Manika ManJhari – Jharasangam
Manika ManJhari – Jharasangam ‘Ketaki Sangameshwara’ Temple
(మాణిక్య మంఝరి – ఝరాసంగం ‘కేతకీ సంగమేశ్వరస్వామి’ దేవాలయం)
సకలమత ప్రేరక! చైతన్య ఏక గురు మాణిక! హా సిద్ధాంత.. మోక్షదాయక! సత్యసత్య రత్నరత్న.. మాణిక రత్న!
- ఝరా / ఝరము = కోనేరు / సెలయేఱు, (Jhara / Jharamu = A Square Tank or Pond With Steps Constructed On All Sides )
- సంగం = సంగమం (Sangam = Association or Coming Together )
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే… దిగంబరా…దిగంబరా…శ్రీపాద వల్లభ దిగంబరా… దత్త బంధువులందరికీ జై గురుదత్త… శ్రీ మాణిక ప్రభు మహారాజ్ కి జై..
శ్రీ మాణిక ప్రభుజీ చరితము ముందుగా సంస్కృతము లో వ్రాయబడినది. దానిని తదుపరి మరాఠా భాషలోకి అనువదించారు. క్రీ.శ. 1943-1944 సంవత్సరంలో పేరమ్మ అగ్రహారం, అమలాపురంలో నివాసముండే శ్రీ గంటి రెడ్డియ్య గారు స్కూల్ హెడ్ మాస్టర్ గా పదవీ విరమణ చేసిన అనంతరం మాణిక్ నగర్ వెళ్లారు. అక్కడ వారు మూడు నెలల కాలం ఉన్నారు. అప్పట్లో అక్కడి సంస్థానంలో అన్ని కార్యక్రమములు చూసుకుంటున్న శ్రీ శంకర మాణిక ప్రభువులు శ్రీ గంటి రెడ్డియ్య గారిని శ్రీ మాణిక ప్రభుజీ వారి చరితమును తెలుగు లోకి అనువదించమని చెప్పారు. శ్రీ మనోహర మాణిక ప్రభు క్రీ.శ.1865 లో శ్రీ మాణిక ప్రభుజీ వారి జీవసమాధి తదుపరి గాదీని ఎక్కిన వారే శ్రీ మనోహర మాణిక ప్రభువుల వారు. వారి యొక్క సహోదరి ముక్తాబాయి. శ్రీమతి ముక్తాబాయి యొక్క కుమారులు శ్రీ శంకర మాణిక ప్రభువు గారు (వీరు క్రీ.శ.1945 వరుకు జీవించి ఉన్నారు)]. తదుపరి ఎన్నో వ్యప్రయాసలకులోనై , శ్రీ మాణిక ప్రభువుల వారి ద్వారా ప్రత్యక్షముగా అనేక విషయాలను తెలుసుకొని, శ్రీ అప్పా సాహెబ్ గారి సహకారంతో శ్రీ గంటి రెడ్డియ్య గారు శ్రీ మాణిక ప్రభుజీ చరితము ను తెలుగులో అందించారు. వారు ఈ అనువాదం పూర్తి చేసేటప్పటికి ఆజ్ఞ ఇచ్చిన శ్రీ మనోహర మాణిక ప్రభువులు స్వర్గస్థులయ్యారు (క్రీ.శ.1945 లో). ఈ విధంగా వొచ్చిన శ్రీ మాణిక ప్రభుజీ చరితము మాత్రమే అసలైనది. ఈ గ్రంధం అనేక సార్లు చదివిన నేను, ఆ గ్రంధంలో ఉన్నట్లుగానే ‘ఝరాసంగం’ కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి అక్కడ అప్పట్లో శ్రీ మాణిక ప్రభుజీ వారి ఆదేశానుసారం (శ్రీ సాంబా సోమయాజులు గారిని గాదీని నిర్మించమని ఆజ్ఞాపించారు) ఏర్పాటు చేసిన శ్రీ మాణిక ప్రభుజీ వారి గాదీ దేవాలయం ఎక్కడుందో విచారణ చేయసాగాను. కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయంలోని వారు శ్రీ మాణిక ప్రభుజీ వారి గాదీ దేవాలయం గురించి ఏమీ చెప్పలేకపోయారు. కానీ అదృష్ట వశాత్తు శ్రీ మాణిక ప్రభువుల వారి ఆశీస్సులతో అక్కడే ఉన్న Sri L.Vijay అనే వారు అక్కడకి దగ్గరలోనే ఒక వ్యవసాయ పొలములో గల శిథిలావస్థలో ఉన్న నిర్మానుష్యమైన శ్రీ మాణిక్ ప్రభు వారి గాదీ దేవాలయానికి తీసుకువెళ్లి చూపించారు. ఇది నిజంగా ఆశర్యము మరియు అద్భుతము. ప్రస్తుతం ఈ గాదీ దేవాలయం శిథిలావస్థలో దయనీయంగా ఉండడం చూసి కొంత బాధపడడం జరిగింది. ఈ యాత్రలో నాతో పాటుగా Smt. Sulochana Akka, వారి కుమార్తె అయిన Ms. Warshini & Jr. Keerthi రావడం జరిగింది. శ్రీపాద శ్రీ వల్లభుల వారి ఆశీస్సులతో..శ్రీ మాణిక ప్రభువుల వారి కరుణతో ఝరాసంగం లోని శ్రీ మాణిక ప్రభుజీ వారి గాదీ దేవాలయం గురించి మరియు కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం కు సంబంధించిన విశేషాలను తెలుసుకొని, తెలుసుకున్న విశేషాలను ఈ Article ద్వారా మీతో పంచుకుంటున్నాను. పవిత్రమైన,అతి విలువైన, అందరికీ తెలియని ఈ మాణిక’ఝరి’ దర్శించండి. తరించండి.
జై గురు దత్త -Keerthi Vallabha (keerthivallabha@gmail.com)
ఝరాసంగం ఎక్కడ ఉంది?
ఝరాసంగం తెలంగాణ రాష్ట్రం లోని Medak District లో Zaheerabad కు దగ్గరలో గలదు. ఝరాసంగం Mumbai Highway కు దగ్గర గాఉండడం వల్ల సులభం గా చేరుకోవచ్చు.
ఝరాసంగం ఎలా చేరుకోవాలి?
Hyderabad To Jharasangam Temple - 110 KMs |
---|
Hyderabad To Jharasangam Temple - 110 KMs |
By Own Transport : Hyderabad ----> Kukatpally ---->BHEL ----> Patancheru ---->ORR ---->SadaSivPet ----> Zaheerabad ----> Jharasangam |
Public Transport By Road : MGBS / JBS -----> Zaheerabad ----> Jharasangam (By Sharing Auto Riksha) |
Public Transport By Rail : Secunderabad / Nampally -----> Zaheerabad ----> Jharasangam (By Sharing Auto Riksha) |
ఝరాసంగం దర్శించడానికి అనువైన సమయం…
ఝరాసంగం లోని కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం దర్శించుకోవడానికి అనువైన కాలం శ్రావణ మరియు బాధ్రపద మాసాలు. కారణం ఈ కాలం లోనే ఇక్కడ మొగలి రేకులు / పువ్వులు దొరుకుతాయి మరియు ఈ కాలంలోనే ’అమృతగుండం’ కూడా నిండి ఉంటుంది. జులై నుండి అక్టోబర్ వరుకు కూడా దర్శనానినికి అనుకూలమైన కాలమే.
ఝరాసంగంలో ఎక్కడ ఉండాలి?
ఝరాసంగంలో ఉండడానికీ, తినడానికీ సరైన వసతులు లేవు. దగ్గర లోగల Zaheerabad లో ఉండవచ్చు. సాధారణంగా భక్తులు Hyderabad నుండి Jharasangam లోగల కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయాన్ని దర్శించి తిరిగి సాయంత్రం కల్లా Hyderabad చేరుకుంటారు.
ఝరాసంగం – శ్రీ మాణిక ప్రభువు గాదీ దేవాలయం
లాడనశ, మదనశ, వేడాభావు గా పిలువబడే దత్తావతార అంశఅవతారమైన శ్రీ మాణిక ప్రభువుల వారు చిన్నతనం నుండి కొన్ని రోజులు అకస్మాత్తుగా ఊర్లో కనపడకుండా పోయేవారు . కొద్ది రోజులకు తిరిగి కనబడేవారు. శ్రీ మాణిక ప్రభువుల వారు చదువుకోలేదు. స్కూల్ కు వెళ్లనే లేదు. పని కూడా ఏమి చేసేవారు కాదు. అందువల్ల వారి మేనమామ గారు శ్రీ మాణిక ప్రభువుల వారు 16 వ సంవత్సరంలో ఉండగా ఒక రోజు మందలించగా శ్రీ మాణిక ప్రభువులు దిగంబరంగా ఆ ఊరు విడిచి (కళ్యాణీ) వెళ్లి పోయారు. అలా వెళ్లిన వారు అనేక ప్రాంతాలను తిరిగారు. వారి పర్యటనలో భాగంగా ఒక సారి ఝరాసంగం వచ్చి అక్కడ అశ్వత్థవృక్ష సమీపంలో గల భూమిని తవ్వించి శ్రీ కేతకి సంగమేశ్వరస్వామి లింగాన్ని బైటకు తీయించారు మరియు పూడుకు పోయిన అమృత గుండాన్ని మళ్ళీ తవ్వించారు. దానికి గల కారణం అమృత గుండానికి ఉన్న మహిమే! మరీ ముఖ్యంగా అమృత గుండం యొక్క దక్షిణ నైరుతి భాగంలోగల ‘దత్తాత్రేయ తీర్థం’ లొ దత్త భక్తులందరూ మునిగి తరించాలని అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ గల అమృత గుండానికి ఉన్న మహిమ, మహత్తు వర్ణింప వీలుకానిది. ఇక్కడే ఒక గాదీ దేవాలయాన్ని ఏర్పాటు చేయమని కూడా భక్తులను ఆదేశించారు. క్రింది వివరణను చదవగలరు:
Click Here To View Video of Sri Manik Prabhu Ji Gaadi Temple At Jharasangam
(ఝరాసంగంలొ గల శ్రీ మాణిక ప్రభుజీ వారి గాదీ దేవాలయం వీడియో చూడడం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)
ఎటువంటి నదులు ఇక్కడ సంగమించనప్పటికీ ఇక్కడ సంగమేశ్వరస్వామి దేవాలయం ఎలా ఏర్పడింది?
సాధారణంగా సంగమేశ్వరస్వామి దేవాలయాలు రెండు లేదా అంతకన్నా ఎక్కువ నదులు, నదీ పాయలు కలిసేచోట ఉంటాయి. కానీ అక్కడి సంగమేశ్వరస్వామి దేవాలయాల తో పోలిస్తే (నదీ సంగమ ప్రాంతంలో ఉండే సంగమేశ్వర స్వామి దేవాలయాలు) ఇక్కడి సంగమేశ్వరస్వామి దేవాలయం భిన్నమైనది. ఇక్కడ (ఝరాసంగంలో) ఏక పాద మహేశ్వరునిలో బ్రహ్మ మరియు విష్ణువులు సంగమం చెందడంవల్లా, అలాగే ఇక్కడ గల అతి పవిత్రమైన Amrutha Gundam లో దిక్కులలో, దిక్కుల మూలలలో గల వివిధ తీర్థాలు కలవడం వల్ల ఈపేరు వచ్చింది.
ఝరాసంగం – అమృతగుండం
S.No | Direction | Name of The Teertham | Importance |
---|---|---|---|
S.No | Direction | Name of The Teertham | Importance |
01 | North (N) | Soma / Chandra Teertham | Someshwara Pujaa Phalitham |
02 | South (S) | Dharma Teertham | Dharma Nista Paraayanatwam |
03 | East (E) | Indra Teertham | Mahendra Sadrusya Yogam & Swarga Praapthi |
04 | West (W) | Varuna Teertham | Godaana Punyam |
05 | NE - ఈశాన్య మూల | Rudra / Shankara Teertham | Shiva Saannidhya Praapthi |
06 | SW - నైరుతి మూల | Dattatreya Teertham | Yogishwara Punya Praapthi |
07 | SE - ఆగ్నేయ మూల | Badari Narayana Teertham | Mahalakshmi Yogam & Pitru Devatha Preethi |
08 | NW - వాయువ్య మూల | Rushi Teertham | Saptha Brahmana santarpana Phalitham & Rushi Loka Staanam |
ఝరాసంగం – కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం విశిష్టత
బ్రహ్మాండ పురాణం ప్రకారం: కేతకి సంగమేశ్వరస్వామి దేవాలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కృతయుగంలో సూర్యవంశపు రాజు ‘కుపేంద్ర భూపాలుడు’ అనే రాజు కుపేంద్ర నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. కాలక్రమేణా కర్మవశాత్తు కుపేంద్ర భూపాలుడు భయంకరమైన చర్మవ్యాధి బారినపడతాడు. భూపాలుడుకి వచ్చిన చర్మవ్యాధి అతి భయంకరమైనది. కుపేంద్ర భూపాలుడి శరీరం సూర్యాస్తమయానికి మాంసపు ముద్దగా మారి (ఎముకలు పూర్తిగా మెత్తబడి) సూర్యోదయం అయ్యేసరికి తిరిగి సాధారణ మానవ శరీరంగా మారుతూఉండేది. కాబట్టి కుపేంద్ర భూపాలుడు తన పనులన్నీ పగటిపూటే పూర్తి చేసుకునేవాడు. వ్యాధి నివారణ కోసం అనేక ఔషధశాలలు,పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించినప్పటికి ఏమాత్రం ఫలితాలను ఇవ్వలేదు. ఒకానొక రోజు వేసవికాలం ఉదయం సమయంలో వేటకు వెళ్లిన కుపేంద్ర భూపాలుడుకు విపరీతమైన అలసట, దప్పిక కావడంతో అక్కడదగ్గరలోగల దట్టమైన చల్లటినీడ, చక్కటి సువాసన కల కేతకి వనం లోకి ప్రవేశించి అక్కడే ఒకచోట కూలబడి పరిసర ప్రాంతంలో ఎక్కడైన నీరు ఉందేమో చూసి రమ్మని సేవకులను ఆదేశించాడు . అంతలో బ్రహ్మదేవుడే గొర్రెల కాపరి వేషంతో గొర్రెలు మేపుతు కేతకి వనంలో రాజభటులకు కనిపించి, అక్కడ నీటితో నిండిన ఒక అద్భుతమైన గుండాన్ని చూపించి ‘మీరాజును ఇక్కడ దప్పిక తీర్చుకోమని’ చెబుతాడు. ఆ గుండం లోని నీటిని త్రాగిన కుపేంద్ర భూపాలుడు అదే నీటితో మొహం, కాళ్ళు చేతులు కూడా కడుక్కొని సూర్యాస్తమయం అవుతుందేమో అన్న తొందరలో తిరిగి కుపేంద్ర నగరాన్ని చేరుతాడు. ఆశర్యంగా ఆరోజు సూర్యాస్తమయం అయిపోయినప్పటికీ కుపేంద్ర భూపాలుడి శరీరం సాధారణ శరీరంగానే ఉంటుంది. ఆనందాశ్శర్యాదులకు లోనైన కుపేంద్ర భూపాలుడు ఆ గుండం లోని నీటికి గల శక్తిని గ్రహించి అక్కడ గల స్వయంభు శివలింగానికి గుడి కట్టి ప్రతిష్ఠిస్తాడు.
స్కాంద పురాణం ప్రకారం: పూర్వం ‘కేతకి’ అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో ‘కేతకీ వనం’గా అంటే మొగలి వనంగా మారి పోతుంది. ఒకసారి బ్రహ్మ ‘కేతకీ వనం’లో శివుడి గురించి తపస్సు చేయగా, శివుడు లింగరూపంలో ప్రత్యక్షం అవుతాడు. బ్రహ్మ కోరిక మేరకు శివుడు బాణలింగ రూపంలో (బాణలింగం అంటే శివుని యొక్క గుర్తులతో సహజంగా ఏర్పడిన శివ లింగం) అక్కడే వెలిశాడు. అందుకే ఈ క్షేత్రానికి “కేతకీ సంగమేశ్వర క్షేత్ర”మని పేరు. ఈ ఆలయంలో సంగమేశ్వరుడు, కేతకి & పార్వతి సమేతంగా కొలువుదీరి ఉంటాడు.
శివతత్వ కథనాల ప్రకారం: ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువులలో ఎవరు గొప్ప అనే వాదన రావడంతో శివుడి దగ్గరకి వెళ్లి శివుణ్ణి తేల్చమని అడిగారట. అయితే శివుడు “నాయొక్క మొదలు అంతం ఎవరైతే చూసి ముందుగా రాగలరో వారే అందరికన్నా గొప్ప” అని చెబుతాడు. బ్రహ్మని లింగం యొక్క శిఖర దర్శనాన్ని, విష్ణువును పాద దర్శనం చేసి రమ్మని శివుడే తగాదా తీర్చటానికి ఆజ్ఞాపించాడు. విష్ణువు వెంటనే వరాహ అవతారం ధరించి భూమిని తొలుస్తూ శివుని పాదాల కోసం వెళుతుండగా మధ్యలో విఘ్నేశ్వరుడు కనిపించి శివుని యొక్క అంత్యభాగం చూడలేమనీ, ప్రయత్నం విరమించు కోవలసిందని చెబుతాడు. విఘ్నేశ్వరుడి మాటలను విన్న విష్ణువు శివుని వద్దకి చేరి ఓటమిని అంగీకరిస్తాడు. బ్రహ్మ శిఖర దర్శనం చేయటానికి వెళ్ళి విఫలమనోరదుడై తిరిగి వస్తుంటే బ్రహ్మకు ఒక ఆలోచన వస్తుంది. తాను శివుని యొక్క శిఖర దర్శనం చేసినట్లుగా కేతకి అంటే మొగలి పువ్వు మరియు కామధేనువు లను సాక్ష్యం చెప్పమని బ్రహ్మ ఆజ్ఞాపిస్తాడు. సృష్టి కర్తకు ఎదురు చెప్పలేక వారిద్దరిని బ్రహ్మ శివుడి దగ్గర కు తీసుకువెళ్లి వాటితో అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు. దానిని గ్రహించిన పరమేశ్వరుడు బ్రహ్మ తో పాటుగా కేతకి ని మరియు కామధేనువు లను ఇద్దరిని శపిస్తాడు. అసత్యం పలికిన బ్రహ్మ కు పూజలు, గుడులు, ఉండవనీ, అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతకి పుష్పం శివపూజకు పనికి రాదనీ, అబద్ధపు సాక్ష్యం చెప్పిన ఆవు ముఖానికి పూజార్హత లేదని శాపం ఇచ్చాడు.
తదుపరి కేతకి మరియు కామధేనువు లు ప్రాధేయ పడితే సత్యాన్ని సంకేతంగా చెప్పిన గోవు పృష్టభాగం (తోక) పూజకు అర్హమని, కేతకి పుష్పం మాత్రం ‘కేతకీ’ శివలింగానికి (ఝరాసంగంలో గల లింగం బ్రహ్మ ప్రతిష్ఠిత కేతకి వనసహిత కేతకి బాణ లింగం) మాత్రమే పూజకు పనికి వస్తుందని శాపనివారణ తెలిపాడు. కాబట్టి మొగలి పువ్వు శివ పూజకు పనికి రాని పువ్వు అయ్యింది. అందువల్లే ఝరాసంగం లోని సంగమేశ్వరస్వామి శివలింగానికి కేతకి పుష్పాలతోనే అర్చన చెయ్యవచ్చు. అందువల్లనే ఇక్కడి శివ లింగం ‘కేతకి శివలింగం’. అందుకే స్వామికి “కేతకీ సంగమేశ్వర స్వామి’’ అని పేరు వచ్చింది. మొగలి పూలతో శివుడిని అర్చించే చోటు ఇదొక్కటే. ఈ ఆలయ ప్రాంగణంలో దట్టమైన మొగలి వనాలుండి స్వామి సేవలో తరిస్తున్నాయి.
ఝరాసంగం కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం విశిష్టత: ఝరాసంగం కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం వెనక భాగంలో ఒక కోనేరు (అమృతగుండం) ఉంది. కాశీలో ప్రవహించే గంగానది యొక్క ఒక ధార అంతర్వాహినిగా భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. మధ్యాహ్నం ఇక్కడ నుండే కాశి లోని విశ్వేశ్వరునికి నైవేద్యం ఈ గుండంలోనే పెడతారు. ఈ గుండానికి ఈశాన్యం మూల ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంది. గుండంలో నీరు నిండుగా ఉన్నప్పుడు ఈ రంధ్రం కనబడదు. ఆ సమయంలో స్వామి వారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా అది నీటితో బాటు ఆ రంధ్రం గుండా వెళ్ళిపోతుంది. అలా ఆ నీరు ఒక సొరంగంలోకి వెడుతుందని భక్తుల నమ్మకం. నీటితో బాటు నైవేద్యం కూడ లోపలికి వెళ్ళి పోతుంది. కాసేపటికి ఆ గుండం స్వచ్చమైన నీటితో పూర్తిగా నిండిపోతుంది. ఇదంతా సంగమేశ్వరుని లీలగా భక్తులు భావిస్తారు. భక్తులు ఈ అమృత గుండంలో స్నానం చేస్తే సర్వ రోగాలు, పాపాలు నశిస్తాయని నమ్ముతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టుక్రింద ఒక శివలింగం ఉంది. దాన్ని కేవలం చేతి గల మూడు వేళ్ళతో పైకి లేపితే వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. దీన్ని కోరికలు తీర్చే లింగం (కామ్య సిద్ధి లింగం) అని అంటారు.
బ్రహ్మాండపురాణంలో చెప్పబడిన శ్రీకేతకి సంగమేశ్వర దేవాలయం మహత్యం చదవడం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి (PDF File)
ఝరాసంగం కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం ఫోటోలు
Other Places / Temples Near To Jharasangam Other Places / Temples Near To Jharasangam 1. Sri Datta Maharaaj Ashramam, Bardipur : 3 KMs From Jahrasangam 2. Sri Manik Prabhu Ji Jiva Samaadhi & Samshtan, Maniknagar, Near Humnabad : 55KMs From Jharasangam 3. Dattatreya Temple, Behind DTDC, Main Road, SadasivPet : 40 KMs From Jharasangam
Jharasangam Ketaki Sangameshwara Temple Address |
---|
Jharasangam Ketaki Sangameshwara Temple Address |
Ketaki Sangameshwara Temple, Jharasangam Village, Medak Dist. - 502246. Ph: 084512 88321 Temple Timings : 05:30 AM To 08:00 PM |