Siddhamangala Sthotram
దివ్య శ్రీ వల్లభ Siddhmngla Sripda Stotrn ( శ్రీపాద శ్రీ వల్లభ దివ్య సిద్ధమంగళ స్తోత్రం)


| దివ్య శ్రీ వల్లభ Siddhmngla Sripda Stotrn - శ్రీపాద శ్రీ వల్లభ దివ్య సిద్ధమంగళ స్తోత్రం |
|---|
| II శ్రీమదనంతశ్రీ విభూషిత అప్పలలక్ష్మీనరసింహరాజా...జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ II |
| II శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా...జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ II |
| II మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీపాదా...జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ II |
| II సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా...జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ II |
| II సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషీగోత్ర సంభవా...జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ II |
| II దోచౌపాతీదేవ్ లక్ష్మీ ఘనసంఖ్యాభోదిత శ్రీచరణా...జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ II |
| II పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా...జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ II |
| II సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా...జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ II |
| II పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్త మంగళరూప...జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండశ్రీ విజయీభవ II |
(సత్యఋషీశ్వర మల్లాది బాపనార్యకృత దివ్య సిద్ధమంగళ స్తోత్రము)
గమనిక : ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించుటకు ఎటువంటి విధినిషేదములు లేవు
ఫలశృతి: పరమ పవిత్రమైన యీ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన యెడల అనఘాష్టమీ వ్రతం చేసి సహస్ర సద్బ్రాహ్మాణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. యీ స్తోత్రమును పఠించుట వలన సిద్ధ పురుషుల దర్శన, స్పర్శ నములు లభించును. యీ స్తోత్రమును పఠించు చోట సూక్ష్మవాయుమండలము నందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించుచుందురు. ఈ సిద్ధమంగళ స్తోత్రమును భక్తీతో పఠించుట వలన మనసున తలచిన కోరికలు నెరవేరి, శ్రీ పాదుల వారి కృపకు పాత్రులగుదురు.
సిద్ధమంగళ స్తోత్రం – శ్లోకార్ధ వివరణ చదవడం కోసం క్రింది “Meaning of Siddhamangala Sthotram” బటన్ పై క్లిక్ చెయ్యండి
![]()





