Jackal Datta Kshetram
Paschim Pir Jackal Datta Kshetram (Kaladungar, Near Indo-Pak Border, Great Rann of Kutch)
(World’s One And Only ‘Aditya Dattatreya’ Kshetram)
పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం (కాలాడూంగర్, ఇండో-పాక్ సరిహద్దు దగ్గర, గ్రేట్ రాన్ ఆఫ్ కచ్)
(ప్రపంచంలోని ఏకైక ‘ఆదిత్య దత్తాత్రేయ’ క్షేత్రం)
Warning: © This Content & Photos Are Copyright Protected
Hari Om Tat Sat Jai Guru Datta.. Hari Om Tat Sat Jai Guru Datta.. Hari Om Tat Sat Jai Guru Datta..
గమనిక : ఈ ఆర్టికల్ చాలా పెద్దది. Paschim Pir Jackal Datta Kshetram కు సంబంధించిన అనేక విషయాలను ఫోటోలతోసహా తెలియజేయడం జరిగింది. ఈ Web Page లో అతి అరుదైన, అద్భుతమైన దాదాపు 200 కు పైగా ఫోటోలు గలవు. దయచేసి పూర్తిగా Load అయ్యేవరుకు వేచి ఉండండి. Load కాని పక్షంలో F5 బటన్ (F5 – Reload) నొక్కండి.
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే…
దిగంబరా…దిగంబరా…శ్రీపాద వల్లభ దిగంబరా…
దత్త బంధువులందరికీ జై గురుదత్త… పశ్చిమ పీర్ ఆదిత్య దత్తాత్రేయ మహారాజ్ కి జై..
2015 May నెలలో Sri Kshetra Devgad దత్తాత్రేయ క్షేత్రం దర్శించినప్పుడు ఒక ఊహించని సంఘటన జరిగింది. అక్కడి ఔదుంబర వనంలో నేను కూర్చుని ‘శ్రీపాద శ్రీ వల్లభ దివ్య చరితామృతం’ పారాయణ చేస్తున్నప్పుడు, అక్కడే నాకంటే ముందుగానే ఔదుంబర వనంలో ఉన్న ఒక ‘సాధువేషధారి’ నన్ను పిలిచి Devgad దత్తాత్రేయ క్షేత్రం వెనుక వైపున గల ‘ప్రవరా నదిని’ ఒకసారి చూసిరమ్మని పంపించారు. నిజానికి నేను అప్పుడే ప్రవరా నదిని చూసి ఔదుంబర వనంలోకి వచ్చాను. ఎందుకు ‘ప్రవర’ని చూడడానికి వెళ్ళమన్నారబ్బా?… అని మనసులో అనుకుంటూనే నేను మళ్లీ వెళ్లి ఎండిపోయిన (May నెల అవ్వడంవల్ల) ప్రవరానదిని చూసి తిరిగి ఔదుంబర వనంలోకి వెళ్ళాను. వెళ్లి నేరుగా నేను పారాయణ చేసిన ప్రదేశానికి వెళ్లి తిరిగి కూర్చుని మళ్లీ పారాయణం ప్రారంభించాను. కొద్ది సేపటికి అక్కడే గల నవనాథ మందిరానికి వెళదామనుకుంటుండగా ఆయన నన్ను పిలిచి “బాబు నువ్వు ప్రస్తుతం పాకిస్తాన్ బార్డర్ లో గల దత్త క్షేత్రాన్ని త్వరలో దర్శిస్తావు. అక్కడ అద్భుత ఆనందాన్ని పొందుతావు” అని చెప్పారు. అది విన్న నేను ఒక్క క్షణం పాటు ఏమి మాట్లాడాలో కుడా నాకు తెలియలేదు. వెంటనే తేరుకుని “స్వామీ అక్కడకి ఎలా వెళ్ళాలి? అడ్రస్ ఏంటి?” అని అడిగాను. దానికి ఆయన “అన్ని అవే వస్తాయి” అని మాత్రం సమాధానం చెప్పారు. పైగా ఇక నువ్వువెళ్ళవచ్చు అన్నట్లుగా తల ఊపారు. దానిని గ్రహించిన నేను అక్కడనుండి నవనాథ మందిరానికి వెళ్ళాను, తదుపరి Devgad Datta Kshetra Yatra ముగించుకొని తిరిగి Hyderabad చేరుకున్నాను.
Devgad లో జరిగిన విషయాలు నా పరిధిలో, ఆధీనంలో లేవని అనిపించి ఆ విషయాన్ని నేను మరిచిపోయాను. తదుపరి కొద్ది రోజుల తరువాత నాకు Gujarat లోని Anjar నుండి ఒక Phone Call వచ్చింది. చేసిన వారు ‘భగవతి పరాసియ’ అనే వారు. మరియు వారు శ్రీపాద వల్లభ స్వామి వారి భక్తులు. వారు మనం Publish చేసిన ‘Viswayoni Gokarna’ అనే Article చూసారట. అది అక్కడి తెలుగు వారిచే గుజరాతి భాష లోకితర్జుమా చేయించుకొని చదివారట. ఆ Article లో మనం వెలుగులోకి తీసుకు వచ్చిన శ్రీపాద శ్రీ వల్లభుల వారు ప్రతిష్టించిన శివలింగం, వారు సంకల్ప మాత్రంతోనే ఏర్పరచిన దత్త కోనేరు, వారు ప్రతిష్టించిన అనసూయా మాత విగ్రహాలకు సంభందించిన సమాచారాన్ని చూసి ఆనందంతో నాకు Phone చేసారు. నిజానికి ఆయన Gokarna వెళ్ళడం కోసం 6 సంవత్సరాలుగా చూస్తున్నారట. ఎప్పుడు ఏదో ఒక అవాంతరం రావడం ప్రయాణం Cancel అవ్వడం జరిగేవట. ఆరేళ్లుగా ఇదే తంతు అట. మన Article Publish అయ్యాక మనం చెప్పిన శ్రీపాదుడి ప్రదేశాలన్నీ చూడడం కోసమే ‘శ్రీపాదులు వారు వేస్తున్న వాయిదా’ అని తెలుసుకున్నారట. అప్పట్లోనే వెళ్లి ఉంటే శ్రీపాద ప్రతిష్టిత శివలింగ దర్శనం జరగకపోయేదే అని వారు భావించారట. అందుకోసమే ఆయన ప్రయాణం ఇన్ని సంవత్సరాలు వాయిదాపడిందేమో అని అనుకున్నారట. ఆయన Phone లో నాతో ” నేను చాలా దత్త క్షేత్రాలు చూసాను. కాని Gokarna క్షేత్రం మాత్రం ముడిపడలేదు. ఆఖరికి పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నదత్తాత్రేయ క్షేత్రం కుడా చూసాను. ఇప్పుడు తెలిసింది ఎందుకు నేను ఇప్పటివరుకు Gokarna వెళ్ళలేక పోయానో!” అని అన్నారు. వెంటనే నాకు మళ్లీ ఒక్క క్షణం నాకు మాటలు రాలేదు. వెంటనే తేరుకుని Pakisthan Border దగ్గర లోఉన్న ఆ దత్తాత్రేయ క్షేత్రం Address కావాలి అడిగాను. దానికి ఆయన “నేను నా చిన్నతనంలో 9th Class చదువుతుండగా మా నాన్న గారు అక్కడకి తీసుకెళ్ళారు. అక్కడి పూజారి గారు అప్పుడప్పుడు సరుకులకు Bhuj లో ఉన్న మా Grocery Shopకి వస్తారు, ఆయన Mobile Number మీకు SMS చేస్తాను, కాని ప్రస్తుతం పరిస్థితులు అప్పటిలాగ లేవు, ఇప్పుడు అక్కడకి వెళ్ళాలంటే BSF (Border Security Force) వారి Permission కావాలి” అని చెప్పారు. కొద్ది రోజుల నిరీక్షణ అనంతరం పూజారి గారి (సాధువు) Number SMS రావడం, వారితో Phone లోమాట్లాడడం, BSF వారి Permission కి Apply చెయ్యడం, Permission Sanction అవ్వడం లాంటి అనేక పనులు అప్రమేయంగానే శ్రీపాదుల వారి ఆశీస్సులతో టక..టక జరిగిపోయాయి. దాని ఫలితమే ఈ Article . దత్తామృతాన్ని గ్రోలండి Enjoy చెయ్యండి.
Hari Om Tat Sat Jai Guru Datta…
- కీర్తి వల్లభ (keerthivallabha@gmail.com)
పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం (కాలాడూంగర్) ఎక్కడుంది?
Paschim Pir Jacakal Datta Kshetram (పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం) Gujarat రాష్ట్రం లోని Kutch (or) Kachchh Region వద్ద Great Rann of Kutch లో India – Pakisthan Border కు దగ్గరగాగల ‘India Bridge’ సమీపంలో Kaladungar (Black Hills) అనబడే కొండమీద ఉంది. ఈ మొత్తం ప్రదేశం Khavada Notified Area క్రిందికి వస్తుంది.కాబట్టి Non Locals ఇక్కడకు వెళ్ళాలంటే BSF వారి Permission తప్పక తీసుకోవాలి. Gujarat రాష్ట్రాన్ని మొత్తం 6 జోన్లుగా విభజించారు (Central Gujarat, South Gujarat, East Gujarat, North Gujarat, Saurashtra-Girnar Area & Kutch) ఇందులో Kutch Area (or) Great Rann of Kutch ఒకప్పుడు (కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం) సముద్రం లోపల ఉండేది. తదుపరి Continental Drifting వల్ల సముద్రం Kutch Area నుండి దూరంగా జరిగింది. ఫలితంగా అక్కడ భూభాగం అనేక రకాల సముద్ర శిలాజాలతో (Fossils) నేటికి కనిపిస్తుంది. తదుపరి అక్కడ అనేక రకాలైన Dinosaurలు తిరిగాయి. ఇప్పటికీ వాటి Fossils & Egges తవ్వకాలలో బయట పడుతూనే ఉంటాయి. ఈ ప్రాంతమంతా Seismic Zone – V లో ఉంది. ఇక్కడ సరాసరి ప్రతి 20 ఏళ్ళ కోకసారి భారి భూకంపాలు తప్పవు. ఈ ప్రదేశం నుండే Tropic of Cancer (కర్కటరేఖ) కుడా వెళుతుంది. ఫలితంగా ఇక్కడి వాతావరణం చిత్రంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో మాట్లాడే భాష ‘Kachchhi’ (కచ్చి). ఇది గుజరాతి భాషతో అస్సలు పోలిఉండదు. ఈ భాష సింధీ భాషకు దగ్గరగా ఉంటుంది. Kachchhi ను అర్ధం చేసుకోవడం చాలాకష్టం. జంతువుల పెంపకం, Handicrafts ఇక్కడి ప్రధాన వృత్తులు. ‘Kachchh’ అంటే Tortoise (తాబేలు) అని అర్ధం. ఈ భూభాగం నీటి నుండి బైటకు కనిపించే తాబేలు డిప్పలాగా నెర్రులు బారి ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది. ఇక్కడి ప్రజలు Swamy Narayana సంప్రదాయాన్ని పాటిస్తారు. ఇక్కడ వాతావరణం ఎడారి వాతావరణం. సముద్రం లోపలకు వెళ్ళడం వల్ల అక్కడగల అధిక ఉప్పు సాంద్రత కలిగిన నేల తెల్లటి మేటలాగా పరుచుకొని White Desert / White Rann ను ఏర్పరిచాయి. ఈ ప్రాంతంలో UV Index అధికంగా ఉండడం వల్ల కొండలూ, గుట్టలు ముదురు ఆకుపచ్చ లేదా నలుపు రంగులో కనిపిస్తాయి. అందుకే వీటికి Black Hills అని పేరు వచ్చింది. ప్రస్తుతం ఇక్కడి చాలా ప్రాంతాలు ( Indo-Pak Borderవైపు ) BSF ఆధీనంలో ఉన్నాయి.
పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం (కాలాడూంగర్ దత్త క్షేత్రం) విశిష్టత
దత్తాత్రేయుడు యోగి – కాని పెద్ద భోగి, స్మతృగామి – అదేసమయంలో ఒకపట్టాన కరుణించడు పిలిస్తే పలకడు, నిర్గుణుడు – కాని సగుణ రూపంలో కనిపిస్తాడు. మౌన ప్రియుడు – కానీ ఉన్మత్తుడు బండ బూతులు తిడతాడు… ఈ విధంగా అనేకానేక వైవిధ్యభరితుడు దత్తాత్రేయుడు, కాని ఒక విషయంలో మాత్రం దత్తాత్రేయుడి దగ్గర ఎటువంటి విభిన్నతలేదు, అదే “దత్తాత్రేయుడు అన్నదాన ప్రియుడు. ఆకలిగా ఉన్న జీవులకు ఆహారం పెడితే వెనువెంటనే సంతోషించే అల్పసంతోషి” అందువల్లే దత్తాత్రేయంలో అన్నదానానికున్న ప్రాముఖ్యత మరిదేనికి లేదు. అలనాడు శిబి చక్రవర్తిని ఇంద్రుడు, అగ్నిదేవుడు ఆయన దాతృత్వాన్ని పరీక్షింపదలచి. ఇంద్రుడు డేగ రూపాన్ని, అగ్నిదేవుడు పావురం రూపాని ధరించి శిబి చక్రవర్తిని పరీక్షించారు. ఆఖరుకి శిబి చక్రవర్తి తనని తాను మొత్తంగా ‘డేగ’ కి అర్పించుకున్నాడు. శిబి చక్రవర్తి కథ దాతృత్వానికి సంబంధించినదైతే, పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్ర ఉదంతం అన్నదానానికీ, అన్నదాన గొప్పదనానికీ సంబంధించినది. మూగజీవుల (Jackals-నక్కలు) ఆకలి కేకలను, వాటి దీన ప్రార్ధనలను విన్న దత్తాత్రేయుడు తన శరీర భాగాలను ఆహారంగా విసిరివేసి, మూగజీవుల ఆకలి బాధలను తీర్చడం కోసం తనకి తానుగా తన దేహాన్ని అర్పించిన అతి గొప్ప రహస్య దత్త క్షేత్రమిది. పరిశోధించిచూడగా ఈ ప్రదేశం అనేక రకాలైన విశిష్టతలకు కొలువైఉన్నట్లుగా తెలియవచ్చింది.
విశిష్టత-1: ఈ క్షేత్ర ప్రాంతంలో గల నక్కల ఆకలిని తీర్చడం కోసం “లోఆంగ్ – లేఅంగ్” పేరుతో దత్తాత్రేయుడు తన శరీర భాగాలను ఆహారంగా విసిరివేసిన క్షేత్రమిది. గత 500 సంవత్సరాల నుండీ నేటివరుకు (ఇక ముందుకూడా) ఇక్కడ అదే కార్యక్రమం జరుగుతుండడం, నక్కలు రెండు పూటలా వచ్చి (12:00 PM & 06:30 PM) ‘లోఆంగ్ ప్రసాదం’ తినడం వింతలలోకెల్లా వింత. (Click Here To View Jackal Loaung Prasad Video)
విశిష్టత-2: ప్రపంచంలోని ఏకైక ‘ఆదిత్య దత్తాత్రేయ’ క్షేత్రం. ఈ విషయాన్ని Symbolic గా Represent చెయ్యడం కోసం దత్తాత్రేయ విగ్రహం వెనుక సూర్య భగవానుడు ఉన్నట్లుగా చిత్రపటాన్ని దేవాలయంలో ఏర్పాటు చేసారు.
విశిష్టత-3: ప్రతీ రోజు ఉదయం సూర్యోదయం అయిన కొద్ది నిముషాల తరువాత ఇక్కడ గల దత్తత్రేయునికి ‘సూర్యకిరణాభిషేకం’ జరుగుతుంది. ఈ సూర్యకిరణాభిషేకం సన్నీవేశం కొద్దినిముషాలపాటు ఉంటుంది. చూసి తీరవలసిన ఘట్టమిది.
విశిష్టత-4: పూజలూ, అర్చనలు, కొబ్బరికాయలు కొట్టడం మొదలైన ఆర్భాటాలు లేకుండా నిత్యం Hari Om Tat Sat Jai Guru Datta అనే నామస్మరణ వినిపించే క్షేత్రం (Click Here To View Live Video)
విశిష్టత-5: సూర్య భగవానుడు తనకిరణాలతో ప్రతీరోజూ సూర్యకిరణాభిషేకం చేయడానికి వీలుగా ప్రత్యేకంగా కట్టబడిన విమాన గోపురం కలిగిన దత్తక్షేత్రమిది. ఇటువంటి విమాన గోపురం మరెక్కడా కనిపించదు.
విశిష్టత-6: ఇక్కడనుండి (కాలాడూంగర్) గిరిరాజ్ గిరినార్ శిఖరం 9000వ మెట్లవద్దకు నేరుగా చేరుకునే గుహ మార్గం ఉండడం.
విశిష్టత-7: దత్తాత్రేయుడు రాజేసిన నిత్యధుని నేటికీ ఇక్కడ వేలుగుతుండడం, ఈ ధుని ఊదిలో దత్తపాదుకా ముద్రలు పడుతుండడం ఇక్కడి విశేషం.
విశిష్టత-8: భూమి ఏటవాలుగా 23.5 డిగ్రీల కోణంలో తిరిగి ఉన్న ప్రదేశంలో గల ఏకైక దత్త క్షేత్రం
విశిష్టత-9: Tropic of Cancer (కర్కటరేఖ) పైన గల ఏకైక దత్త క్షేత్రం
విశిష్టత-10: ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో దత్తాత్రేయ హారతి జరుగుతున్నప్పుడు ఒక కాంతిగోళం (సిద్ధగోళం) విధిగా వచ్చి సూర్యుని చుట్టూతిరిగి తదుపరి దత్త శిఖరం చుట్టూ తిరిగి (సూర్యహారతి కార్యక్రమం) వెళ్ళడం (Click here To View Live Video-1 & Live Video -2)
“లోఆంగ్ - లేఅంగ్”
(“ప్రియమైన నక్కలారా! నా అంగాలను ఆహారంగా తీసుకోండి!”)
దత్తాత్రేయుడు దత్తాత్రేయుడే! వారి లీలలు ఊహాతీతాలు. వారిగురించిన తలపు ఒకరకంగా ఉంటే ఆయన మరోరకంగా ఉంటారు. వారుచేసే అద్భుతాలు వేదాలు కుడా వర్ణింపలేవు. దత్తాత్రేయుని గురించి చెప్పడానికి భాష, లిపి, ఊహ , జ్ఞానం, ఎరుక మొదలైనవేవి సరిపోవు. అందుకే మౌనంగా ఆయన దగ్గర చేతులు కట్టి , ఆయన చేసే పనులు చూస్తూ ఉండడమే సరైన ప్రతిస్పందన. ఆయన చేసే పనులకు (క్రియలనండీ, లీలనండీ లేదా మరేదైనా అనండి) నిలువెత్తు సాక్ష్యం కాలాడూంగర్ లోని పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం. అక్కడ పూజలులేవు, అర్చనలు లేవు…ధనప్రవాహం అసలే లేదు! స్వాములు లేరు..బాబాలు లేరు..’పెద్ద స్వామి పాద నమస్కారానికింత…చిన్నస్వామి పాద నమస్కారానికింత అనే ధరల పట్టీ వేళాడదీసి లేదు! “భక్తుడా ఇంతమొత్తం కడితేనే ఇక్కడ నృసింహ సరస్వతి స్వామి వారు నిన్ను చెయ్యెత్తి ఆశీర్వదిస్తాడు, లేకపోతే చెయ్యేత్తడు” అనే మధ్యవర్తులు, పూజారులు లేరు. అయినవారికి ఆకులు (VIPs, NRIs) కానివారికి కంచాలు (సామాన్యుడు) ఉండవిక్కడ. ఇక్కడ జంతువులే దత్తుడి స్వరూపాలు, VIPలు. ఈ ప్రదేశం భూమిపై న ఉన్న అసలైన దత్తదేశం. ‘పంచభూతదయ’ ఇక్కడ తాండవిస్తూ ఉంటుంది. ప్రకృతి మనల్ని పలకరించి దత్తాత్రేయం అంటే ఏంటో, ఎలాఉంటుందో మనకు తెలిసేలా జీవితాంతం గుర్తుండిపోయేలా Practical గా చూపిస్తుంది. ఇక్కడ దత్త హోమం చేసుకోవాలన్నా లేదా దత్తాత్రేయునికి హారతి పట్టాలన్నా ఎవరికివారు, వారు ఎంతటి వారైనా… వారివారి ఏర్పాట్లు వారు చేసుకోవల్సిందే! ఈ క్రమంలో అక్కడి ప్రశాంతతకు ఎటువంటి భంగం కలిగించరాదు. Lagaan Movie Team (ఈ సినిమా ఈ పరిసర ప్రాంతాలలోనే తీసారు) ఇక్కడి ప్రకృతిని, జంతువులలోని Innocence చూసి వాటికి వారు వాడే Lighting, Generator Sound లవల్ల Disturbance కలగకుండా ఉండడం కోసం, అక్కడ Shooting కి వారికి Permission ఉన్నా, దూరంగా వేరే location కి వెళ్లిపోయారట. ఈ క్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంత రాసినా తక్కువే. ఇక్కడి స్థానికులతో Interact అయ్యి ఇక్కడ జరిగిన విషయాలు Kachchhi భాష లో Record చేసుకొని దానిని Kachchhi – Hindi Translator దగ్గర Translate చేయించుకొని మీకు కొన్ని విషయాలు శ్రీపాద శ్రీ వల్లభుల ఆశీస్సులతో తెలియచెయ్యాలనుకుంటున్నాను… Jai Guru Datta.
దాదాపుగా 500 సంవత్సరాల క్రితం మాట. భరతఖండానికి పశ్చిమ దిక్కున సహ్యాద్రి పర్వతశ్రేణి సముదాయం లోని నల్లటి కొండల (Black Hills -కాలాడూంగర్) పై సూర్య భగవానుడు నడి నెత్తిన ఉన్నాడు.ఆరోజు మాస శివరాత్రి. అప్పుడు సూర్యుడిలో నుండి గురు దత్తాత్రేయుల వారు సహ్యాద్రిశ్రేణి లోని కాలాడూంగర్ పై తమ ఎడమ కాలు పెట్టి భూమి మీదకు దిగారు. తదుపరి వారి కుడి కాలు అక్కడకి 80 KMs దూరంలో గల Puraneshwara Mandiram / Puneshwara Mahadev Mandiram లో పెట్టవలసి ఉంది. ఎందుకంటే Puraneshwara Mandiram లోగల ‘పురానేశ్వరుడు’ పేరుకు తగ్గట్టే అతి ప్రాచీనుడు. దేవి-దేవతా గణాలు పుజచేసుకోవడం కోసం శివుడు 2200 (Two Thousand Two Hundred Years) సంవత్సరాల క్రితం అక్కడ లింగరూపంలో వెలిసాడు. ప్రతీ మాస శివరాత్రి రోజున మధ్యాన్నం అక్కడకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వచ్చి ఆ లింగాన్ని పూజించడం ఆనవాయితి, శివుడు శివుడినే (లింగరూపంలో ఉండే) పూజించడం ఇక్కడి విశేషం. ఈ దేవాలయం 12 వ శతాబ్దంలో ఉన్న రాజుల ద్వారా కొంత వరుకు ఆధునీకరించబడినది. ఈ చర్యలో భాగంగానే దత్తాత్రేయుడు పురానేశ్వర మందిరానికి పయనమవ్వడం కోసం సూర్యమండలం నుండి భూమండలానికి ‘కాలాడూంగర్’ పై ఎడమ కాలుపెట్టి దిగాడు. గురు దత్తాత్రేయుల వారు Puneshwara Mahadev Mandir వెళ్ళడం కోసం సూర్యమండలం నుండి భూమండలానికి దిగేటప్పుడు కాలాడూంగర్ పైనే ఎందుకు దిగవల్సివచ్చిందంటే భూమి 23.5 డిగ్రీల కోణంలో ఏటవాలుగా ఉంది. అలాగే కాలాడూంగర్ కుడా Tropic of Cancer మీద 23.5 డిగ్రీల కోణంలో ఉంది. ఫలితంగా సూర్యమండలం నుండి భూమండలానికి ఎవరు దిగాలన్నా Tropic of Cancer మీద మాత్రమే దిగవలసి ఉంటుంది. కాలాడూంగర్ ప్రాంతం ఎడారి ప్రాంతం. ఎడారి జీవనంలో అన్ని జంతువులకు ఒత్తిడి (Stress) అధికంగా ఉంటుంది. అప్పటికే అక్కడి ఎర్రటి ఎండలో కొద్ది వారాలుగా తినడానికి తిండి లేక ఆకలితో నకనక లాడుతున్న నక్కల గుంపోకటి ఏదైనా జంతువు కనబడకపోతుందా..అని అన్నిటికి తెగించి వెతుకుతున్నాయి. సరిగ్గా ఆ సమయంలో అదే ప్రాంతంలో దత్తాత్రేయుడు దిగాడు. అంతే దత్తాత్రేయుడిని చుసిన నక్కల గుంపు ఆహారం దొరికిందని ఒక్కసారిగా ఆయన మీదకు ఉరికాయి. వచ్చింది ఆహారం కాదు దేవాది దేవుడని గ్రహించి తోకలు ముడిచి కాళ్ళు పైకి లేపి వాటి నేత్రాలతోనే దత్తాత్రేయుడిని క్షమించమని వేడుకున్నాయి. అప్పుడు దత్తాత్రేయుల వారికి నక్కల కి మధ్య ఈ విధంగా ‘నేత్ర సంభాషణ’ జరిగింది.
నక్కల గుంపు / నక్కల రాజు : మమ్మల్ని క్షమించాలి ఆకలిగా ఉండడం వల్ల విచక్షణ కోల్పోయి దేవాదిదేవులైన మీమీదికి ఉరికాము. ఇక్కడ మాకు గత కొద్ది వారాలుగా తిండి లేదు. ఎండలకి ఇక్కడున్న చిన్న జంతువులన్నీ చచ్చి పోయాయి. నక్కల రాజుగా నేను చనిపోయినా పరవాలేదు, మా పిల్ల సంతతికి చంపి తినడానికి జంతువులేవైనా ఉంటే చూబించండి.
దత్తాత్రేయుడు: ఆకలిగా ఉండే జీవుల ఆకలి తీర్చడమే నా ముఖ్యతత్వము. అదే నా మూలతత్వము. అదే దత్తరీతి! దత్తసారము. దానికి వేరొక జాతి జంతువులను చంపడమెందుకు? నేనుండగా?..తినండి.. కడుపు నిండా తినండి.. లోఆంగ్ – లేఅంగ్..లోఆంగ్ – లేఅంగ్..లోఆంగ్ – లేఅంగ్.. నా అంగాలను ఆహారంగా తినండి.. అని దత్తాత్రేయుడు ఆయన చేతులకు, తొడలకు, వక్ష స్థలానికి ఉన్న శరీర కండలను పెరికి వాటికి విసిరారు. దత్తతేయుడు తన కండలను పీకిన చోటల్లా తిరిగి మాంసం రావడం మళ్లీ దానిని పీకి నక్కలకు వేయడం.. ఇలా పలు మార్లు చేసి అక్కడ గల అన్ని నక్కలకు కడుపునిండేటట్టు భోజనం పెట్టారు.
నక్కల గుంపు / నక్కల రాజు : దేవా.. దత్తాత్రేయ! ధన్యవాదములు. అద్భుతం…మీ మాసం ఎంతో తియ్యగా రుచికరంగా ఉంది. ఇలాంటి రుచి ముందెన్నడూ ఎరగము. మీరు మరోలా అనుకోక పోతే మాదో చిన్న విన్నపము..
దత్తాత్రేయుడు: చెప్పండి. ఏంకావాలి?
నక్కల గుంపు / నక్కల రాజు : మీ రుచికరమైన మాంసంతో ఇవాల్టికి ఆకలి తీరింది సరే.. మరి రేపటి నుండి మా పరిస్థితేంటి? దేవా!..
దత్తాత్రేయుడు: నా శరీరాన్ని తిన్నా.. మీ నక్క బుద్ధి పోనించుకున్నారు కాదు.. సరే ఇటువంటి భోజనమే ఎప్పటికి మీకు అందేలా ఏర్పాటు చేస్తాను. రెండు పూటలా…మద్యాహ్నం, సాయంత్రం పిలవగానే రండి, తిని వెళ్ళండి… అని అభయమిచ్చి, ఒక్క అడుగులో పురానేశ్వర మందిరాన్ని చేరారు.
నక్కల గుంపు / నక్కల రాజు : ధన్య వాదములు దేవా..దత్తాత్రేయ
తదుపరి దత్తాత్రేయుల వారు మిట్ట మధ్యాహ్నం అక్కడకి దగ్గరలో గల ఒక పశువుల కాపరి (ఒంటెల కాపరి) మట్టి గుడిసె లోకి వెళ్లి, గుడిసె లో ఘాడనిద్రలో ఉన్న పశువుల కాపరిని నిద్రలేపి ఇలా మాట్లాడారు.
దత్తాత్రేయుడు: ఓ! మాడు.. ఓ! మాడు.. (ఓ మనిషి!)..లే.. మధ్యాహ్నం ఈ నిద్రేంటి? తొందరగా లే! నీకు ఇవాళ వంట నేర్పించాలి. చాలా పనులున్నాయి.
పశువుల కాపరి: ఎవర్నువ్వు? బాగా తెలిసిన వాడిలా పిలుస్తున్నవే?!? వంటేంటి? నేనెందుకు వంట నేర్చుకోవాలి?!
దత్తాత్రేయుడు: అతిగా నిద్ర పోవడం వల్ల నీకు మతి పోయినట్లుగా ఉంది. అదిగో అక్కడ ఆకొండ మీద బండ వెనుక ఆకలిగా ఉన్న నక్కల గుంపు ఉంది వాటికి వండి వేడివేడిగా తిండి పెట్టాలి. కావాలంటే వెళ్లి చూసిరా..
పశువుల కాపరి: ఏంటి ? నక్కలకి వేడివేడిగా వండి పెట్టాలా?.. నాకు కాదు నీకు పోయింది మతి..
దత్తాత్రేయుడు: వెళ్లి చూసి, వచ్చి మాట్లాడు.
పశువుల కాపరి: సరే.. చూద్దాం.. నిజమెంతో… అనుకుంటూ వెళ్లి చూసే సరికి అక్కడ నక్కలు పడిగాపుల కాయడం చుసిన పశువుల కాపరి పరిగెత్తు కుంటూవచ్చి.. బాబోయ్.. ఎన్ని నక్కలో! ఇంతకి మీరెవరో చెప్పండి దయచేసి..
దత్తాత్రేయుడు: చిరునవ్వు నవ్వి చూపుడు వ్రేలుతో పశువుల కాపరి బృమధ్యాన్ని తాకగానే పైన జరిగిన వృత్తంతమంతా ( దత్తాత్రేయుడు సూర్యమండలం నుండి భూమండలానికి దిగిన వృత్తాంతం) అతనికి కనిపించింది (అతని ద్వారానే ఈ వృత్తాంతమంతా ప్రపంచానికి తెలిసింది)
పశువుల కాపరి: క్షమించండి దత్త దేవా. తెలియక ఏదేదో వాగాను. చెప్పండి స్వామీ నన్నేంచేయమంటారు?
దత్తాత్రేయుడు: త్వరగా ఒంటె కట్టుకొని ‘ఖావడా’ సేటు దగ్గరకి వెళ్లి ఎనిమిది సోలల బియ్యం, ఎనిమిది ముంతల బెల్లం, పావు ముంత చితపండు, అరసోల పెసరపప్పు, రెండు వెన్న ముద్దలు (నెయ్యి) తీసుకురా.
పశువుల కాపరి: క్షమించండి, నేను సేటుకి చాలా రోజులుగా బాకీ ఉన్నాను. నేను వెళితే సరుకులు ఇవ్వకపోగా గొడవ చేస్తాడు. ప్రస్తుతం నాదగ్గర రొక్కం కుడా లేదు .
దత్తాత్రేయుడు: పరవాలేదు, నువ్వెళ్ళు.. మిగతాది నేను చూసుకుంటాను
ఆవిధంగా ఖావడాసేటు దగ్గరకి వెళ్ళగానే సేటు అతనిని కూర్చోపెట్టి ‘చల్లటి చాస్’ (మజ్జిగ) ఇచ్చి సరుకులన్నీ ఒంటె మీదకు చేర్చాడట. ఆపై సేటు పశువుల కాపరితో “మికివ్వవలసిన పైకం ఇంకా అందలేదు దానికి తగ్గ మైనం సరుకులు తీసుకెళ్ళమని” చెప్పాడట. అంటే పశువుల కాపరి సేటు దగ్గరకు వెళ్ళేలోపే సేటు పశువుల కాపరికి బాకీ పడేటట్లుగా దత్తాత్రేయుల వారు కాలాన్ని మార్చారన్నమాట.
పశువుల కాపరి తిరిగి కాలాడూంగర్ లోని మట్టి గుడిసె లోకి వెళ్ళేటప్పటికి, అక్కడ దత్తాత్రేయుల వారు మట్టి నేలమీద మఠమేసుకొని కుర్చుని ఉన్నారట. పశువుల కాపరిని చూసిన దత్తాత్రేయుల వారు ఇలా అన్నారట.
దత్తాత్రేయుడు: ఆ ‘సేటు’ ఏమన్నాడు? సరుకులన్నీ ఇచ్చాడా?
పశువుల కాపరి: మీరు కాలస్వరూపులు. కాలం మీ రూపంలో అక్కడ విషయాల నన్నింటినీ తారుమారు చేసిన ఫలితంగా ఇప్పుడు సేటే నాకు బాకిగా ఉన్నాడని చెప్పాడు… దేవా! ఎంత చమత్కారివయ్యానువ్వు! సరుకులన్నీ తనే దగ్గరుండి కట్టి ఒంటెకెక్కించాడు.
దత్తాత్రేయుడు: నవ్వుతూ.. పద పద నీకు ఇవాళ ‘దత్తమాంసపు తాళి (Loaung Prasad)’ ఎలా వండాలో నేర్పిస్తాను.
పశువుల కాపరి: తెచ్చింది పప్పు-బెల్లాలు.. వండేది మాంసం, అంటే.. మీయొక్క మరొక చమత్కారాన్ని చూడబోతున్నానన్నమాట. జైదత్తదేవా.. జై జై దత్తదేవా.. తదుపరి తెచ్చిన సరుకులతో ‘దత్తమాంసపు తాళి’ ఎలావండాలో పశువుల కాపరికి నేర్పించారు.
దత్తాత్రేయుడు: వెళ్ళు ఈ అన్నానంతా గుడ్డలో మూటకట్టుకుని ఇందాక నక్కలను చుసిన ప్రదేశానికి వెళ్లి అక్కడ మూటదులుపు. దులిపి మూడు సార్లు “లోఆంగ్ – లేఅంగ్” అని కేకపెట్టు.
పశువుల కాపరి: అలాగే స్వామి. కానీ నక్కలు శాఖాహారం తినడం…అందులోనూ ఇటువంటి నెయ్యి దట్టించిన తియ్యటి ‘బెల్లపన్నం’ తినడం నాజీవితంలో చూడలేదు సరికదా, కనీసం వినలేదు కుడా! కానీ మీరు మరో చమత్కారానికి తెరతీస్తున్నారని మాత్రం గ్రహింపగలను.
తదుపరి పశువుల కాపరి నక్కలను చూసిన ప్రదేశానికి వెళ్లి అక్కడ అన్నం మూటను విప్పి దులిపి అరవగానే ఆ మూట లోంచి గుప్పుగుప్పుమని మాంసం వాసన వచ్చిందట. ఆ అరుపుకీ, ఆ మాంసపు వాసనకీ తిండి కోసం ఎదురు చూస్తున్న నక్కలు ఒక్కసారిగా వచ్చి ఆవురావురంటూ తిని వెళ్ళిపోయాయి. తిరిగి మట్టి గుడిసెకి చేరుకున్న పశువుల కాపరి ఆనంద భాష్పాలతో దత్తాత్రేయుని కాళ్ళ మీద పడి
పశువుల కాపరి: ఈ జీతానికి మీదర్శనం వల్ల లభించిన ఈపుణ్యం చాలు దేవా. ధన్యుడిని.
దత్తాత్రేయుడు: నువ్వు ఇప్పుడు వండినట్టుగానే ప్రతీ రోజూ రెండు పూటలా వండి నక్కలకి ప్రాసాదం పెట్టు. మీ వంశంలోని ప్రతీ తరంలో ఒకరు ఈ పనికి నియమింపబడతారు. గుర్తుపెట్టుకో ఎప్పటికీ అలసత్వం చూపకు. నేను దత్తత్రేయుడను. నావల్ల కాని కార్యమే ఈ విశ్వంలో లేదు. అలాంటి నేను ఇక్కడ పుట్టే ఈ నక్కలకి ఋణగ్రస్తుడను. నా శరీర భాగాలు వాటికిచ్చి, వాటి ఆకలిని తీర్చి, నా మూలతత్వాన్ని నిలబెట్టుకుంటున్నాను. ఆ విధంగా నా ఋణాన్ని తీర్చుకుంటున్నాను. ఇక్కడ పుట్టి, నా శరీర అంగాలను ఆహారంగా తినే నక్కలు అత్యంత అదృష్టవంతమైనవి. వాటికి సాటిరాగాలవి మరేవి లేవు. నక్కలే కాదు వాటితో పాటు ఈ ఆహారాన్ని తినే పక్షులు, ముంగీసలు, కుక్కలు మరియు ఇతర జీవులు కుడా అదృష్టమైనవే!
పశువుల కాపరి: తప్పకుండా స్వామి. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. తదుపరి దత్తాత్రేయుడు, పశువుల కాపరి ఇరువురూ గుడిసె బైటకు వచ్చి…
దత్తాత్రేయుడు: ఇదిగో పశ్చిమ దిక్కుగా తూర్పు ముఖంగా ఇక్కడ ఉన్న ఈ బండ మీద పడిన నా నీడ శాశ్వతంగా ఉండిపోతుంది. నువ్వు దీనిని పూజించుకోవచ్చు. ఇక్కడ ఈ బండ మీద పడిన నా ప్రతిబింబానికి (నీడ) ప్రతీరోజూ సూర్యోదయ సమయంలో సూర్యకిరణాభిషేకం జరుగుతుంది. సాయంత్రం సుర్యాస్తమయ సమయంలో ఇక్కడ సూర్య భగవానుని అంశ నాకు హారతి ఇస్తుంది. ఇది పశ్చిమ పీర్ ఆదిత్యదత్త క్షేత్రంగా మారుతుంది. మరి జాగ్రత్త.
పశువుల కాపరి: స్వామి!.. మరి మిమ్మల్ని ఎప్పుడైనా చూడాలంటే?…చూడాలనిపిస్తే?..
దత్తాత్రేయుడు: వారు చూపుడు వ్రేలుతో నేల పై చిన్నగుంత చేసి, “కొద్ది నిముషాలలో ఇక్కడ ఒక గుహ ఏర్పడుతుంది, ఈ గుహ మార్గం గిరినార్ లో నేను ఉండే ప్రదేశానికి దగ్గర వరుకు నిముషాలలో తీసుకెళుతుంది. అక్కడ నువ్వు నన్ను కలవవచ్చు” అనిచెప్పి ఒక్క అడుగులో అచ్చట నుండి తిరిగి సూర్యమండలానికి చేరారు.
పశువుల కాపరి: జై పశ్చిమ పీర్ ఆదిత్య దత్త భగవాన్.. జై జై ఆదిత్యదత్త భగవాన్..
చదవడానికి ఇదేదో మంచి థ్రిల్లింగ్ కథలాగ ఉన్నా.. గత 500ల సంవత్సరాలనుండి నేటి వరుకు ఇక్కడ జరుగుతున్నది ఇదే!. ఇకముందు కుడా జరగబోయేదీ ఇదే!. ప్రతీ రోజూ రెండుపూటలా Loaung Prasad వండడం, అది ఆశ్చర్యంగా నిముషాలలోనే మాంసంగా మారడం , రెండు పూటలా ఠంచనుగా నక్కలు రావడం Loaung Prasad తినడం, వెళ్ళడం ఇక్కడ చూడవచ్చు. కాకపోతే దత్తాత్రేయుని నీడ పడిన బండ 1918 AD లో వచ్చిన Earthquake వల్ల భూమిలోకి వెళ్లి పోయింది. ఆప్రదేశం లోనే ఇప్పుడు నూతనంగా Marble Stone తో చేసిన త్రిముఖ దత్తాత్రేయుల వారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇప్పటికీ ఇక్కడ ఉన్న దత్తాత్రేయుల విగ్రహానికి సూర్యోదయ సమయంలో సూర్యకిరణాభిషేకం, సుర్యాస్తమయ సమయంలో ఇక్కడ సూర్య భగవానుని అంశ హారతి (సూర్యహారతి) ఇస్తుంది. ఇవన్నీ మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎంతో పవిత్రమైన, శక్తివంతమైన వర్ణింపవీలుకాని క్షేత్రమిది.
Click Here To View ‘Loaung – Le Ang’ Video (‘లోఆంగ్ - లేఅంగ్’ విడియో చూడడం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)
అలనాటి గ్రంథాలలో పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం వృత్తాంతం
సుమారు 250 సంవత్సరాల క్రితం మేక్రన్దాదా (Sant Mekrandada – ఒక అడవి గాడిద మరియు ఊరకుక్క తో ఊరూరా తిరిగే గొప్ప సంత్) అనే ఒక గొప్ప సంత్ ఇక్కడకి (కాలాడూంగర్) వచ్చి మన అన్నమాచార్యులలాగా, భక్త రామదాసులాగ పశ్చిమ పీర్ ఆదిత్య దత్తాత్రేయునిపై 10,000 పద్యాలను వ్రాసారట. అప్పుడు దత్తాత్రేయుల వారు ప్రత్యక్షమై నువ్వు (Kachchh Kabir) “కచ్ కబీరు” వి అని బిరుదు ఇచ్చారట. తదుపరి మేక్రన్దాదా, దత్తాత్రేయుల వారు కలిసి ఇక్కడ ఉన్న సొరంగ మార్గం ద్వారా గిరినార్ చేరినట్లుగా, అక్కడ ఉన్న 10,000 మెట్లకు ఒక్కో మెట్టుకు ఒక్కో పద్యం చొప్పున 10,000 పద్యాలను మేక్రన్దాదా దత్తాంకితం చేసినట్లు ఇక్కడివారు చెప్పారు. దత్తాత్రేయుడి పై Mekrandada వ్రాసిన 10,000 పద్యాలను సేకరించడానికి విఫలయత్నం చేసాను. సఫలీకృతుడను కాలేకపోయాను. అమృతంవంటి ఆ 10,000 పద్యాలను మనకు అందించమని కాలస్వరూపుడైన ఆదిత్య దత్తాత్రేయుడిని చేతులుజోడించి వేడుకుంటున్నాను.
ఎలా Permission తీసుకోవాలి?.. ఎలా చేరుకోవాలి?
పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం (ఆదిత్య దత్తాత్రేయ క్షేత్రం), కాలాడూంగర్ చేరుకోవాలంటే ముందుగా BSF వారి Entry Permission తీసుకోవాలి. Permission కోసం మనం ఇక్కడ (హైదరాబాద్) నుండే Indian Post ద్వారా Apply చేసుకోవాలి. మొత్తం మీద 3-4 నెలల ముందు Plan చేసుకోవాలి. అనేక ఉత్తర-ప్రత్యుత్తరాల తదుపరి మాత్రమే మనకి Letter of Entry వస్తుంది. కొంతమంది కాలాడూంగర్ కి వెళ్ళాలంటే Permission అక్కర్లేదు అని చెప్పి మనల్ని Misguide చేస్తారు. నిజానికి కాలాడూంగర్ ఇంకా 40 KMs ఉందనగా, White Desert అడ్డ రోడ్డు దగ్గర వచ్చే Checkpost వద్ద Permission కు సంబందించిన Caution Board ఉంటుంది. కాలాడూంగర్ కంటే 20 KMs ల ముందు వచ్చే Khavada లోకి Enter అవ్వలంటేనే Permission కావాలి. ఈ విషయాన్ని స్పష్టంగా Gujarati, English, Hindi భాషలలో రాసి పెట్టిన పెద్ద Board ఇక్కడ కనిపిస్తుంది. Kachchh బాష మాట్లాడే వారికి, Locals కి మాత్రమే Permission నుంచి Exemption ఉంటుంది. కొంతమంది ఎటువంటి Permission లేకుండా కాలాడూంగర్ వెళ్లి వచ్చి ఉండవచ్చు. కాని BSF వారు పట్టు కుంటే మాత్రం వారిని ముందుగా Khavada Police Station కి తీసుకువచ్చి అక్కడ FIR Book చేసి, నేరుగా Bhuj లోని District Court కి Attach చేస్తారు. Permission లేకుండా కాలాడూంగర్ లోకి ప్రవేసించిన వారు, వారి సంజాయిషీ కేవలం Court లోనే చెప్పుకోవలసి ఉంటుంది, బైట Settlements ఉండవు. కాబట్టి కాలాడూంగర్ వెళ్ళాలనుకునేవారు ముందుగానే Letter of Entry తీసుకుని వెళ్ళడం శ్రేయస్కరం. ఒకసారి Letter of Entry Sanction (Permission) అయిన తరువాత దాని Copy నేరుగా మన Address కు Indian Post ద్వారా వస్తుంది లేదా Letter of Entry Sanction అయ్యింది Bhuj Town లో ఫలానా తేదిన ఫలానా Time కి DSP Office వచ్చి మీ Originals చూపించి Permission Letter Collect చేసుకోమంటారు. Entry Permission దొరికిన తదుపరి మనం కాలాడూంగర్ చేరడానికి Travel ఏర్పాట్లు చేసుకోవాలి. కాలాడూంగర్ వెళ్ళడానికి Public Transport లేదు. Own Transport మాత్రమే దిక్కు. Bhuj లో రోజుకు Rs.500/- అద్దెతో Bike Rentకి తీసుకోవచ్చు. దీనికి గాను మన Driving Licence, Address Proof ల Photo Copyల తో పాటు రోజుకు Rs.2000/- Deposit (Refundable) కట్టాలి. Fuel మనమే పోయించుకోవాలి. Bhuj Town దాటిన తరువాత Petrol Bunkలు ఉండవు. కాబట్టి Tank Full చేయించుకుని వెళ్ళాలి.
Click Here To View Model ‘Request For Permission’ Letter
Hyderabad నుండి Kaladungar చేరుకోవాలంటే ముందుగా అక్కడికి Nearest Town అయిన Bhuj ను చేరుకోవాలి. Bhuj అనేది District Head Quarter, Airport & Well Connected Railway Station ఉన్నాయిక్కడ.
Hyderabad To Kaladungar (Nearest Town Bhuj) - రైలులో : Total Two Trains (45 Hrs. Including Layover Time) |
---|
Hyderabad To Kaladungar (Nearest Town Bhuj) - రైలులో : Total Two Trains (45 Hrs. Including Layover Time) |
Secunderabad ----> Begumpet ----> Dadar ---->Bandra (By Local Train) ----> Bandra Terminus (By Sharing Auto Rs.20/-Per head) ----> Bhuj ----> Kaladungar (By Own Vehicle / Transport) |
Hyderabad To Kaladungar (Nearest Airport Bhuj) - By Air : Total Two Flights (05 Hrs. Including Layover Time - Jet Airways) |
---|
Hyderabad To Kaladungar (Nearest Airport Bhuj) - By Air : Total Two Flights (05 Hrs. Including Layover Time - Jet Airways) |
Hyderabad ----> Mumbai ----> Bhuj ----> Kaladungar (By Road) |
పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం క్షేత్ర దర్శనానికి అనువైన సమయం…
పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్ర (ఆదిత్య దత్తాత్రేయ క్షేత్రం, కాలాడూంగర్) దర్శనానికి అనువైన సమయం October నెలనుండి January నెల వరుకు. దీనిని బట్టి Permission కు Plan చేసుకోవాలి.
పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం క్షేత్రంలో ఎక్కడ ఉండాలి?
కాలాడూంగర్ దత్తాత్రేయ క్షేత్రంలో Paid Accommodation Facility ఉంది. Rs.300/-, Rs.500/- & Rs. 700/- Tariff తో ఉండడానికి Rooms దొరుకుతాయి. ఇక్కడ Room తీసుకున్న వారికి ఉచితంగా భోజన సౌకర్యం కలిపిస్తారు. ఇక్కడ Room తీసుకోవడానికి Letter of Entry / ID & Address Proofs (Originals) వారికి Deposit చెయ్యవలసి ఉంటుంది. తిరిగి వెళ్ళేటప్పుడు మనం Deposit చేసిన అన్ని Originals వాపసు ఇస్తారు.
పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం – సూర్యాస్తమయ సమయం -సూర్యహారతి
పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం (ఆదిత్య దత్తాత్రేయ క్షేత్రం) లో సూర్యోదయానికెంత ప్రాముఖ్యత ఉందొ, అంతే ప్రాముఖ్యత సుర్యాస్తమయానికి కుడా ఉంది. దీనికి గల కారణం ప్రతిరోజూ సుర్యాస్తమయ సమయంలో ఆదిత్య దత్తాత్రేయుడికి దేవాలయంలో హారతి జరుగుతున్నప్పుడు ‘సూర్యుని అంశ’ (Fire Ball / SiddhaGolam) ఒకటి Simultaneous గా మొత్తం దత్త దేవాలయానికి హారతి ఇస్తుంది. ఈ సూర్య అంశని ప్రతి ఒక్కరు చూడవచ్చు. పైగా ఇక్కడ సుర్యాస్తమయ సమయాన్ని చూడడం కోసం ప్రత్యేకంగా Sunset View Point ను ఏర్పాటు చేసారు. ఈ ‘సూర్యహారతి’ ని దత్తభక్తులందరూసి తరించాల్సిందే! అయితే ఆ సమయానికి అక్కడకి వచ్చే అతి కొద్ది మంది భక్తులు ఆదిత్య దత్తాత్రేయ దేవాలయం లోపల జరిగే హారతిని చూడడానికే ప్రాముఖ్యత ఇస్తారు. ’సూర్యహారతి’ ని చూడడానికి Best Location ఖచ్చితంగా ఆదిత్య దత్తాత్రేయ దేవాలయ వెనుక భాగం.
Click Here To View Kaladungar Sunset Live Video – 1 (By Taarika Mohan) - కాలాడూంగర్ లోని సూర్యాస్తమయ సమయ విడియో-1 ని చూడడం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
Click Here To View Kaladungar Sunset Live Video – 2 (By Keerthi Vallabha Mohan) - కాలాడూంగర్ లోని సూర్యాస్తమయ సమయ విడియో-2 ని చూడడం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం - కాలాడూంగర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు |
---|
పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం - కాలాడూంగర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు |
1. ఎటువెళ్ళినా Original Letter of Entry & దాని Photo Copyలు వెంట తీసుకెళ్ళాలి. |
2. మనకు సంబందించిన అన్నిID Proofలు, Address Proofలు వాటి Photo Copyలు (Minimum 4 Copies of Each Document) వెంటతీసుకెళ్ళాలి. |
3. Sensitive Area లలో BSF వారి Permission తోనే Photos తీసుకోవాలి (లేనిచో Camera Seize చెయ్యబడుతుంది) |
4. War Flights / Fighter Jets / War Equipments ను ఎట్టి పరిస్థితుల్లో Photos తియ్యవద్దు. దగ్గరలో BSF సైనికులు లేకపోయినా CCTV నిఘా ఉంటుందని మర్చిపోవద్దు. |
5. UV Protection వస్తువులు (Goggles, Hat Etc..), Electrol Powder వంటివి దగ్గరుంచుకోవాలి |
పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం చుట్టుపక్కల గల చూడవలసిన ప్రదేశాలు / ఇతర ఆలయాలు
Place | Location |
---|---|
Place | Location |
1. Puraneswar Mandir / Puneshwar Mahadev Mandir | On Bhuj - Nakhatrana Highway |
2. Guru Gorakshanath Temple | Nani-Aral - Dhinodhar Hills (Inactive Valcano) |
3. Kutch Fossil Park | Godhiyar Village, Nakhatrana |
4. Mata - No - Madh ( Ashapura Mata) | Mata-Na-Mad Village |
5. Mandvi Wind Mill Beach | Mandvi |
6. White Desert (White Rann) | Near Bhiranrandiara |
7. Tropic of Cancer Line | Near Loriya Village |
8. Kutch Musium | Bhuj |
9. Swamy Narayana Mandir | Bhuj |
10. Prag Mahal & Aina Mahal | Bhuj |
కాలాడూంగర్ దత్త క్షేత్రాన్ని (పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం) దర్శించిన ప్రముఖులు
- Jai Guru Datta -