Over View Of Trust
Over View of Sripada Sri Guru Sangamam Seva Trust (శ్రీ పాద శ్రీ గురు సంగమం సేవా ట్రస్ట్ గురించి…)
దిగంబరా…దిగంబరా…శ్రీపాద వల్లభ దిగంబరా…
శ్రీపాద శ్రీ గురు సంగమం సేవా ట్రస్ట్ మార్చ్ 15 2013 న ప్రారంభించబడినది ఈ ట్రస్ట్ అనేక విధములుగా శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీ పాద శ్రీ వల్లభుడు బోధించిన మార్గాలను భక్తులకు సులువుగా అర్ధమై నిత్యజీవితంలో ఆచరణకు అనుకూలించే విధంగా, అందరికీ చేర్చడమే మన ట్రస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశ్యము. వీటితో పాటుగా సంఘసేవా కార్యక్రమాలు కుడా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశ్యాలలో భాగాలే. దత్తాత్రేయం లో పరిశోధన, భక్తులకు శ్రీ దత్తాత్రేయుల తత్వాన్ని చేరువచేయడమే మా కర్తవ్యం. ట్రస్ట్ గా రిజిస్ట్రేషన్ ఈ సంవత్సరమేచేయబడినప్పటికీ శ్రీపాదుల వారి సేవ 2006 నుండి జరుగుతూనే ఉంది. ఈ తతంగమంతా శ్రీపాద శ్రీ చరణుల వారే నడిపించారనడం లో ఎలాంటి సందేహం లేదు. శ్రీపాదుల సేవలో నిరంతరం గడిపే భక్తులే సభ్యులుగా ఉండడం శ్రీ పాదుల వారి ఆశీస్సులు ఉన్నాయనడానికి నిదర్శనం. గురుసేవ, గురుసేవ లో ఉండే భక్తుల కోసం స్థాపించబదినదే మన ఈ శ్రీపాద శ్రీ గురు సంగమం సేవా ట్రస్ట్. మన ట్రస్ట్ ద్వారా వివిధ గురుసేవా కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా శ్రీపాదుల వారి ఆశీర్వాదాలు అర్ధిస్తున్నాము.
భక్తులు విడివిడిగా ఇచ్చే చిన్న మొత్తాలను ‘పూల్’ గా చేసి అందరి తరుఫున పెద్ద గురుసేవా కార్యక్రమాలను జరుపుటకు మీ సహాయ సహకారాలను కుడా అర్ధిస్తున్నాము. ఏ జన్మకు లేని “దానం చేయడము” / భిక్ష వేయడం అనే అవకాశం కేవలం మానవజన్మకే పరిమితమైన అరుదైన అవకాశం. పైగా దత్తాత్రేయం లో ‘భిక్ష’ కు చాలా ప్రాధాన్యత కలదు. భక్తులు గురుసేవ కు తమకు తోచినంత ‘భిక్ష’ రూపంలో అందించమని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే…
శ్రీపాద శ్రీ గురు సంగమం సేవా ట్రస్ట్ (రి. 03/2013)
Sripada Sri Guru Sangamam Seva Trust (శ్రీ పాద శ్రీ గురు సంగమం సేవా ట్రస్ట్) |
---|
Sripada Sri Guru Sangamam Seva Trust (శ్రీ పాద శ్రీ గురు సంగమం సేవా ట్రస్ట్) |
Name of Trust : Sripada Sri Guru Sangamam Seva Trust |
Registration Number : 03/2013 |
Date of Incorporation : 15.03.2013 |
No. of Total Members : 14 |
PAN Number : AANTS0075N |
Bank Account Details : 1. South Indian Bank - A/C No:0508053000005150 (SB), 2. Kotak Mahindra Bank - A/C No: 2311333631 (Current ), 3.Bank of Baroda - A/C No: 32900100001970 (SB) |
80 G Registration : At Present No IT Examptions for Donations |
FCRA Registration : Applied |
Contact Details : #54, Sainikpuri, Hyderabad - 500062, Ph: 09948882498 / 09951552498, Email: reachus@sripadavallabha.org |