Rajamahendravaram
Bhakthavatsala Dattatreya – Rajamahendravaram (Rajahmundry)
భక్తవత్సల దత్తాత్రేయుడు - రాజమహేంద్రవరం (రాజమండ్రి)
దిగంబరా..దిగంబరా..భక్తవత్సల దత్త దిగంబరా..
Sri Vasudevananda Saraswathi (Tembe Swamy) Pratistitha Bhakthavatsala Dattatreya & Datta Paduka
శ్రీ వాసుదేవానంద సరస్వతి (టెంబే స్వామి) ప్రతిష్ఠిత భక్త వత్సల దత్తాత్రేయుడు & దత్త పాదుకలు
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే..దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా..శ్రీభక్తవత్సల దత్తాత్రేయ దిగంబర..దత్త బంధువులందరికీ జైగురుదత్త..
శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామివారు (టెంబే స్వామి) క్రీ.శ. 1908 & క్రీ.శ. 1909 (శక 1829-1830) లో కృష్ణానదీ పరిక్రమలో భాగంగా శ్రీశైలంవద్ద తెలుగునాట అడుగెడినారు, అది మొదలు కృష్ణానదీ మరియు గోదావరినదీ పరివాహక ప్రాంతాలలో అనేక క్షేత్రాలను దర్శించిన శ్రీటెంబే స్వామి 18వ చాతుర్మాస దీక్షను గురుపౌర్ణమి రోజున ముక్త్యాల (Muktyala Village, Krishna District, AP) అనే గ్రామంలో మొదలుపెట్టారు. పిమ్మట వారు ముక్త్యాల గ్రామాన్ని వీడి నుండి కోగూరు (Koguru / Kovvuru – కొవ్వూరు) మీదుగా రాజమహేంద్రవరం (Rajamahendravaram / Rajahmundry) చేరి అక్కడ పవిత్ర గోదావరి నది ఒడ్డునగల శ్రీశృంగేరి శారదాపీఠం ప్రాంగణంలో ‘భక్తవత్సల దత్తాత్రేయుడు’ని మరియు దత్తపాదుకలను ప్రతిష్టించారు. రాజమహేంద్రవరంలోనే శ్రీటెంబే స్వామిని షిర్డీ నుండి పూరి జగన్నాథస్వామి దర్శనానికై వెళుతున్న పుండలీకరావు (దాసుగణు మహారాజ్) అనబడే షిర్డీ సాయి భక్తుడు కలవడం, అప్పుడు శ్రీటెంబే స్వామి సాయికి సమర్పించవలసినదిగా ఒక కొబ్బరికాయను ఇవ్వడం మనకు తెలిసిందే. శ్రీటెంబే స్వామి ప్రతిష్టించిన దత్తాత్రేయుడు మరియు దత్తపాదుకలు రాజమహేంద్రవరంలో గోదావరినది ఒడ్డునగల శ్రీశృంగేరి శారదా పీఠం / శంకర మఠం ప్రాంగణంలో ఉన్నట్లు తెలుసుకున్న నేను అక్కడకి వెళ్లి దర్శించి, తరించడం జరిగింది. అందరికీ తెలియనివీ, పెద్దగా ప్రాచుర్యంలోకిరానివీ, పరమ పవిత్రమైనవీ అయిన ఇక్కడి భక్తవత్సల దత్తాత్రేయుడు మరియు పాదుకలను దత్తభక్తులందరూ తప్పక దర్శించి, తరిస్తారని ఆశిస్తూ … జై గురుదత్త
- Keerthi Vallabha (keerthivallabha@gmail.com)
Rajamahendravaram (Rajahmundry) BakthaVatsala Dattatreya & Datta Paduka ఎక్కడ ఉన్నాయి?
Rajamahendravaram (Rajahmundry)లో గోదావరి నది ఒడ్డున గల Gouthami Childerns Park / APTDC Boat Station (గౌతమి పార్క్) ఎదురుగుండా ఉన్న Sri Sringeri Sharada Pitam / Sri Sringeri Shankara Matam లోపల గలవు. ఇక్కడ ఉన్న Sri Sringeri Sharada Pitam లోపలకు Enter అవ్వగానే Sri Dattatreya Mandir, Sri Sharada Maatha Mandir & Sri ChandraMoulishwara Mandir అనే మూడు దేవాలయాలు కలిసి కనిపిస్తాయి. కానీ Sri Vasudevananda Saraswathi (Tembe Swami) వారు ప్రతిష్టించిన BakthaVatsala Dattatreya మరియు Datta Paduka అదే ప్రాంగణంలో క్రిందన ఉన్న Cellar లో ఉంటాయి. అక్కడ గల పూజారి గారిని “Vasudevananda Saraswathi Swamy ప్రతిష్టించిన BakthaVatsala Dattatreya మరియు Datta Padukaలను చూడాలి దయచేసి Cellar యొక్క Grill Lockను Open చెయ్యమని” అడగాలి. BakthaVatsala Dattatreya మరియు Datta Padukaలు గోదావరి నది మట్టానికి సమాంతరంగా ఉండడం వల్ల ప్రస్తుతం అవి Cellarలో ఉన్నాయి. పైన గల Sri Dattatreya Mandirలో ఉన్న దత్తాత్రేయులవారు Cellar లోకి దిగలేని భక్తుల దర్శనార్ధం నూతనంగా ప్రతిష్టించబడినారు.
Rajamahendravaram BakthaVatsala Dattatreya Kshetram ఎలా చేరుకోవాలి..
Distance Between Hyderabad To Rajamahendravaram (Rajahmundry): 450 KMS |
---|
Distance Between Hyderabad To Rajamahendravaram (Rajahmundry): 450 KMS |
Secunderabad ----> Vijayawada ----> Eluru ----> Tadepalligudem ----> Nidadavolu ----> Rajahmundray ----> Sri Sringeri Sharada Pitam, Godavari Ghat |
Rajamahendravaram BakthaVatsala Dattatreya Kshetram దర్శించడానికి అనువైన సమయం
Rajamahendravaram BakthaVatsala Dattatreya క్షేత్రంను దర్శించడానికి అన్ని కాలాలూ అనువైనవే. Sri Sringeri Sharada Pitam ఉదయం మరియు సాయంత్రం వేళల్లో నిర్ణీత సమయాల్లోనే తెరుస్తారు కనుక ఆయా సమయాల్లో భక్తులు ఎప్పుడైనా స్వామి వారిని దర్శించుకోవచ్చు.
Rajahmundry లో ఎక్కడ ఉండాలి
Rajamahendravaram (Rajahmundry) లో ఉండడానికి అనేక సదుపాయాలు కలవు. బడ్జెట్ హోటల్స్ నుండి స్టార్ హోటల్స్ వరుకు అన్ని సదుపాయాలు గల పట్టణం రాజమండ్రి.
Rajamahendravaram BakthaVatsala Dattatreya Kshetram యొక్క స్థల పురాణం
శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గురించి: టెంబే వంశస్థ పుణ్యదంపతులైన గణేశభట్ టెంబే, రమాబాయి దంపతులు మాణెగావ్ ( మహరాష్ట్ర లోని ) కి చెందిన వారు. గణేశభట్ శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి భక్తుడు. వారు నిరంతరం దత్తనామస్మరణని చేసుకుంటూ, తరచూ గాణుగాపుర క్షేత్రము వెళ్లి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని పూజించుకునేవారు. ఒకసారి స్వామి వారి సేవలో గణేశభట్ పన్నెండు సంవత్సరాలు గడిపారు. అలా గడుపుతున్న రోజులలో ఒకరోజు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు “నువ్వు ఇకపై గాణుగాపురము రానవసరంలేదు, ఇక్కడ గడపనవసరంలేదు, నీవు గృహస్థుడివి, వెంటనే ఇంటికి వేళ్ళు, నేనే వచ్చి నిన్ను కలిసుకుంటాను” అని గణేశభట్ కి స్వప్నంలో ఆదేశిస్తారు. ఆ దంపతుల పుణ్యతత్పరతకి మెచ్చిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఆనందనామ సంవత్సర శుక్ల పంచమి దినాన అనగా 13/August/1854 తేదీన ఆ దంపతులకి కుమారుడుగా జన్మించాడు. అలా పుట్టిన ఆ బాలుడికి ‘వాసుదేవశాస్త్రి’ గా నామకరణం చేసారు. దినదిన ప్రవర్దమానమవుతున్న వాసుదేవశాస్త్రి ఉపనయనానంతరం సంధ్యావందనాది సంస్కారాలను , గురుచరిత్ర నిరంతర పారాయణనూ, వేదాభ్యాసమునూ కొనసాగించాడు, జ్యోతిష్యము, సంస్కృతము నేర్చుకున్నాడు. తన 21వ యేట అన్నపూర్ణాబాయి అనే ఒక అవిటి స్త్రీని వివాహమాడారు.
నిరంతర శ్రీగురుచరిత పారాయణ వలన వాసుదేవశాస్త్రికి దత్తాత్రేయ కరుణాకటాక్షాలు అపారంగా ఉండేవి. చూచుటకు చండాలుడుగా గోచరించే వాసుదేవశాస్త్రి ను అమరపురంలోని శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకల పూజకు గుడిలోపలకు వెళ్ళడానికి అక్కడ ఉన్న పూజారులు అనుమతి ఇవ్వలేదు. అక్కడే ఉన్న గోవిందస్వామి అనబడే వారి యొక్క మాటమీద పురోహితులు వాసుదేవశాస్త్రిని గుడిలోనికి అనుమతిస్తారు. అక్కడి పాదుకలను వాసుదేవశాస్త్రి నిరంతరం ఒక మాసం పాటు పూజించుకున్నారు. తదుపరి మిరాజ్ లో వున్న ‘శంకరభట్టు’ నుండి శ్రీ గురుచరిత్ర తీసికుని పారాయణ చేయమని స్వప్నాదేశమిస్తారు దత్తాత్రేయుల వారు. కానీ శంకరభట్టు ఎవరికీ తన గురుచరిత్ర గ్రంధాన్ని కనీసం ముట్టుకోవడానికి కూడా యివ్వడు, అందువలన దత్తాత్రేయుడు శంకరభట్టుకీ స్వప్నదర్శనమిచ్చి ఆ గ్రంధాన్ని వాసుదేవశాస్త్రికిమ్మని ఆదేశిస్తారు. ఒక రోజున రాత్రి దత్త భగవానుడు గోవిందస్వామికి స్వప్నంలో వాసుదేవశాస్త్రి గురించి చెబుతారు. తటాలున లేచిన గోవిందస్వామి “వాసుదేవశాస్త్రీ నీకు మంత్రోపదేశం చేయమని దత్తాత్రేయుడు ఆజ్ఞాపించారు” అని చెపుతారు. గోవిందస్వామి మరియూ దత్తాత్రేయుడూ ఒక్కరే అని గ్రహించిన వాసుదేవశాస్త్రి, గోవిందస్వామిని తన గురువుగా స్వీకరించి మంత్రసాధన ప్రారంభిస్తాడు.
ఒక సారి భార్యతో కలసి తీర్ఠయాత్రలకి వెళుతున్న వాసుదేవశాస్త్రికి దత్తాత్రేయుడు ’గంగాఖేడ’లో స్వప్నదర్శనమిచ్చి “ఈరోజు నుండి నాలుగోరోజున మీ ఇద్దరినీ నాలో కలుపుకుంటాను” అని చెప్తాడు. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించే వాసుదేవశాస్త్రి తనకు సన్యాసం స్వీకరించాలని వుందనీ, తన భార్యని తీసికుని వెళ్ళమని దత్తాత్రేయుల వారిని వేడుకుంటాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆమె కలరా వ్యాధి వలన మరణిస్తుంది. కర్మకాండలన్నీ పూర్తయిన రాత్రి దత్తాత్రేయుడు వాసుదేవునికి స్వప్నంలో ఆయన గురువు గోవిందస్వామి రూపంలో దర్శనమిచ్చి, వాసుదేవుని కుడిచెవిలో ప్రాణవాన్ని ఉపదేశించి, ఎల్లవేళలా ఆ మంత్రాన్ని జపించమనీ, కేవలం బిక్షతో మాత్రమే జీవించమనీ ఆదేశిస్తారు. ఆ విధంగా సన్యాసాశ్రమం లోకి వచ్చిన తదుపరి వాసుదేవానంద సరస్వతి స్వామిగా విఖ్యాతమయ్యారు. ఉత్తారాది నుండి దక్షిణాది వరకు, తూర్పు నుండి పడమర వరుకు నడకతో యాత్రసాగించి దేశం లోని వివిధ ప్రాంతాలలో 23 చాతుర్మాస దీక్షలు పాటించారు.
ఒక సారి వాసుదేవానంద సరస్వతి తమ యాత్రలో భాగంగా శ్రీరంగంలో అప్పటి శృంగేరీ శంకరాచార్యులు అయిన శ్రీ శివాభినవ నృసింహ భారతి స్వామి వారిని దర్శించుకున్నారు. వాసుదేవానంద సరస్వతిని సత్కరించిన శంకరాచార్యులు ’ఈ యన మానవ రూపంలో ఉన్న దత్తాత్రేయుడు, ఆది శంకరాచార్యులవలె ఆసేతుహిమాచలం పాదయాత్ర చేయుచూ అనేకానేక దత్త దేవాలయాలకు అంకురార్పణ చేశారు’ అని చెప్పారు.
వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యాత్రలో భాగంగా ఆంధ్రపదేశ్ లోని తిరుపతి, శ్రీకాళహస్తి, వేంకటగిరి, నెల్లూరు, శ్రీశైలం వంటి క్షేత్రాలను దర్శిస్తూ 1908 వ సంవత్సరంలొ ముక్త్యాల (Muktyala) లో ఆషాడ పౌర్ణమి రోజున 18వ చాతుర్మాస దీక్షను ప్రారంభించారు. తర్వాత హంసలదీవికి వచ్చి నదీ-సాగర సంగమస్నానం చేసారు. మచిలీపట్నం గుండా ప్రవహించే సప్తగోదావరిని దర్శించుకున్నారు. 1909-1910 వ సంవత్సరంలో రాజమహేంద్రవరం/Rajamahendravaram (Rajahmundry రాజమండ్రి) లో శృంగేరీ శారదా మఠంలో గోదావరి నదీతీరాన ‘బ్రహ్మానంద సరస్వతి’ అను వారి యొక్క ప్రోద్బలంతో దత్తాత్రేయుని విగ్రహాన్ని, పాదుకలను ప్రతిష్టించి అక్కడ ప్రతిష్టించిన దత్తాత్రేయునకు ’భక్తవత్సలుడు’ అని పేరుపెట్టారు. వారు రాజమండ్రిలో విడిది చేసిన కాలంలోనే నాందేడు నుండి పుండలీకరావు (దాసుగణు మహారాజ్) అనే భక్తుడు తన మిత్ర బృందంతో పూరిలో వేంచేసిన శ్రీజగన్నాథ స్వామి దర్శనానికి వెళుతూ వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని రాజమహేంద్రవరంలో కలిశారు. అప్పుడు పుండలీకరావు తిరుగుప్రయాణమవుతుండగా వాసుదేవానంద సరస్వతి స్వామి ఒక కొబ్బరికాయని పుండలీకరావుకిచ్చి “దీనిని షిరిడీలో వున్న నా సోదరుడు సాయిబాబాకి నా తరపున సమర్పించండి” అని చెప్పిన విషయము మనకు విదితమే. ఆ తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి వాయసపుర (కాకినాడ ) సముద్రములో స్నానించి పీఠికాపురం చేరుకున్నారు. పీఠికాపురం కుక్కుటేశ్వర ఆలయప్రాంగణంలో బసచేసిన వీరు పీఠికాపురం శ్రీపాద శ్రీ వల్లభులవారి జన్మస్థలమన్న సంగతిని వెలుగులోకి తెచ్చారు. వాసుదేవానంద సరస్వతి స్వామి గురుదత్తాత్రేయుల వారి మీదే కాకుండా అనేక నదులపై కావ్యాలను వ్రాసారు. గంగా నదిపై “గంగాలహరి” అనే కావ్యం, మరి ముఖ్యంగా సాక్షాత్తు గురుస్వరూపమైన కృష్ణానదీ పై “కృష్ణాలహరి” అనే కావ్యం వాడీ – గణగాపురం మార్గమద్యంలో ఉండగా వ్రాసారు. ఆ మార్గ మధ్యలో కృష్ణమ్మ ప్రత్యక్షమై ‘కృష్ణాలహరి’ కావ్యాన్ని వ్రాసి, వినిపించమనగా వెంటనే ఆసువుధారతో దత్తాత్రేయుల వారి ఆశీస్సులతో చెప్పారు. అది విన్న కృష్ణమ్మ చలించిపోయి ఆనందభాష్పాలు రాల్చిందని తెలియవచ్చింది. నర్మదానది మీద ‘నర్మదాలహరి’,అలాగే పినాకినినది పైన కూడా కావ్యాలను వ్రాసారు.
ముందు నుండి వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కొన్ని పద్దతులను పాటించేవారు. కొన్నైతే సాక్షాత్తు దత్తాత్రేయులవారే స్వయంగా దిగివచ్చి చెప్పినా మార్చుకోలేనంత మొండిఘటంగా ఉండేవారు. కేవలం బ్రాహ్మణుల ఇళ్లలో మాత్రమే బిక్ష చేసేవారు, అది కూడా మూడు ఇళ్లలో చేసేవారు. ఒకవేళ ఊరిలో ఒకటి లేదా రెండు బ్రాహ్మణ ఇళ్ళు ఉన్నా, లేదా అసలు లేకపోయినా పస్తులు ఉండేవారు కానీ ఇతర చోట్ల తినే వారు కాదు. వీరిని ఎన్ని రోగాలు భాదించినా మందులు వేసుకునేవారు కాదు, కానీ ఇతరులకు ఉన్న రోగాలను తగ్గించడానికి మాత్రం మందులు ఇస్తూ ఉండేవారు. ఒకసారి ఒక గ్రామంలో వాసుదేవానంద సరస్వతి స్వామి వెళుతుండగా ఒక గుడిసె దగ్గర అతి తేజోవంతుడైన చిన్నపిల్లవాడు కనిపిస్తాడు. ఆ పిల్లవాడు వాసుదేవానంద సరస్వతి స్వామిని గుడిసెలోకి పిలిచి తినుటకు జొన్న రొట్టెలను ఇస్తాడు. అది చూసిన వాసుదేవానంద సరస్వతి ‘మూడు బ్రాహ్మణుల ఇళ్లలో బిక్ష తప్ప మరేదీ తీసుకునేప్రశక్తేలేదని’ చెపుతారు. అది విన్న ఆ చిన్నపిల్ల వాడు ‘నీకింకా ద్వైతభావం పోలేదు’ అని చెప్పి మాయమవుతాడు. మరొక సారి మంత్రకూటము (Manthani మంథని) అనే గ్రామ అడవుల్లో వాసుదేవానంద సరస్వతి స్వామి చాతుర్మాస దీక్షను చెయ్యాలి అనుకున్నారు. కానీ దత్తాత్రేయుల వారు వాసుదేవానంద సరస్వతి ని వెంటనే మంత్రకూటమును (Manthani) విడిచి ఉత్తరదిక్కుగా వెళ్ళమని ఆజ్ఞ చేశారు. కానీ వాసుదేవానంద సరస్వతి స్వామి దత్తాత్రేయుల వారి మాటను వినకుండా అక్కడే ఏర్పాట్లు చేసుకోసాగారు. చెప్పిచెప్పి విసుగెత్తిన దత్తాత్రేయుల వారు ఒక ముస్లిం వేషధారిగా గుఱ్ఱంపై వచ్చి కొరడాతో అదిరించి, బెదిరించి ఉత్తర దిక్కుగా వెళ్ళేటట్లు చేసారు. అలాగే పీఠికాపురం చేరిన వీరు అక్కడకు దగ్గరలోగల శ్రీపాద శ్రీ వల్లభ వంశీకులను కలసి ‘శ్రీపాద శ్రీ వల్లభ దివ్య చరితామృతము’ అనే గ్రంధాన్ని ఇవ్వమని అడగగా, శ్రీపాద శ్రీ వల్లభ వంశీకులు ఆ గ్రంధం 33వ తరం లోనే బైటకు వస్తుందనీ, రాకకు ముందు పాదుకా ప్రతిష్ట తప్పని సరిగా జరగాలని చెబుతారు. అది తెలుసుకున్న వాసుదేవానంద సరస్వతి స్వామి పీఠికాపురంలో శ్రీపాద శ్రీ వల్లభులవారి పాదుకలను ప్రతిష్టించిడానికి శతవిధాలా ప్రయత్నించి విఫలమైనట్లుగా గ్రంధంలో తెలియజేయబడినది.
రాజమహేంద్రవరం (రాజమండ్రి) లో దత్తాత్రేయ విగ్రహం మరియు పాదుకా ప్రతిష్ట: రాజమహేంద్రవరంలో పవిత్ర గోదావరినది ఒడ్డున గల శ్రీ శృంగేరి శారదా పీఠం ప్రాంగణంలో భక్తవత్సల దత్తాత్రేయుడుని మరియు దత్తపాదుకలను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి హస్తాలమీదుగా ప్రతిష్టించడానికి ముఖ్యకారకులు శ్రీ బ్రహ్మానంద సరస్వతి అనబడే వారు. వీరు గుంటూరు దగ్గర గల మంగళగిరి వాస్తవ్యులు. వీరి అసలు పేరు గోవిందరాజుల రామచంద్రం. వీరు శ్రీ నృసింహసరస్వతి స్వామి వారి భక్తు లు . తరచుగా Nrusimhawadi వెళ్లి వస్తూఉండేవారు. అక్కడే ఒకసారి వీరికి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారితో పరిచయం ఏర్పడింది. సన్యాసం తీసుకుని బ్రహ్మానంద సరస్వతి గామారిన తరువాత వీరు కోగూరు / కొవ్వూరు లోని పరమానంద స్వామి వారి దగ్గర ఉన్నప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కోగూరు / కొవ్వూరు వచ్చారు. అప్పుడు శ్రీ బ్రహ్మానంద సరస్వతి గారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని ఒప్పించి వారిజీవితంలో మొట్ట మొదటిసారిగా కోగూరు / కొవ్వూరు నుండి రాజమహేంద్రవరం (రాజమండ్రి) వరుకు పడవలో ఎక్కించుకుని (అప్పట్లో కొవ్వూరు – రాజమండ్రి మధ్యన Bridge లేదు, Railway Bridge మాత్రమే ఉండేది) తీసుకు వచ్చారు. ఇక్కడ విశేషమేమిటంటే ఆ పడవను బ్రాహ్మణులే నడిపారు. దీనికోసం కొంత మంది బ్రాహ్మణులకు ముందుగానే తర్ఫీదు ఇప్పించారు శ్రీ బ్రహ్మానంద సరస్వతి. రాజమహేంద్రవరం (రాజమండ్రి) వచ్చిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి శృంగేరి శారదా పీఠంలో బస చేశారు.
ఒకానొక శుభదినాన, శుభముహూర్తాన, మాఘమాసం పౌర్ణమి రోజున గోదావరి నది ఒడ్డున శ్రీ శృంగేరి శారదా పీఠం ప్రాంగణంలో వాసుదేవానంద సరస్వతి స్వామి త్రిముఖ షట్భుజ దత్తాత్రేయ విగ్రహాన్నీ, దత్తాత్రేయ పాదుకలను ప్రతిష్టించారు. విగ్రహ ప్రతిష్ట సమయంలో వాసుదేవానంద సరస్వతి స్వామి ” ఇప్పటి వరుకు అన్ని ప్రాంతాల్లో ఏఖముఖుడుగా ఉన్న దత్తాత్రేయుల వారినే ప్రతిష్టించాను. కానీ ఈ రోజు బ్రహ్మానంద సరస్వతి బలవంతము మరియు వత్తిడి మీద త్రిముఖ దత్తాత్రేయుడిని ప్రతిష్టించవలసి వచ్చింది” అని ఆక్షేపించారు. అయినప్పటికీ వారు ఆశీర్వదించారు. వారు ప్రతిష్టించిన త్రిముఖ దత్తాత్రేయుడికి “భక్తవత్సల దత్తాత్రేయుడు” అని పేరు పెట్టారు. విగ్రహ మరియు పాదుకలు ప్రతిష్ట జరిగిన రోజునే ఒక మహిళ Mental Depressionతో (పిశాచబాధ) అక్కడకి రాగా శ్రీ టెంబే స్వామి ఆవిడను అక్కడ కొద్ది సేపు కూర్చోబెట్టి జపము చేయించారు. ఫలితంగా ఆవిడకుగల మానసిక బాధలు తొలగిపోయాయి. ఇప్పటికీ ఈ క్షేత్ర మూర్తి మరియు పాదుకా దర్శనం,స్పర్శనం వల్ల మానసిక బాధలు వెంటనే నివారింపబడతాయని ఇక్కడి వారి విశ్వాసము.
Rajamahendravaram (Rajahmundry) BakthaVatsala Dattatreya & Datta Paduka Photos
Rajahmundry దగ్గర లో గల చూడవలసిన ఇతర ప్రదేశాలు
Places To Visit Near Rajamahendravaram |
---|
Places To Visit Near Rajamahendravaram |
1. Samarlakota / Samalkot Dattareya |
2. Papikondalu (By Launch) |
3. Pithapuram |
4. Vannepudi |
5. Annavaram |
6. Devipuram |
7. Simhachalam |