GirRaj Girnar (గిరిరాజ్ గిర్నార్)
Gouravashali GirRaj Girnar (గౌరవశాలి గిరిరాజ్ గిరినార్)
అలఖ్ నిరంజన్..అలఖ్ నిరంజన్.. జై గురుదత్.. జై గిరినారీ..అలఖ్ నిరంజన్..అలఖ్ నిరంజన్
II హే గిరినారీ దత్తావతారీ కహూపుకారి దర్శనదేరీ…హే గిరినారీ దత్తావతారీ కహూపుకారి దర్శనదేరీ…II
గమనిక : ఈ ఆర్టికల్ చాలా పెద్దది. గిరిరాజ్ గిరినార్ కు సంబంధించిన అనేక విషయాలను ఫోటోలతోసహా తెలియజేయడం జరిగింది. ఈ Web Page లో అతి అరుదైన, అద్భుతమైన దాదాపు 150 కు పైగా ఫోటోలు గలవు. దయచేసి పూర్తిగా Load అయ్యేవరుకు వేచి ఉండండి. Load కాని పక్షంలో F5 బటన్ (F5 – Reload) నొక్కండి.
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే…
దిగంబరా…దిగంబరా…శ్రీపాద వల్లభ దిగంబరా…
దత్త బంధువులందరికీ జై గురుదత్త… జై గిరినారి…
గురు దత్తాత్రేయులవారి అనేక దివ్య, రహస్య క్షేత్రాలను (ఇప్పటివరుకు దాదాపుగా 30కి పైగా) మన Website ద్వారా శ్రీపాదుల వారి ఆశీస్సులతో మీకందించడం జరుగుతోంది. మన Website ద్వారా విడుదలయ్యే ప్రతీ క్షేత్రాన్ని నేను ప్రత్యక్షంగా దర్శించి, అక్కడగల పూజారులను, స్థానికులను, అక్కడి అవధూతలను, అఘోరాలను, క్షేత్ర నిర్వాహకులను ప్రత్యక్షంగా కలిసి, వివరాలను సేకరించి, ఫోటోలను / వీడియోలను తీసి మీకు ఆక్షేత్రానికి ఎలా వేళ్ళలో, ఎక్కడ ఉండాలో, ఎవరిని కలవాలో Route Map తోసహా అందించడం జరుగుతోంది. ఒకటే గుర్తు నానుండి మన Website ద్వారా ఏదైనా ఒక Article విడుదలై అది శ్రీపాదుల వారి దయతో మీకు (ప్రపంచానికి) తెలియజేయడం జరిగిందంటే, అక్కడికి నేను ప్రత్యక్షంగా వెళ్లి Feel అయితేనే ఆ Article మీకందరికీ Share చెయ్యబడుతుంది. లేకపోతే లేదు. మిగతా Websites లాగా అక్కడకి ప్రత్యక్షంగా వెళ్ళకుండా, చద్ది సమాచారం, ఏరుకొచ్చిన ఫోటోలు Search Engine లద్వారా సేకరించి , Page లు నింపి భక్తుల మీదకి వదిలే పద్ధతి కాదు మనది. అందువల్లనేనేమో శ్రీపాదుల వారు నన్ను వివిధ ప్రదేశాలను తిప్పి అక్కడ ఆయన ఉన్నట్లుగా, ఆయన ఉనికిని అనుభవంలోకి తీసుకువచ్చి మరీ ఆయన సమాచారాన్ని మీకందిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీతో పంచుకోబోతున్న ‘గౌరవశాలి గిరిరాజ్ గిరినార్’ మీరందరూ విన్నదే, దర్శించిందే! ఇంతకు ముందు గౌరవ భక్తులెందరో, ఎన్నో సార్లు ‘గిరిరాజ్ గిరినార్’ యాత్ర చేసి ఉండవచ్చు. చాలామంది దత్త బంధువులు 10,000 మెట్లు ఎక్కామా…దిగామా…అన్న చందంగానే యాత్ర సాగిస్తున్నారు. ఎన్నో సార్లు ‘గిరిరాజ్ గిరినార్’ యాత్ర చేసిన వారికీ తెలియని అనేక స్థలాలనూ, విషయాలను ఈ Articleలో గురు దత్తాత్రేయుల వారి ఆశీస్సులతో తెలియపరచడం జరిగింది. దయచేసి పూర్తిగా చదివి, దత్త బంధువులు శ్రీపాదుల వారి ఆశీస్సులతో మన Website లో పెట్టిన Article ని Print Out గా తీసుకుని దానినే Guide గా భావించి, గిరినార్ లోని అన్ని ప్రదేశాలను చూసి గురు దత్తాత్రేయులవారి కృపకు పాత్రులవ్వవలసినదిగా చెబుతూ … జై గురు దత్త.
-Keerthi Vallabha [keerthivallabha@gmail.com]
గిరిరాజ్ గిర్నార్ క్షేత్రం గురించి…
‘గౌరవశాలి గిరిరాజ్ గిరినార్’ యొక్క ప్రాముఖ్యతను మహర్షి వేద వ్యాసుడు “రైవతక గిరి” అను పేరుతో ద్వాపరయుగంలోనే వివరించి చెప్పడం జరిగింది. స్కందపురాణం లో 77 నుండి 102 వ అధ్యాయములలో గౌరవశాలి గిరిరాజ్ గిరినార్ యొక్క ప్రస్తావన పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. వేద వ్యాసుడు గిరినార్ పర్వత శ్రేణులను ‘గురు గిరులు’ గా కూడా చెప్పారు. వేదకాలం నాటి గ్రంథాల ఆధారంగా గిరినార్ పర్వత శ్రేణులలో మొత్తం 866 దేవాలయాలు ఉండేవి. ప్రస్తుతం 135 దేవాలయాలు మాత్రమే మనం చూడగలుగుతున్నాము. వీటిలో అతి ముఖ్యమైనవి మినహా మిగతావాటిని చేరుకోవడానికి ప్రస్తుతం సరైన దారి లేదు. శాస్త్రప్రకారం గిరినార్ పర్వత శ్రేణులు దాదాపుగా 60 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఇవి మొత్తం 14 పర్వతాల సమూహం. ఈ 14 పర్వతాలు 15 KMs ల ప్రాంతాన్ని ఆక్రమించుకొని విస్తరించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణులు భూమి నుండి 1 KM ఎత్తు వరుకు ఎదిగి ఉన్నాయి. వీటిలో అతిముఖ్య మైనవి 5 పర్వత శిఖరాలు. మొదటి శిఖరమైన అంబాశిఖరంలో నేమినాథ మరియు అంబామాత (పార్వతి దేవి) దేవాలయాలు గలవు. రెండవ శిఖరమైన గురుగోరఖ్ నాథ్ శిఖరంలో గురుగోరఖ్ నాథ్ దేవాలయం మరియు అఖండ ధుని గలవు, మూడవ శిఖరమైన ఒఘాద్ శిఖరంలో అనేక గుహాలయాలు గలవు. నాలుగవ శిఖరమైన గురుదత్తాత్రేయ శిఖరంలో దత్తాత్రేయుని కమండలకుండం, అఖండ దత్త ధుని మరియు గురు దత్తాత్రేయుని పాదుకలు గలవు. ఐదవ శిఖరమైన కాళికాశిఖరంలో మహాకాళీమాత దేవాలయం కలదు. దీనినే పావఘర్ శిఖరం అంటారు. దీనిని చేరుకోవడానికి కమండలకుండం నుండి వేరొక దారి తీసుకోని వెళ్ళాలి. ఇక్కడ సహజంగా ఏర్పడిన మహాకాళీమాత యొక్క ప్రసాద పాత్రను చూడవచ్చు. ఇదే దారిలో అనసూయా శిఖరం మరియు ఒఘాద్ శిఖరాలను చేరడానికీ, అలాగే పాండవ గుహను చేరడానికి దారులు కలవు. ఈ మార్గంలో దట్టమైన అడవి ఉంటుంది మరియు అతి తక్కువ మంది భక్తులు మాత్రమే ఈ శిఖరాలను దర్శించడానికి వెళతారు. మహాకాళీమాత ఉపాశకులు, క్షుద్ర విద్యోపాశకులు, అఘోరాలను, దిగంబర శివయోగులను ఇక్కడ చూడవచ్చు. గురుదత్తాత్రేయ శిఖరంలో గురు దత్తాత్రేయుని పాదుకలను చేరుకోవడానికి 9999 మెట్లు అధి/అధో రోహించవలసి ఉంటుంది. గురుదత్తాత్రేయ శిఖరాన్నే ‘అవలోకన శిఖరం’ అనికూడా అంటారు. గిరిరాజ్ గిర్నార్ పర్వత శ్రేణి క్షేత్రంలో మెట్లకు ఇరువైపులా అనేక Stalls, Food Courts మరియు Shops ఉంటాయి. వీటిలో సమస్తం దొరుకుతాయి. గిర్నార్ పర్వత శ్రేణులు వెదురు మరియు టేకు అరణ్య సంరక్షణాలయంగా ప్రకటించబడింది. ఈ పర్వతావళిలో అరుదైన జాతి రాబందులు కనిపిస్తాయి అలాగే ఇక్కడి గిర్ నేషనల్ పార్క్‌లో [గిర్ లయన్ సఫారి] ఆసియా సింహాలను చూడవచ్చు.
జూదగాళ్ళ సొమ్ముతో 10,000 మెట్లు :
హరిదాస్ దేశాయ్ అనే వారు Princely State of Junagadh కు Diwan (Diwan = Ruler / Minister) గా ఉండే వారు. వీరు గిర్నార్ పర్వత శ్రేణులపైకి ప్రజలు శులభంగా వెళ్ళడం కోసం 1889 AD లో లాటరీలనూ,జూదాలను నిర్వహించి అప్పట్లో 3 లక్షల రూపాయలను (300,000/-Dokdo) (అప్పటి రూపాయలలో) వసూలుచేసారు. అలా వసూలు చేయబడ్డ సొమ్ముతో దివాన్ హరిదాస్ దేశాయ్ దత్తాత్రేయ శిఖరం వరుకు మెట్ల నిర్మాణాన్ని చేయించారు. కొండలపై ఈ మెట్ల తాపడానికి సుమారుగా 6 సంవత్సరాల సమయం పట్టింది. మొత్తం మెట్ల నిర్మాణం 1894 AD లో పూర్తైనది. వీరు గిర్నార్ పర్వత శ్రేణుల పై వేయించిన మెట్ల సంఖ్య 12,000 గా చరిత్రలో వ్రాయబడినది. నేటికీ గిర్నార్ పర్వత శ్రేణుల పైకి చేరుకోవడానికి ఈ మెట్లనే వినియోగిస్తున్నాము. హరిదాస్ దేశాయ్ 1895 AD లో మరణించారు.
గిరినార్ పర్వతాన్ని అతి ప్రాచిన గ్రంధాలలో వివిధ రకాలైన పేర్లతో వర్ణించారు. గిరినార్ పర్వతానికి గల ఇతరపేర్లు:
Ancient and Sacred Names of Girnar (గిరినార్ పర్వతానికి గల ఇతర పేర్లు) |
---|
Ancient and Sacred Names of Girnar (గిరినార్ పర్వతానికి గల ఇతర పేర్లు) |
1. Girinarayana |
2. Giriraj |
3. Urjayat and Ujjayanta |
4. Gomanta Giri |
5. Raivataka, Raivata, Raivatagiri, Revatachal |
6. Raivatari Parwath |
7. Vastrapatha |
8. Lingakara Parwath |
9. Kanchana Parwatham |
10. Neminath Parvath |
11. Girimunja Giri |
12. Girinayara Giri |
13. Pushpagiri |
14. Highland of St. John |
15. Girnal, Karnal and Killa-e-Girnar |
16. Devagiri Parwatham |
17. Gir Nar - గిర్ నర్ (Gir Means Hill & Nar Means Human, Girnar Hill Looks Like A Face of Man) |
18. Guru Giri |
19. Dattaachala Sahyaadri |
వేదకాలం నాటి గ్రంథాలలో ‘గిరినార్ ‘పర్వత వృత్తాంతం:
ప్రస్తుతం ఇప్పుడు Mount Girnar & Mount Abu లు ఎక్కడైతే లు ఉన్నయో అక్కడ ఒకప్పుడు అతి భారి కందకాలు (లోయలు) ఉండేవి. ఒకానొకరోజు వసిష్ట మహర్షికి చెందిన కపిల గోవు ఒకటి ఆ కందకంలో పడిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన బృహస్పతి కుమారుడైన ‘కచుడు’ ఆగోవును ఆపెద్ద కందకంలో నుండి బైటకు తీసి క్షేమంగా తిరిగి వసిష్ట మహర్షికి అప్పగించి జరిగిన విషయాన్ని అంతా చెబుతాడు. పైగా ఆ లోయల్లో తరచుగా గోవులు పడే విషయాన్ని చెప్పి గోవులను ముందు ముందు అటువైపు పంపవద్దని చెబుతాడు. అది విన్న వసిష్ట మహర్షి హిమవంతుని ప్రార్ధించి, హిమవంతుని ఇద్దరు కుమారులైన ‘గిరి నారాయణుడు’ [Mount Girnar] మరియు ‘గిరి అబుడు’ [Mount Abu] లను వారికి గల రెక్కల సహాయంతో ఆ కందకాలలో వ్రాలి వాటిని మూసివేసి గోవులను కాపాడవలసిందిగా ప్రార్ధిస్తాడు. ఆ విన్నపం విన్న హిమవంతుడు వసిష్ట మహర్షి ప్రార్ధనలో లోకహితం ఉన్నదన్న సత్యాన్ని గ్రహించి తన కుమారులైన ’గిరి నారాయణుడు’ మరియు ‘గిరి అబుడు’ లను పిలిచి ఆ కందకాలున్న ప్రదేశానికి ఎగిరి వెళ్లి అక్కడ కందకాలను ముసివేసేటట్లుగా స్థిరపడమని చెబుతాడు. తండ్రి ఆజ్ఞ తో గిరి నారాయణుడు తనతో పాటుగా 68 తీర్థాలను వెంటపెట్టుకొని అక్కడ వ్రాలతాడు. అదే సమయంలో బ్రహ్మ సృష్టికి భూమి యొక్క అస్థిరత అడ్డు పడుతుండడం వల్ల భూమిని స్థిరంగా ఉంచాలంటే కొండలకూ, గిరులకూ, పర్వతాలకూ ఉండే రెక్కలను కత్తిరిస్తే తప్ప అది సాధ్యం కాదని తలచి ఇంద్రుడిని పిలిచి అయన దగ్గర గల వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలను కత్తిరించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఇంద్రుడు అన్ని పర్వతాల రెక్కలను కత్తిరించుకుంటూ ఆఖరికి గిరి నారాయణుడు వద్దకు వస్తాడు [అప్పటినుండే అన్ని 'చలములు' , 'ఆచలములుగా మారిపోయాయి. 'అచలము అంటే పర్వతం]. అప్పుడు గిరి నారాయణుడు ఇంద్రుడి వజ్రాయుధానికి భయపడి తన రెక్కలను రక్షించుకోవడం కోసం సముద్రంలో దాక్కుంటాడు. ఈవిషయం తెలిసిన హిమవంతుని కుమార్తె , గిరి నారాయణుడి అక్క (సహోదరి) అయిన పార్వతి దేవి తన తమ్ముడిపైన గల అచంచలమైన ప్రేమ వల్ల, తమ్ముడిని రక్షించుకోవడానికి గానూ ఇంద్రుడితో యుద్ధానికి దిగుతుంది. ఈ విషయం తెలిసిన త్రిమూర్తులు ఆమెను శాంతింపజేసి లోకకల్యాణం కోసమే ఇంద్రుడు ‘రెక్కలు కత్తి రిస్తున్నాడని’ చెప్పి, ఈ సమన్యాయం ‘అన్ని పర్వతాలకూ వర్తిస్తుందని’ సర్దిచెప్పి, గిరి నారాయణుడిని సముద్రం లోంచి బయటకు పిలిచి ఆ ప్రాంతంలో నిలిచి అనేక గోవులను రక్షించిన కారణంగా గిరి నారాయణుడికి అందరు దేవతలు అనేక వరాలను ఇస్తారు. అయినప్పటికీ పార్వతి దేవి తన తమ్ముడిపైనగల ప్రేమ వల్ల శాంతించదు. అప్పుడు దేవతలందరూ “ఏమి వరమిస్తే శాంతిస్తావో” తెలపమనగా పార్వతి దేవి “గిరి నారాయణుడి పై ముప్పైమూడు కోట్ల మంది దేవతలు కోలువైనచో శాంతిస్తా” అంటుంది. అంతట దేవతలు ఆలోచించి ముప్పైమూడు కోట్ల మంది దేవతలు ఒకరిలోనే కోలువై ఉన్న గురు దత్తాత్రేయుల వారిని ప్రార్ధించి గిరి నారాయణుడిపై గురు దత్తాత్రేయులవారు శివస్వరుపంగా శాశ్వతంగా కొలువై ఉండేటట్లుగా చేస్తారు. తమ్ముడిపై ఉన్న వాత్సల్యం కొద్ది పార్వతి దేవి ‘అంబాజీ మాత’ గా మొదటి శిఖరం లో కొలువై ఉన్నారు.
ఎలా చేరుకోవాలి?
By Air Transport |
---|
By Air Transport |
Hyderabad Airport ----> Mumbai Airport [50 Min.] ----> Mumbai Airport ----> Rajkot Airport [50 Min.] -----> Rajkot Airport To Rajkot ST Bus Stand [10 Min.] ----> Rajkot ST Bus Stand To Junagadh [3 Hrs.] = Total 5 Hours [Aprox.] Journey |
By Train |
---|
By Train |
Tran No: 17018 : Secunderabad ----> Rajkot [30 Hrs] (OR) Tran No: 16733 : Kachiguda ----> Rajkot [35 Hrs] ----> Rajkot Junction To Rajkot ST Bus Stand [20 Min.] ----> Rajkot ST Bus Stand To Junagadh [3 Hrs] = Total 35 - 40 Hrs. Journey |
గిరిరాజ్ గిర్నార్ క్షేత్ర దర్శనానికి అనువైన సమయం…
గిరిరాజ్ గిర్నార్ క్షేత్ర దర్శనానికి September Month నుండి January Month వరుకు అనుకూలం. అత్యంత అనుకూల సమయం 15th October తరువాత నుండి 15th January వరుకు. Raivataka Mountain Festival, Girnar Lili Parikrama, Shivaratri, Bhadarvi Amas Festival At Damodar Kund, Dasara At Ambaa Maa Temple, Guru Purnima at Dattatreya Summit & At Kamandal Kund, Vaghesvari Festival, Jain Neminath Jayanthi Festival , Girnar Climbing Competition And Junagadh Girbhi Festival వంటి Festivals లలో తప్పించి మామూలు రోజులలో రద్దీ తక్కువగానే ఉంటుంది. గిర్నార్ శిఖరం ఎక్కడానికి ఉదయం 05:30 సరైన సమయం. సగటు భక్తుడికి గిర్నార్ శిఖరం ఎక్కి, వివిధ ప్రదేశాల దర్శనానంతరం క్రిందకు దిగడానికి కలిపి 11-12 గంటలు పడుతుంది. అంటే దాదాపుగా సాయంత్రం 05:30 గంటల కల్లా ఎలాంటి తొందర లేకుండా క్రిందకు రావచ్చు. మెట్లు యెక్క లేని వారు మెట్ల మొదట్లో (చడవొవ్ హనుమాన్ దేవాలయం దాటాక) ఉన్నDoli Station లో Doli ని మాట్లాడుకోవచ్చు. మనిషి బరువును బట్టి Doli ధర ఉంటుంది. సాధారణంగా గురు దత్తాత్రేయ శిఖరం వరుకు తీసుకెళ్ళి, మళ్లీ క్రిందకు తీసుకొచ్చేందుకు Rs. 5000/- నుండి Rs. 12000/- అడుగుతారు. కేవలం గిర్నార్ క్షేత్రం (పర్వతం వెలుపల మరియు పర్వతం పైనగల ప్రదేశాలు) చూడడానికి 2 రోజుల సమయం పడుతుంది. ఇక గిర్నార్ చుట్టుప్రక్కల గల ప్రాంతాలను (Gir Jungle Safari, Somnath, Dwaraka Etc..) చూడాలంటే ఇంకో 3 రోజుల సమయం అవసరం. మొత్తం మీద 5 రోజులలో చుట్టుప్రక్కల గల ప్రదేశాలతో పాటు మొత్తం గిర్నార్ క్షేత్రాన్ని Comfortable గా చూడవచ్చు.
గిరిరాజ్ గిర్నార్ పర్వతం క్రింద/ వెలుపల/బైట చూడవలసిన ప్రదేశాలు / ఆలయాలు
Temples & Places Below The Girnar Hill (గిర్నార్ పర్వతం క్రింద/ వెలుపల/బైట చూడవలసిన ప్రదేశాలు/ఆలయాలు) |
---|
Temples & Places Below The Girnar Hill (గిర్నార్ పర్వతం క్రింద/ వెలుపల/బైట చూడవలసిన ప్రదేశాలు/ఆలయాలు) |
1. Bhavnaath Temple - Mrugi Kund: At Foot Steps of Girnar Hill |
2. Sri RamaTemple & Lambe Hanuman Temple : At Foot Steps of Girnar Hill |
3. Sri Girnar Saadhana Ashramam (Sant Punith Bapu Datta Ashram) : At Foot Steps of Girnar Hill, Near Bavnaath Temple. Ph: 02852624547 |
4. Damodar & Revati Baldev Temple - Damodar Kund : 1 KM Away From Foot Steps of Girnar Hill |
5. Ashok Shila: : 1 KM Away From Foot Steps of Girnar Hill, Near Damodar Kund |
6. Vageshwari & Gayatri Maa Temple : 2 KMs Away From Foot Steps of Girnar Hill |
7. Mujkund Caves: 3 KMs Away From Bhavnaath Temple |
8. Datar Muslim Darga - Elephant Stone (Dubdi Road) : Near Willingdon Dam |
భావనాథ్ దేవాలయం & మృగికుండ్ (Bhavnaath Temple & Mrugi Kund):
భావనాథ్ దేవాలయం గిర్నార్ పర్వత శ్రేణుల పాదాలదగ్గర గల అతి గొప్ప పురాతన శివాలయం. శివరాత్రికి శివుడే స్వయంగా ఇక్కడకు వస్తాడని భావించే యోగులు, అఘోరాలు, దిగంబర సాధువులు ఆ రోజు ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరౌతారు. ఈ దేవాలయంలోఅత్యంత మహిమగల స్వయంభూ శివలింగం గలదు. శివ పార్వతుల విహారంలో వారి దుస్తులు ఇక్కడ పడిపోయాయని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. అందువల్లనే ఇక్కడ సాధువులు దానికి ప్రతీకగా దిగంబరంగా తురుగుతారు. ఈ దేవాలయంలో ‘మృగికుండ్’ అనే కుండం కలదు. భక్తులు ఇందులో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. శివరాత్రికి ఇక్కడ అతి పెద్ద జాతర జరుగుతుంది. ‘గిర్నార్ లిలి పరిక్రమ’ మరియు ఇతర పోటీలు ఇక్కడ నుండే ప్రారంభం అవుతాయి.
శ్రీదామోదర్ – రేవతి బలదేవ్ దేవాలయం & శ్రీదామోదర్ కుండ్ (Damodar – Revati Baldev Temple & Damodar Kund):
శ్రీదామోదరుడు (శ్రీ మహా విష్ణువు) రేవతి బలదేవుల సహితంగా ఇక్కడ వెలిశాడు. ఈ దేవాలయ ప్రాంగణం లో ‘శ్రీదామోదర్ కుండ్’ అనే ఒక గొప్ప తీర్థం కలదు. ఈ తీర్థం అతి పవిత్రమైనది. ప్రపంచంలోని అన్ని నదుల సారం ఈ కుండంలో ఉండేటట్లుగా బ్రహ్మ ద్వారా అనుగ్రహంపొందిందీ తీర్థం. మరి ముఖ్యంగా నేపాల్ లోని గండకి నది యొక్క అంతర్వాహిని ఈ కుండంలో నికి ప్రవహిస్తుందని చెబుతారు. అందువల్లనే ఇక్కడ అరుదుగా అప్పుడప్పుడు సాలిగ్రామాలు దొరుకుతాయట. మానవ జీవితం లో ఈ తీర్థం లో ఒక్కసారి స్నానమాచరించిన చాలట. తప్పనిసరిగా ప్రతి భక్తుడు చూసి స్నామాచారించవలసిన ప్రదేశమిది.
గిరిరాజ్ గిర్నార్ పర్వత శ్రేణి పైన చూడవలసిన ప్రదేశాలు / ఆలయాలు
మెట్ల సంఖ్య (Number of Steps) | చూడవలసిన ప్రదేశం / క్షేత్రం (Situated Pilgrim Place) |
---|---|
మెట్ల సంఖ్య (Number of Steps) | చూడవలసిన ప్రదేశం / క్షేత్రం (Situated Pilgrim Place) |
Between Step No. 1 And 500 | 1. Chadawow Hanuman 2. Adi Dattatreya Mandir 3. Durga Mandir 4. Neminath Mandir 5. Datta Ashramam 6. Triguneshwar Mandir 7. Sri Girnari Ashramam 8. Rakhidiya Hanuman-Shirdi Sai-Ganapathi Mandir 9. Sripada Sri Vallabha Mandir |
Between Step No. 501 And 1000 | 10. Shiva Temple |
Between Step No. 1001 And 3000 | 11.Temple & Samadhi of Sant Velnath 12. Bhatrahari & Gopichand Cave Temple 13. Sri Rama Temple 14. Ranak Devi Shila 15. Ranak Devi Hastha Mudrika Place 16. Kabutari Valley |
Between Step No. 3001 And 5000 | 17. Pregnant Women Temple 18. Guru Dattatreya Cave Temple 19. Pancheshwari Maa Temples 20. Jain Temple Complex [218 Small Temples] 21. Sant Siromani Raajul Maa Cave Temple 22. Satpudo Kund 23. Gomukhi Ganga 24. Shesavan 25. Anand Cave Temple 26. Shankar Tekri 27. Jata Shankar cave Temple 28. Hanuman Dhara 29. Bharatvan 30. Dattatreya Ashramam 31. Ambaji Maa Temple |
Between Step No. 5001 And 7000 | 32. Gorakshanaath Summit 33. Gorakshnath Temple 34. Gorakshnath Akahnda Dhuni 35. Gorakshnath Paduka 36. Avadhutha Avadhutanaath Ashramam |
Between Step No. 7001 And 9000 | 37. Avadhuta Yeraiah Swamy Cave |
Between Step No. 9001 And 9999 | 38. Kamandal Kund 39. Guru Dattatreya Summit[AvlokanSummit] 40. Guru Dattatreya Paduka Mandir |
.
ఛడవొవ్ హనుమాన్ దేవాలయం (Chadawow Hanuman Mandir):
మనం ఏకార్యక్రమమైనా ప్రారంభించబోయేముందు విఘ్ననాయకుడైన విఘ్నేశ్వరుడిని ముందుగా పూజించి పనిని ప్రారంభించడం ఆనవాయితి . ఈ సంప్రదాయానికి భిన్నంగా గిరిరాజ్ గిర్నార్ క్షేత్ర యాత్రలో పర్వత అధిరోహణకు ముందు అందరూ ఖచ్చితంగా ఛడవొవ్ హనుమాన్ కు ప్రార్ధన లేదా పూజ చేయాలి. దీనికి గల కారణం ఛడవొవ్ హనుమాన్ ‘ప్రాణవాయువుకు’ అధిష్టాన దేవుడు. సాధారణంగా ఈ యాత్రలో భక్తులు గిర్నార్ పర్వతం పైకి వెళ్ళే కొలది ప్రాణవాయువు(Oxygen) అందక ఇబ్బంది పడతారు / చనిపోతారు. అలాంటివేవీ జరగకుండా ఛడవొవ్ హనుమాన్ భక్తులను రక్షిస్తుంటారు. ఈయన మూలాధార చక్రం లోనే అతి శక్తి వంతమైన గణపతి కుడా ఉంటారు. అందువల్లనే ఛడవొవ్ హనుమాన్ దేవాలయం మొదటి మెట్టు దాటగానే మొట్టమొదటగా ఉంటుంది. ఈయన ఆశీస్సులుంటేనే ముందుకు…లేదంటే వెనక్కే! మొదటి మెట్టు ఎక్కే ముందు ఈయనను మర్చిపోయి కొద్దిదూరం వెళ్ళాక గుర్తుతెచ్చుకొని తిరిగి వెనకకు వచ్చి ప్రార్ధించే వారంటే ఈయనకు పిచ్చి కోపమట. కాబట్టి భక్తులు ముందుగానే మొదటిమెట్టు ఎక్కుతూనే ఈయన సహాయాన్ని, అనుమతిని కోరాలి. ప్రాణవాయుఅధిష్టానదేవా పవనపుత్ర శ్రీరామభక్త ఛడవొవ్ హనుమాన్ కిజై జై గిరినారి
ఆదిదత్తాత్రేయ మందిర్, కాళీమాత మందిర్ మరియు నేమినాథ్ జైన్ మందిర్ (Adi Dattatreya Mandir, Kaali Maa Mandir & Neminaath Jain Mandir):
ఛడవొవ్ హనుమాన్ దేవాలయం ప్రక్కనే ఆదిదత్తాత్రేయ మందిర్, కాళీమాత మందిర్ మరియు నేమినాథ్ జైన్ మందిర్ లు కలవు ఇక్కడ గల ఆదిదత్తాత్రేయ మందిర్ వద్ద దత్త పాదుకల (9999 మెట్లపైన గల) దర్శనభాగ్యం కలిగించమని వేడుకోవాలి. అందుకు సహకరించవలసినదిగా కాళీమాతను మరియు నేమినాథ్ జైన్ భగవాన్ లను వేడుకోవాలి. గుణనిర్గుణరూపాయ గిరినార్ దత్తాత్రేయాయ దిగంబరాయ నమస్తే నమః జైగిరినారి
శ్రీత్రిగుణేశ్వర మందిర్,దత్తాత్రేయ ఆశ్రమం, శ్రీపాద శ్రీ వల్లభ మందిర్, శ్రీ గిరినారీ ఆశ్రమం & రాఖిడియ హనుమాన్ మందిర్ :
ఇక్కడ చెప్పబడిన మందిరాలను దర్శించి ఆశీస్సులను తీసుకోవాలి. శ్రీపాద శ్రీ వల్లభ మందిర్ లో కొద్దిసేపు ఆగి దిగంబరస్మరణ, సిద్ధమంగళ స్తోత్రం పఠించి ముందుకు సాగాలి. రాఖిడియ హనుమాన్ మందిర్ లో గణపతి మరియు షిర్డీ సాయిల ఆశీస్సులను తీసుకోవాలి.
సంత్ శ్రీ వేల్నాథ్ మందిర్ & సమాధి మందిర్ (Sant Sri Velnath Mandir & Samadhi Mandir)
సంత్ శ్రీ వేల్నాథ్ బాబా ఒక విచిత్రమైన సంత్ గా ఇక్కడివారు చెబుతారు. అష్టసిద్ధులను కలిగిన వీరు గిరినార్ పర్వతం పై ఆశ్రమం ఏర్పరచుకొని అనేక వింతలను చేసిచూబించారు ప్రస్తుతం వీరి ఆశ్రమం సమాధి మందిర్ ఇక్కడేగలవు.
భత్రహరి & గోపీచంద్ గుహ దేవాలయం (Sri Bhatruhari & Gopichand Cave Temple):
భత్రహరి & గోపీచంద్ లు శ్రీగురు గోరక్షనాథులవారి ప్రియ శిష్యులు. వీరి గుహాలయం 2200 మెట్ల వద్ద కనిపిస్తుంది.
శ్రీరామ మందిర్ (Sri Rama Mandir):
దాదాపుగా 2300 మెట్ల వద్ద శ్రీ రామ మందిర్ మరియు శ్రీ రామ పాదుకలు కనిపిస్తాయి. ఇక్కడ పురాతన కాలం నుండి భక్తులకు నీటిని, ఆహారాన్ని ఉచితంగా అందించే సత్రం కలదు.
రానక్ దేవి హస్తముద్రికల ప్రదేశము (Ranak Devi Hastha Mudrika Sthal):
దాదాపుగా 3000 మెట్ల వద్ద ‘రానక్ దేవి శిల’ మరియు కొంచెం ముందు ‘రానక్ దేవి హస్తముద్రికల ప్రదేశము’ కనిపిస్తుంది. ఒకప్పుడు సిద్ధరాజ్ సోలంకి అనే రాజు జునాఘడ్ ను అక్రమంగా కుట్రతో ఆక్రమించుకొని గిర్నార్ పర్వతం పై ఆశ్రయంపొందుతున్న జునాఘడ్ రాజు మరియు ఆ రాజు యొక్క భార్య అయిన రానక్ దేవిని చేరపట్టి తీసుకెళుతున్నప్పుడు గిరిరాజ్ గిర్నార్ పైనుండి అనేక రాళ్ళు జారిపడతాయి. అప్పుడు రానక్ దేవి జారిపడుతున్న రాళ్ళ పై చెయ్యి ఉంచి “ముందుకు పడి నా భర్తను బలితిసుకోకు గిరినారి” అంటుంది. అప్పుడు ఆవిడ చెయ్యి తగిలిన రాళ్ళు ఎక్కడి వక్కడే అలాగే ఉండిపోతాయి. ఆ రాళ్ళను, ఆరాళ్ళ పైనగల రానక్ దేవి హస్తముద్రికలను ఇప్పటికి చూడవచ్చు.
గర్భవతి గుడి (Pregnant Women Temple):
ఒకప్పుడు ఒక నిండు చూలాలు గిర్నార్ శిఖరం పైకి వచ్చింది. ఒకానొక ప్రదేశానికి రాగానే ఆవిడకి నొప్పులు ప్రారంభం అయ్యాయట. చుట్టుప్రక్కల ఏఒక్క ఆడ మనిషి జాడ కుడా లేదట. అప్పుడు అక్కడ ఉండే ఒక చెట్టు పొద వెనకనుండి సాక్షాత్తు పార్వతీ దేవి ఒక పెద్దావిడ రూపంలో వచ్చి, కడుపులో అడ్డం తిరిగిన బిడ్డను కడుపుమీద రుద్ది సుఖప్రసవం అయ్యేలా చేసి, తల్లిని బిడ్డను క్షేమంగా పర్వతం క్రింది భాగం వరుకు చేర్చిందట. బిడ్డ కొంచెం పెరిగి పెద్దయ్యాక తల్లీ, బిడ్డలు మళ్లీ అక్కడకు వచ్చి పార్వతీ అమ్మ వారి సహాయానికి గుర్తుగా అక్కడ ఒక గుడిని నిర్మించి, తల్లీ, బిడ్డల పాదుకలు ప్రతిష్టిం చారు. ఇప్పటికీ అనేక మంది గర్భవతులు సుఖప్రసవం కోసం మొక్కుకుని ఇక్కడ వరుకు వస్తారు. ఈ గర్భవతి గుడి గిర్నార్ శిఖరం పై 3450వ మెట్టు మీద కలదు.
గురు దత్తాత్రేయ గుహ దేవాలయం / గురుగుహ (Guru Dattatreya Cave Temple / Guru Guha):
దాదాపుగా 3700 మెట్ల దగ్గర శ్రీ గురు దత్తాత్రేయ గుహ దేవాలయం కలదు. ఇక్కడ దత్తత్రేయునిచే వాడబడిన పెద్ద శంఖం కలదు. అలాగే దత్త పాదుకలను కుడా ఇక్కడ చూడ వచ్చు. ఈ దేవాలయాన్నే గురుగుహ అనికూడా అంటారు.
పంచేశ్వరీ మాతల దేవాలయములు (Pancheshwari Maatha Temples):
దాదాపుగా 3750 మెట్ల దగ్గర మలుపులో పంచేశ్వరీ మాతల దేవాలయములు కనిపిస్తాయి. సంతోషిమాత, గోవు రూప భారతమాత, కాళీమాత, వరూధీమాత మరియు ఖుడియార్ మాత అనే పంచేశ్వరీమాత లు పైకి వెళ్ళే భక్తులకు అభయాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తారు.
జైన తీర్థాలు (Jain Tirtha):
దాదాపుగా 2300 మెట్ల వద్ద నుండి జైన తీర్థాలు ప్రారంభ మవుతాయి. ఇవి 3100 లో ఉంటాయి. 24 తీర్ధంకరులకు సంభందించిన 218 చిన్నా,పెద్ద దేవాలయాలు కలవు. జైన తీర్థాల Architecture యాత్రికులకు కనువిందుచేస్తూ ఉంటుంది. నేమినాథ్ జైన్, పార్శ్వనాథ్ జైన్, వస్తుపాల్ జైన మందిరాలు చూడదగినవి. ఇక్కడకి దగ్గరలోనే Girnar Fort ను కుడా చూడవచ్చు.
సంత్ శిరోమణి రాజుల్ మాత గుహ దేవాలయం (Sant Shiromani Raajul Maa Cave Temple):
జైన తీర్థాల తదుపరి జైనుల పవిత్ర గుహ దేవాలయం అయిన సంత్ శిరోమణి రాజుల్ మాత గుహ దేవాలయం వస్తుంది. ఇక్కడ గుహలో నేమినాథ్ జైన్ విగ్రహం ఉంటుంది.
సాత్పుడో కుండ్ &జాంబవంత గుహ (Satpudo Kund & Jambavant Cave):
రాజుల్ మాత గుహ దేవాలయం నుండి కొంచె ముందుకు వెళితే 7 పవిత్ర శిలల మీదుగా ప్రవహించే నీటి కాలువ వస్తుంది. ఈ పిల్ల కాలువ 7 శిలల మీదుగా ప్రవహిస్తుండడం వల్ల దీనిని సాత్పుడో కుండ్ అని పిలుస్తారు. ఈ నీటికి ఔషద గుణాలు ఉన్నట్లుగా నిరూపించబడినది. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్లి క్రిందకు దిగితే అతిపురాతన మైన ‘జాంబవంత గుహ’ వస్తుంది.
గోముఖి గంగాకుండ్ (Gomukhi Ganga Kund):
4100 మెట్ల వద్ద వచ్చే ముఖ్యమైన ప్రదేశం గోముఖి గంగాకుండ్. గిర్నార్ శిఖరంలో రాళ్ళలో నిరంతరంగా గోవు నోట్లోంచి వచ్చే ఈ నీటి ధారలు అందరిని ఆశ్చర్యపరుస్తాయి. ఈ నీరు ఎంతోచల్లగా, తియ్యగా ఉంటాయి. గోముఖి గంగాకుండ్ ప్రాంగణం లోనే శివాలయం, గణపతి, హనుమాన్, భైరవుడు, అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడే సచ్చాకాకా, మహాకాళీ దేవాలయాలు కుడా కలవు. ఇక్కడి ఈ రాళ్ళలో గంగ ఉబికి రావడానికి పురాణ ప్రసస్థమైన ఒక గాధకలదు. ఒక్కప్పుడు సత్యదాముడు అనే ముని భగవంతుని కోసం తప్పస్సు ప్రారంభించాడు. ఆవిధంగా 1000 సంవత్సరాలు గడచినా భగవత్ సాక్షాత్కారం లభించకపోయేటప్పటికి విసుగెత్తి తనువు చాలించానుకున్నాడు. అప్పుడు ఒక అదృశ్య వాణి అతనిని హెచ్చరిస్తూ ” ఓ ముని ! ఈ జన్మలో నువ్వు దాహంతో ఉండి నీరు తాగుదామనుకుంటున్న ఒక గోవును కర్రతో కొట్టి తరిమివేశావు. అందువల్ల ఈ జన్మలో నీకు భగవత్ సాక్షాత్కారం లభించదు” అని చెబుతుంది. అదివిన్న సత్యదాముడు పశ్చాతాపంతో దోషపరిహారాన్ని సుచింపమనగా ఆ వాణి ” గోమంత గిరి (గిర్నార్) వెళ్ళు. అక్కడ గంగా మాతను ప్రార్ధిస్తే అప్పుడు అక్కడ ఒక గోవు ముఖం నుండి గంగ విడుదలౌతుంది. ఆ నీటి తాగి అందులో స్నాన మాచరించిన నీకు భగవత్ సాక్షాత్కారం శీఘ్రంగా లభిం చగలదు. తదాస్తు” అంటుంది. ఆప్రకారంగా సత్యదాముడు గంగా మాతను ప్రత్యక్షం చేసుకొని భగవత్ సాక్షాత్కారాన్నిపొంది ముక్తి పొందుతాడు. అప్పటి గంగాధార నేటికి ఇక్కడ వస్తుంది. అదే ” గోముఖి గంగ”. మన జీవితంలో తెలిసి, తెలియక ఎప్పుడైనా గోవును బాధపెట్టడం వల్ల వచ్చిన దోషాలు ఇక్కడ పరిహారం చేసుకోవచ్చు. గోముఖి గంగ అనేది ఒక Junction. ఇక్కడనుండి రెండు దారులు వెళతాయి. ఇక్కడ నుండి Left Side దారి తీసుకుంటే శేషవన్ (Seshavan), జటాశంకర్ గుహ దేవాలయం (Jata Shankar Cave Temple), ఆనంద్ గుహ (Anand Guha), భరత్ వన్ (Bharatvan), సీతామాధీ (Seethamaadhi), రామకుండ్ (Ramkund), సీతాకుండ్ (Seethakund), భరత్ వన్ దారిలోనే ఉండే హనుమాన్ ధార (Hanuman Dhara-హనుమంతుని నోటిలో నుండి గంగ వచ్చేప్రదేశం), లక్ష్మీనారాయణ్ మందిర్ (Lakshmi Narayan Mandir) సంత్ భజరంగ్ దాస్ సాధనా స్థలం (Sant Bhajrang Das Sadhana Sthal) వంటి వాటిని చేరుకోవచ్చు. ఇక్కడ నుండి Right Side దారి తీసుకుంటే అంబా జీ మాత (Ambaaji Maa Temple) దేవాలయానికి చేరుకోవచ్చు.
.
దత్తాత్రేయ ఆశ్రమం (Dattatreya Ashramam):
అంబా జీ మాత దేవాలయానికిముందు దాదాపుగా 4500 మెట్ల వద్ద ఒక దత్తాత్రేయ ఆశ్రమం కలదు. ఇందు చక్కటి దత్తాత్రేయ విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. ఇక్కడ భక్తులకు ఉచితంగా చల్లటి మంచి నీరు, ప్రసాదంగా ఖర్జురాను పంచుతారు.
అంబా జీ మాత దేవాలయం: [AmbaaJi Maa Temple - At 4848th Step]
అంబా జీ మాత (పార్వతి దేవి) దేవాలయాన్ని 12వ శతాబ్దంలో పునర్నిర్మించారు. అంతకు ముందు ఇక్కడ చిన్నదైన గుడి ఉండేది. ఈ చిన్న గుడి చుట్టూ పెద్ద ప్రాకారాలను కట్టి పెద్ద దేవాలయంగా మార్చారు. ఈ దేవాలయం అతి పురాతనమైదని. ఈ దేవాలయ పునర్నిర్మాణంలో మాత యొక్క రధం మరియు ఆమె కాలి ముద్రలు కనుగొన్నారు. ఈ ప్రదేశంలో కృష్ణుడుకి తలకేశాలు [పుట్టు వెంట్రుకలు] తీసారని చరిత్ర చెబుతోంది. తమ్ముడిపై ఉన్న వాత్సల్యం కొద్ది పార్వతి దేవి అంబాజీ మాతగా మొదటి శిఖరం లో కొలువై ఉన్నట్లు ఇతిహాసాలు చెబుతున్నాయి. అంబా జీ మాత (పార్వతి దేవి) విగ్రహం మాహూర్ లోని రేణుకామాతను పోలి ఉంటుంది. అంబా జీ మాత యొక్క కళ్ళు అతిశక్తి వంతమైనవి. అమ్మ మొత్తం గిర్నార్ పర్వత శ్రేణులను రక్షిస్తూ పహారా కాస్తూ ఉంటారని ఇక్కడి పూజారులు చెబుతుంటారు. అంబా జీ మాత దేవాలయం దాటిన తరువాత వచ్చే మైదానంలో అనేక దుకాణాలు ఉంటాయి.ఇది దాటితే ఇక ఎలాంటి దుకాణాలు ఉండవు. కాబట్టి నీళ్ళు మొదలైనవి కావాలనుకునే వారు ఇక్కడే కొనుక్కొని ముందుకు (గురు గోరక్షనాథుని శిఖరం & దత్తాత్రేయ శిఖరం ) మోసుకుపోవాలి.
గురు గోరక్షనాథుని శిఖరం (గురు గోరక్షనాథుని గుడి, పాదుకలు మరియు అఖండ ధుని – Guru Gorakshanaatha Summit):
గురు గోరక్షనాథుడు నవనాథులలో ముఖ్యమైన వాడు మరియు శివుని యొక్క ;ఓంకార’ స్వరూపంగా భావిస్తారు. గురు గోరక్షనాథుని శిఖరం మొత్తం గిరిరాజ్ గిర్నార్ పర్వత శ్రేణుల లోనే అతి ఎత్తైనది. నిత్యం మేఘాలు చేసే అభిషేకంతో గురు గోరక్షనాథుని శిఖరం చూడడానికి అతి అద్భుతంగా ఉంటుంది. ఈ శిఖర అందాన్ని మాటలలో కాని అక్షరాలలో కాని వర్ణించలేము. గురు గోరక్షనాథుని శిఖరం భూమి నుండి 3666 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ శిఖరంపై అధికంగా పురుగులు, దారుణంగా కుట్టే ఈగలు ఉంటాయి. గురు గోరక్షనాథుని ఆలయం 5280 మెట్ల దగ్గర వస్తుంది. ఇక్కడ గురు గోరక్షనాథుని గుడి, పాదుకలు మరియు అఖండ ధుని కలవు. గురు గోరక్షనాథుని అఖండ ధుని లోపలకు ఉండడం వల్ల బైటకు కనిపించదు. గురు గోరక్షనాథుల వారి గుడి అతి చిన్నదిగా ఉంటుంది. ఈ చిన్న మందిరంలో బ్రహ్మానందంలో మునిగి ఉన్న,తీవ్ర తపస్సులో ఉన్న గురు గోరక్షనాథుల వారి విగ్రహం ఉంటుంది. దీనికి దగ్గరలోనే గోరక్షనాథుల వారి పాదుకా మందిర్ మరియు గోరక్షనాథుల వారి అఖండ ధుని మందిరం ఉంటాయి. ఇక్కడ గురు గోరక్షనాథుడు ఇతర నవనాథులతో, భత్రహరి – గోపీచంద్ లతో మరియు ఇతర 84 మంది దత్త భక్తులతో కూడి 11000 సంవత్సరాలు తపస్సు చేసుకున్న అతి మహిమ గల ప్రదేశమిది. ఇక్కడ గల అఖండ ధుని 11000 సంవత్సరముల క్రితం వెలిగించింది. అది ఇప్పటికీ ఎప్పటికీ మండుతూనే ఉంటుంది. ఇటువంటి ఎన్నో చెప్పలేనన్ని వొళ్ళుగగ్గుర్లు పొడిచే విషయాలు, విశేషాలు ఈ శిఖరంపై ఉన్నాయి. ఆ ధునివద్దే గురు గోరక్షనాథుడు వాడిన త్రిశూలం, రుద్రాక్షలు ఇప్పటికీ చూడవచ్చు. కాని అఖండ ధుని మందిరం లోకి అందరికి ప్రవేశం ఉండదు. కేవలం బైట నుండే చూడాలి. బైట నుండి చూసి నప్పుడు పైన కూర్చున్న శివుడు, శివుని క్రింద నిల్చొని ఉన్న గురుగోరక్షనాథుని విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి. కేవలం గోరక్షనాథుని ఆశీస్సులు ఉన్నవారికి మాత్రమే అది సాధ్యం. ఈ శిఖరంపై ఉండే కుట్టే ఈగల వల్ల ఇక్కడ భక్తులు ఎక్కువసేపు ఉండరు, ఉండలేరు.
గురు గోరక్షనాథుని శిఖరంపై నాఅనుభవాలు (My Experiences On Guru Gorakshanaath Summit):
గురు గోరక్షనాథుని శిఖరం పైకి నేను సరిగ్గా ఉదయం 10:45 కి చేరాను (1వ మెట్టు మీద బయలుదేరింది ఉదయం సరిగ్గా 05:30కి). గురు గోరక్షనాథుని గుడి ఎదురుగుండా కూర్చుని నవనాథ చరిత్రలో ‘గోరక్షనాథ చరిత్ర’ అధ్యాయాన్ని తీసి పారాయణ చేస్తున్నాను. ఎక్కడి నుండో ఒక ఈగ వచ్చి గట్టిగా నామెడ మీద కుట్టి చర్మంలో ముల్లు విరిచి పోయింది. ఆ ఈగ కుట్టిన కొద్ది నిముషాల లోనే మెడ మీద ఎర్రగా అయ్యి వాచింది. ఇదంతా చూసిన గురు గొరక్షనాథ్ దేవాలయ నిర్వాహకుడు నాదగ్గరికి వచ్చి నాదగ్గర గల తెలుగు నవనాథ చరిత్ర గ్రంథాన్ని చూసి మీరు తెలుగు వారా? అని తెలుగులో అడిగాడు. “నేను ఆవును నేను తెలుగు వాడినే, హైద్రాబాద్ నుండి వస్తున్నాను” అని చెప్పాను. “ఈగ బాగా కుట్టినట్లుందే? బాగా వాచింది”… అన్నాడు. అని, “ఇక్కడ కాదు కానీ… నీకు అనుమతి ఇవ్వమని ‘గురు’ ఆజ్ఞ నువ్వు గురు గొరక్షనాథ్ అఖండ ధుని మందిరంలో లోపల కూర్చుని పారాయణ చేసుకోవచ్చు” అని చెప్పాడు. అప్పుడు నా ఆనందానికి హద్దు లేదనుకోండి. వెంటనే గొరక్షనాథ్ అఖండ ధుని మందిరం లోపల ధుని ఎదురుగా కూర్చుని మిగిలిన పారాయణ పూర్తి చేసాను. తరువాత కొద్ది సేపటికి గొరక్షనాథ్ దేవాలయ నిర్వాహకుడు లోపలకు వచ్చి “11000 సంవత్సరాల క్రింద వెలిగించిన ధుని ఇది చూడు” అని అక్కడ ఉన్న ఇనుప సువ్వతో దిని పైన గల బూడిద ను తొలగించాడు. అప్పుడు అందులో కణ కణ మండే నిప్పులను చూసి ఎంతో భక్తితో నమస్కరించాను. తరువాత ఆయన నాకు కొంత సాంబ్రాణి ఇచ్చి అందులో వేయమన్నాడు. అక్కడే ఉన్నగురు గోరక్షనాథుల వారి త్రిశూలం, రుద్రాక్ష మాలలు చూపించారు. తదుపరి “నువ్వు నీకిష్ట మోచ్చినంత సేపు ఇక్కడ ఉండచ్చు, నీకిష్ట మోచ్చినన్ని ఫోటోలు తీసుకోవచ్చు, వెళుతూవెళుతూ నీకు కావలసినంత ఊది ఈధునిలో నుండి తీసుకెళ్లమని” అన్నారు. కొంచెం సేపటికి ఊది తీసుకెళ్లడానికి కాయితం, వేడి వేడి ‘చాయ్’ తీసుకొచ్చి ఇచ్చి “చల్లారి పోతుంది చాయ్ తాగు” అన్నారు. నేను అఖండ ధుని మందిరం బైటకు వచ్చి చాయ్ తాగుతున్నంత సేపు నాకు వివిధ విషయాలు చెప్పారు. నేను ఆయన ఫోటో తీసుకుంటానని అడిగాను. “నాది వద్దు గుడివి తీసుకోండని” చెప్పారు. ఎంతో మృదువుగా ప్రేమగా ఉన్నారాయన. ఆయన పేరు “అవధూతనాథ్”. నేను గురు గోరక్షనాథునికి ధన్యవాదము చెప్పి, మ్రొక్కి, ఆయన నుండి సెలవు అడిగాను. దానికి ఆయన “దత్త శిఖరం నుండి వచ్చేటప్పుడు మళ్లీ ఒకసారి పలకరించు. నాపేరు అవధూతనాథ్, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి నాపేరు చెప్పు… వారిని కుడా లోపలకి తీసుకెళ్ళి అఖండ ధుని దర్శనం చేయిస్తా…” అన్నారాయన. ఆవిధంగా నేను గురు దత్తాత్రేయుల వారి ఆశీస్సులతో అఖండ ధుని మందిరం లోపల ఫోటోలు తీసి మీకు అందివ్వగలుగుతున్నందుకు – జై గురుదత్త…జై గొరక్షనాథ్.
అవధూత ఎర్రయ్యనాథ్ గుహ (Avadhutha Yerraiahnaath Cave):
గురు గోరక్షనాథ శిఖరం దాటిన తరువాత గురు దత్తాత్రేయ శిఖరానికి చేరాలంటే ఇక్కడ నుండి కొన్ని వందల మెట్లను క్రిందకు దిగవలసి ఉంటుంది. ఇప్పటివరుకు అన్ని మెట్లు ఎక్కిన భక్తులు ఇక్కడ చాలా Relax గా Feel అవుతారు. గురు గోరక్షనాథ శిఖరం మరియు గురు దత్తాత్రేయ శిఖరానికి మధ్యలో దాదాపుగా 8008 వ మెట్టు దగ్గర అవధూత ఎర్రయ్యనాథ్ గుహ ఉంటుంది. ఈయన ఒక దిగంబరావధూత . ఒక్కోసారి దిగంబరంగా, ఒక్కోసారి గోచిగుడ్డతో మాత్రమే ఉండే గొప్ప అవధూత శిఖామణి. ఉరిమే ఎర్రటి కనుగ్రుడ్లతో జడలు కట్టిన గడ్డం , జడల జుట్టుతో నల్లగా సన్నగా ఉండే దత్తావధూత ఈయన. దత్తశిఖరం వైపు వెళ్ళే, వచ్చే భక్తులను ఆపి కొంత మందిని గుజరాతిలో బూతులను తిడుతూ, కొంత మందిని ఓదారుస్తూ , కొంతమందికి Rs. 10/- తీసుకోని మంత్రించిన రుద్రాక్షలను ఇస్తూ, కొంత మందికి ఉచితంగా రుద్రాక్షలు ఇస్తూ ఉండే ఒక వింత యోగి. ఆయన తిట్టినా, బుజ్జగించినా దత్త భక్తులందరూ దర్శింపవలసిన దత్తావధూత ఈయన.
అవధూత ఎర్రయ్యనాథ్ తో నా అనుభవాలు (My Experiences With Yerraiahnaath Avadhutha):
గురు గోరక్షనాథుని శిఖరం నుండి దత్త శిఖరం వైపు వెళుతున్న నేను అవధూత ఎర్రయ్యనాథ్ గుహ వద్దకు వచ్చాను. నన్ను చూసిన ఎర్రయ్యావధూత…
ఎర్రయ్యనాథ్ అవధూత: ఓ..బడా సాబ్…అహిఆవో (గుజరాతిలో) – ఓ పెద్ద మనిషి ఇటురా!
నేను: జై గురుదత్త
ఎర్రయ్యనాథ్ అవధూత: కహాసే ఆయా?
నేను: హైద్రాబాద్ జై గురుదత్త
ఎర్రయ్యనాథ్ అవధూత: తెలుగు?!?
నేను: హా తెలుగు.
ఎర్రయ్యనాథ్ అవధూత: నేను తెలుగు వాడినే! నాపేరు ఎర్రయ్య రెడ్డి. రాయలసీమ రెడ్లం మేము. నన్నిక్కడందరు ‘అవధూత ఎర్రయ్యనాథ్’ అంటారు.
నేను: మంచిది జై గురుదత్త
ఎర్రయ్యనాథ్ అవధూత: (గట్టిగా అరుస్తూ) ఎందుకోచ్చావిక్కడికి? ఎవరమ్మన్నారిక్కడికి?
నేను: గురు పాదుకల దర్శనం కోసమోచ్చాను జై గురుదత్త. నేనే వచ్చాను.
ఎర్రయ్యనాథ్ అవధూత: రాయలసీమ గురించి నీకేమి తెలుసు?
నేను: ప్రముఖ అవధూతలందరూ దాదాపుగా రాయలసీమవారే జై గురు దత్త.
ఎర్రయ్యనాథ్ అవధూత: (నవ్వుతూ) సరిగ్గా చెప్పిన వాడివి ఈ మధ్య కాలంలో నువ్వొక్కడివే!.. కూర్చో.
నేను: కూర్చున్నాను.
ఎర్రయ్యనాథ్ అవధూత: కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? ఇదిగో అబ్బాయి నువ్వు నన్ను ఎవరిగురించైనా అడుగు… ఒక్క దత్తాత్రేయుడు గురించి తప్ప..
నేను: అవును స్వామి. కొంచెం నొప్పిగా ఉన్నాయి . దత్తాత్రేయుడు గురించి పూర్తిగా ఎవరూ చెప్పలేరు కాబట్టి నేను ఏమి అడగను జై గురు దత్త.
ఎర్రయ్యనాథ్ అవధూత: మేము రాయలసీమ వారిమైనా కొన్ని సంవత్సరాలు విశాఖ పట్నం లో ఉన్నాను.
నేను: జై గురుదత్త , నేను కుడా కొద్ది రోజులు విశాఖ పట్నం లో ఉన్నాను
ఎర్రయ్యనాథ్ అవధూత: (గట్టిగా అరుస్తూ) నేనేక్కడంటే నువ్వక్కడంటావా? తమాషానా?
నేను: No Sound
అంతలో ఒక 18-20 ఏళ్ళ అమ్మాయి, అబ్బాయి దత్త శిఖరం వైపు వెళు తుంటే చూసి…
ఎర్రయ్యనాథ్ అవధూత: బేటి! ఇటురా! (అమ్మాయిని మాత్రమే పిలిచారు. ఇక్కడనుండి వారి సంభాషణ గుజరాతి బాషలోనే సాగింది)
ఎర్రయ్యనాథ్ అవధూత: నీపేరేంటి? ఎక్కడనుండి వచ్చావ్?
అమ్మాయి: నాపేరు పూజ. నేను జెత్పుర్ నుంచి వస్తున్నా
ఎర్రయ్యనాథ్ అవధూత: ఎందుకోచ్చావ్? అని అడిగారు ‘చిలుము(Cigar)’ పిలుస్తూ
అమ్మాయి: పిక్నిక్కి వచ్చా.
ఎర్రయ్యనాథ్ అవధూత: పిక్నిక్కి వచ్చా వా?!? ఎవరెవరు వచ్చారు?
అమ్మాయి: ఒక్కదాన్నే.
ఎర్రయ్యనాథ్ అవధూత: మరి ఆ అబ్బాఎవరు?
అమ్మాయి: మా ఫ్రెండు
ఎర్రయ్యనాథ్ అవధూత: మీనాన్న ఫోన్ నెంబర్ ఇవ్వు. నేను మాట్లాడాలి
అమ్మాయి: మానాన్నకి ఫోన్ లేదు.
ఎర్రయ్యనాథ్ అవధూత: ఫోన్ తీసి దత్త శిఖరం పైన ఉండే సెక్యూరిటీ గార్డ్ కి ఫోన్ చేసి ” జెత్పుర్ నుంచి ఎర్ర పంజాబీ వేసుకొని ఒక అమ్మాయి, అబ్బాయి వచ్చారు. వాళ్ళని లోపలకి పంపించకు. వాళ్ళ నాన్నతో మాట్లాడు”అని చెప్పాడు.
ఈ లోపు వాళ్ళిద్దరూ చల్లగా వచ్చిన దారినే జారుకున్నారు.
ఎర్రయ్యనాథ్ అవధూత: (నాతో) ప్రతీ వాడు ఇక్కడకి రావడం… నేను గిర్నార్ 10000 మెట్లు ఎక్కానని వాళ్ళ ఊర్లో గొప్పగా చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపో యింది.
నేను: అవును స్వామి నిజమే.
ఎర్రయ్యనాథ్ అవధూత: ఇక్కడ రోప్ వే (Ropeway) వేస్తారట…రోప్ వే !
నేను: No Sound
ఎర్రయ్యనాథ్ అవధూత: అదేస్తే ప్రతి అడ్డమైన గాడిదా ఇక్కడే వచ్చి కూర్చుంటుంది. అయినా నేను ఆ కంపెని పెద్దయనోస్తే చెప్పా… దత్తాత్రేయుడికి ఇష్టం లేదు, పని ఆపేయండి అని… 10 రోజుల్లో పిల్లర్లు వేసేస్తామని, పని ఆపలేమని చెప్పాడు. అలా చెప్పి 10 సంవత్సరాలైంది. ఇప్పడివరుకు మళ్లీ రాలేదు ఎదవలు.
నేను: No Sound
ఎర్రయ్యనాథ్ అవధూత: భోజనం చెయ్యి. వడ్డిస్తా…
నేను: వద్దు జై గురు దత్త దారిలో అవీ-ఇవీ తిన్నా, ఎక్కువ తింటే ఎక్కలేను.
ఎర్రయ్యనాథ్ అవధూత: పోనీ టీ (Tea) తాగు. అని పొయ్యి అంటించి వేడి వేడి టీ (Tea) పెట్టి ఇచ్చారు. టీ తాగుతూ అనేక విషయాలను మాట్లాడుకున్నాము.
నేను: స్వామి మీతో ఒక ఫోటో దిగాలనుంది.
ఎర్రయ్యనాథ్ అవధూత: (గట్టిగా నవ్వుతూ) నువ్వు నాతో కాదు.. నేనే నీతో ఫోటో దిగుతా…
నేను: ఎలాగైనా ఫరవాలేదు జై గురు దత్త. అలా.. నేను గుహ బైట, ఎర్రయ్యనాథ్ అవధూత గుహ లోపల ఉండగా ఒక ఫోటో దిగాము. కాని ఆ ఫోటోలో ఎర్రయ్యనాథ్ అవధూత గుహ చీకట్లో కలిసిపోయారు.
నేను: స్వామి ఫోటో బాగారాలేదు. మీరు అస్సలు పడలేదు. చీకటిగా వచ్చింది.
ఎర్రయ్యనాథ్ అవధూత: ఫ్లాష్ పెట్టండి. అని గుహ లోంచి కొంచెం ముందుకు వచ్చి చెయ్యి మాత్రం బైటకి పెట్టారు.
నేను: (ఫోటో తీసాక) స్వామి ఈ ఫోటో కుడా బాగా రాలేదు. చీకటిగా ఉంది. ఇంకొకటి దిగుదాము.
ఎర్రయ్యనాథ్ అవధూత: (కోపంగా) ఎందుకొస్తారయ్యా ఇక్కడికి ఫ్లాష్ బల్బ్ లేకుండా.. సరేలే నీకోసం గుహ బైటకి వస్తా.. అని చెప్పి గుహబైటకి వచ్చారు ఎర్రయ్యనాథ్ అవధూత. అప్పుడు మేమిద్దరమూ కలిసి ఫోటో దిగాము. వారిని కుడా ఒక ఫోటో (Individual / Solo Photo) తీసాను. ఇది చూసిన అక్కడి వారు ఎర్రయ్యనాథ్ అవధూత గుహ బైటకి వచ్చాడని అందరూ కోలాహలంగా అరుస్తున్నారు. ఒక్క నిముషం నాకేమి అర్ధం కాలేదు. కొద్ది నిముషాలలోనే అక్కడ చాలామంది గుంపుకూడారు. దానికి గల కారణం ఎర్రయ్యనాథ్ అవధూత గుహ బైటకి రావడమేనట. అలా గుంపుకూడిన వారందరిని బూతులు తిట్టి అక్కడనుండి పంపించి వేసారు ఎర్రయ్యనాథ్ అవధూత.
నేను: స్వామి మీరు గుహ బైటకి వస్తే పండగ చేస్తున్నారు. కారణం తెలుసుకోవచ్చా?
ఎర్రయ్యనాథ్ అవధూత: నేను ఇక్కడికివచ్చి 42 ఏళ్ళు. ఒక్కోసారి దత్త శిఖరం పూజారి ఇక్కడ వరుకు రాలేకపోతే దీపారాధన నేనే చేసేవాడిని. ఆపుడు తప్ప నేను బైటకురావడం అరుదు. నేను కాయకల్ప చికిత్సలో ఉన్నాను. నేను నేరుగా తగిలే సూర్యుడి వెలుగులోకి రాను. ఈ గుహ దాటి బైటకు వచ్చి కొన్ని సంవత్సారాలైంది. అందుకే ఈ గోల.
నేను: స్వామి నా మిత్రుడు ఒకరు అవధూతలకు డొనేషన్ ఇవ్వమని కొంత డబ్బిచ్చారు. అది మీకు ఇవ్వా లనుకుంటున్నాను.
ఎర్రయ్యనాథ్ అవధూత: డొనేషన్ గినేషన్ జాన్తనై. అవధూతలకు గోచి గుడ్డలు చాలు. డొనేషన్ లతో పనే లేదు!
నేను: అవధూతలకు భోజనానికైనా మీరు తీసుకుంటే బావుంటుంది.
ఎర్రయ్యనాథ్ అవధూత: సరే. భోజనాలకివ్వు. (నాముందే 10000 మెట్ల దగ్గర ఉప్పు, పప్పు వంటి సరుకులను Delivery చేసే అతనిని ఫోన్ లో పిలిపించి నాతోనే సరుకుల లిస్టును ఇంగ్లిష్ లో రాయించి ఆ అబ్బాయికి డబ్బులు, లిస్టు ఇప్పించారు).
నేను: మిమ్మల్నో ముఖ్య విషయం అడగాలి. స్వామి ఇందాక ఒక Fire Ball (అగ్నిగోళం) దత్త శిఖరం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే గమనించి ఫోటో తీసాను. లక్కీగా అది నా కెమరా లో చిక్కింది. దాని గురించి చెబుతారా.
ఎర్రయ్యనాథ్ అవధూత: ఓ అదా! ఆవిడ సాక్షాత్తు పార్వతి దేవి. ఆవిడ స్వస్థలం హిమాచల్. అక్కడ ఆమాతను ‘జ్వాలాముఖి’ అంటారు. ఒక్క దత్త శిఖరం చుట్టూనే కాదు , మొత్తం గిర్నార్ పర్వతాల చుట్టూ తిరుగుతూ పహారాకాస్తుంటారావిడ. కెమెరాలో రావడం అదృష్టమే అయినా అదిక్కడ సాధారణం. ఈ విషయం ఎక్కువగా ఆలోచించకు. దత్త పాదాలే ముఖ్యం మనకి.
నేను: స్వామి మరి శెలవు. దత్త శిఖరం వెళ్లి వస్తాను. జై గురు దత్త
ఎర్రయ్యనాథ్ అవధూత: ఆగు నాయన.. అవధుతలకు అన్నం పెట్టించిన మీ మిత్రుడుకి ఈ 11 రుద్రాక్షలు ఇవ్వు. ప్రతీ వారి జీవితంలో 11 కష్టాలు వస్తాయి. ఒక్కో కష్టానికి ఒక్కో రుద్రాక్ష బైటకి విసిరెయ్యమని, లేదా నదీ/ సముద్రంలో పడేయ్యమని చెప్పు. దత్త పాదుకా దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు మళ్లీ కలువు. నీతో పనుంది.
నేను: దత్త పాదుకా దర్శనం అనంతరం మళ్లీ నేను ఎర్రయ్యనాథ్ అవధూత గుహకు వెళ్లి “స్వామి వెళ్ళే టప్పుడు కలవమన్నారు”.
ఎర్రయ్యనాథ్ అవధూత: అవును, దర్శనం బాగా జరిగిందా? పైన సీతారాం (దత్త శిఖర పూజారి) ఉన్నాడా? కమండల కుండం వెళ్ళవా?
నేను: దర్శనం బాగా జరిగింది జై గురు దత్త . రెండు సార్లు దర్శనానికి వెళ్ళాను. ఎక్కువ జనాలు లేరు. కమండల్ కుండ్ కుడా వెళ్ళాను.
ఎర్రయ్యనాథ్ అవధూత: ఇంద… తీసుకో ఈ జాతి రత్నాలను నీదగ్గర పెట్టుకో… నీకు మంచి జరుగుతుంది, అలాగే వీటికి నువ్వు ఎలాంటి సొమ్ము నాకు ఇవ్వాల్సిన పని లేదు. నాకివ్వాలనిపించింది, ఇచ్చాను. వెళ్లి రా బాబు.
నేను : స్వామి మీ ఫోన్ నెంబర్ ఇస్తారా?
ఎర్రయ్యనాథ్ అవధూత: నాకు Visiting Card ఉంది తీసుకో.
నేను : జై గురు దత్త వెళ్లి వస్తాను.
ఎర్రయ్యనాథ్ అవధూత: శుభమస్తు.
గురు దత్తాత్రేయశిఖరం(అవలోకన శిఖరం) కమండల్ కుండ్ & దత్త పాదుకలు (Dattatreya Summit & Kamandal Kund) :
అవధూత ఎర్రయ్యనాథ్ గుహదాటి ముందుకు వెళ్ళిన తరువాత ఒక కమాన్ (Arch) వస్తుంది. ఇక్కడ Left Side Steps తీసుకుని పైకి వెళితే గురు దత్తాత్రేయ శిఖరం( అవలోకన శిఖరం), దత్త పాదుకలు వస్తాయి. Right Side దారి తీసుకుని 250 మెట్లు క్రిందకు దిగితే వెళితే కమండల్ కుండ్ వస్తుంది. సాధారణంగా భక్తులు ముందుగా కమండల కుండం వెళ్లి, మళ్లీ మెట్లుఎక్కి పైకి వచ్చి దత్తాత్రేయశిఖరం( అవలోకన శిఖరం), దత్త పాదుకల దర్శనానికి వెళతారు. కమండల్ కుండ్ లో భోజనం చెయ్యాలనుకునే భక్తులు ముందుగా గురు దత్తాత్రేయశిఖరం( అవలోకన శిఖరం) వెళతారు.
కమండల కుండం( Kamandal Kund / Calabash Kund):
గురు దత్తాత్రేయుడు ఆయన కమండలాన్ని విసిరేసిన ప్రదేశంలో రాళ్ల మధ్యలో నుండి ఉద్భవించిన కుండమే ‘కమండల కుండం’. ఇక్కడ గురు దత్తాత్రేయుల వారి అఖండ ధుని, వారు వాడిన త్రిశూలం, కమండలంమరియు ఇతర వస్తువులు ఇప్పటికీ ఉన్నాయి. కమండల కుండం లోని నీరు తియ్యగా, చల్లగా ఉంటాయి. ఇక్కడ గల ఆశ్రమంలో భక్తులకు ఉచిత భోజనం (ఉదయం 11:00 గంటల నుండి) మరియు ఉచిత తేనీరు (Tea) ఇస్తారు. ఇక్కడ గల గురు దత్తాత్రేయుల వారి అఖండ ధుని దత్తాత్రేయుల వారే 12000 సంవత్సరాల క్రితం వెలిగించారు. ఇప్పటికీ ఆ ధుని నిరంతరాయంగా వెలుగుతూ ఉండడం ఇక్కడి విశేషం. ప్రతీ సోమవారం ఉదయం ఇక్కడ గల అతి పవిత్రమైన దత్తాత్రేయుల వారి అఖండ ధునిని Open చేస్తారు. ప్రతీ దత్త భక్తుడు ఈ దృశ్యాన్ని చూసి తిరవలసినదే!
గురు దత్తాత్రేయశిఖరం(Guru Dattatreya Summit / Avalokan Summit- అవలోకన శిఖరం) :
దత్తాత్రేయశిఖరం కమాన్ దగ్గర Lift Side Route తీసుకోని నిట్ట నిలువుగా వుండే కొన్ని వందల మెట్లు ఎక్కిన తరువాత ఆఖరుగా మనమెంతగానో ఎదురుచూసే, మన జన్మని చరితార్ధం చేసే గురు దత్తాత్రేయ పాదుకలు వస్తాయి. ఆ పాదుకల మహిమను ఏమానవ మాత్రుడు వర్ణింప సాహసం చేయగలడు? గురు పాదుకా దర్శనం అనంతరం అక్కడ ఉండే పెద్ద ‘ఘంట’ను కొట్టడం అక్కడి ఆనవాయితి. 10,000 మెట్లు ఎక్కిన అలసటంతా ఒక్కసారిగా ఆ పాదుకా దర్శనంతో పటాపంచలైపోతాయి. భక్తులు ఎంతో ఆనందంతో , గురు దత్తుడికి కృతజ్ఞతలు తెలుపుతూ తృప్తితో క్రిందకి దిగుతారు. దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా..
చాలామంది భక్తులు నాతో ” అన్నదానానికి కొంత మొత్తం మేము గణగాపూర్ లో ఇచ్చాము, పిఠాపురం లో ఇచ్చాము, కురువపురంలోకుడా ఇచ్చాము. కానీ గిర్నార్ క్షేత్రంలో ఎలా? ఎక్కడ ఇవ్వాలో చెప్పమనే” వారు. వారికోసం గిర్నార్ క్షేత్రం Bank Details :
Donations Information To GirRaj Girnar Dattatreya Temple |
---|
Donations Information To GirRaj Girnar Dattatreya Temple |
SHREE GURUDATTATREYA GIRNAR CHARITABLE TRUST, Account No. : 947609131, INDIAN BANK, JUNAGADH BRANCH, IFS Code : IDIB000J013 |
గిరిరాజ్ గిర్నార్ క్షేత్రంలో ఎక్కడ ఉండాలి?
గిరిరాజ్ గిర్నార్ క్షేత్ర యాత్రలో Junagadh లో ఉండడం ఉత్తమం. Junagadh లో అనేక Hotels & Lodgeలు కలవు. Junagadh లో Lodge With Veg Symbol ఉంటే అది భోజన Hotel అని అర్ధం. Hotel అని ఉంటే అది Lodge అని అర్ధం. Junagadh District Head Quarter మాత్రమే కాదు, నల్లులకు(Bed Bugs) కుడా అది Head Quarter. ఆ విషయాన్ని గమనించి వసతులను ఎంచుకోవలసిందిగా విజ్ఞప్తి.
Name of Hotel | Online Booking Facility | Tariff | Rank |
---|---|---|---|
Name of Hotel | Online Booking Facility | Tariff | Rank |
Vista Rooms (www.vistarooms.com) | Only Online Booking - No Offline Booking | Rs.1500/- To Rs.5000/- | 01 |
Hotel Hormony | Online Booking & Telephone Booking (Both) (www.hormonyhotel.in) | Rs.1000/- To Rs.2500 | 02 |
Hotel Somnath | Telephone Booking | Rs. 750/- To Rs.1500/- | 03 |
Sunil Guest House | NA | Rs.250/- (Without TV) & Rs.300/- (With TV) | NA |
గిరిరాజ్ గిర్నార్ క్షేత్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గిరిరాజ్ గిర్నార్ క్షేత్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు |
---|
గిరిరాజ్ గిర్నార్ క్షేత్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు |
1. యాత్రకు అంతకు ముందు నుండి వాడుతున్న Sports Shoe ను వాడాలి (Shoe వేసుకొని గిర్నార్ శిఖరం ఎక్క వచ్చు. గుళ్ళ లోకి వెళ్ళేటప్పుడు Shoes , Socks విప్పి చేతులు కడుక్కొని వెళ్ళాలి) |
2. యాత్ర ప్రారంభంలో విధిగా చడవావ్ హనుమాన్ ను తప్పని సరిగా గుర్తుపెట్టుకొని మరీ పూజించాలి. |
3. యాత్ర మొత్తంలో Backpack లనే వాడాలి. ఎక్కడా Polythene Bags వాడరాదు. |
4. ఉదయాన్నే, సూర్యోదయం ముందే ఎక్కడం ప్రారంభించాలి |
5. Electral Powder, Plaster Bandage వంటివి దగ్గరుంచుకోవాలి |
6. ప్రారంభంలో మెట్ల దగ్గర దొరికే కర్రను Rent కు తీసుకుని, కర్ర సహాయంతో ఎక్కి,దిగాలి |
7. 15 సంవత్సరాల లోపు పిల్లలను, 70 సంవత్సరాలు దాటిన పెద్ద వారిని తీసుకెళ్ళకపోవడం మంచిది. |
8. గిరిరాజ్ గిర్నార్ పరిక్రమ యాత్ర కు వెళ్ళేవారు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి |
గిరిరాజ్ గిర్నార్ పరిక్రమ యాత్ర ( Walk Around Girnar)
గిరిరాజ్ గిర్నార్ పరిక్రమ యాత్ర( Walk Around GirRaj Girnar): గిరిరాజ్ గిర్నార్ పరిక్రమ యాత్రను Lili Parikrama అనికూడా అంటారు. ఎంతో పవిత్రమైన గిరిరాజ్ గిర్నార్ పర్వత శ్రేణులనన్నింటినీ ప్రదక్షిణగా చుట్టి రావడమే ఈ Lili Prarikrama ముఖ్య ఉద్దేశ్యం. సాధారణంగా ఈ ప్రతీ సంవత్సరం కార్తికమాస శుద్ధ ఏకాదశి రోజు Lili Parikrama పారంభమై కార్తిక పౌర్ణమి రోజుతో ముగుస్తుంది. దీనికి ప్రతీ సంవత్సరం November నెలలో District Collector of Junagadh Official గా అన్ని Leading News Papers లలో Notification జారి చేస్తారు. ఈ పరిక్రమ లో మొత్తం 36 KMsనడవాలి. ఈ Lili Parikrama, Rupaayathan (Near Bhavnaath Temple) నుండి ప్రారంభమై Zina Bhava-Ni Madhi, Malvela, Bordevi అనే ప్రదేశాల మీదుగా సాగి తిరిగి Rupaayathan వద్దే ముగుస్తుంది. ఈ Lili Parikrama కు అనేక లక్షల మంది భక్తులు, దిగంబర సాధువులు వస్తారు. దారికి ఇరువైపులా తినుబండారాలు, త్రాగునీరు ఉచితంగా అందిస్తారు. ఈ సమయంలో అక్కడి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా ఉంటాయి. అందువల్ల పరిక్రమ చేసే భక్తులు ప్రత్యేక ఏర్పాట్లతో వెళ్ళాలి.
All India Open Mountaineering Girnar Competition
ప్రతీ సంవత్సరం Govt of India & State Govt of Gujarat లు సంయుక్తంగా All India Open Mountaineering Girnar Competition ను January నెలలో నిర్వహిస్తాయి. ఈ Competition నెగ్గిన వారికి Certificate & Prize కుడా ఇస్తాయి. ఆశ్చర్యంగా ఇందులో పాల్గొనే కొంతమంది Paricipants మొత్తం 10000 మెట్లను ఒక గంటలోపే ఎక్కి, దిగుతారు.
Click Here To Register For All India Open Mountaineering Girnar Competition
గిరిరాజ్ గిర్నార్ చుట్టుపక్కల గల చూడవలసిన ప్రదేశాలు / ఇతర ఆలయాలు
ప్రదేశము (Place) | ప్రాంతము (Location) |
---|---|
ప్రదేశము (Place) | ప్రాంతము (Location) |
Junagadh Museum | Junagadh - Local |
Khapra Kodia Caves / Junagadh Caves | Junagadh - Local |
Sri Swaminarayan Mandir | Junagadh - Local |
Mahabat Maqbara | Near Railway Station & Dist. Court, Junagadh - Local |
Sakkarbaug Zoological Garden / Junagadh Zoo | Junagadh - Local |
Jetpur World Famous Sarees - Jetpur | 40 KMs Distance From Junagadh |
The Gir Forest National Park and Wildlife Sanctuary | 65 KMs Distance From Junagadh |
Rotary Dolls Museum (Worlds Famous Children Museum) | Rajkot 80 KMs Distance From Junagadh |
Madhvapur Beach | Madhvapur (Lord Krishna Had Married Rukmini In Madhavpur) - 85 KMs Distance From Junagadh |
Somnath Jyotirlinga Temple | Somnath - 90 KMs Distance From Junagadh |
Dwaraka | 200 KMs Distance From Junagadh |
Click Here To Book Online Permit (Online e-Permission To Visit Gir Jungle) To Gir Jungle Safari (Or) Devalia Safari
Acknowledgements
Special Thanks To Officials of Junagadh Museum & AIOMGC For Photos/ Ancient Photos of Girnar Mountains
Jai Guru Datta