Shodasa Dattavataaralu
Dattatreya Shodasavataralu (షోడస దత్తవతారాలు)
శ్రీపాద శ్రీ వల్లభులు రెండవ సంవత్సరంలో ప్రవేసించినప్పటి నుండి వారు “షోడసకళాపరిపూర్ణ మహా యుగావతారమను” విషయమును తెలుపుచుండిరి. దత్తాత్రేయుల వారికి షోడస సంఖ్యకు (16) చాల దగ్గర సంబంధం కలదు. శ్రీపాదుల వారు 16వ సంవత్సరం వరుకు పీఠికాపురంలో ఉన్నారు. అటుపిమ్మట 30వ సంవత్సరం వరుకు కురువపురంలో ఉన్నారు. అయినప్పటికీ వారి వయస్సు 16వ సంవత్సరం లోనే నిలిచిపోయింది. అదే విధంగా దత్తాత్రేయుల వారి వయసు కూడా పదహారే! దత్తత్రేయుని అవతారలూ పదహారే! ప్రసిద్ధికెక్కిన ఆయన నామలూ పదహారే! దత్త సంప్రదాయం లో “షోడశాక్షరీ మంత్రం” మహా శక్తి వంత మైనది. ఆ మంత్రం గురించి ఉపనిషత్తులు “కావాలంటే 16సార్లు నీ తల నరికి ఇవ్వు కాని షోడశాక్షరీ మంత్రాన్ని మాత్రం ఇవ్వద్దని” చెపుతాయి. 16 సంఖ్య లో ని 1 ని 6 ని కలపగా 7 వస్తుంది.(1+6=7). ఋషుల భావన ప్రకారం సప్తమ సంఖ్య “మూలతత్వాన్ని” తెలుపుతుంది. అలాగే శ్రుతులు సప్త(7) సంఖ్య ని “అనంతమని”, “పరబ్రహ్మ” అని సూచించాయి. కాబట్టి పై వివరణ లో ఋషుల మరియు శ్రుతుల భావన ప్రకారం చెప్పబడిన ములతత్వం-అనంతం అనేవి దత్తత్రేయుడుగా చెప్పవచ్చు. అందువల్లనే దత్త సంప్రదాయం లో “సప్తావరణపూజ”కు అధిక ప్రాధాన్యత కలదు. అలాగే దత్తాత్రేయుడు ఉండే లోకం 7వదైన ఊర్ధ్వలోకం (సత్యలోకం). అదేవిధంగా మన శరీరంలో ఉండే 7వ చక్రం పేరు “సహస్రారచక్రం”. సహస్రారంలో దైవశక్తి ఉంటుంది. సాధకుడు తన కుండలిని శక్తిని జాగృతంచేసి క్రింద(మూలాధారం) నుండి పైకి 7వ చక్రంలోకి (సహస్రారం) పయనింపజేసి అక్కడగల శక్తిని దత్తం చేసుకుంటే దత్తస్వరుపంగా మారిపోవడంఖాయం.
శ్రీమహా విష్ణువునకు ఏవిధంగా అయితే దశావతారాలు ఉన్నాయో దత్తాత్రేయుల వారికి కలియుగానికి ముందు (పూర్వయుగములలో) మరియు కలియుగములో (ప్రస్తుత యుగములో) అనేక అవతారాలు గలవు. ఈ అన్ని అవతారాలు గురుతత్వాన్ని, దత్తసంప్రదాయాన్ని సూచిస్తూ ఉంటాయి.అదేవిధంగా పూర్వ మరియు ప్రస్తుత యుగములలో వివిధ “దత్తావతార అంశలు” వచ్చి, దత్తాత్రేయుడు ఇచ్చిన పనిని నిర్వర్తించి తిరిగి దత్తలీనమయ్యాయి.
పూర్వయుగములలోని దత్తావతారాలు (దత్తాత్రేయుని షోడస అవతారములు) మొత్తం: 16 | ప్రస్తుత యుగములలోని దత్తావతారాలు మొత్తం: 03 |
1.శ్రీ యోగిరాజు (ప్రథమ అవతారము) | 1.శ్రీపాద శ్రీ వల్లభ |
2.శ్రీ అత్రివరడుడు (ద్వితీయ అవతారము) | 2.శ్రీ నరసింహ సరస్వతి |
3.దిగంబరావధూత శ్రీ దత్తాత్రేయుడు (తృతీయ అవతారము) | 3.స్వామిసమర్ధ (అక్కల్కోట్) |
4.శ్రీ కాలాగ్నిశమనుడు (చతుర్ధ అవతారము) | |
5.శ్రీ యోగిజనవల్లభుడు (పంచమ అవతారము) | |
6.శ్రీ లీలావిశ్వంబరుడు (షష్టమ అవతారము) | |
7.శ్రీ సిద్ధరాజు (సప్తమ అవతారము) | |
8.శ్రీ జ్ఞానసాగరుడు (అష్టమ అవతారము) | |
9.శ్రీ విశ్వంభరావధూత (నవమ అవతారము) | |
10.శ్రీ మయాముక్తావధూత (దశమ అవతారం) | |
11.శ్రీ ఆదిగురువు (ఏకాదశ అవతారం) | |
12.శ్రీ సంస్కరహీన శివస్వరూప దత్తాత్రేయుడు (ద్వాదశ అవతారం) | |
13.శ్రీ దేవదేవుడు (త్రయోదశ అవతారం) | |
14.శ్రీ దిగంబరుడు (చతుర్దశ అవతారం) | |
15.శ్రీ దత్తావధూత (పంచదశ అవతారం) | |
16.శ్రీ శ్యామకమలలోచనుడు (షోడస అవతారం) | |
కేవలం అత్రిమహర్షి దర్శించిన దత్తవతారాలు |
శ్రీ అత్రివరడుడు (ద్వితీయ అవతారము) |
అత్రి, అనసూయలిద్దరికీ దర్శనమిచ్చిన దత్తవతారాలు |
1.శ్రీ యోగిరాజు (ప్రథమ అవతారము)
2.దిగంబరావధూత శ్రీ దత్తాత్రేయుడు (తృతీయ అవతారము)
3.శ్రీ కాలాగ్నిశమనుడు (చతుర్ధ అవతారము) |
దేవతలకు, సిద్ధమునులకు మరియు సిద్ధపురుషులకు దర్శనమిచ్చిన దత్తవతారాలు |
1.శ్రీ యోగిజనవల్లభుడు (పంచమ అవతారము)
2.శ్రీ లీలావిశ్వంబరుడు (షష్టమ అవతారము)
3.శ్రీ విశ్వంభరావధూత (నవమ అవతారము) |
పూర్వ-ప్రస్తుత యుగాలకు మధ్య గల "వారధి దత్తావతారం" |
యువకుడి వలె ఉండే - శ్రీ మహావతార్ బాబాజి ( లేదా) వృద్ధుని వలె ఉండే - శ్రీ విశ్వేశ్వర మహాప్రభు (ఇరువురు ఒక్కరే) |
దత్తావతార అంశలు (ఇచ్చిన విధిని నిర్వర్తించి తిరిగి దత్తలీనమయ్యె కిరణఅంశలు) |
1.నవనాథులు
2.షిర్డీ సాయినాథుడు
3.శ్రీ మాణిక్ ప్రభు
4.శ్రీ గజానన మహరాజ్
5.విరుపాక్షుడు - (మొదలగు వారు అనేకమంది కలరు) |
ఒక Reply వదిలి
You must be logged in to post a comment.