Vallabhapuram
Vallabhesa Vruttantha Divya Sthali “Sri Kshetra Vallabhapuram (Manthangod Village)”
వల్లభేశ వృతాంతం జరిగిన దివ్యస్థలం “శ్రీక్షేత్ర వల్లభాపురం (మంథన్‌గోడ్ గ్రామం)”
దత్తబంధువులందరికీ నమస్కారములు,
దిగంబరా..దిగంబరా..శ్రీ పాద వల్లభ దిగంబరా..నరసింహ సరస్వతి దిగంబరా..అవధూత చింతన శ్రీ గురు దేవదత్త…
Sri Kshetra Vallabhapuram [శ్రీక్షేత్ర వల్లభాపురం (మంథన్‌గౌడ్ )] గ్రామంలోని 700 సంవత్సరాల ఘనచరిత్ర గల Sripada Sri Vallabha – Dattatreya – Nrusimha Saraswathi Swami దేవాలయాన్ని గురించి మీకు అనేక విషయాలను Share చెయ్యాలని చాలారోజులుగా అనుకుంటున్నాను. అది 1999 సంవత్సరం, Mahabubnagar దగ్గరగల Manyamkonda అనే Venkateshwara Swami క్షేత్రాన్ని దర్శించి అక్కడ నుండి Mantralayam కు వెళ్లాలని మా మిత్ర (భక్త)బృందం అనుకున్నాము. ఆవిధంగా వెళ్లే టప్పుడు మొదటిసారిగా ManthaGod / ManhanGoud Village (మంథన్‌గౌడ్ గ్రామం) లోని దత్తాత్రేయ దేవాలయాన్నిదర్శించాను. అక్కడగల ఆ దేవాలయం అభివృద్ధికి ఆమడదూరంలో చూడచక్కగా కొండరాళ్ళ మధ్యలో సుందరంగా, ప్రశాంతంగా ఉంది. చుట్టూరా ఎవరు లేరు దాదాపు 10 -15 నిముషాలు అక్కడ ఉండి అక్కడ నుండి Mantralayam బయలుదేరాము. ఆవిధంగా మొదటిసారి 1999 లో అక్కడకి వెళ్ళాను, వల్లభేశ వృత్తాంతం జరిగిన ప్రదేశమనీ, దాదాపు 700 నుండి 800 సంవత్సరాల చరిత్రగల దత్తాత్రేయ దేవాలయమనీ తెలుసుకొని చాలా ఆనందపడ్డాను. ఇక్కడ గర్భగుడి లోపలగల గోడకు వెలిసిన స్వయంభూ దత్తాత్రేయుల (శ్రీపాద శ్రీ వల్లభ) వారు త్రిశూలసహితంగా అత్యంత అద్భుతంగా ఉంటారు. అక్కడి పరిస్థితులను చూసిన నేను ఎలాగైనా గుడికి సున్నం కొట్టించాలి (గుడి మసిబారిపోయి,పెచ్చులు ఊడిపోయిఉండడంవల్ల) అనుకున్నాను. తదుపరి నేను (దాదాపు 10 సంవత్సరాల తరువాత) 2009 -2010 సంవత్సరంలో తిరిగి అక్కడకు వెళ్లి చూస్తే గుడి అదే పరిస్థితులలో వుంది. అప్పుడు అక్కడ ఉన్న వారిని “గుడికి సున్నం కొట్టిద్దామనుకుంటున్నాను, ఎవరిని అడగాలి” అని Enquiry చేసాను. అప్పుడు అక్కడ ఉన్న ఒకతను “ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను శ్రీ వసంత జోగ్లేకర్ అనే ఒక ముంబాయి నివాసి చేస్తున్నాడనీ, ఇక్కడ నూతనంగా Nepal దేశం నుండివచ్చిన Purohit లను కూడా వసంత జోగ్లేకర్ అక్కడ నుండి తీసుకువచ్చాడనీ, మీరు విడిగా చెయ్యడానికి కుదరదనీ, అతనికి మీరు డబ్బు ఇచ్చినట్లైతే అతను చేయిస్తాడని” చెప్పాడు. వెంటనే వసంత జోగ్లేకర్ ఫోన్ నెంబర్ తీసుకుని అతనిని Hyderabad లోని మాయింటికి ఆహ్వానించి అతనికి మంథన్‌గౌడ్ గుడి అభివృద్ధికి భారీగానే డబ్బులను (నావి + ఇతర Relatives నుండి Collect చేసినవి) ముట్టజెప్పాను. 2012 వ సంవత్సరంలో తిరిగి నేను మంథన్‌గౌడ్ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి అంతకు ముందు కంటే దారుణంగా ఉండడం చూసాను. పైన చెప్పబడిన వసంత జోగ్లేకర్ అనే మాహానుభావుడు అందరి దగ్గర మంథన్‌గౌడ్ గుడి అభివృద్ధి పేరుతో డబ్బు పోగుచేసుకుని పలాయనం చిత్తగించాడని చెప్పారు. పైగా Nepal నుండి వచ్చిన Purohit లకు సంవత్సరకాలంగా జీతాలు ఇవ్వలేదనీ, వారికి తినడానికి తిండి గింజలు కూడా లేవనీ, అంత దూరం నుండి వచ్చిన Purohit లు వెళ్లలేక ఉండలేక ఉన్నపరిస్థితులు ఉన్నాయని తెలిసింది. గుడికి కరంట్ బిల్లు కట్టకపోవడం వల్ల కరంటు లేదు, నీళ్లు కూడా లేని పరిస్థితి. అక్కడి పరిస్థితి చూసి కోపం, బాధ కలిగాయి. ఊరు కానీ ఊరులో Nepali Purohit ల పరిస్థితి దారుణంగాఉంది. వసంత జోగ్లేకర్ ఇదివరలో వాడిన ఫోన్ నెంబర్లన్నీSwitch Off చెయ్యబడి ఉన్నాయి. అతి కష్టం మీద నెల రోజుల తరువాత వసంత జోగ్లేకర్ ఫోన్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేస్తే “మంథన్‌గౌడ్ గుడి అభివృద్ధిలో నాకు చాలా నష్టం వచ్చిందనీ, అక్కడ ప్రజలు సహకరించలేదనీ, మీరు ఇచ్చిన నిధులు పూజారుల జీతాలకే సరిపోయాయనీ” మూర్ఖుడిలా అరిచాడు. పైగా గుడి మీద అంత ప్రేమ ఉండే నువ్వు, లోకల్ గా ఉండే మీరు ఎందుకు అభివృద్ధి చేసుకోవడంలేదనీ, వేరే రాష్ట్రానికి చెందిన నేను వచ్చి అభివృద్ధి చేస్తే తప్ప మీకు దిక్కులేదా?” అని అరిచాడు.
ఇక వసంత జోగ్లేకర్ తో పెట్టుకుంటే పనులు జరగవని అర్ధమయ్యింది, వసంత జోగ్లేకర్ మాటలు నాలో కసిని రేకెత్తించాయి. మనమే మన దత్త క్షేత్రాన్ని అందరం కలసి వృద్ధిలోకి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాను. తిరిగి మంథన్‌గౌడ్ గ్రామం వెళ్లి అక్కడ గల పెద్దలతో “నేను గుడి అభివృద్ధి చేస్తాను” అని చెబితే “వసంత జోగ్లేకర్ చేసింది చాలు.. ఇక ఎవ్వరూ అభివృద్ధి చెయ్యాల్సిన పనిలేదు.. అయితే అదే అభివృద్ధి అవుతుంది లేక పోతే లేదు…” అని ఉరివారు అన్నారు. అయినా కానీ మొదటి సారిగా అక్కడ ఉన్న గుడినీ, దత్తాత్రేయుడినీ నమ్ముకుని దేశం కానీ దేశం Nepal నుండి వచ్చిన Purohit లకు నెలజీతంగా కొంత సొమ్మును అందించాను. అప్పటినుండీ Frequent గా గ్రామప్రజలనూ, గుడి పెద్దలను కలిసే వాడిని. కొద్ది రోజుల (నెలల) తరువాత వారికి నామీద కొంచెం నమ్మకం కలిగింది. ఆవిధంగా 2012 సంవత్సరంలో వల్లభేశ వృత్తాంతం జరిగిన ఈ ప్రదేశంలో Sripada Sri Vallabha విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తే బాగుంటుందని తలచి Temple Committee కి నా ఆలోచన చెప్పాను. అందుకువారు “ధనపరంగా మేము ఏమి చెయ్యలేమనీ, సేవపరంగా సహాయం చేస్తామని” ఒప్పుకున్నారు. అప్పుడు 2013లో Sripada Sri Guru Sangamam Seva Trust ను స్థాపించి 2013 లోనే Jaipur లో నుండి Sripada Sri Vallabha పాలరాతి విగ్రహానికి Order ఇచ్చి తెప్పించాము. 2014, March నెలలో వైభవంగా Sripada Sri Vallabha విగ్రహ ప్రతిష్ట జరిగింది (విగ్రహదాతలు: శ్రీమతి & Sri Kalpana Reddy & Ravindar Reddy And Smt & Sri Manjusha & Raghu Palaparthi). అది జరిగిన పిదప ఊరి వారికి నామీద కొంచెం నమ్మకం కలిగింది. తరువాత గుడిలోపల Granite Flooring వేయించాము (Granite దాతలు: Sri Kondapi Ravi Kumar) , తదుపరి వివిధ అభివృద్హి కార్యక్రమాలను అందరి సహాయసహకారాలతో ఒక్కొక్కటిగా చెయ్యడం జరిగింది. ఒకప్పటి Vallabhapuram ప్రస్తుతం Manthangod Village గా పిలవబడుతోందని వివిధ మార్గాల ద్వారా (వెబ్సైట్, Blogs, Satsangas Etc..) అసలు విషయాన్ని ప్రచారం చేసాను. అయితే ఇదే పేరుతో ఇంకొక క్షేత్రం ఉన్నందున వారియొక్క కొంత మంది భక్తుల నుండి నాకు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వాటన్నిటినీ నేను శ్రీపాదుడి దయతో సమర్ధంగా ఎదుర్కొనడం జరిగింది. నిజాలను ఎవ్వరూ ఎక్కువ రోజులు దాయలేరని ఋజువైంది. పని చెయ్యకుండా మాటలు చెప్పేవారు, మనతో పాటే ఉన్నట్లు నమ్మించి వెనకాల గుంతలు తీసేవారు, Wrong Guidance ఇచ్చేవారు వంటి ఎంతో మందితో నేను వేగాను. అయినా Sripada స్వామి మీద భారం వేసి ముందుకే వెళ్ళాను. కొన్ని Financial నష్టాలను చవిచూసినప్పటికీ వెనకకు వెళ్లాలనిపించలేదు.
ఒకప్పుడు మంథన్‌గౌడ్ దత్త దేవాలయంలో శ్రీ జనార్దన్ కామత్ మహారాజ్ అనే ఒక దిగంబర సన్యాసి ఉండేవారు. వారికి పూర్వమే ఇక్కడ దాదాపుగా 300 సంవత్సరాలకు పూర్వం ఎవరో మధ్యలో త్రిముఖ దత్తాత్రేయ రాతివిగ్రహాన్ని ప్రతిష్టించి అటూ-ఇటూ (కుడి- ఎడమ వైపులలో) Platform లాగకట్టి స్థలాన్ని వదిలేశారు. ఆ ఖాళీ ప్రదేశాలలో Sripada Sri Vallabha Swamy నీ, Sri Nrusimha Saraswathi Swami నీ ప్రతిష్టించాలి అని సంకల్పం. అందరి సహాయసహకారాలతో అది సాధ్యపడింది. 2017 సంవత్సరం January నెలలో Sri Nrusimha Saraswathi Swamy వారి విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది (విగ్రహదాతలు: శ్రీమతి & Sri Lalitha & Srinivas Oruganti And Smt & Sri Rama Devi & NV Srinivas Family). శ్రీపాదుల వారు ‘గోవు లేని ప్రాంగణం శ్మశానంతో సమానమని’ చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గాయత్రి అనే గోవును తెచ్చాము. గాయత్రి ని తెచ్చిన కొద్ది రోజులకే అది గోవర్ధన్ అనే లేగ దూడ (మగదూడ) కు జన్మనిచ్చింది. ఈ క్షేత్ర దర్శనానికి నిత్యం మధ్యాహ్నం ఎంత మంది వస్తారో వారందరికీ ఉచిత అన్నప్రసాద సంతర్పణ జరుగుతోంది. ఈ క్షేత్రం అభివృద్ధిలో, నిత్యాన్నదానంలో ఇంకా ఇతర వృద్ధి కార్యక్రమాలలో Smt & Sri Kranthi & Manohar Appari దంపతుల వారి సహాయసహకారాలు మరువలేనివి. ఒక దత్త క్షేత్రం పరిపూర్ణంగా ఉండాలంటే Navanatha స్వాముల ఆశీస్సులు తప్పనిసరి (మామూలు దేవాలయాల్లో ఎలాగైతే నవగ్రహ ఉపాలయం ఉంటుందో, దత్తదేవాలయాల్లో నవనాథులు ఉండడం తప్పనిసరి అని Sri Kshetra Devghad (శ్రీక్షేత్ర దేవఘడ్) లో తెలుసుకున్నాను) అని తలచి Temple Commettee ని ఒప్పించి Ekamukhi Dattatreya Sahitha Navanatha Mandir నిర్మాణానికి తగినంత భూమిని ఇచ్చేటట్లుగా వారిని ఒప్పించాను. 05/March/2017 వ తారీఖున Navanatha Mandir కు Bhoomi Puja కూడా చెయ్యడం జరిగింది. త్వరలో మిగిలిన అన్ని కార్యక్రమాలను కూడా శ్రీగురు దత్తాత్రేయుల మరియు నవనాథుల ఆశీస్సులతో, మీ అందరి సహాయసహకారాలతో పూర్తి చెయ్యాలని సంకల్పం. ముందు ముందు Sri Kshetra Vallabhapuram (మంథన్‌గౌడ్ ) గుడి ప్రాంగణంలో ఒక Over Head Water Tank నూ అలాగే భక్తులూ, గ్రామ ప్రజల కోసం ‘Sripada Kalyana Vedika’ అనే పేరుతో Function Hall నూ నిర్మించాలని సంకల్పం, తదుపరి స్వామి వారి ఇష్టం. ఇప్పటికి ఈ దేవాలయానికి స్థిరమైన ఆదాయం లేదు. ఇక్కడ ఎటువంటి Commercila Shops కానీ ఇతర Commercial Activities కానీ లేవు, జరగవు. Function Hall లాంటిది వస్తే ఈ దేవాలయానికి స్థిరమైన ఆదాయ వనరులను కల్పించినట్లుగా అవుతుందన్నది ఒక కారణం.
ఎన్నో విశిష్టతలను కలిగిన, 700 వందల సంవత్సరాల పైచిలుకు ఘనమైన చరిత్ర కలిగిన, వల్లభేశ వృత్తాంతం జరిగిన, గొప్ప క్షేత్రమైన Sri Kshetra Vallabhapuram [శ్రీ క్షేత్ర వల్లభాపురం (మంథన్‌గౌడ్ )] శ్రీపాద శ్రీ వల్లభ – Dattatreya – Nrusimha Saraswathi Swami దేవాలయాన్ని భక్తులందరూ దర్శించి తరించాలనీ కోరుకుంటూ…
కీర్తి వల్లభ (keerthivallabha@gmail.com)
ManthanGod Village (మంథన్‌గౌడ్) ఎక్కడుంది? – ఎలా వెళ్ళాలి?
How To Reach MantahnGoud Village (180 KMs) |
---|
How To Reach MantahnGoud Village (180 KMs) |
Shamshabad ---->Jadcherla---->Mahabubnagar ---->Raichur Road---->Devarakadra --->Jakler ----> Before 1 KM From Makthal, After Maha Laxmi Daba Take Lift Side Road Just After Brick Factory----> ManthanGod Village ----> Sripada Dattatreya Temple |
మంథన్‌గౌడ్ (వల్లభాపురం) ప్రాముఖ్యత ఏంటి?
- క్రీ.శ.1351-1352 సంవతరాల్లో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు వల్లభేశుడు అనే పసుపు వర్తక బ్రాహ్మణుడిని దొంగల నుండి రక్షించి కాపాడిన ప్రదేశమిది.
- శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు క్రీ.శ. 1350 లో కృష్ణానదిలో అంతర్హితం అయిన తరువాత మొదటి సారిగా తిరిగి భక్త రక్షణ కోసం కనిపించిన ప్రదేశమిది.
- శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి పాదుకలు పిఠాపురంలో ఉంటే, శ్రీపాదుల పాదుకలతో పాటూ వారి హస్త ముద్రలు నేటికి మంథన్‌గౌడ్ లో చూడవచ్చు.
- శ్రీ చరణుల వారి హస్త ముద్రలు గల ఏకైక ప్రదేశమిది.
- వల్లభేశుడు స్వయంగా ప్రతిష్టించిన శ్రీపాద పాదుకలు కల ప్రదేశమిది.
- ప్రతిష్టించిన పాదుకలలో అతి పురాతనమైన శ్రీపాద పాదుకలు కల ప్రదేశమిది
- ప్రతీ రోజు మధ్యాహ్నం Temple Premises లో ఉచిత అన్నదానము జరుగుతున్న ప్రదేశమిది.
- ప్రతీ పౌర్ణమి, అమావాస్యలందు దత్త హోమాలు, ప్రతీ అష్టమి నందు అనఘాస్టమీ వ్రతాలు, ప్రతీ శనివారం ప్రదోష సమయంలో ప్రదోష పూజలు జరిగే దివ్య స్థలమిది.
ManthaGod Temple (మంథన్‌గౌడ్) స్థల పురాణం
శాసనాలను బట్టి , ఇతర ఆధారాలను బట్టి మంథన్‌గౌడ్ గ్రామం యొక్క పురాతన నామం ‘మహనీయపురం’ గా తెలుస్తోంది. మహనీయపురం దట్టమైన అడవిలో ఉన్న ఒకానొక అతిచిన్న గ్రామం, మరియు పంచదేవపహాడ్ కు దగ్గరలో గల ‘పసుపుల’ గ్రామమును త్వరగా చేరుకొనుటకు వెళ్ళే అడ్డదారిలో గల అతిచిన్న గ్రామము.
1350 వ సంవత్సరం లో ఆ ప్రాంతమంతా దట్టమైన గడ్డితో కూడిన అటవీప్రాతంగా తెలుస్తోంది. 1350 కు ముందు, తరువాత మహనీయపురం ప్రజల ప్రధాన
ఆదాయవనరు ‘వెన్నపూస’ అమ్మకం (పాల నుండి వెన్నను తీయడం). అక్కడ గల అనేక మంది గౌడ కులస్తులు వెన్నపూస ను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్మేవారు. ఈ విధంగా పాల నుండి వెన్నను తీసే ప్రక్రియను ‘మంథన్’ (मन्थन) అని ఉర్దూలో అనేవారు (Manthan = The Churning). క్రమక్రమంగా మహనీయపురం మంథన్‌గౌడ్ గా మార్పు చెందింది. అయితే 1351-1352 సంవత్సరాలలో వల్లభేశ వృత్తాంతం జరిగిన దరిమిలా ఈ ప్రాతాన్నే ‘వల్లభాపురం’ అని కుడా పిలిచేవారు. అయితే ‘వల్లభాపురం’ అనే పేరు వల్లభేశ వృత్తాంతం జరిగినందువల్ల (వల్లభేశుడి పేరుమీద) వచ్చిందా? లేక ‘శ్రీ వల్లభస్వామి’ వారు తిరిగి ఇక్కడ కనిపించడం వల్ల వచ్చిందా? అన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం దొరకలేదు. కొన్ని మరాఠి గురుచరిత్ర పుస్తకాలలో ‘మంథన్‌గౌడ్’ ను ‘మంథన్‌గుడి’ అని ప్రస్తావించడం జరిగింది.
సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం లో 18వ అధ్యాయం లోని వల్లభేశుని వృత్తాంతం
వల్లభేశుడు పసుపు వర్తకము చేయుచుండెను. తనకు వ్యాపారమున లాభము వచ్చిన యెడల కురువపురము పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయవలెనని నిశ్చయించుకొనెను. శ్రీపాదుల అనుగ్రహమున అతడు విశేషధనమును సంపాదించెను. అయితే మ్రొక్కు తీర్చుటకు వాయిదా వేయుచుండెను. ఇంతలో శ్రీపాదులవారు కురుంగడ్డలో అంతర్హితులై గుప్తరూపమునందున్నారు. కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకలు మాత్రమున్నవి. అతడు ధనమును తీసికొని కురుంగడ్డకు వచ్చుచుండగా నలుగురు దొంగలు యాత్రికులవేషమున యితనితో కలసి వచ్చి వల్లభేశుని వధించినారు. అతడు తన తల నరకబడు సమయములో శ్రీపాద వల్లభులను స్మరించెను. శ్రీపాదుల వారు త్రిశూలధారి అయిన యతిరూపంలో వచ్చి ముగ్గురు దొంగలను వధించెను. నాలుగవవాడు తానెన్నడు దొంగతనం కూడా చేయలేదనియూ, ఈ ముగ్గురు దొంగలును మార్గమధ్యంలో తనని కలిసినారనియూ, ప్రలోభపరచెడి వారి మాటలకు లోనయి వారితో కుమ్మక్కయినాననియు, తనను రక్షించవలసినదనియూ, వేడుకొనెను. దయాంతరంగులైన గురుదేవులు వానికి అభయమిచ్చి, కొంచెం విభూతిని ప్రసాదించి, వల్లభేశుని శరీరంపై చల్లమనియూ, వాని తలనూ, మొండెమునూ అతికించ వలసినదనియూ ఆజ్ఞాపించిరి. శ్రీపాదుల అమృతదృష్టి వలన వల్లభేశుడు పునరుజ్జీవితుడయ్యెను. ఆ దొంగ వలన జరిగిన వృత్తాంతమంతయునూ వల్లభేశుడు తెలిసికొనెను. వానికి కలిగిన ఆనందాశ్చర్యములకు అంతులేదు. శ్రీపాదుల దర్శనభాగ్యం తనకు లభించనందుకు పరితపించెను. వల్లభేశుని మూలమున తనకు శ్రీపాదుల దర్శనమైనందులకు ఆ దొంగ ఎంతయో సంతసించెను. వల్లభేశుడు తన తప్పు తాను తెలిసికొనెను. వేయిమ్రంది బ్రాహ్మణ్యమునకు అన్నసంతర్పణ చేయుశక్తి తనకు చాలాకాలం క్రిందటే కలిగినది. ఈనాటి తన స్థోమతలో నాలుగువేల మందికైననూ సునాయాసముగా అన్నసంతర్పణ చేయగలడు. తను అనవసర కాలయాపన చేసి యిక్కట్లను కొనితెచ్చుకొన్నందులకు ప్రతిగా నాలుగువేల మంది బ్రాహ్మణ్యమునకు కురుంగడ్డలో అన్నసంతర్పణ చేయించెను. గురుచరిత్ర లో వివరించబడిన వల్లభేశ వృత్తాంతము (అధ్యాయం 10 లో కలదు)
ManthaGod Temple (మంథన్‌గౌడ్) Photos
ManthaGod Temple (మంథన్‌గౌడ్) Web Links
- Navnatha Temple Bhoomi Puja News Paper Publications – 06/March/ 2017
- Navnatha Temple Bhoomi Puja On 05/March/2017
- Sri Nrusimha Saraswathi Swamy Vigraha Pratista – Jan 2017
- Granite Flooring Work At Manthangoud Temple June 2014
- Granite Stone Transportation To ManthanGoud Village April 2014
- Sripada Sri Vallabha Vigraha Pratista March 2014
- Manthan Goud Temple History 1988 PDF