శ్రీ దత్త Navayoga లక్ష్మి Vratham
శ్రీ దత్త Navayoga లక్ష్మి Vratham(శ్రీదత్త లక్ష్మి నవయోగ వ్రతం – జన్మసాఫల్య వ్రతం)
ఇది ఒక అరుదైన వ్రతం, షిర్డీ సాయి స్వయంగా చెప్పి, వ్రాయించి, చేయించిందిగా ప్రసిద్ధి. ఇది యాగ సమానమైన వ్రతము. ఈ వ్రతం చేయడం వల్ల లక్ష్మీయోగ కటాక్షాలు (ధన, ధాన్యయోగాలు), దత్తుని ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. ఈ వ్రతం చేయడం వల్ల జన్మ సాఫల్యం చెందుతుంది. మానవ జన్మలో ఒక్కసారైనా ఈ వ్రతం చేసి తీరాలి. అందువల్లనే ఈ వ్రతాన్ని జన్మ సాఫల్య వ్రతం అని కూడా అంటారు.
ఈ వ్రతాన్ని చిలుకు ద్వాదశి రోజు కానీ, శ్రీపాద శ్రీ వల్లభ జన్మ దినోత్సవం రోజు కానీ, గురు పౌర్ణమి రోజున కానీ, దత్త జయంతి రోజున కానీ చేయవచ్చు. ఈ వ్రతం లో దత్త- లక్ష్మీ లతో పాటుగా, నవనాథులను, నవనారసింహులను మరియు అష్టసిద్ధులను పూజిస్తాము. ఈ వ్రతాన్నిభార్య-భర్త కలసి జంటగా బంధుమిత్రసమేతంగా చెయ్యాలి. అనేక జంటలు ఏకకాలంలో సాముహికంగా కూడా చేసుకోవచ్చు. ఈ వ్రతంలో మొత్తం 11 కలశాలను 11 కొబ్బరికాయలతో ఏర్పాటు చేసుకోవాలి. అనఘాస్టమీ వ్రతం చేయడం వల్ల పాపాలు నశించి ‘అనఘులుగా’ అవుతాము. ఈ వ్రత చేయడం వల్ల ధన ప్రాప్తి కలిగి జన్మసాఫల్యం పొందవచ్చు.
శ్రీదత్త లక్ష్మి నవయోగ వ్రతం (జన్మసాఫల్య వ్రతం) – విధానము
ముగ్గులతో అలంకరించిన పెద్ద వ్రత పీఠ (11 కలశాలు పట్టేటంత) పై నూతన వస్త్రమును పరిచి దానిపై బ్బియ్యపు గింజలను పేర్చి 11 కలశాలను కొబ్బరికాయలతో జాకెట్ వస్త్రములతో, పూలతో చక్కగా
అలంకరించుకోవాలి. ఏయే కలాశాలలో ఏయే దేవుళ్ళను ఆహ్వానిస్తున్నామో చిన్నచీటీ పైన వ్రాసుకొని వాటి పై ఆయా కలశాలను పెట్టుకోవాలి అలంకరించిన కలశాలను దిక్కులను అనుసరించి క్రింది విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
1వ పెద్ద కలశం (ప్రధాన కలశం-1- వ్రత పీఠకు మధ్యలో ఉంచాలి): శ్రీ దత్తత్రేయునికి
2వ పెద్ద కలశం (ప్రధాన కలశం-2 – వ్రత పీఠకు మధ్యలో ఉంచాలి): శ్రీలక్ష్మీ దేవికి
3వ కలశం (ప్రధాన కలశాల కంటే కొద్దిగా చిన్నది – వ్రత పీఠకు మధ్యలో కలశం-1 మరియు కలశం-2 లకు కింద ఉంచాలి ): మత్సేంద్రనాథుడు + శ్రీ అహోబిల నరసింహస్వామి
4వ కలశం (చిన్న కలశం – ఈ కలశం ఈశాన్య దిక్కుగా ఉండాలి): అణిమా + గోరక్షనాథుడు + శ్రీ భార్గవ నరసింహస్వామి
5వ కలశం (చిన్న కలశం – ఈ కలశం నైరుతి దిక్కుగా ఉండాలి): ప్రాప్తి + రేవనాథుడు + శ్రీ యోగానంద నరసింహస్వామి
6వ కలశం (చిన్న కలశం – ఈ కలశం ఆగ్నేయ దిక్కుగా ఉండాలి): లఘిమా + జాలంధరనాథుడు + శ్రీ ఛత్రవట నరసింహస్వామి
7వ కలశం (చిన్న కలశం – ఈ కలశం వాయువ్య దిక్కుగా ఉండాలి): ప్రాకామ్య + భర్తరినాథుడు + శ్రీ వరాహ నరసింహస్వామి
8వ కలశం (చిన్న కలశం – ఈ కలశం ఉత్తర దిక్కుగా ఉండాలి): వాసిత్వ + కానిఫానాథుడు + శ్రీ మాలోల నరసింహస్వామి
9వ కలశం (చిన్న కలశం – ఈ కలశం దక్షిణ దిక్కుగా ఉండాలి): ఈసిత్వ + చర్పటనాథుడు + శ్రీ జ్వాలా నరసింహస్వామి
10వ కలశం (చిన్న కలశం – ఈ కలశం తూర్పు దిక్కుగా ఉండాలి): మహిమా + గహనీనాథుడు + శ్రీ పావన నరసింహస్వామి
11వ కలశం (చిన్న కలశం – ఈ కలశం పచ్చిమ దిక్కుగా ఉండాలి): కామావసాయిత + నాగనాథుడు + శ్రీ కరంజ నరసింహస్వామి
ఒక Reply వదిలి
You must be logged in to post a comment.