినచర్య ఎలా ఉంటుంది.?
అఘోరాబాబా: గట్టిగా నవ్వుతూ “మాకు దినచర్య ఉండదు. అంతా రాత్రిచర్యే!” రుద్రభూమి మాకు పుణ్య క్షేత్రం. స్మశానం ఇహపరలోకాలకు వారధి అందుకే ఇక్కడ సాధన చేసేది. మాలో అసలైన అఘోరా రాత్రి ఒంటి గంటకు బైటకు వస్తాడు. రాత్రి ఒంటి గంట అనేది నిన్నటికి రేపటికి సంధి సమయం. అది మాకెంతో విలువైనది. పొద్దున్న మాకు రాత్రి లాంటిది. రాత్రి మాకు పొద్దున్న లాంటిది. రాత్రి ఒంటి గంట నుండి అర్ధ రాత్రి మూడున్నర వరుకు సాధన ఉంటుంది. కేవలం రెండున్నర గంటలు మాత్రమే. అందులో ఆఖరి అరగంట ‘భక్షణ’ కార్యక్రమం ఉంటుంది. ఎలా అయితే మీ పూజని బట్టి పూజా సామగ్రి మారుతుంటుందో ఇక్కడ మేము ఎంచుకున్న సాధనను బట్టి కావాల్సిన పదార్ధాలు మారుతూ ఉంటాయి.
నేను: మీ పూజని యేమని పిలుస్తారు? సాధారణంగా మీ పూజా సామగ్రి లో ఏమేమి ఉంటాయి?
అఘోరాబాబా: మాపూజ పేరు ‘శవచింతామణి’. చితిబూడిద, భక్షణ ప్రసాదం కోసం చేపలు, మానవ ఎముకలు, కుక్క మాంసము, కొంత మద్యం, ‘శవభేతాళం’ సాధన కోసం శవం, శవానికి ఉన్న బట్టలు (వాటిని విప్పి మేము వేసుకొని పూజ చెయ్యాలి).
నేను: మీ పూజ గురించి కొంచెం వివరంగా చెబుతారా?
అఘోరాబాబా: మాపూజ మొదటి భాగం ఆదినాథుదు (దత్తాత్రేయుడు), శివుడి ఆరాధనతో మొదలవుతుంది. మీరు చేసే దత్తాత్రేయ ఆరాధనా, మీరు చేసే శివారాధనలతో మా ఆరాధన ఎంతో భిన్నంగా ఉంటుంది. తదుపరి కాలభైరవ ఆరాధనా, స్మశానతార ఆరాధనలు ఉంటాయి. ఆ తదుపరి ‘భూతశుద్ధి’ అనే కార్యక్రమం ఉంటుంది. చంద్రకళలకూ మా పూజకూ దగ్గర సంబంధం ఉంది. మీరంతా అనుకునే దానికి భిన్నంగా అమావాస్య మా పూజకు ఏమాత్రం ఉపయోగపడని రోజు. ఆరోజు తాంత్రికులకి, చిల్లర మంత్రగాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప మావంటి వారికి కాదు. పౌర్ణమి మా పూజకు ఎంతో గొప్ప దినం. పౌర్ణమి రోజు చంద్రుడిలో 15 మంది నిత్య దేవతలూ మరియు 16వ దేవత అయిన మహాత్రిపురసుందరి ఉంటారు. ఆ రోజున ఆ పదహారు దేవతలను సంతృప్తి పరచడమే అఘోరాల విధి. మా ప్రధాన లక్ష్యం ఈ 16 దేవతల ద్వారా విశ్వంలోని Cosmic Energy ని పొందడమే!. పౌర్ణమి మరునాడు గల చంద్రుడిలో 14 మంది దేవతలే ఉంటారు. ఆ మరునాడు 13 మంది. ఇలా అమావాస్య రోజుకి ఎవరూ ఉండరు. అందువల్లే ప్రతీ పౌర్ణమి మాకు పవిత్రమైనది. ఆరోజు పూజ అతితీవ్రంగా అతినిశబ్ధంగా జరుగుతుంది. మేము చేసే పూజలన్నీ పోలికా సూత్రం [Law of Similarity] మరియు సంబంధ సూత్రం [Law of Contact] అనే రెండు సూత్రాల ఆధారంగా జరుగుతాయి. అఘోరా సాధనలో మీకు తెలియని గొప్ప Science ఉంది. ఉదాహరణకు ఉదారంగా (అప్పనంగా) సంపదలూ, ఆరోగ్యం, అష్టాదశ ఐశ్వర్యాలు, మోక్షం మొదలైనవి సులభంగా ఇచ్చే ‘ఛిన్నముండ’ (మీరైతే ఛిన్నమస్త అంటారు) [ఛిన్న= ఖండించిన, ముండ / మస్త = శిరస్సు] మంత్రం ” శ్రీం, హ్రీం, క్లీం, ఐం, వజ్రవైరోచనియే హూం, హూం ఫట్ స్వాహా” ఇంట్లో చదివితే ఒకలాగా, గుళ్ళో చదివితే ఒకలాగా, శవం మీద కుర్చుని రుద్రభూమిలో చదివితే మరోకలాగా పనిచేస్తుంది. ఇదే మంత్రాన్ని కుడి నుండి ఎడమకి చదివితే అంటే “స్వాహా ఫట్ హూం, హూం వజ్రవైరోచనియే, ఐం, క్లీం, హ్రీం, శ్రీం” అది చేతబడి లేదా చిల్లంగి లేదా బాణామతి మంత్రంగా మారుతుంది. ఇవే Law of Similarity & Law of Contact లకు ఉదాహరణలు.
నేను: మీ పూజని ఇతరులు చూడచ్చా? అంటే… మీరు పూజ చేస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి చూడవచ్చా?
అఘోరాబాబా: ఆనందగా. మీ రిస్కు మీద మీరు రావచ్చు. కాని మీరు నాకు కనీసం 17 అడుగులకన్నా దూరంగా ఉండాలి. నా పూజ మధ్యలో రావచ్చు లేదా వెళ్లిపోవచ్చు. మధ్యలో వెళ్లిపోవాలనిపిస్తే డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే. చెప్పవలసిన పని లేదు. టార్చిలైటులు, కెమరాలు, మొబైల్స్ దయచేసితేవద్దు.
నేను: మీ పూజలో మంత్రాలు ఎలా ఉంటాయి? అవి ఎక్కడ నుండి గ్రహింపబడ్డాయి?
అఘోరాబాబా: మంత్రాలు లేకుండా పూజ ఎలా ఉంటుంది? మా పూజలో ‘ఫట్’ / ‘హం’ / ‘వసత్’ తో అంతమయ్యే ‘పురుష’ మంత్రాలూ, ‘స్వాహా’ తో అంతమయ్యే ‘స్త్రీ’ మంత్రాలూ, అలాగే కొన్ని సార్లు ‘నమః’ తో అంతమయ్యే ‘నపుంసక’ మంత్రాలూ ఉంటాయి. అఘోరా మంత్రాలు ‘కనకమాలినితంత్ర’ / ‘మాత్రికాభేదతంత్ర’ / ‘హేవజ్రతంత్ర’ / ‘దత్తాత్రేయతంత్ర’ / ‘దశమహావిద్యాతంత్ర’ అనే గొప్ప అఘోరాతంత్ర గ్రంధాల నుండి గ్రహింపబడ్డాయి.
నేను: మీ ఆహారం లేదా ప్రసాదంలో ఏమేమి ఉంటాయి?
అఘోరాబాబా: అఘోరాలకు ముఖ్య ఆహారం చేపలతో మానవ ఎముకలు కలిపి ఉడకబెట్టిన కుక్క మాంసము. దీన్నే ప్రసాదంగా కుడా పెడతాము. చేపలు మానవ ఎముకల తో ఉడికించిన కుక్క మాంసము తినడం వల్ల మాలో అనేక మార్పులు జరిగి ‘ప్రేతలోకం’ తో సంబంధం ఏర్పడుతుంది.
నేను: ఎవరికి ప్రసాదంగా పెడతారు? దత్తాత్రేయుడికా?
అఘోరాబాబా: కాదు,’స్మశాన తార’ అనే దేవతకి
నేను: కానీ మీరు శవాలను కుడా తింటారని విన్నాను…
అఘోరాబాబా: అవును, అరుదుగా.. దొరకాలి కదా ! ఎలా అయితే శివుడు ధ్యానం లో కూర్చున్నప్పుడు పులి చర్మం మీద కూర్చొని ధ్యానం చేస్తాడో, మేము మా పూజను శవం పై కూర్చుని చెయ్యాలి. సాధారణంగా శవాన్ని కుర్చోవడానికే ఉపయోగిస్తాము. మాకు తిండి మీద అసలు ధ్యాస ఉండదు. తిండే కాదు మాకు వేటిపైనా మొహం ఉండదు.
నేను: అంటే అన్నిశవాలను తినరా?
అఘోరాబాబా: లేదు. ‘గర్భిణి స్త్రీ’ శవం తప్ప మిగతా శవాలను సాధారణంగా తినము. గర్భిణి స్త్రీ శవం కుడా హాస్పిటల్ లో పోస్ట్ మార్టం చెయ్యనిదైతేనే మాకు ఉపయోగం. అటువంటి శవాలు అతి అరుదుగా వస్తాయి.
నేను: గర్భిణి స్త్రీ శవానికి , అఘోరా సాధనకి ఏంటి లింకు?
అఘోరాబాబా: ’Necromancy’ అనే విద్య నేర్చుకోవడానికి ‘గర్భిణి స్త్రీ’ శవం తప్పక కావాలి.అంత కంటే ప్రస్తుతం చెప్పలేను.
నేను: సాదారణంగా అఘోరాలు ఒళ్లంతా చితిబూడిద (చితాభస్మం) రాసుకుంటారు. ప్రత్యేక కారణమేమైనా ఉందా?
అఘోరాబాబా: చితాభస్మం యొక్క గొప్పదనాన్ని గురించి చెబుతూపోతే తెల్లారిపోతుంది, అంత గొప్పది ‘చితిబూడిద’. మీరు ‘ఉజ్జయినీ’ పేరు వినే ఉంటారు. అక్కడగల శివుడిని “మహాకాళేశ్వరుడు” అంటారు. అక్కడ ప్రతినిత్యం రహస్యంగా జరిగే ఒక తంతు మీకు చెబుతాను, దానిని బట్టి చితిబూడిద ఎంత గొప్పదో మీకే అర్ధమవుతుంది. ఉజ్జయినీ మహాకాళేశ్వరునికి శ్మశానం నుంచి అఘోరాలు తీసుకువచ్చే చితాభస్మంతో ప్రతీరోజూ అర్ధరాత్రి రెండు గంటలకు ‘భస్మాభిషేకం’ జరుగుతుంది. ఈ దేవాలయంలో ప్రతీ నిత్యం అర్ధరాత్రి రెండుగంటలకల్లా ‘మహాశ్మశానం’ నుంచి అఘోరాలు తీసుకువచ్చిన ‘తాజా వేడి వేడి చితాభస్మం’తో భస్మార్చన ప్రారంభమవుతుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ అభిషేకాన్ని స్త్రీలు చూడకూడదు. అందువల్ల స్త్రీలకు ప్రవేశం లేదు. అర్ధరాత్రి రెండుగంటలకు ఈ దేవాలయానికి వెళ్ళిన పురుషులంతా ఈ భస్మాభిషేకం చూడచ్చు. పురుష జన్మయెత్తిన వాళ్ళంతా ఈ ‘భస్మాభిషేకం’ చూసి తీరాలన్నది నా మనవి. అలాగే ఇంకో రహస్యం చెబుతాను వినండి. ఎవరికైనా వారి తల్లి మరణించినప్పుడు, ఆవిడ దహనక్రియల అనంతరం ఏర్పడిన చితాభస్మాన్ని కొద్దిగా ఒక డబ్బాలో సేకరించి దానిని విభూదిగా ధరించిన కొడుకు ‘గోమాత’తో సమానము. వాడిలో సమస్త దేవతలు కొలువైఉంటాయి.
నేను: నన్ను కేమ్రా తేవద్దని చెప్పారు ఎందుకో తెలుసు కోవాలనుకుంటున్నాను
అఘోరాబాబా: అవును. ఇక్కడి (గోకర్ణ రుద్రభూమి) స్మశానం లో ఫోటోలు తియ్యరాదు. ఇక్కడకొచ్చే ప్రతీ శవం చుట్టూ నల్లటి నీలపురంగు [Dark Blue Aura] కాంతి పుంజం ఉంటుంది. అలాగే మా చుట్టూ కుడా! ఆ కాంతిని కేమ్రాలు బంధించగలవు. ఇంత కంటే మీకు అనవసరం. డిటైల్డ్ గా చెప్పలేను.
నేను: మీరు అసలు అఘోరాగా ఎందుకు మారారు?
అఘోరాబాబా: ముక్తి పొందడం కోసం… దానికి అనేక మార్గాలు ఉన్నాయి, అందులో ఇదొక మార్గం. అఘోరా అన్న పదానికి అర్ధం తెలియక చెడుగా ప్రచారం చెయ్యడం జరుగుతోంది. నిజమైన అఘోరా ముక్తిమార్గం కోసం తపిస్తూ ఉంటాడు. అన్ని తెలిసే ఇందులోకి వచ్చా.
నేను: గోకర్ణ రుద్రభూమి (స్మశానం) ప్రత్యేకత ఏంటో చెబుతారా?
అఘోరాబాబా: ఇక్కడ దేవతా (అవతార) దేహాలు దహనం చేయబడతాయి. ఇటువంటి స్మశానం మరెక్కడా లేదు. కాశీలో కుడా… తక్కువ కలపతో శవం బూడిదగా మారటానికి కారణం ఇక్కడి రుద్రభూమి (స్మశానం) లో ప్రవహించే ‘వెచ్చటి రుద్రశక్తి’. ఆ శక్తి ఇక్కడి స్మశానం ‘కాంపౌండ్’ వరుకు మాత్రమే ఉంటుంది. ఇది ఇక్కడి విచిత్రం. కుంభవృష్టిలో కుడా ఇక్కడ చితి ఆరకుండా మండుతుంది. నేను ఎన్నో స్మశానాలలో ఉన్నాను. చివరికి కాశీలో కుడా!.. కాని ఇక్కడి ‘వెచ్చటి అనుభూతి’ మిగతావాటిలో లేదు. ఇక్కడి ప్రేతాలు కుడా ఎంతో శక్తివంతమైనవి. అందువల్లే ఇక్కడ మా సాధన సులువుగా సాగిపోతుంది. అందువల్లే మా గురువుగారు నన్ను ఇక్కడకి పంపారు. ఒకటే గుర్తు శక్తివంతం కాని స్మశానాలను అసలు మేము సాధనాస్థలాలుగా ఎంచుకోము. దీని తరువాత రెండవ శక్తివంతమైన రుద్రభూమి (స్మశానం) మైసూర్ చాముండీ కొండల సమీపంలో ఉంది. మూడవ శక్తివంతమైన రుద్రభూమి (స్మశానం) ఉజ్జయినీ లో ఉంది. ఇక నాలుగవ శక్తి వంతమైన రుద్రభూమి కాశీ లో గలదు.
నేను: మీరు నాకు అనేక విషయాలను చెప్పారు. మీరు చాలా ఫ్రెండ్లీగా కుడా మాట్లాడారు ధన్యవాదములు. జై గురుదత్త!
అఘోరాబాబా: జై బాబా కినారాం. చెప్పానుకదా.. మాలోని అఘోరా కేవలం అర్ధరాత్రి ఒంటి గంట నుండి అర్ధ రాత్రి మూడున్నర వరుకు అంటే రెండున్నర గంటల పాటు మాత్రమే ఉంటాడు. మీలాగా వచ్చి మాట్లాడే వారు కుడా అరుదు. అందుకే ఫ్రెండ్లీగా మాట్లాడా… కొద్ది నెలల క్రితం నన్ను కలవడానికి వచ్చిన విదేశియుడికి అంతకు ముందు రోజు రాత్రి నివేదన చేసిన మిగిలిన ప్రసాదాన్ని కుడా పెట్టాను. అతను అసహ్యించుకోకుండా తినడం చూసి నాకే ఆశ్చర్యమేసింది.
(13) రామతీర్ధం మరియు శ్రీ శాండిల్య మహారాజ్ మహాసమాధి
రావణసంహారం అనంతరం రావణాసురుడు ‘బ్రాహ్మణుడు’ అని రాముడు తెలుసుకున్నాడు. బ్రాహ్మణుడిని తెలిసి చంపినా తెలియకుండా చంపినా ‘బ్రహ్మహత్యాపాతకం’ తప్పనిసరి. అందుకు బాధపడిన శ్రీరాముడు దోషపరిహారార్ధం గోకర్ణ చేరి శతశృంగీ పర్వతపాదాల వద్ద ఒక శివలింగాన్ని ప్రతిష్టించి ‘బ్రహ్మహత్యాపాతక’ దోషం నుండి బైటపడతాడు. ఎక్కడైతే రాముడు శివలింగాన్ని ప్రతిష్టించాడో ఆ ప్రదేశాన్ని ‘రామతీర్ధము’ అంటారు. ఈ రామతీర్ధము కాలక్రమేణా జీర్ణస్థితి లోకి రాగా ‘శాండిల్య మహారాజ్’ అనే ఒక యోగి వచ్చి (ఖంబారవాడి వాస్తవ్యులు) రామతీర్ధాన్ని బాగుచేయించి అక్కడే ముక్తిని పొందారు. కనుక ప్రస్తుతం వారి సమాధి కుడా రామతీర్ధమునందే చూడవచ్చు. రామతీర్ధములో నిరంతరంగా వచ్చే ఒక జలధార కు ఎంతో ప్రాముక్యత కలదు. నిజానికి ఈ జలధార కాశీ నుండి వచ్చే గంగాజలం. గోకర్ణ లో తాను ప్రతిష్టించిన శివలింగానికి నిత్యం గంగాజలంతో అభిషేకం చేయడం కోసం శ్రీ రాముడి అభ్యర్ధనని మన్నించిన శివుడు గంగలోని ఒక పాయను అంతర్వాహినిగా గోకర్ణ రామతీర్ధము వరుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడని పురాణం. గోకర్ణకు యోగా చేయడానికీ, సన్ బాత్ చెయ్యడానికీ వచ్చే విదేశీయులు ఈ జలాన్నే తాగుతారు. ఇక్కడి ఈ గంగాజలం పై అనేక రిసెర్చులు కుడా జరిగాయి. మొత్తం మీద ఇక్కడి రామతీర్ధములో నిరంతరంగా వచ్చే ఒక జలధారకు అనేక ఔషద గుణాలున్నాయని తేల్చారు. ఈ జలం కోసం జలధార వద్ద ఫారెనర్స్ 5 లీటర్ల క్యాన్ లను వేసుకొని క్యూలు కడతారు. ఇక్కడ గల ఔదుంబర వృక్షం అత్యంత మహిమ గలది.
(14) మణిభద్ర దేవాలయం / మాణేశ్వర దేవాలయం
మణిభద్రుడు మరియు భూతనాథుడు అను వారు శివగణాలలో ప్రప్రథములు. మహాగణపతి చే శివుని ఆత్మలింగం గోకర్ణలో ప్రతిష్టించబడిందని తెలుసుకున్న వీరిరువురూ గోకర్ణను చూడాలని తలచి, తపించి గోకర్ణ వస్తారు. వీరు గోకర్ణ పొలిమేరలు చేరుకోగానే గోకర్ణ అంతా ఎక్కాడా సందు లేకుండా మొత్తం కోటానుకోట్ల శివలిగాలతో నిండిపోయినట్లుగా కనిపిస్తుంది. దానితో గోకర్ణలో అడుగుపెడితే శివలింగాలపై కాలు పెట్టినట్లే అని తలచి అక్కడే ఆగిపోతారు. అందులో మణిభద్రుడు (మాణే శ్వరుడు) ఎలాగైనా ఆత్మలింగాన్ని దర్శించాలని తలచి రెండు చేతులు క్రిందకీ రెండు కాళ్ళను పైకీ పెట్టి కాళ్ళు గోకర్ణను తగలకుండా చేతులపై నడచుచూ వచ్చి ఆత్మలింగ దర్శనం చేసుకుంటాడు. అందుకు మెచ్చిన శివుడు అతనికి ఒక ‘జటక’ ఇచ్చి గోకర్ణ సముద్ర పశ్చిమ దిక్కుకు అధిపతిని చేస్తాడు. అప్పటినుండి గోకర్ణ సముద్రం మణిభద్ర దేవాలయం దాటిరాదు. అందువల్లే ఇక్కడ మణిభద్రుడు పైకి పెట్టిన పాదుకలను పుజిస్తారు. అంటే మనం చూసే పాదుకలు పైకి ఉన్నాయన్నమాట. అక్కడనుండి క్రిందకు మణిభద్రుడి దేహం ఉంటుంది. మణిభద్రుడుతో పాటు వచ్చిన భూతనాథుడు గోకర్ణ పొలిమేరల్లోనే ఆగిపోతాడు. మణిభద్ర దేవాలయంలో నాగదేవత గుడితోపాటు అతి అరుదైన నాగ పరివారమును చూడవచ్చు.
(15) భరత ప్రతిష్ట శివలింగ దేవాలయము లేదా భరతగుడి (ప్రస్తుతం జీర్ణస్థితిలోగలదు)
రామతీర్ధమునకు దగ్గరలో శతశృంగీ పర్వతగుట్ట మీద భరత ప్రతిష్ట శివలింగ దేవాలయము లేదా భరతగుడి గలదు. ప్రస్తుతం ఈ గుడి జీర్ణస్థితిలో గలదు. శ్రీరాముడి ద్వారా ఈ క్షేత్ర మహిమ విన్న భరతుడు కుడా ఇక్కడకు వచ్చి తన పాపపరిహారార్ధం శివలింగ ప్రతిష్ట చేసాడు. కాల క్రమేణా ఈ గుడి పాడుబడిపోయింది.
(16) పాండవ ఆశ్రమం
జూదంలో ఓడిపోయిన పాండవులు ‘జూదం’ ఒక పాపకార్యమని తెలుసుకొని పాపపరిహారార్ధమై గోకర్ణ చేరి శతశృంగి పర్వతంపై ఆశ్రమాన్ని నిర్మించి తమ వనవాసం లో భాగంగా 4 సంవత్సరాలు ఉండి వెళతారు. నేటికి ఇక్కడ పాండవుల కిరీటపు ముద్రలను,అచ్చులను చూడవచ్చు. ఈ సంఘటన వల్ల జూదం, రేసులు, తాగుడు వంటి మొదలైన వ్యసనాల వాళ్ళ పాపాలు చేసిన వారికి గోకర్ణ ఆత్మలింగ దర్శనం పాపపరిహారంగావిస్తుందని తెలుస్తోంది.
(17) అశోకవనము
అశోకవనము అను ప్రాంతం సాధకులు తపస్సు చేసుకోవడానికి అనువుగా ఉండే ప్రదేశము. ఇక్కడ మల్లికార్జునలింగం గలదు. ఇది ఒక ఏకాంత ప్రదేశము. భక్తుల తాకిడి ఉండదు. ఇది ఒక మంచి సాధనాస్థలి.
(18) ఆంజనేయ జన్మస్థానము / హనుమంతుని జన్మస్థానము
పరమ శివుడు భూదేవికి ఇచ్చిన వరములలో భాగంగా ఆంజనేయ జన్మ గోకర్ణంలోనే జరిగింది. గోకర్ణ నందు ఉన్న సహ్యాద్రిపర్వత శ్రేణులలోగల శతశృంగి పర్వతంపైగల ‘క్రీడాశైల’ (ప్రస్తుతం కుండ్లె బీచ్ అని పిలుస్తున్నారు) వద్ద ఆంజనేయ జననం జరిగింది. ఇక్కడ గల ఆంజనేయ జన్మస్థానము లోనికి ఆందరూ వెళ్ళలేరు. ఇక్కడ కోతులూ, కొండముచ్చులూ నిత్యం పహారాకాస్తూ ఉంటాయి. వాటికి ఇష్టం లేని వారిని వెంటపడి తరిమి తరిమి కొడతాయి. లోపలి వెళ్లి ఆంజనేయ జన్మస్థానమును చూడగలిగిన వారు అదృష్ట వంతులు.
(19) శ్రీ ఉమామహేశ్వర దేవాలయము
మహాగణపతి చేతుల మీదుగా భూమిమీద ఉంచబడ్డ శివుని ఆత్మలింగ స్థానమైన గోకర్ణ క్షేత్ర మహిమని ఆందరూ చెప్పుకుంటుండగా వినిన పార్వతిదేవి ఆదిశంకరుడిని గోకర్ణ తనకి కుడా చూపించమని అడుగుతుంది. అప్పుడు శివుడు శతశృంగి పర్వతంపైగల నైరుతి మూలనందు ‘క్రీడాశైల’ (ప్రస్తుతం కుండ్లె బీచ్ అని పిలుస్తున్నారు) వద్ద గల ఒక సుందర ప్రదేశంలో ఒక ఆశ్రమాన్నీ, అలాగే ఒక నీటి కుండాన్ని (ఉమామహేశ్వరకుండం / పార్వతీ కుండం) నిర్మించి పార్వతీదేవికి గోకర్ణ క్షేత్రాన్ని చూపిస్తాడు. ఆద్యంతం చుసిన పార్వతీ దేవి సముద్రుడు ఉండడం వల్ల కాశీ కంటే గోకర్ణ విసమెత్తు గొప్పక్షేత్రమని నిర్ణయించడం జరుగుతుంది. తదుపరి అక్కడ ఉమామహేశ్వరలింగం స్వయంభూగా వెలిసి శ్రీపాద శ్రీ వల్లభుల వారి చేతుల మీదుగా 3 సంవత్సరాల పాటు ప్రతీ రోజు అభిషేకాలను అందుకున్న గొప్ప స్వయంభూ దేవాలయం శ్రీ ఉమామహేశ్వర దేవాలయము.
శ్రీపాద శ్రీ వల్లభ దివ్య చరితామృతం లో గోకర్ణ క్షేత్రం గురించిన ప్రస్తావన…
-
బాపనార్యులు వారితో శ్రీపాదుల వారు ” తాతా! నేను గోకర్ణ క్షేత్రమును మరింత శక్తివంతము చేయదలచితిని. జీవులకు సంబంధించిన అనిష్టస్పందనలను మహాబలేశ్వరుని (పరమేశ్వరుని ఆత్మలింగము) లోనికి లయముచేసికొని, శుభస్పందనలను ఆశ్రితులకు అందింపచేయుట నా సంకల్పము” – అధ్యాయము-6 భాగము-7
-
శ్రీ బాపనార్యులు శ్రీశైల క్షేత్రములోని శ్రీ మల్లిఖార్జునలింగములోనికి, గోకర్ణములోని మహాబలేశ్వర లింగములోనికి, మరికొన్ని దివ్య స్థలములలోనికి, సూర్యమండలము నుండి శక్తి పాతమును చేసియున్నారు. స్వయంభూదత్తుని అర్చామూర్తిలోనికి కూడా శక్తిపాతము జరిగినది. అగ్ని సంబంధమైన యీ శక్తికి శాంతి జరుపవలెను. లేనియెడల అర్చామూర్తి యొక్క తీక్షణతకు అర్చకునితో సహా, అర్చనలు జరుపువారు అందరునూ శిక్షింపబడుదురు. అనిష్ట ఫలములు సంప్రాప్తించును. స్వయంభూదత్తుని లోనికి సూర్యమండలము నుండి శక్తిపాతము జరిగిన విషయము అంతర జ్ఞానము కలిగిన యోగులు మాత్రమే గ్రహించగలుగుదురు. శ్రీశైలమునందు శక్తిపాతము శ్రీబాపనార్యుల ఆధ్వర్యములో వేలాది మంది ప్రజలసమక్షములో జరిగినది. సూర్యమండలము నుండి తేజస్సు వెలువడి అందరూ చూచుచుండగానే మల్లిఖార్జునలింగమునందు లీనమైనది. అసలు శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు యీ శక్తిపాతమునకునూ అత్యంత గోపనీయమైన దైవరహస్యము కలదు. అది మహాయోగులకు మాత్రమే తెలుపవలసిన విషయము, తెలుసుకొనదగిన విషయము. – అధ్యాయము-8 భాగము-1
-
గోవు యొక్క కర్ణములకు గోకర్ణమునకు, వైశ్యులకు రహస్య సంబంధం గలదు.
దీనిని బట్టి మనలోని అనిష్టస్పందనలను (మనలోని గుణదోషాలను అణచివేసి దయ, వాత్సల్యం వంటి లక్షణాలను పైకి తీసుకువచ్చే ఆత్మవిద్యే ‘అనిష్ట’) తొలగించి మహాబలేశ్వరుని ఆత్మలింగంలోకి నెట్టి మహాబలేశ్వరుని ఆత్మలింగం ద్వారా మనలోకి ఆత్మవిద్యను ప్రవేశపెట్టడమే శ్రీపాదుల వారి లక్ష్యము. అందువల్లనే వారు ఈ క్షేత్రంలో దాదాపు 3 సంవత్సరాలకాలముండి ఎంతోమందిని ఉద్దరించారు. అదేవిధంగా సత్యఋషీశ్వరులైన శ్రీబాపనార్యుల వారితో గోకర్ణ మహాబలేశ్వరుని ఆత్మలింగం లోనికి సూర్యమండలం లోని శక్తిని ప్రవేశపెట్టి ‘శక్తిపాతం’ గావించారు.అందువల్లనే గోకర్ణ ప్రముఖ శైవక్షేత్రమైనప్పటికినీ అక్కడి ఆత్మలింగంలో దత్తాత్రేయులవారు చొప్పించిన శక్తి మూలంగా అక్కడ దత్తాత్రేయులవారి ఆచార వ్యవహారాలు స్పష్టంగా కనిపిస్తాయి. గోకర్ణ క్షేత్ర ప్రాముఖ్యత ‘శ్రీగురుచరిత్ర’ లోని 6వ అధ్యాయంలో కుడా ఇవ్వబడినది.
(20) శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు ప్రతిష్టించిన శివలింగం, అనసూయామాత విగ్రహం మరియు దత్తకోనేరు గురించి…
శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు ప్రతీ రొజూ వేకువఝామునే లేచి, వారి సంకల్పమాత్రం తోనే త్రవ్విన ‘దత్తకోనేరు’ లోని నీటితో వారు ప్రతిష్టించిన అనసూయా మాత విగ్రహానికి పూజ, జలాభిషేకాదులు నిర్వహించి పిమ్మట వారు ప్రతిష్టించిన శివలింగానికి (దత్తప్రతిష్టిత శివలింగం) జలాభిషేకాదులు నిర్వహించి, బిల్వార్చన చేసి కాలినడకన పావుకోళ్ళతో [Wooden Sandals] శతశృంగి పర్వతశ్రేణులను చేరుకొని అక్కడగల శ్రీ ఉమామహేశ్వర ఆలయాన్ని చేరి, అక్కడేగల ఉమామహేశ్వర కుండం లోని జలంతో పార్వతీ-పరమేశ్వరులను పూజించి అక్కడే కొద్ది ఘడియలు ధ్యానం చేసి తిరిగి అక్కడ నుండి కాలినడకన [దారిపొడవునా అనేక మందిని ఆశీర్వదించుచూ] వారు నివసించే ప్రాంతానికొచ్చి, అప్పటికే వారికోసం ఎదురు చూస్తున్న అనేకానేక మంది ఋషులకూ, మునులకూ, దేవతలకూ, శిష్యులకూ, వారి ప్రియభక్తులకూ దత్తతత్వబోధచేసి, పిమ్మట వారందరికీ భోజన సౌకర్యాలను ఏర్పాటుచేసేవారు. తదుపరి వారందరితో కలసి సాయం సంధ్యలో వారు ప్రతిష్టించిన శివలింగ సమక్షంలోనే ప్రదోషపూజ చేసి అక్కడనుండి సముడ్రుడుని చేరి అక్కడ సాయం సంధ్యవార్చేవారు. ఈ విధంగా గోకర్ణలో దాదాపు 3 సంవత్సరాల కాలం ఉండి గోకర్ణలో గురుపరంపరకు బీజం వేసారు. ఈ మొత్తం శ్రీ పాదులవారి కార్యక్రమాన్ని వారి బసలో ఒక శిలాఫలకం మీద చెక్కడం జరిగింది. ప్రస్తుతం ఆ శిలాఫలకం మైసూర్ లోని Archaeology Department లో ప్రత్యేక అనుమతితో చూడవచ్చు.
ప్రస్తుతం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు ప్రతిష్టించిన శివలింగం(దత్త ప్రతిష్టిత శివలింగం) ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంది. ఆ ప్రాంతాన్ని “శ్రీషడక్షరీశ్వర మందిర్” అంటారు. ఇది గోకర్ణ లో “కావలేమఠ్” దగ్గరలో ఉంది. ఆ మందిరం లోపల శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు ప్రతిష్టించిన శివలింగం(దత్త ప్రతిష్టిత శివలింగం) చూడవచ్చు. సాధారణంగా ఫోటోలను తీసుకోవడానికి అనుమతించరు. దత్తప్రతిష్టిత శివలింగాన్ని చేతితో తాకే అవకాశం ఎవరికీ లేదు. వారు ఆ ప్రదేశాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నారు. వారు లోపలకు అందరినీ అనుమతించకపోవచ్చు. ప్రస్తుత ఆ ఇంటి వారు వృద్ధాప్యంలో ఉన్నారు. వారు కేవలం కన్నడ భాష మాత్రమే మాట్లాడతారు. చాలా మందికి గోకర్ణలో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు ప్రతిష్టించిన శివలింగం(దత్తప్రతిష్టిత శివలింగం) ఉందని తెలియదు. మహాబలేశ్వర స్వామి పుజారిలకు సైతం చాలమందికి తెలియదు. కేవలం కొద్దిమంది స్థానిక వృద్ధులకు [Local Senior Citizens], వృద్ధ దత్తభక్తుకు మాత్రమే ఈ ప్రదేశం తెలుసు. అలాగే శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు ప్రతిష్టించిన అనసూయా మాత విగ్రహం, వారు సంకల్ప మాత్రం తోనే త్రవ్విన ‘దత్తకోనేరు’ కుడా ‘కావలేమఠ్’ దగ్గరలోనే మరొక ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంది. వారి పేరు Sri. MV Bhatt వారు కుడా వృద్ధాప్యంలో ఉండడం వల్ల కేవలం Request మీద, శ్రీపాదుల వారి అశీస్సులతో మాత్రమే చూడగలం. ప్రస్తుతం ‘దత్తకోనేరు’ ఒక భావి [Water Well] లాగా మార్చబడినది. దత్తకోనేరు లోని నీటిని వారు తాడు-బకెట్ సహాయంతో తోడి మరీ మనకి అందిస్తారు.
(21) గోకర్ణ సంధ్యాసమయ ప్రాముఖ్యత
గోకర్ణ సంధ్యాసమయమునకు అత్యంత ప్రాధాన్యత కలదు. భూదేవికి ఆదిశంకరుని వరము ఫలితంగా ఋషులూ, మునులూ, దేవతలు సైతం వచ్చి గోకర్ణలో సాయం సంధ్యవార్చి వెళ్ళవలసిందే! దీని ఫలితంగానే ఇక్కడి సాయంసంధ్య అత్యంత అద్భుతంగా ఉంటుంది. సాయంసంధ్య ప్రారంభమయ్యే వేళలో సుర్యుని నుండి ఏటవాలు లేత కిరణాలు వచ్చి అక్కడ ఉన్నవారిని నేరుగా తాకుతాయి. అచ్చటి లేత ఎండ భక్తులకు పునర్జన్మనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సంధ్యా సమయంలో ఇక్కడి సూర్యుడు గులాబీ-నారింజ [Pinkish Orange Colour] రంగులలో భిన్నంగా కనిపిస్తాడు. సుర్యాస్తమయం అయిన తరువాత ఇక్కడి ఆకాశం చిత్రకారుడు వేసిన Painting లా అనేక రంగులతో నిండిపోయి ఎన్నటికీ మర్చిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.
సుర్యాస్తమయం అయిన కొద్దిసేపటి నుండే ఇక్కడి ఆకాశంలో వింత వింత కాంతులు కనిపిస్తాయి. చాలామంది ఒకేసారి [సామూహికంగా] చదువుతున్నట్లుగా వినిపించే మంత్రాల వంటి అనేక శబ్దాలను మనం వినవచ్చు. ఇక్కడి సుర్యాస్తమయ సమయంలో కనిపించి వినిపించే నమ్మలేని నిజమిది. [ఇక్కడ కనిపించే అనేక వింత కాంతులను ఫోటోలు తియ్యడం జరిగింది అలాగే వినిపించే మంత్రాలను రికార్డ్ చెయ్యడం జరిగింది]
(22) శతశృంగి / శతశృంగ పర్వతాలు [శత =100,శృంగ =కొమ్ములు]
గరుక్మంతుడి వల్ల మరియు మహర్షి అగస్తేశ్వరుని వల్ల గోకర్ణ దక్షిణ దిక్కుగా ఏర్పడిన పర్వతాల సమూహమే శతశృంగి / శతశృంగ పర్వతశ్రేణి. ‘శత’ అనగా 100 ‘శృంగ’ అనగా కొమ్ములు. గోకర్ణ దక్షిణ దిక్కుగా ఏర్పడిన 100 కొమ్ముల వంటి పర్వతాల సమూహమే ఈ శతశృంగ పర్వతశ్రేణి. ఈ పర్వతశ్రేణి అనేకానేక ఋషులకు , మునులకు , దేవతలకు వారు ఏర్పరచుకున్న ఆశ్రమాలకు ఆలవాలమైఉన్నాయి. కాలక్రమేణా రెండు పర్వతాలు సముద్రం లో మునిగి పోగా మిగిలిన 98 పర్వతాల సమూహాన్ని ఇక్కడ చూడవచ్చు.
(23) గోకర్ణక్షేత్రం లోని బీచ్ లు
(1) ’ఓం’ బీచ్ [ॐ Beach / OM Beach]
ఇది ॐ ఆకారంలో ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన బీచ్. ఇక్కడ బోటింగ్ సదుపాయం గలదు. ఈ బీచ్ లో Foreigners ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ బీచ్ అతి ప్రమాదకరమైనది కుడా. గోకర్ణ ప్రధాన దేవాలయం నుండి ఇక్కడకి వెళ్ళడానికి ఆటో రిక్షాలు అందుబాటులో ఉంటాయి. ఇది గోకర్ణ ప్రధాన దేవాలయం నుండి దాదాపు 5 KMs దూరం ఉంటుంది.
(2) గోకర్ణ బీచ్ [Gokarna Beach]
గోకర్ణ మహాబలేశ్వర [ఆత్మలింగ] దేవాలయం (గోకర్ణ ప్రధాన దేవాలయం)కు అతి దగ్గరలోగల బీచ్ ఇది. సాధారణంగా భక్తులు ఇక్కడే సముద్ర స్నానం చేసి గోకర్ణ మహాబలేశ్వర [ఆత్మలింగ] దర్శనానికి వెళతారు. ఇక్కడ Indians అధికంగా ఇంటారు. ఈ బీచ్ ఎడమ వైపుకు వెళ్ళే కొలది ప్రమాదకరమైనది. ఈ బీచ్ వెంట కుడి వైపుకు దాదాపు 5 KMs నడిస్తే శాల్మలీ[గంగావళి] నదీసంగమం చేరుకోవచ్చు. గోకర్ణ సంధ్యాసమయ సుర్యాస్తమయం చూడదగిన బీచ్ ఇదే.
(3) కుండ్లె బీచ్ [క్రీడాశైల - Kundle Beach]
ఈ బీచ్ కు నడుచుకుంటూ దగ్గర దారిలో వెళ్ళడానికి ‘రామతీర్ధం’ నుండి మార్గం కలదు. ‘రామతీర్ధం’ వద్ద గల మెట్ల మార్గం ద్వారా 15 నిముషాల నడకతో ఈ బీచ్ ను చేరవచ్చు. ఇది ‘ఓం బీచ్’ కంటే ముందు ఉంటుంది. ఇక్కడ అనేక Resorts ఉన్న కారణం గా ఇక్కడ ఎక్కువగా Foreigners ఉంటారు. ఈ బీచ్ అతి ప్రమాదకరమైనది. పూర్వం ఈ బీచ్ ను ‘క్రీడాశైలం’ అనేవారు. ఈ బీచ్ కు దగ్గరలోనే ఆంజనేయ జన్మభూమీ, శ్రీ ఉమామహేశ్వర దేవాలయం కలవు.
(4) హాఫ్ మూన్ బీచ్ [Half Moon Beach]
ఈ బీచ్ ‘ఓం బీచ్’ దాటిన తరువాత ఉంటుంది. ఇక్కడ Foreigners ఎక్కువగా ఉంటారు. ఈ బీచ్ అత్యంత ప్రమాదకరమైనది. అర్ధ చంద్రాకారంలో ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది
(5) ప్యారడైస్ బీచ్ [Paradise Beach]
ఈ బీచ్ కుడా ’ఓం బీచ్’ దాటిన తరువాతే ఉంటుంది. ఇక్కడ అనేక Resorts ఉన్న కారణంగా ఇక్కడ Foreigners ఎక్కువగా ఉంటారు. ఈ బీచ్ అత్యంత ప్రమాదకరమైనది కుడా. పౌర్ణమి రాత్రులలో ఈ బీచ్ అత్యంత సుందరంగా ఉంటుంది. పౌర్ణమి రాత్రులలో ఈ బీచ్ లో ప్రత్యేక Carnivals జరుగుతాయి.
(6) తడడి బీచ్ [Tadadi Beach]
గోకర్ణలో అన్నింటికన్నా దూరంగా ఉన్న బీచ్ ఇది. ఇక్కడ నిర్మానుష్యంగా ఉండడమే కాకుండా సముద్రపు శంకులూ, గవ్వలు దొరుకుతాయి. ఇక్కడ Foreign జంటలు అధికంగా కనిపిస్తాయి. ఈ బీచ్ అత్యంత ప్రమాదకరమైనదే కాకుండా ఇక్కడి సముద్రపు ఇసుకలో, సముద్రపు నీటిలో Sea Snakes కనిపిస్తాయి.
(24) గోకర్ణ క్షేత్రంలో చూడ వలసిన ఇతర ప్రదేశాలు మరియు గుడులు (పైన చెప్పిన 23 ప్రదేశాలు కాకుండా)
గోకర్ణ క్షేత్రంలో చూడదగిన ఇతర ప్రదేశాలు మరియు గుడులు (పైన చెప్పిన 23 ప్రదేశాలు కాకుండా) |
---|
గోకర్ణ క్షేత్రంలో చూడదగిన ఇతర ప్రదేశాలు మరియు గుడులు (పైన చెప్పిన 23 ప్రదేశాలు కాకుండా) |
24. రసలింగేశ్వర ఆలయం |
25. శింసుమార తీర్ధం |
26. తామ్రపర్ణి |
27. రుద్రపాదం |
28. వినాయక ఆశ్రమం |
29. గోగర్భ |
30. బ్రహ్మఆశ్రమం |
31. ఇంద్రేశ్వర్ - గోమటేశ్వర్ |
32. కామేశ్వర తీర్ధం |
33. కృష్ణ ఆశ్రమం |
34. సుమిత్రేశ్వరలింగం |
35. భీమకుండం |
36. హరిహరపూర్ వైతరణి |
37. కపిలతీర్ధం |
38. కమండలు తీర్ధం |
39. విశ్వామిత్ర ఆశ్రమం |
40. అమృతేశ్వర దేవాలయం (సరస్వతి-సావిత్రి తీర్ధం) |
41. మార్కండేయ ఆశ్రమం |
42. స్కందేశ్వర సుభ్రమణ్య దేవాలయం |
43. పరశురామ ఆశ్రమం |
(44) అఘనాశినీ నదీసంగమం మరియు శాల్మలీ[గంగావళి] నదీసంగమం
గోకర్ణ క్షేత్రం ” అఘనాశినీ” మరియు “శాల్మలీ” [దీనినే 'గంగావళి'నది అనికూడా అంటారు] అనే రెండు నదులు సముద్రంలో కలిసే మధ్య భాగంలో ఉన్న గ్రామం. పేరుకు తగ్గట్టుగానే ఈ రెండు నదుల మధ్యగల భూభాగం గోకర్ణాకారంలో [ఆవు చెవి] ఉంటుంది. ఈ రెండు నదులు గోకర్ణ సముద్రంలో కలిసే సంగమ ప్రదేశాలు [Eastuary] అత్యంత పవిత్రమైనవి. అఘనాశినీ నది సముద్రం లో కలిసే చోట [నదీ సంగమ ప్రదేశం] స్నానమాచరించడం వల్ల పూర్వం 12 జన్మలలో చేసిన పాపాలన్నీ, అలాగే ఈజన్మలో అప్పటి వరుకూ [స్నానం చేసే సమయం వరుకూ] చేసిన పాపాలన్నీ కుడా ‘శూన్యమై’పోతాయి. అదేవిధంగా శాల్మలీ నదిలో స్నానమాచరించడం వల్ల మనం నిత్య జీవితంలో చెప్పిన అబద్దాల వల్ల [సరదాగా చెప్పిన అబద్దాల వల్ల వచ్చిన పాపం తో సహా] ముతా కట్టుకున్న పాపాలన్నీ నశిస్తాయి. భక్తులందరూ తప్పక ఈ రెండు నదులు సముద్రంలో కలిసే చోట్ల స్నానం చెయ్యాలి. వీలుపడనివారు కనీసం ‘అఘనాశినీనది’ [అఘము = పాపము, నాశిని = నసింప జేసేది] సముద్రసంగమ ప్రదేశంలో స్నానం చేస్తే అన్నిపాపాలు ఒకే దెబ్బతోపోతాయి.
గోకర్ణ క్షేత్రంలో ఎక్కడ ఉండాలి?
గోకర్ణ క్షేత్రంలో అనేక వసతీగృహాలు అందుబాటులో కలవు. Rs. 100/- Per Day నుండి Rs. 7000/- Per Day వరకు వివిధ సౌకర్యాలతో కూడిన Guest Houses/ Resorts / Hotels ఇక్కడ భక్తులు ఉండడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ క్రింద ఇచ్చిన కొన్ని వసతీగృహాల చిరునామాలు కేవలం అక్కడ గల నమూనా సౌకర్యాలను భక్తులకు తెలియజెప్పడం కోసం మాత్రమే.
Accommodation | + Points | - Points | Rating |
---|---|---|---|
Accommodation | + Points | - Points | Rating |
1. Sri Shivram Krishna Bhat, Near Brahmana Parishat, Beside Prasada BhojanaShala (Road), Gokarna Ph: 09448894967 | 1.Close to Beach 2. Close to Temple 3. Close to BhojanaShala 4. Close to Main Temple 5. Non Commercial 6. Only Rs.350/- Per 24 Hrs. 7. Plenty of Parking Space 8. Management will Calculate Amount Only for Night Stay | 1. Average maintenance 2. Only 4 Rooms Available | 3.5/5 |
2. Padma Lakshmi Guest House, Near Main Temple, After Mahaganapathi Temple, Gokarna Ph: 09886335937 | 1. Close to Main Temple 2. Close to Shops 3. Rs. 400/- Per Day. | 1. On The Busy Road 2. Parking Available for First Two Cars Only | 2.5/5 |
3. Greens - Om Hotel, Behind RTC Bus Stand, Gokarna Ph: 08386-256244 | 1. Just Behind RTC Bus Stand 2. Tie up with Karnataka Tourism 3. Rs. 500/- Per Day 3. Railway Station Sharing Cabs Will Start From Here | 1.Commercial Environment | 2/5 |
4.Namaste Holiday Homes, Near Kundle Beach,Gokarna Ph: 09739600407 | 1. Free Breakfast for 2 persons and Free Yoga Class 2 times a day 2. Wifi Ready Rooms 3. Special Cottages Available 4. Suggestible for LTC / Reimbursement Trips | 1. Very Far From Temple 2. High Cost 3. Rs.5000 (Five Thousand) Per Day 4. Suggestible for Foreigners 5. Foreign Management | 1/5 |
గోకర్ణక్షేత్ర పురోహితుల వివరాలు
గోకర్ణ క్షేత్రంలో ఏదైనా Accommodation లో దిగిన తరువాత క్రింది పురోహితులకు ఫోన్ చేసి మరుసటి రోజు ఉదయం అభిషేక పూజకు వస్తున్నట్టు చెప్పి, ఎప్పుడు అనువైన సమయమో కనుక్కోవాలి. అక్కడి పురోహితులు హిందీ, ఇంగ్లిష్ బాగా మాట్లాడగలరు.
ఆ మరుసటి రోజు ఉదయం 04:30కి లేచి సముద్ర స్నానం పూర్తి చేసుకొని, తిరిగి రూం కి వచ్చి అక్కడ మళ్లీ స్నానం చేసి (సముద్రపు ఇసుక పోవడం కోసం) సంప్రదాయ దుస్తులు ధరించి నేరుగా మహా గణపతి దేవాలయానికి వెళ్లి అక్కడ ప్రాతఃకాల అభిషేకం చేయించి, గరిక సమర్పించి, గణపతికి శిరస్సు మీద గల ‘నొక్కు’ ను చూసి, అక్కడనుండి గోకర్ణ మహాబలేశ్వర [ఆత్మలింగ] ప్రదాన ఆలయానికి రావాలి. అక్కడ మీ పురోహితులను కలసి అభిషేక టికెట్ తీసుకోని ఆదిగోకర్ణేశ్వరలింగాన్ని దర్శించి అప్పుడు ప్రదాన ఆలయంలోకి అడుగుపెట్టాలి. ఆ తరువాత అక్కడ గల దత్తాత్రేయ దేవాలయాన్ని, వీరభద్ర దేవాలయాన్ని చివరిగా సాక్షి గోకర్ణేశ్వర లింగాన్ని / శాస్త్రేశ్వర గోకర్ణ లింగాన్నిదర్శించాలి.
గోకర్ణ క్షేత్రంలో లభించే సౌకర్యాలు
(1) Bikes & Two Wheelers On Rent
గోకర్ణ క్షేత్రంలో ఎక్కడికి వెళ్ళాలన్న భక్తులకు ఆటో రిక్షాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా కుండ్లె, ఓం, హాఫ్ మూన్, ప్యారడైస్ మరియు తడడి బీచ్ లకు వెళ్ళాలంటే ట్రిప్పుకు Rs.150/- to Rs.200/- అడుగుతారు. అంటే ఒకసారి వెళ్ళడానికి Rs.200/- తిరిగి రావడానికి Rs.200/-, అందువల్ల గోకర్ణ క్షేత్రంలో చాలామంది బైక్ లను అద్దెకి తీసుకుంటారు. Peak Seasons లో Rs.350/- Per Day, మామూలు Off Seasons లో Rs.300/- Per Day చార్జ్ చేస్తారు. పెట్రోల్ మనమే పోయించుకోవాలి. చాలామంది Foreigners కు కుడా బైక్ లను అద్దెకిస్తారు. చాలామంది పాన్ బ్రోకర్లు/ మార్వాడీలు ఈ బిజినెస్ చేస్తారిక్కడ. Indians బైక్ అద్దెకి తీసుకోవడానికి Driving Licence, Photo ID, Address Proof కాపీలనూ, దానితో పాటూ ఒక రోజు అద్దెను Advance గా ఇస్తే సరిపోతుంది. ఇక్కడ యూత్ కోసం High End Bikes కుడా అద్దెకి అభిస్తాయి.
కొసమెరుపు ఏంటంటే Indians ఏదైనా Foreign Country వెళితే అక్కడ Driving Licence లేకుండా Driving ఎట్టి పరిస్థితుల్లో చెయ్యరు. కాని ఇక్కడ Foreigners బైక్ అద్దెకి తీసుకోవడానికి ఎటువంటి Document ప్రుఫులూ, కాపీలూ ఇవ్వక్కర్లేదు. ఇక్కడ Foreigners కు ఎటువంటి హామీ లేకుండానే Bike అద్దెకి లభిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు Driving Licence లేకుండా అద్దె బైక్ లు నడిపే Foreigners ని ఏమి అనరు, పట్టుకోరు, చలానా అసలేరాయరు.
ఇక్కడ బైక్ లతో పాటు Ladies & Senior Citizens నడపడానికి వీలుగా ఉండే Auto Gear Two Wheelers వంటివి కుడా అద్దెకి లభిస్తాయి. ఇక్కడ అద్దెకి దొరికే అన్ని బైకులు కొత్తవిగా, మంచి కండిషన్లో ఉంటాయి. కొన్ని High End బైకులకు కెమ్రాలు, GPRS System లు కుడా బిగించి ఉంటాయి.
(2) Free Food Donation / Amrutaanna Prasadam
గోకర్ణ క్షేత్రంలో ప్రతీ రోజు భక్తులందరికీ మద్యాహ్నం 12:00 PM నుండి 02:00 PM వరుకు, తిరిగి రాత్రి 07:00 PM నుండి 08:00 PM వరుకు ఉచితంగా అమృతాన్నప్రసాదం / నిత్య అన్నదానము లభిస్తుంది. ఇక్కడి అన్నము గోకర్ణ ఆత్మలింగానికి సమర్పించిన ప్రసాదము. కాబట్టి ఇక్కడ భోజనం చెయ్యడం ఎంతో ఉత్తమము.
(3) ATM Centers @ Gokarna
గోకర్ణ క్షేత్రంలో [గోకర్ణ గ్రామంలో] కేవలం 3 ATM Centers మాత్రమే కలవు. కాబట్టి ATM ల వద్ద భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. చాలామంది Foreigner లు ATM లలో International Credit / Debit Card లు వాడడం వల్ల కుడా తొందరగా డబ్బు అయిపోతుంటుంది. కాబట్టి భక్తులు అవసరమొచ్చినప్పుడు కాకుండా ముందుగానే Withdraw చేసుకోవడం మంచిది.
ATM | Location (Land Mark) |
---|---|
ATM | Location (Land Mark) |
1. Karnataka Bank ATM | Behind Gokarna RTC Bus Stand Road |
2. State Bank of Mysore ATM | Opposite OM Hotel, Behind Gokarna RTC Bus Stand |
3. SBI ATM | Hotel Sairam Building, Main Road, Near Gokarna RTC Bus Stand |
గోకర్ణ నాగలింగపుష్పాల చెట్లు (శివలింగ పుష్పాల చెట్లు – కానన్ బాల్ ట్రీ)
గోకర్ణ క్షేత్రంలో అధికంగా కనబడే చెట్లు ఔదుంబరాలు (మేడిచెట్టు లేదా దత్తవృక్షం) ఆతరువాత స్థానంలో ఉండేవి అనఘదత్త వృక్షాలు (పనస చెట్లు) ఇక మూడవ స్థానంలో ఉండేవి నాగలింగ పుష్పాల చెట్లు (శివలింగ పుష్పాల చెట్లు). ఈ నాగలింగ పుష్పాల చెట్లు మన దగ్గర అరుదుగా ఉంటాయి. ఈ చెట్ల పుష్పాలు పరమ శివునికి అతి ప్రీతికరమైనవి. గోకర్ణ ఆత్మలింగానికి ఈ నాగలింగ పుష్పాలను సమర్పించి తరించవచ్చు. వానాకాలం లో ఈ నాగలింగ పుష్పాల చెట్లను గోకర్ణ నర్సరీల్లో అమ్ముతారు కుడా.
గోకర్ణ క్షేత్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గోకర్ణ క్షేత్రంలో మనం అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. కారణం గోకర్ణం ఎంత గొప్ప సాధనా స్థలమో, అంతే గొప్ప పాపపరిహార క్షేత్రం కుడా. అందువల్లే ఎక్కడెక్కడివారో గోకర్ణ వచ్చి మరణించడం జరుగుతూఉంటుంది. మరీ ముఖ్యంగా ‘సముద్రుడు’ తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మనం గమనించేలోపే సముద్రం చాలా ముందుకురావడం లేదా చాలా వెనకకిపోవడం జరుగుతూ ఉంటుందిక్కడ. అంతా నిముషాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఇక్కడి బీచ్ లలో వచ్చే ‘రాకాసి అలలు’ ఎంతో మంది పెద్దపెద్ద గజ ఈతగాళ్ళనే బలితీసుకున్న సంఘటనలు అనేకం. భక్తులకు గోకర్ణ సముద్రం గురించిన ‘హెచ్చరిక’ బోర్డులు పెట్టి నప్పటికీ ఇక్కడ బీచ్ లలో మునిగి చనిపోవడం సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇవి కాక ఈ క్రింది అనేక సాధారణ జాగ్రత్తలు గోకర్ణ క్షేత్రంలో తీసుకోవాలి.
Click Here To Read News Article On Gokarna Beaches
- Foreigners తాకిడి అదికంగా ఉండడం వల్ల ఇక్కడ దొరికే వస్తువుల ధరలు అధికంగా ఉంటాయి. అన్ని చోట్లా ‘అతిగా బార్గైనింగ్’ చెయ్యాలి.
- గోకర్ణ క్షేత్రంలో ఎక్కడ చూసినా నకిలీ వస్తువులే ఉంటాయి. నకిలీ మినరల్/బాటిల్డ్ వాటర్, నకిలీ బిస్కెట్స్, నకిలీ కూల్డ్రింక్స్, నకిలీ ముత్యాలు, నకిలీ శంకులు, నకిలీ మ్యాంగో జ్యూసులు, నకిలీ చెప్పులు, నకిలీ దేవతా పంచలోహవిగ్రహాలు, నకిలీ గ్లుకాన్-డి, ఆఖరికి నకిలీ మందులు కుడా ఇక్కడ సర్వసాధారణం. గోకర్ణ క్షేత్రంలో ఏవస్తువు కొన్నా, ఎక్కడ కొన్నా (పెద్ద షాపులో కొన్నా.., ఫుట్పాత్ పైన కొన్నా..) ఒకటికి రెండుసార్లు చూసి కొనాలి.
- ఇక్కడ శిలాజిత్ వంటి దైవ సంబంధ పదార్ధాలూ, పాదరసలింగాలూ, ఇతర అరుదైన దైవిక వస్తువులు దొరుకుతాయి. కాని వీటిలో 70% వరుకు నకిలివే!
- గోకర్ణ నుండి ఇతర ప్రాంతాలకి వెళ్లడానికీ తిరిగి గోకర్ణ రావడానికి KSRTC బస్సులనే ఉపయోగించండి. ఇక్కడ RTC బస్సులు టైం అంటే టైంకు బయలుదేరుతాయి. ఒక్క నిముషం కుడా ఆలస్యంగా బయలుదేరవు.
- Peak Season లో ట్రావెల్స్ వారి చార్జీలు KSRTC చార్జీలు కన్నా 5-10 రెట్లు ఎక్కువగా ఉంటాయి.
గోకర్ణ చుట్టుపక్కల గల చూడవలసిన ప్రదేశాలు / ఇతర ఆలయాలు
ప్రదేశము (Place) | గోకర్ణ నుండి దూరము (Distance From Gokarna) | గోకర్ణ నుండి ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం (Transport From Gokarna) |
---|---|---|
ప్రదేశము (Place) | గోకర్ణ నుండి దూరము (Distance From Gokarna) | గోకర్ణ నుండి ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం (Transport From Gokarna) |
మురుడేశ్వర | 80 KMs (1 1/2 Hr.) | Direct Bus Available From Gokarna Bus Stand At Morning 06:45 AM (Gokarna - Mysore Bus Via: Mrudeshwar) |
సజ్జేశ్వర | 80 KMs (2 Hrs.) | Gokarna ---->Karwar ---->Sajjeshwar |
గుణేశ్వర | 65 KMs (1 Hr.) | Gokarna ---->Kumta ---->Guneshwar Please Note Temple Open Between 06:00 AM To 01:00 PM And 03:00 PM To 08:15 PM |
ధారేశ్వర్ | 50 KMs (1 Hr.) | Gokarna ---->Kumta ---->Dhareshwar Please Note Temple Open Between 06:00 AM To 10:00 AM And 04:00 PM To 09:00 PM |
కొల్లూర్ ముకాంబిక | 140 KMs (3 Hrs.) | Gokarna ---->Kumta ---->Hunnavwar ---->Udupi ----> Kollur |
ఉడుపి శ్రీకృష్ణ | 170 KMs (3 Hrs.) | Direct Bus Available From Gokarna Bus Stand At Morning 06:45 AM (Gokarna - Mysore Bus Via: Udupi) OR Direct Train Availble From Gokarna Road Railway Station To Udupi (Early Morning 03:00 AM and Morning 06:30 AM) Journey Time: 3 Hrs. |
గోవా | 140 KMs (3 Hrs.) | Gokarna ---->Karwar---->Goa (Direct Bus upto Margoa At 06:45 AM) |
జోగ్ ఫాల్స్ | 120 KMs (3 Hrs.) | Gokarna ---->Kumta ---->Hunnavwar ---->Jog |
హుబ్లి (హుబ్బళ్లి) సిద్ధారూడేశ్వర స్వామి | 170 KMs (3 Hrs.) | Gokarna ---->Kumta ---->Hubli |
(1) మురుడేశ్వర
రావణాసురుడు కైలాసం నుండి పరమేశ్వరుడిని వేడుకొని భూలోకానికి తెచ్చిన ఆత్మలింగానికీ, మురుడేశ్వర క్షేత్రం లోని మురుడేశ్వరలింగానికీ సంబంధం ఉంది.రావణాసురుడు తెచ్చిన ఆత్మలింగాన్ని గోకర్ణ క్షేత్రంలో బ్రాహ్మణ రూపం లో వచ్చిన గణపతి భూమిమీద పెడతాడు. వెంటనే ఆత్మలింగం భూమినుండి బయటకు తీయడానికి వీలు లేకుండా భు స్థాపితమై పోతుంది. సాయం సమయమైనందున అర్ఘ్యాన్ని వదలడానికి వెళ్ళిన రావణాసురుడు భూమిమీద పెట్టబడిన ఆత్మలింగాన్ని బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా రాదు. అప్పుడు రావణాసురుడు కోపంతో ఆత్మలింగం పై కప్పి ఉన్న వస్త్రం, దారం, కవచం వంటి తదితర వస్తువులను విసిరేస్తాడు. ఆ వస్తువులు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ కుడా శివలింగాలుద్భ వించి ఆ ప్రదేశాలు కుడా మహా మాన్విత మైన పుణ్య క్షేత్రాలుగా విలసిల్లు తున్నాయి. అవి గోకర్ణ క్షేత్రానికి దగ్గరలో గల సజ్జేశ్వర, గుణ వంతేశ్వర, ధారేశ్వర, మరియు మురుడేశ్వర. గోకర్ణ తో కలిపితే ఇవి మొత్తం ఐదు. వీటినే పంచ లింగ క్షేత్రాలని పిలుస్తారు. రావణాసురుడు ఆత్మలింగంపై నున్న వస్త్రాన్ని విసిరివేయగా ఆ వస్త్రం పడిన ప్రదేశమే ‘మురుడేశ్వర’. మురుడ అంటే కన్నడ భాషలో వస్త్రమని అర్ధం. ఎత్తైన విమాన గోపురం [18 అంతస్తులు] గల శైవ క్షేత్రమిది. మురుడేశ్వర ఆలయ ప్రాంగణం లో కనబడే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం తో పాటుగా అక్కడ ఉన్న ఇత విగ్రహాలూ, అక్కడే కొలువై ఉన్న దత్తాత్రేయుడు, భూకైలాస గుహ, అక్కడి వాతావరణ పరిస్థితులు, అక్కడి మురుడేశ్వర బీచ్ భక్తులను అమితంగా ఆకట్టు కుంటాయి. మురుడేశ్వర బీచ్ లో ప్రత్యేక ఆకర్షణ. మురుడేశ్వర లో యాత్రికులు ఉండడానికి వసతీ గృహాలు, ఇంద్రప్రస్థ మరియు కామత్ లాంటి ప్రముఖ హోటళ్ళు ఉన్నాయి.
(2) జోగ్ ఫాల్స్ (జోగ్ జలపాతం)
ప్రకృతి మానవుడికి ప్రసాదించిన బహుమతులలో జోగ్ జలపాతాలు ఒకటి. ఈ జలపాతం షరావతి నదినుండి ఏర్పడుతుంది. నాలుగు భాగాలుగా ప్రవహిస్తుంది. అవి రాజా, రాణి, రోవర్ మరియు రాకెట్. సుమారుగా 850 అడుగుల ఎత్తునుండి ఒంపు సొంపులతో క్రిందకు పడే ఈ జలపాతాలు సందర్శకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. రమణీయమైన ఈ జలపాతాల అందం చుట్టూ ప్రక్కలగల పచ్చటి పరిసరాలతో మరింత అధికమవుతుంది. జోగ్ ఫాల్స్ అందాలను ఆనందించాలంటే ‘వాట్కిన్స్ ప్లాట్ ఫాం’ నుండి చూడాలి. దీనికి సమీప పట్టణం షిమోగా జిల్లాలోని సగారా. డైరెక్ట్ గా జోగ్ ఫాల్స్ చేరుకోవడానికి KSRTC బస్సుల సౌకర్యం ఉంది. గోకర్ణ నుండి ఇక్కడకు వచ్చేవారు మూడుగా కార్వార్ లేదా హొన్నవర్ ల కు వచ్చి అక్కడ నుండి జోగ్ ఫాల్స్ కి బస్సును పట్టుకోవాలి. ఇక్కడ KSTDC వారి Mayura హోటల్ కలదు. అడవిలోగుండా సాగే బస్సు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఘాట్ రోడ్డు ప్రయాణం ఉన్న కారణంగా భోజనం చేసి బస్సు ఎక్కరాదు.
(3) కొల్లూర్ మూకాంబిక
కొల్లూర్ మూకాంబిక మహాసరస్వతీ, మహాలక్ష్మీ, మహాకాళీ మాతల ప్రతిరూపం. ఈవిడ కళలకు తల్లి. పాటలు పాడే గాయనీగాయకులకూ, సంగీత కళాకారులకూ మొత్తం మీద సంగీత-సాహిత్య కళలకు ఈవిడే అధిదేవత. సంగీత-సాహిత్యాలలో ప్రతిభ ఉన్నా పైకిరాలేనివారు, మాటలురాని మూగవారు ఈ తల్లి దర్శనం చేసుకుంటే ప్రతిభకు తగ్గ అవకాశం, అలాగే మూగవారికీ, స్వరపేఠిక ఇబ్బందులు ఉన్నవారికి మూకాంబిక దేవి దర్శనం వల్ల మాటలు వస్తాయన్నది భక్తుల విశ్వాసం. అందువల్ల సాధారణ భక్తులతో పాటుగా కళలనే వృత్తిగా, జీవనోపాధిగా ఎంచుకున్న వారు తప్పని సరిగా ఒక్కసారైనా దర్శింపవలసిన స్థలమిది.
(4) హుబ్లి (హుబ్బళ్లి) సిద్ధారూడేశ్వర స్వామి ఆశ్రమం
హుబ్లి (హుబ్బళ్లి) సిద్ధారూడేశ్వర స్వామి ప్రముఖ గురు దేవులు మరియు షిర్డీ సాయి సమకాలీకులు. వీరు ఉత్తర కన్నడమందు గురు పరంపరను వ్యాప్తి చెయ్యడంలో కీలకపాత్ర పోషించారు. గోకర్ణ చేరాలంటే హుబ్లి మీదుగానే వెళ్ళాలి కాబట్టి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ సిద్ధారూడేశ్వర స్వామి ఆశ్రమాన్ని చూసి వెల్ల వచ్చు. అక్కడ సిద్ధారూడేశ్వర స్వామి ఆశ్రమంతో పాటు వారి శయన మందిరము , సమాధి మందిరము కలవు.
(5) ఉడిపి శ్రీకృష్ణ ఆలయం
ఉడిపి మఠంలోకి [నిజానికి ఇది దేవాలయం కాదు] ప్రవేశించగానే ఓ దేవాలయంలోకి అడుగుపెట్టినట్టు ఏ మాత్రం అనిపించదు. ఓ ఊరి మధ్యన నిర్మించిన మహాప్రాకారంలోకి వెళ్లిన భావన కలుగుతుంది. 12వ శతాబ్ద కాలంలో ఏర్పాటు చేసిన ఈ మఠాన్ని, ఆలయాన్ని, భవనాలను ‘తుళు’ సాంప్రదాయ శైలిలో నిర్మించారు. దేవాలయంలోకి ప్రవేశించడానికి ఎలాంటి రుసుము ఉండదు. ఆలయం ఎడమవైపు భాగంలో ప్రధాన ఆకర్షణగా కనిపించే ‘కోనేరు’ ను చుట్టి క్యూలో నడుస్తూ దర్శనం చేసుకోవాల్సిఉంటుంది. భక్తులు సంప్రదాయ దుస్తులతో మాత్రమే దర్శనానికి అర్హులు. ఉడిపి ఆలయంలోని శ్రీకృష్ణ విగ్రహం ఓ ముద్దులొలికే చిన్ని బాలుని రూపంలో ఉంటుంది. నలుపురంగు, సాలిగ్రామ శిలతో తయారు చేసిన ఈ విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది.
స్వామివారి మూలవిరాట్ విగ్రహం ఉంచిన గర్భగుడి ఒక గదిలా ఉండి ముందువైపు అనేక కిటికీలలాంటి తలుపులు ఉంటాయి. ఎప్పుడూ మూసి ఉండే ఈ తలుపులకు ఏర్పాటు చేసిన తొమ్మిది అంగుళాల పొడుగు, తొమ్మిది అంగుళాల వెడల్పుతో చేసిన నలుచదరపు కంతల ద్వారా శ్రీకృష్ణ దర్శ నం చేసుకోవాలి. ఒక్కో తలుపులో ఏర్పాటు చేసిన తొమ్మిది కంతల ద్వారా మాత్రమే ఉడిపి శ్రీకృష్ణను దర్శించుకోవాల్సి ఉంటుంది. దేశంలోని మిగిలిన దేవాలయాలకు భిన్నంగా ఈ దర్శనముంటుంది. ప్రతి మనిషిలో ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా ఈ నవద్వారాలను ఏర్పాటు చేశారు.
కేవలం రెండున్నర అడుగుల ఎత్తు మాత్రమే ఉండే ఈ చిన్నికృష్ణుడి విగ్రహం కుడి చేతిలో ఒక తాడు, ఎడమ చేతిలో మజ్జిగ కవ్వమూ ఉంటాయి. పూజారులు, అర్చకుల ప్రమేయం లేకుండా దర్శనం ఉడిపి దేవాలయ ప్రత్యేకతగా చెప్పుకోవాలి. దేశంలోని ఇతర ఆలయాలలో దైవదర్శనానికి పూర్తి భిన్నంగా ఈ ఆలయ దర్శనం ఉంటుంది. శ్రీకృష్ణ ఆలయం గర్భగుడి ముందు ఓ సువిశాలమైన హాలులాంటి మంటపం ఉంటుంది. ఆ మంటపానికి అటు, ఇటు ఉండే ఇద్దరు అర్చకులు, భక్తులు సమర్పించిన టెంకాయలు,పూజా ద్రవ్యాలను నివేదించి తిరిగి ప్రసాదంగా ఇస్తారు. ఉడిపి ఆలయానికి ఎదురుగానే చంద్రమౌళీశ్వర దేవాలయం, సమీపంలో అనంతశయన ఆలయాలు సైతం చూడవచ్చు. ఆలయం కుడివైపు భాగంలో దేవస్థానం సత్రాలు, బిర్లా, శృంగేరీ, కృష్ణ, గీతా సత్రాలలోని గదుల్లో విడిది చేయవచ్చు. ఉడిపి దేవస్థానంలో భక్తులకు రెండు పూటలా అన్నప్రసాద వితరణ జరుగుతుంది.