Sampurna Sripada Sri Vallabha Charitamrutha Rahasyaalu : Part-1
సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృత రహస్యాలు : పార్ట్-1
Sampurna Sripada Sri Vallabha Charitamrutha Rahasyaalu : Part-1
శ్రీపాదుడి నోట ‘మోడీ’ మాట…
శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు 10 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు (దాదాపుగా కీ.శ.1330 సంవత్సరంలో) శ్రీపాదుడికీ మరియు శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి మద్య జరిగిన సంభాషణలో భాగంగా శ్రీపాదుడు ఆర్య వైశ్యులకు 3 వరములను ఇస్తారు. ఈ సందర్భంలో “భవిష్యత్తులో ఒక ఆర్య వైశ్యుడు భారతప్రభువు కాగలడ”ని చెప్పడం జరుగుతుంది. ఇదంతా సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం లోని 19 వ అధ్యాయం లో చెప్పబడినది. శ్రీపాదుడు చెప్పిన ఆర్య వైశ్య భారత ప్రభువే ‘శ్రీ నరేంద్ర మోడీ’. శ్రీపాదుడి నోటి వాక్కు శిలాశాసనములు. సృష్టిలో ఎవ్వరూ దానిని మార్చలేరు.
అదేవిధంగా శ్రీ పాద శ్రీ వల్లభుడు భవిష్యత్తులో పీఠికాపురము (పిఠాపురం) – శ్యామాలంబపురము (సామర్లకోట) – వాయసపురఅగ్రహారం (కాకినాడ) కలిసి పెద్ద పట్టణంగా రూపుదిద్దుకుంటాయని కుడా చెప్పడం జరిగింది. ఈ విషయం కుడా సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంలో మనం గమనించవచ్చు.
సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం లోని 19 వ అధ్యాయం లో ఏముంది?…
నేను శ్రీపాదుడను. శ్రీవల్లభుడను. తాతా! ఆనాటి అత్యంత ప్రాచీనమైన యుగమునాటి అత్రి అనసూయానందనుడే యీనాటి శ్రీపాదశ్రీవల్లభుడు. భరద్వాజ ఋషి కిచ్చిన వాగ్దానమును బట్టి పీఠికాపురమున అవతరింపవచ్చినది. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి కనుల వెంబడి ధారాపాతముగా ఆనందాశ్రువులు రాలుచుండెను. వారు శ్రీపాదుల వారిని గాఢముగా ఆలింగనము చేసికొనిరి. వారు అనుభవించిన తన్మయత్వము వర్ణనకు అందనిది. వాక్కులతో తెలియజేయలేనంతటిది. కొంతసేపైన తరువాత శ్రేష్ఠిగారిట్లనిరి. “నాయనా! బంగారు తండ్రి! మా వంశముపైన నీ అనుగ్రహముండనీ. మా గోత్రముపైన నీ అనుగ్రహముండనీ! మా ఆర్యవైశ్య కులముపైన నీ అనుగ్రహముండనీ!” అని కోరగా శ్రీపాదులిట్లనిరి. “తాతా! తథాస్తు! బ్రాహ్మణునకు ఒక వరము కోరుకొను అధికారము కలదు. క్షత్రియునకు రెండు వరములు, వైశ్యునకు మూడు వరములు, శూద్రునకు నాల్గువరములు కోరుకొను అధికారమున్నది. నీవు కోరిన మూడు వరములను అనుగ్రహించితిని. 33 కోట్ల దేవతల సాక్షిగా వాగ్దానము చేయుచున్నాను. నా పేరిట, నా మాతామహులైన శ్రీ బాపనార్యుల యింట, సరిగా నా జన్మస్థానము నందు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమేర్పడును. నీ నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ బాపనార్యుల నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ నరసింహవర్మ నుండి 33వ తరము నడుచుచుండగా, నీ వంశములోని 33వ తరము వ్యక్తిని నిమిత్తమాత్రునిగా చేసి నా సంస్థానమును నేనే ఏర్పాటు చేసుకొందును. మీ వంశ మూలపురుషుడైన మార్కండేయ మహర్షిని ఆదేశించుచున్నాను. మార్కండేయమహర్షి ప్రతీ గురువారము మధ్యాహ్నసమయమున ఏదో ఒక రూపములో నాకు నైవేద్యమీయబడిన పదార్ధములో ఎంతోకొంత భాగమును స్వీకరించుగాక! దాని వలన మార్కండేయ గోత్రమునందు జనించినవారలకు మేలుకలుగు గాక! నీవు కోరినట్లే ఆర్యవైశ్యులపై నా అనుగ్రహమున్నది. ఆర్యవైశ్యులకు రాజ్యాధికార యోగము కలుగునట్లు ఆశీర్వదించుచున్నాను. దానికి ప్రతిగా భవిష్యత్తులో ఆర్య వైశ్యుడొకడు భారతప్రభువు కాగలడు. విచిత్రమైన నాడీజ్యోతిష్యము నందలి సూచనను బట్టి పీఠికాపురము రాగలడు. మెండుగా నా అనుగ్రహమును పొందగలడు. ఆ తరువాత నేపాళదేశము నుండి భక్తజనులు అసంఖ్యాకముగా పీఠికాపురమున నా దర్శనార్థము రాగలరు. నా యొక్క శాసనము శిలాశాసనము. సృష్టిలోని ఏ ప్రాణికినీ అది అనుల్లంఘనీయమయిన శాసనము – [ సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం -19 వ అధ్యాయం]
నరేంద్ర మోడీ కులమేంటి?…
శ్రీ నరేంద్ర మోడీ “బనియా” అనే కులం లో జన్మించారు. ఈ బనియా కులం వారి వృత్తి “వర్తకం – వాణిజ్యం”. బనియా వారు అనగా ” ఆర్య వైశ్యులు” లేదా “కోమట్లు” (Baniya/Bania Means “Arya Vysya in Telugu Language”). సూటిగా చెప్పాలంటే శ్రీ నరేంద్ర మోడీ గారు “ఆర్య వైశ్యులు”. బనియాస్ / Bania / Baniya అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. దీనికి అర్ధం “వాణిజ్యం వర్తకం – జరిపేవారు.”
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం…
17/05/2014 రోజున వెలువడిన Times of India – Daily లో శ్రీ నరేంద్ర మోడీ గారి కులం గురించిన ఒక ఆర్టికల్ ప్రచురించడం జరిగింది. ఈ కథనం లో ఇండియా లోని “బనియా(ఆర్య వైశ్యులు)” ల స్థితి-గతులను గురించి ఇవ్వడం జరిగింది.
All India VAISH Federation (ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్) Baniyas గురించి ఏం చెబుతోందో తెలుసుకోవడం కోసం క్రింది Arrow (బాణం గుర్తు) పై క్లిక్ చెయ్యండి
http://encyclopediaindica.com Baniyas గురించి ఏం చెబుతోందో తెలుసుకోవడం కోసం క్రింది Arrow (బాణం గుర్తు) పై క్లిక్ చెయ్యండి
www.indianetzone.com Baniyas గురించి ఏం చెబుతోందో తెలుసుకోవడం కోసం క్రింది Arrow (బాణం గుర్తు) పై క్లిక్ చెయ్యండి
శ్రీ నరేంద్ర మోడీ ‘ప్రైమిష్టర్ ఆఫ్ ఇండియా’ గా ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా [21/05/2014]