NacharamGutta
Nvnatha Pratistitha నరసింహ క్షేత్రం – Nacharam గుత్తా
(Medak Dist. హైదరాబాద్ సమీపంలో)
నవనాథ ప్రతిష్ఠిత నారసింహ క్షేత్రం – నాచారం గుట్ట
II గోరక్ష-జాలంధర-చర్పటాశ్చ అడ్భంగ-కానీఫా-మత్సేంద్రరాద్యా: చౌరంగి-రేవాణక-భర్త్రిసంజ్ఞా భూమ్యాంబ భూవు: నవనాధసిద్దా: II
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే.. దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా..దత్త బంధువులందరికీ జై గురుదత్త..నవనాథసహిత దత్తగురు మహారాజ్ కి జై..
కలియుగంలో భక్తజనోద్ధరణ కోసం భూమిమీదకు వచ్చిన నవనాథులు అనేక ప్రదేశాలను సందర్శించడం జరిగింది. వారి యాత్రలో భాగమైన నాచారం గుట్ట లో నవనాథ ప్రతిష్ఠిత నారసింహ క్షేత్రం ఉందని తెలుసుకొని అక్కడకు వెళ్లడం జరిగింది. పవిత్రమైన ‘హరిద్రానదీ’ తీరంలో గల ఈ అద్భుతమైన క్షేత్రాన్ని చూసి ఎంతో తృప్తి చెందాను. ఎంతో పవిత్రమైన సాక్షాత్తు నవనాథులచే ప్రతిష్టింపబడిన ఇక్కడి నారసింహుడిని, నవనాథ సిద్ధ స్థానాన్ని, దత్తాత్రేయ దేవాలయాన్ని తప్పక దర్శిస్తారని ఆశిస్తూ…
జై గురు దత్త
-కీర్తి వల్లభ (keerthivallabha@gmail.com)
నాచారం గుట్ట ఎక్కడ ఉంది?
నాచారం గుట్ట Telangana State లో Medak Dist.లో Gajwel – Pregnapur కు 12 KMs దూరంలో కలదు. Nacharam Gutta అనేది ఒక చిన్న గ్రామము.ఇది Wargal Mandalam క్రిందకు వస్తుంది.
నాచారం గుట్ట ఎలా చేరుకోవాలి?
Hyderabad To Nacharam Gutta (70 KMs) |
---|
Hyderabad To Nacharam Gutta (70 KMs) |
Route 1: Alwal ----> ShameerPet ----> Turkapally ----> Mulugu ----> Gowraaram ----> Pregnapur ----> Gajwel ----> Mazeedpally ----> Nacharam |
Route 2: Suchitra ----> Kompally ----> Medchal ----> Manoharabad----> Manoharabad Toll Plaza (Take Right Side Samll Road After Toll Plaza) ----> Nacharam |
నాచారం గుట్ట దర్శించడానికి అనువైన సమయం…
నాచారం గుట్ట లోని నవనాథ ప్రతిష్ఠిత నారసింహ క్షేత్రం దర్శించడానికి అనువైన సమయం / కాలం వర్షాకాలంనుండి శీతాకాలంలోని ధనుర్మాసం వరుకు. వేసవిలో ఇక్కడ కొండలు అధికమైన వేడిని కలిగి ఉంటాయి.
నాచారం గుట్ట లో ఎక్కడ ఉండాలి?
నాచారం గుట్ట లో ఉండడానికి వసతి గృహాలు ఉన్నపటికీ వాటికి కనీస సదుపాయాలు లేవు. సాధారణంగా భక్తులు Hyderabad నుండి ఒక్క పూటలో వెళ్లి దర్శించుకుని అక్కడే Sri Satyanarayana Swamy Vratham చేసుకుని తిరిగి సాయంత్రానికల్లా Hyderabad చేరుకుంటారు.
నాచారం గుట్ట స్థల పురాణం
ప్రస్తుతం ‘నాచారం గుట్ట’గా పిలవబడుతున్న ఈ క్షేత్రాన్ని పూర్వము నాథగిరి అనీ, గర్జనగిరి అనీ, సింహగిరి అనీ, శ్వేతగిరి అనీ, గార్గేయగిరి అనీ (గార్గేయ మహర్షి తపస్సు చేయడం వలన), ‘నాచరుడు’ అనే భక్తుడు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి లోకితీసుకుని రావడంవల్ల ‘నాచగిరి’ అనీ పిలిచేవారు. ‘నాచగిరి’ అనే ఈ పేరు కాలక్రమేణా ‘నాచారం’గా మారిందని చెబుతారు.
కృతయుగంలో పవిత్రమైన ‘హరిద్రానదీ’ తీరంలో గల ఈ ప్రదేశం గుండా లోకోద్ధరణకై వెళుతున్న నవనాథసిద్ధ స్వాములైన మత్సేంద్రనాథుడు, గోరక్షనాథుడు, జాలంధరనాథుడు, కానీఫానాథుడు, చర్పటనాథుడు, భర్తరినాథుడు, రేవణనాథుడు, గహనీనాథుడు మరియు అడ్భంగనాథుల వారు ఇక్కడి కొండ గుహలలో నుండి నిరంతరంగా వస్తున్న సింహపు గర్జనలను వింటారు. అప్పుడు వారు తమ దివ్య దృష్టితో అక్కడి గుహలను పరికించి చూడగా అక్కడ వారికి తరచుగా గర్జన చేయుచున్న నారసింహస్వామి కనిపిస్తారు. వెంటనే వారు దత్తాత్రేయుల వారిని ప్రార్ధింపగా దత్తాత్రేయుడు ప్రత్యక్షమై “గర్జిస్తూ ధూమ్రజిహ్వగా (ధూమ్రజిహ్వ = Dark Red Colour Tongue / Blood Red Tongue) ఉన్న నారసింహుని ( ధూమ్ర నారసింహస్వామి) మీ భక్తితో శాంతిపచేసి లక్ష్మి సమేతంగా ఇక్కడే వెలిసేటట్లుగా చేసి, తదుపరి ఇక్కడే ప్రతిష్టించండి. అలాగే ఇక్కడే కొద్ది కాలం పాటు ఉండి తపస్సు చేసుకోండి,te, ఇక్కడ ఉన్నది సాక్షాత్తు నేనేనని తెలుసుకొండి ” అని వివరించి అంతర్ధానుడౌతాడు.
వెంటనే నవనాథసిద్ధ స్వాములు గర్జన చేయుచున్న నారసింహస్వామిని భక్తి తో కొలిచి శాంతింపచేసి, లక్ష్మి సమేతంగా వెలిసేటట్లుగా చేస్తారు. తదుపరి అక్కడేకొంతకాలం గడిపి తిరిగి కర్తవ్య నిర్వహణలో భాగంగా అక్కడ నుండి వేరే చోటుకు వెళతారు. ఈ విధంగా నవనాథసిద్ధ స్వాములు అనేకప్రదేశాలను తిరిగిన అనంతరం శ్రీశైలం చేరుకుంటారు,te. అప్పటికే అక్కడే ఉండి తపస్సు చేసుకుంటున్న గార్గేయ మహాముని నవనాథసిద్ధ స్వాములను కలిసి,te “విష్ణు అవతారమైన దత్తాత్రేయుడి అనుగ్రహం కోసం ఎక్కడ తపస్సు ఆచరించాలో సెలవియ్యవలసిందిగా” కోరగా వారు ‘నాథగిరి’ (నాచారం గుట్ట) పేరు చెబుతారు. ఆవిధంగా గార్గేయ మహాముని ‘నాథగిరి’ కి వచ్చి నవనాథ ప్రతిష్ఠిత నారసింహ క్షేత్రాన్ని దర్శించి అక్కడే ఉండి కొద్ది కాలం తపస్సు ఆచరించి దత్తానుగ్రహం పొందుతాడు,te. గార్గేయ మహర్షి ఈ ప్రదేశం లో తపస్సు చేయడం వలన ఈ ప్రాంతాన్ని ‘గార్గేయ తపోవనం,te’ గా కూడ పిలుస్తారు.
నాచారం గుట్ట – నవనాథ సిద్ధ స్థానం
నాచారం గుట్ట పైన నవనాథసిద్ధ స్వాములు తపస్సు ఆచరించినచోట దత్తాత్రేయ సహితంగా నవనాథసిద్ధ స్వాములు కొలువై చూడచక్కగా ఉంటారు, ఇక్కడికి దగ్గరలోనే పెద్ద ఔదుంబరం మరియు దత్తాత్రేయ సాయినాథ దేవాలయం కూడా ఉంది. ఇక్కడ చేసే నవనాథ చరిత్ర పారాయణం అధిక ఫలితాలను ఇస్తుందిగా స్థలపురాణం చెబుతోంది,te. ప్రాతః కాలంలో ఇప్పటికి ఇక్కడకు నవనాథసిద్ధ స్వాములు నారసింహ దర్శనార్థమై వస్తారని తెలియవచ్చింది.
Click Here To View Nacharam Gutta Navanaatha Siddha Staanam Video
(నాచారం గుట్ట – నవనాథ సిద్ధ స్థానం వీడియో చూడడం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)
నాచారం గుట్ట దేవాలయం ఫోటోలు
నాచారం గుట్ట కు దగ్గరలోగల ఇతర దర్శనీయ ప్రదేశాలు
Other Places / Temples Near To Nacharam Gutta |
---|
Other Places / Temples Near To Nacharam Gutta |
1. Wargal Saraswathi - Shani - Shiva Mandir At Wargal |
2. Ratnalayam At ShameerPet |
Nacharam Gutta Temple Address |
---|
Nacharam Gutta Temple Address |
Navanatha Pratistitha Sri Lakshmi Naarasimha Swamy Temple, Nacharam Gutta Village, Wargal Mandal, Medak Dist.-502334 Ph:08454239101 |