Deekshalu
Deekshalu (దీక్షలు)
దీక్ష అంటే…?
కలియుగం లో మనయొక్క శక్తిని , ఆధ్యాత్మిక కాంతిని పెంపొం దించు కొనుటకు ఏర్పాటు చేయబ డ్డ దే దీక్ష
దీక్ష కాలం లో భక్తులు పాటిం చే వివిధ నియమాలు ఆయా భక్తులను మంచి మార్గంలో నడిపి తక్కువ సమయం లో శీఘ్ర ఫలితాలను అందిస్తాయి.
రకాలు…
- దత్త దీక్ష
- ఔదుంబర దీక్ష
ఎన్ని రోజులు తీసుకోవాలి?
సాధారణంగా మంచి ఫలితాలను ఇచ్చే దీక్ష 40 రోజుల పాటు ఉంటుంది. దీనిని ‘మండల దీక్ష అంటారు. ఇదేకాక 3,7,14,16,21, రోజుల దీక్ష కుడా తీసుకోవచ్చు. దీక్ష యొక్క ఆఖరి రోజు దత్తజయంతి వచ్చేటట్టుగా తీసుకుంటే మంచిది. అంటే మండల దీక్ష తీసుకునే వారు దత్తజయంతి కి 40 రోజుల ముందు తీసుకోవాలి. ఆడవారు 16 రోజుల దీక్ష మాత్రమే తీసుకోవాలి.
ఎవరు తీసుకోవచ్చు?…
కుల, మత, జాతి భేదాలు లేకుండా ఆడవారు, మగవారు,పిల్లలు, వృద్ధులు ఎవరైనా దీక్షలు తీసుకో వచ్చు.
దీక్షకి ఏమేమి సిద్ధం చేసుకోవాలి?
దీక్ష తీసుకునే వారు వారి వారి పరిస్థితు లకు అనుగుణంగా దీక్ష ను బట్టి గురువు గారిని అడిగి వివిధ వస్తువు లను సిద్ధం చేసుకోవాలి.
ఔదుంబర దీక్ష తీసుకునే వారు సిద్ధం చేసుకోవలసినవి |
---|
ఔదుంబర దీక్ష తీసుకునే వారు సిద్ధం చేసుకోవలసినవి |
ఆకుపచ్చ డ్రస్ (మగవారు: ఆకుపచ్చ షర్టు, ప్యాంటు, కండువా -ఆడవారు: ఆకుపచ్చ చీర / పంజాబీ డ్రస్ , జాకెట్, కండువా) |
ఔదుంబర పూసల మాల |
ముడుపు కట్టడానికి మరొక ఆకుపచ్చ కండువా |
ముడుపు లో వేయడానికి 9/11 రూపాయి బిళ్ళలు |
ముడుపు లో వేయడానికి కలకండ ముక్క |
ముడుపు లో వేయడానికి చిన్న నెయ్యి పాకెట్ |
ముడుపు లో వేయడానికి ఎండు కొబ్బరి కుడక (కోప్రా) |
దీక్షకు కావలసిన రోజువారి పూజా సామగ్రి |
దత్త దీక్ష తీసుకునే వారు సిద్ధం చేసుకోవలసినవి |
---|
దత్త దీక్ష తీసుకునే వారు సిద్ధం చేసుకోవలసినవి |
కాషాయ వర్ణ డ్రస్ (మగవారు: కాషాయ వర్ణ షర్టు, ప్యాంటు, కండువా -ఆడవారు: కాషాయ వర్ణ చీర / పంజాబీ డ్రస్ , జాకెట్, కండువా) |
ఔదుంబర పూసల మాల |
ముడుపు కట్టడానికి మరొక కాషాయ వర్ణ కండువా |
ముడుపు లో వేయడానికి 9/11 రూపాయి బిళ్ళలు |
ముడుపు లో వేయడానికి కలకండ ముక్క |
ముడుపు లో వేయడానికి చిన్న నెయ్యి పాకెట్ |
ముడుపు లో వేయడానికి ఎండు కొబ్బరి కుడక (కోప్రా) |
దీక్షకు కావలసిన రోజువారి పూజా సామగ్రి |
దీక్ష నియమాలు |
---|
దీక్ష నియమాలు |
సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం పారాయణ / గురు చరిత్ర పారాయణ |
ఏక భుక్తి |
శీతల స్నానం |
భూతల శయనం |
చెప్పులు ధరించరాదు |
జనన, మరణ కార్యక్రమాలకు వెళ్ళరాదు |
బ్రహ్మచర్యం పాటించాలి |
గోళ్ళు, కేశాల ఖండన చేయరాదు. |
మద్య, మాంస,ధూమపానాలు నిషేధం |
దత్త సహస్ర నామావళి (1008) / శత నామావళి రోజూ చెప్పాలి |
చిన్న గ్లాసు గోక్షీరంతో దత్తాత్రేయుడిని అభిషేకం చేయాలి |
ఔదుంబర పత్రాలతో దత్తాత్రేయుడిని పూజిం చాలి |
ఎల్లప్పుడు దీక్ష సమయంలో ఔదుంబర పుల్లను / కొమ్మను వెంట ఉంచుకోవాలి |
ఎన్ని రోజుల దీక్ష తీసుకున్నారో అన్నిదీపాలను దత్తాత్రేయుడి ముందు వెలిగించాలి (ఉదాహరణకు 40 రోజుల దీక్ష తీసుకున్న వారు 40 దీపాలను పెట్టాలి) |
ఎల్ల వేళల దత్తస్మరణ - దత్త శరణు ఘోష , జంతు ప్రేమ |
ఎవరైనా దూషించినా వత్తిడికి లోను కాకూడదు. |
ఋజు ప్రవర్తన |
సాముహిక పూజలకు వెళ్ళాలి |
నిత్యం దత్త,శ్రీపాద, నరసింహ సరస్వతి, స్వామి సమర్ధ దేవాలయ సందర్శన |
వీలుంటే దత్తదీక్ష తీసుకున్న వారికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయాలి |
దత్త / ఔదుంబర దీక్షలు తీసుకోవడానికి మరియు విరమించడానికి దర్శించవలసిన దత్తక్షేత్రాలు |
---|
దత్త / ఔదుంబర దీక్షలు తీసుకోవడానికి మరియు విరమించడానికి దర్శించవలసిన దత్తక్షేత్రాలు |
ఎత్తిపోతల |
పిఠాపురం |
కురువపురం |
పంచదేవ పహాడ్ |
మంతన్ గౌడ్ గ్రామం (మక్తల్ కు దగ్గరలో) |
దీక్ష విరమణ
మీరు తీసుకున్న దీక్ష రోజులను బట్టి దీక్ష ను విరమించాలి. విరమణ రోజున ఖచ్చితం గా దత్తహొమమ్ చేసి ముడుపులోని నాణేలను తప్ప మిగతా వాటిని హోమం లో పూర్ణాహుతి లో వేయాలి. నాణేలను దత్తత్రేయునికి సమర్పించాలి. దీక్ష విరమణ దత్తక్షేత్రాలలో చేస్తే మంచిది. విరమణ అనంతరం ఆకుపచ్చ / కాషాయ వర్ణ వస్త్రాలపై స్నానం చేసి అప్పటివరుకు ధరిం చైనా ఔదుంబర మాల లను జాగ్రత్తగా తీసివేసి మాములు వస్త్రాలను ధరించాలి మరియు క్రొత్త మాలను ధరించాలి. దీక్ష విరమణ రోజున ఉపవాసం చేయాలి.
ఒక Reply వదిలి
You must be logged in to post a comment.