Kadaganchi
కడగండ్లు తీర్చే కరుణపాదుకా దత్తక్షేత్రం ‘కడగంచి’
Karuna Paaduka DattaKshetram ‘Kadaganchi’
కడగంచి గ్రామం ఎక్కడుంది?
కడగంచి గ్రామం లో గల దత్త క్షేత్రాన్ని ‘ శ్రీ సాయందేవ కరుణపాదుకా దత్త క్షేత్రం’ అంటారు. ఇక్కడ ఉండే దత్తాత్రేయుడు ‘సుందర దత్తాత్రేయుడు’ ఇక్కడ గల శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలను ‘కరుణ పాదుకలు’ అంటారు. కడగంచి గ్రామం కర్ణాటక రాష్ట్రం లో అలంద్ తాలుకా గుల్బర్గా జిల్లలో కలదు. జిల్లా కేంద్రమైన గుల్బార్గాకు 20 కిలోమీటర్ల దూరంలో, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో అలంద్ – షోలాపూర్ స్టేట్ హైవే పైన ఉన్న గొప్ప దత్త క్షేత్రమిది. అలాగే ప్రముఖ దత్త క్షేత్రమైన దేవల్ గాణ్గాపూర్ కు 35 కిలోమీటర్ల దూరం లో ఈ ‘కరుణపాదుకా’ దత్తక్షేత్రం కలదు.
కడగంచి గ్రామం ను ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుండి కడగంచి గ్రామానికి రూట్ (హైదరాబాద్ To కడగంచి 230 కీ.మీ.) |
---|
హైదరాబాద్ నుండి కడగంచి గ్రామానికి రూట్ (హైదరాబాద్ To కడగంచి 230 కీ.మీ.) |
మెహిదీపట్నం ---> లంగర్ హౌస్ --->చిలుకూరు రోడ్డు---> మొయినాబాద్---> చేవెళ్ల---> మన్నేగుడా -X- రోడ్ (ఇక్కడ ఎడమ చేతి వైపు వెళ్ళాలి)--->పరిగి--->కోడంగల్---> రావులపల్లి (ఇండియన్ ఆయిల్ పెట్రోల్ దగ్గర కుడిచేతి వైపు తీసుకోవాలి)---> కర్ణాటక స్టేట్ హైవే (ఇక్కడ కర్ణాటక స్టేట్ హైవే పైగల మొదటి టోల్ ప్లాజా లో రూ.70/- టోల్ టాక్స్ కట్టాలి (ఒక వైపు 4 వీలర్ కి), ఇదే స్టేట్ హైవే పైగల రెండవ టోల్ ప్లాజా లో మొదటకట్టిన రిసీట్ ను చూపించాలి)---->సేడాం--->మల్ఖేడ్---> గుల్బర్గా ఎయిర్ పోర్ట్---> గుల్బర్గా యూనివర్సిటీ (Left Side లో వస్తుంది)---> గుల్బర్గా ESI మెడికల్ & డెంటల్ కాలేజీ (Left Side లో వస్తుంది)----> గుల్బర్గా ESI మెడికల్ & డెంటల్ కాలేజీ దాటగానే వచ్చే చౌరాస్తా లో ఎడమవైపు రోడ్డు తీసుకోవాలి---> అక్కడనుండి దాదాపు 10 కీ.మీ. లకి గుల్బర్గా హైకోర్ట్ బెంచ్ వస్తుంది (Left Side లో వస్తుంది) ----> గుల్బర్గా హైకోర్ట్ బెంచ్ ----> అంబేద్కర్ సర్కిల్ ----> చెక్ పోస్ట్ బస్ స్టాప్ సర్కిల్ ----> చెక్ పోస్ట్ బస్ స్టాప్ సర్కిల్ దగ్గర ఎడమ చేతివైపు రోడ్ తీసుకోవాలి ----> అలంద - షోలాపూర్ స్టేట్ హైవే ----> అలంద - షోలాపూర్ స్టేట్ హైవే టోల్ ప్లాజా ----> సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్నాటక ----> కడగంచి బస్సు స్టాండ్ (ఎడమ చేతివైపు వస్తుంది) ----> కడగంచి గ్రామం. |
గాణుగాపురము/ దేవల్ గాణ్గాపూర్ నుండి కడగంచి గ్రామానికి రూట్ (గాణ్గాపూర్ To కడగంచి 34 కీ.మీ.) |
---|
గాణుగాపురము/ దేవల్ గాణ్గాపూర్ నుండి కడగంచి గ్రామానికి రూట్ (గాణ్గాపూర్ To కడగంచి 34 కీ.మీ.) |
గాణ్గాపూర్ ----> చౌడాపూర్ కమాన్ ----> కమాన్ దగ్గర స్ట్రైట్ రోడ్డు తీసుకోవాలి ----> చౌడాపూర్ బస్సు స్టేషన్ ----> గాణ్గాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్ ----> అలంద - షోలాపూర్ స్టేట్ హైవే ----> అలంద - షోలాపూర్ స్టేట్ హైవే మీదకి రాగానే ఎడమ చేతివైపు వెళ్ళాలి ----> కడగంచి బస్సు స్టాండ్ (ఎడమ చేతివైపు వస్తుంది) ----> కడగంచి గ్రామం. |
గుల్బర్గా నుండి కడగంచి గ్రామానికి రూట్ (గుల్బర్గా To కడగంచి 20 కీ.మీ.) |
---|
గుల్బర్గా నుండి కడగంచి గ్రామానికి రూట్ (గుల్బర్గా To కడగంచి 20 కీ.మీ.) |
గుల్బర్గా ----> గుల్బర్గా హైకోర్ట్ బెంచ్ ----> అంబేద్కర్ సర్కిల్ ----> చెక్ పోస్ట్ బస్ స్టాప్ సర్కిల్ ----> చెక్ పోస్ట్ బస్ స్టాప్ సర్కిల్ దగ్గర ఎడమ చేతివైపు రోడ్ తీసుకోవాలి ----> అలంద - షోలాపూర్ స్టేట్ హైవే ----> అలంద - షోలాపూర్ స్టేట్ హైవే టోల్ ప్లాజా ----> సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్నాటక ----> కడగంచి బస్సు స్టాండ్ (ఎడమ చేతివైపు వస్తుంది) ----> కడగంచి గ్రామం. |
కడగంచి గ్రామం లో గల శ్రీ సాయందేవ కరుణపాదుకా దత్తక్షేత్రాన్ని ను ఎప్పుడు దర్శించుకోవాలి?
కడగంచి గ్రామం లో గల శ్రీ సాయందేవ కరుణపాదుకా దత్తక్షేత్రాన్ని సంవత్సరంలో ఏరోజైనా దర్శించుకోవచ్చు. ఇక్కడ గల దత్తాత్రేయుని విగ్రహం (నల్లరాతి) మెరిసిపోతూ, అత్యంత సుందరంగా ఉండడం వల్ల ఈ దత్తాత్రేయుడిని ‘సుందర దత్తాత్రేయుడు’ అంటారు.
కడగంచి గ్రామం లో గల శ్రీ సాయందేవ కరుణపాదుకా దత్త క్షేత్రం ప్రత్యేకత ఏంటి?
కడగంచి గ్రామం లో గల శ్రీ సాయందేవ కరుణపాదుకా దత్త క్షేత్రం ప్రత్యేకత ఏంటి? |
---|
కడగంచి గ్రామం లో గల శ్రీ సాయందేవ కరుణపాదుకా దత్త క్షేత్రం ప్రత్యేకత ఏంటి? |
1. శ్రీ గురు చరిత్ర 13వ అధ్యాయం లో చెప్పబడిన 'వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం (బాసర)' యొక్క గ్రామాధికారి అయిన శ్రీ సాయందేవ (సాకరే) స్వగ్రామమే కడగంచి. ఈ గ్రామాన్ని పూర్వం 'కన్నడ కాంచీపురం' అనే వారు. |
2. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు వేంచేసిన శ్రీ సాయందేవుల వారి స్వగృహాన్ని (నూతనంగా మార్పుచేయబడిన) నేటికి ఇక్కడ మనం దర్శించవచ్చు. |
3. శ్రీ సాయందేవుల వారి మునిమనవడైన శ్రీ గంగాధర సరస్వతి (నామధరకుడు) కడగంచి లోని శ్రీ సాయందేవుల వారి స్వగృహము లోనే శ్రీ గురుచరిత్ర ను వ్రాసారు. శ్రీ గురుచరిత్ర వ్రాయబడిన దివ్య క్షేత్రమిది. |
4. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు శ్రీ సాయందేవునికి ఇచ్చిన 'కరుణ పాదుకలను' ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. |
కడగంచి శ్రీ సాయందేవ కరుణపాదుకా దత్త క్షేత్రం ఫోటోలు
ఏమేమి తీసుకెళ్ళాలి?
శ్రీ సాయందేవ కరుణపాదుకా దత్త క్షేత్రం చుట్టుపక్కల అందుబాటులో ఏమి దొరకవు. కాబట్టి పూజా సామగ్రి, పాదుకలకు లేపనంగా గంధమును తీసుకోని వెళ్ళాలి. ఈ క్షేత్రానికి గోశాల కుడా కలదు. కాబట్టి గోపూజ చేయించు కోవాలను కునే వారు గోపుజా సామగ్రిని కుడా తీసుకెళ్ళడం మంచిది.
కడగంచి శ్రీ సాయందేవ దత్త మందిరం లో లబించే సౌకర్యాలు
కడగంచి శ్రీ సాయందేవ దత్త మందిరం లో భక్తులకు, సాధకులకు లబించే సౌకర్యాలు |
---|
కడగంచి శ్రీ సాయందేవ దత్త మందిరం లో భక్తులకు, సాధకులకు లబించే సౌకర్యాలు |
ఉండడానికి పూర్తి ఉచిత వసతి ( కరుణ పాదుకా క్షేత్రం ఎదురుగా భక్తనివాస్ లో రూములు ఉచితంగా ఇస్తారు) |
ఉచిత భోజన సౌకర్యం (క్షేత్రానికి చేరుకోబోయే ఒక గంట ముందుగా బోజన పదార్ధాలు తయారు చేయమని మానేజమెంట్ వారికి ఫోన్ లో చెప్పాలి Ph: 09740625679 / 09901178593) |
క్షేత్రం లో ఉండి పారాయణ చేసుకోవడానికి పూర్తి ఉచిత పారాయణ హాలు సౌకర్యం (ఒకప్పటి భూగృహం ఇప్పుడు పారాయణ హాలుగా మార్చబడినది. ఇక్కడ చక్కటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాలరాతి విగ్రహం ప్రతిష్టించారు) |
ఉచిత గోపుజా సౌకర్యం |
కొసమెరుపు: ఇక్కడగల కరుణపాదుకలను భక్తులందరూ చేతిలోకి తీసుకోవచ్చు. భక్తితో మనమే గంధలేపనం చేయవచ్చు, కావలసినన్ని ఫోటోలు తీసుకోవచ్చు. ఇక్కడ భక్తులదీ, సాధకులదే ఇష్టారాజ్యం. ప్రేమతత్వం అణువణువునా కనిపించే దివ్యక్షేత్రం. |
ఆశ్చర్యపరిచే ప్రత్యక్ష నిదర్శనాలు…
శ్రీ వాసుదేవానంద సరస్వతి (టెంబే స్వామి) కడగంచి శ్రీ సాయందేవ కరుణపాదుకా దత్తక్షేత్రం ను దర్శించి, ఎంతో సంతోషించి, శ్రీ గురుచరిత్ర వ్రాయబడిన ఆ ఇంటి నుండే ‘ఘోరకస్తోద్ధరణ స్తోత్రము’ను వ్రాసారు. నేటికి వారు స్వహస్తాలతో వ్రాసిన ఆ స్తోత్రం యొక్క అసలు ప్రతిని (Original Copy) శ్రీ సాయందేవుని గృహం లో మనం చూడవచ్చు.
కడగంచి శ్రీ సాయందేవ దత్త మందిరం & కరుణపాదుకా దత్త క్షేత్ర నిర్వాహకుల సమాచారం
కడగంచి శ్రీ సాయందేవ దత్త మందిరం & కరుణా పాదుకా దత్త క్షేత్ర నిర్వాహకుల సమాచారం |
---|
కడగంచి శ్రీ సాయందేవ దత్త మందిరం & కరుణా పాదుకా దత్త క్షేత్ర నిర్వాహకుల సమాచారం |
1. Sri Kadaganchi Appa Saab / ShivSharanappa (శ్రీ కడగంచి అప్పాసాబ్ / శివశరణప్ప ) - 09740625679 / 08477-226103 |
2. Sri Viswanath - Manager (శ్రీ విశ్వనాథ్ - మానేజర్) - 09901178593 |
కడగంచి సాయందేవ దత్త క్షేత్రం పోస్టల్ అడ్రస్
కడగంచి సాయందేవ దత్త క్షేత్రం పోస్టల్ అడ్రస్ (Postal Address of Kadaganchi Sayamdeva Dattakshetram) |
---|
కడగంచి సాయందేవ దత్త క్షేత్రం పోస్టల్ అడ్రస్ (Postal Address of Kadaganchi Sayamdeva Dattakshetram) |
Sri Sayamdeva Datta Kshetram, Kadaganchi Post, Aland Tal, Gulbarga Dist - 585311, Karnataka. Ph: 09740625679 / 08477-226103 |
కడగంచి కి దగ్గర లోగల ఇతర దర్శనీయ ప్రదేశాలు
కడగంచి కి దగ్గర లోగల ఇతర దర్శనీయ ప్రదేశాలు |
---|
కడగంచి కి దగ్గర లోగల ఇతర దర్శనీయ ప్రదేశాలు |
1. గాణుగాపురము/ దేవల్ గాణ్గాపూర్ - 35 కీ.మీ. |
2. గుల్బర్గా మినీ జూ పార్క్ & టాయ్ ట్రైన్ - 20 కీ.మీ. (చిరు మృగాలయ, మున్సిపల్ పార్క్ దగ్గర అని అడగాలి) |
3. కుమసి గ్రామం (విశ్వరూప దత్త పాదుకలు) - 55 కీ.మీ. |
4. అక్కల్కోట్ - 85 కీ.మీ. |
5. లాడ్ చించోలి (శ్రీధర స్వామి జన్మభూమి - Ph:08477-294008 / 08477-226208 ) - కేవలం 03 కీ.మీ. (ఫోన్ చేసి వెళ్ళడం మంచిది) |