Shabari Mantralu
Shabari Mantralu (శాబరీ మంత్రాలు)
శీఘ్ర ఫలితాలను ఇచ్చే అత్యంత శక్తివంత మైన మంత్రాలే శాబరీ మంత్రాలు. ఈ మంత్రాలకు ఆద్యుడు శాబర మహర్షి. వీటికి అనేక ఇతర మంత్రాలను చేర్చి తిరిగి వ్రాసింది గోరఖనాథుడు. ఇటువంటి శాబరీ మంత్రాలు హిందూమతం లోనే కాకుండా ఇస్లాం మరియు ఇతర మతాలలో కూడా కనిపిస్తాయి. ఒకరకంగా ఈ శాబరీ మంత్రాలు తాంత్రిక మంత్రాల వంటివి. కానీ వీటిని చదివి ఫలితాలను పొందడానికి ఎటువంటి తాంత్రికవిద్య చదివి ఉండనవసరం లేదు. శాబరీ మంత్రాలు అతి సులభమైనవి కుడా! సాధారణ మంత్రాలు లేదా వేద మంత్రాలు అనేక వేల సార్లు చదివితే కాని సిద్ధించవు. కానీ శాబరీ మంత్రాలు అతి సులభంగా సిద్ధిస్తాయి. దీనికి గల కారణం శాబరీ మంత్రాలకు “స్వయంశక్తి” కలదు. సాధారణ మానవులు సైతం చదివేలా సులభంగా ఉంటాయి. శాబరీ మంత్రాలు షట్కర్మలకు వాడే మంత్రాలు. మానవులు ఇబ్బందులలో ఉన్నప్పుడు వీటిని వాడి అతి త్వరగా ఫలితాలను పొందవచ్చు. గోరఖనాథుడు తిరిగి వ్రాసిన శాబరి మంత్రాలు దాదాపుగా అన్ని దత్తాత్రేయ తాంత్రిక విద్యల పుస్తకాలలో దొరుకుతాయి. గోరఖనాథుడు వ్రాసిన శాబరి మంత్రాల ప్రస్తావన లేకుండా దత్త గ్రందాలుండవు.
ఉత్తమ ముగింపు
ఎదుటి వారిపై ప్రయోగించకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా గోరఖనాథుడు వ్రాసిన శాబరి మంత్రాలను ఉపయోగించి మనకు గల వ్యాధులను, స్వసమస్యలను పరిష్కరించుకోవడమే ఈ మంత్రాలకు ఉత్తమమైన ముగింపు.