ఘండికోట శ్రీపాద శ్రీ వల్లభ రాజశర్మ
(Ghandikota Sripada Sri Vallabha Raaja Sharma)
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే … శ్రీపాదుల వారి దివ్య శ్రీ చరణాశ్రితులారా… 2006 నుండి మీ అందరికీ సుపరిచితమైన మన ఈ Website శ్రీ పాదుల వారి ఆశీర్వచనములతో భక్తుల సలహాలను, సూచనలను మరియు సహాయాన్ని తీసుకోని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరిగింది. శ్రీపాదుల వారి ఆజ్ఞ, ఆదేశానుసారం మన Website ప్రపంచం లోనే శ్రీ పాదుల వారి గురించి తెలిపే World’ Most Innovative i-site of Sripada Sri Vallabha గా రూపుదిద్దుకుంది. ఈ Website రూపకల్పనలో ప్రత్యక్షంగా సహకరించిన శ్రీపాద శ్రీ వల్లభ స్వామీ వారికి మరియు పరోక్షంగా సహకరించిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు. శ్రీపాద వల్లభుల భక్త భందువులందరికి శ్రీపాదుల వారి ఆశీస్సులు లభించుగాక.ఎప్పటిలాగే మన ఈ నూతన వెబ్సైట్ ను కుడా భక్తులు వీక్షించి శ్రీపాద వల్లభ స్వామీ వారి కృపకు పాత్రులౌతారని ఆశిస్తూ….
మీ
Keerthi Vallabha (keerthivallabha@gmail.com)
Sripada Sri Guru Sangamam Seva Trust (Regd.03/2013)
దిగంబరా..దిగంబరా.. శ్రీపాద వల్లభ దిగంబరా..
దిగంబరా..దిగంబరా.. శ్రీనృసింహ సరస్వతి దిగంబరా..
దిగంబరా..దిగంబరా శ్రీస్వామి సమర్ధ దిగంబరా…
Note: Our Websites i.e.,
- www.sripadavallabha.org
- www.sripadasrivallabha.com
- www.sripadavallabhacharitamrutam.com
- www.sripadavallabhacharitamrutam.info
- www.sripadavallabhacharitamrutam.net
- www.sripadavallabhacharitamrutam.org
Are No Way Related / Linked With Pithapuram Sripada Sri Vallabha Maha Samsthanam.
దత్తదాసు సంక్షిప్తీకరీంచిన దత్త చరిత్రము (ఇది 53 సార్లు చదివిన ఒకసారి గురుచరిత్ర పారాయణ చేసినంత ఫలితం)
"పూర్వయుగములందు అనసూయామాతకును, అత్రి మహర్షికిని కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే యీనాడు కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పీఠికాపురములో అవతరించెను. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనము జరిగెను. ఉపనయనానంతరము దివ్యతేజో విరాజితుడై మన ప్రభువు భాసించుచుండెను. దీనజనోద్దారకుడైన ఆ ప్రభువునకు నిత్య శ్రీరస్తు నిత్య శ్రీమంగళము అగును గాక!"
శ్రీపాదుల వారు దత్తదాసు ఇంట పలికిన ద్వాదశ (12) అభయ వాక్యాలు |
---|
శ్రీపాదుల వారు దత్తదాసు ఇంట పలికిన ద్వాదశ (12) అభయ వాక్యాలు |
1. నా చరిత్ర పారాయణము చేయబడు ప్రతిచోట నేను సూక్ష్మరూపమున ఉండును. |
2. మనోవాక్కయకర్మలచే నాకు అంకితమైన వానిని నేను కంటికి రెప్పవలె కాపాడుచుందును. |
3. శ్రీ పీఠికాపురమున నేను ప్రతినిత్యము మధ్యాహ్నసమయమున బిక్ష స్వీకరించెదను, నా రాక దైవరహస్యము. |
4. సదా నన్ను ధ్యానించువారి కర్మలను అవి ఎన్ని జన్మాంతరములనుండి ఉన్నవిఅయినను వాన్నంటిని భస్మిపటములు గావించెదను. |
5. అన్నమో రామచంద్రా అని అలమటించువారికి అన్నము పెట్టినచో నేను ప్రసన్నుడ నయ్యెదను . |
6. నేను శ్రీ పాద శ్రీ వల్లభుడను! నా భక్తుల యింట మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును. |
7. నీవు శుద్ధాంత:కరణుడవేని నా కటాక్షము సదా నీయందు ఉండును. |
8. నీవు ఏ దేవతాస్వరూపమును ఆరాదించిననూ, ఏ సద్గురువును ఆలంబనముగా చెసికొన్ననూ నాకు సమ్మతమే! |
9. నీవు చేయు ప్రార్ధనలన్నియూ నాకే చేరును. నీవు ఆరాధించు దేవతాస్వరూపము ద్వారాను , నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహమును నీకు అందజేయబడును . |
10. శ్రీ పాద శ్రీ వల్లభుడనిన పరిమితమయిన యీ నామ రూపము మాత్రమే కాదు. సకల దేవతా స్వరూపములను, సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపము ను అనుష్టానం ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు. |
11. నాది యోగసంపూర్ణ అవతారము . మహా యోగులు, మహా సిద్ధ పురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరు నూ నా యొక్క అంశలే. |
12. నీవు నన్ను ఆలంబనముగా చేసుకున్న యెడల నేను నీకు ధర్మమార్గమును , కర్మ మార్గమును భోదించెదను. నీవు పతితుడవు కాకుండా సదా నేను కాపాడెదను . |