Krishna River Pushkaraalu -2016
Dattatreya Devotees And Krishna River Pushkaraalu – 2016
కృ(ష్ణ)ష్ణానది పుష్కరాలు- 2016 మరియు దత్తభక్తులు
II స్వర్గారోహణ సోపానామ్ మహాపుణ్య తరంగిణీమ్ అధికం సర్వతీర్థానాం కృష్ణవేణీ నమోస్తుతే II
కృష్ణానది పుష్కరాలను గురించిన సమాచారం మనకి ఎక్కడైనా దొరుకుతుంది. కానీ కృష్ణానది – దత్తాత్రేయునికి గల అవినాభావ సంభందం గురించిన సమాచారం లభించడం దుర్లభం. అందునా ఎందుకు దత్తాత్రేయ భక్తులకు కృష్ణానది పుష్కరాలు, కృష్ణానది పుష్కర స్నానం అతి ముఖ్యమైనదో వంటి అంశాలను వెలుగులోకి తీసుకువచ్చిన వారు అరుదు. దత్త ఉపాశకుల వద్దనుండి, వివిధ క్షేత్రాలదగ్గర నుండి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఇక్కడ ఇస్తునాను. ఈ Article చదివి కృష్ణానది పుష్కరాల స్నానం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని తరించవలసినదిగా ప్రార్ధన. తదనుగుణంగా కృష్ణానదిలో పుష్కర స్నానం ఆచరించి దత్తాత్రేయుల వారి ఆశీస్సులకు పాత్రులవ్వవలసినదిగా విన్నపము. జై గురు దత్త.
Digambaraa..Digambaraa..Sripada Vallabha Digambaraa..
KEERTHI VALLABHA [keerthivallabha@gmail.com]
Click Here To Read In English
జలము /నదుల గురించి మరియు నదీ పుష్కరాల గురించి…
జలము(నీరు) అనేది పంచ భూతాలలో అతి ముఖ్యమైన భూతం. జలము లేనిదే జీవము లేదు. జీవులచే త్రాగబడిన నీరు 1. మూత్రం 2. స్వేదం 3.నెత్తురు 4. వీర్యం 5. ప్రాణం గా మారతాయి. అందుకే ” ప్రాణం జలమయం” అన్నారు. జీవులకు అధికంగా ఎక్కువ మొత్తంలో ఉపయోగపడే జలము నదీ జలము. పంటలు పండాలన్నా, వంటలు వండాలన్నా, దాహం తీరాలన్నా నదీ జలమే దిక్కు. అంటే ఉపయోగపడే జలమునకు ఆధారం నదీజలము. దానికి ఆధారం “నది”. ఇటువంటి జలము యొక్క స్థానం అంతరిక్షం (అంటే ఆకాశం). ఆకాశంలో ఉండే జలము (ఆవిరి రూపంలో) క్రిందకి (భూమి మీదకు) వస్తున్నప్పుడు “అహి” అనే మేఘాలకు తగిలి వర్షధారలుగా పడుతుంది. ఈవిధంగా కురిసే వర్షధారాలే నదులుగా మారతాయని “అధర్వణ వేదం ” చెబుతోంది. అసలు సృష్టికి ముందు జలము మాత్రమే ఉండేదని (సముద్ర జలము) “బృహజాబాల ఉపనిషద్ ” చెబుతోంది. ఒకసారి శ్రీమహా విష్ణువు ” నేను జలము నుండి ఉద్భవించాను” అందుకే నన్ను ‘నారాయణుడు’ అంటారు, ‘నారము’ అంటే ‘నీరు’ అని చెప్పడం జరిగింది. “నది” అనే పదము “నద” అనే శబ్దం నుండి ఉద్భవించింది. నది అంటే “నదించునది,te” అని అర్ధం. అంటే ధ్వనిచేస్తూ నడిచేది అని అర్ధం. నదులు ప్రపంచానికి “మాతృ స్వరూపం” అని “మార్కండేయ పురాణం” చెబుతోంది. నదీ జలములలో “అమృతం” ఉంటుందని “అధర్వణ వేదం” చెబుతోంది. “మునిభావభోధిని” అనే గ్రంధంలో ఏ నది యొక్క స్నానం పుష్కర సమయంలో జీవులపై ఎలా పని చేస్తుందో గొప్పగా వివరించడం జరిగింది. “మునిభావభోధిని” అనే గ్రంధంలో వివరణల ఆధారంగా క్రింది Table లో ఆయా నదుల యొక్క ప్రభావంనూ, ఫలితాలనూ చదవండి:
S.No | River | Year of Pushkaram | Pushkara Snaana Phalamu (During Pushkara Samayam) |
---|---|---|---|
S.No | River | Year of Pushkaram | Pushkara Snaana Phalamu (During Pushkara Samayam) |
01 | Ganga | 2023 (April 22 - May 5) | ప్రజ్ఞను ఇస్తుంది, కుండలిని శక్తి ప్రవహించేలా చేస్తుంది, త్రిదోషాలను పోగొడుతుంది. |
02 | Narmada | 2024 (April 22 - May 5) | పాపాలనూ, దోషములనూ, వ్యాధులను పోగొడుతుంది. |
03 | Saraswati | 2025 (May 15 - 26) | పాపాలనూ, దోషములనూ, వ్యాధులను పోగొడుతుంది, ముక్తి ప్రదాయిని. |
04 | Yamuna | 2026 (June 2 - 13) | పాపాలనూ, దోషములనూ, వ్యాధులను పోగొడుతుంది. |
05 | Godavari | 2027 | పాపాలనూ, దోషములనూ, వ్యాధులను పోగొడుతుంది. |
06 | Krishna | 2016 (ఆగష్టు 12 - 23) | గురువుతో మానసిక సంభందాన్ని పెంపొందిస్తుంది, గురు భక్తిని కలిగిస్తుంది, దోషములనూ, వ్యాధులను పోగొడుతుంది. |
07 | Kaveri | 2017 (సెప్టెంబర్ 12 - 23) | పాపాలనూ, దోషములనూ, వ్యాధులను పోగొడుతుంది. |
08 | Bhima | 2018 (సెప్టెంబర్ 12 - 23) | పాపాలనూ, దోషములనూ, వ్యాధులను పోగొడుతుంది. |
09 | Tapti | 2019 (March 29 - April 9) | పాపాలనూ, దోషములనూ, వ్యాధులను పోగొడుతుంది. |
10 | Tungabhadra | 2020 (March 30 - April 10) | శిష్యులకు కావలసిన నిర్మలమైన చిత్తాన్ని కలిగిస్తుంది,దోషములనూ, వ్యాధులను పోగొడుతుంది. |
11 | Sindhu | 2021 (April 6 - 17) | పాపాలనూ, దోషములనూ, వ్యాధులను పోగొడుతుంది. |
12 | Pranhita | 2022 (April 13 - 24) | పాపాలనూ, దోషములనూ, వ్యాధులను పోగొడుతుంది. |
ఇందులో అన్నిటిలోకెల్లా గొప్పదైన నదీ స్నానఫలము (పుష్కరకాలంలో పుష్కరుడు ఉన్నప్పుడు) “కృష్ణనది” కి కలదు. అదే “గురువుతో మానసిక సంభందాన్ని పెంపొందిస్తుంది, గురు భక్తిని కలిగిస్తుంది, దోషములనూ, వ్యాధులను పోగొడుతుంది”. మిగతా అన్ని నదుల స్నానం పాపాలనూ, దోషాలనూ, వ్యాధులను పోగొడితే, ఒక్క కృష్ణనది స్నానం మాత్రమే గురువుతో మానసిక సంభందాన్ని పెంపొందిస్తుంది, గురు భక్తిని కలిగిస్తుంది. (మిగిలిన దోషాల ను నివృత్తి చేయడం తో పాటుగా) అందు వల్లనే దత్తాత్రేయ భక్తులందరికీ కృష్ణనది పుష్కర సమయంలో కృష్ణనది స్నానం అతి ముఖ్యమైనది.
భూమి మీద వివిధ దేశాలలో అనేక నదులున్నప్పటికీ కేవలం కర్మభూమి అయిన మనదేశం లోని నదులకే పుష్కరాలు లేదా కుంభమేళాలు ఉంటాయి. దానికి గల కారణం మిగిలిన దేశాలలోని నదులలో కేవలం “ప్రవాహశక్తి” మాత్రమే ఉంటుంది. కానీ మన దేశపు నదులలో ప్రవాహశక్తి తో పాటు “తీర్థశక్తి ” ఉంటుంది. అందుకే గొప్పగొప్ప క్షేత్రాల యొక్క నదులలో అనేక తీర్థాలు మనకు కని పిస్తాయి (ఉదా: గాణగాపూర్ భీమా-అమరజ నదులలో అష్టతీర్థాలు ఉంటాయి, తిరుమల లోని కపిలతీర్థం కూడా ఈ కోవలోకే వస్తుంది) నదులకు పాపాలనూ కడిగే “ప్రక్షాళనశక్తి “ఈ “తీర్థశక్తి” వల్లనే వస్తుంది.
నదికి సంబంధించిన ఉత్సవాలు అతి ప్రాచీనమైనవి. వీటిని South India లో అయితే Pushkaraalu అనీ, North India లో అయితే Kumbhamela అనీ అంటారు. పేర్లలో తేడా ఉన్నప్పటికీ పద్దతిలో ఈ రెంటికీ ఎలాంటి తేడాయే లేదు. ఒక్కో నదికి ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి గురు గ్రాహం వివిధ రాశులలోకి ప్రవేశించే దానిని బట్టి 12 నదులకు Pushkaraalu / Kumbhamela వస్తాయి. ప్రతీ నదికి ప్రతీ 144 సంవత్సరాలకు ఒకసారి Maha Pushkaram / Maha Kumbhamela వస్తుంది. ” పోషయతీతి పుష్కరం” అనీ నానుడి. అంటే పోషించేది పుష్కరం అనీ అర్ధం. అలసిన జీవుడిని పోషించేది “పుష్కరం”. దేవతల గురువు అయిన “బృహస్పతి (గురుగ్రహం)” జలాధిపతి అయిన “వరుణుడు” యొక్క ముని మనవడు. జలమునకు అధిక తీర్థశక్తిని ఇవ్వగల ”పుష్కరుడు” అనే వాడు బ్రహ్మ యొక్క కమండలంలో ఉంటాడు. బృహస్పతి బ్రహ్మను మెప్పించి అతని కమండలంలో గల పుష్కరుడిని లోకకళ్యాణం కోసం తనకు ఇవ్వమని అడుగుతాడు. అందుకు బ్రహ్మ పుష్కరుడిని బృహస్పతితో వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. అందుకు అంగీకరించని పుష్కరుడు బ్రహ్మ యొక్క కమండలంలో నే ఉండేటట్టుగా బ్రహ్మని బ్రతిమలాడి ఒప్పిస్తాడు. అందువల్ల బ్రహ్మ మధ్యేమార్గంగా ఇరువురికి (బృహస్పతి & పుష్కరుడు) ఆమోద యోగ్యమైన “పుష్కరాలు” అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒప్పందం ప్రకారం పుష్కరుడు 12 రాశులలో ప్రవేశించే మొదటి 12 రోజులు మరియు చివరి 12 రోజులు (ఆదిపుష్కరాలు – అంత్యపుష్కరాలు) బృహస్పతితో ఉండేటట్లుగా ఒప్పందం కుదురుతుంది. ఇది కాక ప్రతీరోజు ఆ సంవత్సరమంతా (పుష్కర సంవత్సరం అంతా) మధ్యాహ్నం 45 నిముషాల పాటు (12:00 PM To 12:45 PM) ఆ నదిలో బృహస్పతి – పుష్కరుడు – బ్రహ్మ ముగ్గురూ ఉండేటట్లుగా ఒప్పందం కుదురుతుంది. ఈ విధంగా ఏర్పడినవే నదుల యొక్క “పుష్కరాలు”.
కృష్ణానది పుష్కర స్నానం దత్తాత్రేయ భక్తుల జీవితంలో అతి ముఖ్యమైనవిగా ఎందుకు పరిగణింపబడుతున్నాయి? (దత్తాత్రేయుడుకి కృష్ణానదికి ఉన్న అవినాభావ సంభందం)
కృష్ణనదికి “భూమధ్యనది” అని పేరు. కృష్ణనది శ్రీ మహా విష్ణువు ద్వారా ఏర్పర్చబడినది మరియు సృజించబడినది (దత్తాత్రేయుడు విష్ణువు యొక్క అవతారము). ఈ విధంగా శ్రీ మహా విష్ణువు ద్వారా ఏర్పర్చబడిన కృష్ణనది విష్ణువు యొక్క శక్తిని అంశని కలిగి ఉంటుంది. ఈ విధంగా విష్ణువు యొక్క అంశలు కలిగిన కృష్ణనదిని బ్రహ్మ తన “పుత్రిక”గా స్వీకరించి తన యొక్క శక్తి మరియు అంశలను అందులో నిక్షిప్తం చేస్తాడు. ఫలితంగా త్రి మూర్తులలో ఇప్పుడు ఇద్దరి అంశగా, శక్తి వంతంగా కృష్ణనది తయారై ఉంది. ఇది బ్రహ్మ పుత్రికగా బ్రహ్మ దగ్గర కలదు. కృష్ణనది యొక్క పవిత్రతనూ, శక్తిని గమనించిన “సహ్యముని” శ్రీ కృష్ణుడుని ప్రార్ధించి ఆనదిని తన యొక్క పర్వతముల మీదుగా (సహ్యాద్రి పర్వతాల) భూమిపైకి తెచ్చి, లోకకల్యాణానికి నాంది పలకవలసిందిగా అర్ధిస్తాడు. అది విన్న శ్రీ కృష్ణుడు బ్రహ్మ వద్దకు వెళ్లి బ్రహ్మని అడిగి కృష్ణనదిని తనలో కలిపేసుకుంటాడు. తదుపరి సహ్యాద్రి పర్వతాల పైకి చేరి ఒక అశ్వత్థ వృక్షంగా మారి (రావి చెట్టు) ఆ వృక్షము యొక్క వామ (ఎడమ) భాగం నుండి సహ్యాద్రి పర్వతాల పైన “చక్రతీర్థం” అనే ప్రదేశంలో కృష్ణనది భూమి మీదకు విడుదల చేస్తాడు. అందువల్లనే ” కృష్ణ కృష్ణామ్గ సంభూత జంతూనాం పాపహారిణి” అంటారు. అంటే కృష్ణనది కృష్ణుడు యొక్క అంగముల నుండి పుట్టి జంతువుల పాపాలను హరించే నది అని అర్థం,te. ఈ విధంగా సాక్షాత్తు జగద్గురువైన శ్రీ కృష్ణుడి దేహం నుండి పునర్జన్మించింది “కృష్ణనది”. మరి సహ్యాద్రి పర్వతములు దత్తాత్రేయునికి అత్యంత ప్రీతికరమైనవి. అతి ప్రాచీన అతి ముఖ్యమైన దత్తక్షేత్రాలన్నీ సహ్యాద్రిలోనే ఉంటాయి. ఇప్పటికే కృష్ణనది లో విష్ణువు, బ్రహ్మ, శ్రీ కృష్ణుల శక్తులు కలిసి ఉన్నాయి. ఇలా పుట్టిన ఈ నది సహ్యాద్రిలోని మహాబలేశ్వరం వద్ద గల “మహాబలేశ్వరుని (శివుడు) ఆలయం వద్ద గల గోవు ముఖంలో నుండి మైదానంప్రాతంలోకి వస్తుంది. అంటే ఇప్పుడు కృష్ణనదిలో విష్ణువు – బ్రహ్మ – శివుడు యొక్క శక్తులు కలిసాయి. అంటే ఇప్పుడు ఈ నది త్రిమూర్త్యాత్మకమైనది. దానితో పాటుగా శ్రీ కృష్ణుడు యొక్క శక్తి కూడా నిక్షిప్తం చేయబడినది. పైగా దత్తాత్రేయుల వారికి ఇష్టమైన గోవు నుండి ఈ నది మైదానప్రాంతములలో కి అడుగుపెడుతుంది. ఇలా గోవు ముఖం నుండి మైదానప్రాంతములలోకి అడుగు పెట్టిన ఈ నది వెంటనే “వేణి” అనే మరొక నదిని తనలో కలుపుకుంటుంది. ఈ “వేణి” అనే నది సాక్షాత్తు శివుడి యొక్క దేహం నుండి ఉద్భవించిన నది. ఈ “వేణి” కలవడం వల్ల కృష్ణనది “కృష్ణవేణి” గా మారుతుంది. ఇప్పుడు శివుడి యొక్క దేహం (శక్తి) కూడా ఈ నదిలో నిక్షిప్తం చేయబడినది. అందుకే కృష్ణనది బ్రహ్మ-విష్ణు-శివాత్మకరూపం. అందువల్లే అన్ని దత్తాత్రేయ అవతారాలకూ, కృష్ణనదికి అవినాభావ సంభందం కలదు. ఈ విధంగా ఏర్పడిన కృష్ణవేణి తెలంగాణాలో ప్రవేశించే ముందు “భీమానది”ని తనలో కలుపుకుంటుంది. ఈ కలయికకు ముందు భీమానది గాణగపూర్ వద్ద “అమరజనది” ని కలుపుకుంటుంది. ఈ అమరజనది అతి చిన్ననది. ఇది Gulbarga (Kalaburagi) District లో కేవలం 65 దూరం ప్రవహించి (ఒక్క Gulbarga జిల్లా లో మాత్రమే) గాణగపూర్ వద్ద భీమానదిలో కలుస్తుంది. ఈ అమరజనది “కడగంచి” కి దగ్గర లోగల (7 KMs) దత్తర్గావ్ – Dttargaon (దత్తగ్రామము) అనే గ్రామంలో పుట్టిన నది. ఇది పుట్టిన గ్రామము పేరే “దత్తర్గావ్”. అలాగే కర్ణాటకలో “కుండలినీ” అని పిలువబడే అధిక కుండలినీ శక్తిగల ఇంకొక చిన్ననది భీమానది లో కలుస్తుంది. ఈ నదులన్నీ ఒక్కొక్కటిగా వచ్చి కృష్ణనదిలో కలుస్తాయి. అందుకే కృష్ణనది గురుస్వరూపం. అందుకే ఈ నదీ స్నానం మనకు గురువుతో మానసిక సంభందాన్ని పెంపొందిస్తుంది, గురు భక్తిని కలిగిస్తుంది, సర్వ దోషములనూ, వ్యాధులను పోగొడుతుంది, కూడలినిశక్తి ని విజృంభించేటట్లుగా చేస్తుంది. కాబట్టి దత్తాత్రేయ భక్తులందరికి కృష్ణనదీ పుష్కరాలు, కృష్ణనదీ పుష్కరస్నానం అతి ముఖ్యం.
కృష్ణానది పుష్కర స్నానం ఎప్పుడు చేయాలి?
తేదీ | Time |
---|---|
తేదీ | Time |
12/Aug/2016 To 23/Aug/2016 | Best Time From Morning 06:00 AM To 12:45 PM (Avoid Pushkara Snanam During RahuKaalam & Yamaganda Kaalam & Do Not Take Holy Dip Between 07:00 PM To 04:30 AM Under Any Circumstances) |
12/Aug/2016 To Anthya Krishna Pushkaraalu In July 2017 (One Year Period) | From Noon 12:00 PM To 12:45 PM (All Days In The Total Year) |
Anthya Krishna Pushkaraalu 2017 | From Noon 12:00 PM To 12:45 PM |
కృష్ణానది పుష్కర స్నానం ఎక్కడ చేయాలి? (అత్యుత్తమ కృష్ణానది పుష్కర స్నాన ప్రదేశాలు)
S.No. | Place of Pushkara Snanam | Nearest Dattatreya Temple / ఆలయం | Rating / Facilities | Crowd |
---|---|---|---|---|
S.No. | Place of Pushkara Snanam | Nearest Dattatreya Temple / ఆలయం | Rating / Facilities | Crowd |
01 | Wai, Satara Dist. 35 KMs from Satara | Wai Mahaa Ganapathi (వాయ్ మహాగణపతి) & Dattatreya Temple | 5* | Heavy |
02 | Nrusimha Waadi, Near Sangli / Kolhapur | Nrusimha Saraswathi Temple | 5* | Moderate |
03 | Audumbar, Near Sangli | Nrusimha Saraswathi Temple | 5* | Moderate |
04 | Mahabaleshwar | Mahabaleswara Temple | 5* | Heavy |
05 | Alampur | Dattatreya Temple & Jogulamba Shakthi Pitham & Sangameshwara Temple | 5* | Moderate |
06 | Tangidigi, Near Krishna Station, Near Makthal | Datttareya Temple | 5* | Very Less |
07 | Sripada Sri Vallbha Puram (Vittal Baba Asharamam) | Dattatreya Temple | 5* | Moderate |
08 | Sripada Sri Vallabha Tapo Bhumi & Siddhasana Stanam, Kurvapuram | Sripada Sri Vallabha Temple | 5* | Moderate |
09 | Ettipotala / Macherla - Nagarjuna Sagar | Ekamukha Dattatreya Temple | 5* | Less |
10 | Srisailam | Jyotirlinga Temple & ShaktiPitam | 5* | Heavy |
11 | Kotiliga Kshetram | Muktyala, Near Jaggayyapet, Nalgonda-Krishan Dist Border | 3* | Moderate |
12 | Beechupally | Hanuman Temple, On Kurnool - Bangaluru Highway | 5* | Moderate |
13 | Vedadri | Narasimha SKetram | 3* | Moderate |
14 | Vijayawada | Durga Malleshwara Temple | 3* | Heavy |
14 | TallayaPalem, Near Mangalagiri 15 KMs From MangalaGiri | Kotilinga Shaiva Kshetram | 5* | Moderate |
కృష్ణానది పుష్కర స్నానం అనంతరం చేయవలసిన దానములు – వాటి ఫలితములు
పగలు | Type of Daanam / విరాళం | Puja / Homam |
---|---|---|
పగలు | Type of Daanam / విరాళం | Puja / Homam |
పగలు - 1 | Anna Sraaddham / Anna Daanam (Food Donation) | Pushkara Nadi Puja / Datta Homam / Shivalinga Abhishekam With Krishan Rive Jalam / Ista Devatha Puja / Ista Devatha Kshetra Darshanam |
పగలు - 2 | Godaanam / Lavana Daanam (Salt) | Pushkara Nadi Puja / Datta Homam / Shivalinga Abhishekam With Krishan Rive Jalam / Ista Devatha Puja / Ista Devatha Kshetra Darshanam |
పగలు - 3 | Phala Daanam / Guda Daanam (Bellam - Jaggery) / Cheruku Daanam (Sugarcane) | Pushkara Nadi Puja / Datta Homam / Shivalinga Abhishekam With Krishan Rive Jalam / Ista Devatha Puja / Ista Devatha Kshetra Darshanam |
పగలు - 4 | Panchamrutha Daanam | Pushkara Nadi Puja / Datta Homam / Shivalinga Abhishekam With Krishan Rive Jalam / Ista Devatha Puja / Ista Devatha Kshetra Darshanam |
పగలు - 5 | Two Varities of Grains Daanam | Pushkara Nadi Puja / Datta Homam / Shivalinga Abhishekam With Krishan Rive Jalam / Ista Devatha Puja / Ista Devatha Kshetra Darshanam |
పగలు - 6 | Chandana, Oushada (Tulasi Etc..) Daanam | Pushkara Nadi Puja / Datta Homam / Shivalinga Abhishekam With Krishan Rive Jalam / Ista Devatha Puja / Ista Devatha Kshetra Darshanam |
పగలు - 7 | Dhana Daanam | Pushkara Nadi Puja / Datta Homam / Shivalinga Abhishekam With Krishan Rive Jalam / Ista Devatha Puja / Ista Devatha Kshetra Darshanam |
పగలు - 8 | Pushpa Danam | Pushkara Nadi Puja / Datta Homam / Shivalinga Abhishekam With Krishan Rive Jalam / Ista Devatha Puja / Ista Devatha Kshetra Darshanam |
పగలు - 9 | Pnda Pradaanam | Pitru Homam |
పగలు - 10 | Guru Puja, Vastra Daanam | Pushkara Nadi Puja / Datta Homam / Shivalinga Abhishekam With Krishan Rive Jalam / Ista Devatha Puja / Ista Devatha Kshetra Darshanam |
పగలు - 11 | Pusthaka Daanam, Yagnopaveetham Daanam | Pushkara Nadi Puja / Datta Homam / Shivalinga Abhishekam With Krishan Rive Jalam / Ista Devatha Puja / Ista Devatha Kshetra Darshanam |
పగలు - 12 | Tilaadaanam | Pushkara Nadi Puja / Datta Homam / Shivalinga Abhishekam With Krishan Rive Jalam / Ista Devatha Puja / Ista Devatha Kshetra Darshanam |
Remaining All Other Days During Krishna River Pushkaram Between 12:00 ప్రధాని, 12:45 PM | All Above Daanaalu | All Above Puja / Homaalu |
- కృష్ణనదీ పుష్కర సమయంలో చేసే వైదికకర్మలు, దానాలు అద్భుత ఫలితాలు ఇస్తాయి.
- ఒకసారి కృష్ణనదీ పుష్కర స్నానం 12 నదుల స్నానానికి సమానం
- ఒకసారి కృష్ణనదీ పుష్కర స్నానం ఒక అశ్వమేధయాగంతో సమానం
- కృష్ణనదీ పుష్కర సమయం లో 9వ రోజున చేసే పిండప్రాధానం వల్ల పితృ జన్యుకణములలో మార్పును తీసుకువచ్చి అధిక సత్తువ గల ముందు తరముల వారు పుడతారు.
- కృష్ణనదీ పుష్కర సమయంలో చేసే దానాలకు ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించవచ్చు (ఉదా: గోదానానికి బదులుగా ధనమును ఇవ్వవచ్చు).