World’s Biggest & World’s Richest Dattatreya Temple – Vedantnagar
‘గులాబీ గూట్లో కాషాయాంబరుడు‘ – Gulaabi Gutlo Kashaayaambarudu‘
(Vedanthapriya Dattatreyudu’ – ‘వేదాంతప్రియ దత్తాత్రేయుడు)
(World’s Biggest & World’s Richest Dattatreya Temple-Vedantnagar – ప్రపంచంలోని అతి పెద్ద & అతి ఐశ్వర్యవంత దత్తదేవాలయం – వేదాంతనగర్)
|| ఓం అగ్నావిష్ణూ సజోషసేమావర్ధంతువాంగిరః ద్యుమ్నైర్ వాజేభిరాగతం ||
వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే ప్రసితిశ్చమే, ధీతిశ్చమే క్రతుశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే, శ్రావశ్చమే శ్రుతిశ్చమే జ్యోతిశ్చమే సువశ్చమే,
ప్రాణశ్చమే పానశ్చమే వ్యానశ్చమేసుశ్చమే, చిత్తంచమహాధీతంచమే వాక్చమే మనశ్చమే, చక్షుశ్చమే శ్రోత్రంచమే దక్షశ్చమే బలంచమే,
ఓజశ్చమసహశ్చమ ఆయుశ్చమే జరాచమే, ఆత్మాచమే తనూశ్చమే శర్మచమేవర్మచమే, అంగానిచమే స్థానిచమే పరూగుంషిచమే శరీరాణిచమే,
జేష్ఠ్యంచమహాధిపత్యంచమే మన్యుశ్చమే భామశ్చమే, అమశ్చమేభశ్చమే జేమాచమే మహిమాచమే, వరిమాచమే ప్రథిమాచమే వర్ష్మాచమే ద్రాఘుజాచమే…
శ్రీగురు నృసింహ సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో శాలివాహన శకం 1924 చిత్రభాను సంవత్సరం ఆశ్వీయుజ నవమి, బుధవారం, ఆశ్లేషా నక్షత్ర సమయంలో ప్రపంచం లోనే అతిపెద్ద & అతి ఐశ్వర్యవంత దత్తదేవాలయ నిర్మాణానికి శిలాన్యాసం జరిగింది. దీనికి ముందు కర్త-కర్మ-క్రియ అయిన, రెండవ సంపూర్ణ దత్తావతారమైన శ్రీగురు నృసింహ సరస్వతి స్వామి వారు, ఈ కార్యాన్ని ఈదేవాలయ వ్యవస్థాపకులైన శ్రీ రామకృష్ణ స్వామి వారికి కనిపించి కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా ఆదేశించారట. పైగా ” నేను వేద ప్రియుడనూ, గోప్రియుడను. వేదపఠనమన్న నాకు మిక్కిలి ప్రీతి. ఇంకా చెప్పాలంటే ‘వేదలోలుడను’ నేను. నీ చేతుల మీదుగా సాగే ఈ దేవాలయ నిర్మాణం మిగతా అన్ని దేవాలయాలకు భిన్నంగా నిత్యం వేదపఠనంతో,te, ‘సామగానం’తోపాటు మిగిలిన వేదాలలోని పనసల ఉచ్చారణలతో ఇక్కడి ప్రతీ అణువు నిండిపోవాలి. ప్రస్తుతం వేదం ‘నిర్వేదం’గా మారుతోంది. నీ ఆధ్వర్యంలో మార్పు తీసుకురా! మా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి” అని చెప్పారట. శ్రీగురు నృసింహ సరస్వతి స్వామి వారి ఆదేశానుసారం అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలంటే దేవాలయ నిర్మాణంతో పాటుగా అక్కడే ఒక వేద విద్యా పీఠంను కుడా స్థాపించాలనీ, అక్కడ లుప్తమైపోతున్న వేద విద్యను ఎంపిక చేసిన పిల్లలకు ఉచితంగా అందివ్వాలని తలపోశారు. ఫలితంగా అక్కడ ప్రపంచంలోని అతిపెద్ద దత్తదేవాలయం తో పాటుగా ‘వేదాంత’ వేదవిద్యాపీఠ యూనివర్సిటీ కుడా స్థాపించబడినది. దేవాలయ నిర్మాణానికి ప్లాన్ కుడా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారే ఇచ్చారని ఇక్కడి స్థానిక భక్తుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణానికిగానూ ప్రత్యేకంగా ఎంపిక చేసిన Banshi – Sri Padhpur Pink Stones (గులాబి గోధుమ రాళ్ళు) తెప్పించి నిర్మాణం గావించారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే సూర్యరశ్మి పడిన దేవాలయ ప్రాంగణం Pink Colour లో మెరిసిపోతూ కనిపిస్తుంది. సూర్యరశ్మి పడే కోణాన్ని బట్టి దేవాలయం రంగు మారుతూ ఉంటుంది. దేవాలయం నిర్మాణం ఇంకా కొద్ది కాలం లో పూర్తవుతుందనగా శ్రీక్షేత్ర దేవల్ గాణగాపూర్ (కర్నాటక) నుండి ఆశ్చర్యకరంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు ఈ క్షేత్రానికి వచ్చాయి. నేటికీ ఆ పాదుకలను మనమీ క్షేత్రంలో దర్శించి తరించవచ్చు. అలాగే దేవాలయ నిర్మాణం ప్రారంభమైన కొద్ది రోజులలోనే దేవాలయ ప్రాంగణంలో అతి ఆశ్చర్యకరంగా ఒకే తల్లి వేరు వ్యవస్థ నుండి పుట్టిన ఔదుంబరం, వటవృక్షం మరియు అశ్వద్ధ వృక్షాలు ఒకే వేరుతో ఒకే కాండంతో పుట్టుకొచ్చాయి. ఈ క్షేత్రంలో నేటికీ ఆ ‘కల్పవృక్షాన్ని’ మనం దర్శించి తరించవచ్చు. అదేవిధంగా అత్యంత ఖరీదైన 24 Carat of Gilded Marble తో అతి సుందరమైన త్రిముఖ షట్భుజ దత్తాత్రేయ విగ్రహాన్ని కుడా ఈ దేవాలయంలో ప్రతిష్టించారు. ఆశ్చర్యంలో కెల్లా ఆశ్చర్యం ఏంటంటే దేవాలయ వ్యవస్థాపకులు ఈ దేవాలయానికి దాదాపు 7 KMs దూరంలో లో ‘నృసింహ సరస్వతి తపోవనం’ అనే పేరుతో ఒక విశాల ‘గోశాల’ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసారు. ప్రతీ రోజూ వేకువఝామునే కొంత మంది విద్యార్ధుల బృందంతో ఆచార్యుల వారు అక్కడకు చేరి గోవులకు వేదం చదివి వినిపిస్తారు. ఈ విధంగా ఇక్కడ Shift System లో ప్రతీ రోజూ జరుగుతుంది (ఆదివారాలతో సహా). ప్రాతః కాల వేద శ్రవణానంతరం గోవులు వాటి ఇష్టానుసారంగా అక్కడ గల విశాలప్రాంగణంలో తిరుగుతాయి. ఒక విద్యార్ధుల బృందం గోశాలలో వేదపఠనంలో ఉండగా మరొక విద్యార్ధుల బృందం ప్రధాన దేవాలయంలో వేదపఠనం గావిస్తారు. ఈ రెండు కుడా ఒకేసమయంలో జరుగుతాయి.
ఇంతపెద్ద దేవాలయ నిర్మాణానికి భక్తుల నుండి సేకరించిన కొద్దిమొత్తం విరాళాల తోనే కట్టారంటే ఆశ్చర్యపోకతప్పదు,te. వచ్చిన ప్రతీ పైసా దేవాలయ నిర్మాణానికే నిబద్ధతగా వాడారట. దాని ఫలితమే ఈ World’s Biggest Dattatreya Temple. ఈ దేవాలయానికి దగ్గరలో గల నోబెల్ హాస్పిటల్ దగ్గర ఉండే వడ-పావ్ బండి అతను అప్పట్లో Rs. 2/- దేవాలయ నిర్మాణానికి ఇచ్చారట. వారిని నేను కలిసినప్పుడు వారు నాతో అనేక విషయాలను చెప్పడం జరిగింది. వారిలాగే అనేకమంది వారి సహచరులు ఒక రూపాయి, రెండు రూపాయిలు నిర్మాణానికి ఇచ్చారని చెప్పారు. అలాగే స్వామి వారికి చేయించిన ఆభరణాలన్నీ భక్తులు ఇచ్చిన కొద్దిమొత్తాల తోనే చేయించారని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద దత్తదేవాలయమే కాదు నిధుల వినియోగంలో ప్రపంచంలోనే అత్యంత నిబద్ధత కలిగిన దేవాలయంగా కుడా వారు అభివర్ణించారు,te. అక్కడి స్థానికులు ఈ దేవాలయాన్ని ‘చిన్నచిన్న చీమలు పెట్టిన నిలువెత్తు పెద్ద పుట్ట’ తో పోల్చి చెబుతారు.
నేను (కీర్తి వల్లభ) ఈ దేవాలయాన్ని సందర్శించినప్పుడు (On 24.May.2015 At Around 08:30 పోస్ట్) నయనమనోహరంగా అత్యంత ఆశ్చర్యకరంగా రోమాంచిత మయ్యేటట్లుగా సూర్యభగవానుల వారు ‘వేదాంత్ నగర్ వేదాంతప్రియ దత్తాత్రేయ దేవాలయ’ శిఖరం పై 22° Circular Position లోఉండి (Also Called 22° Sun Dog) ఒక పెద్ద సూర్య శక్తిపాత వలయాన్ని (22 డిగ్రీల కోణంలో వలయాకారంగా ఏర్పడి) ఏర్పరచి నన్నానందంలో మునిగిపోయేట్లుగా చేసి ఆహ్వానం పలికారు. సూర్యభగవానుల వారి ఈ ‘వింత విన్యాసం’ దాదాపు ఒకటిన్నర నిమిషాలపాటు (01 min. 30 Sec) జరిగింది. వాటిని ఫోటోలను తీయడం కుడా జరిగింది. ఆ Photo లను పరిశీలించిన నాకు వాటిలో అనేక సిద్ధగోళాలు, వాటిలోపల ఉన్న సిద్ధ పురుషులు కనిపించారు. ఆ Photo లను ఈ శీర్షికతో పాటు భక్తులందరికీ Share చేస్తున్నాను. విచారకరమైన విషయమేమంటే ఇంతటి శక్తివంతమైన ఈక్షేత్రం షిర్డీకి అతి దగ్గరలో ఉన్నప్పటీకీ దర్శించే తెలుగు వారు మాత్రం అతి అరుదు.
వేదాంత్ నగర్ వేదాంతప్రియ దత్తాత్రేయ క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి?
By Own Transport (70 KMs - 1 Hour 30 min. Journey) From Shirdi |
---|
By Own Transport (70 KMs - 1 Hour 30 min. Journey) From Shirdi |
Shirdi ----> Rahata ----> Rahuri ----> Ahmednagar -----> Opp: Nobel Hospital ----> Vedantnagar Dattatreya Temple |
By Public Transport / By MSRTC Bus (Total 75 KMs - 2 గంటల ప్రయాణం) |
---|
By Public Transport / By MSRTC Bus (Total 75 KMs - 2 గంటల ప్రయాణం) |
Shirdi RTC Bus Stand (Opp: Khandoba Temple) ----> Catch Ahmednagar Bus (Bus Frequency : for Every 15 Min.) ----> Get Down At Ahmednagar Tarakpur Bus Stand -----> Walk Towards Nobel Hospital (10 min. Walkable Distance) ----> Vedantnagar Dattatreya Temple |
వేదాంత్ నగర్ వేదాంతప్రియ దత్తాత్రేయ క్షేత్ర దర్శనానికి అనువైన సమయం…
‘వేదాంత్ నగర్ వేదాంతప్రియ దత్తాత్రేయ’ క్షేత్రాన్ని షిర్డీ క్షేత్రం నుండి ఒక్కరోజులో దర్శించుకొని రావచ్చు మరియు ఈ క్షేత్ర దర్శనానికి అన్ని కాలాలు అనువైనవే. Shirdi నుండి ప్రతీ 15 నిముషాలకు Ahmednagar కు MSRTC బస్సు సౌకర్యం ఉంది. అలాగే శ్రీపాద శ్రీవల్లభ జయంతి రోజూ, గురుపౌర్ణమి రోజూ, శ్రీనృసింహసరస్వతి స్వామి జయంతి రోజూ మరియు దత్త జయంతి రోజు ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. వెళ్లేముందు సందర్శన వేళలను దృష్టి ఉంచుకుని వెళ్ళవలసినదిగా మనవి. ఈ దేవాలయం యొక్క రంగుల మార్పు చూడాలంటే మాత్రం ఉదయం వేళలలో (Between 07:00 AM మరియు 10:00 పోస్ట్) వెళ్ళడం మంచిది.
వేదాంత్ నగర్ వేదాంతప్రియ దత్తాత్రేయ క్షేత్రంలో ఎక్కడ ఉండాలి?
వేదాంత్ నగర్ వేదాంతప్రియ దత్తాత్రేయ క్షేత్రాన్ని షిర్డీ క్షేత్రం నుండి ఒక్కరోజులో దర్శించుకొని రావచ్చు,te. సాధారణంగా భక్తులు Shirdi లో Accommodation తీసుకుని తెల్లవారు ఝామున మొదటి బస్సు (వద్ద మొదలవుతుంది 05:00 పోస్ట్) కు బయల్దేరి వేదాంతప్రియ దత్తాత్రేయ క్షేత్రాన్ని చూసుకొని తిరిగి Shirdi చేరుకుంటారు. Ahmednagar లో కుడా అనేక Hotels / Lodges ఈ క్షేత్రానికి దగ్గరలోనే Main Road పై అందుబాటులో ఉన్నాయి.
వేదాంత్ నగర్ వేదాంతప్రియ దత్తాత్రేయక్షేత్ర ప్రత్యేకత…
వేదాంత్ నగర్ వేదాంతప్రియ దత్తాత్రేయక్షేత్ర ప్రత్యేకత |
---|
వేదాంత్ నగర్ వేదాంతప్రియ దత్తాత్రేయక్షేత్ర ప్రత్యేకత |
1. ప్రపంచంలోని అతిపెద్ద దత్త దేవాలయం |
2. ప్రపంచంలోని అతి ఐశ్వర్యవంత దత్తాత్రేయుడు |
3. వేదవిద్యాపీఠ యూనివర్సిటీ కలిగిన ప్రపంచపు ఏకైక దత్తదేవాలయం ( University లో దేవాలయాలను చూసి ఉంటామేమోగానీ, దేవాలయంలో University ఉండడడం ఎక్కడా చూసి ఉండం) |
4. ఒకే తల్లి వేరు వ్యవస్థ నుండి పుట్టిన ఔదుంబరం, వట వృక్షం మరియు అశ్వద్ధ వృక్షాలు కల్పవృక్షంగా ఉద్భవించి ఈ క్షేత్రంలో ఉండడం |
5. గోవులకు వేదం చదివి వినిపించే ఏకైక దత్త క్షేత్రం |
6. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు వచ్చి చేరిన క్షేత్రం |
7. సాక్షాత్తు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిచే దేవాలయ నిర్మాణానికి ప్లాన్ ఇవ్వబడిన క్షేత్రం |
8. ప్రపంచంలో Architecture పరంగా అతి సుందరమైన దత్త దేవాలయం |
వేదాంత్ నగర్ వేదాంతప్రియ దత్తాత్రేయ క్షేత్రంలో చూడవలసిన ఇతర ఆలయాలు / ప్రదేశాలు
వేదాంత్ నగర్ వేదాంతప్రియ దత్తాత్రేయ క్షేత్రంలో చూడవలసిన ఇతర ఆలయాలు / ప్రదేశాలు |
---|
వేదాంత్ నగర్ వేదాంతప్రియ దత్తాత్రేయ క్షేత్రంలో చూడవలసిన ఇతర ఆలయాలు / ప్రదేశాలు |
1. శ్రీ లక్ష్మీ అమ్మవారి / అనఘా లక్ష్మీ అమ్మవారి దేవాలయం |
2. కల్పవృక్షం & శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు |
3. "శ్రీ నృసింహ సరస్వతి తపోవనం" అని పిలవబడే గోశాల (On Ahmednagar - Aurangabad Highway, 7 KMs Away From Temple) |
4. వేదాంత వేదవిద్యాపీఠ యూనివర్సిటీ |
వేదాంత్ నగర్ వేదాంతప్రియ దత్తాత్రేయక్షేత్ర ఫోటోలు
వేదాంత్ నగర్ వేదాంతప్రియ దత్తాత్రేయక్షేత్ర యాత్రలో ఉపయోగపడే ఇతర సమాచారం
Information To The Devotees On Arrival At Vedapriya Dattatreya Temple At Vedantnagar |
---|
Information To The Devotees On Arrival At Vedapriya Dattatreya Temple At Vedantnagar |
Postal Address : Vedant Nagar Dattatrya Temple, Opp: Nobel Hospital, Near Tarakpur Bus Stand, Manmad Road, Ahmednagar - 414003, Maharashtra, Ph: 0241-2423585 |
Devotees Are Requested Not To Carry Leather Belts / Bags or Other Leather Accessories Into The Temple. You Can Safely Keep The Accessories With The Security Office At The Main Gate Before You Go Into The Temple Premises. Cameras and Photography Not Allowed In Side The Temple |
Separate Queue And Sitting Area For Male And Female Devotees. No Common Queue Line / Sitting Area For Both Male And Female Devotees In The Temple Premises |
Kindly Conform Temple Timings Before Temple Visit |