tangidigi
The Confluence of River Krishna & River Bhima – Tangidigi Village
కృష్ణానదీ – భీమానదీ సంగమ స్థానం – తంగిడిగి గ్రామం
శ్రీ గురుచరిత్ర నందు 15వ అధ్యాయం ప్రకారం శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు తమకు ఎక్కువవుతున్న శిష్యులనుండి ధూర్త భక్తుల నుండి దూరంగా ఉండడం కోసం కొంత కాలము వారు గుప్తంగా ఉండదలచిరి. ఆ సందర్భంగా తమకున్న శిష్యులనందరినీ పిలిచి మీరందరూ ప్రస్తుతం ఉన్న ప్రదేశాన్ని విడిచి వివిధ క్షేత్రాలను దర్శించవలసినదిగా ఆజ్ఞాపిస్తారు. అప్పుడు శిష్యులు ఏఏ క్షేత్రాలను దర్శించాలో, ఏఏ క్షేత్రాలను దర్శిస్తే ఏఏ పుణ్యఫలం దక్కుతుందో దయచేసి తమరే సెలవియ్యండని వేడుకొనగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు అధిక ఫలాన్నిచ్చే కొన్ని క్షేత్రాలను చెబుతారు, ఆవిధంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి ద్వారా చెప్పబడిన క్షేత్రమే కృష్ణానదీ – భీమానదీ సంగమ స్థానం, ప్రస్తుతం ఈ ప్రాంతం Mahabubnagar Dist.లో Tangidigi Village అనే చోట గలదు. ఈ ప్రదేశాన్ని శ్రీ విఠలానంద సరస్వతి స్వామివారు క్రీ.శ.2011 లో వెలుగులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ప్రఖ్యాత పుష్కరఘాట్ కూడా కలదు. ఇక్కడే వారు శ్రీ దత్త భీమేశ్వర దేవాలయాన్ని మరియు దాదాపుగా 20 అడుగుల ఎత్తు ఉన్న శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి విగ్రహాన్ని( ఈమధ్య కాలంలోనే) ఇక్కడ ప్రతిష్టించారు.
ఈ విషయం తెలుసుకున్న నేను ఆ ప్రాంతాన్ని 2013 మే నెలలో సందర్శించడం జరిగింది. నదీసంగమ ప్రాంతానికి వెళ్ళిన తరువాత అక్కడి పరిస్థితులను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను. అక్కడి నదీసంగమ ప్రదేశం లోని రాళ్ళు సహజ సిద్ధంగా వినయకుడిలా ఎవరో వచ్చి చెక్కినట్లుగా మలచబడ్డాయి. నదీసంగమ ప్రదేశం లోని అనేక రాళ్ళు చిన్న చిన్న పాదుకలగా తాయారు చేయబడ్డాయి. నదీసంగమ ప్రదేశం లోని రాళ్ళపై పాద ముద్రలు, సహజంగా ఏర్పడిన శివ లింగం, నంది, శంకు, త్రిశూలం , పాము, ఓం కారము, నామము వంటి అనేక ఆనవాళ్ళు లభించాయి. సహజంగా మలచబడిన “సహజ వినాయకులని” మరియు కొన్ని పాదుకల వంటి రాళ్ళను ఏరుకొని భద్రపరుచుకున్నాను. అక్కడ కనిపించిన పాదముద్రలు చాల పెద్దవిగా కొన్నీ, చాలా చిన్నవిగా కొన్నీ ఉన్నాయి. అవన్నీ ఎవరో వచ్చి అమర్చినట్లుగా ఉండడం మాత్రం ఆశ్చర్యమే మరి!
దత్త భక్తులందరూ ఈ దివ్య నదీసంగమ ప్రాంతాన్ని చూసి, స్నానమాచరించి, మీకు దొరికిన పాదుకల, వినాయకుల వంటి రాళ్ళను సేకరించుకొని శ్రీపాదుని కృపకు పాత్రులగుతారని కోరుకుంటున్నాను.
-Keerthi Vallabha (May/2013)
గమనిక: Tangidigi Village లో ఉన్న ఈ సంగమ ప్రాంతాన్ని Nivruti Sangamam (నివృత్తిసంగమం)అని కొంతమంది చెబుతున్నారు, కానీ అది వాస్తవం కాదు.ఇప్పుడు నేను ఇక్కడ చెప్పే ఈ సంగమమే (Tangidigi Village) NivrutiSangamamఅని అనడంతో నేను ఏకీభవించడం లేదు, అసలైన నివృత్తిసంగమం (అంటే శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు స్నానమాచరించిన నివృత్తిసంగమం) Srisailam Project కట్టడంవల్ల అది Krishna River లో మునిగిపోయింది. అసలైన నివృత్తిసంగమం Kurnool Dist లో Nandikotkur Mandal లో Machhumarri Villageవద్ద Sangameshwaram అనే ప్రదేశంలో కలదు. ఆ ప్రదేశం వేసవికాలంలో కృష్ణానదిలో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు బైట పడుతుంది. ఇప్పటికి అక్కడ నివృతి సంగమానికి సంభందించిన (దక్ష యజ్ఞం , దక్షుని కుమార్తె సతీదేవి శరీరాన్ని నివృతి (వదిలివేయబడిన) చేసిన ఘట్టం)శాసనాలు ఉన్నాయి. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు అక్కడకి వచ్చినట్లుగా చెప్పబడుతున్న శాసనం కూడా ఉంది.
వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి (Click here for Details)
ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న ఈ Tangidigi ప్రదేశం శ్రీ గురుచరిత్రకు అందులోని 15వ అధ్యాయానికి సంభందిచినదే కానీ నివృత్తిసంగమం మాత్రం కాదు. పైగా శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు నివృత్తిసంగమం నుండి కురువపురం వచ్చినట్లుగా గ్రంథంలో చెప్పబడినది. Satellite Picture లో చూసినా కూడా మచ్చుమర్రి లోని నివృత్తిసంగమం (అసలైన నివృతిసంగమం)కురుగడ్డ ఒకే సరళరేఖపై ఉంటాయి.
విషయము | వివరణ |
---|---|
విషయము | వివరణ |
ప్రదేశం పేరు (Name of The Place) | Tangidigi Village (Near Krishna Station,Mahabubnagar Dist) |
ఎక్కడ ప్రస్తావించబడినది? | శ్రీ గురుచరిత్ర లోని 15వ అధ్యాయం నందు |
How To Reach Tangidigi Village |
---|
How To Reach Tangidigi Village |
Shamshabad -->Jadcherla -->Mahabubnagar --> Raichur Road -->Devarakadra --> Makthal --> Maganoor --> Krishna Station --> (రైల్వే ట్రాక్ క్రాస్ చెయ్యాలి) --> Tangidigi Village --> Sangama Stanam (Sri Vittal Baba Ji Ashramam) |
ఎప్పుడు వెళ్ళాలి? (Best Time To Visit) |
---|
ఎప్పుడు వెళ్ళాలి? (Best Time To Visit) |
నదీసంగమ స్థానం లోని రాళ్ళలో గల పాద ముద్రలు, సహజ వినాయకులను అలాగే అక్కడగల వివిధ సహజ రూపాలను చూడాలన్నా, వాటిని సేకరించి తెచ్చుకోవాలన్నా, అలాగే నదీసంగమ స్థానంలో ముంపు భయం లేకుండా స్నాన మాచరించాలన్నా March నెల నుండి June నెల వరుకు అనుకూల సమయం. మిగతా నెలలలో కృష్ణ - భీమా నదులు ఉధృతంగా ప్రవహించడం వల్ల పైవన్నీ నీటమునిగి ఉంటాయి. అందువల్ల అప్పుడు కేవలం నదీసంగమ స్థానంలో స్నానమాచరించవచ్చు. |
ఎవరిని కలవాలి? / ఎవరు మనల్ని గైడ్ చేయగలరు? |
---|
ఎవరిని కలవాలి? / ఎవరు మనల్ని గైడ్ చేయగలరు? |
శ్రీదత్త భీమేశ్వరాలయం (శ్రీ విఠలానంద సరస్వతి స్వామివారి ఆశ్రమం) లో ఉండే Sri Mareppa - Mobile No. : 8978837669 గారు అక్కడ గల అన్ని ప్రదేశాలను చూపించగలరు. మొదటి సారి వెళ్ళే వారు తప్పనిసరిగా వారి సహాయం తీసుకొనడం మంచిది. అలాగే బయలుదేరేముందు వారికి ఫోన్ ద్వారా సమాచారమివ్వడం మంచిది. |
ప్రత్యేకతలు |
---|
ప్రత్యేకతలు |
1. పాద ముద్రలు 2. ఎటు చూసినా సహజ గణపతులు 3. ఎక్కడ వెతికినా చిన్నచిన్న పాదముల వంటి రాతి నిర్మాణాలు 4. సహజంగా ఏర్పడ్డ నందీశ్వరసహిత శివలింగం 5. సహజంగా ఏర్పడ్డ త్రిశూలం 6. సహజంగా ఏర్పడ్డ నాగ సర్పం 7. సహజంగా ఏర్పడ్డ నామము 8. సహజంగా ఏర్పడ్డ ఓం కారము 9. సహజంగా ఏర్పడ్డ శంకు 10. అనేక సాలగ్రామాల వంటి రాళ్ళు 11. దత్త భీమేశ్వరాలయం 12.అన్నింటికన్నా మిన్నగా దివ్య కృష్ణానదీ - భీమానదీ సంగమ స్థానం & స్నాన ఘట్టము. |
Tangidigi Datta Bhimeshwara Temple & Sri Baba Ji Ashramam Photos