ShivaDatteshwarudu
ShivaDatteshwarudu – Uddamarri Village
శివదత్తేశ్వరుడు – ఉద్దమర్రి
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే..దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా..శ్రీశివదత్తేశ్వర దత్తమహారాజ్ కీ జై.. దత్త బంధువులందరికీ జైగురుదత్త..
Telangana రాష్ట్రంలో (నిజాం కాలం కంటే ముందు) వందలకొలది Datta Kshetraలుఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య పదులకు చేరుకుంది. ముందు ముందు ఆ ఉన్నవి కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. మన తరువాతి తరముల వారికి ప్రాచీన Datta kshetraదర్శన భాగ్యం కూడా దుర్లభం అయ్యే పరిస్థితి. ప్రాచీన దత్త దేవాలయాలను పునరుద్ధరించడం అటుంచితే ఉన్న దత్త దేవాలయాలను కూడా కాపాడుకోలేని దుస్థితి. కళ్ళ ముందు Kadalivanam లో విగ్రహాలు పగలగొట్టినా కనీసం Respond అయ్యే పరిస్థితులలో మనము లేము. ఒక మూర్ఖశిఖామణి అంటాడు ” మా వాసుదేవానంద సరస్వతి స్వామి Kadalivanam వెళ్ళలేదు కాబట్టి అసలు Kadalivanam అనేదే లేదు” అని. అంటే అతని ఉద్దేశ్యం Kadalivanamలో విగ్రహాలను పగలగొట్టినా పరవాలేదని!, Vasudevananda Saraswath Swami దర్శించని ఎన్నో దత్త క్షేత్రాలు భూమి మీద ఉన్నాయి. ఉదాహరణకు దత్తాత్రేయుడు పుట్టిన Chitrakoot ను Vasudevananda Saraswathi Swami దర్శించనే లేదు! అంటే Chitrakoot లేనట్టా! ఇంకొకడంటాడు ” అదంతా స్వామి దయతోనే జరిగిందని”. ఇటువంటి చెత్త Interpretationsఇచ్చే వారందరికీ సమాధానంగా నిలిచే పురాతన దత్త క్షేత్రమే శివదత్తేశ్వర దత్త క్షేత్రం. గ్రామంలోని యాదవ కులస్థులందరూ తలా కొంచెం ధనరూపేణా, శ్రమరూపేణా, సమయంరూపేణా వెచ్చించి త్వరలోనే కనుమరుగవ్వాల్సిన గొప్ప దత్త క్షేత్రాన్ని తిరిగి నిలిపారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. అందరికీ తెలియని,పెద్దగా ప్రాచుర్యంలోకిరాని, ఉద్దమర్రి అనే కుగ్రామం లో ఉన్న పవిత్రమైన ఈ శివదత్తేశ్వర దత్తక్షేత్రాన్ని దత్తభక్తులందరూ తప్పక దర్శించి, తరిస్తారని ఆశిస్తూ … జై గురుదత్త
- Keerthi Vallabha (keerthivallabha@gmail.com)
ShivaDatteshwara Datta Kshetram ఎలా చేరుకోవాలి
How To Reach Shiva Datteshwara Kshetram |
---|
How To Reach Shiva Datteshwara Kshetram |
Route1: ECIL ---->Kushaiguda ---->Nagaram ----> ORR ----> Keesara ----> Rangapuram 'Y' Junction ----> Ramalingapalli ----> Uddamarri ----> Mallanna Gudi |
Route 2: Jubilee Bustand ----> Alwal ----> ORR ----> Shamirpet ----> Turakapalli ---->Muduchintalapalli ----> Uddamarri ----> Mallanna Gudi |
ShivaDatteshwara Datta Kshetram దర్శించడానికి అనువైన సమయం
Uddamarri లోని శివదత్తేశ్వర దత్తాత్రేయ క్షేత్రమును అన్ని కాలాలలో దర్శించుకోవచ్చు. ఉదయంపూట అనుకూలమైన సమయం. వెళ్ళేటప్పుడు దత్తాత్రేయుని కోసం పూలదండలు మొదలైనవి ఏమి తీసుకెళ్లకపోవడమే మంచిది, ఎందుకంటె గుడి తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయి. దత్తాత్రేయుడిని Grill Door లోంచే దర్శించుకోవాలి. అక్కడ కోనేటిలో ఉన్న చేపలకు ఆహారం తీసుకువెళ్ళవచ్చు.
Uddamarri ShivaDatteshwara Datta Kshetram స్థలపురాణం
ఈ క్షేత్రంలో గుడి బాగోగులు చూడడం కోసం నియమింపబడిన వారు ఇక్కడి దత్తాత్రేయుడి ప్రత్యేకత మరియు స్థలపురాణం తెలియదని చెప్పారు. అలాగే గుడిలోపల ఉన్న Architecture గమనించడం ద్వారా ఏమైనా ఆధారాలు దొరుకుతాయని అనుకుంటే గుడి తలుపులు కూడా తెరవమని చెప్పారు. అప్పుడు Uddamarri గ్రామంలో ఉన్న గ్రామ పంచాయితీ ఆఫీసులో ‘కృష్ణ’ అనే వారిద్వారా కొంతమంది యాదవ కులపెద్దలను కలిసి వారితో మాట్లాడి ఈ స్థలపురాణాన్ని సేకరించాను.
క్రీ.శ. 1515-1545 మధ్యకాలంలో ‘అవధూత రాయుడు’ అనే ఒక గప్ప దత్త ఉపాశకులు ఇక్కడ దత్తాత్రేయుని గుడి కట్టించినట్లుగా తెలియవచ్చింది. ఈ క్షేత్రంలో దత్తాత్రేయ విగ్రహం ఎదురుగా నంది సహిత శివలింగం ఉంటుంది. అందువల్లనే ఈ దేవాలయం ‘శివదత్తేశ్వర దత్త దేవాలయం’గా పేరు వచ్చింది. ఇచ్చట అవధూత రాయుడు ప్రతిష్టించిన దత్తాత్రేయ విగ్రహాన్ని ఎవరో దొంగిలించగా నూతనంగా త్రిముఖ దత్తాత్రేయుల వారిని ప్రతిష్టించారు. శివలింగం మాత్రం అప్పటిదేనని (ఆకాలం నాటిదేనని) గ్రామస్థులు చెప్పారు.
ఈ దేవాలయం మల్లన్న దేవాలయం దగ్గర ఉంటుంది. క్రీ.శ. 1545 తదుపరి (ఆధూత రాయుడు నిర్యాణం అనంతరం) ఈ క్షేత్రం బాగోగులు చూసే వారు లేక పాడు పడిపోయింది. పురాతన దత్త విగ్రహంతో పాటు విమానగోపురం పైన ఉన్న కలశాలు సైతం తస్కరించబడ్డాయి. తదుపరి Uddamarri గ్రామం స్మశానం కూడా కాలక్రమేణా ఈ గుడి వరుకు విస్తరించింది. స్మశానానికీ మల్లన్నగుడి, దత్తాత్రేయ గుళ్లకు మధ్యలో ఎటువంటి సరిహద్దు గోడ (Compound Wall) కూడా లేకుండా అన్ని కలిసే ఉంటాయి. ఫలితంగా భక్తులు గుడివైపు రావడం మానేశారు. ఫలితంగా గొప్ప దత్తక్షేత్రం కాలగర్భంలో కలిసిపోయింది..
ఈ క్షేత్రానికి అతి దగ్గరలో యాదవ కులస్థుల కులదైవమైన ‘మల్లన్నగుడి’ ఉంది. మల్లన్నగుడికి వెళ్లి వస్తూ ఉండే యాదవులు దత్తాత్రేయ దేవాలయం గురించి ఆలోచించి ఎలాగైనా గుడిని పునరుద్ధరించాలని సంకల్పించి తలా కొంత చొప్పున చందాలను ప్రోగుచేసి దత్తాత్రేయుని గుడిని బాగుచేయించి, తిరిగి దత్తాత్రేయుడిని ప్రతిష్టించి అక్కడ బాగోగులను చూడడం కోసం వేరేవాళ్లను నియమించారు. ఈ క్షేత్రంలో అతి పవిత్రమైన, అతి మహిమ గల ఒక మూలస్థంభం ఉంది. దానిచుట్టు ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి ఆపదలైనా తీరుతాయని ఇక్కడి వారి నమ్మకం. అలాగే ఇక్కడ ఒక కోనేరు కూడా కలదు.ఈ కోనేరులో గల జలచరాలకు ఆహారం వెయ్యడం వల్ల శత్రుబాధలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం.
ఇప్పుడు ఈ క్షేత్రం లోని శివదత్తేశ్వర దత్తాత్రేయుల వారు Uddamarri, MuduchinthalaPalli మరియు ఇతర చుట్టుప్రక్కల గ్రామాలలోని యాదవ కులస్థులకు ఇలవేల్పైపూజలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఇక్కడ దత్తాత్రేయుల వారికి సంభందించిన అన్ని పర్వదినాలు(దత్త జయంతి, గురుపూర్ణిమ మొదలైనవి) జరుపుకుంటున్నట్లుగా తెలియవచ్చింది.