Ainavilli (అయినవిల్లి)
Ainavilli (అయినవిల్లి)
II ఓం తత్పురుషాయ విద్మహే
వక్రతుండాయ ధీమహీ
తన్నో దంతి: ప్రచోదయాత్ II
కృతయుగం నుండి పూజలందుకుంటున్న ఈ అయినవిల్లి స్వయంభూ గణపతి అత్యంత మహిమాన్వితుడు. శ్రీపాద శ్రీ వల్లభుల తాతగారు సత్యఋషీశ్వర బాపనార్యులు గారు ఇక్కడ 13వ శతాబ్దం లో స్వర్ణగణపతి యజ్ఞమును జరిపారు . ఈ యజ్ఞం చివరిలో విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై త్వరలో మానవ జన్మ ఎత్తబోతున్నట్టు గా (శ్రీపాద శ్రీ వల్లభ రూపం లో
సందేశం ఇచ్చారు. అయినవిల్లి స్వయంభూ గణపతే కాణిపాకం వరసిద్ధి వినాయకునిగా వస్తున్నట్టు విఘ్నేశ్వరుడు తెలపడం జరిగింది. దీనిని బట్టి అయినవిల్లి స్వయంభూ గణపతి కాణిపాకం వరసిద్ధి వినాయకుని కంటే ప్రాచీనుడని తెలుస్తోంది. శ్రీపాద శ్రీ వల్లభుల తండ్రి గారైన అప్పల లక్ష్మినరసింహ రాజ శర్మ గారు అయినవిల్లి వాస్తవ్యులే. ఇచ్చట క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. ఇచ్చటే శ్రీదేవి – భూదేవి సమేత కేసవస్వామి వారి గుడి కుడా కలదు. ఇక్కడ ప్రతీ సంవత్సరం మాఘ శుద్ద చవితి నాడు జరుపబడే లక్ష పెన్నుల యజ్ఞం (దీనినే ‘చదువుల పండగ’ అంటారు) విద్యార్ధులకు మంచి ఫలితాలను ఇస్తోంది. అయినవిల్లి పిఠాపురం నుండి దాదాపు 105 కీ .మీ . దూరంలో, అమలాపురం నుండి 12 కీ.మీ దూరంలో గలదు. శ్రీపాద వల్లభుల శ్రీ చరణాశ్రితులందరూ దర్శింపదగ్గ పుణ్యక్షేత్రం ఈ అయినవిల్లి.
ఎలా చేరుకోవాలి?…
అయినవిల్లి చేరుకోవాలంటే ముందుగా అమలాపురం చేరుకోవాలి. అక్కడనుండి ముక్తేశ్వరం వెళ్ళే పాసింజర్ బస్సును పట్టుకొని ముక్తేశ్వరం లో దిగాలి. అక్కడనుండి షేరింగ్ ఆటోలద్వారా అయినవిల్లి చేరుకోవచ్చు. ఎక్కువ మంది ఉన్నప్పుడు, లగేజి ఉన్నప్పుడు కంఫర్టబుల్ గా వెళ్ళాలంటే అమలాపురం నుండి (అమలాపురం నుండి కేవలం 12 కీ. మీ. దూరంలోనే అయినవిల్లి ఉంది) నేరుగా ఆటోరిక్షాను అయినవిల్లి వరుకు మాట్లాడుకొని చేరవచ్చు. పూజా సామగ్రి అంతా గుడి ప్రాంగణం లోనే దొరుకుతాయి. అయినవిల్లి మహా గణపతి దేవాలయం లో కేవలం రూ. 20/- కి అంతరాలాయ దర్శనం అనే సౌకర్యం కుడా కలదు. అక్కడే ఉదయం 11 గంటల నుండి భోజనాలయం లో ఉచిత భోజన సదుపాయం కుడా భక్తులకు ఏర్పాట్లు చేయబడినవి. దేవస్థానం వారి కౌంటర్లలో అయినవిల్లి మహా గణపతి ప్రసాదం గా రవ్వలడ్డు దొరుకుతుంది.
విషయము | వివరణ |
---|---|
గుడి తెరిచే సమయం | ఉ. 05:00 నుండి మ.12:00 వరుకు సా.04:30 నుండి సా.07:30 వరుకు |
గుడి ఫోన్ నెంబర్ | 08856225812 |
ఐనవిల్లి కి వివిధ ప్రాంతాల నుండి దూరం (కీ.మీ. లలో) | అమలాపురం నుండి- 12, రాజమండ్రి నుండి- 55, కాకినాడ నుండి- 72, పిఠాపురం నుండి- 105 |
ఐనవిల్లి మహాగణపతి గుడిలో జరిగే ముఖ్య పూజలు-ఉత్సవాలు | పుస్తకముల పూజ - ప్రతీ రోజు, భాద్రపద శుద్ధ చవితి - గణపతి నవరాత్రులు, శ్రీలక్ష్మి గణపతి హోమం, సప్తనదీజలాభిషేకం - ప్రతీ సంవత్సరము మాఘ బహుళ తదియ రోజు (ఈసారి18-Feb-2014), అలాగే చదువుల పండుగ - ప్రతీ సంవత్సరం మాఘ శుద్ద చవితి రోజు, లక్ష రుద్రాక్షపూజ - ప్రతీ శుద్ద చవితి రోజు. |
గుడి ప్రాంగణంలో గల ఇతర దర్శనీయ ప్రదేశాలు | కాలభైరవ దేవాలయం, విశ్వేశ్వర దేవాలయం, అన్నపూర్ణ దేవాలయం, చెన్నకేశవ దేవాలయం. |
దగ్గరలోగల ఇతర దర్శనీయ ప్రదేశాలు | ముక్తేశ్వరం లోని ముక్తేశ్వరుడు (3 కీ.మీ ల దూరం లో) |