హోం
ఘండికోట శ్రీపాద శ్రీ వల్లభ రాజశర్మ
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే … శ్రీపాదుల వారి దివ్య శ్రీ చరణాశ్రితులారా… ఎందుకు జరిగాయో ఎలా జరిగాయో తెలియని సంఘటనలు క్రీ.శ. 2006 నుండి మాకు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ( ಶ್ರೀಪಾದ ಶ್ರೀವಲ್ಲಭ, श्रीपाद श्रीवल्लभ, Шрипада Шри Валлабха ) వారి సాంగత్యం ఏర్పడేలా చేసాయి. అప్పటి నుండి వారిపై మాకు అమితమైన భక్తి. శ్రీపాద శ్రీ వల్లభుల నామస్మరణ అంటే మాకు చాల ఇష్టం. ఈ వెబ్సైట్ శ్రీపాద శ్రీ వల్లభులవారి ఆశీర్వాదం తో తయారు చేయబడినది.
ఈ వెబ్సైట్ రూపకల్పనలో శ్రీపాదుల వారే దగ్గరుండి ఎన్నో సలహాలు ఇవ్వడం జరిగింది. సూక్ష్మరూపం లో చిన్న వెలుగు వలే (జ్యోతి రూపం) నా కుడి కంటి దగ్గర ఈ వెబ్సైట్ డిజైన్ చేస్తున్నంతసేపూ ఉండేవారు. చాలా వరుకు ఫోటోలు మరియు ఇతరత్రా మెటీరియల్ నా సొంత కెమెరా ద్వారా తీసినవే మరియు నేను తయారు చేసినవే, అంటే శ్రీపాదులవారు వారి ఆశీర్వచనములతో వారే నాద్వారా చేయించారని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు టైపింగ్ రాని నేను ఇంత ఇన్ఫర్మేషన్ తెలుగులోనే ఇచ్చానంటే అది శ్రీపాదుల శ్రీ పాదుకా మహిమే కాక ఇంకేమవుతుంది?
2006 నుండి 2013 (జులై నెల) వరుకు ఫ్రీ వెబ్సైట్ గా ఉన్న మన ఈ వెబ్సైట్, ప్రీమియం సైట్ (పైయిడ్ వెబ్సైట్) గా మార్చడంలో ఆర్ధికంగా సహాయ సహకారాలని అందించిన శ్రీమతి & శ్రీ లలితా శివ జ్యోతి మరియు శ్రీనివాస్ ఓరుగంటి వారికి మరియు శ్రీ భార్ఘవ్ కుమార్ అక్కినపల్లి వారికి ధన్యవాదములు.
ఈ వెబ్సైట్ రూపకల్పనలో ప్రత్యక్షంగా సహకరించిన శ్రీపాద శ్రీ వల్లభ స్వామీవారికి మరియు పరోక్షంగా సహకరించిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు. శ్రీపాద వల్లభుల భక్త భందువులందరికి శ్రీ పాదుల వారి ఆశీస్సులు లభించుగాక …..
మీ
కీర్తివల్లభ
దిగంబరా..దిగంబరా.. శ్రీపాద వల్లభ దిగంబరా.. దిగంబరా..దిగంబరా.. నృసింహ సరస్వతి దిగంబరా..
దిగంబరా..దిగంబరాశ్రీస్వామి సమర్ధ దిగంబరా…