Pujalu
Pujalu (పూజలు)
శ్రీపాద శ్రీ వల్లభ పూజ (Sripada Sri Vallabha Puja)
శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారిని పూజించడానికి క్రింది ఆడియోను డౌన్లోడ్ చేసుకొని ఆడియో ఫైల్ ను అనుసరించి పూజించుకోవచ్చు. పూజకు కావలసిన సాధారణ ద్రవ్యాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఈ పూజ శ్రీపాదుల వారికి, దత్తత్రేయునికి మరియు నరసింహసరస్వతి స్వామివారికి చేయవచ్చు. ఈ పూజను ప్రతీ చిత్రానక్షత్రం రోజున కూడాచేసుకోవచ్చు.
Sripada Sri Vallabha Puja Part – 1 (డౌన్లోడ్ చేసుకోవడం కోసం Right Click – Save As… తీసుకోండి)
Sripada Sri Vallabha Puja Part – 2 (డౌన్లోడ్ చేసుకోవడం కోసం Right Click – Save As… తీసుకోండి)
శనిప్రదోష పూజ(ShaniPradosha Puja)
శనిప్రదోష పూజ గురించి శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంలో 6వ,10వ మరియు 24వ అధ్యాయంలో వివరించబడినది. ప్రతీ శనివారం నాటి సాయంసంధ్య మహాశక్తివంతమైనది. అలాగే శనివారం త్రయోదశి మరియు శనివారం చతుర్దశి తిథులు అతిబలమైనవి. ప్రతీ జీవికి పుట్టుకతో పాటు వచ్చే ప్రారబ్ధకర్మల యొక్క శేషం శూన్యం చేయుటకు ఇదొక్కటే మార్గం. అందువల్లనే శనిప్రదోష పూజ అత్యంత ప్రసస్థమైనది. అదే విధంగా రాహుగ్రహ పూజ కుడా విశేష మైనదే. ఎందుకంటే రాహువు, శనిగ్రాహం వలెనె ఫలితాలను ఇస్తాడు. అందువల్లనే శ్రీపాదుల వారి కుటుంబసభ్యులు మరియు వెంకటప్పయ్య శ్రేష్టి, నరసింహ వర్మ తదితరులు కుడా ప్రతీ వారం జరిగే శనిప్రదోష పూజలో పాలుపంచుకునే వారు.
శనివారం నాడు ప్రదోష సమయాన (సాయం సంధ్య) శివ ఆరాధన చేసినట్లయితే కర్మ దోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున ఏ మానవుడైనా శుభ స్పందనలను పొందాంటే శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం.
- దానము: శివార్చన అనతరం నల్లనువ్వులు దానం చేయవలెను
- అభిషేకం: నల్లనువ్వుల నునెతో శివునికి అభిషేకం చేయవలెను.
శనిప్రదోష పూజ ఎలా చేయాలి?
ప్రతీ శని వారం సాయం సంధ్యలో శనిప్రదోష స్తోత్రం చదువుతూ అభిషేకం చేస్తూ పూజించాలి. లింగాష్టకం కుడా చదవవచ్చు. ఈపూజలో శివునికి విధిగా బిల్వం సమర్పించాలి.
శనిప్రదోష పూజ యొక్క ఫలితాలు
స్త్రీలకు : అనుకున్నవారితో అనుకున్నప్పుడు / సరైన సమయంలో పెళ్లి జరగడం, మంచి భర్త లభించడం, చక్కని సంసారం, ఉత్తమ సంతానం కలగడం, సిరిసంపదలు మరియు సౌభాగ్యం, కొత్త ఉద్యోగం లభించడం, ఇంటర్వ్యూల్లొ సులభ విజయం
పురుషులకు : ఋణబాధలు తీరడం , అన్నింటా విజయం, అపమృత్యు భయం తొలగడం, ఆయు:ఆరోగ్యాలు, ఉద్యోగవిజయం, విపరీతమైన / ఆకస్మిక ధనలాభం, కొత్త ఉద్యోగం లభించడం, ఇంటర్వ్యూల్లొ సులభ విజయం
2013 -2014 విజయనామసంవత్సరంలో గల శని త్రయోదశి మరియు శని చతుర్దశి వివరాలు
Date (తేది) | Thiti (తిథి) |
---|---|
Date (తేది) | Thiti (తిథి) |
02-November-2013 | శని - చతుర్దశి |
16-November-2013 | శని - చతుర్దశి |
14-December-2013 | శని - త్రయోదశి : ఉదయం 09-20 వరుకు |
15-March-2014 | శని - చతుర్దశి |
29-March-2014 | శని - త్రయోదశి : తెల్లవారుజామున 05-05 వరుకు |
శనిప్రదోష స్తోత్రం (Shani Pradosha Stotram) |
---|
శనిప్రదోష స్తోత్రం (Shani Pradosha Stotram) |
ఏనార్చయంతి గిరీశం సమయై ప్రదోషే ఏనార్చితం శివమపి ప్రణమంతి చాన్యే యేథ కథాం శృతి పుటైర్నపి బంతి మూడా: థె జన్మ జన్మ శుభవంతి నరా దరిద్రా: |
ఏ వై ప్రదోష సమయే పరమేశ్వరస్య కుర్వంతనన్య మనసౌంగ్రి సరోజ పూజాం నిత్యం ప్రవృద్ధ ధన ధాన్య కళత్ర పుత్రా సౌభాగ్య సంపదధికాస్త ఇహైవ లోకే |
కైలాశ శైల భువనేత్రి జగజనీత్రీమ్ గౌరీం నివేక్ష కనకార్చిత రత్న పీఠె నృత్యం విధాతు మభి వాంఛతి శూలపాణౌ దేవా ప్రదోష సమయే నభజంతి సర్వే |
ఘందర్వ యక్ష పథ ఘొరఘ సిద్ధ సాధ్యా విద్యా ధరామ రావరాప్స రసాం గణాస్చ ఏన్నేత్రి లోక నిలయ సహాభూత వర్గాః ప్రాప్తే ప్రదోష సమయే హర పార్శ్వ సంస్థా |
అతః ప్రదోషే శివ ఏక ఏవ పుజ్యో ధనాన్యే హరి పద్మజాడ్యా: తస్మిన్ మహేషే విధినేజ్యమానె సర్వే ప్రశీదంతి సురాధి నాథా: ... |
శని ప్రదోష స్తోత్రం విడియో చూడడం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
శని ప్రదోష స్తోత్రం (Shani Pradosha Sthotram)
Leave a Reply
You must be logged in to post a comment.