Mandara Vruksham (మందార వృక్షం)
Mandara Vruksham (మందార వృక్షం)
Nomenclature (నామాంక్లేచర్ - నామీకరణము) |
---|
పేరు : మందార |
ఇంగ్లీష్ పేరు : చైనా రోస్ (China Rose) |
శాస్త్రీయ నామము / లాటిన్ పేరు : హైబిస్కస్ రోసా- సైనెన్సిస్ (Hibiscus- rosasinensis) |
కుటుంబము : మాల్వేసి (Malvaceae) |
ప్రదక్షణ మరియు పూజించు విధానము
మందార వృక్షం చుట్టూ 11 సార్లు నెమ్మదిగా గురుస్మరణ చేస్తూ ప్రదక్షణ పూర్తి చేయాలి. మంగళ. గురు, శని వారాలు ప్రసస్థమైన రోజులు. మన ఇంట్లో గల శ్రీపాద/ దత్త విగ్రహాలకు, పటాలకు మందార మొగ్గలను (అసంపూర్తిగా విచ్చుకున్న పుష్పాలు) అర్పించవచ్చు.
మందార వృక్ష పూజా ఫలము
మందార వృక్షానికి 11 రోజుల పాటు గురుస్మరణ చేస్తూ పూజిస్తే పరిక్షలలో, ఇంటర్వ్యూ లలో విజయం, చేతికి దక్కదనుకున్నది మనల్ని వెతుక్కుంటూ రావడం వంటివి జరుగుతాయి. విద్యార్ధులకి, జీవితంలో సరిగా సెటిల్ అవ్వని వారికి ఈ వృక్ష పూజ వల్ల చాలామంచి ఫలితం కనిపిస్తుంది.