Panasa Vruksham (పనస వృక్షం/చక్కి చెట్టు)
Panasa Vruksham (పనస వృక్షం/చక్కి చెట్టు)
Nomenclature (నామాంక్లేచర్ - నామీకరణము) |
---|
పేరు : పనస చెట్టు / చక్కి వృక్షం / ఒకే వృక్షానికి రెండు రకాల పత్రాలుండడంవల్ల(హెటిరోఫిలి - Heterophilly) దీనిని అనఘ-దత్త వృక్షం అంటారు. |
ఇంగ్లీష్ పేరు : జాక్ ట్రీ (Jack Tree) |
శాస్త్రీయ నామము / లాటిన్ పేరు : ఆర్టోకార్పస్ హెటిరోఫిల్లస్ (Artocarpus heterophyllus) |
కుటుంబము : మోరేసీ (Moraceae) |
చాలమంది దత్త, శ్రీపాద భక్తులకు పనస వృక్షం యొక్క గొప్పదనం తెలియదు. పనస వృక్షం లో దత్తాత్రేయులవారి వామ భాగముంటుంది. పనస వృక్షం, ఔదుంబర వృక్షాలు కలిసి ఉంటే అది మహాద్భుతమైన ప్రదేశం గా గుర్తించండి. పనస వృక్షం మధుమతి తల్లి (అంటే సాక్షాత్తూ అనఘాదేవి) నివసించే వృక్షం. దత్తాత్రేయుని శక్తిస్వరూపిణి అయిన అనఘాదేవి ఈ పనస వృక్షమూలములో తనయొక్క అన్నిశక్తి అంశలతో సుప్రతిష్టమై ఉంటుంది . ఔదుంబర వృక్షం లో దత్తాత్రేయుని కుడిభాగముంటే పనస వృక్షం లో దత్తాత్రేయుని వామభాగముంటుంది . పనస వృక్షం నందు మహాలక్ష్మి, మహా కాళీ, మహా సరస్వతి, శ్రీ రాజరాజేశ్వరి అంశలు, అలాగే దశమహా విద్యలైన శ్రీదేవితత్వమూ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పనస వృక్ష పూజ చాల ప్రసస్తమైనది.
ప్రదక్షణ మరియు పూజించు విధానము
శుక్ర, మంగళ, గురువారాలు పనస వృక్ష పూజకు ఉత్తమమైన రోజులు. పనస వృక్షానికి నెమ్మదిగా ” ఓమ్ ఐం హ్రీం శ్రీం శివరామ అనఘ దత్తయనమః ” అని అనుకుంటూ కనిష్టంగా 27 గరిష్టంగా 108 ప్రదక్షణలు చేయవచ్చు. మొత్తం ప్రదక్షణలు పుర్తైన తరువాత వృక్షానికి 3 లేదా7 లేదా 9 చిన్నబిందెల లేదా చెంబుల నీళ్ళను పోయాలి. తరువాత పసుపు,కుంకుమ,పూలు, గాజులు పనస వృక్షానికి సమర్పించాలి.
పనస వృక్ష పూజా ఫలము
ఈ వృక్షము మొదట్లో కూర్చుని చేసే దేవి అనుష్టానాలు శీఘ్రఫలప్రదాలవుతాయి. దాంపత్య జీవితాన్ని అబివృద్ధి పరిచే మహత్తుగల వృక్షమిది. పనస వృక్షం క్రింద చేసిన శ్రీపాద శ్రీ వల్లభ చరితామృత గ్రంధ పారాయణము లేదా గురుచరిత్ర పారాయణము, అనఘాస్టమి వ్రతము ఉత్తమ ఫలితాలనిస్తుంది. అనఘాస్టమి వ్రతంలో అనఘ-దత్తులను ఔదుంబర, పనస పత్రాలతో పూజించిన స్వామివారు సంతుష్టి చెందుతారు. అష్టసిద్ధుల ఆశీస్సులు పొందడానికి మరొక సులభమైన మార్గం పనస వృక్ష పూజ. పనస చెట్టు స్థాపనవల్ల అనఘదత్తాత్రేయుల ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. పనస వృక్షం క్రింద శ్రీపాద శ్రీ వల్లభ దివ్య సిద్ధమంగళ స్తోత్రం పఠించిన (సిద్ధమంగళస్తోత్రం నందు చివరగా “మధుమతి దత్త మంగళ రూపా” అని చదువుతాము, పనస వృక్షం మధుమతి తల్లి (అనఘ మాత) కి ప్రియమైన వృక్షం)మనలో ఉహించలేనన్నిశుభస్పందనలు కలుగుతాయి.