Kuruvapuram (కురువపురం/కురుగడ్డ/కురుంగడ్డ)
Kuruvapuram
(కురువపురం/కురుగడ్డ/కురుంగడ్డ)
Krishna Pushkar Ghats At Kuruvapuram
S.No | Pushkar Dip Place / Pushkar Ghat | Nearest Dattatreya Temple / Holy Place | Facilities / Importance |
---|---|---|---|
S.No | Pushkar Dip Place / Pushkar Ghat | Nearest Dattatreya Temple / Holy Place | Facilities / Importance |
01 | Vittal Baba Ashramam, Sripada Sri Vallabhapuram | Dattatreya Temple In Vittal Baba Ashramam, Bhaskara Banda, Sahaja Vinayaka & Samadhi Mandir | Free Accommodation, Food, Free Parking, Toilets, Pushkar Ghat Facility With Life Guards, Dress Changing Rooms, Butti Station To Reach Kuruvapuram / Narada Gadda, Pujari Available for Puja & Daana |
02 | Vata Vruksham(Marri - Banyan Tree) Pushkar Ghat, Kuruvapuram | Sripada Temple Under Vata Vruksham | Free Accommodation, Food,Toilets, Dress Changing Rooms. |
03 | Kuruvapuram Main Entrance / Kamaan | Sripada Siddhaasana Sthaanam Temple (Kuruvapuram Temple) | Free Accommodation, Food,Toilets, Dress Changing Rooms. |
04 | Narada Gadda (Island) | Swayambhu Shivalingam (Narada Pratistitha) Devotees can take Special Butti To Reach Narada Gadda FromVittal Baba Asharamam | Very Holy and Very Less Crowded Powerful Place |
05 | Krishna Pushkar Ghat Towards Atukur Side | Kurvapur Temple | Free Accommodation, Food, Free Parking, Toilets, Pushkar Ghat Facility, Dress Changing Rooms, Butti Station To Reach Kuruvapuram Pujari Available for Puja & Daana |
06 | Krishna Pushkar Ghat Under Railway Bridge, Deosugur - Raichur 20 KMs From Makthal | Dattatreya Temple (Yellamma Temple Road), Near Railway Bridge - Deosugur | Very Less Crowd, Many Star Hotels Available on Reasonable Rates, Free Parking, Toilets, Pushkar Ghat Facility, Dress Changing Rooms, Pujari Available for Puja & Daana |
కురువపురం/కురుగడ్డ/కురుంగడ్డ
శ్రీపాద శ్రీ వల్లభుల వారి యోగ స్థలం కురువపురం/కురుగడ్డ/కురుంగడ్డ అనే ప్రాంతం. ఈ ప్రాంతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులలో గలదు. శ్రీపాద శ్రీ వల్లభులు 16వ యేట నుండి 30 సంవత్సరములు వచ్చునంత వరుకు అంటే దాదాపు 14 సంవత్సరాలపాటు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ వారు ఒక మహాయోగి ఆచరించవలసిన అన్ని విధివిధానాలను ఆచరించి అనేక మంది మహామహా యోగులకే ఆదర్శంగా నిలిచారు. ఇక్కడే శ్రీపాద శ్రీ చరణులు ఆశ్వీయుజ మాస కృష్ణ ద్వాదశి, హస్తా నక్షత్రం రోజున కృష్ణా నదిలో అంతిర్హితులైరి. కురువపురం/కురుగడ్డ/కురుంగడ్డ అనే ప్రాంతం చుట్టూరా కృష్ణానదితో ఉండే దీవి. నాటి నుండి నేటి వరుకు ఈ దీవికి చేరాలంటే బుట్టి ద్వారా మాత్రమే చేరగలం. కురుంగడ్డ లో ఎక్కడైతే శ్రీపాదుల వారు సిద్దాశనం లో కుర్చున్నారో అక్కడ ప్రస్తుతం గుడి కలదు. ఆ సిద్దాశన స్థానానికి భక్తులు ఉదయం తొమ్మిదిగంటల లోపైతే అభిషేకం చేయించుకోవచ్చు. ఇక్కడ పురాతన వట వృక్షం, దాని క్రింద ప్రతిష్టిత మైన శ్రీపాదుల వారి పాలరాతి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. దీనికి దగ్గరలోనే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు తపస్సు చేసుకున్న గుహను, అందులోని శివలింగాన్ని చూసి తరించవచ్చు.
కరువపురం – చారిత్రాత్మక వివరణ
పూర్వం ఋషీశ్వరులను (కాలనాగులు) పరీక్షింపదలచిన దత్తాత్రేయుడు అకస్మాత్తుగా నది నీటిలో మునిగి తమ రూపాన్ని కొద్ది సంవత్సరాలు గుప్తపరిచారు. తిరిగి అనేక సంవత్సరాల తరువాత నదినుండి అనఘాసమేతుడై చేతిలో మధుపాత్రతో బయటకువచ్చిరి. వారి లీలలు అమోఘములు. దత్తాత్రేయుల వారు ఆనాడు ఎచ్చట నీటమునిగిరో ఆ ప్రదేశమే నేటి కురువపురం /కురుగడ్డ/కురుంగడ్డ. ‘కురు’ మహారాజుకు జ్ఞానోపదేశం జరిగిన ప్రాంతమే ఈ కురువపురమనెడి పవిత్ర స్థలం. ఈ కురుపురం యొక్క మహత్యమును వర్ణించుటకు ఆదిశేషునకైనను వీలుకాదు. ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభులు జలసమాధి లో ఉండగా ఇచ్చటనే కాలనాగులు యోగ సమాధిలో ఉన్నవి.
కురుంగడ్డ లోని శ్రీపాద శ్రీ వల్లభ గుడి
కురుంగడ్డ లోని శ్రీపాద శ్రీ వల్లభ సిద్ధాసన స్థానం
కురువపురం లోని పురాతన వట వృక్షం దాని క్రింద గల శ్రీపాద వల్లభ విగ్రహ స్థానం
కురువపురం లోని పురాతన వట వృక్షం దాని క్రింద గల పాలరాతి శ్రీపాద వల్లభ విగ్రహం
కురుంగడ్డ లోని శ్రీపాద శ్రీ వల్లభ గుడి గోడలపై కనిపించే వివిధ దత్తచిత్రాలు
విషయము | వివరణ |
---|---|
గుడి తెరిచే సమయం | ఉ.04.30 నుండి మ.12.00 వరుకు సా.04.00 నుండి రా.07.30 వరుకు |
గుడి ఫోన్ నెంబర్ | 08532280570 / 09731827546 |
రూట్ (హైదరాబాద్ నుండి) | శంషాబాద్ --> జడ్చర్ల -->మహబూబ్ నగర్ --> రాయిచూర్ రోడ్డు -->దేవరకద్ర --> మఖ్తల్ -->పంచదేవ పహాడ్ -->అక్కడ నుండి బుట్టి (Small Elliptical Boat) ద్వారా కృష్ణా నదిలో ప్రయాణం చేసి కురువపురం చేరవచ్చు. |
కురువపురం లో జరిగే ముఖ్య పూజలు-ఉత్సవాలు | కురువపురం లో ప్రతీ రోజు ఉ.05.00 నుండి ఉ.09.00 వరుకు - అభిషేకం, ఉ.09.00 నుండి ఉ.11.30 వరుకు - అలంకారదర్శనం, మ.12.00 - మహానైవేద్యం, రా. 07.30 - పల్లకీ సేవ. ఇవికాక భాద్రపద శుద్ధ చవితి - శ్రీపాద వల్లభ జయంతి, ఆశ్వీయుజ బహుళ ద్వాదశి - గురుద్వాదశి (శ్రీపాదుల గుప్తదినం), దత్త జయంతి , మాఘ బహుళ పాడ్యమి - శ్రీ నృసింహ సరస్వతి గుప్తదినం వంటి ఉత్సవాలు కుడా జరుగుతాయి. |
ఇతర దర్శనీయ ప్రదేశాలు | నారద గుట్ట (బుట్టి లో వెళ్ళాలి), పంచదేవ పహాడ్ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయ ప్రాంగణం లో గల శ్రీ పాద శ్రీ వల్లభ దర్బార్ & అక్కడే గల అనఘ దత్త దేవాలయం, పంచదేవ పహాడ్ కు 1 కీ. మీ. ముందు గల శ్రీ విట్టల్ బాబా గారి ఆశ్రమం & అక్కడే గల దత్త దేవాలయం, వల్లభేశ వృత్తాంతం జరిగిన ప్రదేశమైన మంథన్‌గౌడ్ (వల్లభాపురం) గ్రామం లోగల శ్రీపాద హస్త మరియు పాదముద్రలు. |
పంచదేవపహాడ్
ఐదు (5) మంది దేవతా మూర్తులు కొలువైఉన్న చారిత్రాత్మక పురాణ ప్రసిద్ధ ప్రాంతం ‘పంచదేవ పహాడ్’ ఇక్కడ గల ఐదు దేవతామూర్తులు వరుసగా 1. రుక్మిణి సహిత పాండురంగ స్వామి 2. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 3. ఆంజనేయ స్వామి 4. రాఘవేంద్ర స్వామి మరియు 5. విఘ్నేశ్వరుడు. వీరంతా కొలువైఉన్న ఈ గ్రామం అతి పురాతన మైనదని చెప్పుటకు చాలా ఆధారాలు కలవు. శ్రీపాద శ్రీ వల్లభుల వారు తరచుగా ఇక్కడే వారి దర్బార్ ను జరిపినట్లు ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఎక్కడైతే రుక్మిణి సహిత పాండురంగ స్వామి దేవాలయం ఉందో అక్కడే శ్రీపాద శ్రీ చరణులు దర్బార్ జరిపేవారు. ఇక్కడ గల పాండురంగ స్వామి దేవాలయం క్రీ.శ.1238 లో బాగుచేయబడినది. అంటే అప్పటికి ఎన్నో ఏళ్ళకు ముందు నుండే ఆ దేవాలయం కలదు. ఇప్పుడు ఇదే దేవాలయ ప్రాంగణం లో అనఘ-దత్త దేవాలయం మరియు ’శ్రీ పాద శ్రీ వల్లభుల దర్బార్ ‘ కలవు. ఇచ్చట యాత్రికులు బస చేయుటకు వసతి కూడా కలదు. శ్రీపాదుల వారు ఎంతోమంది భక్తులకు గల వ్యక్తిగత సమస్యలను ఇక్కడనుండే తీర్చారు. కాబట్టి దత్త భక్తులందరూ దర్శించవలసిన ప్రదేశం. పాండురంగ స్వామి దేవాలయం కృష్ణానది కి దగ్గరలోనే ఉంటుంది, కాబట్టి అక్కడ నుండి కుడా కురువపురం కు బుట్టిల ద్వారా చేరుకోవచ్చు లేదా కురువపురం నుండి వచ్చేటప్పుడు పంచదేవ పహాడ్ చేరే బుట్టిలను ఎక్కి దర్శించుకోవచ్చు.
పంచదేవ పహాడ్ గ్రామం లో శ్రీపాద శ్రీ వల్లభ దర్బార్ లో గల చూడ చక్కనైన శ్రీపాదుల వారి విగ్రహం
పంచదేవ పహాడ్ గ్రామం లో రుక్మిణి – పాండురంగ దేవాలయ ప్రాంగణం లో గల శ్రీపాద శ్రీ వల్లభ దర్బార్
పంచదేవ పహాడ్ గ్రామం లో క్రీ.శ.1238 లో కట్టబడిన రుక్మిణి – పాండురంగ దేవాలయం. శ్రీపాద శ్రీ వల్లభ దర్బార్ జరిగింది ఇక్కడే.