Triveni Madhu Gokarna / Eettipothala (Yati-Tapaha-Tala) – త్రివేణి మధు గోకర్ణ / ఎత్తిపోతల (యతి -తపః -తల)
‘Triveni Madhu Gokarna’ / Eettipothala (Yati-Tapaha-Tala)
‘త్రివేణి మధు గోకర్ణ’ / ఎత్తిపోతల (యతి -తపః -తల)
(Ettipotala Madhumati Sametha Dattatreya Devasthanam)
జై జై…దత్తాత్రే భగవంత…జై జై
అతి ప్రాచీన,కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని అతి గొప్ప విశేషమైన మహిమగల దత్తక్షేత్రమిది. నిజానికి ఎత్తిపోతల అనగా యతులు తపస్సు చేసుకొనే తలము (యతి – తపః – తలం) అని అర్ధం, కాని ఇక్కడ ఉన్న సుందరమైన వాటర్ ఫాల్స్ (జలపాతం) వల్ల ‘ఎత్తిపోతల’ అంటే ‘ఎత్తు’నుండి నీళ్ళు ‘పోత’లాగా పడడం అనుకుంటారు. ఎత్తిపోతల ఒక దత్త క్షేత్రం. ఇక్కడ గల దత్తాత్రేయుడు ఎన్నో ప్రత్యేకతలను ఆపాదించుకున్నవాడు.
ఎలా చేరుకోవాలి?
By Own Transport From Hyderabad (150 KMs - 3 Hours Journey) |
---|
By Own Transport From Hyderabad (150 KMs - 3 Hours Journey) |
Uppal ----> Sagar Ring Road ----> Ibrahimpatnam ----> Maal ----> Mallepally ----> Peddavoora ----> Hillcolony ----> Pylan Colony ---->Macherla Road ----> Yekonampet Cross Road ----> Take Left Small Road Just after 'Macherla 11KMs Mile Stone' ----> Yettipotala |
By Public Transport (Bus) మొత్తం 165 KMs - 4 గంటల ప్రయాణం) |
---|
By Public Transport (Bus) మొత్తం 165 KMs - 4 గంటల ప్రయాణం) |
Hyderabad MGBS / RC Puram / Chandanagar / Miyapur / KPHB ----> Macherla ----> Hire Auto Riksha From Macherla To Yettipotala |
ఎత్తిపోతలక్షేత్ర దర్శనానికి అనువైన సమయం…
ఎత్తిపోతల దత్తక్షేత్రాన్ని ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. ఉదయం 8:00 గంటల నుండి మద్యహ్నం 12:00 గంటల లోపు తిరిగి సాయంత్రం 5:00 గంటల నుండి సాయంత్రం 06:30 గంటల లోపు ఇక్కడి ఆలయాలను దర్శించుకోవచ్చు. ప్రతీ సంవత్సరం తొలి ఏకాదశి (ఆషాడ శుద్ధ ఏకాదశి) రోజున ఇక్కడ జాతర జరుగుతుంది. ఎత్తిపోతల జలపాతాన్నిRs. 20/- Ticket తీసుకోని APTDC View Point ద్వారా రోజులో ఏసమయంలోనైనా చూడవచ్చు. Ettipotala Water Falls ఆహ్లాదకరంగా కనబడాలంటే వానాకాలం ఉత్తమమైన సమయం.
ఎత్తిపోతల దత్తక్షేత్ర ప్రత్యేకత…
యతి – తపః – తలం (ఎత్తిపోతల) త్రివేణి సంగమ దత్తక్షేత్ర ప్రదేశం. ఇక్కడ (ఎత్తిపోతల) కృష్ణానది ఉప-ఉప నదులైన మూడు ఉప-ఉప (వంకలు) నదులు చంద్రవంక, అగ్నివంక మరియు సూర్యవంక నదులు ఒకదానికొకటి సంగమిస్తాయి. ఈ మూడు నదులు ఎత్తిపోతల జలపాతం వద్ద కలిసి ఒకటిగా ఏర్పడి ఆ మొత్తం ‘మధువంక’ గామారి అది కృష్ణానదిలో కలవడం జరుగుతుంది. అందువల్లనే ఎత్తిపోతల జలపాతం వద్ద సంగమేశ్వర దేవాలయాన్ని (ప్రస్తుతం జీర్ణ స్థితిలో కలదు) మనం చూడవచ్చు, మరియు ఈ మూడు వంకలు కలిసి పైనుండి క్రిందకు పడేచోట గల ప్రదేశం చూచుటకు గోవు యొక్క కర్ణం (ఆవుచెవి) మాదిరిగా ఉండడమూ మరియు మూడు వంకలు కలిసి ( చంద్రవంక, అగ్నివంక మరియు సూర్యవంక) ‘మధువంక’ గా దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి అయిన మధుమతీదేవి యొక్క నేత్రముల ఎదురుగా జరుగుతుండడం వల్ల ఈ క్షేత్రాన్ని ‘త్రివేణి మధు గోకర్ణ’ గా ఒకప్పుడు పిలిచేవారు. ఇక్కడగల పరిసర ప్రదేశాల్లో మధుమతీ సమేత దత్తాత్రేయుని ఆవాసంవల్ల ఇక్కడ యతులు తపస్సు చేసుకోవడానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఫలితంగా ‘త్రివేణి మధు గోకర్ణ’ కాస్తా ‘యతి – తపః – తలం’ గా తదుపరి ‘ఎత్తిపోతల’ గా మారింది.
త్రివేణి మధు గోకర్ణ (ఎత్తిపోతల) దత్తక్షేత్ర ప్రాముఖ్యత |
---|
త్రివేణి మధు గోకర్ణ (ఎత్తిపోతల) దత్తక్షేత్ర ప్రాముఖ్యత |
1. ప్రపంచంలోని ఏకైక మధుమతీ సమేత దత్తాత్రేయుడు |
2. స్వయంభూ దత్తాత్రేయుడు |
3. కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం (కొండగుహలో ఉన్న స్వయంభూ దత్తాత్రేయ మూర్తిని పునః ప్రతిష్టించాడు కార్త్యవీర్యార్జునుడు) |
4. పరుశురాముడుచే పూజించబడిన దత్తాత్రేయుడు / పరుశురాముడుచే పునరుద్ధరింపబడిన దత్తక్షేత్రం |
5. ప్రపంచంలోని ఏకైక సింధూర లేపన దత్తాత్రేయుడు |
6. ప్రపంచంలోని ఏకైక 'నాగకిరిటాభారణ' (నాగుపామును కిరిటంగా ధరించిన) దత్తాత్రేయుడు |
7. అష్టసిద్ధులు పొందడానికి 'ద్వారక్షేత్రం' |
8. ఏకముఖ, చతుర్భుజ దత్తాత్రేయుడు |
9. త్రివేణిసంగమ ప్రదేశంలోగల దత్తాత్రేయుడు |
10. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి, నృసింహసరస్వతి స్వామి వార్లు దర్శించిన క్షేత్రం |
11. విష్ణురూప, అలంకారప్రియ, చిద్విలాస మరియు నామధారి (నామమును ధరించిన) దత్తాత్రేయుడు |
ఎత్తిపోతల దత్తక్షేత్రం లో చూడవలసిన ఆలయాలు / ప్రదేశాలు
(A) మధుమతీ దేవి ఆలయం
మధుమతీ దేవి దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి. మధుమతి అనగా ‘తేనెవంటి హృదయం’గలది అని అర్ధం. మధుమతీ దేవి కుడా స్వయంభూగానే ఉద్భవించారు. విష్ణుకుండినుల కాలం లో ఈ ఆలయం జీర్ణోద్ధారణ గావింపబడినది. వారు, వారి తరువాత వచ్చిన రాజులందరూ అమ్మ వారికి భక్తులే. ఈవిడ లక్ష్మీ స్వరూపురాలు మరియు అష్టసిద్ధులకు తల్లి. ఈవిడ పనసచేట్టులో కుటుంబ సమేతంగా ఉంటారు. ఎత్తిపోతల దత్తక్షేత్ర దర్శనానికి వచ్చిన వారు ముందుగా మధుమతీ దేవిని దర్శించి ఆ తరువాత కొండమీద గుహలో ఉన్న దత్తాత్రేయుడిని దర్శించడం ఇక్కడి ఆనవాయితి. ఎంతోమంది ఋషులకి,దత్త ఉపాసకులకి, దత్త భక్తులకీ మధుమతీ దేవి దర్శనం కలిగిందని చెబుతారు. ఈ తల్లి ప్రతినిత్యం రెండు నుండి మూడు సార్లు పైన గల కొండమీద గుహలో ఉన్న దత్తాత్రేయుడిని దర్శించడానికి వెళతారట.ఈ విధంగా పైకి వెళ్ళేటప్పుడు అమ్మ వారి పాదాలు మెట్లకు ఆనకుండా, మెట్లకు కొద్దిగా పైన గాలిలో నడుచుకుంటూ వెళ్ళడం అనేక మంది చూసారు.
(B) ఏకముఖ దత్తాత్రేయస్వామి ఆలయం
ఎత్తిపోతల దత్తాత్రేయుడు స్వయంభూ దత్తాత్రేయుడు. కొండగుహలో ఉన్న స్వయంభూ దత్తాత్రేయమూర్తిని పునః ప్రతిష్టించాడు ‘హైహయ’ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు. హైహయ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు ఈ క్షేత్రానికి దగ్గర లోగల మహీష్పతి నగరాన్ని(నేటి మాచర్ల) రాజధానిగా పరిపాలన సాగించేవాడు. అందువల్ల ఇక్కడే కార్త్యవీర్యార్జునుడు ముఖ్య పర్వదినములలో తప్పని సరిగా అనఘాస్టమీ వ్రతాలను ఆచరించేవాడు. ఈ క్షేత్ర మహిమ తెలుసుకున్నపరుశురాముడు (కార్త్యవీర్యార్జునుడి సంహరించినవాడు మరియు రేణుకామాత – జమదగ్నిల కుమారుడు) కార్త్యవీర్యార్జునుడి తదుపరి ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేసాడు. ప్రపంచంలోని ఏకైక సింధూరలేపన దత్తాత్రేయుడు ఇక్కడ కనిపిస్తాడు, అలాగే ప్రపంచంలోని ఏకైక ‘నాగకిరిటాభారణ’ (నాగుపామును కిరిటంగా ధరించిన) దత్తాత్రేయుడు ఏకముఖ, చతుర్భుజుడుగా కనిపిస్తాడు. విష్ణురూప, అలంకారప్రియ, చిద్విలాస మరియు నామధారి (నామమును ధరించిన) దత్తాత్రేయుడు. భక్తులు ఇక్కడి దత్తాత్రేయుడుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కార్త్యవీర్యార్జున విరచిత దత్తస్తోత్రాలను చదివితే మిక్కిలి ప్రీతి చెందుతాడట. అలాగే కష్టాలలో ఉన్నవారు వారి కష్టాలు తీరిన తరువాత ఇక్కడి ’ఝెండా ప్రాంగణం’ లో ఝెండాలను కడతారు.
(C) దత్త శిల
‘దత్త శిల’ ఎత్తిపోతల ప్రధాన ద్వారం నుండి దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళే మెట్ల మార్గంలో పెద్ద పుట్టకు సమీపంలో కుడివైపున ఉంటుంది. దత్తాత్రేయుడు ఈ రాయి మీద కుర్చుని విశ్రాంతి తీసుకునేవాడని అనేక మంది మహర్షులు చెప్పేవారు. ఒక్కోసారి ఈ శిల మీదే దత్తాత్రేయుడు కల్లు త్రాగువాని వలె కుర్చుని కల్లు తాగుతూ కనిపిస్తాడట. నడి రాత్రిలో ఈ దత్త శిలకు శిరస్సును ఆనించి దత్తాత్రేయుడిని ధ్యానించి ఈ శిలకు దరిదాపుల్లోనే నిద్రిస్తే వారికి తప్పని సరిగా దత్తదర్శనం కలుగుతుంది.
(D) రంగనాయక స్వామి ఆలయం
ఎత్తిపోతలలో గల మరొక ప్రధాన ఆలయం శ్రీదేవి – భూదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి ఆలయం. ఈ ఆలయం ఇక్ష్వాకుల కాలం లో నిర్మించగా విష్ణుకుండినులు అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీదేవి – భూదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి కుడా స్వయంభూనే. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో మధువంక పొంగి శ్రీ రంగనాయక స్వామి వారి పాదాల వరుకు వస్తుంది.
(మరియు) ఇష్టకామేశ్వరి దేవి ఆలయం
ఇష్టకామేశ్వరి దేవి ఆలయం చోళరాజులు అభివృద్ధి చేసినట్లుగా చెబుతారు. ప్రస్తుతం జీర్ణస్థితిలో గలదు.
(F) చౌడేశ్వరి దేవి ఆలయం
చౌడేశ్వరిదేవికే ‘ఛాముండేశ్వరిదేవి’ అనికూడా పేరు. చౌడేశ్వరిదేవి ఎత్తిపోతల క్షేత్ర పాలకురాలు. దత్త భక్తులనూ, ఉపాసకులను అనుక్షణం రక్షించే బాధ్యతను తలకెత్తుకున్నగొప్ప తల్లి ఈమె.
(G) ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ View Point
కృష్ణానది ఉప-ఉప నదులైన మూడు ఉప-ఉప (వంకలు) నదులు చంద్రవంక, అగ్నివంక మరియు సూర్యవంక నదులు ఒకదానికొకటి సంగ మించి పైనుండి క్రిందకు దూకే ప్రదేశమే ఎత్తిపోతల Water Falls View Point. ఇక్కడనుండి చూసినప్పుడు Ettipotala Water Falls అతి సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళాలంటే APTDC వారికి డబ్బు చెల్లించి Ticket తీసుకోని వెళ్ళాలి. ఇక్కడే APTDC వారి Restaurant ఉంది. అలాగే ఇక్కడే APTDC కాటేజీలు అద్దెకు లభిస్తాయి మరియు ఇక్కడ సాయంత్రం పూట Light Show ఉంటుంది.
ఎత్తిపోతల దత్తక్షేత్ర ఫోటోలు
ఎత్తిపోతల చుట్టుపక్కల గల చూడవలసిన ప్రదేశాలు / ఇతర ఆలయాలు |
---|
ఎత్తిపోతల చుట్టుపక్కల గల చూడవలసిన ప్రదేశాలు / ఇతర ఆలయాలు |
1. Nagarjuna Sagar Project |
2. Nagarjuna Konda Bouddha Museum - By Lanch (Monday Holiday) |
3. Nagarjuna Sagar - Srisailam : Road Cum Cruise Package Tour By APTDC / Nagarjuna Sagar - Srisailam Package Tour By Southern Travels Will Cover All The Places |
4. Anupu - Bouddha Aaraamam |
5. Sri Lakshmi Chennakeshava Temple At Macherla (Palnati Bhrahmanaidu Punaha Pratistitha) |
6. Sri Vasavi Kanyaka Parameshwari Temple At Macherla |
7.Chintapally Sai Sannidhi (Shirdi Sai Temple) - Nagarjuna Sagar Road |
8. Sri Venkateswara Swamy Hill Top Temple - Mallepally (మల్లేపల్లి కొండమీద గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం) |
ఎత్తిపోతల దత్తక్షేత్రయాత్రలో ఉపయోగపడే ఇతర సమాచారం
విషయం | వివరణ |
---|---|
విషయం | వివరణ |
Postal Address | Sri Madumati Sametha Dattatreya Swamy Temple, Yettipotala, Via: Kotturu Village, Macherla Mandal, Guntur Dist. PIN - 522426 |
Sri Madumati Sametha Dattatreya Swamy Temple Purohit Mobile No. | Sripada Sharma - 9849617016 |
Sri Ranganayaka Swamy Temple Purohit Mobile No. | Sudarshana Charyulu - 9490807884 |
APTDC, Ettipotala | మిస్టర్. Dattu / మిస్టర్. Hanumanthu (Manager) 08642-211100 / 9666026233 |