Oudumbara ట్రీ (ఔదుంబర వృక్షం / మేడి చెట్టు)
Oudumbara ట్రీ (ఔదుంబర వృక్షం / మేడి చెట్టు)
Nomenclature (నామాంక్లేచర్ - నామీకరణము) |
---|
పేరు : మేడి చెట్టు / అత్తి చెట్టు / బొడ్డ చెట్టు / క్షీర వృక్షం / ఔదుంబర వృక్షం / హేమదుగ్ధ వృక్షం / దత్త వృక్షం |
ఇంగ్లీష్ పేరు : క్లస్టర్ ఫిగ్ / రెడ్ వుడ్ ఫిగ్ (Cluster Fig / Red wood Fig) |
శాస్త్రీయ నామము / లాటిన్ పేరు : ఫైకస్ రేసిమోసా / ఫైకస్ గ్లోమేరేటా (Ficus glomerata) |
కుటుంబము : మోరేసీ (Moraceae) |
గురు దత్తాత్రేయులవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబర వృక్షం (మేడి చెట్టు). దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మరూపంలో సుప్రతిష్టితులై ఈవృక్ష మూలమునందు సర్వదా ఉంటారని పైంగ్య బ్రాహ్మణము నందు వివరించబడినది. దత్త భక్తులు ఔదుంబర వృక్షం క్రింద ఉన్నయెడల వారు శ్రీదత్త ప్రభువుల కృపాఛత్రము యొక్క ఛాయలో ఉన్నట్లే . శ్రీపాదుల వారి ప్రకారం ఔదుంబర వృక్షం నుండి ప్రాణశక్తి వెలువడును . అపమృత్యు భయములను పారద్రోలును. శ్రీపాదులవారికి, భక్తులకు మధ్య వారధిగా ఔదుంబర వృక్షం ఉంటుంది. భక్తులు తమకష్టాలను, కోరికలను ఔదుంబర వృక్షంనకు నివేదించిన యెడల అవన్నీనేరుగా శ్రీ పాదుల వారికి చేరుతాయి . దత్త భక్తులకు ఔదుంబర వృక్ష సేవనము అత్యంత ముఖ్యమైనది. ఔదుంబర వృక్షం గృహమునందు ఉన్న సాక్షాత్తు దత్తత్రేయలవారు మనయింట్లో ఉన్నట్టే.
ప్రదక్షణ మరియు పూజించు విధానము:
మంగళ లేదా గురు వారాలు ఔదుంబర పూజకు శ్రేష్టమైన రోజులు. ముందుగా ఔదుంబర వృక్షాన్ని చేతితోతాకి ” గురు బ్రహ్మ..గురు విష్ణుః గురుదేవో…” చెప్పి లేదా మీకు వీలుంటే ఔదుంబర వృక్షాన్ని చేతితోతాకి క్రింది ఔదుంబర పాదుకా స్తోత్రాన్ని లేదా ఔదుంబర స్తుతిని కాని చదవాలి.
ఔదుంబర పాదుకా స్తోత్రం |
---|
|| వందే వాజ్మన సాతీతం నిర్గుణం సగుణం గురుం దత్తమాత్రేయ మానందకందం భక్తేష్టపూరకం || |
|| నమామి సతతం దత్త మౌదుంబర నివాసినం యతీంద్ర రూపంచ సదా నిజానంద ప్రబోధదం || |
|| కృష్ణా యదగ్రే భువనేశాని విద్యానిధి స్తధా ఔదుంబరాః కల్ప వృక్షా: సర్వతః సుఖదా: సదా || |
|| భక్తబృందాన్ దర్శనతః పురుషార్ధ చతుష్టయం దదాతి భగవాన్ భూమా సచ్చిదానంద విగ్రహః || |
|| జాగర్తి గుప్తరూపేణ గోప్తాధ్యాన సమాధితః బ్రహ్మ బృందం బ్రహ్మ సుఖం దదాతి సమద్రుష్టితః || |
|| కృష్ణా తృష్ణా హరా యత్ర సుఖదా భువనేశ్వరీ యత్ర మోక్షదరాద్డత్త పాదుకా తాం నమామ్యహం || |
|| పాదుకారూపి యతి రాన్నరసింహ సరస్వతి రాజతే రాజరాజ శ్రీ దత్త శ్రీపాద వల్లభః || |
|| నమామి గురుముర్తిం తం తాపత్రయహరం హరిం ఆనందమయ మాత్మానం నవభక్త్యా సుఖప్రదం || |
|| కరవీరస్థ విబుధ మూఢపుత్రం వినిందితం ఛిన్న జిహ్వం బుధం చక్రేతద్వన్మయి కృపాంకురు || |
ఔదుంబర స్తుతి |
---|
ఔదుంబర: కల్పవృక్షః కామదేనుశ్చ సంగమః చింతామణిర్గురో: పాదో దుర్లభో భువనత్రయే |
ఔదుంబరానికి నెమ్మదిగా ” దిగంబరా.. దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా.. , దిగంబరా..దిగంబరా..శ్రీ నృసింహ సరస్వతి దిగంబరా.. , దిగంబరా..దిగంబరా..శ్రీ దత్తాత్రేయ దిగంబరా..” అనుకుంటూ, గురుస్తుతి చేస్తూ ప్రదక్షణలు పూర్తిచేయాలి. ప్రతీ ప్రదక్షణకు ముందు, తర్వాత ఔదుంబర వృక్షానికి నమస్కరించాలి. ఔదుంబరానికి కనీసంగా 7 ప్రదక్షణలు, గరిష్టంగా రెండులక్షల వరుకు చేయవచ్చు. శీఘ్ర ఫలితాల కోసం “ఔదుంబర దీక్ష “ ను కూడా చేపట్టవచ్చును. ఔదుంబర వృక్ష పత్రాలతో శ్రీపాదుడుని పూజించిన శ్రీపాదుల వారి అనుగ్రహము శీఘ్రముగా కలుగుతుంది. మొత్తం ప్రదక్షణలు పుర్తైన తరువాత వృక్షానికి 3 లేదా 7 లేదా 9 చిన్న బిందెల లేదా చెంబుల నీళ్ళను పోయాలి.
ఔదుంబర వృక్ష పూజా ఫలము
మేడి చెట్టు భూలోక కల్పవృక్షము. ఈవృక్షము మొదట్లో కూర్చుని చేసే అనుష్టానాలు శీఘ్రఫలప్రదాలవుతాయి. గొడ్రాళ్ళను కూడా సంతాన వంతులను చేసే మహత్తుగల వృక్షమిది. ఔదుంబర మూలమున చేసిన జపఫలము కోటి రెట్లవుతుంది. ఔదుంబరాన్ని పూజించిన మహావ్యాధులు, మహాపాపాలు,మహా దారిద్ర్యాలు, గ్రహదోషాలు వెంటనే తొలగిపోతాయి . ఔదుంబర వృక్షం క్రింద చేసిన శ్రీపాద శ్రీ వల్లభ చరితామృత గ్రంధ పారాయణము లేదా గురు చరిత్ర పారాయణము చెప్పడానికి, వ్రాయడానికి వీలుకానంత ఫలితాన్నిస్తుంది. ఔదుంబర వృక్షం క్రింద చేసిన అనఘస్టమి వ్రతము మరియు శ్రీ సత్య దత్త వ్రతాలు అద్భుత ఫలితాలనుయిస్తాయి. మేడి చెట్టు స్థాపన లెక్కింపలేనంత పుణ్యఫలాన్ని మూటకట్టి మనకు ఇస్తుంది. నిత్యం ఔదుంబరమాల ను ధరించి ఔదుంబర వృక్షాన్ని పూజిస్తే ఎలాంటి పనినైనా సులభంగా, విజయవంతంగా పూర్తిచేయవచ్చు. ఒట్టిగా సిద్ధమంగళస్తోత్రాన్ని ఒకసారి పఠిస్తేనే 1000 మంది సద్భ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేసిన పుణ్యం దక్కుతుంది. అలాంటిది సిద్ధమంగళస్తోత్రాన్ని ఔదుంబర వృక్షం క్రింద చదివితే ఎంతటి పుణ్యఫలాన్నిస్తుందో చెప్పగలమా?