Palamakula
Samskarahina ShivaSwarupa Dattatreya (13th Shodasa Dattavataaram) – Palamakula Village
‘హీన’స్థితి లో ఉన్న ‘సంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయ (త్రయోదశ [13వ]షోడశ దత్తావతారం) – పాలమాకుల గ్రామం
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే..దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా..శ్రీసంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయ మహారాజ్ కీ జై.. దత్త బంధువులందరికీ జైగురుదత్త..
Telangana రాష్ట్రంలో (నిజాం కాలం కంటే ముందు) అనేకానేక Datta Kshetra లు ఉండేవనీ, వాటిలో కొన్ని ధ్వంసము చేయబడగా మరికొన్ని అశ్రద్ధ చేయబడ్డాయనీ మీకు ఇదివరకే తెలియజేయడం జరిగింది. ఆవిధంగా అశ్రద్ధ చేయబడిన ఒకానొక గొప్పదైన, అతిఅరుదైన, షోడశ దత్తావతారములలో 13వ అవతారమైన ‘శ్రీసంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయ దేవాలయం’ గురించిన సమాచారాన్ని ప్రముఖ దత్తభక్తులు శ్రీ రమేష్ గారు నాకు చేరవేశారు. ఆ సమాచారాన్ని అందుకున్న నేను Palamakula అనే Village కి వెళ్లి అక్కడ అత్యంత హీన, దీన స్థితిలో ఉన్న ‘సంస్కారహీన శివస్వరూప దత్తాత్రే యుడు’ ఉన్న ప్రదేశానికి వెళ్లి, అక్కడి పరిస్థితులను చూసి చాల బాధపడ్డాను.
సంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయస్వామి వారి స్థల పురాణం సేకరించడానికి నాకు అధిక సమయం మరియు ప్రయాసలు కలిగినప్పటికీ RajagopalPet అనే Village లో ఉండే శ్రీ దస్తగిరి అనబడే వారినుండీ, అలాగే ఆటోరిక్షా నడిపే శ్రీ ఆంజనేయులు గారి (Mob No.9676683805 ) సహకారంతో సంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాను. ఈ క్షేత్రం యొక్క అతి ప్రాముఖ్యమైన విషయమేమిటంటే ఇక్కడ దత్తస్వామి గణపతి మరియు పార్వతి అమ్మలతో ఒకే పీఠంపై కొలువై ఉన్నాడు.
ఒకప్పుడు అంగరంగ వైభవంగా వెలుగొందిన గొప్ప దత్త క్షేత్రం నేడు చెత్తను Dump చేసే Dumping Yard లా మారిపోయింది. రాత్రయితే ఆ ప్రదేశం అరాచకాలకూ, అక్రమాలకూ అడ్డా. ముంతల్లో, సీసాల్లో మద్యం తెచ్చుకుని హాయిగా కూర్చుని తాగడానికి అనుకూల ప్రదేశం. ఈక్షేత్రాన్ని చూస్తే ‘కని రోడ్డుమీద పారేసిన అమాయకపు బిడ్డ’లాగ స్వచ్ఛంగా ఉంటుంది. ప్రస్తుతం Palamakula Village లో పరిస్థితి ఏంటంటే ‘శివస్వరూప దత్తాత్రేయస్వామి గుడి’ అంటే ఎవరికీ తెలియదు. కానీ “బండ మీది శివుని గుడి” అని అడిగితే ఏకోద్ది మందో గుర్తుపట్టి Address చెప్పవచ్చు.
ఇక్కడ స్వామి వారికి రోజువారీ నైవేద్యం సంగతి దేవుడెరుగు కనీసం దీపం పెట్టే దిక్కేలేదు. అన్నివేళలా గుడి తలుపులు తెరిచే ఉంటాయి. శివస్వరూప దత్తాత్రేయస్వామి గుడికి దగ్గరలోనే దాదాపు 2 ఫర్లాంగుల దూరంలో ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ గుడిని చూసుకోవడానికి ఒక పూజారితో పాటుగా చక్కగా చుట్టూరా ప్రహరీ గోడతో ధూప, దీప,నై వేద్యాలతో అలరాలుతోంది. నేనువెళ్ళిన సమయానికి శివస్వరూప దత్తాత్రేయస్వామి గుడి అత్యంత దుర్భరమైన స్థితిలో ఉంది. వెంటనే గుడిని శుభ్రంగాచేసి దగ్గరలోని అమ్మవారి గుడి నుండి నీళ్లను తెచ్చి సంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయునకు, నంది సహిత శివలింగానికి అభిషేకం చేసి, అక్కడే అదేసమయంలో పూసిన కాషాయరంగు మోదుగ (Flame of The Forest) పూలనూ, ఒక కాషాయ వస్త్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ క్షేత్రానికి దగ్గరలో అనేక ఇతర దత్తక్షేత్రాలు కూడా కలవు. వాటిలో Rampur అనే Village లో Sripada Sri Vallabha Datta Kshetram కలదు. అదేవిధంగా Velkatur అనే Village లో 12వ దత్తావతారమైన Sri RamLal Prabhi Ji వారి Trust ఒకటి కలదు, అలాగే ఇక్కడకి దగ్గరలోనే గల Marrimutyala అనే Village లో Sri Saandrananda Swamy Asharamam మరియు Dattatreya Temple, Paduka & Oudumbaram కూడా తప్పక దర్శింపదగినవి.
ఆశక్తి గల భక్తులెవరైనాసరే… కడు దయనీయ స్థితిలో ఉన్న ఈ క్షేత్రాన్ని ప్రతి Weekend దర్శించి అక్కడ గల Grama Panchayati Office లో ఉండే పంచాయితీ ప్రెసిడెంట్ ను కలిసి ప్రణాళికా బద్ధంగా చర్చించి ఈ క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేయవలసినదిగా కోరుతున్నాను. అటువంటి వారికి నావంతు సహాయం చెయ్యడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను.
ఎంతో పవిత్రమైన, అరుదైన Palamakula Village లోగల ఈ ‘సంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయ’క్షేత్రాన్ని దత్తభక్తులందరూ సకుటుంబ సమేతంగా దర్శించి, తరిస్తారని… దేవాలయ జీర్ణోద్ధరణలో పాలుపంచుకుంటారని ఆశిస్తూ… జై గురుదత్త
శ్రీ దుర్ముఖినామ సంవత్సర మహా శివరాత్రి పర్వదిన (24.02.2017) సందర్భంగా…
- Keerthi Vallabha (keerthivallabha@gmail.com)
Samskarahina ShivaSwarupa Dattatreya Kshetram ఎలా చేరుకోవాలి
How Reach Palamakula Village |
---|
How Reach Palamakula Village |
Route 1: Secunderabad ----> JBS ----> Alwal ----> ORR ----> ShameerPet ----> Tolplaza ----> Duddeda ---> Hanmakonda Road (Warangal Road) ----> RjagopalPet ---> Palamakula ----> Banda Midi Shivuni Gudi (110 KMs) |
Route 2: Warangal ----> Hanmakonda ----> Hasanparthy ----> Husnabad ----> Samudrala ----> Palamakula ---->Banda Midi Shivuni Gudi (65 KMs) |
Samskarahina ShivaSwarupa Dattatreya Kshetram దర్శించడానికి అనువైన సమయం
Samskarahina ShivaSwarupa Dattatreya Kshetram ను అన్ని కాలాలలోనూ దర్శించుకోవచ్చు. పగటిపూట ఉదయం 10:00 AM దాటిన తరువాత వెళ్లడం ఉత్తమం. వెళ్ళడానికి Two Wheeler అయితే Better Option. Four Wheeler అయితే ఎదురుగుండా మరేదైనా వాహనం వచ్చిందంటే మాత్రం ఇబ్బందే. వెళ్లేటప్పుడే మనతో పాటు అన్ని వస్తువులు తీసుకుని వెళ్ళాలి. అక్కడ చుట్టూ ప్రక్కల ఏమి దొరకవు. Two / Four Wheeler మీద నేరుగా గుడివరుకు వేళ్ళవచ్చు. Route తెలుసుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఆటోరిక్షా ఆంజనేయులు (Mob: 9676683805) కు Phone చేసి సహాయం కోరవచ్చు. ఈ క్షేత్రానికి ఒంటరిగా కంటే Group తో వెళ్లడం మంచిది. Public Transport లో వెళ్ళదలచిన వారు ముందుగా Auto Riksha Anjaneyulu కు Phone ద్వారా తెలియ జేస్తే వారు Nominal Charges తో మొత్తం ఇక్కడ ఉన్న క్షేత్రాలను చూపిస్తారు.
Samskarahina ShivaSwarupa Dattatreya Kshetram స్థలపురాణం - ప్రత్యేకతలు
దాదాపుగా 400- 500 సంవత్సరాల క్రితం నాథసంప్రదాయానికి చెందిన ఊరు,పేరు తెలియని ఒక బైరాగి Palamakula గ్రామంలో ఊరు బైటగల కొండ దిగువన పరుచుకున్నట్లుగా ఉండే బండమీద తపస్సు చేసుకొని సంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయుడిని సాక్షాత్కరించుకొన్నాడట. వారి తదుపరి వారి శిష్యగణాలు కూడా ఇక్కడ తపము ఆచరించినట్లుగా చెబుతారు. దాదాపుగా 150 -200 సంవత్సరాలకు ముందు వారంతా ఇక్కడ నుండి ఖాళీచేసి వెళ్లిపోతూ గుడి బాగోగులను అప్పటి గ్రామపాలకులకు అప్పజెప్పి వెళ్లిపోయారట. తదుపరి వచ్చిన రాజులు మరియు నిజాం ప్రభుత్వం హయాంలో ఈ గొప్ప క్షేత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినది. ఫలితంగా అప్పటి నాథసంప్రదాయంలో ఉన్నవారు కొలిచిన స్వయంభు సంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయుడి విగ్రహం దొంగిలించబడినది. దాని స్థానంలో ఇపుడు మనము చూస్తున్న విగ్రహంను సుమారు 150 సంవత్సరాల క్రితం ‘దత్తదాసు’ అనే ఒక అవధూత ప్రతిష్టించారట. సంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయుడికి ఇష్టమైన నైవేద్యం ‘నీరు’ మాత్రమే. అందుకే ఇప్పటికీ ఇక్కడ అంతంత బండల మధ్యలోనూ సహజంగా ఏర్పడిన ఒక కోనేరు ఉంది. ఇందులో ప్రమాదవశాత్తు ఎవరూ పడకుండా ఉండడం కోసం ఎవరో ఒక భక్తుడు దాని చుట్టూ సిమెంట్ గోడలు కట్టించి బావికి పెట్టినట్లుగా గిలకలను పెట్టించాడు. ప్రస్తుతం సంవత్సరంలో ఒక్క మాఘమాస అమావాస్య రోజున మాత్రమే ఈ గుడి దగ్గర జాతర జరుగుతుంది. ఇక్కడ స్వామికి నిత్య ధూప, దీప, నైవేద్యాలు జరగడం లేదు. పురోహితులు కూడా ఎవరు లేరు. ఫలితంగా గుడి చెత్తను వేసే Dumping Yard లావాడడం మొదలు పెట్టారు. తదుపరి అనేక అక్రమాలకూ అడ్డాగా మారిపోయింది. ఇక్కడ గల సంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయమూర్తికి కుడి వైపున విఘ్నేశ్వరుడు, ఎడమ వైపున పార్వతి అమ్మవారు ఉండడం విశేషం. బహుశా ప్రపంచంలోనే ‘గణపతి సహిత పార్వతి సమేత దత్తాత్రేయుడు’ ఈయనే అయ్యి ఉండవచ్చు.
సంస్కారహీన శివస్వరూప దత్తాత్రే యుడు గురించి…
“సంస్కారహీన శివస్వరూపుడు” దత్తాత్రేయుని షోడశ అవతారములలో (16 Incarnations of Guru Dattatreya Before Kali Yuga) 13వ ది. [దత్తాత్రేయుల వారికి కలియుగమునకు పూర్వపు యుగములలో 16 అవతారములు కలవు, వీటిని షోడశదత్తావతారములు అంటారు మరియు కలియుగములో 3 సంపూర్ణ అవతారములు కలవు అవి : 1. శ్రీపాద శ్రీ వల్లభ, 2. నృసింగ సరస్వతి మరియు 3. స్వామి సమర్థ] సంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయుడు దిక్కులనే అంబరములుగా కలిగి మద్య-మగువ ప్రియుడుగా కనిపించే అవతారము.ఇది వైరాగ్యఆశ్రమము మరియు పంచమఆశ్రమమును గురించి తెలియజేస్తుంది. ఈ అవతారము శ్రావణ-శుక్ల-అష్టమీ, సోమవారము రోజున దత్తాత్రేయుల వారిచే ధరింపబడినది. ఈ స్వామికి ఇష్టమైన నైవేద్యం ‘నీరు’ (జలము) మాత్రమే. సంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయునకు నీటిని అర్ఘ్యం ఇవ్వడం వల్ల ప్రారబ్ధ కర్మలు తొలగిపోతాయి. కనుక ఈ స్వామి దర్శనం భక్తులకు మిక్కిలి మేలు చేస్తుంది, మనఃశాంతిని కలగజేస్తుంది.
Samskarahina ShivaSwarupa Dattatreya Kshetram Photos
Samskarahina ShivaSwarupa Dattatreya క్షేత్రం దగ్గరలోగల ఇతర దర్శనీయ ప్రదేశాలు
Other Places Near To Samskarahina ShivaSwarupa Dattatreya Kshetram |
---|
Other Places Near To Samskarahina ShivaSwarupa Dattatreya Kshetram |
1. Sripada Sri Vallabha Kshetram - Rampur Village (Naganuru) (5 KMs) |
2. Sri Vasista RamLal Prabhuj Trust - Velkatur Village (10 KMs) |
3. Sandrananda Ashramam & Dattatreya Temple - Marrimutyala Village (18 KMs) |
- – Jai Guru Datta – -