Gomatha – Gopuja
Gomatha – Gopuja (గోమాత – గోపూజ)
ప౦చభూతశివే! పుణ్యే! పవిత్రే! సూర్య స౦భవే!
ప్రతీచ్ఛేమ౦ మయాదత్త౦ సౌరభేయి గోమాత ! నమోస్తుతే!!
[ప౦చ భూతాలకు శుభాన్ని కలిగి౦చే పుణ్య శివ స్వరూపిణీ! పవిత్ర మైనదాన ! సూర్యుని ను౦డి కలిగినదానా! (సూర్య కాంతి లోని శక్తిని గోవు తన పాలలో నిలుపుతుంది). సురభీ వ౦శ౦లో కలిగిన తల్లీ! నీకు నమస్కారము]
పూర్వం యోగులు, సాధువులు అధికంగా గోవుకు పూజలు జరుపుతుండేవారు. గోపూజ మహిమ తెలిసిన అనతరం చాలామంది భక్తులు ఈ పూజలో భాగస్థులౌతున్నారు. సకల దోషాలను హరించే శక్తి గోపూజకు ఉంది . త్రిమూర్తులు, సకల దేవతలు గోవుమాతపైనే కొలువై ఉన్నట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. గోవును మనం మన ‘గురువుగా’ చేసుకొని కుడా పూజించవచ్చట! అందుకనే అనేక మంది ఆధ్యాత్మిక గురువులందరూ గోపూజ తప్పనిసరిగా చేస్తారు. గోవు మనకు అందుబాటులో ఉండే నడిచే గురువుగారన్నమాట. మన గురువు వలే గోవు కుడా సాదుస్వరుపం, ప్రేమస్వరుపమే! గురువుగారు తిట్టినా, కొట్టినా, శపించినా.. ఏది చేసినా మనమంచి కోసమే… అలాగే గోవు యొక్క పాలు, పంచకం, పేడ… మొదలైనవన్నీ మనమంచికే…
త్వరితంగా దత్తాత్రేయుల వారి అనుగ్రహం పొందడానికి అతి సులభమైన మార్గం ఈ గోపూజ. గోవు పృష్ట భాగం లో శ్రీ లక్ష్మి దేవి నివశిస్తున్నందున గోవు తోక భాగం మంచిదని, ముఖ భాగం చూడకూడదని చెబుతారు (లక్ష్మీదేవి నివసించే అయిదు స్థానాలను వేదాలు వివరించాయి. వాటిలో మొదటిది ఏనుగు కుంభస్థలం, రెండవది ఆవు వెనక తట్టు, మూడవది తామర పువ్వు, నాలుగవది బిళ్వ పత్రం వెనుక భాగంలో ఉండే ఈనెలు, అయిదవది సువాసినీ పాపట ప్రారంభస్థానం). నిజానికి గోవు యొక్క సర్వ అంగాలలో దేవతలు ఉంటారు. మంత్రయుక్తంగా గోపూజ చేయలేని వారు ప్రేమతో గో గ్రాసాన్ని (గడ్డి) కాని, అరటిపండును కాని తినిపించినా స్వర్వ దేవతల, గురువుల ఆశీస్సులు లభిస్తాయి.
కామోద్రేక్తంతో మరియు అహంకారంతో చేసే తప్పుల వలన కలిగే దోషాలను కూడా గోపూజ ద్వారా నివారించుకోవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలలో పేర్కొనడం జరిగింది. అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, తెలిసీ తెలియక చేసిన పాపాలు గోపూజ వల్ల నశిస్తాయి. గోవును పూజించడం మాత్రమే కాకుండా గోవును దేవాలయానికి దానంగా ఇవ్వడం, గోవు వలన మనకు సిద్ధించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలను ఇతరులకు దానంగా ఇవ్వడం కూడా గోదానం తో సమానమేనని పండితులు భావిస్తున్నారు.
అలాగే సిద్ధ గురువుల రాక, దేవ రహస్యాన్ని కనుగొనే మహత్మ్యం గోవుకు మాత్రమే ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. అందువల్లే గోపూజకు శాస్త్రాల్లో కీలక ప్రాముఖ్యత సంతరించుకుంది.
విదేశీ ఆవు | భారతీయ (దేశీయ) ఆవు |
---|---|
విదేశీ ఆవు | భారతీయ (దేశీయ) ఆవు |
ఇవి సంకరపరచగా వచ్చినవి (మానవుడు సృష్టించిన రకము) | వేదాలను అనుసరించి ఉన్న శరీర నిర్మాణం ఉంటుంది |
మూపురము(Hump) ఉండదు | మూపురము(Hump) ఉంటుంది |
గంగడోలు ఉండదు | మెడకి కాళ్ళకి మధ్యలో పెద్దదైన గంగడోలు ఉంటుంది |
ముఖము పై తెలుపు, నలుపు మచ్చలు ఉంటాయి | ముఖము పై మచ్చలు ఉండవు |
చెవులు చిన్నవిగా ఉండి అగ్రభాగం గుండ్రంగా ఉంటుంది | చెవులు పెద్దవిగా, పత్రాలవలె ఉండి, అగ్రభాగం మొనదేలి ఉంటాయి |
వీపు భాగం సమతలంగా ఉంటుంది | మూపురము ఉండడం వల్ల వీపు భాగం అర్ధ చంద్రాకృతి లో ఉంటుంది |
తోక పై భాగం సమతలంగా ఉంటుంది | తోక పై భాగం ఏటవాలుగా ఉంటుంది |
వీటి నుండి వచ్చే అన్ని ఉత్పత్తులు (పాలు,పెరుగు,నెయ్యి...మొదలగునవి అన్నీ...) నాసిరకమైనవి | వీటి నుండి వచ్చే అన్ని ఉత్పత్తులు (పాలు,పెరుగు,నెయ్యి...మొదలగునవి అన్నీ...) అసాధారణమైన విలువలు కలిగినవి |
విదేశీ ఆవుల డెక్కల నుండి ఏవిధమైన నునె శ్రవింపబడదు | దేశీయ ఆవుల డెక్కల నుండి ఒక రకమైన నూనె వెలువడి అది పడిన భూమిలో నత్రజని స్థాపన బాగా జరిగి భూమి సారవంతము అవుతుంది |
విదేశీ ఆవుల ద్వారా "గోరోచనము( Billary Concretion)" లభ్యం కాదు. | దేశీయ ఆవులు సహజం గా చనిపోయినప్పుడు వాటినుండి "గోరోచనము (Billary Concretion)" అనబడే ఒక దివ్య ఔషదం సేకరించవచ్చు. ఇది పక్షవాతాన్ని 100% తగ్గించే ఏకైక ఔషదం. |
గోపూజకు ఉత్తమ తిథులు / రోజులు
గోపూజకు ఉత్తమ తిథులు / రోజులు |
---|
గోపూజకు ఉత్తమ తిథులు / రోజులు |
ఆశ్వయుజ బహుళ ద్వాదశి (శ్రీపాద శ్రీ వల్లభ అవతార సమాప్తి రోజు లేదా గురుద్వాదశి) - దీనినే గోవత్స ద్వాదశి అనికూడా అంటారు |
గోకులాస్టమి |
కార్తీక మాసం మొత్తం |
దత్తజయంతి |
ప్రతీ పౌర్ణమి రోజున |
కపిలగోవు అనగా... |
---|
కపిలగోవు అనగా... |
ఎరుపు-నలుపు రంగుల కలయిక తో ఉన్న లేదా నలుపు-గోధుమ రంగుల కలయిక తో ఉన్న గోవులను కపిల గోవులు అంటారు |
ఈ గోవులు అరుదైనవి, ఖరీదైనవీ మరియు శ్రేష్టమైనవి కుడా |
కపిల గోవులు (ఇంటియందు కానీ, గుడులలో కానీ, మఠములలో కానీ) ఎక్కడుంటే అక్కడ అందరు దేవతలు కొలువై ఉంటారు ఈ గోవులు దైవరాకను గమనించే శరీర నిర్మాణాన్ని కలిగి ఉండడం విశేషం |
గంగిగోవు పాలు గరిటడైనను చాలు…
అమ్మ తరువాతి స్థానం ఆవుదే. అమ్మ పాలలోని పోషక విలువలు ఆవు పాలలోనూ ఉన్నాయి. ఆవుపాల విశిష్ఠతలను ఆయుర్వేద శాస్త్రం ఏనాడోవివరించింది. ఆవు పాలు అమృతంతో సమానం.అందుకే దేవుడికి నైవేద్యంగా ఆవుపాలను వాడుతారు. ప్రతి రోజూ ఒక గ్లాసు ఆవుపాలు తాగితే రోగాలు మన దరిచేరవు. ఆవుపాలలో రోగ నిరోధక శక్తికి అవసరమైన పొటాషియం, విటమిన్ ‘ఎ’ అధికంగా ఉంటుంది. అంతేకాదు కోలన్ కణాలు క్యాన్సర్‌కు గురికాకుండా ఉండాలంటే రోజూ ఆవుపాలు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతాయి. ప్రేగులలోని క్రిములు నశిస్తాయి. చదువుకునే పిల్లలకు మనస్సుతో పనిచేసే వ్యక్తులకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయి. మనస్సును బుద్ధిని చైతన్యవంతం చేస్తాయి. సాత్విక గుణమును పెంచుతాయి. సాధువులు, ఋషులు, మునులు ఆవుపాలనే సేవిస్తారు. యజ్ఞమునకు, హోమమునకు ఆవుపాలను వాడతారు. దేవాలయాలలో పూజకు, అభిషేకానికి ఆవుపాలు వాడుతారు. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని కార్తిక పురాణంలో చెప్పబడింది. గోవు దేవతా స్వరూపం. కైలాసం దగ్గరలోని గోలోకంనుంచి వచ్చింది. ఆవుపాలు, ఆవు నెయ్యితో మనకు దేవతా శక్తి వస్తుంది. ఆవు పాలలో బంగారం వుంది. ఆవు మూపురంలో స్వర్ణనాడి వుంది. ఈ నాడి సూర్యకిరణాలతో ఉత్తేజమై బంగారుతత్వం అనే ఒక పసుపు పచ్చని పదార్థాన్ని పాలలోకి వదులుతుంది. అందువల్ల ఆవుపాలు పసుపు పచ్చగా వుంటాయి.
‘ఘృతేన వర్థతే బుద్ధి క్షీరేణాయుష్య వర్థనం’
ఆవు నెయ్యి బుద్ధిబలమును పెంచుతుంది. ఆవు పాలు ఆయుష్షును పెంచుతాయి. ఆవు పాలలో విషాన్ని హరించే శక్తి వుంది. ఛాందోగ్య ఉపనిషత్ ప్రకారం మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న మొదలైన వాటిలో స్థూలభాగం శరీరంలోని ఎముకలుగా మారుతుంది. మధ్యభాగం మజ్జ (మూలుగ)గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన ఎముకలు, మజ్జ,సాత్వికము మరియు శ్రావ్యమైన వాక్కు కోసం ఆవునెయ్యి, వెన్న తప్పక తీసుకోవాలి. భారతీయ గోవుకు మూపురం వుంటుంది. ఈ మూపురం లోని వెన్నుపూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి వుంది. అందువలన ఈ ఆవు పాలు, నెయ్యి, వెన్నలకు పైన చెప్పిన ప్రత్యేక గుణములున్నాయి. విదేశి గోవులకు మూపురం వుండదు. అవి సూర్యశక్తిని గ్రహించలేవు. అందువలన వాటి పాలు మంచివి కావు. విదేశి గోవుల నుండి తీసే పాలను A1 Milk గా, భారతీయ (దేశీయ ఆవు) గోవుల నుండి తీసే పాలను A2 Milk గా పిలుస్తారు. A1 పాల ధర కంటే A2 పాల ధర అధికము మరియు పోషక విలువల పరంగా కుడా A2 Milk చాలా మంచివి. చాలా దేశాలలో పాల బాటిల్స్ మీద ఈ విషయాన్ని కంపెనీలు స్పష్టంగా ముద్రిస్తున్నాయి కుడా! ఇక రసాయన (Chemistry) శాస్త్ర పరంగా చూస్తే A1 Milk అమినోఆసిడ్స్ చైన్లో 67 వ స్థానం లో హిష్టిడైన్ ఉంటుంది కాగా A2 Milk అమినోఆసిడ్స్ చైన్లో 67 వ స్థానం లో ప్రోలైన్ అనే α- అమినోఆసిడ్ ఉంటుది. పాల ప్రోటీన్ లో అమినోఆసిడ్స్ చైన్లో 67 వ స్థానం లో ప్రోలైన్ ఉంటే అటువంటి పాలనే సహజసిద్ధమైన మరియు అసలైన (Original Cow Milk) ఆవుపాలగా పరిగణించాలి. ఆ నిర్మాణం మన భారతీయ ఆవుపాలలో ఉన్నట్లుగా పరిశోదనాత్మకంగా నిరూపించబడినది.
A1 & A2 పాల రసాయన నిర్మాణం (Chemical Structure of A1 & A2 Milk)…
A1 Milk | A2 Milk |
---|---|
A1 Milk | A2 Milk |
Jersey,British White,Holstein,Tasmanian Grey వంటి మూపురం లేని విదేశీ / సంకర(Hybrid) ఆవుల నుండి ఈ పాలు తీస్తారు. వీటిలో కపిలగోవు రకాలు ఉండవు. | Ongole, Malenadu Gidda, Nagori, Nimari, Rati, Sahiwal, Sindhi, Tharparker, Umblachery, Vechur, Gir, Hallikaru, Hariana, Jawari, Kangayam, Kankrej, Kasaragod, Khilari, Krishna, Malavi, Amrithmahal, Baragur, Dangi, Deoni, Gaoloa వంటి దేశవాళీ మూపుర సహిత గోవుల నుండి ఈ పాలను సేకరిస్తారు. వీటిలో కపిలగోవు రకాలు ఉంటాయి. |
A1 Milk అమినోఆసిడ్స్ చైన్లో 67 వ స్థానం లో హిష్టిడైన్ ఉంటుంది | A2 Milk అమినోఆసిడ్స్ చైన్లో 67 వ స్థానం లో ప్రోలైన్ అనే α- అమినోఆసిడ్ ఉంటుది. |
ఈ పాలలో 15-% దాకా ప్రోటీన్లు A1 Beta casin రూపము లో ఉంటాయి | ఈ పాలలో ౩౦% దాకా ప్రోటీన్లు A2 Beta casin రూపము లో ఉంటాయి |
పసిపిల్లలకి, పిల్లలకి, వృద్ధులకి బాగా జీర్ణము కావు | పసిపిల్లలకి, పిల్లలకి, వృద్ధులకి బాగా జీర్ణము అవుతాయి |
ఎక్కువ కాలము వాడుటవలన మోకాళ్ళ నొప్పులు , డయాబిటిస్ Type-1 , గ్యాస్ ట్రబుల్, విరేచనములు , చర్మ రోగములు కలగటానికి ఆస్కారం ఉంది | ఈ పాలను ఎంత ఎక్కువ కాలం వాడితే అన్ని మంచి గుణాలు కనిపిస్తాయి. |
పూర్వ కాలంలో గోవులెన్ని ఎక్కువ ఉంటే వారే శ్రీమంతులుగా ఉండేవారు. గోధనమే నిజధనంగా భావించేవారు. గోధనంలేని రాజ్యం క్షీణిస్తుందనే భావనయుండేది. అందుకనే పాండవులకి అరిష్టం కలిగించాలని ఉత్తర గోగ్రహణ(విరాట పర్వం) జరిపిస్తాడు దుర్యోధనుడు. గో సంతానంలో కొన్ని పొలం దున్ని ఆహారోత్పత్తికై సహాయపడితే మరికొన్ని పాలను ప్రసాదించి మానవాళికి వాటి ద్వారా రోగనిరోధక శక్తి ప్రసాదిస్తాయి. గోవును పూజించి ముమ్మారు ప్రదక్షిణ చేస్తే సర్వ పాపాలు హరిస్తాయి. గోధూళిని మనము నొసట ధరించిన సమస్త పాపములు హరించునని ప్రతీతి.
100% నేటికీ పనిచేసే వింత చికిత్స – గోధూళి చికిత్స…
ఆయుర్వేద శాస్త్ర౦లో కొన్ని చికిత్సా విధానాల ప్రకార౦ ఆవులమ౦ద (గోసముహము) మధ్యలో చర్మ రోగాలు వచ్చిన రోగిని నిలబెట్టి / నివసి౦పచేయట౦… ఆయా సమయాల్లో రేగిన గోధూళి రోగి శరీర౦పైబడి రోగనివారణ జరగడ౦ సూచి౦పబడి౦ది. ఈ విధానంతో మొండి చర్మ వ్యాధులను నేటికీ 100% తగ్గిస్తున్నారు ఆయుర్వేద వైద్యులు.
పంచగవ్యాలు అనగా?..... |
---|
పంచగవ్యాలు అనగా?..... |
II గోమూత్రం గోమయంచైవ క్షీరదధి ఘృతం తథా! పంచరాత్రం తదాహారం పంచగవ్యేన శుద్ధ్యతి II - వశిష్ఠ స్మృతి - 11-380 |
1. ఆవు పేడ 2. ఆవు మూత్రం 3. ఆవు పాలు 4. ఆవు పెరుగు 5. ఆవు నెయ్యి |
గోమహత్యము
గోవు యొక్క దేహభాగం / పూజా సమయం | కొలువుండే దేవతలు / దేవుళ్ళు / పూజా ఫలం |
---|---|
గోవు యొక్క దేహభాగం / పూజా సమయం | కొలువుండే దేవతలు / దేవుళ్ళు / పూజా ఫలం |
గోపాదాలు | పితృదేవతలు |
పిక్కలు | గుడి గంటలు |
అడుగులు | ఆకాశగంగ |
ముక్కొలుకులు | ముత్యపు చిప్పలు |
పొదుగు | పుండరీకాక్షుడు |
స్తనములు | చతుర్వేదములు |
గోమయము | శ్రీ లక్ష్మి |
పాలు | పంచామృతాలు |
తోక | తొంబది కోట్ల ఋషులు |
కడుపు | కైలాసము |
బొడ్డు | పొన్నపువ్వు |
ముఖము | జ్యేష్ఠ |
కొమ్ములు | కోటి గుడులు |
ముక్కు | సిరి |
కళ్ళు | కలువ రేకులు |
వెన్ను | యమధర్మరాజు, |
చెవులు | శంఖనాదము |
నాలుక | నారాయణ స్వరూపము |
దంతాలు | దేవతలు |
పళ్ళు | పరమేశ్వరి |
నోరు | లోకనిధి |
ప్రాతఃకాల గో దర్శనం | శుభప్రదము |
మధ్యాహ్న కాల దర్శనం | వెయ్యి గుళ్ళల్లో దీపారాధన చేసిన ఫలము |
రాత్రి పూట గో పూజ | యమబాధలు వుండవు |
సంధ్యవేళ గో దర్శనం | ఇంటికి శ్రీ మహాలక్ష్మి స్వయముగా విచ్చేస్తుంది. |