Gandharvapuram (Ganagapur) గంధర్వపురము (గాణుగాపురము/ దేవల్ గాణ్గాపూర్)
Gandharvapuramu(Deval Ganagapur) - గంధర్వపురము (గాణుగాపురము/ దేవల్ గాణ్గాపూర్)
II అణిక కార్యకారణాసి… అవతార ఘేవు పరమేసి
వేషధారుణసీ సన్యాసి… నామే నృసింహసరస్వతి II
రెండవ కలియుగ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు శ్రీ కృష్ణ సరస్వతి స్వామి వారి దగ్గర సన్యాసం స్వీకరించిన తారువాత వారు దేశాటనలో భాగంగా అనేక ప్రాంతాలను తమ పాద స్పర్శతో పునీతంచేస్తూ దాదాపుగా తమ 47వ ఏటా అష్టతీర్ధములతో కూడిన భీమ-అమరజ నదీసంగమ ప్రాంతమైన గంధర్వపురము (గాణుగాపురము/గాణ్గాపూర్) లో అడుగు పెట్టారు. ఆ ప్రాంత మహిమను లోకానికి వెల్లడించడం కోసం అక్కడ ఒక మఠమును కుడా స్థాపించారు. అది మొదలు వారు తమకు 70 సంవత్సరాలు వచ్చేవరుకు గంధర్వపురము లోనే ఉన్నారు. శ్రీపాద శ్రీ వల్లభుల వారికి కురువపురం ఎలాగో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి గంధర్వపురము అలాగే (యోగ /తపోభూమి) అని చెప్పవచ్చు. ఇచ్చట నుండే శ్రీ గురుడు (శ్రీ నృసింహ సరస్వతి స్వామి) అనేక లీలలను చేసి చూపారు. ఎటుచూసినా దత్త భక్తులతో, దత్తాశ్రమాలతో, గోవులతో, దత్తశునకాలతో నిండి ఉన్న గాణ్గాపూర్ సందర్శన దత్త భక్తులందరికీ మంచి అనుభూతిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి గురించి…
విషయము | వివరణ |
---|---|
తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు | శాలగ్రామ దేవ |
పుట్టిన ప్రాంతం | కరంజా గ్రామం (అకోలా జిల్లా) |
ఇంట్లో పిలిచే పేరు | నరహరి |
పుట్టిన తేది, తిథి | క్రీ.శ. 1376 - పుష్య మాస శుద్ధ ద్వితీయ (విదియ) |
తల్లి-దండ్రులు | అంబ - మాధవశర్మ |
శాఖ | శుక్లయజు (యజ్ఞ వల్క్య) శాఖ |
సన్యాసదీక్ష ఇచ్చిన గురువు | శ్రీ కృష్ణ సరస్వతి |
సన్యాసదీక్ష అనంతరం ఇవ్వబడిన పేరు | శ్రీ నృసింహ సరస్వతి |
ప్రియ శిష్యులు | మాధవ సరస్వతి, బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, సదానంద సరస్వతి, జ్ఞానజ్యోతి సరస్వతి మరియు సిద్ధ సరస్వతి (మొత్తం 7 మంది) |
స్వామి వారు గంధర్వపురము లో గడిపిన కాలం | 23 సంవత్సరాలు (దాదాపుగా) |
అవతార అంతర్హిత దినం (అవతారం గుప్తపరచిన దినం) | బహుధాన్య నామ సంవత్సరం( క్రీ.శ.1456) ఉత్తరాయణ పుణ్యకాలంలో, కుంభరాశి లోకి రవి, కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించిన శిశిర ఋతువులో, మాఘమాసం, కృష్ణపక్షం పాడ్యమి శుక్రవారం |
ఎలా వెళ్ళాలి?…
హైదరాబాద్ నుండి గాణ్గాపూర్ కు సులభమైన రూట్... |
---|
హైదరాబాద్ నుండి గాణ్గాపూర్ కు సులభమైన రూట్... |
హైదరాబాద్ నుండి బీజాపూర్ వెళ్ళే పాసింజర్ ట్రైన్ (నాంపల్లి లో బయలుదేరే సమయం 19:50, ఖైరతాబాద్ లో బయలుదేరే సమయం 19:55, బేగంపేట్ లో బయలుదేరే సమయం 20:00, సనత్నగర్ లో బయలుదేరే సమయం 20:10, హాఫిజ్ పేట లో బయలుదేరే సమయం 20:20, లింగంపల్లి లో బయలుదేరే సమయం 20:30) ఎక్కితే ఉదయం 04:15 కల్లా "గాణ్గాపూర్ రోడ్డు" అనే రైల్వే స్టేషన్ లో దిగచ్చు. అక్కడనుండి గాణ్గాపూర్ కి షేరింగ్ ఆటోలు ఎక్కి చేరవచ్చు. గాణ్గాపూర్ రోడ్డు నుండి గాణ్గాపూర్ కు దాదాపు 15 కీ. మీ. ల దూరం ఉంటుంది. |
సొంత వాహనాలలో వెళ్ళే వారికి హైదరాబాద్ నుండి గాణ్గాపూర్ కు దగ్గరి రూట్... మెహిదీపట్నం To గాణ్గాపూర్ 256 కీ.మీ. |
---|
సొంత వాహనాలలో వెళ్ళే వారికి హైదరాబాద్ నుండి గాణ్గాపూర్ కు దగ్గరి రూట్... మెహిదీపట్నం To గాణ్గాపూర్ 256 కీ.మీ. |
మెహిదీపట్నం---> లంగర్ హౌస్ --->చిలుకూరు రోడ్డు---> మొయినాబాద్---> చేవెళ్ల---> మన్నేగుడా -X- రోడ్ (ఇక్కడ ఎడమ చేతి వైపు వెళ్ళాలి)--->పరిగి--->కోడంగల్--->రావులపల్లి (ఇండియన్ ఆయిల్ పెట్రోల్ దగ్గర కుడిచేతి వైపు తీసుకోవాలి)---> కర్ణాటక స్టేట్ హైవే (ఇక్కడ కర్ణాటక స్టేట్ హైవే పైగల మొదటి టోల్ ప్లాజా లో రూ.65/- టోల్ టాక్స్ కట్టాలి (ఒక వైపు 4 వీలర్ కి), ఇదే స్టేట్ హైవే పైగల రెండవ టోల్ ప్లాజా లో మొదటకట్టిన రిసీట్ ను చూపించాలి)---->సేడాం--->మల్ఖేడ్--->గుల్బర్గా ఎయిర్ పోర్ట్--->గుల్బర్గా యూనివర్సిటీ (Left Side లో వస్తుంది)--->గుల్బర్గా ESI మెడికల్ & డెంటల్ కాలేజీ (Left Side లో వస్తుంది)----> గుల్బర్గా ESI మెడికల్ & డెంటల్ కాలేజీ దాటగానే వచ్చే చౌరాస్తా లో ఎడమవైపు రోడ్డు తీసుకోవాలి--->అక్కడనుండి దాదాపు 10 కీ.మీ. లకి గుల్బర్గా హైకోర్ట్ బెంచ్ వస్తుంది (Left Side లో వస్తుంది) ----> గుల్బర్గా హైకోర్ట్ బెంచ్ దాటగానే ఎడమచేతివైపు రోడ్ తీసుకోవాలి--->చౌడాపూర్--->చౌడాపూర్ లో Left Side లో గాణ్గాపూర్ కి వెళ్ళే 'ఆర్చ్' కనిపిస్తుంది---->గాణ్గాపూర్ |
చౌడాపూర్ లో దేవల్ గాణ్గాపూర్ వెళ్ళే రోడ్డులో కనిపించే ఆర్చ్ (కమాన్)
ఏమేంచూడాలి?…
గాణ్గాపూర్ లోని క్రింది దర్శనీయ ప్రదేశాల గురించి విపులంగా తెలుసుకొనడం కోసం ఆయా ప్రదేశాల పై క్లిక్ చెయ్యండి
గాణ్గాపూర్ చేరగానే ముందుగా వెళ్ళ వలసిన ప్రాంతం “భీమా-అమరజా నదీసంగమ స్థానం”. సంగమ స్థానం లో స్నానం చేసాక భీమా-అమరజా నదులకు కృతజ్ఞత గా పూలు, పసుపు, కుంకుమ, కానుకలు నదిలో వదలాలి. పూజా సామాగ్రి కుడా అక్కడే దొరుకుతుంది.
భీమా-అమరజా నదీసంగమ స్థాన స్నాన ఫలితం:
ఈ జన్మలో అప్పటివరుకు చేసిన అన్ని పాప కర్మల ప్రక్షాళన జరుగుతుంది మరియు శ్రీ గురుని దర్శించడానికి అర్హత లబిస్తుంది.
భీమా-అమరజా నదీసంగమ స్థానం లో స్నానం చేసిన తరువాత “సంగమేశ్వర స్వామి”ని దర్శించాలి. ఈ గుడిలో విధిగా మూడు ప్రదక్షణలు చేయాలి. ఈ గుడి భీమా-అమరజా నదీసంగమ స్థానంనకు అతి దగ్గరలోనే ఉంటుంది. సంగమేశ్వర స్వామి దేవాలయం నకు సరిగ్గా ఎదురుగా ఉండే శ్రీ నృసింహ సరస్వతి (దత్త) మందిరాన్ని దర్శించి అక్కడ పూజలు చేయించుకోవచ్చు.
భీమా-అమరజా నదీసంగమ స్థానం ఒడ్డున గల ఔదుంబర వృక్షం క్రింద ప్రదక్షణలూ, గురు చరిత్ర పారాయణ చేసుకోవచ్చు. గురు చరిత్ర లో శ్రీ గురుని ఆజ్ఞ మేరకు నరహరి శర్మ తనకు గల వ్యాధి నివారణకు గాను ఎండు మేడి కట్టెపుల్ల నాటిన ప్రాంతమిది.
ఈ వృక్షం క్రింద చేసిన పారాయణ ఫలితం:
ఆదివ్యాధి నివారణ జరుగును.
నదీసంగమ స్థానం నుండి వస్తున్నప్పుడు ఎడమచేతి వైపున “భస్మదగుట్ట” కనిపిస్తుంది. పరశురాముడు ఇక్కడ చేసిన యజ్ఞ ఫలితంగా ఋషులచే తేబడిన భస్మం (మట్టి) ఇక్కడ ఉంటుంది. యాత్రికులు తమ పాద రక్షలు విడిచి భస్మదగుట్ట ను చేరి తమకు కావలసినంత తీసుకోని వెళ్ళవచ్చు. ఈ ప్రాంతం లో దానములు చేసిన 100 రెట్ల ఫలితం ఉంటుంది.
భస్మదగుట్ట భస్మం (మట్టి) ఉపయోగం:
- దత్త భక్తులు ఇళ్లు కట్టుకునేటప్పుడు పునాదులలో వేసుకోవడానికి
– ఔదుంబరములను పెంచే స్థానములో వేయడానికి
– పూజా మందిరాలు అలకడానికి
– వ్రత పీఠలపై వేసే ముగ్గులో కలపడానికి ఉపయోగించుకుంటే మంచిది.
ఈ ప్రదేశం ప్రతీ దత్త భక్తుడూ తప్పనిసరిగా దర్శించవలసిన ప్రదేశం. పంచ ఔదుంబర వృక్షం ప్రస్తుతం భీమా-అమరజా నదీసంగమ స్థానం రోడ్డు లో గల శ్రీపాద వల్లభ మహాసంస్థాన్ ట్రస్ట్ లోపల గలదు. ఎంతో మహిమాన్విత వృక్ష మిది. 800 సంవత్సరాల క్రిందటిదని తెలియవచ్చింది. ఈ చెట్టు క్రిందే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు తమ అనుష్టాన కార్యక్రమములను చేసుకునే వారు. ప్రస్తుతం వృక్షంలో చాలాభాగం ఎండిపోయింది. దత్తపరంపర లోని అందరూ, సిద్ధపురుషులు సైతం వచ్చి ఈ చెట్టుదగ్గర కూర్చుని తరించిన వారే.
పంచ ఔదుంబర వృక్షం క్రింద కూర్చుని చేయవలసినవి:
ఔదుంబర స్తోత్ర పఠనం, సిద్ధ మంగళ స్తోత్ర పఠనం, శ్రీ నృసింహ సరస్వతి స్తోత్ర పఠనం, సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృత పారాయణ, గురుచరిత్ర పారాయణ.
ఫలితం:
పంచఔదుంబర వృక్షం క్రింద కూర్చుని చేసిన స్తోత్ర పఠనాలు, పారాయణలు వెయ్యిరెట్ల ఫలితాన్ని శీఘ్రంగా యిస్తాయి.
Land Mark:
20 అడుగుల పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉన్నదే శ్రీపాద వల్లభ మహాసంస్థాన్ ట్రస్ట్ . ట్రస్ట్ లోపల ఈ పంచ ఔదుంబర వృక్షం ఉంటుంది. వృక్షానికి అతి చేరువగా మహాతీర్ధం / కాశీతీర్ధం / వారణాసితీర్ధం కుడా ఉంటుంది.
శ్రీ గురుడు భీమా-అమరజా నదీసంగమ స్థానం నకు వెళ్ళునప్పుడు, వచ్చునప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకునే ప్రాంతమిది. ఇక్కడే గురు చరిత్రలోని 48 వ అధ్యాయం లోని సంఘటన జరిగింది.బాగా కాపుకు రాబోతున్న పంటను గురు వాక్యమునకు లోబడి మొదలుకు కోసేసిన ఘటన జరిగిన ప్రదేశమిది. గురు వాక్యం “కామధేనువు” తో సమానమని నిరూపించబడిన ప్రదేశం. ఇక్కడ 48వ అధ్యాయం పారాయణ చేస్తే మంచిది.
శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు ఉన్న ప్రధాన మందిరమే నిర్గుణపాదుకా దత్తమందిరం. ఇదే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు స్తాపించిన మఠం. ఇక్కడి స్వామి వారి పాదాలకు ద్రవ పదార్ధాల స్పర్శనం ఉండదు, కేవలం కస్తూరి, కెసరీ, అష్ట గంధములతో లేపనం పూస్తారు. భగవంతుడు నిర్గుణుడు. వారి పాదాల చెంతనే సర్వం లభిస్తాయనడానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ మందిరం. ఇక్కడ ఉదయం నుండి రాత్రి వరుకు
అనేక పూజలు, ఉత్సవాలు, మధుకరి – భిక్ష మొదలైనవి జరుగుతాయి.
భీమా-అమరజా నదీసంగమ దారిలో నూతనం గా నిర్మించబడిన శ్రీ శంకర మఠం కలదు. ఈ మఠం లో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాల రాయి విగ్రహం కలదు. మరియు పారాయణ చేసుకోవడానికి అనువైన ప్రశాంతమైన ప్రదేశమిది.
దేవల్ గాణ్గాపూర్ పోలీస్ స్టేషన్ లైన్ లో గల SGS (శ్రీ గణపతి సచ్చిదానంద) వారి ఆశ్రమం లో దాదాపు 20 అడుగుల ఎత్తైన త్రిముఖ దత్తాత్రేయుని విగ్రహం ఉంటుంది. ఇక్కడ భక్తులు ఉండడానికి కుడా వసతి కలదు. ఉండడానికి రూం, పొద్దున్న టిఫిన్ , మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనంతో పాటు అన్నింటికి కలిపి రోజుకు రూ. 250 తీసుకుంటారు.
భీమా-అమరజా నదీసంగమ స్థానం నుండి కళ్ళేశ్వర గుడి వరుకు గల వివిధ ప్రదేశాలలో మొత్తం అష్టతీర్దాలు విస్తరించబడి ఉన్నాయి. భక్తులు ఈ అన్ని తీర్దాలలో స్నానమాచరిస్తేనే గంధర్వపుర యాత్ర పూర్తైనట్లు గుర్తుపెట్టుకొనవలసింది.
అష్టతీర్దాలు: 1.షట్కులతీర్ధం 2.నృసింహతీర్ధం 3.వారణాసి/ మహా/ భగిరథీతీర్ధం 4. పాపావినాశిని తీర్ధం 5.కోటితీర్ధం 6.రుద్రపాదతీర్ధం 7.చక్ర తీర్ధం 8.మన్మధతీర్ధం
గాణ్గాపూర్ చేరగానే ముందుగా వెళ్ళ వలసిన ప్రాంతం “భీమా-అమరజా నదీసంగమ స్థానం”. సంగమ స్థానం లో స్నానం చేసాక భీమా-అమరజా నదులకు కృతజ్ఞత గా పూలు, పసుపు, కుంకుమ, కానుకలు నదిలో వదలాలి. పూజా సామాగ్రి కుడా అక్కడే దొరుకుతుంది.
భీమా-అమరజా నదీసంగమ స్థాన స్నాన ఫలితం:
ఈ జన్మలో అప్పటివరుకు చేసిన అన్ని పాప కర్మల ప్రక్షాళన జరుగుతుంది మరియు శ్రీ గురుని దర్శించడానికి అర్హత లబిస్తుంది.
భీమా-అమరజా నదీసంగమ స్థానం లో స్నానం చేసిన తరువాత “సంగమేశ్వర స్వామి”ని దర్శించాలి. ఈ గుడిలో విధిగా మూడు ప్రదక్షణలు చేయాలి. ఈ గుడి భీమా-అమరజా నదీసంగమ స్థానంనకు అతి దగ్గరలోనే ఉంటుంది. సంగమేశ్వర స్వామి దేవాలయం నకు సరిగ్గా ఎదురుగా ఉండే శ్రీ నృసింహ సరస్వతి (దత్త) మందిరాన్ని దర్శించి అక్కడ పూజలు చేయించుకోవచ్చు.
ఈ వృక్షం క్రింద చేసిన పారాయణ ఫలితం:
ఆదివ్యాధి నివారణ జరుగును.
నదీసంగమ స్థానం నుండి వస్తున్నప్పుడు ఎడమచేతి వైపున “భస్మదగుట్ట” కనిపిస్తుంది. పరశురాముడు ఇక్కడ చేసిన యజ్ఞ ఫలితంగా ఋషులచే తేబడిన భస్మం (మట్టి) ఇక్కడ ఉంటుంది. యాత్రికులు తమ పాద రక్షలు విడిచి భస్మదగుట్ట ను చేరి తమకు కావలసినంత తీసుకోని వెళ్ళవచ్చు. ఈ ప్రాంతం లో దానములు చేసిన 100 రెట్ల ఫలితం ఉంటుంది.
భస్మదగుట్ట భస్మం (మట్టి) ఉపయోగం:
- దత్త భక్తులు ఇళ్లు కట్టుకునేటప్పుడు పునాదులలో వేసుకోవడానికి
– ఔదుంబరములను పెంచే స్థానములో వేయడానికి
– పూజా మందిరాలు అలకడానికి
– వ్రత పీఠలపై వేసే ముగ్గులో కలపడానికి ఉపయోగించుకుంటే మంచిది.
పంచ ఔదుంబర వృక్షం క్రింద కూర్చుని చేయవలసినవి:
ఔదుంబర స్తోత్ర పఠనం, సిద్ధ మంగళ స్తోత్ర పఠనం, శ్రీ నృసింహ సరస్వతి స్తోత్ర పఠనం, సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృత పారాయణ, గురుచరిత్ర పారాయణ.
ఫలితం:
పంచఔదుంబర వృక్షం క్రింద కూర్చుని చేసిన స్తోత్ర పఠనాలు, పారాయణలు వెయ్యిరెట్ల ఫలితాన్ని శీఘ్రంగా యిస్తాయి.
Land Mark:
20 అడుగుల పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉన్నదే శ్రీపాద వల్లభ మహాసంస్థాన్ ట్రస్ట్ . ట్రస్ట్ లోపల ఈ పంచ ఔదుంబర వృక్షం ఉంటుంది. వృక్షానికి అతి చేరువగా మహాతీర్ధం / కాశీతీర్ధం / వారణాసితీర్ధం కుడా ఉంటుంది.
శ్రీ గురుడు భీమా-అమరజా నదీసంగమ స్థానం నకు వెళ్ళునప్పుడు, వచ్చునప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకునే ప్రాంతమిది. ఇక్కడే గురు చరిత్రలోని 48 వ అధ్యాయం లోని సంఘటన జరిగింది.బాగా కాపుకు రాబోతున్న పంటను గురు వాక్యమునకు లోబడి మొదలుకు కోసేసిన ఘటన జరిగిన ప్రదేశమిది. గురు వాక్యం “కామధేనువు” తో సమానమని నిరూపించబడిన ప్రదేశం. ఇక్కడ 48వ అధ్యాయం పారాయణ చేస్తే మంచిది.
శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు ఉన్న ప్రధాన మందిరమే నిర్గుణపాదుకా దత్తమందిరం. ఇదే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు స్తాపించిన మఠం. ఇక్కడి స్వామి వారి పాదాలకు ద్రవ పదార్ధాల స్పర్శనం ఉండదు, కేవలం కస్తూరి, కెసరీ, అష్ట గంధములతో లేపనం పూస్తారు. భగవంతుడు నిర్గుణుడు. వారి పాదాల చెంతనే సర్వం లభిస్తాయనడానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ మందిరం. ఇక్కడ ఉదయం నుండి రాత్రి వరుకు
అనేక పూజలు, ఉత్సవాలు, మధుకరి – భిక్ష మొదలైనవి జరుగుతాయి.
భీమా-అమరజా నదీసంగమ దారిలో నూతనం గా నిర్మించబడిన శ్రీ శంకర మఠం కలదు. ఈ మఠం లో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాల రాయి విగ్రహం కలదు. మరియు పారాయణ చేసుకోవడానికి అనువైన ప్రశాంతమైన ప్రదేశమిది.
దేవల్ గాణ్గాపూర్ పోలీస్ స్టేషన్ లైన్ లో గల SGS (శ్రీ గణపతి సచ్చిదానంద) వారి ఆశ్రమం లో దాదాపు 20 అడుగుల ఎత్తైన త్రిముఖ దత్తాత్రేయుని విగ్రహం ఉంటుంది. ఇక్కడ భక్తులు ఉండడానికి కుడా వసతి కలదు. ఉండడానికి రూం, పొద్దున్న టిఫిన్ , మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనంతో పాటు అన్నింటికి కలిపి రోజుకు రూ. 250 తీసుకుంటారు.
భీమా-అమరజా నదీసంగమ స్థానం నుండి కళ్ళేశ్వర గుడి వరుకు గల వివిధ ప్రదేశాలలో మొత్తం అష్టతీర్దాలు విస్తరించబడి ఉన్నాయి. భక్తులు ఈ అన్ని తీర్దాలలో స్నానమాచరిస్తేనే గంధర్వపుర యాత్ర పూర్తైనట్లు గుర్తుపెట్టుకొనవలసింది.
అష్టతీర్దాలు: 1.షట్కులతీర్ధం 2.నృసింహతీర్ధం 3.వారణాసి/ మహా/ భగిరథీతీర్ధం 4. పాపావినాశిని తీర్ధం 5.కోటితీర్ధం 6.రుద్రపాదతీర్ధం 7.చక్ర తీర్ధం 8.మన్మధతీర్ధం
గాణ్గాపూర్ దేవాలయం లో జరిగే పూజలు & ఉత్సవాలు |
---|
గాణ్గాపూర్ దేవాలయం లో జరిగే పూజలు & ఉత్సవాలు |
ఉ. 03:00 గంటల నుండి మ. 12:00 వరుకు - నిర్గుణ పాదుకా దర్శనం వివిధ పూజలు |
మ. 12:00 నుండి మ.01:30 వరుకు - మధుకరి (భిక్ష) |
సా.06:00 నుండి సా.07:00 వరుకు గుడి ప్రాంగణం లో ఉండవచ్చు |
సా. 07:00 - పల్లకి సేవ |
ప్రతీ ఏకాదశి రోజు - పాదుకలకు నీలి రంగు గంధ లేపనం ఉంటుంది |
చైత్ర శుద్ధ ప్రతిపద - పాదుకలకు కస్తూరి & అష్టగంధ లేపనం ఉంటుంది |
గురు పౌర్ణమి - సన్యాస దీక్షలు తీసుకున్న వారికి పూజలు, చాతుర్మాస వ్రతాలు జరుగుతాయి. |
శ్రవణ మాసం మొత్తం - ఉదయం ప్రతిరోజూ రుద్రాభి షేకాలు జరుగుతాయి. |
భాద్రపద శుద్ధ చవితి - శ్రీపాద శ్రీ వల్లభ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. |
ఆశ్వీయుజ బహుళ ద్వాదశి - శ్రీపాద శ్రీ వల్లభ అంతర్ధాన దిన వేడుకలు జరుగుతాయి. |
కార్తిక పౌర్ణమి - సంగమం వద్ద కార్తిక దీపోత్సవం, వనభోజనాలు, విశ్రాంతి కట్ట వరుకు పల్లకీ సేవ జరుగుతాయి. |
మార్గ శిర్ష మాస చతుర్దశి & పౌర్ణమి - దత్త జయంతి ఉత్సవాలు జరుగుతాయి |
పుష్యమాస శుద్ధ ద్వితీయ - శ్రీ నృసింహ సరస్వతి జయంతి ఉత్సవాలు జరుగుతాయి |
మాఘమాస శుద్ధ ద్వితీయ నుండి మాఘ పౌర్ణమి వరుకు (9రొజులు) - దత్త నవరాత్రులు నందా దీప సహితం గా జరుగుతాయి |
మాఘమాస బహుళ ప్రతిపద - శ్రీ నృసింహ సరస్వతి అంతర్ధానదిన వేడుకలు జరుగుతాయి. |
ఫాల్గుణ మాస బహుళ పంచమి - నిర్గుణ పాదుకలకు కస్తూరి & కేసరి లేపనం పూస్తారు. |
ఒకప్పటి పంచఔదుంబర వృక్షం
నేటి పంచఔదుంబర వృక్షం
దేవల్ గాణ్గాపూర్ లో కనిపించే శ్రీపాద వల్లభ స్వామి & సింధూర వర్ణ దత్తాత్రేయుడు
నిర్గుణపాదుకా దత్తమందిరం
నిర్గుణపాదుకా దత్తమందిర గాలి గోపురం
సంగమం దగ్గర కనువిందు చేసే ఔదుంబరం
సంగమం దగ్గర కనిపించే అరుదైన నింబ-ఔదుంబర (వేప-మేడి) సంగమ వృక్షం ( వేప-రావి వృక్షాలు కలసి ఉండడం సాధారణ విషయం)
సంగమం దగ్గర గల దత్తాత్రేయ దేవాలయం లోని దత్తాత్రేయుడు
భస్మదగుట్ట ప్రాంతం