శ్రీక్షేత్ర దేవ్గడ్ – ప్రవర దత్త క్షేత్రాన్ని దర్శించిన వారి గుండెలు ఆనందంతో నిండిపోతాయి. ఈ క్షేత్రం పేరుకు తగ్గట్లుగానే ఉంటుంది. సంస్కృతంలో ‘ప్రవర’ అనగా ‘Most Excellent’ అని అర్ధం. ఇచ్చటి ప్రశాంత వాతావరణం, 24 గంటలూ వినిపించే ‘హరి’ నామస్మరణ, ‘దత్త’ నామస్మరణలతో భక్తుల శరీరం పులకించి పోతుంది. ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టగానే మనమేదైనా Foreign Country లో ఉన్నామా? అని అనిపిస్తుంది. చెత్త, దుమ్ము, అనవసరపు హారన్ మోతలు ఏమి ఉండవక్కడ. కేవలం ‘దత్తస్మరణే’ ఎటుచూసినా..ఎక్కడ విన్నా… ఇంతటి గొప్ప దత్త క్షేత్రం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాము. శ్రీ కిసాన్ గిరి బాబా అనే అవధూత ఇక్కడకు దగ్గరలో గల ‘నెవాస’ ప్రాంతంలో సంత్ ధ్యానేశ్వర్ (జ్ఞానేశ్వర్) దేవాలం వద్ద ఉండేవారు. తరువాత వారు దేవ్గడ్ ‘ప్రవరనదీ’ ఒడ్డుకుచేరి అక్కడ శ్రీ సంత్ ధ్యానేశ్వర్ (జ్ఞానేశ్వర్) రచించిన భగవద్గీతను (దానికే ‘ధ్యానేశ్వరి’ అని మరోపేరు) మరాఠి లో భక్తులకు భోదించేవారు. ఆ విధంగా కొద్ది సంవత్సరాలు గడిచాక ఒకరోజు అకస్మాత్తుగా శ్రీ దత్తాత్రేయుల వారు సశరీరంతో కనిపించి అవధూత బాబా వారిని ఆశీర్వదించారట. ఫలితంగా అక్కడ గల ‘ప్రవర నది’ ఒడ్డున ఒక గొప్ప దత్త దేవాలయం వెలిసింది. భక్తులు ఉదయాన్నే లేచి ‘ప్రవర’ లో స్నానమాచరించి, దత్తక్షేత్రాన్ని దర్శించి, అక్కడ గల ఔదుంబర వనంలో కుర్చుని ఔదుంబర వృక్షాల క్రింద పారాయణ చేసుకుంటారు. దత్తాత్రేయుల వారు ఎన్నోసార్లు వివిధ రూపాలలో ఇక్కడ గల ఔదుంబర వనంలో విహరించారని ఇక్కడ గల Night Shift Security వారు తెలిపారు. ఈ క్షేత్రంలో గోపురాలకు, గోడలకు, బురుజులకు ‘గంటలు’ (Bells) కట్టబడి ఉంటాయి. దత్తాత్రేయుల వారు వచ్చినప్పుడు అవి వాటంతతవే మ్రోగుతాయాట, ఈ విధమైన సంఘటనలు ఇక్కడ సర్వసాధారణమని ఇక్కడి పురోహితులు చెబుతారు. ఒక్కోసారి దత్తాత్రేయుల వారు నవనాథుల సహితంగా ఇక్కడ విహరిస్తారట. ఇక్కడ గల ఔదుంబర వనంలో తరచుగా దత్తాత్రేయుల వారు విహరిస్తుండడం వల్ల ఈ క్షేత్రానికి ‘దత్తదివ్యోద్యానవనం’ (Garden of Eden of Dattatreya) అని పేరు. ఇంతటి గోప్ప దత్తక్షేత్రం Shirdi కి అతి దగ్గరలో ఉన్నప్పటీకీ దర్శించే తెలుగు వారు మాత్రం అతి అరుదు.
శ్రీక్షేత్ర దేవ్గడ్ – ప్రవర దత్త క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి?
By Own Transport (Shirdi To Devgad 70 KMs - 2 Hours Journey)
By Own Transport (Shirdi To Devgad 70 KMs - 2 Hours Journey)
By Public Transport (MSRTC Bus) - Shirdi To Devgad 75 KMs - 2 గంటల ప్రయాణం (By Shirdi To Aurangabad Bus Via: Devgad Patha)
By Public Transport (MSRTC Bus) - Shirdi To Devgad 75 KMs - 2 గంటల ప్రయాణం (By Shirdi To Aurangabad Bus Via: Devgad Patha)
Route 1 : Shirdi RTC Bus Stand (Opp: Khandoba Temple) ----> Catch Shirdi To Aurangabad Bus ---->Rahata ----> Srirampur ----> Newasa ----> Newasa Patha ----> Devgad Patha ----> Getdown At Devgad Patha And Catch Sharing Auto Riksha To Devgad (Auto Riksha Charge Rs.10/- 4KMs Only) -'నెవాసా పాఠా' అంటే 'నెవాసా అడ్డరోడ్డు' అని అర్ధం / 'దేవ్గడ్ పాఠా' అంటే 'దేవ్గడ్ అడ్డరోడ్డు' అని అర్ధం
Route 2 : Shirdi RTC Bus Stand (Opp: Khandoba Temple) ----> Catch Shirdi To Aurangabad Bus ---->Rahata ----> Srirampur ----> Newasa ----> Newasa Patha ----> Getdown At Newasa Patha And Catch Sharing Auto Riksha To Devgad (Auto Riksha Charge Rs.15/- 8 KMs Only)
Route 3 : Shirdi RTC Bus Stand (Opp: Khandoba Temple) ----> Catch Shirdi To Aurangabad Bus ---->Rahata ----> Srirampur ----> Newasa ----> Getdown At Newasa Bus Stand And Catch Sharing Auto Riksha To Newasa Patha (Auto Riksha Charge Rs.10/- 3 KMs Only) ----> Getdown At Newasa Patha And Catch Sharing Auto Riksha To Devgad Patha (Auto Riksha Charge Rs.10/- 4 KMs Only) ----> Getdown At Devgad Patha And Catch Sharing Auto Riksha To Devgad (Auto Riksha Charge Rs.10/- 4KMs Only)
శ్రీక్షేత్ర దేవ్గడ్ – ప్రవర దత్త క్షేత్ర దర్శనానికి అనువైన సమయం…
శ్రీక్షేత్ర దేవ్గడ్ – ప్రవర దత్తక్షేత్రాన్ని షిర్డీ క్షేత్రం నుండి ఒక్కరోజులో దర్శించుకొని రావచ్చు, మరియు ఈ క్షేత్ర దర్శనానికి అన్ని కాలాలు అనువైనవే. Shirdi నుండి ప్రతీ 20 నిముషాలకు Aurangabad కు MSRTC Bus సౌకర్యం ఉంది. Aurangabad Bus ఎక్కి Newasa / Newasa Patha / Devgad Patha దగ్గర దిగి Sharing Auto Riksha ద్వారా సులభంగా శ్రీక్షేత్ర దేవ్గడ్ – ప్రవర దత్త క్షేత్రాన్ని చేరుకోవచ్చు. అలాగే శ్రీపాద శ్రీవల్లభ జయంతి రోజూ, గురుపౌర్ణమి రోజూ, నృసింహసరస్వతి స్వామి జయంతి రోజూ మరియు దత్త జయంతి రోజు ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. వెళ్లేముందు Route Map And శ్రీక్షేత్ర దేవ్గడ్ – ప్రవర దత్త క్షేత్ర Phone Number లను నోట్ చేసుకొని వెళ్ళవలసినదిగా మనవి.
శ్రీక్షేత్ర దేవ్గడ్ – ప్రవర దత్త క్షేత్రంలో ఎక్కడ ఉండాలి?
శ్రీక్షేత్ర దేవ్గడ్ – ప్రవర దత్త క్షేత్రాన్ని షిర్డీ క్షేత్రం నుండి ఒక్కరోజులో దర్శించుకొని రావచ్చు. సాధారణంగా భక్తులు Shirdi లో Accommodation తీసుకుని తెల్లవారు ఝామున మొదటి బస్సు (Starts At 04:00 AM, అప్పటి నుండీ ప్రతీ 20 నిముషాలకి ఒక Bus కలదు) కు బయల్దేరి శ్రీక్షేత్ర దేవ్గడ్ – ప్రవర దత్త క్షేత్రాన్ని చూసుకొని తిరిగి అటుపిమ్మట దగ్గరలో గల ఇతర క్షేత్రాలను చూసుకొని తిరిగి రాత్రికి Shirdi చేరుకుంటారు. శ్రీక్షేత్ర దేవ్గడ్ – ప్రవర దత్త క్షేత్రానికి మరోపేరు ‘దత్తదివ్యోద్యానవనం’ (Garden of Eden of Dattatreya) కాబట్టి చాలామంది దత్త భక్తులు అక్కడి వాతావరణాన్ని చూసి ముగ్ధులై అక్కడ కనీసం ఒకటి-రెండు రోజులు ఉంటారు. దత్తభక్తులు ఉండడం కోసం శ్రీక్షేత్ర దేవ్గడ్ – ప్రవర దత్త క్షేత్రంలో Bhaktha Niwas & Yatri Niwas అనే రెండు వసతీ గృహాలు కలవు. కనీస రుసుముతో వాటిని ఇక్కడికి పారాయణ చేసుకోవడానికి వచ్చిన భక్తులకు ఇస్తారు. Accommodation తో పాటు Free Food Donation సౌకర్యం కుడా కలదు. ఇవికాక శ్రీక్షేత్ర దేవ్గడ్ – ప్రవర దత్త క్షేత్రం లోపలగల ‘కాంప్లెక్స్’ నందు ప్రైవేటు క్యాంటిన్ సదుపాయం కుడా ఉంది. అలాగే ఇక్కడ ATM సౌకర్యంతో పాటుగా వివిధ పూజా సామాగ్రి అమ్మే దుకాణాలు కుడా కలవు.