Vadhuryangram
క్షేత్రమని ద్వారా నరసింహ – Papanaasha Tirtham, Vadhury nagaram (Bidar)
నరసింహ ద్వయ క్షేత్రం – పాపనాశతీర్థం, వైఢూర్య నగరం (బీదర్)
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే.. దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా..దత్త బంధువులందరికీ జై గురుదత్త..శ్రీ నృసింహ సరస్వతి మహారాజ్ కి జై..
కలియుగంలో భక్తజనోద్ధరణ కోసం ద్వితీయ సంపూర్ణ దత్తావతారంగా వచ్చిన వారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి. శ్రీ నృసింహ సరస్వతి స్వామి సన్యాస దీక్ష తీసుకున్న తదుపరి, వారి యాత్రలో భాగమైన ‘పాపనాశతీర్థం (Papanaash Tirtham)’ గురించిన ప్రస్తావన శ్రీగురుచరిత్రలో 50వ అధ్యాయంలో (SriGuru Charitra : 50th Adhyaayam) విపులంగా వివరించబడిఉంది. అహ్మద్-ఇ బహమనీ సుల్తాన్ అల్లాఉద్దీన్ అప్పటి అయిన (పూర్వం శ్రీపాదుల వారి కాలంలో ఇతడు ఒక రజకుడు – 9వ అధ్యాయం: శ్రీగురు చరిత్ర) యొక్క ఆహ్వానము మేరకు ఈ తీర్థానికి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు వచ్చి ఇక్కడ నుండి అతి దగ్గరలోగల,te, Bahamani Sulthan రాజ్య రాజధాని అయిన ’వైఢూర్య నగరానికి (Bidar)’ వెళ్లి వారి ఆతిధ్యం స్వీకరించారు. అటువంటి పవిత్రమైన, శ్రీగురుని యొక్క పాదస్పర్శతో పునీతం కాబడిన “పాపనాశ తీర్థ క్షేత్రం” వైఢూర్య నగరం (బీదర్) లో ఉందని తెలుసుకుని అక్కడకి వెళ్లి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు అనుష్టానం, జపము మరియు తపము చేసుకున్న కొండగుహను దర్శించుకొని శ్రీగురుని ఆశీస్సులు పొందడం జరిగింది,te. నేను ఇక్కడకు రావడానికి కారణం మరియు ఈ ప్రదేశం యొక్క వివరాలు నాకు తెలియడానికి కారణం ప్రత్యక్షంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారైతే,te… పరోక్షంగా THE HINDU News Paper (Karnataka Edition).
నేను వైఢూర్య నగరం (బీదర్) లోని Papanaash Kshetram చేరిన తదుపరి అక్కడ గల పూజారులను అక్కడే ఉన్న ఇతర స్థానికులను “శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు జపము/అనుష్టానం చేసుకున్న గుహ ఎక్కడ ఉంది?” అని అడగడం జరిగింది. అక్కడి వారు “శ్రీ నృసింహ సరస్వతి స్వామి” అనగానే “Bidar లోనే ఉన్న ఝరని నారసింహ స్వామి (Jharani Naarasimha Swamy)” వారి వివరాలను చెప్పారు. నేను మళ్ళీ దత్తాత్రేయులవారి ద్వితీయ అవతారమైన ”నృసింహ సరస్వతి స్వామి” అని Particular గా అడగగా వారెవరో మాకు తెలియదనీ, ఇక్కడ అటువంటి వారు అనుష్టానం చేసుకున్న గుహలు గట్రా లేనేలేవని చెప్పారు.
నేను వెంటనే నాతో పాటు తీసుకెళ్లిన THE HINDU News Paper ను అక్కడి వారికి చూపగా “ఈ ప్రదేశం భవాని మాత పరిసర ప్రాంతంలో ఉంది” అని కొబ్బరికాయలు అమ్మే ఒకేఒక మహిళ మాత్రమే గుర్తుపట్టి చెప్పింది,te. వెంటనే అక్కడికి వెళ్లి అక్కడ గల ఒక సన్యాసిని (A Female Mendicant) ని అడుగగా ఆవిడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు జపము/అనుష్టానం చేసుకున్న గుహ,te, వారి విగ్రహం మొదలైనవన్నీ దగ్గరుండి చూపించారు. ఆ ప్రాంతమంతా ఇప్పటికీ దట్టమైన వృక్షాలతో పొద్దున్నపూట కూడా సాయంసంధ్యవేళలా అనిపించేటట్లుగా ఉంది,te. THE HINDU లో వచ్చిన Article ప్రకారం ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు కూడా జపము/అనుష్టానం చేసుకున్నట్లుగా ఉంది,te. కానీ శ్రీపాదుల వారికి సంబంధించిన వివరాలేవీ ఇక్కడ వారి నుండి నాకు లభించలేదు,te. అతి పవిత్రమైన మరియు అద్భుతమైన ఈ క్షేత్రాన్ని చూసి ఎంతో తృప్తి చెందాను,te. ఎంతో పవిత్రమైన సాక్షాత్తు శ్రీగురుడు నడయాడిన ఈ ప్రదేశాన్ని దత్త భక్తులందరూ తప్పక దర్శిస్తారని ఆశిస్తూ…అదేవిధంగా ఈ క్షేత్రానికి దగ్గరలోగల అతి పవిత్రమైన,te, శ్రీ మాణిక్ ప్రభువుల వారు సైతం విచ్చేసి, కొలిచిన ఝరని నారసింహ స్వామి (Jharani Naarasimha Cave Temple) వారి క్షేత్రాన్ని కూడా దర్శించి (అందువల్లనే ఈ Article కు “క్షేత్రమని ద్వారా నరసింహ” అనే Title పెట్టడం జరిగింది)… ఇరువురి ఆశీస్సులకు పాత్రులుకావాలని కోరుకుంటూ …
జై గురు దత్త
-కీర్తి వల్లభ (keerthivallabha@gmail.com)
పాపనాశతీర్థం ఎక్కడ ఉంది?
శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు అనుష్టానం చేసుకున్న ప్రదేశం పాపనాశతీర్థం. శ్రీగురుడి అనుష్టాన ప్రదేశం మరియు గుహ (లేటరైట్ రాళ్లతో ఏర్పడిన గుహ) Bhawani Maatha దేవాలయ ప్రాంగణంలో కలవు. ఈప్రదేశం Bidar Town కు 5KMs దూరంలో ఉంది. ఇక్కడ ‘పాపనాశతీర్థం’ అనబడే పాపాలను ప్రక్షాళన చేయగల ఒక కోనేరు (Koneru / అన్ని వైపులా నిర్మించారు స్టెప్స్ తో చెరువు) మరియు Papanaash Linga Kshetram అనబడే ఒక శివాలయం కలవు. అలాగే ఇక్కడ అనేక అశ్వత్థ, ఔదుంబర వృక్షాలు, భవానిమాత, సంతోషిమాత దేవాలయాలు, మౌనేశ్వర స్వామి ఆశ్రమం, హనుమంతుని దేవాలయము, పాపనాశగుండము, సాయి మరియు అనేకానేక వన – వృక్ష దేవతల దేవాలయాలు, అనేక గుహలు గలవు.
పాపనాశతీర్థం ఎలా చేరుకోవాలి?
Hyderabad To Papanash Tirtham (Bidar) 155 KMs |
---|
Hyderabad To Papanash Tirtham (Bidar) 155 KMs |
Hyderabad ----> Sadashivpet ----> Zaheerabad ----> Bidar ----> Papanaash Tirtham |
పాపనాశతీర్థం దర్శించడానికి అనువైన సమయం
పాపనాశతీర్థంను ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. అత్యంత అనుకూల సమయం మాత్రం వానాకాలం మరియు దసరా నవరాత్రుల రోజులు. దీనికి కారణం ఆయా సమయాల్లో కోనేటిలోనూ (తీర్థం), గుండంలోనూ నీరు సంవృద్ధిగా ఉంటుంది.
పాపనాశతీర్థం లో ఎక్కడ ఉండాలి?
పాపనాశతీర్థంలో ఉండడానికి వసతి సౌకర్యాలు లేవు. దగ్గరలో గల Bidar Town లో ఉండవచ్చు. సాధారణంగా Hyderabad నుండి వచ్చే భక్తులు ఒక్కపూటలో దర్శించుకొని తిరిగి వెళ్లిపోతారు.
పాపనాశతీర్థం స్థల పురాణం
పాపనాశతీర్థం – శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనుష్టాన స్థానం
పాపనాశతీర్థం చేరుకున్న శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు అక్కడే గల ఒక గుహలో అనుష్టానం, జపము చేసుకున్నారు. అక్కడేగల పాపనాశతీర్థంలో సంధ్యావందన కార్యక్రమములు చేసుకున్నారు. ఆశ్చర్యమైన విషయమేమంటే శ్రీగురుడు అనుష్టానం, జపము చేసుకున్న సమయంలోనే అక్కడ అదే గుహలో శ్రీసంతోషిమాత ( లేదా శ్రీ మహా కాళీమాత కావచ్చు) గుహ గోడలలో వెలిశారు. ఇక్కడే శ్రీగురుడు అమ్మవారి ఉపాసన / ఆరాధన కూడా చేసినట్లుగా ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. యవన రాజ్యమైన వైఢూర్య నగరం (Bidar) లోకి ప్రవేశించడానికి అనువుగా ఇక్కడ అమ్మవారి ఆరాధన చేశారని ఇక్కడి యోగుల విశ్వాసం. అందువల్లనే శ్రీగురుని అనంతరం ఆగుహ సంతోషిమాత గుహదేవాలయంగా పిలవబడుతోంది. దత్తాత్రేయుడుతో (శ్రీ నృసింహ సరస్వతి స్వామి) కూడిన అమ్మవారి దేవాలయం ఇక్కడ కనిపించడం విశేషం. అలాగే ఇక్కడే దత్తపరంపర లోని మౌనేశ్వరస్వామి,te (Tinthani Mouneswara Swamy Ashramam) ఆశ్రమం కూడా తప్పక దర్శింపదగినది.
పాపనాశతీర్థం ఫోటోలు
పాపనాశతీర్థం కు దగ్గరలోగల ఇతర దర్శనీయ ప్రదేశాలు
పాపనాశతీర్థం కు దగ్గరలోగల ఇతర దర్శనీయ ప్రదేశాలు (Other Places To Visit Near Papanash Tirtham) |
---|
పాపనాశతీర్థం కు దగ్గరలోగల ఇతర దర్శనీయ ప్రదేశాలు (Other Places To Visit Near Papanash Tirtham) |
1. Jharasangam Manik Prabhuji Desolate Temple |
2. Jharasangam Kethaki Sangameswara Temple |
3. Bardhipur Dattaashram |
4. Jharani Naarasimha Cave Temple |
5. Bidar Fort |
6. Siddhi Vinayaka Temple, Rejinthal |