Chitrakoot
Dattodghama Dharma Tirtham – Chotrakoot
దత్తోద్ఘమ ధర్మతీర్థం – చిత్రకూటము
(Atri Maharshi - Anasuya Maatha Ashramam - అత్రి మహర్షి – అనసూయా మాత ఆశ్రమం)
మన్దాకినీం నదీం రమ్యాం ప్రాఙ్ముఖాస్తే యయుస్తదా । ప్రదక్షిణం చ కుర్వాణాః చిత్రకూటం మహాగిరిమ్ ॥
ఓం అం అనసూయాయైనమః.. ఓం ఆం ఆత్రయేనమః.. ఓం ద్రాం దత్తాత్రేయాయనమః.. ఓం దుం దుర్వాససేనమః.. ఓం చం చంద్రమసేనమః
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే..దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా..అత్రితనయ అనసూయానందనదిగంబర..దత్త బంధువులందరికీ జైగురుదత్త..
చిత్రాతిచిత్రమైన, రామాయణంలోని అయోధ్యకాండంలో ప్రస్తావించిన విచిత్ర ప్రదేశమే Chitrakoot / Chitrakoot Dham / Chitrakuta Parwatham. ఇక్కడే Sati Anasuya Maatha త్రిమూర్తులను పసిబిడ్డలుగా మార్చి దత్తాత్రేయుని ఉద్భవానికి కారణమయ్యింది. ఇక్కడే Anasuya Maatha సీతమ్మ వారికి ‘పతిధర్మాన్ని’ బోధించింది. ఇక్కడే Anasuya మాత తన పతి అయిన Atri Maharshi దాహం తీర్చడం కోసం తన పాతివ్రత్య బలం చేతనే Mandakini నదిని ఏర్పడేటట్లుగా చేసింది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ ప్రదేశానికి నా యొక్క Varanasi Trip లో భాగంగా Chitrakoot దర్శించడమైనది. చిత్రమైన Chitrakoot గురించిన Information ఇక్కడి వారినుండి సేకరించి మీకు అందిస్తున్నాను. ఎంతో పవిత్రమైన, దత్తాత్రేయ ఉద్భవానికీ, ధర్మబోధనలకు పుట్టినిల్లైన ఈప్రదేశాన్ని దత్తభక్తులందరూ తప్పక దర్శిస్తారని ఆశిస్తూ… జై గురు దత్త
-కీర్తి వల్లభ (keerthivallabha@gmail.com)
Chitrakoot ఎక్కడ ఉంది?
Confuse కాకుండా జాగ్రత్తగా చదవండి, Chitrakoot పేరుతో ఇక్కడ మొత్తం మూడు ప్రదేశాలు కలవు. 1. Chitrakoot Town - Satna District Madhya Pradesh State, 2.Chitrakoot District – Uttar Pradesh State 3. Chitrakoot Dham – Karwi, Uttar Pradesh State. ఈ మూడు ప్రాంతాలు చాలా దగ్గర దగ్గరగా (ఒక State లోంచి ఇంకో State లోకి నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు) Madhya Pradesh & Uttar Pradesh States లో విస్తరించి ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాన్నే Dandakaaranya (దండకారణ్యం) అనే వారు. అప్పట్లో ఈప్రాంతం రావణాసురుడి సామంత ప్రదేశంగా ఉంటూ ఉండేది. ఇక్కడకి అనేక మంది రాక్షసులు వచ్చి సేదతీరేవారు. ఇప్పటికీ ఈ ప్రాంతం రాక్షసుల వంటి బందిపోటు దొంగలకు (Dacoity /Group Robbery) ప్రసిద్ధి. దొంగతనాలు చేసి పక్కనే ఉన్న ఇంకొక State లోకి తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోతారు. అందువల్లనే ఇక్కడ సాయంత్రం 06:00 PM దాటిన తరువాత జనసంచారం ఉండదు. ఇక్కడ భక్తులు చూడవలసిన ప్రదేశాలు మాత్రం రెండు States లోను విస్తరించి ఉన్నాయి. అందువల్లనే ఏ State లోఉన్న ప్రదేశాలను చూడడానికి ఆ State Registration Number ఉన్నVehicle ని మాట్లాడుకోవాలి, లేకపోతే భారీమొత్తంలో Chech-Post వద్ద Entry Tax కట్టవలసి ఉంటుంది. మొత్తంమీద ఈ ప్రదేశం Madhya Pradesh & Uttar Pradesh States మధ్య విస్తరించి ఉంది.
చిత్రకూట్ Sati Anasuya Ashram ఎలా చేరుకోవాలి?
Route No:1 By Train Cum Road Total 1450 KMs |
---|
Route No:1 By Train Cum Road Total 1450 KMs |
Secunderabad ----> Satna (Upto Satna by Train) ----> Karwi ----> Chitrakoot ----> Sati Anasuya (Satna To Sati Anasuya By Road) |
Route No:2 By Road (or) రైలు - Total 130 KMs |
---|
Route No:2 By Road (or) రైలు - Total 130 KMs |
Allahabad ----> Karwi ----> Chitrakoot ----> Sati Anasuya |
Route No:3 By Road (or) రైలు - Total 240 KMs |
---|
Route No:3 By Road (or) రైలు - Total 240 KMs |
Varanasi ----> Allahabad ----> Karwi ----> Chitrakoot ----> Sati Anasuya |
Chitrakoot దర్శించడానికి అనువైన సమయం
చిత్రకూట్ ధామ్ లోని సతీ అనసూయ & అత్రి మహాముని ఆశ్రమం దర్శించడానికి అన్ని కాలాలూ అనువైనవే. చిత్రకూట పర్వతం యొక్క పచ్చటి అందాలను చూడాలంటే వర్షాకాలం అనువైనది. శీతాకాలంలో చలి అధికముగా ఉన్నప్పటికీ సౌకర్యంగానే ఉంటుంది. వేసవికాలం అంత అనువైన సమయం కాదు.
Chitrakoot లో ఎక్కడ ఉండాలి?
చిత్రకూట్ లో ఉండడానికి అనేక రకాలైన వసతి, విడిది సౌకర్యాలు ఉన్నాయి. Chitrakoot లో అనేక Star Hotels, Resorts, Dharmashala లు కలవు. దగ్గరలో గల Karwi లో కూడా అనేక Hotels, Lodge లు కలవు.
Chitrakoot Sati Anasuya స్థల పురాణం
(A) Chitrakoot లో River Mandakini ఏర్పడుట: వైష్ణవ సంప్రదాయం లోని ఆగమ శాస్త్రాలను అత్రిమహర్షి వ్రాసారు. ఆకారణంగా శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు అత్రి మహర్షుల వారికి మెండుగా లభించాయి. వైష్ణవ సంప్రదాయంలో పాంచరాత్ర మరియు వైఖానస అనే రెండు ఆగమ విధానాలు కలవు. వైఖానస మహర్షి వారి తొమ్మిది మంది శిష్యులలో ముఖ్యమైన శిష్యుడైన అత్రి మహర్షుల వారిచే అది మానవులకు అందించబడినది. తదుపరి అత్రిమహర్షి కర్దమ ప్రజాపతి కుమార్తె అయిన ‘అనసూయ’ను వివాహం చేసుకొని, ఇరువురు దంపతులు ఆధ్యాత్మిక అన్వేషులై అడవులను చేరి తపములను,ధర్మాలనూ ఆచరిస్తూ ఉండేవారు. ఆవిధంగా వారి జపతపములకు భంగం వాటిల్లకుండా ఉండడం కోసం వారు వింధ్యా పర్వతశ్రేణులలో భాగమైన, మానవసంచారం లేనిదైన ‘దండకారణ్యం’ లో చేరి అక్కడ తమ విధులను నిర్వర్తించుకునేవారు. ఒకసారి Chitrakuta Parwatham లో వరుసగా 10 సంవత్సరాలపాటు వర్షం ఒక్క చినుకైనా పడలేదు. అరణ్యంలోని అన్నిజీవులూ, చెట్లు నీరు లేక అల్లాడిపోవడం చూసిన అనసూయ మాత అత్రిమహర్షి వారిని నీటికోసం (వర్షాల కోసం) తపస్సు చేయవలసిందిగా అర్ధించింది. దానికి ఒప్పుకున్న అత్రిమహర్షి తపస్సు చేస్తుండగా వారికి విపరీతమైన దాహం వేయసాగింది. తపస్సును అర్ధాంతరంగా ముగించిన అత్రిమహర్షి “దాహంగా ఉంది తాగడానికి కొన్ని మంచి నీళ్లు ఇవ్వమని” అనసూయను అడుగుతారు. Ashramamలో ఎక్కడా చుక్కైనా నీరు లేని కారణంగా అనసూయ మాత ఒక కమండలం తీసుకుని భయంకరమైన రాక్షసులు తిరిగే అడవిలో భర్త దాహం తీర్చడం కోసం నీటి కోసం వెతకడం చూసి చలించిపోయిన గంగామాత అనసూయ యొక్క పతిధర్మ నిబద్ధతకు మెచ్చి శివునితో సహా దర్శనమిచ్చి ” అమ్మ అనసూయ! ఇక్కడ భూమిమీద ఒక గుంత తవ్వు. నేను అందులో ప్రవేశించి నీకు నీటిని అందిస్తాను. ఆనీటితో నీ పతి యొక్క దాహాన్ని తీర్చవచ్చు” అని చెప్పగా అనసూయా మాత ఋక్షపర్వతము దగ్గర (చిత్రకూట పర్వతానికి ఇది దగ్గరలో ఉంటుంది మరియు ఇది River Mandakini జన్మస్థలం) ఒక గుంతను తవ్వగా అందులోకి ప్రవేశించిన గంగ మామూలు గుంతను నీటిచెలమ (Water Spring) గా మారుస్తుంది. అంతా దివ్యదృష్టితో గమనించిన అత్రిమహర్షి అక్కడకు చేరి, దంపతులిరువురు లోకకళ్యాణం కోసం అక్కడే స్థిరపడమని ప్రార్ధింపగా, వారి ప్రార్ధన మేరకు అక్కడ గంగ Mandakini అనే పేరుతో శాశ్వతంగా ఉండిపోతుంది. ఆవిధంగా ఏర్పడినదే River Mandakini. ఈనదినే Paisuni (పైశుని) అనీ KasiGanga (కాశిగంగ) అనీ కూడా పిలుస్తారు.
గుర్తు: River Mandakini of Chitrakoot is Different From River Mandakini of Himalaya Glacier. దయచేసి గమనించండి ఇక్కడ ఏర్పడిన River Mandakini వేరు Himalaya Glacier లో River Alaknanda కు ఉపనదిగా (Tributary) ఉన్న River Mandakini వేరు. ఇక్కడి River Mandakini యొక్క పేరు Government Records లో River “Paisuni” గా ఉంది. ఇది Chitakoot Forest లో Majhgawan అనే ప్రదేశంలో Vindhya Mountains లో పుడుతుంది.
(B) దత్తోద్ఘమ వృత్తాంతం (దత్తాత్రేయుని జన్మ వృత్తాంతం) : అత్రి మహర్షి మహా శక్తి సంపన్నుడు. అయన అర్ధంగి Anasuya. అనసూయ మహా పతివ్రత. భర్తనే దైవంగా భావించి త్రికరణశుద్ధిగా సేవించేది. ఆవిడ ‘ధర్మాన్ని’ పాటించేది. అందువల్లనే అనసూయకు మెల్లిగా అపూర్వమైన శక్తులు రాసాగాయి. ఈ విషయాలను కర్ణాకర్ణిగా తెలుసుకున్న దేవతల రాజు దేవేంద్రునికి అనసూయ యొక్క మహాశక్తుల గురించి తెలిసి బెంగపట్టుకుంది. ఒకానొక సమయంలో దేవేంద్రుడు చాలా బెదిరిపోయాడు. ఎందుకంటే అనసూయ తన పాతివ్రత్య బలంతో ఎలాంటి వారినైనా దేవేంద్రుని స్థానంలో కూర్చోబెట్టగలదు. ప్రస్తుతానికి ఆ అపాయం లేకపోయినప్పటికీ ముందు ముందు చెప్పలేము. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆపరిస్థితి రావచ్చు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా దేవేంద్రుడు త్రిమూర్తులను కలిసి “భూలోకంలో అనసూయ అనే ఒక సాధారణ స్త్రీ మహా శక్తివంతురాలిగా మారింది. కేవలం ‘పతిధర్మాన్ని’ పాటించి ఆవిడ అలామారింది. ప్రస్తుతం ఆవిడ ఎంత శక్తి వంతురాలు అంటే… ఆవిడ తలచుకుంటే ఏ దేవతనైనా నిర్ములించగలదు, ఎంతటి సాధారణ మానవులనైనా దైవంగా మార్చగలదు”. త్వరలో సృష్టి-స్థితి-లయలు ఆవిడే చేసినా మీరు ఆశ్ఛర్యపోనవసరంలేదు! కనుక మీరు ఆవిడ శక్తులను తగ్గించే మార్గాన్ని వెతకవలసింది” అని చెప్పాడు. అది విన్న త్రిమూర్తులు నివ్వెరపోయి అనసూయ యొక్క శక్తులను నశింపజేయటం కోసం Chitrakoota Parwathamలోగల Atri-Anasuya Ashramam కి సాధువుల రూపంలో వస్తారు. వచ్చి “నిర్వాణ భిక్ష” (Nirwana Biksha = నగ్నంగా మారి ఆహారపదార్ధాలను అతిథులకు వడ్డించే పద్ధతి) అడుగుతారు. అప్పుడు Anasuya మాత తనకుగల పాతివ్రత్య బలంతో వారిని పసిబిడ్డలుగా మార్చి నిర్వాణ భిక్షతో పాటుగా స్తన్యాన్ని కూడా ఇస్తుంది. Anasuya Maatha యొక్క ధర్మబలం ఎంత గొప్పదో, ఎంత శక్తి వంతమైనదో త్రిమూర్తులు తెలుసుకుని క్షమించమని అడిగి వరమును కోరుకొనమనగా ” ఓ త్రిమూర్తులారా! కారణం ఏమైనప్పటికీ పసిబిడ్డల రూపంలో ఉన్న మీకు నా స్తన్యాన్ని ఇచ్చాను, ఫలితంగా నాకు మీపై అపరిమిత మైన పుత్రవాత్సల్యం కలిగింది. కాబట్టి మీరు ముగ్గురు నాకు పుత్రులుగా జన్మించవలసింది” అని కోరుకోగా Anasuya కు Brahma Amshaగా – Chandrudu / Chandratreya, Vishnu Amshaగా – Dattatryudu/ Dattatreya , Mashewara Amshaగా – Durwasudu / Krishnatreya జన్మించారు. ఈ ఘట్టం ఇక్కడే ఈ Chitrakuta Parwatham మీదగల Atri- Anasuya Ashramam లోనే జరిగింది.
(C) సీతారాములు అనసూయా- అత్రి మహాముని ఆశ్రమానికి విచ్చేయుట :సీతారాములు తమ వనవాసంలో అధిక సంవత్సరాలు (దాదాపుగా పదకండున్నర సంవత్సరాలు) గడిపిన ప్రాంతం ఈ Chitrakoot. ఇక్కడే సీతారాములు అనసూయా-అత్రి మహాముని ఆశ్రమానికి విచ్చేసినట్లుగా అక్కడ Anasuya Maatha Sithamma కి పతిధర్మాన్ని భోదించినట్లుగా Ramayanamలోని Ayodhya Kandamలో చెప్పబడినది.
(D) Chitrakoot గురించిన ఇతర ముఖ్య విశేషాలు:
- Anasuya – Atri Maharshi Ashramam దగ్గర నేటికీ అతిశక్తి వంతమైన అరుదైన Atri Maharshi ప్రతిష్ఠిత ’Atreshwara Mahadeva Lingam’ గలదు. ఈ శివలింగం మీద విఘ్నేశ్వరుడు ఉండడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇదిఎంతో మహిమగలది. ఇక్కడ భక్తులు మూడుసార్లు ఘంటను మ్రోగించి శివలింగానికి Mandakini నది నీళ్లతో అభిషేకం చేస్తారు.
- Chitrakoot లో Sithamma వారి వక్షస్థలాన్ని కాకాసురుడు (Crow Rupa Rakshasa -కాకిరూప రాక్షసుడు) పొడవగా, ఆ కాకి పైకి శ్రీ రాముడు దర్భను (దర్భబాణం) ప్రయోగించాడు. ఫలితంగా ఆ కాకి కన్ను పోయింది. అందుకే నేటికీ కాకులు ఒక కన్నుతో ఏటవాలుగా చూస్తూ ఉంటాయని ఇక్కడివారు చెపుతారు. ఈ వృత్తాంతాన్ని Spatika Shila వద్ద చూడవచ్చు.
- Chitrakoot లో Hanumaan Dhara అతి ప్రసిద్ధికెక్కిన యాత్రా స్థలము. దాదాపు 2500 మెట్లెక్కి ఇక్కడ హనుమంతుడిని దర్శించుకోవాలి. ఇక్కడి పురాతనమైన ఆంజనేయ స్వామి విగ్రహంపై నిరంతరం జలధారపడుతూ చూడచక్కగా వుంటుంది. Rainy Season లో ఈ ప్రదేశం తప్పక దర్శించాలి.
- గుహలో గుప్తంగా ప్రవహిస్తున్న ‘GuptGodavari’ అనబడే Yamuna నూ, అక్కడి వివిధ తీర్థాలను తప్పక దర్శించాలి.
- శ్రీరాముడు Chitrakootలో ఎక్కువ కాలం కొలువుదీరిన ‘KamadaGiri – KamathNath Temple’ నూ మరియు దాని గిరిప్రదక్షిణను (KamadaGiri Parikrama) తప్పక చేయాలి.
- Sati Anasuya వద్ద మందాకినీ నదిలో ఉన్న Atri Maharshi వారి Sahaja Paduka ముద్రలను తప్పకుండా దర్శించుకోవాలి.
- Sati Anasuya వద్ద గల మందాకినీ నదిలో గల జలచరాలకు తిండి పెట్టినచో పితృదేవతలు తృప్తి చెందుతారు. అక్కడే చేపలకు ఆహారాన్ని అమ్ముతారు.
Chitrakoot లో చూడవలసిన ప్రదేశాలు
Places Must Visit In Chitrakoot Dham |
---|
Places Must Visit In Chitrakoot Dham |
1. Sati Anasuya & Atri Maha Muni Ashramam |
2. Manas Mandir |
3. Prachina Janaki Maa Temple |
4. Spatika Shila |
5. Ramadarshan |
6. GuptGodavari Cave |
7. KamadaGiri - Kaamathnath Temple |
8. Matgendranath Temple (Shiva) |
9. Mandakini River (Ram, Janaki, Bharat Ghats) |
10. Raaghava PrayagaGhat |
11. Tulasidaas Mandir |
12. Bharat Milaap |
13. Hanumaan Dhara |
14. Vanadevi Ashramam |
15. Janaki Kund |
17. Sharada Mandir |
18. Panchamukha Hanuman |
19. Bade Hanuman |
20. Ram Bhaitak |
21. Sitha Rasoi |
Chitrakoot ఫోటోలు
Chitrakoot కు దగ్గరలోగల ఇతర దర్శనీయ ప్రదేశాలు
Places Near To Chitrakoot |
---|
Places Near To Chitrakoot |
1. Varanasi |
2. Allahabad |
3. Sithamarhi |
4. Khajuraho |
5. Bandhavgarh |
Chitrakoot యాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తలు
Chitrakoot యాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తలు |
---|
Chitrakoot యాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తలు |
1. చీకటి పడేలోగా యాత్రను ముగించాలి. చూడవలసినవి ఏవైనా ప్రదేశాలు మిగిలి ఉంటే వాటిని మరుసటి రోజుకు వాయిదా వేసుకోవాలి. |
2. అపరిచితులకు మనము ఎక్కడ ఉంటుంది, ఎక్కడ నుండి వచ్చింది, ఎన్ని రోజులు ఉంటోంది..తదితర వివరాలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. |
3. Festival రోజుల్లో Crowd ఎక్కువగా ఉండే చోట 'ధూళిదర్శనము' చేసుకుంటే సరిపోతుంది. |
4. అడవిలో, గుహలలో వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. |