నేత్ర Siddhula Navnatha – Armoor (నవనాథ సిద్ధులగుట్ట – ఆర్మూర్)
నేత్ర Siddhula Navnatha – Armoor (నవనాథ సిద్ధులగుట్ట – ఆర్మూర్)
II గోరక్ష-జాలంధర-చర్పటాశ్చ అడ్భంగ-కానీఫా-మత్సేంద్రరాద్యా:
చౌరంగి-రేవాణక-భర్త్రిసంజ్ఞా భూమ్యాంబ భూవు: నవనాధసిద్దా: II
నవనారాయణాంశ సంభూతులే నవనాధులు వారు శ్రీపాద శ్రీ వల్లభుల ఆజ్ఞ మేరకు, శ్రీ కృష్ణావతారం లో చేసిన వాగ్దానం మేరకు భూమి మీద అవతరించారు. ఋషభ చక్రవర్తికి గల 100 మంది కుమారులలో నారాయణాంశ కలిగిన తొమ్మిది మందే ఈ నవనాథులు.వీరంతా అవధూతలు మరియు దత్తాత్రేయుల వారికి ఆప్తులు. వీరిపేర్లు స్మరిస్తే చాలు శ్రీ పాద వల్లభులు సంతుష్టి చెందుతారు. నవనాథుల తో పాటుగా అడ్భంగుడు (కాపువాడు) మరియు మీననాథుడు (మత్సేంద్రనాధుడి కుమారుడు) కుడా నవనాథులు ఎంత ప్రసిద్ధి పొందారో అంతే ప్రసిద్ధిపొందిన వారు. వీరంతా ‘నాథసంప్రదాయం’లో ఉన్నవారు. ఆంధ్రప్రదేశ్ లోని నిజామాబాద్ జిల్లానందు గల ఆర్మూర్ నందు నవనాధ సిద్ధుల ఆలయం కలదు. ఆర్మూర్ (ఆరు + మూడు = ఆర్మూర్) అంటే 9 అనీ, అది నవనాథ సిద్ధులను తెలుపుతుంది. ’నవనాథ సిద్ధులగుట్ట’ గా పిలిచే ఈ ప్రాంతం అతి పవితమైనది మరియు శ్రీపాద భక్తులందరూ దర్శించ వలసిన అరుదైన పుణ్య స్థలమిది. క్రింది పట్టిక ఏ నవనారాయణాంశ ఏ నవనాథుడిగా అవతరించారో తెలుపుతుంది.
నవనారాయణాంశలు | నవనాధులు |
---|---|
కవి | మత్సేంద్రనాధుడి గా |
హరి | గోరక్షనాధుడి గా |
అంతరిక్షుడు | జలంధరనాధుడి గా |
ప్రబుద్ధుడు | కానీఫానాధుడి గా |
పిప్పిలాయనుడు | చర్పటనాధుడి గా |
అవిర్హోత్రుడు | నాగనాధుడి గా |
ద్రమీలుడు | భర్తరినాధుడి గా |
చమనుడు | రేవణనాధుడి గా |
కరభజనుడు | గహనీనాధుడి గా |
నవనాథ సిద్ధులగుట్ట స్థల పురాణం
నవనాథసిద్ధులు మరగుజ్జులుగా మారి సిద్ధులగుట్ట మీదగల రాళ్ళ గుహలలో తపస్సు చేసిన ప్రదేశమిది. నవనాథులందరూ కలసి తపస్సు చేసిన ప్రదేశంలో గల శివలింగం అతి శక్తి వంతమైనది మరియు యుగయుగాల నాటిది. అలాగే మత్చేంద్రనాథుడు ప్రతిష్టించిన అతి మహిమాన్విత శివలింగం కుడా దర్శింపతగినది. ఇదే గుట్ట పైన గల రామాలయం, కోరికలు తీర్చే కొలను, గోశాలలు, దుర్గామాత గుహ కుడా తప్పక చూడవలసినవి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక నవనాథ ఆలయమిది. ఇక్కడి గుహలలో నుండి ఊరె పవిత్ర జలము సర్వవ్యాధి నివారిణిగా పనిచేస్తుంది. శ్రీపాద దత్త భక్తులందరికీ నవనాథసిద్ధుల ఆశీర్వాదములు తప్పక అవసరము, కాబట్టి ఈస్థల దర్శనం అతి విలువైనది, పవిత్ర మైనది.
ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్ట కు చేరే వెనుక వైపు గల దారి
ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్ట పై కనిపించే నవనాథులు
నవనాథ సిద్ధులగుట్ట పై నవనాథులు తప్పస్సు చేసిన ప్రాంతంలో వెలసిన శివలింగం
నవనాథ సిద్ధులగుట్ట పై మత్చేంద్రనాథుడు ప్రతిష్టించిన శివలింగం
కోరికలు తీర్చే కొలను
ట్రెక్కింగ్ ద్వారా వెళ్లి చూడవలసిన రాక్ పిల్లర్స్
’సిద్ధులగుట్ట’ లో ఊరుతున్న సర్వవ్యాధి నివారణాజలం
ఏం తీసుకెళ్ళాలి?
శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేక జలము, పాలు, తేనే, బిల్వం మొదలగునవి తీసుకెళ్ళాలి. శివుని గుహలో కూర్చుని శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం లోని అధ్యాయం 32 ను పారాయణ చెయ్యాలి కాబట్టి శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతాన్ని తప్పక తీసుకుని వెళ్ళాలి.
ఆర్మూర్ చేరాక ఏ రూట్ తీసుకోవాలి?
సొంత వాహనాలలో వెళితే వెనక వైపుగల రూట్ తీసుకుంటే వాహనాలు నేరుగా నవనాథ సిద్ధులగుట్ట మీదకి చేరతాయి. నడుచు కుంటూ వెళ్ళేవారు ముందు వైపు రూట్ తీసుకుని, మెట్లు (సుమారు 100) ఎక్కి నవనాథ సిద్ధులగుట్ట పైకి చేరుకోవచ్చు.
ఎలా సిద్ధం కావాలి?
నవనాథ సిద్ధులగుట్టను పూర్తిగా చూడాలంటే అది వయసులో ఉన్నవారికి మాత్రమే సాధ్యం. కొన్నిచోట్లకు వెళ్ళడం పెద్దవారికి కష్టం. కాబట్టి పెద్ద వారు, చిన్న పిల్లలు గలవారు పైన చెప్పిన ప్రదేశాలను దర్శించవచ్చు. నవనాథ సిద్ధులగుట్టను మొతం చూడాలంటే ట్రెక్కింగ్ కి సిద్ధమైనట్లుగా సిద్ధమావ్వాలి, మంచి కరవని, కొండ రాళ్ల మీద జారకుండా గ్రిప్ ఉండే షూస్, బాక్ ప్యాక్ , మంచి నీళ్ళ బాటిల్ మొదలైనవి వెంట తీసుకెళ్ళాలి.
విషయము | వివరణ |
---|---|
యాత్రకు సరైన సమయం | జూన్ నుండి అక్టోబర్ వరుకు |
హైదరాబాద్ నుండి ఆర్మూర్ కు దూరం | సుమారు 200 కీ.మీ. (ఒక వైపు) |
హైదరాబాద్ నుండి రూట్ | NH-44, బోయినపల్లి ------>సుచిత్రా జంక్షన్ ------> కొంపల్లి -------> మేడ్చల్------>తూప్రాన్ ------> కామారెడ్డి -------->డిచ్ పల్లి -------->ఆర్మూర్ (Four Wheeler వారు మధ్యలో రెండు చోట్ల టోల్ టాక్స్ కట్టాలి. Rs.55 + Rs.110 మొత్తం Rs.165/-వెళ్ళేటప్పుడు మరియు Rs.55 + Rs.110 మొత్తం Rs.165/- వచ్చేటప్పుడు, మొత్తం రెండువైపులా కలిపి Rs.Rs.330/- Two Wheeler వారు ఎటువంటి టోల్ టాక్స్ కట్టనవసరం లేదు) |
ఆర్మూర్ కు దగ్గరలోగల ఇతర దర్శనీయ ప్రదేశాలు | కామారెడ్డి దగ్గర కల రామారెడ్డి గ్రామం (ఈ గ్రామాన్నే ఇస్సన్నపల్లి అనికూడా అంటారు) నందుకల కాలభైరవ దేవాలయము, కామారెడ్డిలో TTD కళ్యాణ మండపం దగ్గరగల SGS వారి నవనాథ పీఠం |
నవనాథుల ప్రాముఖ్యత |
---|
కలియుగంలో మానవులు అల్పాయుష్కులుగా, అధిక రోగాలతో శక్తి హీనులుగా ఉండడం చూసి భరించలేని వీరు మానవులను ఎలాగైనా పూర్వ యుగాలలోని అతి శక్తివంతమైన ఋషులు వంటి వారిగా తీర్చిదిద్దలనన్న సంకల్పంతో శాబర మహర్షి వ్రాసిన మంత్రాలకు (శాబరీ మంత్రాలు) మరికొన్ని మంతాలను చేర్చి మానవాళికి అప్పగించారు. ఆమంత్రాలు పఠించిన మానవులు తమకన్నా శక్తివంతులౌతున్నారని దేవతలు ఆ శాబరీ మంత్రాలను అదృశ్యం చేసారు. నవనాథులు సాక్షాత్తు దత్త అంశలు. వారిని స్మరిస్తే చాలు గ్రహ బాధలు, రోగాలు, అష్టదరిద్రాలు దరిచేరవు. మానవాళి వృద్ధి కోసం తాపత్రయపడే దత్తంశాలే నవనాథులు. |