Sakuri Ekamukha Dattatreyudu
కలలను సాకారం చేసే ‘సాకురి’ ఏకముఖ దత్తాత్రేయుడు
Sakuri Ekamukha Dattatreya
ఓం గురు జయ గురు… ఓం గురు శివ గురు… ఓం గురు శక్తి గురు… జేయజై…
క్రీ.శ.1925 సంవత్సరం లో గ్వాలియర్ మహారాణి వారు శ్రీ ఉపాసిని బాబా వారి దర్శనానికి సాకురి / సాకోరి వచ్చారు. దర్శనానంతరం శ్రీ ఉపాసిని బాబా వారు గ్వాలియర్ మాహారాణి తో ”ఇక్కడొక ఏకముఖ దత్త దేవాలయముంటే బాగుంటుంది” అన్నారు. దానికి సమ్మతించిన గ్వాలియర్ మహారాణి వెంటనే శ్రీ వాలింబే అనే సివిల్ ఇంజనీర్ ను పిలిపించి ఏకముఖ దత్త దేవాలయ నిర్మాణ పనిని అప్పగించారు. సాకురి ఏకముఖ దత్త దేవాలయ క్రీ.శ. 1925 నుండి క్రీ.శ. 1927 వరుకు జరిగింది. నిర్మాణానంతరం అక్కడ ఎటువంటి దత్తాత్రేయ విగ్రహాన్ని ప్రతిష్టించలేదు. కేవలం 24 గంటలూ దత్తనామస్మరణ జరుగుతూ ఉండేది. అందువల్లే అప్పట్లో ఈ దేవాలయం రోజులో అన్ని వేళలా తెరిచే ఉండేది. అదే సంప్రదాయాన్ని నేటికీ పాటిస్తున్నారిక్కడ. తదుపరి క్రీ.శ.1943 వ సంవత్సరం పుష్యమాసంలో ఇప్పుడు మనం చూస్తున్న ఏకముఖ దత్తాత్రేయ విగ్రహం శాస్ర్తోక్తంగా ప్రతిష్ట గావింపబడినది. అత్యంత ఆశ్చర్యకరంగా ఏకముఖ దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ట అనంతరం ప్రతీ సంవత్సరం సూర్యుడు కుంభ – మీన రాశులలోకి సంచయనం చెందేటప్పుడు (సాదారణంగా ఈ ఘటన మార్చ్ / ఏప్రిల్ నెలలలో జరుగుతుంది) అదేవిధంగా సూర్యుడు సింహ – కన్యా రాశులలోకి సంచయనం చెందేటప్పుడు (సాదారణంగా ఈ ఘటన సెప్టెంబర్ / అక్టోబర్ నెలలలో జరుగుతుంది) సూర్య కిరణాలు నేరుగా ఏకముఖ దత్తాత్రేయ విగ్రహ నుదుటపై పడతాయి. ఈ అరుదైన సూర్య భగవానుని విన్యాసం ఇక్కడ తప్పక చూసితీరవలసినది. ఆసమయంలో ఇక్కడ గల ఏకముఖ దత్తాత్రేయ విగ్రహం మెరిసిపోతూ అతి శక్తివంతంగా కనిపిస్తుందట. ఈఒక్క ఘటనే కాదు సాకురి ఏకముఖ దత్త క్షేత్రంలో ఈ క్రింది అనేకానేక ప్రత్యేకతలుకలవు.
సాకురి ఏకముఖ దత్తక్షేత్ర ప్రత్యేకతలు…
సాకురి ఏకముఖ దత్తక్షేత్ర ప్రత్యేకత |
---|
సాకురి ఏకముఖ దత్తక్షేత్ర ప్రత్యేకత |
1. ప్రపంచంలో అతిపెద్ద దత్తయంత్రం గల దత్త క్షేత్రం |
2. ప్రపంచపు ఏకైక హనుమద్సహిత ఏకముఖ దత్త క్షేత్రం |
3. సూర్య కిరణాలు నేరుగా దత్తాత్రేయుని నుదుటమీద పడే ఏకైక దత్త క్షేత్రం |
4. రోజులోని అన్ని సమయాలలో తెరిచి ఉంచే ఏకైక దత్త క్షేత్రం |
5. అన్ని అవతార రూపాలలో చక్కగా ఇమిడిపోగల ఏకైక ఏకముఖ దత్తాత్రేయ విగ్రహం కలిగిన దత్త క్షేత్రం |
6. దత్త శునకాలకు (కుక్కలకు) పూజ చేసే ఏకైక దత్త క్షేత్రం ఇక్కడ చేసే దత్త శునక పూజను 'Sri Shwan Pujan' అంటారు |
7. వ్యాధుల నుండి కాపాడే 'మహమ్మారి శివుడు' (ఈయననే ప్లేగు దేవుడు అనికూడా అంటారు) గల ఏకైక దత్త క్షేత్రం |
8. దత్తహోమాలు, దత్తపూజలు చేసే స్త్రీ పుజారుగల ప్రపంచంలోని ఏకైక దత్త క్షేత్రం |
సాకురి ఏకముఖ దత్త క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి?
By Public Transport / By Own Transport (షిర్డీ Sakuri విలేజ్ : 05KMs - 10 min. Journey) |
---|
By Public Transport / By Own Transport (షిర్డీ Sakuri విలేజ్ : 05KMs - 10 min. Journey) |
షిర్డీ ---- & gt; లైవ్స్ ---- & gt; వీరభద్ర సొంత ఆలయం ---- & gt జీవిస్తాడు; Skuri ---- & gt; బాబా Upasini Asrmm ---- & gt; Akmuk దత్తాత్రేయ ఆలయం (షిర్డీ ఆధారపడి : ఆటో Riksha ఛార్జ్ రూ .10 పంచుకోవడం ద్వారా /- కాబట్టి చీఫ్ Getdun ఆలయం ---- & gt తాను ఉంచుతుంది; టువార్డ్స్ Upasini బాబా Asrmm వల్క్ 1 KM దూరం / 10 min. Walkable Distance) |
సాకురి ఏకముఖ దత్త క్షేత్ర దర్శనానికి అనువైన సమయం…
సాకురి ఏకముఖ దత్తక్షేత్రాన్ని Shirdi క్షేత్రం నుండి రెండు గంటల్లో దర్శించుకొని రావచ్చు, మరియు ఈ క్షేత్ర దర్శనానికి అన్ని కాలాలు అనువైనవే. Shirdi Main Road నుండి Sharing Auto Riksha లు దొరుకుతాయి. అవి ఎక్కి Rahata Virabhadra Swamy Temple దగ్గర దిగి, Rahata Virabhadra Swamy Temple లోపలే గల Lotus Dattarreya Temple ను దర్శించుకొని అక్కడనుండి 10 నిముషాల నడక ద్వారా సులభంగా సాకురి ఏకముఖ దత్త క్షేత్రాన్ని చేరుకోవచ్చు. అలాగే శ్రీపాద శ్రీవల్లభ జయంతి రోజూ, గురుపౌర్ణమి రోజూ, నృసింహసరస్వతి స్వామి జయంతి రోజూ మరియు దత్త జయంతి రోజు ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ప్రత్యేక రోజులలో ప్రత్యేక అలంకారాలలో కనిపించడం ఇక్కడి ఏకముఖ దత్తత్రేయుడి ప్రత్యేకత.
సాకురి ఏకముఖ దత్త క్షేత్రంలో ఎక్కడ ఉండాలి?
సాకురి ఏకముఖ దత్తాత్రేయ క్షేత్రాన్ని Shirdi క్షేత్రం నుండి కేవలం రెండు గంటలలో దర్శించుకొని రావచ్చు. సాధారణంగా భక్తులు Shirdi లో Accommodation తీసుకుని అక్కడి దర్శనానంతరం సాకురి ఏకముఖ దత్తాత్రేయ క్షేత్రాన్ని దర్శిస్తారు,te. అయితే సాకురి ఏకముఖ దత్త క్షేత్రం లో కుడా ఉండడానికి Bhakth Niwas అనే వసతీ గృహం కలదు. నామమాత్రపు రుసుముల చెల్లింపుతో ఇక్కడ కుడా భక్తులు ఉండవచ్చు.
సాకురి ఏకముఖ దత్త క్షేత్రం చుట్టుప్రక్కల గల చూడవలసిన ఇతర ఆలయాలు / ప్రదేశాలు
సాకురి ఏకముఖ దత్త క్షేత్రం చుట్టుప్రక్కల గల చూడవలసిన ఇతర ఆలయాలు / ప్రదేశాలు |
---|
సాకురి ఏకముఖ దత్త క్షేత్రం చుట్టుప్రక్కల గల చూడవలసిన ఇతర ఆలయాలు / ప్రదేశాలు |
1. శ్రీ ఉపాసిని బాబా ఆశ్రమం |
2. శ్రీ ఉపాసిని బాబా ఆశ్రమంలోని సహజ గణపతి |
3. శ్రీ ఉపాసిని బాబా ఆశ్రమంలోని పార్థివలింగాలు |
4. Rahata Virabhadra Swamy Temple ప్రాంగణం లోగల 'Lotus Dattatreya Temple' |
5. Rahata లోగల Navanatha Shiddha Temple |
సాకురి ఏకముఖ దత్తక్షేత్ర ఫోటోలు
సాకురి ఏకముఖ దత్త క్షేత్రం చుట్టు ప్రక్కలగల ఉతర దర్శనీయ ప్రదేశాల ఫోటోలు
సాకురి ఏకముఖ దత్తక్షేత్ర యాత్రలో ఉపయోగపడే ఇతర సమాచారం
సాకురి ఏకముఖ దత్తక్షేత్ర యాత్రలో ఉపయోగపడే ఇతర సమాచారం |
---|
సాకురి ఏకముఖ దత్తక్షేత్ర యాత్రలో ఉపయోగపడే ఇతర సమాచారం |
Postal Address: Ekamukha Dattatreya Devasthan, Sri Upasini Baba Ashram, Sakuri - 423107, Rahata TQ, Ahmednagar Dist Ph: 02423 - 242173 |
Sakuri Ekamukha Dattatreya Temple Bhakth Niwas Booking Ph: Sri Vijay Kulkarni : 098221 99073 |
Sri Upasini Baba Ashram - Hyderabad Branch Address: Sri Upasini Baba Ashram, Errakunta, Near Pahadi Shareef, హైదరాబాద్. Ph: 098666 47918 |