Sri Deva Deveshwara Mandiram
శ్రీ దేవదేశ్వర మందిరం – మయూర క్షేత్రం
(Sri Deva Deveshwara Mandiram – Mayura Kshetram)
కాశీస్నానజప ప్రతిదివసీ..కొల్హాపురభిక్షేసీ నిర్మలనదితుంగా!.. జలప్రాసీ నిద్రామాహురదేశీ…
మయూర క్షేత్రం /మాహూర్యం/మాతృపురం/మాతృపట్నం/మాహూర్ అనగానే మనకి గుర్తొచ్చేది రేణుకా అమ్మవారి శక్తి పీఠము, అదేవిధంగా దత్తాత్రేయుని ‘నిద్రాస్థానం.’ అలాగే ‘అనసూయమాతశిఖరం’ (AnasuyaGhad – అనసూయఘడ్) మరియు ‘దత్తాత్రేయశిఖరం’ (DattaGhad – దత్తఘడ్) కుడా దత్తభక్తులకు సుపరిచితమే! చాలామంది దత్తభక్తులు ‘దత్తాత్రేయుని నిద్రాస్థానం’ మాహూర్ కొండమీద గల ‘దత్తాత్రేయశిఖరం’ (దత్తఘడ్) అని అనుకుంటారు. కానీ కాదు. దత్తాత్రేయుని నిద్రాస్థానం మాహూర్ Bus Stand ఎదురుగా ఉన్న సందులో ఒక అర కిలోమీటర్ దూరంలో ఉన్న ‘శ్రీ దేవదేశ్వర మందిరం (Sri DevadeveshwaraMandir)’ అన్న విషయం చాలామంది దత్తభక్తులకు తెలియదు. మాహూర్ Bus Stand నుండి కాలి నడకన సులభంగా చేరగల దివ్య ప్రదేశమిది. గురు దత్తాత్రేయుల వారు వారి దినచర్యలో భాగంగా ఎక్కడున్నా రాత్రికి మాహూర్ లోగల శయనమందిరానికి వస్తారు. దత్తాత్రేయుల వారి శయనమందిరాన్నే”శ్రీ దేవదేశ్వర మందిరం” అంటారు. మాహూర్ పర్వత పాదాల వద్దగల ఈ ‘దేవదేశ్వర మందిరం’ వద్ద రాత్రి బస చేస్తే దత్తభక్తులకు చాలామంచిది. మాహూర్ క్షేత్రాన్ని దర్శించే దత్తభక్తుల్లో 98% ఇక్కడకి వెళ్ళరు. భక్తులకు ఈ దివ్య ప్రదేశం గురించి తెలియజెప్పడం కోసమే ఈ శీర్షికకు “శ్రీ దేవదేశ్వర మందిరం – మయూర క్షేత్రం” అని పేరు పెట్టడం జరిగింది. మాహూర్ క్షేత్ర యాత్రకు వెళ్లాలనుకుంటున్న దత్తభక్తులు ఇకపై శ్రీ దేవదేశ్వర మందిరాన్ని తప్పక దర్శిస్తారని ఆశిస్తున్నాను.
ఎలా చేరుకోవాలి?
రైలులో(ప్రజా రవాణా) - 17405 / కృష్ణా ఎక్స్ప్రెస్ (మొత్తం 430 KMs - 10 గంటల ప్రయాణం) |
---|
రైలులో(ప్రజా రవాణా) - 17405 / కృష్ణా ఎక్స్ప్రెస్ (మొత్తం 430 KMs - 10 గంటల ప్రయాణం) |
Secunderabad Station ----> Malkajgiri ----> Bolarum ----> Kamareddi ----> Nizamabad ----> Basar ----> Kinwat Railway Station ----> Kinwat Bus Stand ----> Mahur By Bus |
By Own Transport (450 KMs - 9 Hours Journey) |
---|
By Own Transport (450 KMs - 9 Hours Journey) |
Secunderabad ----> Suchitra ----> Kompally ----> Medchal ---->Tupran ----> Ramayampet ----> Dichpally ----> Armoor ----> Neredgonda ----> Kangutta ----> Gokunda ----> Kinwat ----> Malwada ----> Mahur |
మాహూర్ క్షేత్ర దర్శనానికి అనువైన సమయం…
మాహూర్ క్షేత్రం పెన్ గంగా (పంచగంగ) నది ఒడ్డునగల గొప్ప శక్తిపీఠము. మాహూర్ క్షేత్రం ఒక్కరోజులో దర్శించుకొని రావచ్చు. మాహూర్ క్షేత్ర దర్శనానికి అన్ని కాలాలు అనువైనవే. కాని అత్యంత అనువైన సమయం మాత్రం శీతాకాలం. శీతాకాలంలో మాహుర్ పర్వత శ్రేణులు (సహ్యాద్రి పర్వతాలు) అతిసుందరంగా ఉంటాయి. సాధారణంగా భక్తులు శనివారం రాత్రి 9:00 గంటల ట్రైన్ కి బయలుదేరి (17405 – కృష్ణా ఎక్స్ప్రెస్. Krishna Express బాసర్ వరుకు తెలంగాణా రాష్ట్రంలో ప్రయాణించి, బాసర్ తరువాత మహారాష్ట్ర లో Kinwat వరుకు ప్రయాణించి తిరిగి తెలంగాణా రాష్ట్రం ఆదిలాబాద్ లో ప్రవేశిస్తుంది) ఉదయం 5:00 గంటలకల్లా కిన్వట్ (Kinwat To Mahur First Bus At 06:00 పోస్ట్ : Kinwat – Nagpur Via: Mahur) చేరుకొని అక్కడనుండి ఉదయం 7:00 గంటలకల్లా మహూర్ చేరి అక్కడ కాలకృత్యాలు తీర్చుకొని, పొద్దున్న నుండి సాయంత్రం 04:00 గంటల వరుకు మాహుర్ లో వివిధ ప్రదేశాలు దర్శించుకొని, మహూర్ నుండి సాయంత్రం 04:30 కు బయలుదేరే బస్సులో కిన్వట్ కు చేరి రాత్రి 09:00 గంటలకు కిన్వట్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే ట్రైన్ ను (17406 – కృష్ణా ఎక్స్ప్రెస్) పట్టుకొని సోమవారం ఉదయం 05:00 గంటల కల్లా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కానీ మహూర్ ఘడ్ లోని అన్ని ప్రదేశాలను వివరంగా చూడాలంటే కనీసం అక్కడ ఒకరోజైనా ఉండాలి.
మాహూర్ క్షేత్రంలో ఎక్కడ ఉండాలి?
మాహూర్ క్షేత్ర దర్శనానికి వచ్చేవారు Kinwat (కిన్వట్) లో లేదా Mahur Town (మహూర్ టౌన్ – Main Road) లో వసతిని తీసుకోవచ్చు. Kinwat లో అయితే Kinwat Railway Station బైట కుడిచేతి వైపు Hotel Anmol (Ph: 02469-222869) అనే లాడ్జి ఉంది. Anmol లాడ్జి లో Common Beds అలాగే Rooms దొరుకుతాయి. Maintenance మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. Kinwat ఒక మండల్ ఏరియా అంతకు మించి అక్కడ సౌకర్యాలు దొరకవు. ఉదయం సరిగ్గా 08:00 గంటలకు Anmol లాడ్జి ఎదురుగుండా Kinwat Railway Station To Mahur – MSRTC Bus (Rail Link Bus) వస్తుంది. అదేక్కితే ఉదయం 10:00 గంటలకల్లా మనం Mahur చేరుకోవచ్చు. తిరిగి సాయంత్రం Anmol Lodge కి వచ్చి రాత్రి 08:45 వరుకు లాడ్జిలో రెస్ట్ తీసుకోని Railway Station పక్కనే కాబట్టి Train రావడానికి 10 నిముషాలముందు Railway Station కి వెళితే సరిపోతుంది.
గమనిక: Kinwat లో ఎంతమందికి వసతి కావాలో, వారందరి ID Proofలు Submit చెయ్యాలి. కాబట్టి ప్రతి ఒక్కరు (ఆడవారైనప్పటికీ) వారివారి Photo ID Proof తీసుకోని వెళ్ళడం మరిచిపోవద్దు.
మాహూర్ క్షేత్ర దర్శనానికి వచ్చే వారికి మరొక అనువైన వసతీ సౌకర్య ప్రదేశం మాహూర్ టౌన్ (Main Road). ఇక్కడ అనేక రకాలైన Star Hotels & Lodges భక్తులకు అందుబాటులో గలవు.
Best Hotels In Mahur |
---|
Best Hotels In Mahur |
Hotel Devi Pride,Opp: SBI, Near Bus Stand, Mahur. Ph: 02460 - 268122 (Online Booking Available : www.mahurhoteldevipride.com) |
Sahyadri Resort, T-Point, Pusad Road, Mahur. Ph: 02460 –268651 |
Renuka Bhakt Niwas, 1 KM Away From Bus Stand, Mahur. Phone: 02460-268416 (Cheap & Best Accommodation In Mahur) |
EkVira Dham, Main Road, Mahur. Phone: 02460- 268680 |
మాహూర్ క్షేత్రం లో చూడవలసిన ప్రదేశాలు / ఆలయాలు
(A) ఏకవీరాదేవి ఆలయం - హివర
ఏకవీరాదేవి ఆలయం నాందేడ్ – మాహూర్ హైవే కు దగ్గరగా ఉంది. ఇది మాహూర్ Bus Stand నుండి 10 KMs దూరం లో ఉంది. నాందేడ్ – మాహూర్ హైవే దిగిన తరువాత లోపలకి అర కిలోమిటర్ చిన్న రోడ్డులో ప్రయాణిస్తే ’హివర’ అనే గ్రామంలో ఏకవీరాదేవి ఆలయం కనిపిస్తుంది. మాహూర్ Bus Stand నుండి ఏకవీరాదేవి ఆలయానికి Rs. 250/-కు రాను-పోను Sharing Auto Riksha లు అందుబాటులో ఉంటాయి. చాలామంది ఆధ్యాత్మికవేత్తల ప్రకారం హివరలో ఉన్న ఏకవీరాదేవే అసలైన శక్తి పీఠమని అభిప్రాయం. అందువల్ల భక్తులందరూ ఖచ్చితంగా దర్శించవలసిన ప్రదేశమిది.
(B) రేణుకామాత ఆలయం
రేణుకామాత ఆలయం కుడా శక్తి పీఠమే! మాహూర్ యొక్క ప్రధాన దేవాలయం రేణుకామాత ఆలయం. ఇక్కడ ఇతర ఆలయాలకు భిన్నంగా అమ్మవారికి ‘సుపారి’ (తాంబూలం) ని ప్రసాదంగా పెడతారు. ముందుగా తమలపాకులు, వక్కలు ఇతర సామాగ్రి కొని దర్శనం ‘క్యూ’లో నిలబడాలి, తరువాత దానిని అక్కడ సుపారి ప్రసాదం తయారు చేయడానికి (దంచడానికి) ఇవ్వాలి. ఆఖరుగా రేణుకామాత ఆలయం లోకి ప్రవేశించే ముందు తాంబూలం దంచినందుకు Rs.20/- ఇచ్చి ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించాలి.
(C) అనసూయ – అత్రి ఆలయం ( ‘అనసూయమాత శిఖరం’ – అనసూయఘడ్)
అనసూయ మాత మరియు ఏకముఖ షట్భుజ బాలదత్తత్రేయుడి తో పాటుగా ఈ శిఖరం పై అత్రి మహర్షి ఆశ్రమాన్ని కుడా చూడవచ్చు. దత్త భక్తులకు ముఖ్యమైన దర్శనీయ ప్రదేశమిది. ఇక్కడే దేవతలూ, మహర్షులూ వాడిన పురాతన పాత్రలను చూడవచ్చు.
(D) దత్తాత్రేయ ఆలయం / దత్తాత్రేయ టేకడి ( ‘దత్తాత్రేయ శిఖరం’ - దత్తఘడ్)
దత్తాత్రేయ ఆలయం / దత్తాత్రేయ టేకడి ( ‘దత్తాత్రేయ శిఖరం’ - దత్తఘడ్) అనేది సహ్యాద్రి లోని దత్తాత్రేయుని ఆవాస ప్రాంతం. ఇక్కడ ఏకముఖ దత్తాత్రేయుడు కేవలం శిరస్సు వరుకు మాత్రమే కనిపిస్తాడు. ఇక్కడ దత్తాత్రేయుడు కూర్చునే సింహాసనం కుడా ఉంది. అతి శక్తి వంతమైన ప్రదేశమిది. దత్త భక్తులకు అతి ముఖ్య స్థానమిది.
(మరియు) పరశురామ మందిరం
పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారము. పరశురాముడు త్రేతాయుగంనకు చెందినవాడు మరియు జమదగ్ని యొక్క కుమారుడు. పరశురాముని తల్లి ‘రేణుక దేవి’. పరశురామ వృత్తాంతం జరిజిన ప్రదేశమే పరశురామ మందిరం. ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనది మరియు చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినది. పరశురామునికి దత్తాత్రేయుడు భోదించిన (పరశురాముని గురువు దత్తాత్రేయుడు) భోధనలన్ని ‘త్రిపురారహస్య’ అనేపేరుతో అధిక ప్రముక్యతను సంతరించుకున్నాయి.
(F) మాతృతీర్ధం
మాతృతీర్ధం అనేది ‘గురుచరిత్ర’ లో చెప్పబడిన అతి పవిత్ర తీర్ధం. గురుచరిత్ర ప్రకారం ఇక్కడ పరశురాముడు వారి తండ్రిగారైన ‘జమదగ్ని’ కి ఉత్తరక్రియలను నిర్వహించినట్లుగా చెప్పబడినది. దత్త భక్తులందరూ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశమిది.
(G) శ్రీ దేవదేశ్వర మందిరం
మాహూర్ Bus Stand ఎదురుగా ఉన్న సందులో ఒక అర కిలోమీటర్ దూరంలో ఉన్న ‘శ్రీ దేవదేశ్వర మందిరం’(Sri DevadeveshwaraMandir) దత్తాత్రేయుని నిద్రాస్థానం. ఈ ప్రదేశం గురించి ఈ శీర్షికలో ముందుగానే చెప్పుకున్నాము.
(H) మాహూర్ కోట
మాహూర్ ఘడ్ కోట చూడ చక్కని ప్రదేశం. మాహూర్ ఘడ్ కోట చూడాలంటే అనేక మెట్లు ఎక్కిదిగవలసి ఉంటుంది. ఇక్కడ అప్పటి ఆర్కిటెక్చర్, వాస్తు పరిజ్ఞానం విస్తుకొలిపేవిగా ఉంటాయి. ఈ కోటలోనే మాహాకాళీమాత దేవాలయం కుడా కలదు. మంచి ఫోటో & షూటింగ్ స్పాట్ ఇది.
(I) మాహూర్ మ్యూజియం
మాహూర్ మ్యూజియం ఎదురుగా ఉన్న సందులో శ్రీ దేవదేశ్వర మందిరం వెళ్ళే రోడ్డులో ఉంది. ఇక్కడ మాహూర్ ను పాలించిన రాజుల జీవనశైలికి సంబంధించిన భద్రపరచిన వస్తువులతో పాటుగా అప్పటి యుద్ధాలలో వాడిన వివిధ ఆయుధాలను చూడవచ్చు.
(J) పాండవలెన్ని(గుహలు)
పాండవలెన్నిగుహలు Mahur Bus Stand వెనుక గల రోడ్డులో దాదాపు 3 KMs దూరంలో ఉన్నాయి. వీటిని చేరుకోవాలంటే లోకల్ ఆటోరిక్షాలను రాను-పోను మాట్లాడుకొని వెళ్ళవలసి ఉంటుంది.
(K) అంకేశ్వర్ & శరభంఘ్ ఆశ్రమం
అంకేశ్వర్ (Unkeshwar) క్షేత్రం కిన్వట్ (Kinwat) కు 15 KMs దూరంలో గలదు. ఇక్కడ ఒకప్పుడు “శరభంఘుడు” అనే రుషి ఉండేవాడు అతను సోరియాసిస్ (Psoriasis) అనే చర్మవ్యాధితో బాధపడేవాడు. అంతటి బాధలో కుడా ప్రదోష శివార్చన చేసేవాడు. ఆ వ్యాధితోనే సీతారాములను తన ఆశ్రమానికి ఆహ్వానించి ఆతిధ్యమిస్తాడు. అతని ఆతిధ్యానికి మెచ్చి శ్రీ రాముడు తన బాణంతో కొట్టగా అక్కడ ఒక ఉష్ణకుండం ఏర్పడగా అందులో స్నానమాచరించిన శరభంఘుడుకి చర్మవ్యాధి తగ్గుతుంది. ఇప్పటికీ ఇక్కడ అనేక వ్యాధులను ఈ కుండంలో గల జలం తోనే తగ్గిస్తారు. ఈ ఉష్ణ కుండంలో గల నీరు ఎల్లప్పుడూ 50°C వేడిగాఉండి నురుగులు కక్కుతూ పొగలతో ఉంటుంది. భక్తులందరూ తప్పక దర్శించవలసిన ప్రదేశమిది. పూర్తి వివరాలకు http://www.sharabhanghashram.com/?page_id=2 పై Click చెయ్యండి.
మాహూర్ క్షేత్రయాత్రలో ఉపయోగపడే ఇతర సమాచారం
విషయం | వివరణ |
---|---|
విషయం | వివరణ |
Local Taxi | మిస్టర్. Raju, Ph: 09545288901 |
Maha Puja & Abhishekam | Sri. Baliram Vilas, Ph: 09421871071 / 02460268452 |
Normal Puja In All Temples | Sri. Aravind Deo, Ph:02460268403 / Sri. Chandrakanth, Ph:02460268401 |
Local Sharing Auto Riksha Facility | 1.మాహూర్ Bus Stand లో దిగాక 3 ప్రదేశాలు (రేణుకా మాత దేవాలయం, అనసూయఘడ్ & దత్తఘడ్) చూపించి మళ్లీ మాహూర్ Bus Stand కు తీసుకురావడానికి (రాను-పోను) షేరింగ్ ఆటో కి Rs.50/- Per Head తీసుకుంటారు. 2. హివర లోని ఏకవీరాదేవి మాత ఆలయం చూపించి మళ్లీ మాహూర్ Bus Stand కు తీసుకురావడానికి (రాను-పోను) షేరింగ్ ఆటో కి Rs. 250/- తీసుకుంటారు. 3.పాండవలెన్ని(గుహలు) చూపించి మళ్లీ మాహూర్ Bus Stand కు తీసుకురావడానికి (రాను-పోను) షేరింగ్ ఆటో కి Rs.150/- తీసుకుంటారు. |
MSRTC Local Tour Bus | కేవలం Rs.12/- Ticket తో మాహూర్ క్షేత్రం లో అన్నీప్రదేశాలను చూపిస్తారు. కాని ఈ Bus Specific Time లోనే ఉంటుంది. వివరాలకు Mahur Bus Stand లో విచారణ చెయ్యండి. |