Krishnaamalakam (కృష్ణామలకము/నల్ల ఉసిరి వృక్షం)
Krishnaamalakam (కృష్ణామలకము/నల్ల ఉసిరి వృక్షం)
Nomenclature (నామాంక్లేచర్ - నామీకరణము) |
---|
పేరు : ఉసిరి చెట్టు / అమలక వృక్షం / ధాత్రి వృక్షం |
ఇంగ్లీష్ పేరు : ఇండియన్ గూస్ బెర్రీ (Indian Gooseberry) |
శాస్త్రీయ నామము / లాటిన్ పేరు : ఫిలాంథస్ ఎంబ్లికా / ఎంబ్లికా అఫిసినాలిస్ (Emblica officinalis) |
కుటుంబము : ఫిలాంథేసి (యూఫోర్బియేసి - Euphorbiaceae) |
కృష్ణామలక వృక్షం త్రిమూర్తి స్వరూపము. కృష్ణామలక వృక్ష దర్శనమే సర్వపాప క్షయకరం . ఈ వృక్షం గురు దత్తాత్రేయుల వారికి ప్రియమైనది. అందువల్లే మహారాష్ట్ర లోని మాహుర్ (మాతాపురం) నకు దాదాపుగా 5 కీ.మీ దూరం లో గల సహ్య్యద్రి పర్వతాలలో ఉన్న శ్రీ గురుదత్తాత్రేయుల వారు నివసించే ప్రాంతాన్ని ” అమలకాశ్రమము లేదా అమలకీ గ్రామము ” అని అంటారు.
ప్రదక్షణ మరియు పూజించు విధానము
కృష్ణామలక వృక్షాలు బహు అరుదు . వాటి స్థానంలో సాధారణ అమలక వృక్షాన్ని కూడా పూజించవచ్చు. పూజా విధానం, ప్రదక్షణ విధానం అన్నివిధాలా అశ్వత్ధ వృక్షాన్ని పోలి ఉంటాయి .
అమలక వృక్ష పూజా ఫలము
క్షీరాబ్ధి ద్వాదశి (తులసిమాత వివాహ దినోత్సవం ) నాడు ఉసిరి కాయలతో దత్తత్రేయునికి దీపారాధన చేస్తే చాల పుణ్యఫలం దక్కుతుంది. అలాగే కార్తిక మాసంలో ఉదయం పూట ఉసిరి పత్రాలతో శ్రీ పాదులవారికి / దత్తత్రేయునికి పూజ చేస్తే ధనధాన్య వృద్ధి కలుగుతుంది. అమలక వృక్షానికి ప్రదక్షణ లు చేస్తే పునర్జన్మ ఉండదని సాక్షాత్తు దత్తత్రేయులవారే ప్రకటించారు.