Manika Maniharam’Mominpet’
Manika Maniharam ‘Mominpet’ - మాణిక మణిహారం ‘మొమిన్ పేట్’
శ్రీమాణిక..జయమాణిక..హరమాణిక..హరిమాణిక..చిన్మాణిక..సన్మాణిక..హరమాణిక..హరిమాణిక..చిన్మాణిక..సన్మాణిక..
భక్త కార్య కల్పద్రుమ గురుసార్వభౌమ..శ్రీ మద్రాజాధిరాజ యోగిమహారాజ,త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ
సదోదిత సకల మత స్థాపిత..సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్‌కీ జై…(Click Here for Audio)
* ఈ వెబ్ పేజ్ లోని కొన్ని విషయాలు మరియు కొన్ని ఫోటోలు www.srimanikprabhuji.org నుండి తీసుకోవడం జరిగింది.
శ్రీ మాణిక ప్రభుజీ గురించి…
శ్రీ మాణిక ప్రభుజీ/ మాణిక్ ప్రభు / మాణిక్య ప్రభువు గా పిలువబడే ‘మాణికరత్న నాయకుడు’ దత్తాత్రేయుని మొట్ట మొదటి అంశావతారము (మొట్ట మొదటి దత్తాత్రేయ సంపూర్ణ అవతారము: శ్రీపాద శ్రీ వల్లభ, రెండవ దత్తాత్రేయ సంపూర్ణ అవతారము: శ్రీ నృసింహ సరస్వతి, మూడవ దత్తాత్రేయ సంపూర్ణ అవతారము: స్వామి సమర్థ, అలాగే మొట్ట మొదటి దత్తాత్రేయ అంశావతారము: శ్రీ మాణిక ప్రభు, రెండవ దత్తాత్రేయ అంశావతారము: శ్రీ షిర్డీసాయి). ఈయనకు గల బిరుదు ‘భక్త కార్య కల్పద్రుమ’. బహుశా ఇటువంటి బిరుదు కలిగిన ఏకైక దత్తావతారం శ్రీ మాణిక ప్రభువే!. వీరు చేసే పనులు, మాటలు సూటిగా దత్తతత్వాన్ని చూపేవిగా ఉంటాయి. వీరు చేసిన, చూపిన లీలలు ఉహకందనివిగా, కాలాతీతంగా ఉంటాయి. శ్రీ మాణిక ప్రభు 22-December-1817 మంగళవారం, ఈశ్వరనామ సంవత్సరంలో ‘దత్తజయంతి’ నాడు మనోహర నాయకుడు, బయాదేవి దంపతులకి రెండవ సంతానంగా జన్మించారు. వీరు పుట్టింది గుల్బర్గా దగ్గరగల ‘కళ్యాణి’ లో. వీరి చిన్నతనంలోనే (4వ ఏటా) తండ్రిని కోల్పోవడంవల్ల మేనమామ వద్ద పెరిగారు. పెద్దవాడవుతున్నా కుటుంబ పరిస్థితిని పట్టించుకోకుండా అరణ్యాలవెంట తిరుగుతున్న ‘మాణిక’ని మామ మందలించడంతో, తను కట్టుకున్న కౌపీనాన్ని (గోచీ) కూడా విసర్జించి, మేనమామకు సాష్టాంగ నమస్కారంచేసి కళ్యాణి నగరాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆనాటి నుండి, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ, అద్భుత లీలలు ప్రదర్శిస్తూ, దత్తప్రవచనాలతో ప్రజల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతూ, ఎన్నో విషమపరీక్షలు ఎదుర్కొంటూ, జీవన ప్రయాణం చేస్తూవచ్చారు. ఒకనాడు వారు పల్లకిలో అడవి మార్గాన వస్తుండగా ఒకచోట అడవి తీగల మధ్యలో వారు కూర్చున్న పల్లకీ చిక్కుకుని ఎంతకీ కదలలేదు. బోయీల అడుగు ముందుకి పడలేదు. దానితో బోయీలలో భయం నెలకొంది. చుట్టూ దట్టమైన అరణ్యం, వన్యమృగాలు, పాములతో నిండివుంది. ఇది గమనించిన మాణిక ప్రభు పల్లకిని కిందికిదించమని చెప్పి, ఆయన పల్లకీ నుండి దిగీదిగగానే అక్కడే ఉన్న రెండు అతి పెద్ద బిల్వవృక్షాలు నిలువునా కాలి బూడిదైపోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన బోయీలు మరింత భయభ్రాంతులవుతుండగా, మాణిక ప్రభు “ఇద్దరు బ్రహ్మరాక్షసులకి ముక్తి లభించింది” అని అన్నారు. ఆ ప్రాంతం రెండు నదుల (విరజ మరియు గురుగంగ నదులు) సంగమ ప్రదేశం. అక్కడే ఒక గడ్డితో చేసిన కుటీరం ఏర్పాటుచేసుకుని జీవసమాధి పొందేవరుకు ఉండిపోయారు. కాల క్రమేణా మాణిక ప్రభు ఉన్న ఆ అటవీ ప్రాంతమే ‘మాణిక్ నగర్’ గా ప్రసిద్ధికెక్కింది . మాణిక్ నగర్ ‘మణిచూల పర్వతం’ మీద గలదు. మాణిక్ నగర్ కు గల మరొక పేరు ‘వృషభాద్రి’. ఇక్కడే (మాణిక్ నగర్) మాణిక ప్రభు సంస్థానం (ఆలయం) ఉంది. సంస్థానం, దేవాలయంగా క్రీ.శ.1945వ సంవత్సరంలో కట్టబడినది. అప్పటినుండి మాణిక ప్రభు అక్కడే ఉండి అనేకానేక అద్భుతాలను చేసారు. మాణిక్ నగర్ కర్నాటక లోని బీదర్ జిల్లాలో హుమ్నాబాద్ కు 2 KMs దూరంలో ఉంది. కానీ శ్రీ మాణిక ప్రభువుల వారికి క్రీ.శ.1865వ సంవత్సరంలోనే మొట్ట మొదటి దేవాలయం హైదరాబాద్ లోని శంకరపల్లికి దగ్గరలో గల మొమిన్ పేట్ లో కట్టబడినది. శ్రీ మాణిక ప్రభువుల వారు స్వయంగా విచ్చేసిన దేవాలయమిది. వారి దేవాలయాన్ని వారే సందర్శించి ఆశ్చర్యపోయారట. ఆ దేవాలయ నిర్మాణకర్తలని ఎంతో అభినందించి,ఆశీర్వదించి సంతృప్తితో తిరిగి మాణిక్ నగర్ చేరారట.
భక్తుల యొక్క కష్టాలనూ, వ్యాధులనూ ‘పూలతో’ పోగొట్టడం వీరి ప్రత్యేకత. అందుకే శ్రీ మాణిక ప్రభుజీ వారి అన్ని చిత్రాలలో వారు ‘పువ్వు’ని పట్టుకునట్లుగా ఉంటుంది. మొట్ట మొదటి దత్త అంశావతారమైన శ్రీ మాణిక ప్రభుజీ వారికి, వారు జీవసమాధి పొందక మునుపే నిర్మించిన మొట్ట మొదటి దేవాలయము మనకు దగ్గరలోనే ‘మొమిన్ పేట్’ అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయ నిర్మాణం క్రీ.శ.1862 లో ప్రారంభించబడి క్రీ.శ.1865 లో పూర్తి చేయబడినది. క్రీ.శ.1865 లో శ్రీ మాణిక ప్రభుజీ వారు 28-నవంబర్-1865 సోమవారం మార్గశీర్షమాస శుద్ధ ఏకాదశి రోజు జీవసమాధి పొందుతారనగా దానికి సరిగ్గా ఒక నెల ముందు మాణిక్ నగర్ నుండి వచ్చి వారికి నిర్మించబడిన ఆలయంలో ఒక ‘దత్తగాదీ (Spiritual Seat)’ని స్థాపించి, వారు తరచుగా చేతి క్రింద పెట్టుకునే ‘దండాన్నీ’ మరియు ‘పాదముద్రల’ ను అక్కడ వదిలి ఎంతో సంతృప్తితో తిరిగి మాణిక్ నగర్ వెళ్లారు. శ్రీ మాణిక ప్రభుజీ వారు సైతం ఈ దేవాలయాన్ని సందర్శించి, అక్కడ గాదీనీ, పాదుకలను ప్రతిష్టించడం వల్ల దత్త భక్తులందరూ చూసితీరవలసిన ప్రదేశమిది.
మొమిన్పేట్ శ్రీ మాణిక ప్రభు దేవాలయం (శ్రీ మాణిక ప్రభువుల వారికి కట్టబడిన మొట్ట మొదటి దేవాలయము)
శ్రీ మాణిక ప్రభు దేవాలయం మొమిన్ పేట్ లో ఏర్పడిన విధానం & శ్రీ మణిక ప్రభువుల వారి మొమిన్ పేట్ పర్యటన
శ్రీ కృష్ణమాచార్య దంపతులు సుమారు క్రీ.శ. 1860 వ సంవత్సరంలో వారి ఉద్యోగనిమిత్తం గల పని మీద హుమ్నాబాద్ నవాబును కలవడానికి వచ్చిరి. శ్రీ మాణిక ప్రభువుల వారి గురించి కర్ణాకర్ణిగా విన్న వారు మాణిక్ నగర్ వెళ్లి ప్రభు దర్శనం చేసుకోని, వారసుడు కావాలనే కోరికను అక్కడ శ్రీ మాణిక ప్రభువుల వారి ముందు విన్నవించుకొనిరి. అందుకు శ్రీ మాణిక ప్రభువుల వారు నవ్వుతూ “పిల్లవాడిని ఇస్తే ఈ పల్లెవాడు కుడా రావలసిఉండును, సరేలే తీసుకో.. నేను వస్తాలే!” అని చెప్పారట. వారు తిరిగి స్వగ్రామమైన మొమిన్ పేట్ వచ్చిన కొద్ది నెలల కాలంలో వారికి పండంటి బిడ్డపుట్టడం ఆ బిడ్డకి “మాణిక్యరత్నం” అనేపేరు పెట్టడం చకచకా జరిగిపోయాయి. అప్పటినుండి ఆదంపతులు శ్రీ మాణిక ప్రభువుల వారిని అధీష్ట దేవుడుగా కొలవడం ప్రారంభించారు. అడిగిన వెంటనే ఆశీర్వదించిన శ్రీ మాణిక ప్రభువుల వారి పై గల భక్తిని చాటుకోవడం కోసం క్రీ.శ. 1862 వ సంవత్సరంలో శ్రీ మాణిక ప్రభువుల వారికి దేవాలయం కట్టించడం ప్రారంభించారు. క్రీ.శ. 1865 వ సంవత్సరంలో శ్రీ మాణిక ప్రభువుల వారి దేవాలయం పూర్తి చెయ్యబడినది. పిమ్మట శ్రీ కృష్ణమాచార్య దంపతుల ఆహ్వానం మేరకు జీవసమాధి చెందడానికి ఒక నెల రోజుల ముందుగా ఇచ్చిన మాట ప్రకారం మొమిన్ పేట్ వచ్చి గుడి మొత్తం కలియతిరిగి, దత్తగాదీని స్థాపించి, పాదుకా ముద్రలనూ, దండాన్ని ఇచ్చి ఆ దంపతులను ఆశీర్వదించి తిరిగి మాణిక్ నగర్ చేరిరి.
This temple has a great history in the epics. It was built by Smt. & Sri Krishanmacharya in the year 1862 A.D. During the 18th century the name Sri Manika Prabhu Ji, was very famous in the Bidar and Hyderabad Nizam region. Sri Krishnamacharya who heard about the holy man Sri Manik Prabhu went to him to gain his blessings. As they had no child (Heir) for their property, they traveled all the way to Maniknagar presently close to Humnabad to get the blessings of Sri Manika Prabhu Ji. After getting blessings from Sri Manika Prabhu Ji they came back. By the blessings of Manik Prabhu they had a son after few months, named as ‘Manikya Ratnam’. So, they started treating Sri Manika Prabhu Ji as their a patron god (అధీష్టదేవుడు) who is an Amshavataar of Sri Dattatreya. Later Sri Manika Prabhu himself came to this Mominpet Temple and inaugurated ‘Datta Gaadi(Spiritual Seat)’ and Paduka and gifted his ‘Danda’ (Y – shaped stick) . Later this historictemple was maintained by his successor who born with the boon of Sri Manika Prabhu Ji. This was done purely with the intention of devotion towards Sri Manika Prabhu and not with the idea of showing off wealth and status.
మొమిన్ పేట్ మాణిక ప్రభు దేవాలయం ఫోటోలు
మొమిన్ పేట్ మాణిక ప్రభు దేవాలయం విశిష్టత
- శ్రీ మాణిక ప్రభువుల వారికి కట్టబడిన మొట్టమొదటి దేవాలయమిది.
- శ్రీ మాణిక ప్రభువుల వారు విచ్చేసి ఆశీర్వదించిన స్వీయదేవాలయం.
- శ్రీ మాణిక ప్రభువుల వారు స్వయంగా స్థాపించిన ‘దత్తగాదీ’ ఉండడం.
- శ్రీ మాణిక ప్రభువుల వారి ‘దండం’ ఉండడం.
- శ్రీ మాణిక ప్రభువుల వారి పాదముద్రికలు ఉండడం.
- దేవాలయం లోపలే ఔదుంబర వృక్షం ఉండడం.
- దేవాలయ ప్రాంగణంలో అతి అరుదైన ఔదుంబర – అస్వత్థ వృక్షాలు కలిసి పెరిగిన దేవతా వృక్షం ఉండడం.
మొమిన్ పేట్ ఎలా చేరుకోవాలి…
మొమిన్ పేట్ ఎలా చేరుకోవాలి... (Kukatpally To Mominpet Via BDL Township & Shankarpally - 50 KMs) |
---|
మొమిన్ పేట్ ఎలా చేరుకోవాలి... (Kukatpally To Mominpet Via BDL Township & Shankarpally - 50 KMs) |
కుకట్ పల్లి ----> BHEL ----> పటాన్ చెరు ----> పటాన్ చెరు Bus Stand దాటిన తరువాత Left Hand Side వచ్చే కమాన్ గుండా వెళ్ళాలి ---->ORR క్రింది నుండి వెళ్ళాలి ----> నందిగామ ----> భానూర్ ----> BDL Township ----> శంకరపల్లి ----> ఫతేపూర్ ----> మహాలింగపురం ----> ఎన్కతల ----> మొమిన్ పేట్ |
మొమిన్ పేట్ మాణిక ప్రభు దేవాలయ నిర్వాహకుల వివరాలు
మొమిన్ పేట్ శ్రీ మాణిక ప్రభు దేవాలయానికి వెళ్ళదలచిన వారు ముందుగా అక్కడి దేవాలయ నిర్వాహకులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించి బయలుదేరవలసినదిగా విజ్ఞప్తి.
మొమిన్ పేట్ మాణిక ప్రభు దేవాలయ నిర్వాహకుల వివరాలు |
---|
మొమిన్ పేట్ మాణిక ప్రభు దేవాలయ నిర్వాహకుల వివరాలు |
Sri Ramesh Panthulu - 9849340252 |
మొమిన్ పేట్ దగ్గరలో గల ‘నవాబ్ పేట్’ లో గల శ్రీ మాణికప్రభు ‘గాదీ’ దేవాలయం గురించి…
(Maintained By Sri Manik Prabhu Samsthan, Maniknagar)
శ్రీ మాణికప్రభువుల వారి ’గాదీ’ దేవాలయాలు (గాదీమందిర్) దేశవ్యాప్తంగా అనేక చోట్ల స్థాపింపబడినవి. మరీ ముఖ్యంగా కర్నాటక, తెలంగాణ మరియు ఆంధ్ర (కర్నూల్ లో మాత్రమే) రాష్ట్రాలలో చాలాచోట్ల ఈ గాదీమందిర్ లు గలవు. అటువంటి గాదీమందిర్ లలో ఒకటి మొమిన్ పేట్ కు దగ్గరలో గల నవాబ్ పేట్ లో కూడా కలదు. నవాబ్ పేట్ లో గల శ్రీ మాణికప్రభువుల వారి గాదీమందిర్ దత్త భక్తులందరూ చూసితీరవలసిన ప్రాంతము.
నవాబ్ పేట్ శ్రీ మాణికప్రభు ‘గాదీ’ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి…
నవాబ్ పేట్ శ్రీ మాణికప్రభు 'గాదీ' దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి... (మొమిన్ పేట్ నుండి - 09 KMs) |
---|
నవాబ్ పేట్ శ్రీ మాణికప్రభు 'గాదీ' దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి... (మొమిన్ పేట్ నుండి - 09 KMs) |
మొమిన్ పేట్ ----> ఎన్కతల ----> ఎన్కతల దాటిన తరువాత Right Hand Side వచ్చే చిన్న రోడ్డు గుండా వెళ్ళాలి ----> ఈ చిన్న రోడ్డు పెద్ద తార్ రోడ్డు లో కలిసే చోట Left Hand Side రోడ్డు తీసుకోవాలి ----> నవాబ్ పేట్ ----> Opposite Road of Nawabpet RTC Bus Stand ----> నవాబ్ పేట్ శ్రీ మాణికప్రభు 'గాదీ' దేవాలయం |
నవాబ్ పేట్ శ్రీ మాణికప్రభు ‘గాదీ’ దేవాలయ ఫోటోలు – విశిష్టత
- మాణిక్ నగర్ లో జరిగే విధంగానే అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి.
- శ్రీ మాణికప్రభు సంస్థానం వారిచే నడపబడుతున్నది.
- ఇక్కడ శ్రీ మాణిక ప్రభువుల వారి పాదుకలు కలవు.
నవాబ్ పేట్ శ్రీ మాణికప్రభు ‘గాదీ’ దేవాలయ నిర్వాహకుల వివరాలు
నవాబ్ పేట్ లో గల శ్రీ మాణికప్రభు ‘గాదీ’ దేవాలయానికి వెళ్ళదలచిన వారు ముందుగా అక్కడి దేవాలయ నిర్వాహకులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించి బయలుదేరవలసినదిగా విజ్ఞప్తి.
నవాబ్ పేట్ శ్రీ మాణికప్రభు ‘గాదీ’ దేవాలయ నిర్వాహకుల వివరాలు |
---|
నవాబ్ పేట్ శ్రీ మాణికప్రభు ‘గాదీ’ దేవాలయ నిర్వాహకుల వివరాలు |
Sri Aravindaacharya - 9848059119 |
శ్రీ మాణికప్రభువుల వారి ’గాదీ’ దేవాలయాలు (గాదీమందిర్ లు)
Adilabad - Elvi
Adilabad - Mhaisa
Adilabad – Mudhole
Hyderabad – Goulipura
Hyderabad – Jangli
Hyderabad - Karwan
Hyderabad – Keshavgiri
Hyderabad - Rahimpur
Hyderabad - Ramantapur
Secunderabad – Secunderabad
Kurnool – Malagveli (Andhra Pradesh)
Mahaboobnagar – Shadnagar
Medak – Alladurg
Medak - Andol
Medak – Babulgaon
Medak - Chelmeda
Medak - Daulatabad
Medak - Doppur
Medak - Eddu Mailaram
Medak - Ismailkhanpeth
Medak - Jogipeth
Medak - Karchal
Medak – Kohir
Medak - Krishnapur
Medak – Medak Town
Medak – Mubarakpur
Medak - Narayankhed
Medak - Nyalkal
Medak - Pattancheru
Medak – Ramtirtha
Medak – Sadashivpeth
Medak - Sangareddy
Medak – Shankarampeth
Medak - Tekmal
Medak – Togta
Medak - Vendikol
Medak - Zaheerabad
Medak - Zara Sangam
Nizamabad – Ali Sagar
Nizamabad – Bodhan
Nizamabad – Kaulas
Nizamabad - Kotgir
Nizamabad - Nizamabad Town
Nizamabad - Rudrur
Nizamabad - Zukkal
Rangareddy - Aloor
Rangareddy - Chevalla.
Rangareddy - Dhobipeth
Rangareddy - Mominpet
Rangareddy – Nawabpet
Rangareddy – Pargi
Rangareddy - Tormamdi
Warangal – Warangal Town
Belgaum - Madhalli
Bellary – Shridhargatta
Bidar - Agrahar
Bidar - Amrutkund
Bidar - Andur
Kalyan - Basava Kalyan
Bidar - Belkunda
Bidar – Bhalki
Near Bidar – Zarani Narsimha
Bidar – Bidar Town
Bidar – Chalakapur
Bidar – Chalki
Bidar - Chikhali
Bidar - Dhannur
Bidar Dist – Gotamgotti
Bidar - Hallikhd
Bidar -Janwada
Bidar - Khatakchincholi
Bidar - Khelgi
Bidar Dist - Ladwanti