రహస్య Viswarupa దత్త క్షేత్రంగా
విశ్వ రహస్య ‘దత్త విశ్వరూప’ క్షేత్రం – త్రివిక్రమభారతి తపోవనం : కుమసి గ్రామం
రహస్య ఉండాలి Viswarupa దత్త క్షేత్రంగా – Trivikrama Bharathi Tapovanam : కుమాసీ విలేజ్
దత్తబంధువులందరికీ నమస్కారములు,
రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి విశ్వరూపపాదుకా రహస్య క్షేత్రం కుమసి గ్రామం లో ఉందని సమాచారం అందుకున్న నేను శ్రీపాదుల వారి ఆశీస్సులతో అక్కడకి వెళ్ళడం జరిగింది. అక్కడి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి విశ్వరూప దర్శన ఆనవాళ్ళను చూసి ఆశ్చర్యపోయాను. అబివృద్దికి ఆమడదూరంలో ఉన్న, రహస్యంగా ఒక చెరుకుతోటలో ఉన్న, ఒక గ్రామదేవత గుడిలా ఉండే ఆ గుడి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి అతి పవిత్రమైన అతి రహస్యమైన , అతి విలువైన విశ్వరూపపాదుకా మందిరమని తెలిసి రోమాంచితుడనయ్యాను.
వెంటనే స్థానికులను, పూజారి గారిని కలిసి మన వెబ్సైట్ భక్తులందరి కోసం ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తున్నాను. శాలివాహనశకం 1358 (క్రీ.శ. 1436) లో త్రివిక్రమభారతి సమక్షంలో జరిగిన విరాట్ విశ్వరూప దర్శనమునకు సంబంధించిన, ‘మోడీలిపి (Modi Script)’ లో వ్రాయబడిన మరియు అప్పటి గ్రామాధికారి శ్రీ భీమన్నశివరాం చే రికార్డ్ చేయబడిన దస్త్రం కుడా శ్రీ గురుని ఆశీస్సులతో సంపాదించడం జరిగింది. దత్త భక్తులమైన మనకు ఇంతకన్నా ఇంకేంకావాలి? ఆస్వాదించండి…మరియు దర్శించండి.
దిగంబరా..దిగంబరా..శ్రీ పాద వల్లభ దిగంబరా..దిగంబరా..దిగంబరా.. నరసింహ సరస్వతి దిగంబరా..
మీ
కీర్తి వల్లభ
కుమసి గ్రామం ఎక్కడుంది?
కుమసి గ్రామం బిజాపూర్ జిల్లా లోని సిందగి తాలుకా లో కలదు. కుమసి సరైన బస్సు, రోడ్డు సౌకర్యాలు లేని కుగ్రామం. ఈ గ్రామం భీమా నది ఒడ్డున కలదు.
కుమసి గ్రామం ను ఎలా చేరుకోవాలి?
కుమసి గ్రామం గాణుగాపురము/ దేవల్ గాణ్గాపూర్ నుండి లేదా అక్కల్కోట్ నుండి చేరుకోవచ్చు. దయచేసి గమనించండి కుమసి కి చేరే అన్నిరోడ్డు మార్గాలు సరిగా ఉండవు.
గాణుగాపురము/ దేవల్ గాణ్గాపూర్ నుండి కుమసి గ్రామానికి రూట్ (గాణ్గాపూర్ To కుమసి 40 కీ.మీ.) |
---|
గాణుగాపురము/ దేవల్ గాణ్గాపూర్ నుండి కుమసి గ్రామానికి రూట్ (గాణ్గాపూర్ To కుమసి 40 కీ.మీ.) |
గాణుగాపురము / దేవల్ గాణ్గాపూర్ --- & gt; చౌడాపూర్ ఆర్చ్ (కమాన్) ---> చౌడాపూర్ ఆర్చ్ (కమాన్) నుండి స్ట్రైట్ రోడ్డు తీసుకోవాలి ---> అఫ్జల్ పూర్ రోడ్ (పెట్రోల్ పంప్ దగ్గర Leftt Side రోడ్డు తీసుకోవాలి) ---> అత్నూర్ ---> అఫ్జల్ పూర్ ---> అఫ్జల్ పూర్ చౌరాస్తా ---> భీమానది బ్రిడ్జి ---> భీమానది బ్రిడ్జి దాటగానే ఎడమచేతి వైపున గల రూట్ తీసుకోవాలి ---> దేవన్గావ్ ---> కుమసి గ్రామం. |
అక్కల్కోట్ నుండి కుమసి గ్రామానికి రూట్ (అక్కల్కోట్ To కుమసి 60 కీ.మీ.) |
---|
అక్కల్కోట్ నుండి కుమసి గ్రామానికి రూట్ (అక్కల్కోట్ To కుమసి 60 కీ.మీ.) |
అక్కల్కోట్ ---> భక్తనివాస్ రోడ్ ---> మైన్దర్గి ---> దుదని ---> బెలుర్గి ---> అఫ్జల్ పూర్ చౌరాస్తా ---> అఫ్జల్ పూర్ చౌరాస్తా దగ్గర కుడి చేతి వైపు గల రోడ్డు తీసుకోవాలి ---> భీమానది బ్రిడ్జి ---> భీమానది బ్రిడ్జి దాటగానే ఎడమచేతి వైపున గల రూట్ తీసుకోవాలి ---> దేవన్గావ్ ---> కుమసి గ్రామం. |
కుమసి గ్రామం ను ఎప్పుడు దర్శించు కోవాలి?
కుమసి గ్రామానికి వెళ్ళే రోడ్డు బాగున్నంత వరుకు (వర్షాకాలంలో ఈ రోడ్డులో వెళ్ళడం కష్టం) ఎప్పుడైనా వెళ్ళవచ్చు. వైశాఖ శుద్ధ దశమి రోజు ఇక్కడ ఉత్సవాలు (మే నెలలో) జరుగుతాయి. ఇక్కడికి వెళ్లేముందు తప్పనిసరిగా పూజారి గారిని సంప్రదించి మాత్రమే వెళ్ళాలి. చలి, ఎండాకాలాలు అత్యంత అనుకూలమైనవి.
కుమసి గ్రామం ప్రత్యేకత ఏంటి?
గాణుగాపురము/ దేవల్ గాణ్గాపూర్ కు కుతవేటు దూరం లో ఉన్నప్పటికీ, పెద్దగా ప్రాచుర్యం పొందని అతి శక్తివంతమైన దత్తక్షేత్రం ‘కుమసి’. పైగా ఇది పంచపాదుకా దత్త క్షేత్రాలలో ఒకటి. (పంచపాదుకా క్షేత్రాల (Pancha Paduka Kshetrlu)గురించి తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చెయ్యండి) స్వయంగా నృసింహసరస్వతుల వారు ఇక్కడ అడుగుపెట్టి విశ్వరూప దర్శనం ఇచ్చారంటేనే ఈ ప్రాంతం ఎంత పవిత్రమైనదో ఉహించండి. దత్త భక్తులందరూ వారి జీవితకాలం లో దర్శింపతగిన పంచపాదుకా క్షేత్రాలలో ఐదవది కుమసి గ్రామంలోని ఈ ”త్రివిక్రమభారతి తపోవనం”. ఇక్కడే త్రివిక్రమభారతి సజీవ సమాధి ఉండడం మరొక ప్రాముఖ్యత గల విషయము.
ఏమేమి తీసుకెళ్ళాలి?
కుమసి గ్రామం లోని త్రివిక్రమభారతి తపోవనం దగ్గర ఏమి దొరకవు. ఉండడానికి, తినడానికి వసతులు లేవు. పూజా సామగ్రి కుడా దొరకదు. మంచినీళ్ళ దగ్గరనుండి మంచిగంధం దాకా అన్నీ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ గల విశ్వరూప దత్తపాదుకలకు జలాభిషేకం తరువాత సాదారణంగా గంధలేపనం చేస్తారు. కాబట్టి మంచి గంధండబ్బా, పూలు ఇతర పూజా సామగ్రి తీసుకుని వెళ్ళాలి.
కుమసి గ్రామమును గురించిన చారిత్ర్రాత్మక వివరణ – గురు చరిత్ర నుండి గ్రహింపబడిన వివరణ
శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు సన్యాస దీక్ష తీసుకున్న అనంతరం వివిధ క్షేత్రాలను దర్శించి, భీమా – అమరజా నదీ సంగమ క్షేత్రమైన గంధర్వపురము (గాణుగాపురము/ దేవల్ గాణ్గాపూర్) చేరి నివసింపసాగిరి. గాణుగాపురము నందు వందగడపల బ్రాహ్మణ ఇళ్ళు గలవు. వారి దైనందిన బిక్ష కార్యక్రమములలో భాగంగా ఒకకానొక వైశాఖమాస మద్యాహ్నం ఎండవేళలో ఒక పేద బ్రాహ్మణ ఇంటికి బిక్షకై వెళ్ళెను. ఆ ఇంటి బ్రాహ్మణుడు కుడా బిక్ష పై జీవించు వాడగుటచే అతను కుడా బిక్షకు గ్రామము లోకి పోయెను. ఇంటిలో ఉన్న అతని భార్య శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని సాదరంగా ఆహ్వానించి, ఆసనంపై కూర్చుండ బెట్టి భర్తరాకకై ఎదురు చూచుచుండెను. వారి ఇంటి ముందు ఒక బర్రె కట్టి వేయబడి ఉన్నది. ఆ బర్రె గొడ్డు బర్రె కావడంవల్ల వస్తువులు మోయుటకు, మట్టి పనులు చేయించుకొనుటకు గ్రామస్థులు వారి వద్ద నుండి అద్దెకి తీసుకెళుతుండేవారు.
శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు బిక్షకై వెళ్ళిన ఆ ఇల్లాలి భర్త కోసం కొంత సేపు వేచి చూసి , కాలాతీతం అవుచున్నది కాబట్టి ఎదురుగా ఉన్న ఆ బర్రె పాలను పిండి ఇవ్వవలసిందిగా కోరతారు. అంతట ఆ ఇల్లాలు “స్వామి అది పాలిచ్చు గేదె కాదు… అది గొడ్డు గేదె” అని చెబుతుంది. అంతట శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు “గేదె వద్దకు పాత్రను తీసుకోని వెళ్లి పాలు పితికి చూస్తే కదా అది గొడ్డు గేదో పాడి గేదో తెలిసేది!” అని అనగానే ఆ ఇల్లాలు ఒక పాత్రను తెచ్చి గొడ్డు గేదె పొదుగును పట్టి పితకగా ధారలు ధారలుగా ఒకటి కాదు రెండు పాత్రల నిండా పాలను ఇస్తుంది. ఆ పాలను కాచి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి ఆ ఇల్లాలు సమర్పించుకుంటుంది ఆశ్చర్యపోతూ. ఆ పాలను త్రాగిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఆ ఇంటి వారిని ఆశీర్వదించి సంగమమునకు వెళ్లి పోయెను. విషయము తెలిసిన ఆ ఇల్లాలి భర్త శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని దర్శించి ప్రణమిల్లిరి. మరుసటి దినమున ఒక ఆసామి తన ఇంట్లో మట్టిపని ఉన్నదని, గొడ్డు బర్రెను బాడుగకు ఇవ్వవలసిందిగా ఆ బ్రాహ్మణ దంపతులను అడగగా ఇక ముందు మేము మా బర్రెను పనులకు పంపలేమని, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి దయతో అది పాడి గేదె గా మారిందని తెలుపుతారు.
ఈ అద్భుత లీల ఆనోటా ఈ నోటా నాని గంధర్వపురమును పాలించు రాజుకు తెలుస్తుంది. ఆ రాజు గారు తన పరివారముతో సంగమమున గల శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని దర్శించి మావద్ద ఆతిద్యమును స్వీకరించవలసినదిగా పాదములనంటి ప్రార్దిస్తాడు. అప్పటివరుకు గుప్తంగా ఉన్న శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు గంధర్వపురములో శాశ్వతంగా నివసింపతలచి ఆ రాజు యొక్క కోర్కెను మన్నించెను. అంగీకారమును తెలుసుకున్న ఆ రాజు ఆనందముతో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని పల్లకి లో కూర్చుండ బెట్టి
మేళ -తాళాలతో , వేద మంత్రాలతో ఏనుగులు , గుర్రములు ముందు నడుస్తుండగా రాజు స్వయంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి ఛత్రమును పట్టుకొని పడమటి దిక్కుగా గల రాజ దర్బారుకు తీసుకెళతారు. వెళుతూ వెళుతూ దారిమధ్యలో ఒక బ్రహ్మ రాక్షసునికి శాపవిమోచనం కలిగించి , అక్కడ ఒక మఠము ను నిర్మించమని ఆదేశిస్తారు.
అదే సమయం లో గంధర్వపురమునకు దగ్గరలోగల ‘కుమసి’ అనే గ్రామంలో ‘త్రివిక్రమభారతి’ అనే ఒక యతి నివసిస్తుండేవారు. వారు వేదాలను అధ్యనం చేసిన, అన్నీవిడచిన సర్వపరిత్యాగి మరియు శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఉపాసకులు. వారు కుమసి గ్రామం గుండా ప్రవహించే భీమానది పరివాహక ప్రాంతం లో ఒక ఆశ్రమాన్ని స్థాపించి తపస్సు చేసుకునేవారు. వారు ప్రతీరోజు వారి దైనందిన మానసికపూజలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారితో సంభాషించే తంటతి అర్హతగల ఉపాసకులు. ఈ గ్రామంలో నివసించే త్రివిక్రమభారతిని కలవడానికి అనేక మంది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులు ఇతర ఉపాసకులు,యోగులు వస్తుండేవారు. వారందరితో త్రివిక్రమభారతి గంధర్వపురము (గాణుగాపురము/ దేవల్ గాణ్గాపూర్) నకు కొత్తగా వచ్చిన ‘శ్రీ నృసింహ సరస్వతి’ అను వారు ఒక ‘ఢాంబిక సన్యాసి’ అని, ‘యతు’లకు రాచ మర్యాదలకు సరిపడదని చెబుతుండేవారు. అంతటితో ఊరుకోక శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి రోజున జరిగిన ప్రసంగంలో కుడా గంధర్వపురములో గల శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని ఉద్దేసించి ‘ఢాంబిక సన్యాసి….ఢాంబిక సన్యాసి’ అని పలుమార్లు ప్రస్తావిస్తారు. సర్వ విషయగ్రాహి అయిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఈ విషయాన్ని గ్రహించి, ఒకానొక వైశాఖ శుద్ధ దశమి రోజు ఉదయం వారు ఉంటున్న రాజమందిరంలో గల వారికి “త్వరితంగా ఒక పల్లకిని ఏర్పాటు చేయండి, మనమందరం కలిసి ఒకటిగా కనబడే సమయమాసిన్నమైంది” అని చెబుతారు. ఈ విషయం తెలిసిన రాజు గారు ఒక పల్లకీని తెప్పించి దానిని సుందరంగా అలంకరించి, అందులో శ్రీగురుని కూర్చుండబెట్టి రాజు తో సహా భాజా-భజంత్రీలతో, అనేక మంది భటులతో, వందిమాధిగలతో శ్రీగురుడు చెప్పిన దిశగా కుమసి గ్రామం వైపు బయలుదేరుతారు.
అదే రోజు ఉదయం భీమానది ఒడ్డున గల తన ఆశ్రమంలో మానసిక పూజకు కూర్చున్న త్రివిక్రమభారతి ఎంత ప్రయత్నించిననూ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం మరియు సంభాషణలు జరగవు. దానికి చింతించిన త్రివిక్రమభారతి మరలా మరలా ప్రయత్నించగా వారికి గంధర్వపురము నుండి అట్టహాసంగా బయలు దేరిన పల్లకీ, మరియు దానిలో ఆశీ న్నుడై ఉన్న శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు పదే పదే కనబడసాగిరి. అంతట భయపడిన త్రివిక్రమభారతి తన మానసిక పూజలో పల్లకీ కనిపించిన దిశగా పరుగు లంకించుకుంటాడు. దూరంగా ఒక పల్లకి మేళ తాళాలతో కుమసి వైపుకు రావడం, అది అన్నివిధాలా తానూ ఇంతకు మునుపు మానసిక పూజలో చుసిన పల్లకీ తో పొలి ఉండడాన్ని గమనించిన త్రివిక్రమభారతి పల్లకీకి ఎదురేగి వారిని ఆపి పల్లకీలో గల శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసినంతనే అక్కడగల రాజు, భటులు, పల్లకీ మోసే బోయీలు మరియు ఇతర శిష్యులు అందరూ అచ్చంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని పోలిన వారిలా మారిపోతారు. తన తప్పును తెలుసుకున్న త్రివిక్రమభారతి అహంకారమును విడిచి “ఇంతమందిలో మిరేవ్వరో పోల్చుకోలేక పోతున్నాను…దయచేసి నాకు మీ నిజరూప దర్శనం ఇవ్వండని” శ్రీ గురుని పరిపరి విధాలుగా వేడుకొనగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు పల్లకీ నుండి ఒక బండపై దిగి అందరూ చూస్తుండగా (త్రివిక్రమభారతితో సహా) తమ విరాట్ విశ్వరూపాన్ని చూపిస్తారు. ఆవిధం గా ‘ఢాంబిక సన్యాసి’ అన్న త్రివిక్రమభారతికి గర్వభంగం చేసారు. ఎక్కడైతే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు పల్లకీ నుండి దిగి వారి పాదాలను కుమసి గ్రామం లో మోపి విశ్వరూప దర్శనాన్ని ఇచ్చారో ఆ ప్రాంతంలో వారు పాదాలు మోపిన బండపై శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదముద్రలు పడ్డాయి. వాటినే విశ్వరూప దత్త పాదుకలు అంటారు. చాలా కాలం పాటు వాటిని పూజించిన త్రివిక్రమభారతి పిమ్మట అక్కడే సజీవ సమాధిని పొందారు (శ్రీగురు చరిత్రము – 24 వ అధ్యాయము).
త్రివిక్రమభారతి సర్వశ్య శరణాగతి
శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి విరాట్ విశ్వరూప దర్శన వృత్తాంతమును తెలిపే చిత్రం
కుమసి లోని దత్త విశ్వరూప పాదుకలు
కుమసి లోని దత్త విశ్వరూప పాదుకలు (మందార పుష్పాలు పెట్టినవి)
కుమసి లోని దత్త విశ్వరూప పాదుకలు (దగ్గరగా)
కుమసి లోని దత్త విశ్వరూపపాదుకా మందిర్ & భీమానది
కుమసి లోని దత్త విశ్వరూపపాదుకా మందిర్ & భీమానది
కుమసి లోని దత్త విశ్వరూపపాదుకా మందిర్
త్రివిక్రమభారతి సజీవ సమాధి
త్రివిక్రమభారతి సజీవ సమాధి
త్రివిక్రమభారతి సజీవ సమాధి
ఆశ్చర్యపరిచే ప్రత్యక్ష నిదర్శనాలు
- అదేసమయం లో (వైశాఖ శుద్ధ దశమి రోజు) భీమా నది ఒడ్డున గల తన చెరుకుతోటకు నీళ్ళు పెడుతున్న కుమసి గ్రామాధికారి శ్రీ భీమన్నశివరాం త్రివిక్రమభారతి ఆందోళనగా నది ఒడ్డున పరుగులు పెట్టడం చూసి వారుకూడా త్రివిక్రమభారతి వెళ్ళిన దిశగా వెళ్లి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు చూపిన విరాట్ విశ్వరూపాన్ని చూసి తరించిన అదృష్టశాలి.
- నేటికీ ప్రతీ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజు గాణుగాపురము నుండి నృసింహ సరస్వతి స్వామి వారి ఉత్సవిగ్రహం తో కూడిన పల్లకీ కుమసి గ్రామమునకు వస్తుంది. ఆరోజే సాముహిక గురుచరిత్ర పారాయణ, ఇతర ఉత్సవాలు కుమసి లో జరుగుతాయి.
- అప్పటి రాచరికపు నియమాల ప్రకారం ఊర్లో ఏది జరిగినా గ్రామాధికారి దానిని దస్త్రం పై వేసి (రికార్డ్ చేసి) విషయాన్ని స్థానిక రాజుకు విన్నవించడం ఆనవాయితి. ఆవిధంగా శాలివాహనశకం 1358 (క్రీ.శ. 1436) లో త్రివిక్రమభారతి సమక్షంలో జరిగిన విరాట్ విశ్వరూప దర్శనమునకు సంబంధించిన, ‘మోడీలిపి (Modi Script)’ లో వ్రాయబడిన మరియు అప్పటి గ్రామాధికారిశ్రీ భీమన్నశివరాం చే రికార్డ్ చేయబడిన దస్త్రం నేటికీ మనం చూడవచ్చు.
- ఆ ‘మోడీలిపి’ దస్త్రాన్ని మనము సంపాదించడం జరిగింది, అలాగే దానిని ప్రొఫెషనల్ ట్రాన్సిలేటర్ సహాయంతో తెలుగు లోకి అనువదించడం కుడా జరిగింది. ఆశ్చర్యపరిచే ఈ ప్రత్యక్ష నిదర్శనాలను చూసి తరించండి.
అప్పటి (శాలివాహనశకం 1358 (క్రీ.శ. 1436) - వైశాఖ శుద్ధ దశమి) గ్రామాధికారి శ్రీ భీమన్నశివరాం చే ‘మోడీలిపి (Modi Script)’ లో వ్రాయబడి రికార్డ్ చేయబడిన దస్త్రం
పైన గల మోడీలిపి దస్త్రమునకు తెలుగు అనువాదము |
---|
పైన గల మోడీలిపి దస్త్రమునకు తెలుగు అనువాదము |
పుట.1190 కుమసి గ్రామ వాస్తవ్యులు, త్రివేదౌపాసకులు, సంస్కృత పండితులు, ప్రముఖ యతీశ్వరులు, పరమహంస పరివ్రాజకులు, భారతి తీర్ధ అనుచరులు, అనేక మంది రాజులతో సత్కారాలు పొందిన వారైన శ్రీమాన్ త్రివిక్రమ భారతి స్వామి మరియు మరి ముగ్గురి సమక్షం లో భీమా నది అంచున శాలివాహనశకం 1358 (క్రీ.శ. 1436) లో వైశాఖ శుద్ధ దశమి రోజు ఖచ్చితంగా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ ఆదిదేవులు, వర్ణింప వీలులేని వారైన శ్రీ 1008 నృసింహ సరస్వతి స్వామి వారు గంధర్వపురము నుండి రాజలాంచనాలతో కుమసి గ్రామానికి వేంచేసి విరాట్ విశ్వరూప దర్శనమును చేసి గ్రామాన్ని పునీతం చేసిరి. ఇది తమరి సమాచారం కొరకు పంపడమైనది. భవదీయ విధేయుడు శ్రీ భీమన్నశివరాం - కుమసి గ్రామాధికారి మరియు సాక్షి: నరహరి కవీశ్వర (హిప్పరగ వాస్తవ్యులు) |
విశ్వరూప పాదుకా క్షేత్ర నిర్వాహకుల సమాచారం
విశ్వరూప పాదుకా క్షేత్రం, కుమసి గ్రామం క్షేత్ర నిర్వాహకుల సమాచారం |
---|
విశ్వరూప పాదుకా క్షేత్రం, కుమసి గ్రామం క్షేత్ర నిర్వాహకుల సమాచారం |
Sri. Raghunath Bhutt (Pujari) - (వీరు ఇంగ్లీష్ / కన్నడ భాషలు మాట్లాడగలరు) Mobile No: 07411428019 |