తరచుగా అడిగే ప్రశ్నలు
తరచుగా అడిగే ప్రశ్నలు
శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు?
సమస్త సృష్టి లోని ఏకత్వం నందలి అనేకత్వంను, అనేకత్వం నందలి ఏకత్వంను తనయందే నిలుపుకొని వచ్చిన అత్యంత అద్భుతమైన, అత్యంత విలక్షణమైన యుగావతరమే శ్రీపాద శ్రీవల్లభ అవతారం . ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రీపాద శ్రీవల్లభులు షణ్ముఖ మరియు మహాగణపతులు ధర్మశాస్త (అయ్యప్ప) లో కలవడం వల్ల ఏర్పడి ఉండవచ్చు లేదా రుద్ర మరియు బ్రహ్మలు విష్ణువు లో కలవడం వల్ల ఏర్పడి ఉండవచ్చు. వారి అవతరణ “సవిత్రకాటక చయనం” వల్ల జరిగింది. అందువల్లనే శ్రీపాద శ్రీ వల్లభులు వినాయక చవితి రోజు పుట్టారు. అలాగే శ్రీపాదుల వారిది షణ్ముఖతత్త్వం కనుకనే వారు జ్ఞానావతారులు మరియు ధర్మశాస్త (అయ్యప్ప) కాబట్టే వారు జ్యోతి స్వరూపులు. అలాగే ఒకానొక సమయంలో వ్యాఘ్రేశ్వర శర్మ అనబడే పులిని అధిరోహించి ధర్మశాస్త అయ్యప్ప వలే పంచదేవపహాడ్ నుండి కృష్ణా నది మీదుగా నీటిలో నడుచుకుంటూ కురుగడ్డ చేరారు. శ్రీపాద శ్రీ వల్లభుల తాతగారు (బాపనార్యులు) ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అయినవిల్లి లో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరిపించెను, అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయకుని వారే ప్రతిష్టించెను. పిఠాపురం లోని కుక్కుటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న స్వయంభూ దత్తుడిని పునః ప్రతిష్టించింది కూడా సత్య ఋషీస్వరులైన బాపనార్యులు గారే. అలాగే శ్రీపాద శ్రీ వల్లభుల తండ్రి గారైన అప్పల లక్ష్మీ నరసింహ రాజ శర్మ వారి స్వగ్రామం అయినవిల్లి. వీటన్నింటిని క్రోడీకరించి చూస్తే మహా గణపతి, సుబ్రమణ్యేశ్వరులు ధర్మశాస్త లో కలవడం వల్ల, అలాగే గాయత్రీ మంత్రాధిష్టాన దేవత అయిన సవితాదేవి అనుగ్రహం తో త్రేతాయుగము లో జరిగిన “సవిత్రకాటకచయనం” అనే యజ్ఞ ఫలితంగా వారు క్రీ.శ.1320 ప్రాంతం లో పిఠాపురం లో జన్మించిరి. కానీ శ్రీపాద శ్రీ వల్లభ అవతారరూపం క్రీ .శ .1212 నుండి భూమిమీద ఉండి యోగులకు, మహాపురుషులకు సూక్ష్మరూపస్థితి లో దర్శనమిచ్చేవారు.
శ్రీపాద శ్రీ వల్లభులకు ఆ పేరు ఎందుకు పెట్టారు ?
అఖండ లక్ష్మి సౌభాగ్యవతి అయిన సుమతీ మహారాణి కి జన్మించిన శిశువు(శ్రీపాద వల్లభుడు) యొక్క పాదాలలో దివ్య చిహ్నాలు(శంకు,చక్రం,ఓం,పుష్పాలు మరియు కల్పవృక్షం) ఉండడం, శిశువు అప్రతిమాన తేజస్సు తో ప్రకాశిస్తూ ఉండడం వల్ల సుమతీ మహారాణి మరియు అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మలు (శ్రీపాదుల వారి తల్లిదండ్రులు) ఆ శిశువు కు శ్రీపాద శ్రీ వల్లభ రాజ శర్మ అనిపేరు పెట్టిరి . కాలం గడిచేకొద్ది శ్రీపాద శ్రీ వల్లభుల దివ్య చరణాలలో సర్వతీర్థాలు ఉన్నట్లుగా తెలుసుకోనిరి. అందువల్ల శ్రీపాదులవారు సార్ధక నామధేయులు.
శ్రీపాద శ్రీవల్లభుల విరాట్ స్వరూపం ఎలా ఉంటుందని వారు (శ్రీపాద శ్రీవల్లభులు) చెప్పారు?
నిరాకారుడైన నేను నరాకారంగా ( మనుష్య రూపంలో ) మీ ముందునకు వచ్చుట కడు చోద్యము . నిర్గుణుడైన నేను సగుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యము . అసలు పరిమితులు, అవధులు లేని నేను పరిమితులతో , అవధులతో ఉన్నట్లు మీకు అనుభవమగుట వింత గొలుపు విషయము. “నిరాకారుడైన నేను నరాకారంగా (మనుష్య రూపంలో) మీ ముందునకు వచ్చుట కడుచోద్యము . నిర్గుణుడైన నేను సగుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యము . అసలు పరిమితులు, అవధులు లేని నేను పరిమితులతో, అవధులతో ఉన్నట్లు మీకు అనుభవమగుట వింత గొలుపు విషయము”అని చెప్పిరి.
శ్రీపాద ఆరాధన (దత్తారాధన) గొప్పదనము ఏమిటి?
శ్రీపాదులు స్మర్త్రుగామి, దశమహవిద్యలను ఆరాధించుట వలన కలిగే ఫలం దత్తారాధన వల్ల వెంటనే కలుగును. దత్తుడు సర్వదేవతాస్వరూపుడు, అతి ప్రాచీనుడు, అవతార సమాప్తి లేని మహావతారుడు సులభ సాధ్యుడు , కుక్కలకు ఇతర జీవులకు అన్నం పెట్టిన వెంటనే అనుగ్రహిస్తాడు . ఔదుంబరము(మేడి), అశ్వద్ధ (రావి) , పనస (మధుమతి తల్లి నివాస వృక్షం) మరియు కృష్ణామలకము వంటి వృక్షాల మొదళ్ళలో సూక్ష్మరూపంలో ఉండి సద్యఃఫలములను ప్రసాదించు మహావతారం.
జాన్ అనే విదేశి భక్తుడిని శ్రీ పాదుల వారు ఎలా అనుగ్రహించారు?
జాన్ అనునతడు ఒక శ్వేత జాతీయుడు. అతనిది జెర్మని. జెర్మని నుండి కురుగడ్డకి శ్రీపాదుల వారి దర్శనార్ధమై వచ్చిన సమయంలో శ్రీపాదుల వారు అతని కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూసిరి. అతనికి నేత్ర దీక్ష ను ఇచ్చిరి. అనంతరం అచ్చటనున్న వారందరిని ఆకశంలోకి చూడమనిరి, ఆకశంలో దేవనాగరిలిపి లో ఒక పెద్ద సంఖ్య కనిపించింది. ఆ సంఖ్య 170141183460469231731687303715884105727 (౧౭౦౧౪౧౧౮౩౪౬౦౪౬౯౨౩౧౭౩౧౬౮౭౩౦౩౭౧౫౮౮౪౧౦౫౭౨౭ ) అది చిత్రగుప్తులవారి జ్ఞానసంఖ్య అని, విశ్వసంఖ్య అని శ్రీపాదుల వారు శెలవిచ్చిరి. జాన్ జర్మన్ భాష లో ప్రశ్నిస్తూఉంటే శ్రీపాదుల వారు తెలుగులో సమాధానమిచ్చేవారు. జాన్ కి శ్రీపాదులవారు తెలుగులో మాట్లాడిందంతా జర్మన్లో కి అనువదించబడి వినిపించేదట. ఎంతటి అద్భుతము!!!
శ్రీ పాదుల వారు ఎవరికి తమ స్వహస్తాలతో అన్నము తినిపించి, వారి స్వహస్తాలతోనే చేతులను, మూతిని తుడిచిరి ?
నామానందాచార్యులు(నామానందులు) గారికి (అసలు పేరు సాయనాచార్యులు సన్యాస దీక్ష సందర్భంగా శ్రీపాదులే నామానండుదని పేరు పెట్టిరి) వీరే దివ్య సిద్ధమంగళ స్తోత్రమును శ్రీ బాపనార్యుల నోటి గుండా విని మనకు అందించినది.
శ్రీపాద వల్లభులు శ్రీ మహావిష్ణువువలె సర్పంపై పవళించిన వృత్తాంతమును ఎవరు ఎవరి సమక్షములో తెలిపిరి ?
శ్రీ పళనిస్వామి సమక్షములో ‘మాధవుడు’ పాముకాటుకుగురై మరణించి,తిరిగి శ్రీపాదులవారి ఆశీర్వాదములతో శ్రీ పళనిస్వామి ద్వారా పునరుజ్జీవితుడైనాడు. మరణించినప్పుడు సూక్ష్మదేహంతో కురువపురం మధ్య భాగంలోని లోతులలో నాగాలోకమును దర్శించెను. అచ్చట మాధవుడు అనేక మహాసర్పములను దర్శించెను అందులో ఒక మహాసర్పమును చూసెను. ఆ మహాసర్పము పై శ్రీపాద వల్లభులు శ్రీ మహావిష్ణువు వలె పవళించి ఉండెను. అచ్చట అనేక ఇతర మహాసర్పములు వేదగానం చేయుచుండగా శ్రీపాద వల్లభులు చిదానందముతో వినుచుండెను. యిదంతయూ చిదంబరమునకు సమీపములోని శ్రీ పళని స్వామి నివసించే కొండగుహలలో జరిగెను. అచ్చటనే మాధవుని తో పాటుగా శ్రీమాన్ శంకరభట్టు కుడా ఉన్నారు.
శ్రీమాన్ శంకరభట్టు గారు ఏ ఏ శ్రీపాద శ్రీ వల్లభ భక్తులను ఎక్కడ కలిసారు?
శ్రీమాన్ శంకరభట్టు గారు ఉడిపి నుంచి కురవపురం అటునుండి పిఠాపురం దర్శించినపుడు కలిసినశ్రీపాద భక్తుల వివరాలు వరుసగా : 1.వ్యాఘ్రేశ్వర శర్మ – మరుత్వమలై నందు 2.శ్రీ సిద్ధేంద్ర యోగి – కదంబవనం / పాండ్య దేశం / మధురానగరం నందు 3.వల్లభ దాసు – విచిత్రపురం 4.శ్రీ పళని స్వామి – చిదంబరం 5.మంగలి సుబ్బయ్య -తిరుమల – తిరుపతి 6.తిరుమల దాసు – కాణిపాకం 7.సుబ్బయ్య శ్రేష్టి – 8.ఆనంద శర్మ -9.దత్త దాసు ( దత్తానంద స్వామి ) – ముంత కల్లు గ్రామం 10.బంగారప్ప – 11.శ్రీమన్నారాయణ 12.నామానందులు 13. రవి దాసు (తిరుమలదాసు కుమారుడు ) -కురుగడ్డ 14.వల్లభేశ్వర శర్మ – కురుగడ్డ 15.సుబ్బన్న శాస్త్రి – కురుగడ్డ 16. లింగన్న శాస్త్రి – 17. గురు చరణుడు-18. గణపతి శాస్త్రి – పెనుగొండ 19. దండి స్వామి , అబ్బన్న, దండోరా మాదిగ సుబ్బన్న20.కృష్ణ దాసు(మాల దాసరి) -మాంచాల గ్రామం 21.గురు దత్త భట్టు – కురుగడ్డ 22.శివయ్య -పిఠాపురం 23. ధర్మ గుప్తుడు – 24. విరుపాక్షుడు – పంచ దేవ పహాడ్ 25. శరభేశ్వర శాస్త్రి 26. సిద్ధుడు 27. బంగారయ్య (వేదాంత శర్మ) – బంగారమ్మ 28. బ్రాహ్మణ బైరాగి 29. పురాణ పండితుడు – లక్ష్మి 30. నాగేంద్ర శాస్త్రి 31.భాస్కర శాస్త్రి (త్రిపురాంతకం – త్రిపురాతకే శ్వరుని అర్చకులు) 32. నరసింహ ఖాన్ -కాశ్యప గోత్ర వృద్ధ బ్రాహ్మణుడు – మహారాష్ట్ర 33. ధనగుప్తులు – ధర్మగుప్తులు – కొండవీడు
శ్రీ పాదుల వారిని చుట్టిఉండే కాంతిని గురించి ఒకానొక యోగి యేమని సెలవిచ్చెను ?
శ్రీ పాదుల వారిని చుట్టి వ్యాపించి ఉన్న ధవళకాంతి (తెలుపు) వారి నిర్మలత్వానికి, సంపూర్ణ యోగావతారానికి చిహ్నాలుగా, ఆ ధవళకాంతిని చుట్టి ఉన్న నీలిరంగు కాంతి వారి అనంత ప్రేమను మరియు కరుణను సూచిస్తుందని విగ్రహాల, దేవుళ్ళ మరియు మనుషుల కాంతి పరివేష్టమును గురించి తెలిపే ఒక యోగి చెప్పెను.
“దో చౌపాతీ దేవ్ లక్ష్మీ” అనగానేమి ? లేదా ౨౪౯౮ (2498 ) అర్ధమేమిటి ? లేదా శ్రీ పాద “ఘనసంఖ్య” అనగానేమి?
శ్రీపాదులవారు వారికి ఇష్టమైన ఇళ్ళ నుండి రెండు చపాతీలను స్వీకరించేవారు. వారు దో చపాతీ దేవ్ లక్ష్మీ అని అడుగుటకు బదులుగా “దో చౌపాతీ దేవ్ లక్ష్మీ” అని అడిగేవారు. ఈ విధంగా వారు ౨౪౯౮ (2498 ) సంఖ్య కు నిఘూడ అర్ధాన్ని చెప్పారు. వారి ప్రకారం:
• దో – అనగా 2
• చౌ – అనగా 4
• పతిదేవ్ – 9 వలె మార్పు చెందని పరమేశ్వరుడు (బ్రహ్మతత్వము)
• లక్ష్మీ – 8 సంఖ్య వంటి మాయాస్వరూపము
అలాగే 2498 లోని ’24′ గాయత్రీ మంత్రము లోని 24 అక్షరాలను, '9′ బ్రహ్మతత్వమును, '8′ మయాతత్వమును సూచించును. అదేవిధంగా 2498 లోని ’2′ ద్వంద్వములను, '4′ శరీరమును, '9′ బ్రహ్మతత్వమును, '8′ మాయాతత్వమును సూచించును. మరొకవిధంగా 2498 లోని ’2′ గో ను (గోవు లోని గో), '4′ కులమును, '9′ బ్రహ్మతత్వమును, '8′ మాయాతత్వము సూచించును. పై వివరణల వలన శ్రీపాదులే గాయత్రీ స్వరూపమని, వారే పరమాత్మ మరియు పరాశక్తి అని భక్తులకు సూచించిరి.
2498 సంఖ్యకు ఇంకొక ప్రాముఖ్యత కుడా కలదు. శ్రీపాద శ్రీ వల్లభులుగా గణేశ చతుర్ధినాడు అవతరించుటకు ఖచ్చితంగా 2498 సంవత్సరాలకు ముందు అనగా ఋగ్వేదకాలం 1178 లో (క్రీ.పూ.1178 – ECB 1178 – బిఫోర్ క్రయిస్ట్ ఏరా) బదరికాశ్రమమున ఉన్న మహాయోగులకు 25 సంవత్సరాల నవయువకునిగా శ్రీ దత్తాత్రేయుల వారు దర్శనముఇచ్చి వారికి క్రియాయోగమును భోదించి అంతర్దానమయ్యెను. ఆ మహాయోగులు 25 సంవత్సరాల నవయువకునిగా ఉన్న శ్రీ దత్తాత్రేయుల వారిని ” శ్రీ బాబాజీ” అని పిలిచిరి. అదే మహాయోగులు తిరిగి శ్రీ బాబాజీ ని ప్రార్ధించి దర్శనమివ్వమనిరి. అప్పుడు శ్రీ బాబాజీ వారికీ ఒక తేజోరూపముగా కనిపించి చివరకు ఆ తేజోరూపము ఒక వృద్ధరూపమును దాల్చెను. ఆ మహాయోగులు వారిని “శ్రీ విశ్వేశ్వరమహాప్రభు” అని పిలిచిరి. అదే మహాయోగులు శ్రీ విశ్వేశ్వరమహాప్రభువులను నిరంతర దర్శనమును కోరిరి. అప్పుడు శ్రీ విశ్వేశ్వరమహాప్రభువులు తాము 2498 సంవత్సరముల తరువాత భవిష్యత్తులో హూణశకమున (క్రీ.శ.)1320 లో శ్రీ పీఠికాపురమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించెదమని చెప్పిరి.
ఎందుకు 9 సంఖ్య బ్రహ్మతత్వమును, 8 సంఖ్య మయాతత్వమును సూచించును?
ఈ ప్రశ్నకు గణితబద్ధమైన సమాధానము కలదు. దాని ప్రకారం తొమ్మిది(9) క్రింది విధముగా మార్పుచెందదు.
9 x 1 = 9
9 x 2 = 18 → 1 + 8 = 9
9 x 3 = 27→ 2 + 7 = 9
పై విధంగా 9 సంఖ్య ని ఏ ఇతర సంఖ్యతో (1-9) గుణించినా తొమ్మిదే వస్తుంది. ఇదే మార్పుచెందని బ్రహ్మ తత్వము.
అలాగే ఎనిమిది(8) సంఖ్య కు గణితబద్ధమైన వివరణ క్రిందివిధంగా ఉంటుంది.
8 x 1 = 8
8 x 2 = 16 → 1 + 6 = 7 → 1 < 8 ( 7 ఉంది 1 కంటే తక్కువ 8 ఏడు, ఎనిమిది కంటే ఒకటి తక్కువ)
8 x 3 = 24 → 2 + 4 = 6 → 2 < 8 ( 6 ఉంది 2 కంటే తక్కువ 8)
8 x 4 = 32 → 3 + 2 = 5 → 3 < 8 ( 5 ఉంది 3 కంటే తక్కువ 8)
8 x 5 = 40 → 4 + 0 = 4 → 4< 8 ( 4 ఉంది 4 కంటే తక్కువ 8)
8 x 6 = 48 → 4 + 8 = 12 → 1+2 = 3 → 3 < 8 (3 ఉంది 5 కంటే తక్కువ 8)
8 x 7 = 56 → 5 + 6 = 11 → 1+1 = 2 → 2 < 8 ( 2 ఉంది 6 కంటే తక్కువ 8)
8 x 8 = 64 → 6 + 4 = 10 → 1+0 = 1 → 1 < 8 (1 ఉంది 7 కంటే తక్కువ 8)
8 x 9 = 72 → 7 + 2= 09 → 0+9 = 9 → 9 > 8 (9 ఉంది 1 Grater than 8)
పైవిధంగా ఒకటొకటిగా తగ్గుతూ చివరకు 8 సంఖ్య అయిన మాయాతత్వము 9 సంఖ్య అయిన బ్రహ్మతత్వము లో ఐక్యమైపోతుంది.
పిఠాపురం నందు శ్రీ పాదులవారు పదహారు సంవత్సరాలు ఉన్నారు. అయితే ఏ ఏ భక్తులు ఏ ఏ సంవత్సరాల అనుభవాలను శ్రీమాన్ శంకరభట్టు గారికి వివరించారు?
శ్రీ పాదుల వారి వయస్సు మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు : తిరుమల దాసు
రెండవ సంవత్సరం : తిరుమలదాసు
మూడవ సంవత్సరం : సుబ్బయ్య శ్రేష్టి
నాలుగవ సంవత్సరం :
ఐదవ సంవత్సరం : ఆనంద శర్మ
ఆరవ సంవత్సరం : దత్తదాసు
ఏడవ సంవత్సరం :
ఎనిమిదవ : శ్రీమన్నారాయణ
తొమ్మిదవ సంవత్సరం :
పదవ సంవత్సరం: గణపతి శాస్త్రి – కాకినాడ , గురుచరణుడు, కృష్ణదాసు అనే హరిదాసు , విస్సావధానులు, గురుదత్త భట్టు
పదకండవ సంవత్సరం: ధర్మగుప్తుడు – శివ యోగి – పిటాపురం
పన్నెడవ సంవత్సరం : రమణి – నరసింహరాయుడు – పంచదేవ పహాడ్ (నిజానికి12 వ సంవత్సరం లో వారి స్థూలశరీరం పిటాపురం లో ఉన్నప్పటికిని వారు లీలాశరీరం తో పంచదేవపహాడ్ లో రమణి – నరసింహరాయుడు ల వివాహం జరిపించారు .
పదమూడవ సంవత్సరం: సిద్ధుడు – మహిషి గ్రామం , మిధిలాదేశం
పద్నాలుగవ సంవత్సరం: బంగారయ్య (వేదాంత శర్మ) – బంగారమ్మ
పదిహేనవ సంవత్సరం : నాగేంద్ర శాస్త్రి
పదహారవ సంవత్సరం : భాస్కర శాస్త్రి (త్రిపురాంతకం – త్రిపురాతకే శ్వరుని అర్చకులు)
శ్రీ పాదుల వారి వయస్సు
• మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు : తిరుమల దాసు
• రెండవ సంవత్సరం : తిరుమలదాసు
• మూడవ సంవత్సరం : సుబ్బయ్య శ్రేష్టి
• నాలుగవ సంవత్సరం : సుబ్బయ్య శ్రేష్టి
• ఐదవ సంవత్సరం : ఆనంద శర్మ
• ఆరవ సంవత్సరం : శ్రీ దత్తనంద స్వామి
• ఏడవ సంవత్సరం : శ్రీ దత్తనంద స్వామి
• ఎనిమిదవ సంవత్సరం: శ్రీమన్నారాయణ
• తొమ్మిదవ సంవత్సరం : నామానందులు
• పదవ సంవత్సరం: గణపతి శాస్త్రి – కాకినాడ , గురుచరణుడు, కృష్ణదాసు అనే హరిదాసు , విస్సావధానులు, గురుదత్త భట్టు
• పదకండవ సంవత్సరం: ధర్మగుప్తుడు – శివ యోగి – పిఠాపురం
• పన్నెడవ సంవత్సరం : రమణి – నరసింహరాయుడు – పంచదేవ పహాడ్ (నిజానికి12 వ సంవత్సరం లో వారి స్థూలశరీరం పిటాపురం లో ఉన్నప్పటికిని వారు లీలాశరీరం తో పంచదేవపహాడ్ లో రమణి – నరసింహరాయుడు ల వివాహం జరిపించారు
• పదమూడవ సంవత్సరం: సిద్ధుడు – మహిషి గ్రామం , మిధిలాదేశం
• పద్నాలుగవ సంవత్సరం: బంగారయ్య (వేదాంత శర్మ) – బంగారమ్మ
• పదిహేనవ సంవత్సరం : నాగేంద్ర శాస్త్రి
• పదహారవ సంవత్సరం : భాస్కర శాస్త్రి (త్రిపురాంతకం – త్రిపురాతకే శ్వరుని అర్చకులు)
ఒక Reply వదిలి
You must be logged in to post a comment.