శ్రీ గురు Astakam
శ్రీ గురు Astakam (శ్రీ నృసింహ సరస్వతి Astakam) – శ్రీ గురు అష్టకం(శ్రీ నృసింహ సరస్వతి అష్టకం)
శ్రీ గురు అష్టకం(శ్రీ నృసింహ సరస్వతి అష్టకం / నృసింహ సరస్వతి స్తోత్రం) |
---|
|| ఇందుకోటి తేజకర్ణసింధు భక్తవత్సలం నందనాత్రి సూనుదత్తమిందిరాక్ష శ్రీగురుం గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [1] |
|| మోహపాశ అంధకార జాతదూర భాస్కరం ఆయతాక్ష పాహి శ్రీయవల్లభేశ నాయకం సేవ్యభక్త బృందవరద భూయో భూయో నమామ్యహం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [2] |
|| చిత్తజారి వర్గషడ్క మత్త వారుణాంకుశం సత్యసార శోభితాత్మ దత్తశ్రీయ వల్లభం ఉత్తమావతార భూతకర్తృ భక్తవత్సలం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [3] |
|| వ్యోమవాయు తేజ ఆపభూమి కర్తృమీశ్వరం కామక్రోధమోహరహిత సోమసూర్యలోచనం కామితార్ధ దాతృభక్త కామధేను శ్రీగురుం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [4] |
|| పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజసం చండదురిత ఖండనార్ధ దండదారి శ్రీగురుం మండలీకమౌళి మార్తాండ భాసితాననం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [5] |
|| వేదశాస్త్ర స్తుత్యపాద మాదిమూర్తి శ్రీగురుం నాదబిందు కళాతీత కల్పపాద సేవ్యయం సేవ్యభక్త బృందవరద భూయో భూయో నమామ్యహం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [6] |
|| అష్టయోగ తత్వ నిష్టతుష్ట ఙ్ఞానవారిధిం కృష్ణవేణీ తీరవాస పంచనద్య సంగమం కష్టదైన్యదూరభక్త తుష్ట కామ్యదాయకం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [7] |
|| నారసింహ సరస్వతీశనామ మష్టమౌక్తికం హార్కకృత్య శారదేన గంగాధరాఖ్య స్వాత్మజం ధారుణీక దేవదీక్ష గురుమూర్తి తోషకం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం || [8] |
ఫలశృతి: || నారసింహ సరస్వతీశ అష్టకంచ యఃపఠేత్ ఘోర సంసారసింధు తారణాఖ్య సాధనం సారఙ్ఞాన దీర్ఘ ఆయురారోగ్య సంపదాం చారువర్గ కామ్యలాభ నిత్యమేవ యఃపఠేత్ || |
పైన చెప్ప బడిన శ్రీ గురు అష్టకం / శ్రీ నృసింహ సరస్వతి అష్టకం / నృసింహ సరస్వతి స్తోత్రం ఆవిర్భావ కథ |
---|
నరహరిశర్మ అనే భక్తుడు పారవశ్యంతో శ్రీ గురుని ఈ అష్టకంతో స్తుతించాడు. కుష్టురోగంతో భాద పడుతున్న నరహరిశర్మ దేవతలెందరినో ఆశ్రయించి, జీవితంపై విరక్తిచెంది శ్రీగురుని గురించివిని చివరికి ఆయనని ఆశ్రయిస్తాడు. ఆతని నమ్మకాన్ని పరీక్షించడానికి శ్రీగురుడు ఆతనికి ఎండిన మేడిచెట్టు పుల్లనిచ్చి, "నాయనా మా మాట మీద విశ్వాసముంచి దీన్ని నాటి రోజూ నీరుపోస్తుండు, ఆ కట్టె ఎపుడయితే చిగురిస్తుందో అప్పుడు నీ వ్యాధి నయమవుతుంది" అంటారు. శ్రీ గురుడు చెప్పినట్టే చేస్తున్న అతన్ని చూసి సంగమంలో ఉన్న తోటివారు అతని ఎగతాళి చేస్తారు. అయినప్పటికీ నరహరిశర్మ శ్రీ గురుని మాటపై అచంచల విశ్వాసం ఉంచి అయన చెప్పినట్లే చేస్తూంటాడు. ఆసక్తి చంపుకోలేని సంగమంలోని కొందరు శ్రీ గురుని వద్దకు వెళ్లి....."గురుదేవా ఆ వెర్రివాడు వారం నుండీ తిండి తిప్పలు లేకుండా మీరు చెప్పినట్టే ఆ ఎండు మేడికట్టెను సేవిస్తున్నాడు...పైగా అతని బాగుకోరి హితం చెప్తున్న మాకు శ్రీ గురుడు చెప్పినట్లు చేయటం నా పని, ఆయన అన్న మాట నిలబెట్టుకోవడం ఆయన పని అంటూ ఉపవాసాలు చేస్తున్నాడు" అంటారు. అప్పుడు శ్రీ గురుడు..." నాయనలారా భూలోకంలో గురుదేవుని వాక్య మొక్కటే మానవులను తరింపజేయగలదు. గురుదేవుల మాటలను విశ్వశించిన వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. భావాన్నిబట్టి ఫలితం ఉంటుంది. దేవత,మంత్రము,వైద్యుడు,పుణ్యతీర్ధము,గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావముంటుందో,వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది...అని శివలింగాన్ని అత్యంత శ్రద్ధవిశ్వాసంతో పూజించి తరించిన బోయవాని కథ చెప్పి,నరహరిశర్మ వద్దకు వెళ్తారు. అక్కడ భక్తి,శ్రద్ధలతో ఎండిన మేడికట్టెను పూజిస్తున్న అతని చూచి సంతుష్టి చెందిన ఆయన ఎండిన ఆ మేడికట్టె పై తమ కమండలంలోని నీటిని జల్లుతారు. ఆయన సంకల్పంతో మహిమాన్వితమైన ఆ మంత్ర జలం ఎండుకట్టెను తాకిన క్షణమే అది చిగురించడం ప్రారంభిస్తుంది.....సంగమంలోని భక్తులు సంభ్రమాశ్చర్యాలతో ఆ వింతను స్తుండగానే ఆ చెట్టు పెరిగి పెద్దదవుతుంది.నివ్వెరబోయి చూస్తున్న నరహరిశర్మకి కుష్టురోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరుస్తుంది.తనని తాను చూచుకున్న నరహరిశర్మ ఆశ్చర్యచకితుడై, శరీరమంతా రోమాంచితమవుతుండగా పారవశ్యంతో శ్రీ గురుని పైవిధంగా స్తుతిస్తాడు. |
శ్రీ నృసింహ సరస్వతి స్తుతి |
---|
శ్రీ నరసింహ సరస్వతీ యోగిరాజం భజేహమ్ |
కర్ణాంత కమల నయనం కనకవర్ణచ్ఛాయం వటవృక్షాధః శిలాతలోపరి పద్మాసనాసీనమ్ శ్రీ నరసింహ సరస్వతి |
నిజ తను ధృత కాషాయాంబర సంవృతోత్తమాంగం కంఠమాలాయిత పావన రుద్రాక్షహారమ్ శ్రీ నరసింహ సరస్వతి |
అనేక లీలా మహిమ ప్రదర్శన సద్గురు మూర్తిం హరిహర బ్రహ్మాత్మక శ్రీపాద దత్తాత్రేయ పూర్ణావతారమ్ శ్రీ నరసింహ సరస్వతి |