Shirdi Sai Sahaja (Nija) Paduka Mandir
Shirdi Sai Sahaja (Nija) Paduka Mandir – Korhale Village (Koraala-Doraala)
(షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ - కోర్హలె గ్రామము (కోరాల-డోరాల))
Warning: © This Web Page, Content & Photos Are Copyright Protected
Jai Jai SayiRaam…SayiRaam…SayiRaam…
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే… దిగంబరా…దిగంబరా…శ్రీపాద వల్లభ దిగంబరా… దత్త బంధువులందరికీ జై గురుదత్త… శ్రీసాయినాథ మహారాజ్ కి జై..
చాలామంది భక్తులు మన Website లో Shirdi Sai Baba కు సంబందించిన Article ఏది ఎందుకు పెట్టలేదని అడిగారు. “Shirdi గురించి At least ఒక Page వ్రాయవచ్చును కదా!” అని ఎంతో మంది నన్ను అడిగారు. నిజానికి “Shirdi గురించీ, Shirdi సాయినాథుని గురించీ మనదగ్గర తెలియని వారెవరు? నాకంటే Shirdi గురించి ఎన్నో విషయాలు తెలిసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, పైగా సాయి ఆశీస్సులు లేకుండా వారి గురించి వ్రాయడమెలా?..” అని వారికి చెబుతుండేవాడిని. కొద్ది రోజుల తరువాత సాయిబాబా Shirdi కి రాక ముందు నుండే Shirdi లోగల “గురుస్థానం” గురించిన Article Publish చెయ్యాలని అనుకున్నాను. సాయి Shirdi కి రాక మునుపే ‘శీలధి’ లో ఉన్న “గురుస్థాన్” దర్శనానికి నవనాథులలలొ ఒకరైన ‘కర్ణ కానీఫానాథుల’ వారు గురుస్థాన్ కు వచ్చి, అక్కడే కొద్ది రోజులు ఉండి తపస్సు చేసుకున్నట్లుగా తెలిసింది. అందువల్లనే గురుస్థానానికి దగ్గరలో అతి పురాతన కానీఫానాథ్ దేవాలయాన్ని నేటికీ Shirdiలో చూడవచ్చు. ఈ మొత్తం విషయాన్ని ఒక మంచి Article గా చేద్దామని అనుకుంటున్న సమయంలో దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం (2013లో) Shirdiలో శ్రీసాయి నిజ పాదుకలు ఉన్నట్లుగా తెలిసింది. సమాచారమైతే తెలిసింది కానీ, అవి ఎక్క డున్నాయో, ఎవరి ఆధీనంలో ఉన్నాయో నిర్దుష్టమైన వివరాలు తెలియలేదు. అనంతరం శ్రీసాయి నిజ పాదుకలకు సంబంధించిన వివరాలను తెలియజేయమని శ్రీపాద శ్రీ వల్లభుల వారిని వేడుకున్నాను. అలాగే ప్రతీ సంవత్సరం మూడు నుండి నాలుగు సార్లు Shirdi వెళ్ళే అనేక భక్తులతో Shirdiలో శ్రీసాయి నిజ పాదుకలు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడానికి ప్రయత్నించమని వారికి చెబుతుండేవాడిని. ఆవిధంగా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. 2016 February నెలలో నాకు Sayyad (Shirdi లో ఉండే Auto Riksha Driver) అనే వ్యక్తి నుండి SMS వచ్చింది. Shirdi లో Nrusimha Guest House (Nrusimha Lodge) లో ఉండే Sri Peter అనే వ్యక్తిని కలవమనీ, అతను శ్రీ సాయి నిజ పాదుకలు ఉన్న Shirdi కు దగ్గరలోని Korhale (Koraala-Doraala) అనే గ్రామానికి తీసుకువెళతాడనీ సమాచారం ఇచ్చారు. ఆ SMS అందుకున్న నేను ఆశ్చర్యానికిలోనై వెంటనే Shirdi కి పయనమయ్యాను. శ్రీపాద శ్రీ వల్లభుల వారి ఆశీస్సులతో..శ్రీ సాయినాథుల వారి కరుణతో షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ కు సంబంధించిన విశేషాలను తెలుసుకొని, తెలుసుకున్న విశేషాలను ఈ Article ద్వారా మీతో పంచుకుంటున్నాను. పవిత్రమైన,అతి విలువైన, అందరికీ తెలియని ఈ పాదధామాన్ని దర్శించండి. తరించండి.
జై గురు దత్త -Keerthi Vallabha (keerthivallabha@gmail.com)
షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ / షిర్డీ సాయి నిజ (సహజ) పాదుకలు ఎక్కడ ఉన్నాయి?
షిర్డీ సాయి నిజ సహజ పాదుకలు రహత తాలుకా లో షిర్డీ కి 8 KMs దూరంలో క్రొత్తగా నిర్మిస్తున్న Shirdi Airport కు సమీపంలో గల కొర్హలె(Korhale) అనే గ్రామంలో శ్రీ షిర్డీ సాయి మందిర్ లో కలవు. కొర్హలె – డోర్హలె (Korhale – Dorhale) అనేవి రెండు జంట గ్రామాలు. ఈ రెండు గ్రామాలను కోరాల-డోరాల ( Koraala – Doraala) అని ఇక్కడి వారు పిలుస్తారు. Auto Riksha వారికి కుడా కోరాల-డోరాల జంట గ్రామాలలోని కోరాల సాయి మందిర్ కు తీసుకుని వెళ్ళమని అడగాలి. ఈ రెండు గ్రామాలలో ఉన్న బంజరుభూముల్లో గులాబీ, సబ్జా వంటి మొక్కలు పెంచుతారు. వీటిని పూల బోకే (Flower Bokeh) లాగ చుట్టి షిర్డీలో సాయి సమాధి మందిరం వద్ద అమ్ముతారు. షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ కొర్హలె గ్రామ ప్రధాన రహదారికి ఆనుకునే ఉంటుంది. కోరాల నుండి 2 KMs దూరంలో గల డోరాల (Doraala) గ్రామం నందు నవనాథ దేవాలయం కలదు. ఇది కుడా చూడవలసిన ప్రదేశమే.
కొర్హలె గ్రామము (కోరాల) లోగల షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ ఎలా చేరుకోవాలి?
How To Reach...ఎలా చేరుకోవాలి.. |
---|
How To Reach...ఎలా చేరుకోవాలి.. |
Hyderabad ----> Shirdi ----> Hire Auto Riksha (Onward And Return) From Khandoba Temple (Shirdi) To Korhale And Korhale To Shirdi for Around Rs.300/- Per Auto (No Public And Sharing Transport Available From Shirdi) |
కొర్హలె గ్రామము (కోరాల) లోగల షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ చరిత్ర / స్థలపురాణం
అబ్దుల్ జాన్ పఠాన్ అనే ముస్లిం యువకుడు ‘తార్బెల’ అనే గ్రామ (ప్రస్తుతం ఈ గ్రామం పాకిస్తాన్ లో ఉంది) వాస్తవ్యుడు. అతను చిన్న నాటినుండి ‘హిందూద్వేషి’. అతని జీవిత ఆశయం ఎలాగైనా ‘మక్కా’ యాత్ర చేయాలనీ, తదుపరి శేషజీవితం అక్కడే (మక్కాలో) గడపాలనేది అతని లక్ష్యం. అయితే మక్కాయాత్ర చేయాలంటే అధిక మొత్తంలో డబ్బు కావాలి. పుట్టుక తోనే కడు బీదవాడైన అబ్దుల్ జాన్ పఠాన్ తన జీవిత లక్ష్యం నెరవేర్చుకునేందుకు ఎలా డబ్బు సంపాదించాలో ఆ గ్రామంలో గల తన తోటివారిని అడిగినప్పుడు వారు ” జీవిత లక్ష్యం అయిన మక్కాయాత్ర చేయాలంటే నిన్ను అక్కడకు పంపే దాతను (Sponsor) ముందుగా వెతుక్కోవాలి. అటువంటి దాతలు మన ప్రాంతంలో అతి అరుదుగా ఉన్నారు. నువ్వు ఉన్న పళంగా బొంబాయి దగ్గరలో గల మన్మాడ్ చేరుకో. అక్కడ Shirdi అనే గ్రామంలో Sayi Fakeer అనే ఒక మహ్మదీయ ఔలియా ఉన్నారు. వారికి కొద్ది రోజులు భక్తుడిగా ఉండు. తదుపరి వారి భక్తుడిని అని చెప్పుకో… నీకల వెంటనే నెరవేరుతుంది (ఇప్పటి అదే జరుగుతోంది…). ఒక్కోసారి ఆయనే నిన్ను ఎవరి ద్వారానైనా మక్కాకి పంపించవచ్చునుకుడా! వెంటనే బైల్దేరు” అని చెప్పారు. వారిచ్చిన సలహా నచ్చిన అబ్దుల్ జాన్ పఠాన్ తార్బెల నుండి బొంబాయి, బొంబాయి నుండి మన్మాడ్ చేరి తదుపరి అక్కడ నుండి Shirdi చేరాడు. అక్కడ ఊరు బైటగల ద్వారకామాయిలో ఉన్న సాయిబాబా వారిని దర్శించాలనీ, దర్శనానంతరం తన ‘మక్కాయాత్ర డబ్బు’ విషయం విన్నవించుకోవాలని అనుకున్నాడు. అబ్దుల్ జాన్ పఠాన్ ద్వారకామాయికి చేరుకునే సమయానికి అక్కడే ఉన్నారు శ్రీ సాయిబాబా. అబ్దుల్ జాన్ పఠాన్ ను చూసిన సాయిబాబా ఏమీ మాట్లాడలేదు. కేవలం ఇరువురి చూపులు మాత్రమే కలుసుకున్నాయి. బాబాను చూసిన అబ్దుల్ జాన్ పఠాన్ కుడా ఏమీ మాట్లాడలేదు, ఏ విన్నపమూ విన్నవించుకోనూ లేదు. అలాగే అబ్దుల్ జాన్ పఠాన్ ను చూసిన సాయిబాబా ఏమీ మాట్లాడ లేదు. ఆ విధంగా రోజు పొద్దున్న- సాయంత్రం ఇరువురి చూపులు కలిసేవి, అంతే. అది తప్ప ఇంకేమీ జరిగేది కాదు. అలా కొద్ది రోజులు గడిచిన తదుపరి అక్కడి వారు అబ్దుల్ జాన్ పఠాన్ వచ్చిన కారణం అడిగి తెలుసుకున్నారు. తదుపరి బాబా వారితో సన్నిహితంగా ఉండే “అబ్దుల్ ” అనే మరొక ముస్లిం భక్తుడి ద్వారా అబ్దుల్ జాన్ పఠాన్ యొక్క జీవిత లక్ష్యాన్ని బాబాకు విన్నవించారు. అంతా సావదానంగా విన్న సాయి “ఇక్కడ అందర్నీద్వేషిస్తూ (హిందువులను)… అక్కడికెళ్ళి (మక్కా) ఏ గడ్డి పీకుతాడు? – ముందు ముందు చూద్దాం”అని అన్నారు. ఆవిధంగా ఒకటి కాదు రెండు కాదు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ మూడు సంవత్సరాలలో బాబా అబ్దుల్ జాన్ పఠాన్ ను మానసికంగా ఎంతో ఉద్ధరించారు. ఎంతలా అంటే.. హిందూద్వేషి ఆయన అబ్దుల్ జాన్ పఠాన్ హిందువులతోనే సాన్నిహిత్యంగా ఉండేటట్లుగా…అన్నిటికంటే ముఖ్యంగా ఆయన జీవిత లక్ష్యమైన “మక్కాయాత్ర” మరిచిపోయేటట్లుగా చేసారు. అదీ బాబా అంటే… మూడు సంవత్సరాల తరువాత ఒక రోజు సాయిబాబా అబ్దుల్ జాన్ పఠాన్ ను పిలిచి ” నీకేం కావాలో కోరుకో అది వెంటనే తీరుస్తాను” అని అన్నారు. దానికి అబ్దుల్ జాన్ పఠాన్ ” నాకు మీ పాదాలు తప్ప మరేమీ వద్దు! అయినా నాకేం కావలి బాబా.. మీ12 అంగుళాల పాదాలు మరియు నేను పోతే పాతిపెట్టడానికి 6 అడుగుల భూమి తప్ప”. అది విన్న సాయిబాబా తనలో తనే నవ్వుకొని ” తథాస్తు – వెంటనే కోరాల గ్రామం బయలుదేరు. అక్కడే ఉండు! అన్ని అవే వస్తాయి” అన్నారు. తదుపరి అబ్దుల్ జాన్ పఠాన్ Korhale గ్రామానికి వచ్చి అక్కడే స్థిరపడిపోయాడు. అక్కడే సమాధి చెందాడు. అతను మక్కాయాత్ర చెయ్యలేదు. అబ్దుల్ జాన్ పఠాన్ సాయిబాబానే అతని “అల్లా”, Shirdiయే అతని అతని “మక్కా- మదీనా” గా భావించాడు. తదుపరి వారి వంశస్తులు కుడా ఇప్పటికీ Korhale లోనే ఉంటున్నారు. అబ్దుల్ జాన్ పఠాన్ తదుపరి వారి వంశంలోని గొప్ప సాయి భక్తుడు ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు).
సాయి నిజ పాదుకల చరిత్ర:
షిర్డీ సాయిబాబా ప్రతీరోజూ 5 ఇళ్ళలో బిక్ష చేసేవారు. అలా బిక్ష చేసే ఇళ్ళలో శ్రీ వామన్ రావ్ గొండ్కర్ ఇల్లు కుడా ఒకటి. అలా బిక్ష రూపంలో తీసుకుని వచ్చిన పదార్ధాలలో కొంత ద్వారకామాయి దగ్గర ఉండే కుక్కలకూ, పక్షులకూ, పిల్లులకూ రోజూ ఒకే ప్రదేశంలో ఒక బండ మీద నిలబడి జల్లేవారు. తదుపరి జంతువులు స్వేచ్చగా వచ్చి తినిపోతుండేవి. అలా అనేక సంవత్సరాలు అదే బండపై నిలబడి ఆహారం వేదజల్లడం వల్ల శ్రీ సాయిబాబా వారి పాద ముద్రలు వాటి మీద శాశ్వతంగా పడ్డాయి. ఇది వింతల్లో కెల్లా వింత. శ్రీ సాయిబాబా నిజ పాద ముద్రలు పడిన ఏకైన బండ అది. అయితే శ్రీ వామన్ రావ్ గొండ్కర్ భార్య ప్రతి రోజూ బిక్షలో ఏదో ఒక ద్రవ పదార్ధాన్ని(పులుసు,పాయసం,చారు లాంటివి) ఇచ్చేవారు. అది గమనించిన సాయి బండ మీద శాశ్వతంగా పడిన పాద ముద్రల మధ్య తన చూపుడు వ్రేలితో గుండ్రంగా బండ మీద తిప్పి అప్పటికప్పుడు ఒక గుంతను (Pit Hole) చేసారు. శ్రీ వామన్ రావ్ గొండ్కర్ భార్య ఇచ్చే ద్రవ పదార్ధాలను ఆ గుంతలో పోసేవారు. ఒక్కోసారి పక్షుల దాహం తీర్చడం కోసం ఆ గుంతలో మంచినీళ్ళు కుడా పోసేవారు .
సాయి నిజ పాదుకలు Korhale గ్రామానికి ఎలా తీసుకుని రాబడ్డాయి?
శ్రీ సాయి బాబా మహా సమాధి అనంతరం నిజ పాదుకా ముద్రలు కలిగిన ఆ బండ శ్రీ వామన్ రావ్ గొండ్కర్ గారు భద్రపరిచారు. తదుపరి శ్రీ వామన్ రావ్ గొండ్కర్ మనవడైన అమృత రావ్ గొండ్కర్ వద్దకు ఆ నిజ పాదముద్రల బండ చేరింది. వారు ఆ నిజ పాదముద్రల బండను కలిగిన భూమిని నిజ పాద ముద్రలు పడిన బండతో సహా గుజరాతీ వారైన “భికాజీ – షకారాంషెల్కే” కుటుంబానికి అమ్మారు. భికాజీ వారు Shirdi లో “Nrusimha Guest House” (Nrusimha Lodge) అనే పేరుతో ఒక Lodge ను కట్టారు. అలా కడుతున్నప్పుడు ఈ నిజ పాదముద్రలు పడిన బండను ఒక గోడలో పెట్టి సిమెంటు చేసి స్థిరంగా ఏర్పాటుచేసారు. తదుపరి 2004 లో Shirdi బాగా ఆధునీకరింపబడినది. ఆధునీకరణలో భాగంగా Nrusimha Guest House ఉన్న రోడ్డును (Pallaki Road) వెడల్పు చేయసంకల్పించారు. అందులో భాగంగా శ్రీ సాయి బాబా నిజ పాదుకా ముద్రలు ఉన్న ఆ బండను స్థాపించిన గోడను (Nrusimha Guest House ముందు భాగాన్ని) 06/May/2004 రోజున పడగొట్టాలని నిర్ణయించారు. అక్కడి స్థానికులు ఎంత చెప్పినా అధికారులు వినలేదు. Bulldozer లతో ఆ గోడను కుల్చేసారు. వందల కొద్దీ పగిలిన ఇటుక రాళ్ళు ఆ నిజ పాద ముద్రలపై పడ్డాయి. జరిగేదంతా అక్కడే నిలబడి చూస్తున్నాడు ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు). తదుపరి Shakaaram Shelke వంశస్తులైన వారు అక్కడ నిలబడ్డ ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు) ను చూసి “ఈ బండను మీరు తీసుకెళ్ళండి” అని వారి చేతిలో పెట్టారు. ఇది వింతలో కెల్లా వింత.. అసలుసిసలైన వింత. ఎక్కడి అబ్దుల్ జాన్ పఠాన్ కాలం(1918) ఎక్కడి 2004వ సంవత్సరం!… బాబా అన్న మాట నిలబెట్టుకున్నారు. బాబా వారి పాదాలను అబ్దుల్ జాన్ పఠాన్ వద్దకు చేర్చారు. ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు) ద్వారా శ్రీ సాయి నిజ పాదుకా ముద్రలు కలిగిన బండ రాయి Korhale గ్రామం చేరింది. తదుపరి అక్కడి వారు ఎవరిని అధిక మొత్తంలో విరాళాలను అడగకుండానే సాయిబాబానే మందిరం కట్టడానికి కావాల్సిన డబ్బును కుడా సమకూర్చడం వల్ల ఇప్పుడు అక్కడ (Korhale లో) ఒక అందమైన సాయి బాబా మందిరం కట్టబడినది. ఎంతటి ఆశ్చర్యము.. బాబా లీలలు అంతే ఉంటాయి. శ్రీ బాబా శ్రీ బాబానే! వారికి వారే సాటి. బాబా వస్తువులు ఎన్నో..ఎన్నెన్నో Sansthan వారి Museum లో చేరాయి, భద్రపరచబడ్డాయి.ఈ ఒక్క నిజ పాదుకా ముద్రలుపడిన బండ తప్ప. అది ఎప్పటికీ అబ్దుల్ జాన్ పఠాన్ వారిదే!
Incident | Year (Approx) |
---|---|
Incident | Year (Approx) |
Year of Abdul Jan Pathan Visit To Shirdi | 1914 |
Baba Last Word's With Abdul Jan Pathan ("Abdul Ask For Any Thing You Want...) | August 1918 |
Abdul Jan Pathan Left To Korhale Village | August / September 1918 |
Baba Maha Samadhi | October 1918 |
Chitluri Vinny అమ్మగారు కొర్హలె గ్రామము (కోరాల) లోగల షిర్డీ సాయి నిజ పాదుకల గురించి సంకలనం చేసిన సమాచారం
కొర్హలె గ్రామము (కోరాల) లోగల షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ ఫోటోలు
కొర్హలె గ్రామము (కోరాల) లోగల షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ దర్శనానికి అనువైన సమయం
కొర్హలె లోగల షిర్డీ సాయి నిజ (సహజ) పాదుకల దర్శనానికి అన్ని కాలాలు అనుకులమైనవే. భక్తుల రద్దీ చాలా చాలా తక్కువగా ఉంటుంది. పర్వదినాలలో సైతం ఇక్కడ రద్దీ తక్కువ. ఉదయం 10:00 AM లోపు, సాయంత్రం 05:00 PM నుండి 06:30 PM వరుకు అనుకూలమైన దర్శన సమయాలు. వెళ్ళేటప్పుడు గంధం, పన్నీరు, పూలు, వస్త్రం వంటి వాటిని తీసుకునివెళ్ళాలి. అక్కడి గోశాలలో గల గోవుల కోసం వీలుంటే కొన్ని ఆకుకూరలను తీసుకువెళ్ళాలి.
కొర్హలె గ్రామము (కోరాల) లోఎక్కడ ఉండాలి?
కోరాల-డోరాల జంట గ్రామాలలో ఉండడానికి ఎటువంటి సదుపాయాలు లేవు. షిర్డీ లోనే ఉండి వెళ్లి రావాలి. Shirdi New Airport సమీపంలోగల Lodgeల్లో బస చేసినట్లైతే కోరాల-డోరాల జంట గ్రామాలు దగ్గరగా ఉంటాయి. భక్తులు సాధారణంగా Shirdiలో బస చేసి షిర్డీ సాయి నిజ (సహజ) పాదుకల దర్శనానికి వచ్చివెళతారు.
కొర్హలె గ్రామము & షిర్డీ చుట్టుపక్కల గల చూడవలసిన ప్రదేశాలు / ఇతర ఆలయాలు – వివరాలు
- Shirdi Local : GuruSthan, Samadhi Mandir, Dwarakamaayi, Chawadi, Dakshina Mukha Hanuman, Datta Mandir Near Nanda Deepa, Kanifanath Temple, Khandoba Temple, Sai Heritage Village – Ancient Shirdi (Near Nisarga Hotel), Wet N Joy Water Park, Hemant Sai Art Gallary (Opp: Samadhi Mandir)
- Lotus Dattatreya Temple in Veerabhadra Swamy Temple Premises, Rahata
- Navanatha Temple In Rahata (Near Sri Datta Hotel)
- Navanatha Temple In Dorhale (2 KMs Away From Korhale)
- Ekamukha Dattatreya Temple At Sakuri (Click Here To Know More About Sakuri Ekamuka Dattatreya Temple)
- World’s Biggest & Richest Dattatreya Temple At Vedantnagar, Ahmednagar (Click Here To Know More About World’s Biggest Dattatreya Temple)
- Pravara Datta Kshetram – Srikshetra Devgad (Click Here To Know More About Pravara Datta Kshetram)
- Sripada Vallabha & Ekamukha Dattatreya Temple At Nashik
శ్రీచైతన్య కానీఫానాథ్ దేవాలయం (Sri Chaitanya Kanifanath Temple) గురించి…
Shirdi లో Old Post Office ఎదురుగుండా నవనాథులలొ ఒకరైన Karna Kanifanath పురాతన దేవాలయం కలదు. ఈ దేవాలయం Shirdiలొ ఉన్నట్లుగా చాలామంది భక్తులకు తెలియదు. ఈ దేవాలయం “GuruSthan” కు అతి దగ్గరలోనే ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం దాదాపుగా క్రీ.శ. 1450 లో నవనాథులలొ ఒకరైన Kanifanath ఇక్కడ గల GuruSthan వద్ద కుండలిని జాగృతం చేసుకోవడానికి వచ్చారట. అప్పటికి Shirdi చాలా చాల చిన్న గ్రామము. అప్పటికి ఇంకా Sai Babaవారు Shirdi రాలేదు. దాదాపుగా ఆ సమయంలోనే Shirdi గ్రామంలో Cholera వ్యాధి వ్యాపించడం వల్ల దాదాపుగా గ్రామం ఖాళీగా ఉందట. సాధారణంగా నవనాథులు మనుష్య సమూహాలకు దూరంగా ఉంటారు. వారు భూమి మీదకు రావాల్సివచ్చిన కార్యక్రమం తోనే వారు సంపర్కంలో ఉంటారు. అందువల్ల చాలామందికి కర్ణ కానీఫానాథుల వారు Shirdi వచ్చినట్లుగా తెలియదు. దీనిని బట్టి ఆలోచిస్తే “GuruSthan” ఎంత శక్తి వంతమైనదో అర్ధం అవుతుంది. అప్పట్లో కర్ణ కానీఫానాథుల వారు నివాసం ఉన్న ప్రదేశం లోనే వారి గుడి వెలిసింది. ఇప్పటికీ ఆగుడి లోపల కానీఫానాథుల వారు అభిషేకం చేసిన శివలింగం ఉంది. కాని అది అందరికి కనిపించదు. ఆ శివలింగం తలుపు వెనకాల ఉంటుంది. Gents నేరుగా గుడి లోపలకు Pant & Shirt తో వెళ్ళవచ్చు మరియు ఆ శివ లింగానికి ఉదయం పుట ఆవు పాలు, పెరుగు , జలము వంటివి తీసుకు వెళ్లి అభిషేకం చేసుకోవచ్చు. Ladiesకి గుడి లోపలకు ప్రవేశం లేదు. కేవలం బైట నుండి దర్శనం చేసుకోవాలి. అలాగే కానీఫానాథుల వారు వాడిన Shataka, Rassi (Whip), Biksha Patra లను ఈ దేవాలయంలో చూడవచ్చు. ఇక్కడి కర్ణ కానీఫానాథుల వారు చైతన్య స్వరూపంగా ఉంటారు. పద్దతులు పాటించని వారికి కొరడా దెబ్బలు తప్పవు. తస్మాత్ జాగ్రత్త. ఈ దేవాలయం లో Navanatha Stotram పఠించాలి. ఇక్కడ మొత్తం నవనాథ చరిత్ర బొమ్మల రూపంలో ఉంచారు. కానీఫానాథుల వారినే “ఖానోబా (Khanoba)” అనికూడా (ఖండోబా కాదు – Not Khandoba) పిలుస్తారు. ఈ గుడినే ‘సన్యాసుల గుడి’ అనికూడా పిలుస్తారు. ఒకప్పుడు ఇక్కడ Kanifanaath వారి Whip, Shataka & Biksha Patra లనూ, అక్కడ ఉండే రహస్య శివలింగాన్ని మాత్రమే పూజించే వారు. తదుపరి Sri Kanifanath వారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
శ్రీచైతన్య కానీఫానాథ్ దేవాలయం ఫోటోలు (Photos of Kanifanath Temple)
Shirdi లోని ఇతర ఫోటోలు
Shirdi లో భక్తులకు అందుబాటులో ఉన్న Facilities
Category of Facility | Point of Contact / Information |
---|---|
Category of Facility | Point of Contact / Information |
1. Sai Devotee's Insurance Policy (సాయి భక్తుల జీవిత భీమా) | 'Sri Sai Sampurna Suraksha Kavach Apaghat Vima Sanrakshan' for the security of devotees coming to Shirdi for Baba's Darshan. In case of an unfortunate incident resulting in injury or death within the temple premises, Darshan queue, Prasadalaya, Sainiwas Guest house, Caravanserai, New Bhaktaniwas, and on the road along the temple, devotees will get compensation under this policy - Contact PRO Office, Near Gate1 |
2. Baby Feeding Room For Mothers | Beside Udhi Distribution Counter |
3. Parayana Hall | Near Nanda Deep |
4. Sai Satya Vratha Puja Hall | Devotees Can Perform Samuhika Sai Satya Vratha Here By The Payment of Rs.100/- At Specific Timings Between, 07:00 AM To 08:00 AM,09:00 AM To 10:00 AM & 11:00 AM To 12:00 PM, |
5. Canteen | Devotees Can Get Tea, Coffee, Mineral Water Etc.., On Nominal Rates. This Counter is very useful for Bulk purchases / Groups - Near PRO Office / Gate No.1 |
6. NRI Darshan Pass | All The NRI's / Foreign Nationals / Any Other Country Visa Holders / Green Card Holders Can Get This Pass By The Payment of Rs.200/- Per Person. Supporting Document (Passport/Visa/Green Card) is Prerequisite - Contact PRO Office, Near Gate1 |
7. Senior Citizens Darshan Pass | Senior Citizens More Than 65 years of Age Can Get this Pass By the Payment of Rs.200/- Per Person. Supporting Document (Age Proof) is Prerequisite - Contact PRO Office, Near Gate1 |
8. Baby Darshan Pass | Babies of Below 6 months of Age Can Get This Pass By The Payment of Rs.200/- for The Mother / Father. Supporting Document (Hospital File / Age Proof of Baby) is Prerequisite - Contact PRO Office, Near Gate1 |
9. VIP Darshan Pass | VIPs & Near And Dears of VIPs Can Get This Pass By the Payment of Rs.600/- Per Person. Supporting Document (Letter) is Prerequisite - Contact PRO Office, Near Gate1 |
10. Physically Disabled Persons Darshan Pass | Attendant of PDP Can Get This Pass On Free of Cost - Supporting Document is Prerequisite - Contact PRO Office, Near Gate1 |
11. Aarathi Entry Pass | By the Payment of Rs.600/- And Rs.400/- Per Person Devotees Can Get the Aarathi Passes - Contact PRO Office, Near Gate1 |
12. First -Aid Center | Opposite Gurusthan |
13. Railway Booking Office | Near Parayana Hall |
14. Free Bus Facility | From Sianagar Railway Station To Bhaktha Niwas (Via: Samadhi Mandir) |
15. Accommodation On Nominal Cost | Devotees Can Book The Rooms On Nominal Cost Through Sansthans Website (https://online.sai.org.in) |
16. Dattavadhutha Entry Pass | Avadhutha/ Swamy Ji/Aghora Other Yoga-Yoginis Can Get This Darshan Pass On The Payment of Rs.600/- Per Person - Contact PRO Office, Near Gate1 |
Acknowledgements |
---|
Acknowledgements |
మాతృ సమానురాలైన Chitluri Vinny అమ్మ గారికి మరియు Sada Ghade అన్నగారికి ప్రత్యేక ధన్యవాదములు అదే విధంగా అడిగిన వెంటనే సమాచారాన్ని అందించిన అబ్దుల్ జాన్ పఠాన్ వంశస్తులకు, Sayyad Bhai, Peter Bhai వారికీ, Korhale లోగల శ్రీ షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ సిబ్బందికి నా ధన్యవాదములు. |