VANNEPUDI
Vanne Chinnela ‘Vannepudi’
(వన్నెచిన్నెల ‘వన్నెపూడి’)
శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ చరణ స్పర్శతో ‘వన్నె’ తేబడిన ఒక కుగ్రామమే “వన్నెపూడి”
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే..దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా..దత్త బంధువులందరికీ జైగురుదత్త..
‘వన్నెపూడి’ గ్రామం (Vannepudi Village) ఎటువంటి హడావిడి లేకుండా ఉండే ఒక గొప్ప శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రం. ఇక్కడ నుండే శ్రీచరణుల వారు ఉత్తర ఈశాన్య దిక్కుగా ఉండే వారణాశి వెళ్లారు. శ్రీపాద వల్లభులు వన్నెపూడి లోనే అదృశ్యమై కాశీకి చేరి అక్కడ నుండి అనేక క్షేత్రాలను తమ పాద స్పర్శచే పునీతంచేసి చివరకు కర్నూలు జిల్లాలోని (Kurnool Dist.) నందికొట్కూరు (Nandikotkur) కు 16 KMs దూరంలోగల మచ్చుమర్రి (Machhumarri Village) అనే గ్రామం నుండి మండు వేసవిలో (ప్రస్తుతం Srisailam Dam కట్టడం వల్ల వేసవి కాలంలో, నీరులేనప్పుడు మాత్రమే ఇక్కడ గల దేవాలయాన్ని శాసనాలను చూసే అవకాశం ఉంటుంది) కాలినడకన మాత్రమే చేరుకోగల నివృత్తి సంగమం (Nivruthi Sangamam) అనే ప్రదేశంలో స్నానమాచరించి అక్కడకు నేరుగా దగ్గరలోనే గల కురుగడ్డి (Kurugaddi / Kuruvapuram / Guruvapuram) నకు చేరి అక్కడ 14 సంవత్సరములు అగ్నియజ్ఞాన్ని చేశారు. శ్రీపాద వల్లభులు పిఠాపురం నుండి బయలు దేరి వన్నెపూడి వచ్చి ఆ గ్రామానికి ‘వన్నె’ తెచ్చి అక్కడ అదృశ్య మయ్యారనే విషయాన్ని తెలుసుకున్న నేను ఇక్కడకు వచ్చి Sripada Vallabha స్వామి వారు అదృశ్యమైన ప్రదేశాన్ని దర్శించి తరించాను. ప్రశాంతతకూ, నిరాడంబరతకూ మారుపేరై నిఘాడ క్షేత్రంగా విరాజిల్లు తున్న ఈ చూడ చక్కని ప్రదేశం లోగల Dattateya Devasthanam & Sripada Vallabha Adrusuya Sthaanam లను తప్పక దర్శిస్తారని ఆశిస్తూ … జై గురు దత్త.
-Keerthi Vallabha (keerthivallabha@gmail.com)
Vannepudi Village ఎక్కడ ఉంది?
Vannepudi Sripada Sri Vallabha Adrusya Sthaanam East Godavari Districtలో Annavaram కి 10KMs దూరంలో, అదేవిధంగా Pithapuram క్షేత్రానికి 17 KMs దూరంలో కలదు. ఈ గ్రామానికి Sharing Auto Rikshaలద్వారా సులభం గా చేరుకోవచ్చు.
Vannepudi ఎలా చేరుకోవాలి?
Annavaram To Vannepudi (10 KMs) / Pithapuram To Vannepudi (17 KMs) |
---|
Annavaram To Vannepudi (10 KMs) / Pithapuram To Vannepudi (17 KMs) |
Annavaram ----> Kattipudi ----> Vannepudi [OR] Pithapuram ----> Gollaprolu ----> Vannepudi |
Vannepudi Sripada Sri Vallabha Adrusya Sthaanam దర్శించడానికి అనువైన సమయం
Vannepudi క్షేత్రాన్ని ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. అన్నికాలాలు అనువైనవే. దత్తజయంతి, శ్రీపాద శ్రీ వల్లభ జయంతి రోజుల్లో భక్తులు ఎక్కువగా ఉంటారు. Dattatreya Jayanthi కి 41 రోజుల ముందు నుండే ఇక్కడ మండల దత్తదీక్షలు తీసుకునే దత్త స్వాములతో కోలాహలంగా ఉంటుంది. ఈ Kshetram నకు వెళ్లే ముందుగా పురోహితులకు Phone చేసి వెళ్లడం మంచిది (Srinivasa Charyulu - 9676463917).
Vannepudi లో ఎక్కడ ఉండాలి
Vannepudiక్షేత్రంలో ఉండడానికి ఎటువంటి వసతీ సౌకర్యాలు లేవు. సాదారణంగా భక్తులు Annavaramలో కానీ, Pithapuramలో కానీ Accommodation తీసుకుని Vannepudi Temple ని దర్శిస్తారు.
Vannepudi స్థల పురాణం
శ్రీపాద వల్లభులు తమ 16 వ సంవత్సరంలో గృహబంధనాది కార్యముల నుండి వెలుపలకు వచ్చి ‘యతి’యై స్వేచ్ఛగా సంచరించుచూ విశ్వోద్ధరణగావించుటకై వారి తల్లిదండ్రుల నుండీ, మాతామహుల నుండీ మరియు ఇతర ముఖ్యుల నుండీ అనుమతిని తీసుకుని పీఠీకాపురం నుండి ఉత్తరఈశాన్య దిక్కుగా యతిరూపధారియై కాలినడకన బయలుదేరెను. వారు అట్లు ఉత్తర దిక్కుగా వెళుతున్నప్పుడు వారి తల్లిదండ్రులూ, మాతామహులూ,ఇతర ముఖ్యులూ శ్రీ పాదులవారి వెన్నంటే రాసాగిరి. ఆవిధంగా పీఠీకాపురం నుండి ప్రస్తుతం వన్నెపూడిగా పిలువబడుతున్న ఈ ప్రదేశం వరుకు వారందరూ శ్రీపాదుడి వెనకే వచ్చిరి (దాదాపు 17 KMs). అక్కడవరుకు వచ్చిన శ్రీపాదులవారు ఒకసారి వెనుకకు తిరిగి వారందరిని ఇక ఇక్కడితో ఆగమని సూచిస్తూ ఆఖరిసారిగా తల్లియైన సుమతిమాత నుండి భిక్షను స్వీకరించి, వారందర్ని వెనుకకు పంపి క్షణకాలంలో అదృశ్యులైరి. ఆవిధంగా శ్రీ పాదుల వారి శ్రీచరణములతో పునీతం గావింపబడి ‘వన్నెకెక్కిన’ కారణంగా ఈ ప్రదేశం ‘వన్నెపూడి’ గా మారి, చూడచక్కటి గ్రామంగా రూపుదాల్చుకుని గొప్ప దత్తక్షేత్రంగా విరాజిల్లుతోంది. అందువల్లనే ఇక్కడ గల దత్తాత్రేయ దేవాలయానికి ‘దత్త బిక్ష మందిరం’ (Datta Biksha Mandiram) అని పేరు వచ్చింది. ఇక్కడ శ్రీపాదుల వారు అదృశ్యమైన చోట ప్రస్తుతం ఒక ఔదుంబర వృక్షాన్ని చూడవచ్చు. ఈ ఔదుంబరం క్రిందనే శ్రీపాద శ్రీ వల్లభుల పీఠం నెలకొల్పారు. అదేవిధంగా ఈ క్షేత్రంలో Sripada Vallabha Swamiవారి పాదుకలను చూడవచ్చు.
Vannepudi Kshetram Photos
Vannepudi చుట్టుప్రక్కలగల దర్శనీయ ప్రదేశాలు
Places To Visit Near Vannepudi |
---|
Places To Visit Near Vannepudi |
1. Annavaram Vira Venkata Satyanarayana Swamy Temple |
2. Sri Dwibhashyam Gari House, Pithapuram |
3. Pithapuram (Swayambhu Dattareya, Samsthanam Etc..) |
Vannepudi Sripada Dattatreya Kshetram Postal Address
Vannepudi Sripada Dattatreya Kshetram Postal Address |
---|
Vannepudi Sripada Dattatreya Kshetram Postal Address |
Srinivasa Charyulu - Purohithulu Sri Dattatreya Devasthanam, Vannepudi Village - 533449, Gollaprolu (Mn), East Godavari Dist. Ph: 9676463917 |