Ghanaswarupa Nrusimha Saraswathi Swamy Kshetram – Koduvatoor Daatatreya Siddhaasramam
Ghanaswarupa Nrusimha Saraswathi Swamy Kshetram – Koduvatoor Daatatreya Siddhaasramam
ఘనస్వరూప నృసింహసరస్వతి స్వామి క్షేత్రం - కొడువటూర్ దత్తాత్రేయ సిద్ధాశ్రమం
II గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః II
‘కొడువటూర్ (కొడవటూర్) సిద్ధులగుట్ట’ ఒక సిద్ధక్షేత్రం. సిద్ధులు, గురువులు నడయాడిన పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం. ప్రముఖ దేవీ-దేవతా గణాలందరూ ఇక్కడ స్వయంభూగా వెలిశారు. కాకతీయుల కాలంలో ఒకవెలుగు వెలిగిన గొప్ప క్షేత్రమిది. ఈ క్షేత్ర గొప్పదనాన్ని గమనించిన శ్రీ గౌరీభట్ల రాధాకృష్ణశర్మ గారు ఇక్కడ ‘ఘనస్వరూప శ్రీనృసింహసరస్వతి దత్తాత్రేయ సిద్ధాశ్రమం’ స్థాపించారు. మనకు దగ్గరలో ఇంత పెద్ద శ్రీనృసింహసరస్వతి స్వామి వారి విగ్రహం ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించదు,te. ఇక్కడ గల దత్తాత్రేయుడు తన పరివారంతో కొలువై నయన మనోహరంగా కనిపిస్తాడు. దత్త భక్తులందరూ తప్పనిసరిగా దర్శించి తరించ వలసిన క్షేత్రమిది,te. అలాగే ఈ గుట్ట పై ఒక ఒక ప్రసిద్ధ ‘స్వయంభూ శ్రీ సిద్ధలింగేశ్వరస్వామి’ శివాలయం కుడా ఉంది. అదేవిధంగా అనేక దేవాలయాలు ఈ గుట్టపై ఉన్నాయి.
ఎలా చేరుకోవాలి?
By Own Transport (80 KMs - 2 Hours Journey) |
---|
By Own Transport (80 KMs - 2 Hours Journey) |
ఉప్పల్ ---- & gt; వరంగల్ రహదారి ---- & gt; Gatkesr ---- & gt; Bibinagr ---- & gt; వరంగల్ హైవే టోల్ ప్లాజాలు ---- & gt; Aler ---- & gt; టెక్ లెఫ్ట్ సైడ్ రోడ్ (రైల్వే గేట్ రోడ్) Aler ---- & gt; ఫర్ Kolanpak ---- & gt; Pochannapet ---- & gt; Bachhannapet ---- & gt; Koduvatoor |
By Public Transport - (మొత్తం 90 KMs - 3 గంటల ప్రయాణం) |
---|
By Public Transport - (మొత్తం 90 KMs - 3 గంటల ప్రయాణం) |
Hyderabad MGBS / సికింద్రాబాద్ జూబ్లీ Bustand / ఉప్పల్ ---- & gt; Aler ---- & gt; Bachhannapet (బి షేరింగ్ ఆటోలు) ----& Gt; Koduvatoor |
కొడువటూర్ దత్తాత్రేయ సిద్ధాశ్రమక్షేత్ర దర్శనానికి అనువైన సమయం…
కొడువటూర్ దత్తాత్రేయ సిద్ధాశ్రమ క్షేత్రం ఒక్కరోజులో దర్శించుకొని రావచ్చు. కొడువటూర్ దత్తాత్రేయ సిద్ధాశ్రమ క్షేత్ర దర్శనానికి అన్ని కాలాలు అనువైనవే. కాని అత్యంత అనువైన సమయం మాత్రం వానాకాలం. వానాకాలంలో కొడువటూర్ (కొడవటూర్) సిద్ధులగుట్ట అతిసుందరంగా ఉంటుంది. అలాగే శ్రీపాద శ్రీవల్లభ జయంతి రోజూ, గురుపౌర్ణమి రోజూ, శ్రీనృసింహసరస్వతి స్వామి జయంతి రోజూ మరియు దత్త జయంతి రోజు ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఆ సమయాల్లో దత్తాత్రేయ సిద్ధాశ్రమ దర్శనం చాలా బావుంటుంది.
కొడువటూర్ దత్తాత్రేయ సిద్ధాశ్రమక్షేత్ర ప్రత్యేకత…
- సిద్ధులగుట్ట పై ఆశ్రమ స్థాపనచేయడం
- పెద్దదైన, సుందరమైన (ఘనస్వరూప) శ్రీనృసింహసరస్వతి స్వామి వారి విగ్రహం ఉండడం
- దత్తాత్రేయ దేవాలయం పిట్టగోడలు ఓం ద్రాం, ఐం, హ్రీం, శ్రీం బీజాక్షరాలతో ఆవాహనం చేయడం
- శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించడం
కొడువటూర్ సిద్ధులగుట్ట క్షేత్రం లో చూడవలసిన ఇతర ఆలయాలు / ప్రదేశాలు
కొడువటూర్ సిద్ధులగుట్ట క్షేత్రం లో చూడవలసిన ఇతర ఆలయాలు / ప్రదేశాలు |
---|
కొడువటూర్ సిద్ధులగుట్ట క్షేత్రం లో చూడవలసిన ఇతర ఆలయాలు / ప్రదేశాలు |
1. సిద్ధులగుట్ట కొండగుహలో 'స్వయంభూ శ్రీ సిద్ధలింగేశ్వరస్వామి' |
2. కాలభైరవ మందిరం |
3. సిద్ధులగుట్ట కొండపైన గల సిద్ధుల గుండము (కొలను) |
4. సిద్ధులగుట్ట కొండపైన గల రాముల గుండము (కొలను) |
5. సిద్ధులగుట్ట కొండపైన గల ముక్కంటి గుండము (కొలను) |
6. సిద్ధులగుట్ట కొండపైన గల బాలసిద్ధేశ్వరస్వామి లింగము , భస్మలింగం |
7. సిద్ధులగుట్ట కొండపైన గల సంగమేశ్వర లింగము |
8. యమకోణ హనుమంత గుహాలాయం (ఈ ఆలయానికి నేలపై పడుకొని ముందుకు ప్రాకుతూ మాత్రమే వెళ్ళగలం) |
9. మహా సరస్వతి దేవాలయం |
10. షిర్డీసాయి దేవాలయం |
11. నాగదేవత సహిత శివాలయం |
12. అతిపురాతన కాకతీయ ప్రతాపరుద్ర ప్రతిష్టిత ఈశాన్యాన శ్రీ ముక్కంటీశ్వరస్వామి దేవాలయం (ప్రస్తుతం శిధిలావస్థలో ఉంది) |
కొడువటూర్ దత్తాత్రేయ సిద్ధాశ్రమక్షేత్ర ఫోటోలు
కొడువటూర్ దత్తాత్రేయ సిద్ధాశ్రమ క్షేత్రం చుట్టుప్రక్కల గల చూడవలసిన ఇతర ఆలయాలు / ప్రదేశాలు |
---|
కొడువటూర్ దత్తాత్రేయ సిద్ధాశ్రమ క్షేత్రం చుట్టుప్రక్కల గల చూడవలసిన ఇతర ఆలయాలు / ప్రదేశాలు |
1. Kolanpak Swethamber Jain Mandir కొలనుపాక జైన్ మందిర్: (జైన్ మందిరం లోకి హిందువులు దర్శనార్హులు) |
2. Pembarthi (పెంబర్తి) మెటల్ క్రాఫ్ట్ విలేజ్ మేకింగ్ (9 Aler కి.మీ.) |
కొడువటూర్ దత్తాత్రేయ సిద్ధాశ్రమక్షేత్ర నిర్వాహకుల వివరాలు |
---|
కొడువటూర్ దత్తాత్రేయ సిద్ధాశ్రమక్షేత్ర నిర్వాహకుల వివరాలు |
శ్రీ ముకేష్ శర్మ (Koduvatoor దత్తాత్రేయ ఆలయం పురోహిత్) Ph: 9701662313 |