Coffee Drinking Dattatreya – Baba Budangiri Datta Pitham
Coffee Drinking Dattatreya – Baba Budangiri Datta Pitham
(నిత్యం కాఫీ తాగే దత్తాత్రేయుడు – బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం)
Warning: © This Web Page, Content & Photos Are Copyright Protected
ఓం..ద్రాం దత్తాత్రేయాయనమః…ఓం..ద్రాం దత్తాత్రేయాయనమః…ఓం..ద్రాం దత్తాత్రేయాయనమః…
Om.. Dram Dattatreyayanamaha…Om.. Dram Dattatreyayanamaha…Om.. Dram Dattatreyayanamaha…
గమనిక : ఈ ఆర్టికల్ చాలా పెద్దది. Baba Budangiri Dattatreya Pitham కు సంబంధించిన అనేక విషయాలను ఫోటోలతోసహా తెలియజేయడం జరిగింది. ఈ Web Page లో అతి అరుదైన, అద్భుతమైన దాదాపు 100 కు పైగా ఫోటోలు గలవు. దయచేసి పూర్తిగా Load అయ్యేవరుకు వేచి ఉండండి. Load కాని పక్షంలో F5 బటన్ (F5 – Reload) నొక్కండి.
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే… దిగంబరా…దిగంబరా…శ్రీపాద వల్లభ దిగంబరా… దత్త బంధువులందరికీ జై గురుదత్త… బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠ దత్తాత్రేయ మహారాజ్ కి జై.. దత్తక్షేత్రాల్లో నిఘూడమైనదీ, బైట ప్రపంచానికి పెద్దగా వివరాలు తెలియని క్షేత్రం ‘బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠ క్షేత్రం’. ఇక్కడి దత్తాత్రేయ గుహ దేవాలయం కాలక్రమేణా ఇస్లాం మతస్థుల ఆధీనంలోకి వెళ్ళిన కారణంగా… ముస్లిం పూజారుల (ఇమామ్ / ఫకీర్ ) చే ఇక్కడ దత్తాత్రేయుడు పూజా, నైవేద్యాలను అందుకుంటున్నాడు. ఈ గుహ దేవాలయం కోసం హిందూ-ముస్లింల ఆధిపత్య పోరు ఫలితంగా ఇప్పుడు ఈ ప్రాంగణం ‘వివాదాస్పదమైన’ ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించి ఇక్కడ అనేకానేక ఆంక్షలను విధించింది. ఇక్కడ గల గుహ దేవాలయంలో ఏముంటుందో…లోపల ఎలా ఉంటుందో…మీరు ఏ Search Engine లో వెతికినా Photo లు కనపడవు. కేవలం బైట ప్రదేశాల Photo లు మాత్రమే Net లో అందుబాటులో ఉన్నాయి. అలాగే Legal Problems వస్తాయేమోనని భయపడి ఈ క్షేత్ర విశిష్టత, వివరాలను తెలియజేయడానికీ, షేర్ చెయ్యడానికి కుడా చాలామంది వెనుకాడడం జరుగుతోంది. శ్రీపాద భక్తులు ‘సింహం పిల్లలవలె’ ఉంటేనే ఆయనకిష్టం కదా! వృత్తి రిత్యా Advocate కూడా అయిన నేను, ఎలాగైనా శ్రీపాద శ్రీ వల్లభుల వారి అనుమతి, ఆశీర్వాదములతో దత్త భక్తులందరికీ బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం యొక్క సమగ్ర సమాచారాన్ని ఫోటోలతోసహా అందించాలనే కోరిక నాకు ఎప్పటినుండోఉంది. ఈ విషయంలో మనందరిమీద ‘శ్రీచరణుల’ వారి కరుణాకటాక్షాలు ఎలా ఉన్నాయో ఒక చిన్న ఉదంతం ద్వారా చెబుతాను. ఎప్పుడూ Tight Security ఉండే ఈ ప్రదేశంలో నేను వెళ్ళిన రోజున అసలు Security నే లేదు. నేను వెళ్ళడానికి ముందురోజు నుండి అక్కడ ఉన్న CCTV Server చెడిపోయి, అన్ని CCTV లు పని చెయ్యడం మానేశాయి. అది శ్రీచరణుల వారి ఆజ్ఞగా భావించి మొదటిసారిగా గుహ దేవాలం లోపలి ప్రాంతాన్నిPhoto లు తీసాను. నేను లోపల Photo లు తీస్తున్నప్పుడు అక్కడ ఉండవలసిన అధికారులు గానీ, సిబ్బంది గానీ లేరు. శ్రీ స్వామి వారే వారిని అక్కడ లేకుండా చేసారనడంలో ఎలాంటి సందేహం లేదు. Photo లు తీసిన తరువాత చూస్తే ఆశ్చర్యంగా ఆ ఫోటోల్లో అనేక కాంతి రేఖలు వచ్చాయి. దర్శనానంతరం Chikmagalur లో ఉన్న ఒక ప్రముఖ ఇమామ్ ను, అలాగే అక్కడి స్థానిక ప్రముఖ హిందూ స్వామీజీ వారిని కలిసి క్షేత్రానికి సంభందించిన అనేక నిఘూడ విషయాలను వారి నుండి తెలుసుకున్నాను. వాటన్నిటిని మీకందిస్తున్నాను. ఇరు వర్గాల వారికి బాధ కలిగించే ప్రకటనలను మాత్రమే ఈ Article లో Edit చెయ్యడం జరిగింది. దత్తలీలలను తెలుసుకుని తరించండి, చదివి ఆనందించండి, పవిత్రమైన,అరుదైన, ప్రకృతితో మమేకమైన ఈ దత్తధామాన్ని దర్శించండి. జై గురు దత్త -కీర్తి వల్లభ
బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం ఎక్కడుంది?
బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం సహ్యాద్రి కనుమలలో Malenadu లో Chikmagalur కు ఉత్తరంగా 35 KMs దూరం లో ఉంది. సముద్ర మట్టానికి 5500-6000 అడుగుల ఎత్తులో ఉండే అనేకానేక గిరుల సమూహమే Malenadu (Male = Hill, Nadu = Land). ఎటుచూసినా పచ్చటి ఆహ్లాదకర వాతావరణం, ఆధ్యాత్మికత నిండి ఉన్న ప్రదేశమిది. Aerial View లో చూస్తే “ॐ” ఆకారంలో లేదా అర్ధచంద్రాకారంలో ఈ ప్రదేశ శిఖరాలు కనబడుతుండడం వల్ల దీనికి Omkara Giri లేదా Chandra Drona Parwatham అని పేరు. ప్రముఖ ముస్లిం బాబా ‘బుడాన్’ ఇక్కడ ఉండడం వల్ల Baba Budan Giri అనీ, దత్తాత్రేయుడు కొలువై ఉండడం వల్ల Datta Giri అని పేరు. ఇక్కడికి చేరడానికి Chikmagalur నుండి Public Transport సరిగా లేదు. Own Transport మాత్రమే ఆధారం. Karnataka లోని ప్రధాన పర్యాటక ప్రదేశమిది. అలాగే ప్రకృతి ప్రేమికుల స్వర్గధామమిది. ఇక్కడకి వచ్చే భక్తులు/పర్యాటకులు ఇచ్చటి ప్రకృతి తో పాటుగా ఇక్కడ అడవుల్లో గల “Home Stay” ల్లో బసచేసి ఆనందిస్తారు. ఉదయాన్నే, సూర్యోదయానికి ముందే లేచి ఇక్కడ గల Coffee Plantation Estates ల్లో, పోక/ వక్క చెట్ల అడవుల్లో, మిరియాల మొక్కలతో అల్లుకున్న Silver Oak చెట్ల మధ్యలో మంచులో తిరిగి ప్రకృతిని ఆస్వాదిస్తారు. తదుపరి ఇక్కడ అడుగడుగునా కనిపించే Waterfalls లో స్నానమాచరించి తిరిగి ఉదయం 08:00 గంటల కల్లా బసకు చేరుకొని తదుపరి Sightseeing కి వెళతారు.
బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం చరిత్ర / స్థలపురాణం
Chikmagalur నివాసి అయిన ఒక ప్రముఖ ఇమామ్ ద్వారా తెలుసు కున్న చరిత్ర / స్థలపురాణం | Chikmagalur నివాసి అయిన ఒక ప్రముఖ స్వామీజీ ద్వారా తెలుసు కున్న చరిత్ర / స్థలపురాణం |
---|---|
Chikmagalur నివాసి అయిన ఒక ప్రముఖ ఇమామ్ ద్వారా తెలుసు కున్న చరిత్ర / స్థలపురాణం | Chikmagalur నివాసి అయిన ఒక ప్రముఖ స్వామీజీ ద్వారా తెలుసు కున్న చరిత్ర / స్థలపురాణం |
11వ శతాబ్దం లో Prophet Muhammad శిష్యుడు, దాదా హయత్ Quladar (అలియాస్ అబ్దుల్ Azeez Macci) అనే పేరు గల ఒక గొప్ప సూఫీ గురువు పశ్చిమ దేశాల నుండి సముద్రమార్గం ద్వారా Mangaluru కు తదుపరి అక్కడనుండి సరాసరి Chikmagalur గుండా Budangiri కు రావడం జరిగింది. వారికి పశ్చిమ దేశాలలో అనేక మంది శిష్యులు ఉన్నారు. వారు వారి శిష్యులతో సమాధిస్థితిలో మాట్లాడేవారు / సంధానమైఉండే వారు. మీరంతా అనుకుంటున్నట్లుగా వారు సూఫీ సిద్ధాంతాలను ప్రచారం చెయ్యడానికి అక్కడనుండి ఇక్కడకు రాలేదు. కేవలం భగవంతుని ఆజ్ఞతోనే ఆయన ఇక్కడకి వచ్చారు. సూఫీ సిద్ధాంతాలను ప్రచారం చెయ్యడానికి వచ్చిఉంటే అప్పట్లో మానవమాత్రులు అతి కష్టంమీద చేరగలిగే అటువంటి ప్రదేశాన్ని ఎన్నుకునే వారేకాదు,te. ఆ ఉద్దేశ్యం ఉన్నవారు సాధారణంగా ప్రజలకు దగ్గరగా ఉంటారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆ గుహలోకి వెళ్లి అక్కడ ఒంటరిగా దైవ కార్యక్రమాలు చేసుకునేవారు. కానీ ముస్లింల దైవ కార్యక్రమంలో "Wazu" అనే ప్రక్రియ చేయడానికి నీరు అవసరం. నీటి కోసం అక్కడి పరిసరాలను పరిశీలించిన ఆయనకు అక్కడ నీరు దొరకకపోయేటప్పటికి అప్పటికప్పుడు దేవుణ్ణి ప్రార్ధించి అక్కడ ఒక కోనేరు ఏర్పడేటట్లుగా చేసారు,te. నేటికీ ఆ కోనేరును మనం అక్కడ చూడవచ్చు. మరుసటి రోజున ఉదయం అక్కడికి ఒక హిందూ పూజారి రావడం జరిగింది. రాత్రికి రాత్రి అక్కడ కోనేరు ఏర్పడి ఉండడం, ఎవరో విదేశీ వ్యక్తి అక్కడ ఉండడంతో ఆయనను భగవంతునిగా భావించి అక్కడనుండి ఆ పూజారి వెళ్లి పోయాడు,te. తదుపరి వారికి గల అనేక మంది శిష్యులను అక్కడకి విడతల వారిగా సమాధిస్థితి నుండే పిలిచేవారు. క్రమంగా వారికి గల అనేక మంది శిష్యులు ఇక్కడకి రావడం జరిగింది,te. తదుపరి Dada Hayat గారు తనకి దేవుడి ఆజ్ఞ అయ్యిందనీ తాను పశ్చిమ దిక్కుగా వెళ్లాలనీ శిష్యులకు చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయారు,te. అక్కడే ఉన్న శిష్యులలో పెద్దవారైన వారు అక్కడ గల కార్యక్రమాలను చూస్తుండే వారు,te. ఆవిధంగా కొంత మంది శిష్యులు అక్కడే పుట్టి అక్కడే చనిపోయారు. వారి సమాధులను కుడా ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. ఆవిధంగా 11వ శతాబ్దం నుండి 17 వ శతాబ్దం వరుకు అంటే దాదాపు 600 సంవత్సరాలు గడిచాక అప్పుడు అక్కడ గల 'ఒక పెద్దాయన' సమాధిస్థితిలో Sayyad Shah Jamaluddin (హజ్రాత్ సయ్యద్ అలియాస్ Meram) అనే పేరు గల ఒక సూఫీ శిష్యుడిని తక్షణం అక్కడకు రావాల్సిందిగా చెప్పారు,te. అలాగే వస్తూవస్తూ ఇక్కడ గల దేవుడికి ఏదైనా అరుదైన పదార్ధం నైవేద్యంగా పెట్టడానికి తీసుకురమ్మన్నారు. ఆ శిష్యుడు Yeman దేశంలో ఉంటాడు. అతను వస్తూవస్తూ నైవేద్యంగా పెట్టడం కోసం 7 కాఫీ గింజలు వెంట తెచ్చాడు. తదుపరి అక్కడి భాద్యతలన్ని ఆయనకే అప్పజెప్పారు. వారు అనేక మహిమలను చేసి చూపించే వారు. వారే Baba Budan. ఆ విధంగా మనదేశంలో Coffee Introduce చెయ్యబడినది. ప్రస్తుతం Baba Budan Giri చుట్టుప్రక్కల గల అన్నిCoffee Estateలకు, Coffee ద్వారా మనకు వచ్చే ఆదాయానికి ఆద్యుడు Baba Budan. ఈ సందర్భంగా అందరికీ తెలియని ఒక రహస్యం మీకు చెబుతాను, అదేంటంటే నేటికి ఇక్కడ గల భగవంతునికి కాఫీ గింజలు మరియు 'కాఫీ'ని నైవేద్యంగా పెడతారు,te. అనేకమంది Coffee Estate Ownerలు వారి మ్రోక్కులను కుడా కాఫీగింజల రూపంలో ఇక్కడ అర్పిస్తారు. Baba Budan సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు అనుమానాస్పద స్థితి లో అక్కడే మరణించారు. వారి భౌతికశరీరం కుడా అక్కడే సమాధి చేయబడినది. వారి తదుపరి వారి మేనల్లుడు(నెఫ్యూ) Sayyed Musa Hassan Shah అనే వారు Sajjada Nishan (Incharge) గా నియమింపబడ్డారు. ఆ విధంగా కాలం గడుస్తున్న సమయంలో సుమారు 1973-74 లో Baba Budan Giri ని Waqf Board స్వాధీన పరుచుకోవాలని అనుకుంది. అప్పుడు అక్కడ గల Sajjada Nishan Waqf Board పై Court లో Case వేసారు. ఏమని అంటే "Baba Budan Giri Darga కేవలం ముస్లింలకు మాత్రమే చెందినది కాదు. హిందువులకు కుడా చెందినదవ్వడం వల్ల Waqf Board కు స్వాధీనం చేసుకొనే హక్కు లేదు" అని. ఆ Caseను Sajjada Nishan of BBG Darga గెలిచారు. తదుపరి Court BBG Dargaప్రాంతాన్ని Waqf Board స్వాధీనం చేసుకునే విలులేదని తీర్పు చెప్పింది. అక్కడ నుండి హిందూ-ముస్లింల మధ్యలో వివాదం రాజుకుంది. ఆ ప్రాతం మాదంటేమాదని ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవ కుడా Court మెట్లు ఎక్కింది. కానీ తీర్పు మాకే అనుకూలంగా వచ్చింది. Court ఆర్డర్ ప్రకారం 1975 కు ముందు ఏపద్దతులు ఇక్కడ పాటించబడ్డాయో అవేపద్దతులు నేటికి ఇక్కడ అమలౌతున్నాయి. ఇది BBG DP Darga చరిత్ర | ఎవరేమనుకున్నా ఈ గుహదేవాలం లో 11వ శతాబ్దం కంటే ముందు నుండి ఏకముఖ దత్తాత్రేయుడి విగ్రహం ఉంది. అప్పట్లో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పూజారులు కేవలం గురువారాలే అక్కడకి వెళ్ళేవారు. ఇప్పటికీ ముసివేయ బడ్డ గుహలో ఏకముఖ దత్తాత్రేయుడి విగ్రహం ఉంది. అక్కడ గల మహిమలకు కారణం ఆ దత్తాత్రేయుడే! అందువల్లనే "ఇనాం దత్తాత్రేయ పీఠం" అని పిలిచినా ఇరువర్గాలు ఏమి అనడంలేదు. అసలైతే అది దత్తగిరి/ చంద్ర ద్రోణ పర్వతం లేదా ఓంకారగిరి. బాగా గమనించండి నాటి నుండి నేటి వరుకు Datta Giri కి చుట్టు ప్రక్కల అనేకానేక హిందూ దేవాలయాలు కనిపిస్తాయి. ఇప్పటికీ అక్కడ త్రితీర్థాలు ఉన్నాయి. భీముడు గదతో కొట్టడంవల్ల ఏర్పడిన Gada Tirtham, మాణిక్యప్రభు రాకతో 'మాణిక్యధార' గా మారిన Nallikayi Tirtham మరియు హిందూ దేవాలయ సమూహాలతో ఉన్న Kamana Tritham ఇక్కడ గమనించ వచ్చు,te. నేను బాధపడేదోక్కటే 11వ శతాబ్దం తదుపరి ఇక్కడ దత్తాత్రేయ జయంతి జరగడంలేదు,te. Court కుడా హిందూ పద్దతుల్లో పూజించుకోవచ్చని చెప్పడం గుడ్డిలో మెల్లలాంటిది. ఏది ఏమైనా దత్తలీలలు ఉహలకందవు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఎవరితో చేయించుకోవాలో...మొత్తానికి కాఫీ ప్రియుడు ఇక్కడి దత్తాత్రేయుడు,te. |
బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం విశిష్టత
- Unmarried Muslim Fakir లచే పూజా, నైవేద్యాలను అందుకుంటున్న దత్తాత్రేయక్షేత్రం
- Muslim Fakir లచే హిందూ పద్దతుల్లో (దీపారాధన, కొబ్బరికాయలు కొట్టడం Etc..) పూజలందుకుంటున్న దత్తక్షేత్రం
- Coffee Seeds ను మన దేశం లోకి మొట్ట మొదటి సారిగా ప్రసాదంగా తీసుకురాబడిన క్షేత్రం
- నిత్యం కాఫీ గింజలను, ‘కాఫీ’ను నైవేద్యంగా స్వీకరిస్తున్న దత్తాత్రేయుడు గల ఏకైక దత్తక్షేత్రం
- భక్తుల యొక్క Property Disputesను వెనువెంటనే పరిష్కరించే దత్తాత్రేయక్షేత్రం(ప్రస్తుతం ఆయన క్షేత్ర ప్రాంతమే Disputeలో ఉంది. అదే దత్తలీల)
- దత్తక్షేత్రాలన్నింటిలొకీ అతిపెద్ద దీపారాధన (పరిమాణం పరంగా) చెయ్యబడే ఏకైక దత్తక్షేత్రం (దీపావళి రోజున అతిపెద్ద దీపం (బెకన్) ఈ శిఖరం పై వెలిగిస్తారు. ఈ దీపం చుట్టుప్రక్కలగల 70 KMs వరుకు గల గ్రామాల్లో కనిపిస్తుంది)
- ఏకైక త్రితీర్ధ దత్తక్షేత్రం (Gadaa Tirtham, Nallikayi Tirtham & Kamana Tritham)
బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం ఎలా చేరుకోవాలి?
ఎలా చేరాలి? ... ఎలా చేరుకోవాలి ... (హైదరాబాద్ టు BBG దత్తాత్రేయ Pitham రోడ్ దూరం: 900KMs - 16 18Hrs టు. Journey) |
---|
ఎలా చేరాలి? ... ఎలా చేరుకోవాలి ... (హైదరాబాద్ టు BBG దత్తాత్రేయ Pitham రోడ్ దూరం: 900KMs - 16 18Hrs టు. Journey) |
హైదరాబాద్ ---- & gt; బెంగళూరు ---- & gt; చిక్మగళూర్ ---- & gt; బాబా Budangiri దత్తాత్రేయ Pitham (By Own Transport, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేవు చిక్మగళూర్ నుండి అందుబాటులో) |
బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం క్షేత్ర దర్శనానికి అనువైన సమయం…
బాబా బుడంగిరి దత్తాత్రేయ పీఠం (Baba Budan Giri Dattatreya Pitham – BBGDP) దర్శనానికి August Month నుండి January Month వరుకు అనుకూలం. అత్యంత అనుకూల సమయం August నుండి October వరుకు ఉండే Rainy Season. Guru Pournami, Dattatreya Jayanthi (హిందువులు దత్త జయంతి గుహ వెలుపల Unofficial గా చేసుకుంటారు), Holi Pournami Urus వంటి Festivals లలో తప్పించి మామూలు రోజులలో రద్దీ తక్కువగానే ఉంటుంది. బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం దర్శనానికి ఉదయం 07:30 నుండి ఉదయం 09:30 వరుకు అనుకూల సమయం. సగటు భక్తుడికి బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం మరియు దానికి అనుసంధానంగా ఉన్న ఇతర ప్రదేశాల (Manikyadhara, Jhari Waterfalls, Devirammana Betta, Mullayyanagiri, Sitalayyanagiri & Honnammana Holla Temple) దర్శనానంతరం తిరిగి Chikmagalur చేరడానికి 11-12 గంటలు పడుతుంది. అంటే దాదాపుగా సాయంత్రం కల్లా ఎలాంటి తొందర లేకుండా తిరిగి రావచ్చు. ఇక Chikmagalur చుట్టుప్రక్కల గల ప్రాంతాలను ( Kallathigiri Falls, Kemmanagundi, Bhadra Wildlife Sanctuary (Muthodi), Z – Point, Shanti Falls, Hebbe Falls, Kudremukha, Hanumana Gundi Falls, Horanadu – Annapurneshwari Temple, Sringeri – Sharada Peetham, Kavikall Mata, Halebidu, ఉడిపి, Shravanabelagola Etc..) చూడాలంటే ఇంకో 2-3 రోజుల సమయం అవసరం. మొత్తం మీద 3-4 రోజులలో చుట్టుప్రక్కల గల ప్రదేశాలతో పాటు మొత్తం Baba Budan Giri Datta Pitham క్షేత్రాన్ని Comfortable గా చూడవచ్చు. ప్రతీ 12 Years కి ఒక్కసారి ఇక్కడ August – October నెలల మధ్యలో Kurinji Flowers అనే నీలిరంగు పుష్పాలు ఇక్కడ కొండల మీదా, శిఖరాల మీదా గుత్తులు-గుత్తులుగా పూయడం వల్ల ఆ సమయంలో ఈ ప్రదేశ దర్శనం అతి అద్భుతంగా ఉంటుంది. ఈ అరుదైన అవకాశం తిరిగి 2018 సంవత్సరం August – October నెలల మధ్యలో వస్తుంది (ఇంతకు ముందు 2006 సంవత్సరంలో ఇక్కడ Kurinji Flowers పూశాయి). Winter Season లో BBG DP Minimum Temperature 5 – 6 °C వరుకు వెళుతుంది. బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం వెళ్ళే మార్గంలో Maatha Honnamma Holla అనే గొప్ప దత్తాత్రేయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం చూడ దానికి చిన్నదిగా కనిపిస్తుంది. ఇక్కడ Mathaa Honnamma అనే సర్పం (నాగ దేవత) దత్తాత్రేయుల వారికి పడగను పట్టి ఉంటుంది. తప్పకుండా చూడాల్సిన గుడి ఇది. ఇక్కడే Honnamma Holla Falls అనే పవిత్రమైన Waterfalls ఉంది.
బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం ఫోటోలు
బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం క్షేత్రంలో ఎక్కడ ఉండాలి?
బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం క్షేత్రంలో ఉండడానికి ఎటువంటి వసతీ సౌకర్యాలు లేవు. ఆ పరిసర ప్రాంతాలలో Tent వేసుకొని ఉండడం కుడా నిషేధము. భక్తులు/పర్యాటకులు Chikmagalur లో కానీ,te, బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం క్షేత్రం దగ్గరలో గల అడవుల్లోని వివిధ ‘Home Stay’ లలో కానీ బస చేస్తారు.
BBG డిపి క్షేత్రం చుట్టుపక్కల గల చూడవలసిన / స్నానమాచరించవలసిన Waterfalls
జలపాతాలు పేరు | ప్రాముఖ్యత |
---|---|
జలపాతాలు పేరు | ప్రాముఖ్యత |
1. Manikyadhara | ఈ స్థలానికి శ్రీ మాణిక్య ప్రభు జీ విజిట్ పెట్టారు. దత్తాత్రేయ భక్తులు ఇక్కడ పవిత్ర బాత్ తీసుకోవాలి మరియు ఇక్కడ ఒక వస్త్రం వదిలేయాలని, భక్తులు ఏ ఇక్కడ ఉంది కావే వరకు మట్టి సేకరించండి ఉండాలా |
2. చింక్ ఫాల్స్ | Desolved సహజ హెర్బల్ ఆయిల్స్ తో నీరు - ప్లాంట్ పీకడం, పుప్పొడి మొదలైనవి. |
3. మజ్జిగ ఫాల్స్ (లగ్జరీ ఫాల్స్) | Desolved సహజ హెర్బల్ ఆయిల్స్ తో నీరు - ప్లాంట్ పీకడం |
4. Hebbe Falls | Desolved సహజ హెర్బల్ ఆయిల్స్ తో నీరు - ప్లాంట్ పీకడం |
5. కాలహట్టి ఫాల్స్ | హై Kudalini శక్తి మరియు Desolved సహజ హెర్బల్ ఆయిల్స్ తో నీరు - ప్లాంట్ పీకడం |
6. శాంతి ఫాల్స్ | విద్యుదీకరణ నీటి |
7. శంకర్ ఫాల్స్ | విద్యుదీకరణ నీటి |
8. Hanumana Gundi Falls | హై కుండలిని తో విద్యుదీకరణ నీటి |
9. హోన్నమ్మ Holla జలపాతాలు | కుండలిని పవిత్ర జలం, భక్తులు తలపై నీరు డ్రాప్స్ చల్లుకోవటానికి |
బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠం క్షేత్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- వాన, విపరీతమైన చలి నుండి కాపాడుకోవడానికి తగినన్ని జాగ్రత్తలను తీసుకోవాలి
- దూరంలో ఉండే ప్రాంతాలకు Sightseeing కు వెళ్ళే టప్పుడు Phone చేసి వెళ్ళడం మంచిది
- Waterfalls దగ్గర అనేక నీటి జంతువులు కనిపిస్తాయి. వాటి నుండి రక్షణ పొందడం కోసం Shoe ధరించాలి
- Ghat Road లలో Vehicle / Two Wheeler నడపడంలో అనుభవంలేని వారు Vehicle ని Rent కు తీసుకోకపోవడం మంచిది
BBG DP క్షేత్రం చుట్టుపక్కల గల చూడవలసిన ప్రదేశాలు / ఇతర ఆలయాలు – వివరాలు
టౌన్ / Place | సమాచారం / వివరాలు |
---|---|
టౌన్ / Place | సమాచారం / వివరాలు |
1. చిక్మగళూర్ పట్టణం | స్థానిక చిక్మగళూర్ : కాఫీ మ్యూజియం, మహాత్మా గాంధీ పార్క్, శ్రీరామ 'Kodanda రామ దేవాలయం' యొక్క HireMagalur మొదటి ఆలయం, Hirekolale లేక్, కళామందిరం, లలితకళామందిరం, శిల్పప్రదర్శనశాల |
2. Marle | 12 చిక్మగళూర్ కి.మీ. బేలూర్ రోడ్ - 1150 క్రీ.శ Chennakeshava ఆలయం & amp; Siddheswara ఆలయం |
3. శంకర్ ఫాల్స్ | 30 చిక్మగళూర్ కి.మీ.. కలస రోడ్ |
4. Kavikall Mata | 30 చిక్మగళూర్ కి.మీ.. భద్ర ఫారెస్ట్ పాయింట్ చూడండి |
5. Bhadra Wildlife Sanctuary (Muthodi) | 32 చిక్మగళూర్ కి.మీ.. ప్రకృతి క్యాంప్, వాహనం సఫారి (Ph:08262234904) |
6. Halebidu - బేలూర్ | 40 చిక్మగళూర్ కి.మీ.. హెరిటేజ్ సిటీ & amp; ఆలయం టౌన్ |
7. Kemmanagundi / కృష్ణ రాజేంద్ర హిల్ స్టేషన్ | 55 చిక్మగళూర్ కి.మీ.. ట్రెక్కింగ్ జోన్ - Z-పాయింట్, వృక్షశాస్త్ర ఉద్యానవనం, రోజ్ గార్డెన్, Shanti Falls, |
8. Hebbe Falls | 65 చిక్మగళూర్ కి.మీ.. ఈ ప్లేస్ చేరుకోవడానికి అందుబాటులో జీప్ సర్వీస్ 1 |
9. కళ్ళహతిగిరి జలపాతాలు | 65 చిక్మగళూర్ కి.మీ.. మహర్షి Agsthe Tapao స్థలం, Verabhadra Swamy Temple, Dhanya Dattatreya. Accommodation Available For Night Stay |
10. ఉడిపి | 85 చిక్మగళూర్ కి.మీ.. Sri Krishna Temple |
11. Sringeri – Sharada Peetham | 90 చిక్మగళూర్ కి.మీ.. Sharadamba Temple |
12. Magundi River Rafting | 90 చిక్మగళూర్ కి.మీ.. Situated Between Balehonnur & Kalasa - Water Sports Center |
13. Horanadu | 100 చిక్మగళూర్ కి.మీ.. Annapurneshwari Temple |
14. Kudremukha | 100 చిక్మగళూర్ కి.మీ.. Horse face shaped Hill Range - ట్రెక్కింగ్ జోన్ |
15. Hanumana Gundi Falls | 110 చిక్మగళూర్ కి.మీ.. In The Vicinity of Kundermukha Forest |
16. Shravanabelagola | 112 చిక్మగళూర్ కి.మీ.. Bhagawan Bahubali Statue (Gommateshwara) |
Chikmagalur లో అందుబాటులో ఉన్న Tourist Facilities
Facility | సమాచారం |
---|---|
Facility | సమాచారం |
1. Two Wheeler On Rent | Ph: 09483634751, Rs.500/- Per Day & Rs.500/- Refundable Deposit, Delivery At Hotel Facility Available On Free of Cost |
2. Auto Riksha On Call | Ph: 09743598198 - Very Prompt Service (Sayyad Bhai) |
3. Local Sight Seeing By Tata Indica | Ph: 09731402939, Rs 1400/- For Total Day Trip In & Around Chkimagalur Including BBGDP Hills Etc.. (Sri Umesh Ji) |
4. Chikmagalur Tourism Office | Ph: 08262228493 |
5. KSRTC Bus Stand | Ph: 08262234018 |
6. Coffee Mueseum | Ph: 08262221432 |
7. Local Railway Reservation Center | Ph: 08262220324 |
8. కళామందిరం, లలితకళామందిరం, శిల్పప్రదర్శనశాల | Ph: 08262233536 |