Devipuram
Dattatreya KshetraPalaka Kshetram & Andhra Kaamakhya – Devipuram
దత్తాత్రేయుడు క్షేత్రపాలకుడుగా ఉన్న క్షేత్రం & ఆంధ్రా కామాఖ్యా – దేవీపురం
Datta Shaaktheya Kshetram – Devipuram (దత్తశాక్తేయ క్షేత్రం – దేవీపురం)
ఓం శ్రీం హ్రీం క్లీం అం గం ళం సర్వ సమ్మోహిన్యై స్వాహా
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే..దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా..అనఘా దత్తాత్రేయ దిగంబర..దత్త బంధువులందరికీ జైగురుదత్త..
ఇంతకు మునుపు Datta Tatwa Raasi – Varanasi అనే Article లో Baba KinaRam Aghora Shakthi Sthalలో దత్తాత్రేయుల వారిని వామాచార పద్ధతుల్లో కొలుస్తారనీ, వామాచార పద్ధతికి కూడా ఆరాధ్యదేవుడు దత్తాత్రేయుడని మీకందరికీ తెలియజేయడం జరిగింది. తదుపరి Andhra Kaamakhya – Devipuram అనేచోట గల శాక్తేయక్షేత్రంలో దత్తాత్రేయుడు క్షేత్రపాలకుడుగా (Dattatreya As Kshetrapaalaka) ఉన్నాడని తెలుసుకుని అక్కడకి వెళ్లడం జరిగింది. Devipuram ఒక గొప్ప Shaktheya Kshetram . అక్కడగల Kaamakhya Pithamలో Mother Kaamakhya Devi, Yoni Rupamలో ఉంటుంది. బహుశా మనందరికీ అమ్మ యొక్క గొప్పదనాన్ని తెలియజేయడంకోసం కావచ్చు లేదా ‘అమ్మే నేను- నేనే అమ్మ’ అని చెప్పడం కోసం కావచ్చు అక్కడ Dattatreyudu క్షేత్రపాలకులుగా ఉండి ఆ క్షేత్రాన్ని నడిపిస్తున్నారు. ఈ క్షేత్రాన్ని దర్శించి, దాని విశిష్టతను గ్రహించగలగాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ‘అమ్మని బొమ్మలా కాకుండా… అమ్మని అమ్మలా’ చూసే ఋజుదృష్ఠి గల భక్తులకు ఈ క్షేత్రం తప్పక దర్శించతగినది. ఎందుకిలా చెబుతున్నానంటే ఇక్కడ Devi Khadga Maalaa Sthotram లోగల 108 మంది అమ్మలు విగ్రహరూపంలో యంత్రసహితంగా కొలువైయున్నారు. ఇందులో కొంత మంది అమ్మలు సహజస్థితిలో(నగ్నంగా) ఉంటారు. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ గల Sri Sahasrakshi Raja Rajeshwari Templeను శ్రీచక్ర మేరు ఆకారంలో (SriChakra Meru Shaped Temple) నిర్మించారు. Raja Rajeshwari అమ్మను దర్శించాలంటే 3 సార్లు ఈ SriChakram చుట్టూ ప్రదక్షిణగా తిరగాలి. పరికించి చూస్తే ఈ విశ్వమంతా దత్తమయంగా కనిపిస్తుంది. వైష్ణవం దత్తమయమే, శైవం దత్తమయమే, శాక్తేయం దత్తమయమే ఆఖరికి వామాచారం కూడా దత్తమయమే. అన్నిపద్ధతుల్లో దత్తాత్రేయుడే ఉండి నడిపిస్తున్నాడనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ Kshetram. ఎంతో పవిత్రమైన, దత్తాత్రేయుడు క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ గొప్ప శాక్తేయక్షేత్రాన్ని దత్తభక్తులందరూ (ప్రత్యేకించి మగవారు) ఒక్కసారైనా తప్పక దర్శిస్తారని ఆశిస్తూ … జై గురు దత్త
-Keerthi Vallabha (keerthivallabha@gmail.com)
Andhra Kaamahkya Devipuram ఎక్కడ ఉంది?
Andhra Kaamahya Devipuram Kshetram, Visakhapatnam Districtలో Anakapalliకి 13KMs దూరంలో కలదు. Andhra Kaamakhya అని ఎందుకంటున్నామంటే అతి ప్రాముఖ్యతగాంచిన Yoni Rupa Kaamakhya Devi Temple, Assam State Guwahatiలో కలదు. తదుపరి Kaamakhya అమ్మ ఇక్కడ మాత్రమే యోనిరూపంలో కనిపిస్తుంది.
Devipuram ఎలా చేరుకోవాలి?
How To Reach Devipuram (Hyderabad To Devipuram 620 KMs) |
---|
How To Reach Devipuram (Hyderabad To Devipuram 620 KMs) |
Secunderabad ----> Vijayawada ----> Rajahmundry ----> Anakalalli (or) Visakhapatnam ----> Devipuram [13 KMs From Anakapalli & 40 KMs From Visakhapatnam] |
Devipuram దర్శించడానికి అనువైన సమయం
Devipuram క్షేత్రాన్ని ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. అన్నికాలాలు అనువైనవే. శరన్నవరాత్రులు, కార్తీకమాసం, ధనుర్మాసం, దత్తజయంతి రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. GiriParikrama చెయ్యాలంటే మాత్రం Rainy & Winter Seasonలు అనువైనవి.
Devipuram లో ఎక్కడ ఉండాలి
Devipuramలోఉండడానికి సదుపాయాలు ఉన్నాయి (ముందుగా Phoneచేసి చెప్పాలి). ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనము ఉచితంగా అందించే సదుపాయం కలదు. కానీ అధిక భక్తులు Anakapalliలోకానీ Vizagలోకానీ Stay చేస్తారు.
Devipuram స్థల పురాణం
ప్రపంచంలోని ప్రత్యేక ఆలయాల్లో Andhra Kaamkhya Devipuram Temple ఒకటి. ఇది Dattatreyudu క్షేత్ర పాలకుడిగా ఉన్న అతి సుందర శాక్తేయ దత్తక్షేత్రం. ఈఆలయాన్ని 1983లో శ్రీ నిష్ఠల ప్లల్లాదశాస్త్రి, అన్నపూర్ణమ్మ దంపతులు దత్తావధూత అయిన శ్రీ స్వ ప్రకాశానంద స్వాముల వారి మార్గదర్శకంలో నిర్మించారు. నిష్ఠల ప్లల్లాదశాస్త్రి విశాఖపట్నం వాస్తవ్యులు. వీరు Nuclear Physics లో PhD చేసి, Mumbai లోని Tata Institute of Fundamental Research (TIFR) లో శాస్త్రవేత్తగా పనిచేసేవారు. వారు ఒకసారి Office పనిమీద Hyderabad వెళ్లారు. పని ముగిసిన అనంతరం వారు ఊరికే చూడడానికి Birla Mandirకు వెళ్ళి, బాలాజీని దర్శించి ఒకచోట ధ్యానం చేసుకుంటుండగా వారికి శ్రీ వేంకటేశ్వర స్వామి స్త్రీరూపంలో ‘అమ్మ’ గా దర్శనమిచ్చి ‘నాకు శ్రీచక్రగృహమును కట్టించు’ అని పలికి అంతర్థానమైనట్లనిపించింది. అప్పుడే కాకుండా మరొకమారు వారికి ధ్యానసమయంలో దర్శనమిచ్చి ఈ కార్యం నీవల్లే నెరవేరుతుంది,’జాగ్రత్తగా, దోషరహితంగా, శక్తికి నిలయంలా మీరు ఆలయాన్ని నిర్మించండి’ అని ఆదేశించింది. తదుపరి ప్రహ్లాదశాస్త్రి తమ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వస్థలమైన Visakhapatnam వచ్చారు. ఆలయం నిర్మించాలనే సంకల్పంతో 1982 లో 108 రుత్విక్కులతో 16 రోజులు దేవీయాగం చేశారు. ఆ యజ్ఞంలో ‘పుట్రేవు’ అనే గృహ నామధేయం కలిగిన ఇద్దరు సోదరులు ఆలయం నిమిత్తం మూడు ఎకరాల భూమి యజ్ఞప్రసాదంగా బహుమతిగా ఇచ్చారు. ఈ విధంగా శ్రీ చక్రాలయ నిర్మాణ స్థలాన్ని అమ్మవారేస్వయంగా ఎంచుకుంది. తొమ్మిది కొండల మధ్య, రమణీయంగా, ప్రశాంతంగా ఉన్న ఆ స్థలంలో ప్రహ్లాదశాస్త్రి తిరుగుతూ ఉండగా యోని వంటి ఒక రాతి ప్రదేశము మరియు కొన్ని హోమపు గుర్తులు కనిపించాయి. అక్కడ తవ్వితే, అగ్నిలో కాల్చిన గుర్తులున్న పంచలోహ శ్రీచక్ర మేరువు లభించింది. దాని గురించి విచారించగా సుమారు 300 ఏళ్ళ క్రితం అక్కడ గొప్ప యజ్ఞం జరిగినట్లు తెలిసింది. ఆ శ్రీచక్రమేరువును మళ్ళీ భూమిలో నిక్షిప్తం చేసి దానిపై కామాఖ్యపీఠం ప్రతిష్టించారు.
అమ్మవారి సూచనలమేరకు ఇక్కడ యోని ఆకారంలో కామాఖ్యపీఠం ఏర్పాటు చేసి శ్రీచక్రాన్ని పీఠానికి అడుగున ప్రతిష్ఠించారు. అదేవిధంగా దేవీ సూచించినట్లుగానే, ఆవిడ ఆజ్ఞమేరకే నవావరణలు కలిగిన శ్రీచక్రమేరు ఆకారంలో ఆలయాన్ని నిర్మించారు. దేవీ ఖడ్గమాల నుంచి ఎంపిక చేసిన 108 పరిచారక దేవతలను ఇక్కడ ప్రతిష్ఠించారు. మూలవిరాట్ సహస్రాక్షి శ్రీరాజరాజేశ్వరీ దేవి అష్టదళ పద్మంలోని కేంద్రబిందు స్థానంలో ప్రతిష్ఠించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన దేవతామూర్తులన్నీ స్త్రీమూర్తులు కావటం విశేషం. దేవీ సూచనలమేరకే వస్త్రాలను కప్పకుండా యంత్ర సహితంగా తయారు చేయించడం జరిగిందని తెలుస్తోంది. ఏ స్త్రీకయినా ముఖంలో విద్యనిచ్చే వాగ్ధేవత ఉంటుందని, వక్షస్థలంలో (పాలిండ్ల యందు) ఐశ్వర్యం ఇచ్చే లక్ష్మీదేవి, యోనియందు సంతానానిచ్చే గౌరీదేవి ఉంటుందని ఈ సందర్భంగా అమ్మ తెలియజేసింది.
సంక్షిప్తంగా చెప్పాలంటే జ్ఞానాన్నిచ్చేది ముఖమనీ, పోషించేది స్తన్యమనీ మరియు జన్మనిచ్చేది యోని అనీ అవగాహన చేసుకుని పూజలు చేయాలనీ ఈమొత్తానికి గురు దత్తాత్రేయుల వారు అధిదేవులుగా ఉండి క్షేత్రాన్ని పాలిస్తారని జగన్మాత చెప్పింది. ఇక్కడ పూజలు చేయడంవల్ల విద్య, ధనం, సంతానం, మోక్షం ప్రాప్తిస్తాయని అమ్మవారు స్వయంగా చెప్పారు. అందువల్లనే Guru Dattatreyudu ఇక్కడ క్షేత్ర పాలకుడుగా ఉంటూ ఈ క్షేత్రాన్ని అన్నివిధాలా నడిపిస్తూ ఉంటారు.
Click Here To View Devipuram Video (దేవీపురం వీడియో చూడడం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)
KshetraPaalakudu అంటే?…
క్షేత్రపాలకుడు కేవలం క్షేత్రాలకే కాక ప్రతి యజ్ఞానికీ, యాగానికీ, హోమానికీ, స్థలానికీ కూడా ఉంటాడు. ప్రతీ ఇంటికి లేదా కార్యాలయానికి (Office) ఒక యజమాని ఉంటాడు కదా! అలాగే క్షేత్రపాలకుడు కూడా. మన దేహం క్షేత్రమైతే లోపల ఉండే జీవుడు క్షేత్రపాలకుడు. జీవుడికి చెప్పకుండా (లోపల ఉండే క్షేత్రపాలకుడు అనబడే జీవుడు) దేహంతో ఏపని చేసినా ఆపని వికటిస్తుంది, వ్యతిరేక ఫలాలు వస్తాయి. క్షేత్రపాలకుడు క్షేత్రాన్ని అన్ని వేళలా ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. మనం (భక్తులు) వస్తూ ఉంటాము, వెళుతూ ఉంటాము. కానీ ఆ క్షేత్రం యొక్క బాగోగులు నిరంతరం కనిపెట్టుకుని అక్కడే ఉండేవాడు క్షేత్రపాలకుడు. అందువల్లనే క్షేత్రపాలకుడికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. అసలు ప్రధాన క్షేత్రాన్ని దర్శించే కంటే ముందుగానే క్షేత్రపాలకుడు ఉన్న స్థానాన్ని దర్శించి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఇక్కడ ఈ క్షేత్రంలో అమ్మలందరి బాగోగులను శ్రీగురు దత్తాత్రేయుల వారు చూస్తూ ఉంటారు. అందువల్లనే Devipuram Kshetramలో మొదటగా Guru Dattatreya Mandir ఉంటుంది.
Devipuram లో చూడవలసిన ప్రదేశాలు
Places To Visit At Devipuram |
---|
Places To Visit At Devipuram |
1. Guru Dattatreya Kshetrapaalaka Temple (With Dattaavadhuta Swapakashananda) / Datta Gruu Pitham / Sri Guru Temple |
2. Shiva Temple |
3. Kaarya Siddhi Ganapathy Temple |
4. SriChakra Shaped Sri Meru Sahasrakshi Raja rajeshwari Temple (With 108 Devi Khadgamaala Idols) |
5. Kaamakhya Pitham [Yoni Rupa Mother Kaamakhya Devi] |
6. Dakshawaati With 1365 Shiva Lingaas |
Devipuram – GiriParikrama (దేవీపురం – గిరిపరిక్రమ)
Devipuram Kshetram 9కొండల నడుమన గల Datta Shaktheya Kshetram . ఇక్కడ గల అన్ని దేవాలయాలను చుట్టి చేసే ప్రదక్షణనే GiriParikrama (గిరిపరిక్రమ) అంటారు. ఈ Parikramaలో ముందుగా క్షేత్రపాలకుడు అయిన గురు దత్తాత్రేయుల వారిని దర్శించి ఒక కొబ్బరికాయను కొట్టి 1 లేదా 3 లేదా 5 క్రింద ఉన్న Route Map ఆధారంగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి పరిక్రమకు ఒక కొబ్బరికాయ చొప్పున దత్తాత్రేయుల వారికి సమర్పించాలి. పరిక్రమను దంపతులిరువురు కలిసి ప్రశాంత చిత్తంతో చేసిన యెడల సంతాన ఫలము లభిస్తుంది.
Devipuram Photos
Andhra Kaamkhya Devipuram Postal Address |
---|
Andhra Kaamkhya Devipuram Postal Address |
Sri Guru Datta Sahasrakshi Raja Rajeshwari Pitham, Devipuram, Ammulapalem Post, Near Anakapalli, Visakhapatnam Dist. PIN-531002 Ph: 09866138896 / 09553255583 / 09440845333, Web: www.devipuram.com |